గుజరాత్‌ ఓపెనర్ల ప్రపంచ రికార్డు | Sudharsan Gill Equals World Record Becomes 1st Pair In History To Achieve | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ ఓపెనర్ల ప్రపంచ రికార్డు!.. ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర

May 21 2026 10:07 PM | Updated on May 21 2026 10:07 PM

Sudharsan Gill Equals World Record Becomes 1st Pair In History To Achieve

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఐపీఎల్‌-2026లో భాగంగా గురువారం నాటి ఈ పోరులో వీరిద్దరు అర్ధ శతకాలతో రాణించారు.

కెప్టెన్‌ గిల్‌ 37 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేయగా.. సాయి సుదర్శన్‌ 53 బంతులు ఎదుర్కొని 84 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

74 బంతుల్లో 125 పరుగులు
ఇక చెన్నైతో మ్యాచ్‌లో సాయి- గిల్‌ కలిసి తొలి వికెట్‌కు 74 బంతుల్లో 125 పరుగులు జోడించారు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనత సాధించారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు అభిషేక్‌ శర్మ- ట్రవిస్‌ హెడ్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు.

ఐపీఎల్‌లో అత్యధికసార్లు వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్‌ జోడీగా సాయి సుదర్శన్‌- శుబ్‌మన్‌ గిల్‌ నిలిచారు. అంతేకాదు.. పాకిస్తాన్‌ బ్యాటర్లు బాబర్‌ ఆజం- మహ్మద్‌ రిజ్వాన్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు సమం చేశారు. టీ20 క్రికెట్‌లో అత్యధికసార్లు వందకు పైగా పరుగులు జోడీగా నిలిచారు.

ఐపీఎల్‌లో అత్యధికసార్లు 100కు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్‌ జోడీలు
👉సాయి సుదర్శన్‌- శుబ్‌మన్‌ గిల్‌ (గుజరాత్‌ టైటాన్స్‌)- ఏడుసార్లు
👉అభిషేక్‌ శర్మ- ట్రవిస్‌ హెడ్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)- ఆరుసార్లు
👉శిఖర్‌ ధావన్‌- డేవిడ్‌ వార్నర్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)- ఆరుసార్లు
👉జానీ బెయిర్‌ స్టో- డేవిడ్‌ వార్నర్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)ఐదుసార్లు
👉ఫాఫ్‌ డుప్లెసిస్‌- విరాట్‌ కోహ్లి (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు) ఐదుసార్లు

టీ20 క్రికెట్‌లో అత్యధికంగా పదిసార్లు 100కు పైగా పరుగులు జోడించిన జంటలు
👉బాబర్‌ ఆజం- మహ్మద్‌ రిజ్వాన్‌ (పాకిస్తాన్‌- కరాచీ కింగ్స్‌)
👉ఏబీ డివిల్లియర్స్‌- విరాట్‌ కోహ్లి (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు)
👉క్రిస్‌ గేల్‌- విరాట్‌ కోహ్లి (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు)
👉సాయి సుదర్శన్‌- శుబ్‌మన్‌ గిల్‌ (గుజరాత్‌ టైటాన్స్‌)

మ్యాచ్‌ విషయానికొస్తే.. చెన్నైతో మ్యాచ్‌లో గుజరాత్‌ ఓపెనర్లు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (37 బంతుల్లో 64), సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 84) అర్ధ శతకాలతో రాణించారు. వీరికి తోడు వన్‌డౌన్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ (27 బంతుల్లో 57 నాటౌట్‌)తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.

చదవండి: మా చేతిలో పాక్‌ ఓటమి బాధించింది: బంగ్లాదేశ్‌ కోచ్‌

Advertisement
 
Advertisement
Advertisement