సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన దువ్వూరు మునిశేఖర్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదానికి గురిచేసిందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు.
పార్టీ పట్ల అపారమైన నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై సేవలందించిన నాయకుడిగా మునిశేఖర్ రెడ్డి గుర్తింపు పొందారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
మునిశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ప్రార్థించారు. మునిశేఖర్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.


