అభిషేక్‌ బెనర్జీ ఆస్తులతో నాకు సంబంధం లేదు.. ఎంపీ వివరణ | my assets have been tmc sayani ghosh clarifies on joint property | Sakshi
Sakshi News home page

అభిషేక్‌ బెనర్జీ ఆస్తులతో నాకు సంబంధం లేదు.. ఎంపీ వివరణ

May 20 2026 5:33 PM | Updated on May 20 2026 5:50 PM

 my assets have been tmc sayani ghosh clarifies on joint property

కోల్‌కతా: అభిషేక్ బెనర్జీకి తనకు ఉమ్మడి ఆస్తులు కలిగి ఉన్నాయనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీఎంసీ ఎంపీ సాయాని ఘోష్ స్పష్టం చేశారు. ఈ రోజు (బుధవారం) ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.  ఉమ్మడిగా ఒక ఆస్తిని కలిగి ఉన్నామంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. తన ఆస్తుల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తిగా వెల్లడించానన్నారు. ఈ రకమైన "ఫేక్ న్యూస్" (అసత్య ప్రచారాలు) వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.

ఆమె మాట్లాడుతూ " అభిషేక్ బెనర్జీ & సాయాని ఘోష్ కలిసి కోల్‌కతా 700030 లోని '19 D సెవెన్ ట్యాంక్స్ రోడ్' అనే ఆస్తిని ఉమ్మడిగా కలిగి ఉన్నారు దానికి ఎలాంటి మొబైల్ నంబర్ సంప్రదింపుల కోసం లేదని కొన్ని ఫార్వార్డ్ మెసేజ్‌లను ఇప్పుడే చూశాను. వారు ఎవరో నాకు తెలియదు. కానీ, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు స్వలాభం కోసం పనిచేయకుండా నిజాయితీగా ఉంటూ ఒక సాధారణ నేపథ్యం నుండి ప్రయాణాన్ని ప్రారంభించిన ఎంపీ సాయాని ఘోష్ మాత్రం అది కాదు" అన్నారు. ప్రజలు నన్ను ఆశీర్వదించారు, అందుకు నేను కృతజ్ఞతురాలిని అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

తాను ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా తన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఇది వరకే బహిరంగంగా అందుబాటులో ఉంచానని తెలిపారు. తన ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించబడ్డాయి. రికార్డులను తనిఖీ చేయండి. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అవినీతి ఆరోపణలు మోపుతున్నవారు ఇకనైనా ఈ ప్రయత్నాలను ఆపాలన్నారు. తనపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో క్షమించేది లేదను ఈ అంశంలో తాను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానిని సాయాని ఘోష్ హెచ్చరించారు.

 

వివాదం ఏంటి
కాగా ప్రస్తుతం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, అతని కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు ఆస్తులను కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ పరిశీలిస్తోంది. అతని బంధువులు వారితో సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించిన 17నుండి 21 ఆస్తులకు సంబంధించి ఆమోదించబడిన బిల్డింగ్ ప్లాన్లు, ఇతర పత్రాలను సమర్పించాలని ఇదివరకే  KMC నోటీసులు జారీ చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా నిర్మాణాలు జరిగాయా అనేది పత్రాలను పరిశీలించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ సాయాని ఘోష్ వివరణ ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement