లక్నో: ఓ యువకుడిని చెరువులోకి ఈడ్చుకెళ్లింది మొసలి. ఉత్తరప్రదేశ్‌లోని గొండాలో ఓ మహిళ అంత్యక్రియల సమయంలో సరయూ నదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడాకు చెందిన దీపక్ శర్మ తన అత్త ఊర్మిళా దేవి మరణంతో గొండా జిల్లాలోని ఉమ్రీ గ్రామానికి వెళ్లాడు.
నది ఒడ్డున చితిని సిద్ధం చేసే పనిలో భాగంగా గుంత తవ్విన తర్వాత అతడు నదిలో స్నానానికి దిగాడు. అదే సమయంలో నీటిలో నుంచి బయటకు వచ్చిన మొసలి అతడి తలను నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. క్షణాల్లో ఈ దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అంత్యక్రియలకు వచ్చినవాళ్లు నదిలోకి దిగొద్దని హెచ్చరించినా శర్మ పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షి రాజేశ్ శుక్లా మీడియాకు చెప్పారు. అక్కడున్నవాళ్ల కేకలు వేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. గ్రామస్తులు, స్థానిక పడవ నడిపేవారు వెంటనే గాలింపు చేపట్టారు. అయినా శర్మ ఆచూకీ దొరకలేదు.
ఈ ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, జిల్లా అధికారులు అక్కడికి చేరుకున్నారు. రెవెన్యూ శాఖ బృందం కూడా గాలింపు చేపట్టింది. అయినా ఫలితం రాలేదు. గాలింపును మరింత వేగవంతం చేయటానికి లక్నో నుంచి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని పిలిచారు.
दामाद को नदी में ले जाते मगरमच्छ … #LiveVideo
Crocodiles Saryu Ghat#Crocodiles#SaryuGhat pic.twitter.com/Y8xcLggUAY— TRUE STORY (@TrueStoryUP) May 21, 2026


