టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. అప్పట్లో పెళ్లి, మనసిచ్చి చూడు లాంటి సూపర్ హిట్స్ అందుకున్న వడ్డే నవీన్ కొన్నేళ్ల తర్వాత కనుమరుగైపోయాడు. మళ్లీ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు పదేళ్ల విరామం హీరోగా మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సినిమాకు కమల్‌తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాశీసింగ్ హీరోయిన్‌గా కనిపించనుంది. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ఓ కానిస్టేబుల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి మాట వినని రెబల్ కానిస్టేబుల్‌గా పాత్రలో వడ్డే నవీన్ కనిపించనున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.


