చెప్పని కథ | Aathma Katha - An Untold Story trailer gets a grand launch | Sakshi
Sakshi News home page

చెప్పని కథ

May 22 2026 12:08 AM | Updated on May 22 2026 12:08 AM

Aathma Katha - An Untold Story trailer gets a grand launch

శ్రీనివాస్, సురేష్‌

సురేష్, రూప హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆత్మకథ’. ‘యాన్‌ అన్‌టోల్డ్‌ స్టోరీ’ (ఓ చెప్పని కథ) అనేది ఉపశీర్షిక. శ్రీనివాస్‌ బండ్రెడ్డి దర్శకత్వంలో వారాహి ఎంటర్‌ టైన్మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై సోమేష్‌ నిర్మించారు. ఈ సినిమా టైటిల్, ట్రైలర్‌ను లాంచ్‌ చేసిన మాజీ ఎమ్మెల్యే   రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో చాలా ధైర్యంగా శ్రీనివాస్‌గారు ఓ మంచి కథ చెబుతున్నారు. సురేష్‌ మంచి నటుడు.

ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఆత్మకథ’ చిత్రంతో మెయిన్‌ హీరోగా మారాను. ఒక ఇంట్లో జరిగే కథగా రూపొందిన సినిమా ఇది. కామన్‌ మ్యాన్‌ భావోద్వేగాలు, భయం, వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చె΄్పారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు శ్రీనివాస్‌ గుండ్రెడ్డి. ‘‘దర్శకుడు ఈ కథ చెప్పి, ఇందులో ఆత్మ మీరే అన్నారు. దీంతో సినిమాలో నేను కనిపిస్తానా? అనుకున్నాను. కానీ ఈ సినిమా కథ అంతా నా చుట్టూ తిరుగుతుంది’’ అని తెలిపారు సమ్మెట గాంధీ.

Advertisement
 
Advertisement
Advertisement