బజాజ్ ఆటో దేశీయ విఫణిలో 'పల్సర్ ఎన్160' కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1,22,000 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్). ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత బజాజ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.
బజాజ్ కొత్త పల్సర్ ఎన్160.. స్టాండర్డ్ సిరీస్ కంటే కూడా ప్రీమియం లుక్, మెరుగైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటివి ఉన్నాయి. ఇవి మరింత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. గోల్డ్ కలర్ USD ఫోర్కులు, ABS టెక్నాలజీ వంటివి ఉన్నాయి.
సాధారణ టెలిస్కోపిక్ ఫోర్క్ సెటప్‌తో పోలిస్తే.. USB ఫోర్క్‌లను జోడించడం వల్ల మోటార్‌సైకిల్‌కు మరింత ప్రీమియం ఫ్రంట్-ఎండ్ లుక్ వస్తుంది. బ్రేకింగ్, కార్నరింగ్ లోడ్ల కింద మెరుగైన దృఢత్వాన్ని అందిస్తుంది. ABS బ్రేకులు రైడర్లకు మరింత బలమైన భద్రతను అందిస్తాయి.
ఇదీ చదవండి: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. 15 రోజుల్లో 25వేల బుకింగ్స్!
ఇకపోతే ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి ఈ వేరియంట్లో స్టైలింగ్ అండ్ రైడర్ సౌకర్యంపై స్పష్టంగా దృష్టి పెట్టారు. ఈ వేరియంట్లో మీకు LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ మరియు రైడర్, పిలియన్‌కు ఎక్కువ స్థలాన్ని అందించే సింగిల్-సీట్ సెటప్ కూడా లభిస్తాయి. పనితీరులో ఎలాంటి మార్పు ఉండదు.


