Bollywood
-
'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్ (ఫొటోలు )
-
ముంబైలో 'థగ్ లైఫ్' టీమ్.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)
-
అజయ్ దేవగణ్ రైడ్-2.. ఛావా తర్వాత రెండో చిత్రమిదే!
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నటించిన చిత్రం 'రైడ్ 2'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 1న థియేటర్లలో విడుదలైంది. గతంలో వచ్చిన రైడ్ మూవీ సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు వసూలు చేసింది. దాదాపు 18 రోజుల తర్వాత ఈ బెంచ్‌మార్క్‌ను అధిగమించింది. దీంతో ఈ సంవత్సరం విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది.ఈ సినిమాకు రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలైన 19 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 201.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం ఇండియాలో మాత్రమే రూ. 177.50 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇటీవల విడుదలైన హాలీవుడ్ మూవీ 'మిషన్: ఇంపాజిబుల్-ది ఫైనల్ రికనింగ్' కారణంగా రైడ్-2 కలెక్షన్స్ కొద్దిగా తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా రూ. 151.50 కోట్ల నెట్ వసూళ్లు కలెక్ట్ చేసింది.కాగా.. 'రైడ్ 2' ఊహించిన దానికంటే థియేటర్లలో బాగానే నడుస్తోంది. అజయ్ దేవగణ్ కెరీర్లో రూ. 200 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా రైడ్-2 నిలిచింది. గతేడాది నవంబర్‌లో దీపావళికి విడుదలైన 'సింగం ఎగైన్' తర్వాత ఈ మూవీ రికార్డ్ సాధించింది. అయితే 2018లో విడుదలైన 'రైడ్' ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 154 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో వాణి కపూర్ హీరోయిన్గా నటించగా.. రితేష్ దేశ్‌ముఖ్, సౌరభ్ శుక్లా ముఖ్య పాత్రల్లో నటించారు. -
'వార్ 2' మొదలైంది.. టీజర్లో ఈ షాట్స్ గమనించారా? (ఫోటోలు)
-
శిల్పా శిరోద్కర్‌కు కరోనా
బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కరోనా వైరస్ సోకింది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, అందరూ మాస్క్‌లు ధరించి, జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు శిల్పా శిరోద్కర్. కోవిడ్‌పాజిటివ్ నేపథ్యంలో ప్రస్తుతం శిల్పా ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. ఇక బాలీవుడ్లో ‘త్రినేత్ర’, ‘హమ్’ (1991), ‘గోపీ కిషన్’ (1994) వంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు శిల్పా.అలాగే 1992లో తెలుగులో ‘బ్రహ్మ’ చిత్రంలో కూడా నటించారామె. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి, బ్రేక్ తీసుకున్న శిల్పా ఇటీవల బిగ్‌బాస్ 18 సీజన్లో కంటెస్టెంట్గాపాల్గొన్నారు. ఇదిలా ఉంటే... ఆసియా దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో శిల్పా అక్కడికి ట్రావెల్ చేసి, ముంబై వచ్చారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక మహేశ్‌బాబు సతీమణి నమత్ర సోదరి శిల్పా శిరోద్కర్ అనే సంగతి తెలిసిందే. -
భారత్- పాక్ వార్.. రూ.50 లక్షల ఆఫర్ వదులుకున్న సింగర్!
విరాట్ కోహ్లీతో వివాదంతో వార్తల్లో నిలిచిన సింగర్ రాహుల్ వైద్య మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల కోహ్లీపై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఇండియా- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశభక్తిని చాటుకున్నారు. టర్కీలో తాను ప్రదర్శన ఇవ్వడానికి నిరాకరించాడు. ఓ పెళ్లిలో ప్రదర్శన ఇచ్చేందుకు దాదాపు రూ.50 లక్షలు ఆఫర్ చేశారని వెల్లడించాడు. పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీ వ్యవహరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగర్ రాహుల్ తెలిపారు.రాహుల్ వైద్య మాట్లాడుతూ.."టర్కీలో నాకు వచ్చిన ఆఫర్‌కు రూ. 50 లక్షలు ఇస్తామన్నారు. కానీ డబ్బు కంటే.. నా దేశ ప్రయోజనాలను ముఖ్యమని వారికి చెప్పా. వారు నాకు ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. కానీ నేను వద్దన్నది డబ్బు గురించి కాదని మరోసారి స్పష్టం చేశా. ఎందుకంటే డబ్బు కంటే చాలా ముఖ్యమైన అంశం. ఇది ఒక వ్యక్తిగా కాదు.. నా దేశం గురించే ఈ నిర్ణయం. మన దేశానికి అండగా నిలబడాలన్నదే నా ఆశయం." అని పంచుకున్నారు. మన దేశానికి శత్రువుగా అంటూ మనల్ని అగౌరవపరిచే దేశాన్ని సందర్శించడంలో తనకు ఆసక్తి లేదని రాహుల్ పేర్కొన్నారు.ఇటీవల బాలీవుడ్ నటి రూపాలి గంగూలీ సైతం టర్కీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సినీ ప్రముఖులు, మనదేశ ప్రయాణికులు టర్కీ బుకింగ్‌లను రద్దు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా.. ఇప్పటికే టర్కీ విషయంలో భారత్ పలు ఆంక్షలు విధించింది. ఇకపై టర్కీలో భారతీయ సినిమాలు షూటింగ్‌లు ఉండవని స్పష్టం చేసింది. టర్కిష్ సంస్థలతో ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆదేశించింది. -
'ఛత్రపతి' రీమేక్ అందుకే ఫెయిలైంది: బెల్లంకొండ శ్రీనివాస్
తెలుగులో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్.. మధ్యలో హిందీలో సినిమా చేశాడు. చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ ఇక్కడ 'భైరవం' చిత్రం చేశాడు. మే 30న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో పాల్గొన్న ఇతడు.. ఛత్రపతి హిందీ రీమేక్ ఫ్లాప్ కావడం గురించి మాట్లాడాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)'హిందీలో సినిమాలు చేసిన తెలుగు హీరోలు పెద్దగా లేరు. ప్రస్తుతం రానా, రామ్ చరణ్ మాత్రమే చేశారు. చరణ్ చేసింది 'జంజీర్' రీమేక్. హిందీ మూవీని మళ్లీ హిందీలో చేయడం వల్ల ప్రేక్షకులు అలా తీసుకున్నారేమో తెలియదు. నేను చేస్తున్నది సౌత్ మూవీ కదా అనుకున్నాను. రాజమౌళి హిట్ సినిమా, ఎమోషన్స్ కి బాగా కనెక్ట్ అవుతారని అనుకున్నాం''పైగా సవతి తల్లి, బిడ్డల సెంటిమెంట్ లాంటివి హిందీలో పెద్దగా ఉండవని నిర్మాత భరోసా ఇచ్చారు. దీంతో వర్కౌట్ అవుతుందేమోనని అనుకున్నాం. కానీ ఛత్రపతి మూవీని రీమేక్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే అప్పటికే సౌత్ సినిమాల్ని హిందీ ప్రేక్షకులు బాగా చూసేశారు. ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఇది వర్కౌట్ అవుతుందా? అనే టెన్షన్ వల్ల పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాను' అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'డ్రాగన్' షూటింగ్ లో ప్రేమ.. ఇప్పుడు ఏకంగా పెళ్లి) -
చాహల్‌తో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన ఆర్జే మహ్వశ్!
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్జే మహ్వశ్ పేరు తెగ వినిపిస్తోంది. దీనికి కారణం ఈ ముద్దుగుమ్మకు టీమిండియా క్రికెటర్ యుజ్వేందర్ చాహల్‌తో కనిపించడమే. వీరిద్దరు కలిసి దుబాయ్‌లో ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఫోటోలు పెద్దఎత్తున వైరలయ్యాయి. ఆ తర్వాతే ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ మహ్వశ్ సందడి చేయడంతో వీటికి మరింత బలం చేకూరింది. కానీ తమ రిలేషన్‌పై ఇప్పటివరకు ఎవరూ కూడా స్పందించలేదు.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆర్జే మహ్వశ్.. తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. అవీ తనను ఎలా ప్రభావితం చేశాయో వివరించింది. కొంతమంది ట్రోల్స్ కారణంగా ఇలాంటివీ జరుగుతూ ఉంటాయని తెలిపింది. కానీ అందులో ఎలాంటి నిజం లేకపోవడంతోనే వాటిని అంగీకరించలేకపోయానని పేర్కొంది. ఈ వ్యక్తులు నాతో ఎందుకు ఇలా చేస్తున్నారు.. నిజం తెలియనప్పుడు నా జీవితం పట్ల ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? అని బాధపడ్డానని వెల్లడించింది. అందుకే సోషల్ మీడియాను వదిలేసి ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నట్లు ఆర్జే మహ్వశ్ తన బాధను పంచుకుంది. కానీ నాపై వచ్చిన రూమర్స్, ట్రోల్స్ బాగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేసింది. మీరు చెప్పేవన్నీ కల్పితాలేనని.. మా మధ్య అలాంటిదేమీ లేదని ఆర్జే మహ్వశ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.కాగా.. ఆర్జే మహ్వశ్ ప్యార్ పైసా ప్రాఫిట్ అనే సిరీస్‌తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ మ్యాక్స్ ప్లేయర్లో ప్రసారం అవుతోంది. ఈ షో ప్రీమియర్ అయినప్పుడు చాహల్ ఈ సిరీస్‌పై పోస్ట్ పెట్టారు. -
తెరపైకి తెలంగాణ అమర జవాన్ బయోపిక్!
దేశభక్తి ప్రధానంగా ఉండే సినిమాలు కొన్ని ఇదివరకే తెరపై సందడి చేశాయి. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ కూడా దక్కించుకున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి తెలంగాణకు చెందిన అమర జవాన్ బయోపిక్ కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోగా సల్మాన్ ఖాన్ నటిస్తాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇంతకీ ఎవరా జవాన్? ఏంటి సంగతి?తెలంగాణ సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు.. 2020లో గల్వాన్ లోయలో చైనాతో జరిగిన యుద్ధంలో వీరమరణం చెందారు. అప్పట్లో ఈయన ధైర్య సాహసాల గురించి మన ప్రజలు చాలా మాట్లాడుకున్నారు. అనంతరం ఈయన జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగా 'ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ 3' అనే నవల కూడా రాశారు.(ఇదీ చదవండి: నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం)ఇప్పుడు ఈ నవల ఆధారంగానే సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సల్మాన్ హీరోగా నటించనున్నారట. ఈ ఏడాది జూలైలో షూటింగ్ మొదలుకానుండగా.. ముంబై, లద్దాఖ్ లో దాదాపు 70 రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరణ చేయనున్నారని సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.గతంలో హీరోస్, టైగర్ జిందా హై, ఏక్ థా టైగర్ తదితర దేశభక్తి ప్రధానంగా నడిచే సినిమాల్లో సల్మాన్ నటించాడు. కాకపోతే గత కొన్నాళ్లుగా ఇతడు మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ హిట్ పడట్లేదు. గతేడాది 'సికిందర్' చిత్రంతో వచ్చి ఘోరమైన ఫలితం అందుకున్నాడు. మరి ఈసారి జవాన్ బయోపిక్ మూవీతో సల్మాన్ ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) -
23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్ హీరోయిన్స్ (ఫోటోలు)
-
విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు తెలిపిన సింగర్.. ఎందుకంటే?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రముఖ సింగర్ రాహుల్ వైద్య కృతజ్ఞతలు తెలిపారు. తనను సోషల్ మీడియాలో అన్‌బ్లాక్ చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కాగా.. గతంలో కోహ్లీ, అతని అభిమానులను ఉద్దేశించి జోకర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో సింగర్ రాహుల్‌ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కోహ్లీ బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని సింగర్ కూడా వెల్లడించాడు.తాజాగా అన్‌బ్లాక్ చేయడంతో కోహ్లీపై ప్రశంసలు కురిపించారు సింగర్ రాహుల్ వైద్య. భారత క్రికెట్‌కు ఆయన చేసిన కృషిని ప్రశంసిస్తూ వరుస పోస్టులు పెట్టారు. నన్ను అన్‌బ్లాక్ చేసినందుకు మీకు ధన్యవాదాలు.. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో మీరు ఒకరని కోహ్లీని కొనియాడారు. మీరు భారతదేశానికి గర్వకారణమని.. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ దేవుడు ఎప్పుడు దీవించాలని కోరుకుంటున్నట్లు సింగర్ రాసుకొచ్చాడు.గతంలో తలెత్తిన వివాదాన్ని ప్రస్తావిస్తూ..'నా భార్య, సోదరిని ఉద్దేశించి చాలా అసభ్యంగా కామెంట్స్ చేశారు. నా చిన్నకూతురు చిత్రాలను మార్ఫింగ్ చేశారు. నా కుటుంబానికి ద్వేషపూరిత సందేశాలను పంపిన వ్యక్తులకు ఆ దేవుడు కొంత జ్ఞానం ప్రసాదించుగాక. నేను కూడా అంతకంటే దారుణంగా స్పందించగలను. కానీ నేను అలా చేయను. ఎందుకంటే అది మరింత ప్రతికూలతకు కారణమవుతుంది. వికాస్ కోహ్లీ (విరాట్ సోదరుడు) మీరు నాకు ఏమి చెప్పినా నాకు చెడుగా అనిపించలేదు. ఎందుకంటే మీరు మంచివారని నాకు తెలుసు. మాంచెస్టర్ స్టేడియం వెలుపల మిమ్మల్ని కలవడం, నా పాట గురించి మీరు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అందరు ప్రేమ, శాంతి ఉండాలని కోరుకుంటున్నా' అంటూ తన పోస్ట్‌లో వివరణ ఇచ్చారు. కాగా.. గతంలో విరాట్ కోహ్లీ అభిమానులు విరాట్ కంటే పెద్ద జోకర్లు అంటూ సింగర్ కామెంట్ చేశాడు. దీనిపై కోహ్లీ ఫ్యాన్స్ అతనిపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. View this post on Instagram A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv) -
నటుడు మిథున్ చక్రవర్తికి నోటీసులు
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)కి మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మలాడ్‌లో ఉండే ఎరంగేల్ ప్రాంతంలో తన సొంత స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా మిథున్ ఒక గ్రౌండ్ ఫ్లోర్, మూడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. దీంతో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటి నిర్మాణ పనులు తక్షణమే ఆపాలని అందులో పేర్కొంది. అయితే, తాను ఎలాంటి అక్రమమైన నిర్మాణాలు చేయలేదని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు బీఎంసీకి అందిస్తానని మిథున్ చక్రవర్తి తెలిపారు.గత వారం రోజులుగా అదే ప్రాంతంలో అక్రమ భవన నిర్మాణాలను, బంగ్లాలను బీఎంసీ తొలగిస్తుంది. ఇప్పటికే దాదాపు 130 అనధికార నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. మే 31లోపు ఆ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని అధికారులు తెలిపారు. -
హీరో తప్పుకొన్నాడు.. హిందీ 'బేబి'కి బ్రేకులు?
తెలుగు సినిమా 'బేబి'.. రిలీజైన టైంలో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదేం సినిమా అని చాలామంది అన్నారు కానీ యూత్ మాత్రం ఈ మూవీని హిట్ చేశారు. ఇకపోతే ఈ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయాలని దర్శకుడు సాయి రాజేశ్ ఫిక్స్ అయ్యాడు. కాకపోతే అధికారికంగా ప్రకటించలేదు.(ఇదీ చదవండి: జయం రవిని ఎప్పుడూ అల్లుడిలా చూడలేదు.. సీన్ లోకి ఎంటరైన అత్త)ప్రస్తుతానికైతే ఇంకా చర్చల దశలోనే ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నట్లు నటుడు బాబిల్ ఖాన్ ప్రకటించాడు. లెక్క ప్రకారం హీరోల్లో ఒకరిగా ఇతడిని తీసుకోవాలని సాయి రాజేశ్ అనుకున్నాడు. కానీ రీసెంట్ గా బాబిల్.. బాలీవుడ్ ని పరోక్షంగా తిడుతూ వీడియో పెట్టడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నట్లు పేర్కొన్న బాబిల్ ఖాన్.. ఆ దర్శకుడితో కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకున్నానని, దురదృష్టవశాత్తూ అది సాధ్యపడటం లేదని రాసుకొచ్చాడు. సాయి రాజేశ్, టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తమ మధ్య అపారమైన ప్రేమ ఉందని, భవిష్యత్తులో కలిసి పనిచేస్తామనే నమ్మకం ఉందని అన్నాడు.బాబిల్ పోస్ట్ పై స్పందించిన సాయి రాజేశ్.. 'నేను కలిసిన టాలెంటెడ్, కష్టపడే నటుల్లో బాబిల్ ఒకడు. కొంతకాలం ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నేను నా హీరోని మిస్ అవుతున్నాను. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. మేం తప్పకుండా మ్యాజిక్ సృష్టిస్తాం' అని చెప్పుకొచ్చాడు.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రీమేక్ నుంచి ఓ హీరో తప్పుకొన్నాడు. ఇప్పటికిప్పుడు మరో హీరోని వెతికి పట్టుకుని అతడికి ట్రైనింగ్ ఇప్పించి సినిమా చేయడానికి మరికొన్నాళ్లు పట్టొచ్చు. అంటే 'బేబి' హిందీ రీమేక్ కి బ్రేకులు పడ్డట్లే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Babil (@babil.i.k) View this post on Instagram A post shared by Sai Rajesh (@sairazesh) -
'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్
వేల మంది కష్టపడితేనే ఓ సినిమా తీయడం సాధ్యమవుతుంది. అదే మూవీ హిట్ అయితే గనక హీరో హీరోయిన్ లేదా దర్శకుడికే ఎక్కువ క్రెడిట్ వస్తుంది. కానీ ఇదే మూవీ కోసం పనిచేసిన చాలామందికి పెద్దగా గుర్తింపే దక్కదు. సరిగ్గా ఇలాంటి అనుభవమే తనకు ఎదురైందని నేషనల్ అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ అంటున్నాడు.బాస్కో మార్టిస్ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇతడు తెర వెనక మాత్రమే ఉంటాడు. తెలుగు, హిందీలో సూపర్ హిట్ అనిపించుకున్న చాలా పాటలకు ఇతడు కొరియోగ్రఫీ చేశాడు. కానీ తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతేడాది రిలీజైన 'దేవర'లో చుట్టమల్లే పాటని కొరియోగ్రఫీ చేసింది కూడా ఇతడే.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా)తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చుట్టమల్లే పాటకు తనకు గుర్తింపు దక్కకపోవడంపై తన బాధని బయటపెట్టాడు. 'దేవర ప్రమోషన్స్ లో జాన్వీ నా గురించి మాట్లాడి ఉండాల్సింది. కానీ పర్వాలేదులే. మన పని మనం చేసుకుంటే చాలు' అని బాస్కో మార్టిస్ చెప్పుకొచ్చాడు.బాస్కో మాట్లాడిన దానిబట్టి చూస్తుంటే జాన్వీ తన పేరు చెప్పకపోవడంపై బాధ పడుతున్నట్లు అనిపించింది. అలానే ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ కి సరైన గుర్తింపు దక్కకపోవడం గురించి మరీ నేరుగా కాకపోయినా పరోక్షంగా తన అసంతృప్తిని బయటపెట్టినట్లు అనిపించింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యాన చిన్న చిన్న టెక్నీషియన్స్ కి కూడా ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఆ లెక్కన బాస్కో చాలా బెటర్!(ఇదీ చదవండి: రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం: మంచు విష్ణు) -
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నరాలు తెగే హైప్ ఇచ్చిన హృతిక్ రోషన్
-
బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్
ప్రముఖ టీవీ నటి,బాగ్ బాస్ 12 విన్నర్ దీపిక కాకర్ (Dipika Kakar), తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య ఆరోగ్యం కోసం ప్రార్థించాల్సిందిగా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అసలు దీపిక కాకర్‌కు ఏమైంది?దీపిక కాకర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు.ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్‌లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. టీవీ నటిగా వచ్చిన పాపులారిటీతోనే 2018లో హిందీ బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో విన్నర్‌గా నిలిచింది. తాజాగా దీపిక కాకర్‌ను లివర్‌లో పెద్ద ట్యూమర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని తొలగించేందుకు వైద్యులు త్వరలోనే ఆపరేషన్ చేయనున్నారు. ఈ విషయాన్ని నటుడు, దీపిక భర్త షోయబ్ ఇబ్రహీం ఒక వ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అయితే అదృష్టవశాత్తూ అది ట్యూమర్ కాదని తెలిపాడు. దీపిక ఇటీవల కడుపునొప్పితో బాధపడిందని, మొదట్లో అది మామూలు కడుపు నొప్పే అనుకున్నారు. యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత అది తగ్గింది. కానీ మళ్లీ నొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించగా ట్యూమర్ ఉన్నట్టు తేలింది. కాలేయంలోని ఎడమ లోబ్‌లో చాలా దాదాపు టెన్నిస్ బంతి అంత కణిడి తున్నట్టు సీటీ స్కాన్ ద్వారా గుర్తించారు షోయబ్ పోస్ట్‌లో అభిమానులతో షేర్ చేశారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కెరీర్‌కు దూరంగా కెరీర్ పీక్‌లో ఉండగానే భర్త, ఫ్యామిలీకోసం పరిశ్రమకు దూరమైంది. పెళ్లికి ముందు చదువు పూర్తికాగానే, దీపిక కాకర్ మూడు సంవత్సరాలు విమాన సహాయకురాలిగా పనిచేసింది. 2010లో, నీర్ భరే తేరే నైనా అనే షోతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. అలా దాదాపు ఆరేళ్లు టీవీలో ప్రదర్శితమైన ససురల్ సిమర్ కాలో ఆమె 'సిమర్' పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. టెలివిజన్ ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. దీపిక ఎపిసోడ్‌కు రూ. 70వేలు వసూలు చేసేదంటే ఆమె క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.మొదటి భర్తకు విడాకులు, రెండో పెళ్లి2011లో దీపికా కాకర్ రౌనక్ సామ్సన్ను వివాహం అయింది. విభేదాల కారణంగా 2015లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ససురాల్ సిమర్ కా సమయంలో, దీపిక షోయబ్ ఇబ్రహీంతో పరిచయం ప్రేమగా మారింది. తెరపై అందరినీ ఆశ్చర్యపరిచిన వీరి కెమిస్ట్రీ నిజజీవితంలోనూ బాగా పండింది. ముఖ్యంగా మొదటి భర్తతో విడాకుల సమయంలో షోయబ్ దీపికకు సపోర్ట్‌గా నిలిచాడు. 2018లో మాతం మారి, తన పేరును ఫైజాగా మార్చుకుని మరీ షోయబ్ ఇబ్రహీని వివాహం చేసుకుంది. 2023లో, ఈ జంట తమ మగబిడ్డ ( రుహాన్ )కు జన్మనిచ్చింది.2019లో, దీపిక ‘కహాం హమ్ కహాం తుమ్’ అనే షోలో నటించింది, కానీ ఆ షో ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇక కుమారుడు రుహాన్ పుట్టిన తర్వాత దీపిక తన కెరీర్‌ను విడిచిపెట్టి, కొడుకు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకుంది. మాస్టర్ చెఫ్ ఇండియాలో పాల్గొంది కానీ భుజం గాయం కారణంగా షోను మధ్యలోనే వదిలేసింది. 2011 - 2018 వరకు అత్యధిక పారితోషికం తీసుకున్న దీపిక నికర విలువ రూ. 40 - రూ. 45 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. -
'ఇలియానాను ఎందుకు తీసుకోలేదంటే'.. రైడ్-2 డైరెక్టర్ క్లారిటీ!
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఇటీవలే రైడ్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో అజయ్ దేవగణ్ సరసన వాణి కపూర్ హీరోయిన్గా నటించింది. 2018లో వచ్చిన రైడ్ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే పార్ట్-1లో హీరోయిన్గా ఇలియానా సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైడ్-2లో ఇలియానాను ఎంపిక చేయకపోవడంపై డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా స్పందించారు. ఇలియానాను కాదని.. వాణి కపూర్‌ను ఎందుకు ఎంపిక చేశారన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఆమె జీవితం పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిందని ఆయన అన్నారు. తాను ప్రస్తుతం ఓ బిడ్డతో పాటు మంచి కుటుంబం కలిగి ఉంది.. అంతేకాకుండా విదేశాలకు వెళ్లిపోయిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల వల్లే హీరోయిన్ను మార్చాల్సి వచ్చిందని రాజ్ కుమార్ గుప్తా వెల్లడించారు.కానీ ఇలియానాతో రైడ్ మూవీలో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపాకు. ఆమె ఎల్లప్పుడూ రైడ్ ప్రపంచంలో భాగమేనని రాజ్ కుమార్ గుప్తా అన్నారు. రైడ్- 2లో వాణి కపూర్ నటించడంపై ఎలాంటి వ్యతిరేకత లేదని దర్శకుడు పేర్కొన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే నటీనటుల మార్పులు తప్పనిసరని ఆయన వివరించారు. అంతకుముందు రైడ్ -2 ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఇలియానా స్థానంలో నటించే అంశాన్ని ప్రస్తావించగా.. మా మధ్య ఎటువంటి పోటీ లేదని వాణి కపూర్ స్పష్టం చేశారు. -
వారికి ఆ ధైర్యం లేదు.. అందుకే సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేశారు: వివేక్ అగ్నిహోత్రి
ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో పాన్ ఇండియాలో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండిట్ల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాతో వివేక్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ దర్శకులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ముఖ్యంగా యానిమల్ మూవీ దర్శకుడిపై విమర్శలు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగాను మాత్రమే టార్గెట్ చేశారని.. రణ్‌బీర్ కపూర్‌ను విమర్శించే ధైర్యం బాలీవుడ్లో ఏ డైరెక్టర్‌కు లేదని అన్నారు.వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..'యానిమల్ విషయంలో సందీప్ రెడ్డి వంగాను మాత్రమే టార్గెట్ చేశారు. ఎందుకంటే రణ్‌బీర్ కపూర్‌ను విమర్శించే ధైర్యం ఎవరికీ లేదు. ఇండస్ట్రీలో అతను చాలా పవర్ఫుల్. అందుకే అతన్ని విమర్శించడానికి ఎవరూ లేరు. వారికి అంత ధైర్యం ఉంటే ప్రయత్నించి చూడమనండి.బాలీవుడ్లో చాలా మంది దర్శకులు హీరోల గురించి కేవలం వారి వెనుక మాత్రమే మాట్లాడుతారు. వారికి బహిరంగంగా ఏదైనా చెప్పే ధైర్యం కూడా వారు చేయరు. కాబట్టి వారు ఇబ్బంది పడక తప్పదు. అలాంటి ఎంత నీచంగా నటించినా రూ.150 కోట్లు ఇస్తారు. 51 ఏళ్ల నటులు తమంతట తాము నిజమైన స్టార్లు అయితే ఎంత సంపాదించినా తనకు అభ్యంతరం లేదు.నా సమస్య ఏమిటంటే స్టార్డమ్ లేకున్నా స్టార్లలా ప్రవర్తించే వ్యక్తులతోనే. అలా చలామణి అయ్యే వారంటే నాకు నచ్చదు' అని అన్నారు.కాగా.. అంతకుముందు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'యానిమల్‌పై విమర్శలపై స్పందించారు. అందరు విమర్శకులు తననే టార్గెట్ చేశారని అన్నారు. మరోవైపు రణ్‌బీర్ కపూర్ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. ఎందుకంటే వారంతా రణ్‌బీర్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నారని నాకు అర్థమైందని సందీప్ వంగా వెల్లడించారు. నేను బాలీవుడ్ కొత్త కావడం నాపై విమర్శలు చేయడం వారికి సులభమని అన్నారు. -
మోనాలిసాకు మరో ఛాన్స్.. ఈసారి స్పెషల్ సాంగ్
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఎవరు ఎందుకు ఎప్పుడు ఫేమస్ అవుతారో అస్సలు చెప్పలేం. ఊరగాయలు అమ్మినా ఫేమస్ అవ్వొచ్చు. పూసలు అమ్మినా సరే ఫేమస్ అయిపోవచ్చు. అలానే కొన్నాళ్లక్రితం జరిగిన కుంభమేళాలో పూసలమ్ముతూ వైరల్ అయిపోయిన మోనాలిసా ఇప్పుడు మరో అవకాశం అందుకుంది.(ఇదీ చదవండి: 'పెద్ది'... ఈసారి రాసి పెట్టుకోండి: రామ్ చరణ్) మోనాలిసాకు ఇదివరకే ఓ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కింది. ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో తెలీదు గానీ ఇప్పుడు మరో ఛాన్స్ పట్టేసింది. ఉత్కర్ష్ సింగ్ అనే నటుడు తీసిన ఓ స్పెషల్ సాంగ్ కోసం మోనాలిసాని తీసుకున్నాడు. తాజాగా షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు.సినిమా ఛాన్సుల మాటేమో గానీ కుంభమేళాలో పూసలమ్మే టైంకి.. ఇప్పటికీ చాలా మారిపోయింది. మోనాలిసా ఎప్పుడు కనిపించినా మేకప్ తోనే కనిపిస్తోంది. త్వరలో ఈమె నటించిన సాంగ్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈమె సంగతేంటో జనాలకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Utkarsh Singh (@utkarshsinghofficial_) -
మళ్లీ రీమేక్ నే నమ్ముకున్న ఆమిర్.. మక్కీకి మక్కీ.. ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ని మిస్టర్ ఫెర్ఫక్షనిస్ట్ అంటారు. కానీ 'దంగల్' వరకు ఓకే కానీ ఆ తర్వాత ఇతడికి దురదృష్టం మొదలైంది. ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో దాదాపు మూడేళ్ల పాటు సినిమాలే చేయని ఆమిర్.. కొత్త మూవీతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు.'సితారే జమీన్ పర్' టైటిల్ తో తీసిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఇది 2023లో రిలీజైన 'ఛాంపియన్స్' అనే మూవీకి రీమేక్ అని క్లారిటీ వచ్చేసింది. కొన్ని సీన్లయితే మక్కీకి మక్కీ దింపేశారు. ఇదే విషయాన్ని కొందరు నెటిజన్లు వీడియోలు పోస్ట్ చేసి మరీ చెబుతున్నారు. మరోవైపు ఎప్పటిలానే ఆమిర్ సినిమాపై ట్రోలింగ్ షురూ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా) 'సితారే జమీన్ పర్' విషయానికొస్తే.. షార్ట్ టెంపర్ ఉండే ఓ కోచ్ అనుకోని కారణాల వల్ల కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. దీంతో సదరు జడ్జి ఊహించని తీర్పు ఇస్తారు. మతిస్థిమితం లేని కొందరిని టీమ్ గా చేసి బాస్కెట్ బాల్ నేర్పించమని చెబుతారు. తర్వాత సదరు కోచ్ ఏం తెలుసుకున్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.మంగళవారం రాత్రి ట్రైలర్ రిలీజ్.. అప్పుడే ఆమిర్ ఖాన్ పై ట్రోలింగ్ మొదలైంది. టర్కీ ఫస్ట్ లేడీని గతంలో ఇతడి కలిశాడని, అందుకే సినిమాని బహిష్కరించాలని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: శుభవార్త చెప్పిన సుడిగాలి సుధీర్ తమ్ముడు) #SitareZameenPartrailer देखो मिस्टर परफेक्ट ने कैसे पर्फेक्ट्ली फ्रेम टू फ्रेम कॉपी मारी है 😃😃😃🕋🕋🕋I can’t imagine how much they have made a fool of Bollywood lovers in the Past #AmirKhan #Champions pic.twitter.com/ZeKtJoLQve— Ex Shia Muslim News (@ExShiaMuslim) May 13, 2025 -
ధైర్యమే కాదు... అంతులేని త్యాగం కూడా...
కశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. కాగాపాక్ కుట్రలను దీటుగా ఎదుర్కొన్న ఇండియన్ ఆర్మీపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.తాజాగా హీరోయిన్ ఆలియా భట్ కూడా ఇండియన్ ఆర్మీపై, సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగమైనపోస్ట్ పెట్టారు. ‘‘గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒక విధమైన నిశ్శబ్దం ఉంటుంది. కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. మనం ఇళ్లలో హాయిగా నిద్రపోతున్నామంటే బోర్డర్లో ఉన్న సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు.ఆదివారం మనమంతా మదర్స్ డేను సంతోషంగా చేసుకున్నాం. ఆ సమయంలో దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. వారిది కేవలం ధైర్యం మాత్రమే కాదు... అంతులేని త్యాగం కూడా. ఈ ప్రతి యూనిఫామ్ వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రీ జోలపాటలా ఉండదని ఆ తల్లికి తెలుసు. ప్రాణాలు కోల్పోయిన సైనికులను తలచుకుని మనం దుఃఖిస్తున్నాము.అనిశ్చితి... ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలు కావొచ్చు. కానీ... ప్రతి రాత్రి ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను కోరుకుంటున్నాం. ప్రార్థనలు చేస్తూ, కన్నీళ్లు దిగమింగుకుంటున్న ప్రతి తల్లిదండ్రులకు ప్రేమను పంపుతున్నాం... ఎందుకంటే మీ బలం ఈ దేశాన్ని మీరు ఊహించినదానికంటే ఎక్కువగా కదిలిస్తుంది. మన రక్షకుల కోసం, భారతదేశం కోసం కలిసి నిలబడదాం.. ‘జైహింద్’’ అంటూపోస్ట్ చేశారు ఆలియా భట్. -
'కరాటే కిడ్' కోసం తండ్రికొడుకు సాయం
హాలీవుడ్ క్లాసిక్ సిరీస్‌కు చెందిన 'కరాటే కిడ్: లెజెండ్స్' ఇప్పుడు సరికొత్తగా భారతీయ ప్రేక్షకులని పలకరించబోతోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, కొడుకు యుగ్ కలిసి ఈ చిత్ర హిందీ డబ్బింగ్ వెర్షన్ కోసం పనిచేశారు.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో) జాకీ చాన్ మిస్టర్ హాన్ పాత్రకు అజయ్ దేవగన్ గొంతు అందించగా, బెన్ వాంగ్ పోషించిన లీ ఫాంగ్ పాత్రకు యుగ్ డబ్బింగ్ చెప్పాడు. తొలిసారి ఇంటర్నేషనల్ సినిమాకు వాయిస్ ఇవ్వడం అజయ్ దేవగన్‌కి ఇదే తొలిసారి.సినిమా కథలో గురువు-శిష్య బంధం ప్రధానాంశంగా ఉండగా, ఆ బంధం వెనుక నిజ జీవిత తండ్రీ-కొడుకుల కెమిస్ట్రీ ఉండడం ఈ వెర్షన్‌కు స్పెషల్ టచ్ ఇస్తోంది. 'కరాటే కిడ్: లెజెండ్స్' సినిమా మే 30న రిలీజ్ అవుతోంది. దేశవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్.. తెలుగులో నేరుగా రిలీజ్) View this post on Instagram A post shared by Sony Pictures IN (@sonypicturesin) -
'మీ త్యాగం మరువలేనిది'.. ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ భామ ఆలియా భట్ మన సైన్యం సేవలను గుర్తు చేసుకుంది. మదర్స్ డే సందర్భంగా దేశానికి సేవ చేస్తున్న సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించింది. తమ హీరోలను దేశానికి అందించి.. ప్రతి క్షణ నిశ్శబ్దంగా తమ బిడ్డకోసం కలవరపడుతూనే ఉంటారని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సైనికులు, వారి మాతృమూర్తుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మాతృ దినోత్సవం సందర్భంగా సైనికుల తల్లులను తలచుకుని భావోద్వేగానికి గురైంది.ఆలియా భట్ తన నోట్లో రాస్తూ.. "గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఎక్కడా చూసినా నిశ్శబ్దమే వినిపించింది. గత కొన్ని రోజులుగా మేము ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దం, ఆందోళన చుట్టూ మోగుతున్న ఉద్రిక్తత.. ఎక్కడో, పర్వతాలలో మన సైనికులు మేల్కొని అప్రమత్తంగా ఉంటూ ప్రమాదంలో ఉన్నారనే బాధను మేము అనుభవించాం. ఆదివారం మనమంతా మదర్స్ డేను సంతోషంగా జరుపుకున్నాం. అందుకే ఈ రోజు మన దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. అంతులేని త్యాగం, ప్రతి సైనికుడి యూనిఫామ్ వెనక నిద్ర లేని రాత్రులు గడిపే ఆ వీరుడి తల్లి ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రి కూడా ప్రశాంతంగా ఉండదని ఆ అమ్మకు తెలుసు. ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలవ్వొచ్చు. కానీ సైనికుల తల్లిదండ్రుల ధైర్యం ఈ దేశాన్ని ఎంతగానో కదిలిస్తోంది. కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులకు మన ప్రేమను పంపండి. మీ బాధను పంటి బిగువున నొక్కిపెట్టిన వారికి ప్రతిక్షణం అండగా ఉంటాం. మీ కోసం మేమంతా కలిసి నిలబడతాము. మన రక్షకుల కోసం.. భారతదేశం కోసం.. జై హింద్' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా సైతం పాకిస్తాన్‌పై దాడులు చేసింది. దాదాపు వందమందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్ సిందూర్‌కు ప్రముఖులు సైతం తమ మద్దతును ప్రకటించారు. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
'మిస్ వరల్డ్'లో మన స్థానం ఎంత.. కిరీటం అందుకున్న బ్యూటీస్ ఎందరు..?
ప్రపంచ సుందరి- 2025 (Miss World Competitions 2025) పోటీలు హైదరాబాద్‌లో అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ ఏడాది కిరీటాన్ని అందుకునే అందాల రాశి ఎవరా? అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మిస్ వరల్డ్ అవ్వాలనే ఆశయంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటికి పైగానే అమ్మాయిలు ఈ పోటీలకు దరఖాస్తు చేసుకుంటారు. 160కంటే ఎక్కువ దేశాలే ఈ పోటీల్లో పాల్గొంటాయి. అందుకే బ్యూటీ వరల్డ్‌లో ఈ పోటీలకు అంత ప్రత్యేకత ఉంటుంది. ఇంతటి ప్రతిష్టాత్మకత కలిగిన ఈ పోటీలలో గెలుపొందిన మన భారతీయ సుందరిలు ఆరుగురు ఉన్నారు.భారత్ నుంచి ఆరుగురు అందాల భామలు ఈ కిరీటాన్ని అందుకున్నారు. మొట్టమొదటిసారి ముంబైకి చెందిన రీటా ఫరియా (1966)లో ఈ కిరిటాన్ని దక్కించుకుంది. మిస్ వరల్డ్‌గా ఎంపికైన తొలి మెడికల్ డాక్టర్ కూడా ఆమె కావడం విశేషం. గెలిచిన తర్వాత సినిమాల్లో ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, ఆమె తన డాక్టర్ వృత్తిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ (1994), డయానా హెడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంక చోప్రా (2000), మానుషి చిల్లర్ (2017) ప్రపంచ సుందరీమణులుగా నిలిచారు. ప్రపంచంలో ఇప్పటివరకూ అత్యధిక కిరీటాలు (6) గెలిచిన దేశాల జాబితాలో భారత్‌తో పాటు వెనిజులా ప్రథమ స్థానంలో ఉంది. ముఖ్యంగా 2000సంవత్సరంలో భారత్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆ ఏడాదిలో ప్రియాంక చోప్రా(మిస్ వరల్డ్), లారా దత్తా (మిస్ యూనివర్స్) దియా మిర్జా (మిస్ ఆసియా పసిఫిక్)గా గెలవడంతో ఒకే ఏడాది మూడు ఇంటర్నేషనల్ బ్యూటీ పాజెంట్ టైటిళ్లు సాధించిన ఏకైక దేశంగా భారత్ నిలిచింది. అలా బ్యూటీ వరల్డ్‌లో భారత్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. -
కేంద్రం అంటే బాలీవుడ్‌కు భయం.. అందుకే నోరెత్తరు: రచయిత
హిందీ చిత్ర పరిశ్రమ గురించి బాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అంటే బాలీవుడ్‌కు భయం అని ఆయన అన్నారు. అందుకే ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సాహసం చేయరని ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరైన తెగించి విమర్శలు చేస్తే.. దర్యాప్తు సంస్థల నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభద్రతాభావం బాలీవుడ్ హీరోలలో ఉందని అభిప్రాయపడ్డారు. ఈడీ, సీబీఐ దాడుల భయమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా నిరోధిస్తుందని ఆయన అన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ వేదికగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్‌తో జరిగిన చర్చ సందర్భంగా జావేద్ అఖ్తర్ ఈ వ్యాఖ్యలు చేశారు.'బాలీవుడ్ తారలు గొప్ప పేరు ప్రఖ్యాతులతో విలాసవంతమైన జీవితాల్ని గడుపుతారు. కానీ, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయాల్లో వారు కూడా సామాన్యుల తరహాలోనే ఆలోచిస్తారు. ఈ బడా హీరోలను వెనక నుంచి నడిపించేది మొత్తం పారిశ్రామికవేత్తలే. ఎట్టిపరిస్థితిల్లోనూ వారితో పోరాడేంత పెద్దవారు కాదు ఈ సినీ తారలు. ఈ క్రమంలోనే వారి వైఖరిపై పలుమార్లు విమర్శలు వచ్చాయి. అదే హాలీవుడ్ నటులు అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా తమ భావాల్ని వ్యక్తం చేస్తారు. తాజాగా అమెరికన్ నటి మెర్లీ స్ట్రీప్ అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించినా ఆమెకు ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదు. అలాంటి వ్యాఖ్యలు ఇక్కడి ప్రభుత్వంపై చేస్తే ఈడీ, సీబీఐ దాడుల పేరుతో రంగంలోకి దిగుతారు. ఆ భయంతోనే బాలీవుడ్ చిత్రపరిశ్రమ ప్రభుత్వాన్ని ప్రశ్నించదు.' అని ఆయన జావేద్ అఖ్తర్ వ్యాఖ్యనించారు. అయితే, ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తాను నిరంతరం సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నానని జావేద్ అన్నారు. ఓ పౌరుడిగా సమస్యలపై స్పందించడం తన ధర్మమని ఆయన పేర్కొన్నారు.జావేద్ అఖ్తర్ ప్రతిభా వంతమయిన కవి, వక్త, స్క్రీన్ ప్లే రచయిత. సూటిగా తన భావాల్ని ఎలాంటి వెరపూ, బెదురూ లేకుండా ప్రకటిస్తున్న సామాజిక గొంతుక ఆయనది. ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన స్వతంత్ర లౌకిక స్వరం, జావేద్ అఖ్తర్. భావుకుడు, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ఏడు తరాల సాహిత్య చైతన్యమున్న కుటుంబంలో జన్మించారు. తన కవిత్వం మత తత్వానికి, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా రాశారు. జాతీయ సమైక్యత, స్త్రీల హక్కుల కోసం మాట్లా డారు, రాశారు. తప్పు దోవ పట్టిన యువతను ద్దేశించి జావేద్ రాసిన గీతాన్ని 1995లో కేంద్ర మానవ వనరుల శాఖ యువతకోసం ‘జాతీయ గీతం’గా ప్రకటించింది. -
సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది
కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్‌లపై ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు స్పందించారు. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘భార్యతో కలిసి వేసవి సెలవుల కోసం పహల్గాం వెళ్లిన భర్తను ఉగ్రమూక కాల్చి చంపింది.తన భర్తను చంపవద్దని ఆ భార్య ఎంతగానో ఏడుస్తూ, ప్రాధేయపడినా ఆ ఉగ్ర ఉన్మాది వినలేదు. ఆమె కళ్ల ముందే భర్తను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఆమెను విధవరాలని చేశాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆ భార్య... తనను కూడా చంపేయమని అడిగినా... ‘నిన్ను చంపను... వెళ్లి చెప్పుకో..’ అని ఆ రాక్షసుడు అన్నాడు. నా కుమార్తెలాంటి ఆమె మానసిక స్థితి చూస్తుంటే .. ‘ఆమె వద్ద చితాభస్మం ఉన్నా... సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది’ అని మా నాన్న (హరివంశ్ రాయ్ బచ్చన్) రాసిన ఓ పద్యంలోని వాక్యం నాకు గుర్తొచ్చింది. అందుకే నేను నీకు సిందూరం ఇస్తున్నా... అపరేషన్ సిందూర్... జై హింద్... భారత సైన్యమా... ఎప్పటికీ ఆగకు... వెనకడుగు వేయకు’’ అంటూ భావోద్వేగమైన ΄పోస్ట్‌ను షేర్ చేశారు అమితాబ్ బచ్చన్. -
ఆ సినిమా వల్లే బాలీవుడ్లో ఆఫర్ వచ్చింది: శ్రీ విష్ణు
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు సింగిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నెల 9 నుంచి సింగిల్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొత్తం రెండురోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 11.2 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీవిష్ణు కెరీర్లో మరో భారీ హిట్‌గా సింగిల్ మూవీ నిలిచింది.సింగిల్ రిలీజ్ నేపథ్యంలో శ్రీ విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రతి సినిమాతో ఏదో ఒక అనుభవాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రారంభంలో చిరంజీవి, వెంకటేశ్ లాంటి పెద్ద హీరోలు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా ఎనర్జీ ఇచ్చేదన్నారు. బ్రోచెవారేవరురా లాంటి సినిమాకు చాలా ప్రశంసలు వచ్చాయి.. ఆ సమయంలో గొప్ప ఫీలింగ్ కలిగిందని తెలిపారు. బన్నీ, రవితేజ నా ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తుంటారని వెల్లడించారు.ఇక స్వాగ్ సినిమా విషయానికొస్తే.. తమిళం నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. అలాగే మొదటిసారి స్వాగ్ మూవీ తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని శ్రీ విష్ణు వెల్లడించారు. కాగా.. సింగిల్ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా దర్శకుడు కార్తీక్ రాజు ఈ మూవీని తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. -
స్టార్ జంటపై విడాకుల రూమర్స్.. తన భర్తపై పూర్తిగా నమ్మకముందన్న భార్య!
బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందపై గత కొన్ని నెలలుగా విడాకులు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. చాలా సార్లు ఆయన భార్య సునీతా అహుజా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం కలిసే ఉన్నామని.. ఎవరూ కూడా తమను విడదీయలేరని పేర్కొంది. గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది.తాజాగా మరోసారి తమపై వస్తున్న విడాకుల వార్తలపై ఆయన భార్య సునీతా అహుజా స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన భర్తపై అపారమైన నమ్మకం ఉందని తెలిపింది. ఎలాంటి తెలివితక్కువ మహిళ మమ్మల్ని వేరు చేయలేదని స్పష్టం చేసింది. గోవింద నేను లేకుండా జీవిస్తాడని అనుకోవడం లేదు.. తన కుటుంబాన్ని ఎలాంటి తెలివితక్కువ మహిళ కోసం వదిలి వెళ్లడని సునీతా వెల్లడించింది.ఇప్పటికైనా రూమర్స్‌ను వ్యాప్తి చేయవద్దని ఆమె మీడియాను కోరింది. గోవిందతో తన వివాహం గురించి చర్చించడానికి ఏదైనా ఉంటే నేరుగా తన వద్దకు వచ్చి అడగాలని అహుజా అన్నారు. ఇలాంటి వాటిని ఎప్పటికీ అంగీకరించనని,.. ఎవరికైనా ధైర్యం ఉంటే నన్ను నేరుగా అడగాలని తెలిపింది. ఇలాంటివి ఎప్పుడైనా జరిగితే, మీడియాతో మొదట మాట్లాడే వ్యక్తిని నేనే.. ఆ దేవుడు నా కుటుంబాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయడని నమ్మకముందని పేర్కొంది. కాగా.. గోవింద, సునీత 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వర్ధన్ అహుజా, టీనా అహుజా అనే ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. -
పాకిస్తానీ నటితో చేయను: బాలీవుడ్ హీరో
-
ఆ హీరోయిన్ తో అస్సలు నటించను: టాలీవుడ్ హీరో
తెలుగు సినిమాలతో నటుడిగా మారిన హర్షవర్దన్ రాణే.. ఇక్కడ సరైన పాత్రలు, గుర్తింపు రాకపోయేసరికి బాలీవుడ్ కి వెళ్లిపోయాడు. అక్కడ హీరోగా పలు చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. అందులో ఒకటి 'సనమ్ తేరీ కసమ్'. ఈ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రీసెంట్ గా రీ రిలీజ్ చేస్తే అద్భుతమైన వసూళ్లు దక్కించుకుంది. దీంతో చిత్రనిర్మాతలు సీక్వెల్ ని ప్రకటించారు. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడింది.(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) నిన్నటివరకు భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మన దేశం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్ లోని పలు ఉగ్రస్థావరాల్ని మట్టుబెట్టింది. ఈ క్రమంలో పలువురు పాక్ నటీనటులు.. ఆపరేషన్ సిందూర్ పై నోటికొచ్చిన కామెంట్స్ చేశారు. వాళ్లలో నటి మావ్రా హోకెన్ ఒకరు. ఈమెనే గతంలో 'సనమ్ తేరీ కసమ్'లో హీరోయిన్ గా నటించింది.తాజాగా ఈమె.. 'ఆపరేషన్ సిందూర్'పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హర్షవర్ధన్, సీక్వెల్ లో ఈమెతో నటించేది లేదని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.'ప్రస్తుత పరిస్థితులని నేను గౌరవిస్తున్నాను. నా దేశాన్ని ఉద్దేశించి కొందరు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నేనొక నిర్ణయానికి వచ్చాను. గతంలో నటించిన వాళ్లే ఇప్పుడు 'సనమ్ తేరీ కసమ్ 2'లోనూ నటిస్తానంటే.. నేను అందులో నటించాలని అనుకోవట్లేదు' అని హర్షవర్ధన్ చెప్పుకొచ్చాడు.అలానే మావ్రా హోకెన్ పోస్ట్ ని కూడా షేర్ చేసిన హర్షవర్ధన్.. ఏ దేశానికి చెందిన నటీనటుల్ని అయినా నేను గౌరవిస్తాను. కానీ నా దేశం గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు అని స్పందించాడు. ఇప్పుడు ఇది కాస్త హాట్ టాపిక్ అయింది.(ఇదీ చదవండి: రూ.60 కోట్ల దావా.. ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ జోక్యం) -
రూ.60 కోట్ల దావా.. ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ జోక్యం
ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లలో రిలీజైన చాలా సినిమాలు.. తక్కువ రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కానీ రీసెంట్ గా 'భోల్ చుక్ మాఫ్' అనే హిందీ చిత్రం మాత్రం విడుదలకు మరోరోజు ఉందనగా.. ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకెక్కింది.లెక్క ప్రకారం 'భోల్ చుక్ మాఫ్' సినిమా మే 09న థియేటర్లలో రిలీజ్ అవ్వాలి. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేశారు. థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. చాలామంది టికెట్స్ కూడా కొనుకున్నారు. కానీ రిలీజ్ కి ఒకరోజు ముందు నిర్మాతలు అందరికీ షాకిచ్చారు. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఒక్క ఫ్రేమ్ లో 19 మంది తెలుగు యంగ్ డైరెక్టర్స్.. ఏంటి విశేషం?) దీంతో ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్.. బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. ఈ సినిమా కోసం తాము చాలా ఖర్చు చేశామని, ఇప్పుడు ఇలా ఓటీటీలో రిలీజ్ చేయడం సరికాదని రూ.60 కోట్ల దావా వేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ స్టే ఇచ్చింది. అంటే తదుపరి ఆర్డర్ వచ్చేంతవరకు మూవీని ఎక్కడా విడుదల చేయడానికి వీల్లేదనమాట. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలో భారత క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) -
ఉగ్రవాదులు భూమ్మీద ఉండకూడదు: జాన్వీ కపూర్
‘‘ఇన్ని రోజులు మనం యుద్ధం రాకూడదనే కోరుకున్నాం. కానీ, ఉగ్రవాదులు మన ప్రజలను చంపుతుంటే సహించేది లేదు. భారత్ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వలేదు. ఇన్ని రోజులు మన మీద జరిగిన దాడుల తర్వాత ఆ బాధను తీర్చుకోవడానికే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. వారి దుశ్చర్యలను తిప్పి కొడుతున్నాం. మనది దూకుడు కాదు... దశాబ్దాల బాధకు సమాధానం. అసలు ఉగ్రవాదులు భూమ్మీద ఉండకూడదు’’ అని హీరోయిన్ జాన్వీ కపూర్ పేర్కొన్నారు.కశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఇండియన్ ఆర్మీపై ప్రశంసలు కురుపిస్తూ, వారికి మద్దతుగా సోషల్ మీడియాలోపోస్టులు పెడుతున్నారు. జాన్వీ కపూర్ కూడా ఇప్పటికే పలుపోస్టులు పెట్టినప్పటికీ, తాజాగా తన ఇన్ స్టా్రగామ్లో సుదీర్ఘమైనపోస్ట్ పెట్టారు. ‘‘ఇండియా– పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జమ్మూపై దాడుల విజువల్స్ చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను.పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడులు నన్ను ఎంతో బాధించాయి. ఇది నేను ఇప్పటివరకూ ఎప్పుడూ అనుభవించని బాధ. ఇన్ని రోజులు విదేశాల్లో ఇలాంటి దాడులు జరుగుతుంటే శాంతిని పాటించాలని కోరుకున్నాం. కానీ ఇప్పుడు అదే పరిస్థితి మనవరకు వచ్చింది. మన సైనికులు సరిహద్దు దగ్గరపోరాడుతూ మనల్ని కా పాడుతున్నారు. మన దేశ సార్వభౌమత్వాన్ని రక్షిస్తున్న సైనికులకు ఎప్పటికీ రుణపడి ఉండాలి.వాళ్ల వల్లే మనం సురక్షితంగా ఉంటున్నాం. ఇలాంటి సమయంలో దేశం మొత్తం మన భారతీయ జవానులకు మద్దతుగా నిలవాలి. ఈ యుద్ధంలో అమాయకులుప్రాణాలు కోల్పోవడం నన్ను బాధిస్తోంది. త్వరలోనే ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను. మన సైనికుల కోసంప్రార్థిస్తుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి పుకార్లను ఇతరులతో పంచుకోవద్దు’’ అంటూ జాన్వీ కపూర్పోస్ట్ చేశారు. ఆమెపోస్ట్పై పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మా జోలికి వస్తే వదిలిపెట్టం: రణ్వీర్ సింగ్
‘ఆపరేషన్ సిందూర్’ పై హీరో రణ్వీర్ సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓపోస్ట్ షేర్ చేశారు. ‘‘ఎవరి పనులు వాళ్లు చేసుకునే వారిని మేం(భారతీయులు) ఇబ్బంది పెట్టం. ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం.మన సాయుధ దళాల ధైర్యానికి సెల్యూట్. ఈ ఆపరేషన్‌లో వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారికి ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చారు. -
జాతీయ అవార్డ్ గ్రహీత విక్రమ్ కన్నుమూత
జాతీయ అవార్డ్ గ్రహీత, ప్రముఖ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్(51) కన్నుమూశారు. తొలుత మరాఠీ సినిమాల్లో పనిచేసిన ఈయన తర్వాత పలు హిందీలో చిత్రాల్లో నటించారు. 2013లో ఓ బెంగాలీ చిత్రానికి ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. విక్రమ్ గైక్వాడ్ మరణవార్త తెలుసుకున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నివాళులర్పించారు. ఈయన మరణం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. భారతీయ సినిమా, నాటక రంగానికి విక్రమ్ చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: శ్రీవిష్ణు ‘సింగిల్’కి రికార్డు ఓపెనింగ్స్... తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?)విక్రమ్ గైక్వాడ్ మేకప్ ఆర్టిస్ట్ గా చేసిన వాటిలో.. బెల్ బాటమ్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, బ్లాక్ మెయిల్, దంగల్, పీకే, సూపర్ 30, కేదార్నాథ్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ తదితర హిందీ సినిమాలున్నాయి.మరాఠీ సినిమాల్లో ఈయన్ని బాలగంధర్వ అని కూడా అంటారు. విక్రమ్ మరణంపై చిత్రపరిశ్రమలోని ప్రముఖులు నివాళులర్పించారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ముంబైలోని దాదర్‌లోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే విక్రమ్ మృతికి కారణం ఇంకా తెలియరాలేదు.(ఇదీ చదవండి: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!) -
సైఫ్ అలీఖాన్ కత్తిపోటు కేసు.. బెయిల్ వద్దంటూ పోలీసులపై నిందితుడి ఆరోపణలు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) ఈ ఏడాది ప్రారంభంలో దాడి జరిగిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను(30) అరెస్ట్ చేశారు. ఇప్పటికే అతనిపై కోర్టులో చార్జ్‌షీట్‌ను కూడా దాఖలు చేశారు. అయితే, తన అరెస్ట్ చట్టవిరుద్ధమని ప్రకటించాలని, తనను జైలు నుంచి వడుదల చేయాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును నిందితుడు ఆశ్రయించాడు. ఆపై ఏప్రిల్ నెలలో సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కూడా అతను ఉపసంహరించుకున్నాడు.ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న నిందితుడు మొహమ్మద్ తన న్యాయవాది అజయ్ గావ్లి ద్వారా, తన అరెస్టును చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (బాంద్రా) ముందు దరఖాస్తు చేసుకున్నాడు. ఆపై తనను జైలు నుండి విడుదల చేయాలని కోరాడు. ఆ పిటిషన్లో, పోలీసులు తనను అరెస్టు చేసేటప్పుడు చట్ట నిబంధనలను పాటించలేదన్నాడు. వారిపై మరికొన్ని ఆరోపణలు చేశాడు. దీంతో వాటికి సమాధానం చెప్పాలని పోలీసులను కోర్టు కోరింది. విచారణను మే 13కి వాయిదా వేసింది.జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. అతని మెడపై కత్తిపోట్లు కూడా పడ్డాయి. దీంతో ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స తీసుకున్న ఆయన సుమారు ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే అతడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడని పోలీసులు గుర్తించారు. -
'ఆపరేషన్ సిందూర్' సినిమా పోస్టర్ విడుదల.. వెనక్కి తగ్గిన రిలయన్స్
'ఆపరేషన్ సిందూర్' (Operation Sindhoor) పేరుతో సినిమా పోస్టర్ వచ్చేసింది. ఈ టైటిల్ కోసం బాలీవుడ్ బడా దర్శకనిర్మాతలు కూడా పోటీ పడ్డారు. అయితే, ఒక నిర్మాణ సంస్థ తమ బ్యానర్ పేరుతో ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని వారి స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడులు చేసింది. దీంతో ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఇదే బ్యాక్‌డ్రాప్‌తో బాలీవుడ్లో సినిమా రానుంది.‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ కోసం సినీ దర్శక నిర్మాతలు పోటీపడ్డారు. కేవలం రెండు రోజుల్లోనే 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో జీ స్టూడియోస్, టీ-సిరీస్ లాంటి కొన్ని బాలీవుడ్ బడా నిర్మాణసంస్థలు కూడా ఈ పేరు కోసం పోటీపడ్డాయి. అయితే, నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకం, ది కంటెంట్ ఇంజనీర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కనుందని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో యూనిఫాం ధరించి.. రైఫిల్ పట్టుకొని నుదుటన సిందూరం పెట్టుకుంటోన్న మహిళను చూపారు. ఉత్తమ్, నితిన్ దర్శకత్వంలో ఈ సినిమా రానుందని ప్రకటించారు. ఇందులో నటిస్తున్న నటీనటులను వారు ప్రకటించలేదు.ఆపరేషన్ సిందూర్, మిషన్ సిందూర్, సిందూర్ : ది రివెంజ్అంటూ ఆపరేషన్ కోడ్‌నేమ్ స్ఫూర్తితో సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఆపరేషన్ తరువాత ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ), ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (ఐఎఫ్‌టీపీసీ), వెస్ట్రన్ ఇండియా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐఎఫ్పీఏ)లకు సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు పెరిగాయి. ఈ మెయిల్ ద్వారా ఇప్పటికే 30కి పైగా టైటిల్ అప్లికేషన్లు అందగా, ఈ సంఖ్య 50–60 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి టైటిల్ వచ్చిన తరువాత సినిమా తీసేందుకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. మూడేళ్లలో సినిమా రెడీ కాకపోతే టైటిల్ తీసేసుకుంటారు.టైటిల్ విషయంలో వెనక్కి తగ్గిన రిలయన్స్ఈ పేరుతో ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు మరో ఐదు సంస్థలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్‌మార్క్‌ను సంప్రదించాయి. అయితే దేశానికి గర్వకారణమైన విషయంతో తాము వ్యాపారం చేయబోమని, తమ ఉద్యోగి పొరపాటున చేశారని చెప్పిన రిలయన్స్.. దరఖాస్తును వెనక్కి తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం బాలీవుడ్ బడా నిర్మాతలు పోటీ పడటం చూసి నెటిజన్లు ఫైర్ అయ్యారు. సెన్సిటివ్ విషయాన్ని ఇలా వ్యాపారంగా మలుచుకుంటారా అంటూ విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారందూరు కూడా రాబందులతో సమానమని చెబుతున్నారు. -
‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ కోసం క్యూ!
ముంబై: ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం ఉగ్రవాదంపై పోరు చేస్తుంటే.. ఆ పేరు కోసం బాలీవుడ్ దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’, ‘మిషన్ సిందూర్’, ‘సిందూర్ : ది రివెంజ్’అంటూ ఆపరేషన్ కోడ్‌నేమ్ స్ఫూర్తితో సినిమా టైటిల్స్ రిజిస్టర్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే 30కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆపరేషన్ తరువాత ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ), ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (ఐఎఫ్‌టీపీసీ), వెస్ట్రన్ ఇండియా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (డబ్ల్యూఐఎఫ్పీఏ)లకు సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు పెరిగాయి. ఈ మెయిల్ ద్వారా ఇప్పటికే 30కి పైగా టైటిల్ అప్లికేషన్లు అందగా, ఈ సంఖ్య 50–60 వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ‘ఇది భారతదేశం గరి్వంచదగ్గ విషయం. అందుకే ఈ కథను సినిమా తీయాలని చాలామంది అనుకుంటున్నారు’ అని ఐఎంపీపీఏ కార్యదర్శి అనిల్ నగ్రాత్ తెలిపారు. ఒక వ్యక్తి ఎన్ని టైటిల్స్కైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే మొదట దరఖాస్తు చేసుకున్న వ్యక్తికే టైటిల్ కేటాయిస్తామని తెలిపారు. గతంలో కార్గిల్, ఉరీ, కుంభమేళాలకు కూడా ఇలాగే టైటిల్ అప్లికేషన్లు అధికంగా వచ్చాయి. టైటిల్ నమోదుకు దరఖాస్తు రుసుము రూ.300 ప్లస్ జీఎస్టీ, అత్యవసర ప్రాతిపదికన అయితే రూ.3,000 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించారు. ఒక్కసారి టైటిల్ వచి్చన తరువాత సినిమా తీసేందుకు మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. మూడేళ్లలో సినిమా రెడీ కాకపోతే టైటిల్ తీసేసుకుంటారు. ఈ పేరుతో ట్రేడ్‌మార్క్ రిజి్రస్టేషన్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తోపాటు మరో ఐదు సంస్థలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్‌మార్క్‌ను సంప్రదించాయి. అయితే దేశానికి గర్వకారణమైన విషయంతో తాము వ్యాపారం చేయబోమని, తమ ఉద్యోగి పొరపాటున చేశారని చెప్పిన రిలయన్స్.. దరఖాస్తును వెనక్కి తీసుకుంది. -
బిడ్డకు జన్మనిచ్చి మరణించిన స్టార్ హీరోయిన్.. అతనే 'హిట్-3' విలన్
బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్ హిట్-3 సినిమాతో టాలీవుడ్లో బాగా పాపులర్ అయ్యాడు. హిందీలో ఆయన సుమారు 30కి పైగా సినిమాల్లో నటించారు. అయితే, హిట్-3లో విలన్‌గా ఆల్ఫా పాత్రలో మంచి గుర్తింపు పొందాడు. సికందర్, దర్భార్, భాగీ2 వంటి చిత్రాల్లో కూడా ప్రతీక్ మెప్పించాడు. అయితే, ప్రతీక్ బాబర్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుమారుడు అని చాలామందికి తెలియదు. మహానటి అనే పేరుకు అసలైన ఐకాన్‌గా ఒకప్పుడు ఆమె పేరు పొందింది.పద్మశ్రీతో పాటు రెండు నేషనల్ అవార్డ్స్ఉత్తమ నటిగా రెండు జాతీయ అవార్డ్స్ అందుకున్న స్మితా పాటిల్ ఏకైక కుమారుడే ప్రతీక్ బాబర్.. 80కి పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఆమె కేవలం 31 ఏళ్ల వయస్సులోనే కన్నుమూసింది. స్టార్ హీరోయిన్ కాకముందే ఆమె డైరెక్టర్స్‌కు కండీషన్స్ పెట్టేది. అగ్లీ డ్రెస్సులు అంటే నో చెప్పేది. తన పాత్రకు ప్రాధాన్యం లేకపోతే ఎంత పెద్ద హీరో అయినా సరే.. డబ్బు ఎంత ఇచ్చినా సరే డోన్ట్ కేర్ అనేది. ఆమె చిత్రపరిశ్రమలో ఉన్నదే పదేళ్లు.. అయినా సరే భారీగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇండియన్ సినిమా తెరపై మళ్లీ ఇలాంటి నటిని చూడలేమేమో అనేంతలా సినీ అభిమానులను మెప్పించింది. కేతన్ మెహతా 1987లో తీసిన "మిర్చ్ మసాలా" చిత్రంలో ఈమె నటనను ఫోర్బ్స్ పత్రిక "భారత సినిమాలలో 25 అత్యున్నత నట ప్రదర్శనల" జాబితాలో చేర్చింది. ఇదొక మచ్చుతునక మాత్రమేనని చెప్పవచ్చు.1955లో జన్మించిన ఆమె దశాబ్దకాలంలోనే 80కి పైగా సినిమాల్లో నటించింది. భారత ప్రభుత్వం ఈమెను 1985లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2013లో ఆమె పేరుతో పోస్టల్ స్టాంప్ కూడా విడుదలైంది. సినీ నటుడు రాజ్ బబ్బర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్మితా పాటిల్ ప్రతీక్ బబ్బర్‌ను కన్న తరువాత రెండు వారాలకు చనిపోయింది. కాన్పు వల్ల కలిగిన అనారోగ్య సమస్యల కారణంగా 1986, డిసెంబర్ 13న మరణించింది. తల్లి మీద ప్రేమతో హిట్-3 నటుడు తన పేరును 'ప్రతీక్ స్మితా పాటిల్'గా మార్చుకున్నాడు. -
'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. పాక్ నటులపై నిషేధం
మన దేశం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వల్ల 80 మంది పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ పై పాక్ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ కామెంట్స్ చేయడంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఖండించింది. వీరిని తక్షణమే బాలీవుడ్ నుంచి నిషేధిస్తున్నట్లు లేఖ విడుదల చేసింది. ఇలాంటి వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని కోరింది.'వారి (ఫవాద్-మహిరా) కామెంట్స్ మన దేశాన్ని అగౌవరపరిచేలా ఉన్నాయి. అలానే ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయకులని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులని కూడా అవమానించేలా ఉన్నాయి. మన ఇండస్ట్రీలో పనిచేసే పాక్ నటీనటులు, చిత్రనిర్మాతలపై పూర్తిగా నిషేధం విధించాలి. భారతీయులెవరూ వీరిని అభిమానించొద్దు'(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' టైటిల్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు)'కళ పేరుతో ఇలాంటి నటీనటుల్ని గుడ్డిగా మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవాన్ని అగౌవరపరచం లాంటిదే. చిత్రపరిశ్రమ దీన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిలబడదాం' అని ఆల్ ఇండియా సినీ వర్కర్క్ అసోసియేషన్ పేర్కొంది.గత నెలలో పహల్గామ్ లో జరిగిన దాడికి ప్రతీకార చర్యగా.. మంగళవారం అర్థరాత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్ పై 'ఆపరేషన్ సిందూర్' పేరుతో దాడి చేసింది. 9 స్థావరాలపై దాడి చేయగా 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇకపోతే ఫవాద్ ఖాన్ నటించిన హిందీ సినిమా 'అబిర్ గులాల్'. మే 9న రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడా సినిమా అటకెక్కిపోయినట్లే.(ఇదీ చదవండి: 'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా) -
'ఆపరేషన్ సిందూర్' టైటిల్ కోసం క్యూ కట్టిన నిర్మాతలు
'ఆపరేషన్ సిందూర్' టైటిల్ హక్కుల కోసం బాలీవుడ్‌లోని టాప్ సినీ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసిన విషయం తెలిసిందే. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ విరుచుకుపడింది. ఈ పేరు చాలా శక్తివంతంగా ఉందని గుర్తించిన సినీ మేకర్స్ టైటిల్ హక్కుల కోసం క్యూ కడుతున్నాయి.ఇప్పటికే అనేక మంది నిర్మాతలు ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు BN తివారీ ఇండియా టుడేతో ధృవీకరించారు. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం పనిచేసే సంఘాలలో ఒకటి)లో దాదాపు 15 మంది చిత్రనిర్మాతలు, స్టూడియోలు కూడా ఇదే టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు.హిందీ చిత్ర పరిశ్రమ నిర్మాతలు నిన్నటి నుంచి "ఆపరేషన్ సిందూర్" అనే టైటిల్ రేసులో మహావీర్ జైన్ ఫిల్మ్స్ ముందంజలో ఉందని, ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసిన మొదటి బ్యానర్ అని సమాచారం. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ కూడా ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. ఆపై ప్రముఖ బ్యానర్లు జీ స్టూడియోస్, టి-సిరీస్ ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసిన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ బ్యానర్లన్నీ కూడా ఇటీవలనే పహల్గామ్ దాడిని ప్రపంచానికి చూపాలని పహల్గామ్ పేరుతో టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నాయి. అయితే, "ఆపరేషన్ సిందూర్" అనేది ఒక శక్తివంతమైన టైటిల్ కావడంతో చాలామంది పోటీపడుతున్నారు. -
పోలీసులకు నటి ఫిర్యాదు.. పరారీలో నటుడు అజాజ్ ఖాన్!
ఇటీవల హౌస్ అరెస్ట్ షో వివాదం తర్వాత అజాజ్ ఖాన్ పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ షోలో అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేయడం వివాదంగా మారింది. దీంతో ఆ షోను ప్రసారం చేస్తున్న ఓటీటీ సంస్థ కూడా బ్యాన్ విధించింది. ఆ తర్వాత ఓ నటి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అజాజ్ ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అజాజ్ ఖాన్ తన ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారైనట్లు తెలుస్తోంది.తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఒక నటి ముంబయిలోని చార్కోప్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అజాజ్ ఖాన్‌ను సంప్రదించేందుకు పోలీసులు యత్నించగా.. ఇంటి వద్ద అందుబాటులో లేడని తెలిపారు. అంతేకాకుండా ఫోన్ నంబర్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో పరారైనట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. 'హౌస్ అరెస్ట్' షోలో పాత్రను ఆఫర్ చేశాడని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని నటి ఆరోపించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే 'హౌస్ అరెస్ట్' అనే షోలో అనుచిత కంటెంట్‌ను ప్రసారం చేసినందుకు మరో కేసులో కూడా పోలీసులు అతనికి సమన్లు జారీ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రోత్సహించినందుకు అతనితో పాటు, ఉల్లు ఓటీటీ యజమానులపై ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ షోను వెంటనే నిషేధించాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
#MetGala2025 : చరిత్ర సృష్టించిన కియారా.. మొదటిసారి బేబీ బంప్‌తో ఇలా! (ఫొటోలు)
-
అడవిలో థామా
‘థామా’ సినిమా కోసం దాదాపు నెలపాటు అడవిలో జరిగే షూటింగ్లో పాల్గొంటున్నారట హీరోయిన్ రష్మికా మందన్నా. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న హిందీ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ ఈ దీపావళికి రిలీజ్ కానుంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఊటీతోపాటు అక్కడి ఫారెస్ట్‌లో జరుగుతోందట.ఆయుష్మాన్, రష్మికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సన్నివేశాల తర్వాత ఆయుష్– రష్మిక– నవాజుద్దీన్ సిద్ధిఖీలపై క్లైమాక్స్ సన్నివేశాలను కూడా ఇదే షెడ్యూల్లో చిత్రీకరిస్తారని బాలీవుడ్ టాక్. ఈ షెడ్యూల్‌తో ‘థామా’ షూటింగ్ టాకీపార్ట్ దాదాపు పూర్తవుతుందని,పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయని సమాచారం. ఇక మడాక్ ఫిల్మ్స్(నిర్మాత దినేష్ విజన్) హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా ‘థామా’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
జూన్ లో సితారే జమీన్ పర్
ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘సితారే జమీన్ పర్’. ‘సబ్ కా అప్న అప్న నార్మల్’ అనేది ఉపశీర్షిక. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించారు. ఆమిర్‌ఖాన్ ప్రోడక్షన్స్పై ఆమిర్‌ఖాన్ , అపర్ణ పురోహిత్ నిర్మించారు. ఈ సినిమాని జూన్ 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆరోష్ దత్తా, గోపీకృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్‌జైన్ , నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. వీరందరూ ‘సితారే జమీన్ పర్’ సినిమాతోనే వెండితెరకు పరిచయమవుతుండటం విశేషం. ఆమిర్‌ఖాన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన హిట్ ఫిల్మ్ ‘తారే జమీన్ పర్’ (2007) సినిమాకు స్పిరిచ్యువల్ సీక్వెల్‌గా ‘సితారే జమీన్ పర్’ చిత్రం తెరకెక్కిందని, స్పానిష్ ఫిల్మ్ ‘ఛాంపియన్స్’ (2018) ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారని బాలీవుడ్ టాక్. అలాగే దాదాపు మూడేళ్ల తర్వాత ఆమిర్‌ఖాన్ నుంచి వస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్లో అంచనాలు నెలకొన్నాయి. -
'ఆదిపురుష్'-కొడుక్కి క్షమాపణ.. మాట మార్చేసిన సైఫ్
ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'.. థియేటర్లలో రిలీజై ఓటీటీలోకి వచ్చినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇదంతా రెండేళ్ల కిందటి ముచ్చట. మళ్లీ కొన్నిరోజుల క్రితం నుంచి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. తన సినిమా ఫ్లాప్ కాదని దర్శకుడు ఓం రౌత్ వాదించడం, ఈ మూవీలో నటించినందుకు కొడుక్కి సారీ చెప్పానని సైఫ్ అలీ ఖాన్ అనడం పెద్ద చర్చకు దారితీసింది.కొడుకు తైమూర్‌కు 'ఆదిపురుష్' సినిమా చూపించానని, అతడిలో ఏ స్పందన లేకపోయేసరికి సారీ చెప్పానని సైఫ్ అన్నాడు. ఆల్రెడీ ఫ్లాప్ అయిన సినిమా గురించి మళ్లీ మళ్లీ ఎందుకు ఇలా అంటున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ నటుడు మాట మార్చేశాడు. (ఇదీ చదవండి: స్నానం కూడా చేయలేదు.. అమ్మ జీవితాంతం నన్ను..: రష్మీ) 'నేను ఆదిపురుష్ మూవీలో విలన్ గా నటించాను. అందులో కేకలు వేస్తూ అందరితో యుద్ధం చేస్తుంటాను. అది చూసి ఈసారి ఇలాంటి సినిమాలో హీరోగా చేయమని అన్నాడు. దీంతో ఓకే చెప్పాను. విలన్ గా నటించినందుకు సారీ చెప్పాను. నేను పనిచేసిన అన్ని చిత్రాల్ని గౌరవిస్తాను. ఆదిపురుష్ ని కూడా అలానే చూస్తాను' అని సైఫ్ కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.ఆదిపురుష్ లో సైఫ్ రావణుడి పాత్ర చేశాడు. అయితే ఇతడి పాత్ర వేషధారణ నుంచి ట్రోలింగ్ మొదలైంది. తర్వాత లంకని గ్రాఫిక్స్ లో దారుణంగా చూపించడం, గబ్బిలాల్లాంటి పక్షులతో ఫైటింగ్.. ఇవన్నీ కూడా సగటు ప్రేక్షకుడికి చిరాకు తెప్పించాయి. దీంతో ఆదిపురుష్.. ఫెయిలైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
'పెళ్లి చేసుకుంటానని వాడుకున్నాడు'.. అజాజ్ ఖాన్‌పై నటి తీవ్ర ఆరోపణలు!
బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. అతను హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న హౌస్ అరెస్ట్ అనే షోలో విపరీతమైన, అసభ్యకరమైన కంటెంట్‌తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఈ షోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోను ఇప్పటికే సదరు ఓటీటీ సంస్థ బ్యాన్ చేసింది. ఈ అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేస్తోన్న అజాజ్ ఖాన్‌పై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వివాదంలో నడుస్తుండగానే అజాజ్ ఖాన్‌పై ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకుంటానని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అజాజ్ ఖాన్‌పై చార్కోప్ పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో అతనిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.అజాజ్ ఖాన్ తన ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో తనకు ఓ పాత్ర ఆఫర్ చేశాడని ఆమె తెలిపింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తనకు లవ్ ప్రపోజ్ చేశాడని నటి ఆరోపించింది. మార్చి 25న తన నివాసంలోనే నాపై అత్యాచారం చేశాడని.. రెండు సార్లు తనను పెళ్లి చేసుకుంటానని హామీ కూడా ఇచ్చాడని చార్కోప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మాకు నాలుగు వివాహాలకు అనుమతి ఉందని తనకు చెప్పాడని నటి ప్రస్తావించింది. ఆమె ఆరోపణలతో కేసు నమోదు చేసిన చార్కోప్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో మహిళలను అసభ్యకరంగా చూపించినందుకు అజాజ్ ఖాన్‌పై అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
పాక్ నటుడి సినిమాపై బ్యాన్ వద్దు.. రిలీజ్ చేయాలి: ప్రకాశ్ రాజ్
కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ అన్నిరకాలుగా సిద్ధమైంది. ఇప్పటికే దేశంలో ఉన్న పాక్ ప్రజలను వారి స్వదేశానికి వెళ్లగొట్టింది. సింధూ జలాల నీటిని ఆపేసింది. పాక్ సెలబ్రిటీల ఖాతాలను భారత్‌లో డీయాక్టివేట్ చేసింది. వారి యూట్యూబ్ ఛానళ్లను సైతం నిలిపివేసింది. పాక్ నటులను, వారి సినిమాలను బ్యాన్ చేసింది.సినిమాలను నిషేధించకూడదుదీంతో పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ (Fawad Khan) నటించిన అబీర్ గులాల్ సినిమా రిలీజ్ ఆగిపోయింది. సినిమాలను బ్యాన్ చేయడాన్ని నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుపట్టాడు. ద లాలంటాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మాట్లాడుతూ.. సినిమాలను నిషేధించడాన్ని నేను సమర్థించను. అది ఎటువంటి సినిమాలు అయినా సరే.. వాటిని జనాల నిర్ణయానికి వదిలేయాలి. శృతిమించిన అశ్లీలత, పిల్లలపై వేధింపులు ఉన్న చిత్రాలను మినహా వేటినీ నిషేధించకూడదు అని పేర్కొన్నాడు. అయితే పాక్ నటుడి సినిమాను సపోర్ట్ చేసినందుకు ప్రకాశ్ రాజ్‌పై విమర్శలు వస్తున్నాయి.అబీర్ గులాల్..పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం అబీర్ గులాల్ (Abir Gulaal Movie). వాణీ కపూర్ కథానాయికగా యాక్ట్ చేసింది. ఆర్తి ఎస్.బగ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వివేక్ అగర్వాల్ నిర్మించారు. మే 9న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అంతలోనే జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరగ్గా.. కేంద్రం పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పాక్ నటుడు ఫవాద్ నటించిన అబీర్ గులాల్ సినిమాపై బ్యాన్ ప్రకటించింది.చదవండి: సారీ చెప్పమన్న బేబీ డైరెక్టర్.. రెండేళ్ల జీవితం వృథా అన్న బాలీవుడ్ హీరో -
సారీ చెప్పమన్న 'బేబీ' డైరెక్టర్.. రెండేళ్ల జీవితం ధారపోశానన్న హీరో
బాలీవుడ్లో కనీస మర్యాద ఇవ్వరు.. ఇంత నకిలీ ఇండస్ట్రీ మరొకటి ఉండదు అంటూ హిందీ చిత్రపరిశ్రమపై ఫైర్ అయ్యాడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు, హీరో బాబిల్ ఖాన్ (Babil Khan). అర్జున్ కపూర్, అనన్య పాండే, షనయా కపూర్, అర్జిత్ సింగ్.. ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేని చాలామంది ఉన్నారని, బాలీవుడ్ పని చేయడానికి మంచి ప్రదేశం కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.అసలు ఏమనుకుంటున్నావ్?కొన్ని గంటల తర్వాత తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చాడు. అర్జున్, అనన్య, షనయా, అర్జిత్‌లను తాను విమర్శించలేదని, సపోర్ట్ చేశానని పేర్కొన్నాడు. దీనిపై తెలుగు డైరెక్టర్ సాయి రాజేశ్ (Sai Rajesh) స్పందించాడు. అంటే ఇప్పటివరకు నీకు సపోర్ట్ చేసిన మేము ఇప్పుడు సైలెంట్‌గా ఈ టాపిక్‌ను వదిలేయాలంటావ్.. అసలు మా గురించి ఏం అనుకుంటున్నావ్? అంటే.. నువ్వు వీడియోలో పేర్కొన్న వారికి మాత్రం గౌరవం ఇస్తే సరిపోతుందా? సారీ చెప్పాల్సిందే!నీకు సపోర్ట్ చేసిన మేమంతా పిచ్చివాళ్లమా? నీకు నిజంగా వాళ్లను పొగడాలి, గౌరవం ఇవ్వాలి.. అనిపిస్తే ఇచ్చుకో.. కానీ నీకోసం నిల్చున్న మా అందరినీ లైట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు మాకు క్షమాపణలు చెప్పాల్సిందే అని పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన బాబిల్.. నువ్వు నా మనసు ముక్కలు చేశావ్.. నీకోసం నేను చేయాల్సిందంతా చేశాను. రెండేళ్ల జీవితాన్ని నీ ముందు ధారపోశాను.మణికట్టు కోసుకున్నాఒళ్లు హూనం చేసుకుని నా శరీరాన్ని పాత్రకు తగ్గట్లుగా మలుచుకున్నాను. కానీ ఏం చేసినా అన్నీ తిరస్కరించావ్. ఎంత బాధున్నా దిగమింగుకుని నవ్వుతూ కనిపించాను. మురికిగుంటలో బొర్లాను. నీకోసం నా చేయి కోసుకున్నాను అని కామెంట్స్ చేశాడు. తర్వాత ఈ కామెంట్స్ డిలీట్ చేశాడు.బేబీ రీమేక్‌లో బాబిల్?బేబీ సినిమా (Baby Movie)తో రూ.100 కోట్ల హిట్ అందుకున్నాడు దర్శకుడు సాయి రాజేశ్. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకున్నాడు. ఇందుకోసం నటుడు బాబిల్ ఖాన్‌ను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రెండేళ్లగా అతడిని తిప్పించుకున్న సాయి రాజేశ్ చివరకు అతడిని రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. Babil reacts to filmmaker Sai Rajesh’s criticism: “I slit my wrist for him”byu/Normal_Weather8827 inBollyBlindsNGossip చదవండి: బాలీవుడ్ అంతా కాపీనే: నవాజుద్దీన్ సిద్దిఖీ -
బాలీవుడ్ అంతా కాపీనే.. ఆ సంస్కృతి ఇప్పటిదీ కాదు: నవాజుద్దీన్ తీవ్ర విమర్శలు
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రస్తుతం కోస్టావో అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద గోల్డ్ స్మగ్లింగ్‌ను అడ్డుకున్న కస్టమ్స్ ఆఫీసర్ కోస్టావో ఫెర్నాండెజ్ జీవితం ఆధారంగా దర్శకుడు సేజల్ షా రూపొందించారు. ఇటీవలే ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజైంది. తన మూవీ రిలీజ్ తర్వాత నవాజుద్దీన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ ప్రస్తుత స్థితి గురించి మాట్లాడారు. హిందీలో ఇతరుల సినిమాలను కాపీ కొట్టడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.బాలీవుడ్ గురించి నవాజ్ మాట్లాడుతూ, "మన పరిశ్రమలో ఐదేళ్లుగా ఇదే పునరావృతం అవుతోంది. అందుకే ప్రేక్షకులు విసుగు చెంది చివరకు విడిచిపెట్టారు. వాస్తవానికి బాలీవుడ్లో అభద్రత చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ అంతా ఓకే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఒకటి హిట్ అయితే చాలు. ఇక దానికే 2,3,4 అంటూ సీక్వెల్స్ తీసుకుంటూ పోతారు. బ్యాంకుల్లో జరిగే ఆర్థిక దివాలా లాగే.. ఇది కూడా క్రియేటివ్ దివాలా. బాలీవుడ్లో క్రియేటివిటీ లోపించింది. ఇప్పుడే కాదు.. ప్రారంభం నుంచి ఇండస్ట్రీలో కాపీ కొడుతూనే ఉన్నారు. కథలు , పాటలు ఇతర ఇండస్ట్రీల నుంచి దొంగతనం చేస్తూనే ఉన్నారు' అని కాస్తా ఘాటుగానే విమర్శించారు.సౌత్ నుంచి కాపీ చేయడంపై మాట్లాడుతూ..'ఇక్కడ ఉండే దొంగలు ఎలా సృజనాత్మకంగా ఉంటారు? మనం దక్షిణాది నుంచి, కొన్నిసార్లు ఇతర ఇండస్ట్రీల నుంచి కథలు దొంగిలించాం. హిట్లుగా మారిన కొన్ని కల్ట్ సినిమాల్లో కూడా కాపీ చేసిన సన్నివేశాలు ఉంటాయి. గతంలో వారు ఒక వీడియోను అందజేసి ఇది మేము తీయాలనుకుంటున్న సినిమా అని చెప్పేవారు. దానిని చూసి ఇక్కడ దానిని రిపీట్ చేసేవారు. ఇలాంటి పరిశ్రమ నుంచి మనం ఏమి ఆశించవచ్చు? ఎలాంటి నటులు వస్తారు? అంతా ఓకే రకమైనవారు అవుతారు. అందుకే నటులు, దర్శకులు తప్పుకోవడం ప్రారంభించారు - అనురాగ్ కశ్యప్ లాంటి మంచి కథలు అందించేవారు కూడా తప్పుకుంటున్నారు' అని తెలిపారు. -
బాలీవుడ్ లో మర్యాద ఇవ్వరు.. యంగ్ హీరో కన్నీళ్లు
సినిమా ఇండస్ట్రీ అంటేనే నెపోటిజం, ఒకరిని ఒకరు తొక్కేయడాలు లాంటివి చాలా ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. కాకపోతే వీటి గురించి పెద్దగా బయటకు రాదు, రానివ్వరు. అప్పుడప్పుడు కొందరు నటీనటులు మాత్రం తమ బాధని వెళ్లగక్కుతుంటారు. అవి వీడియోల రూపంలో వైరల్ అవుతుంటాయి.(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా!) తాజాగా హిందీ సినిమాలు చేస్తున్న ఓ యంగ్ హీరో బాబిల్ ఖాన్.. ఏడుస్తూ బాధపడుతూ ఓ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేశాడు. బాలీవుడ్ లో అస్సలు మర్యాద ఇవ్వరు అని నోటికొచ్చింది మాట్లాడాడు. ఇది జరిగిన కాసేపటికే వీడియోని డిలీడ్ చేయడంతో పాటు అకౌంట్ ని డీయాక్టివేట్ చేసేశాడు.'ఈ రోజు మీ అందరితో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇండస్ట్రీలో(బాలీవుడ్) అర్జున్, అనన్య, షనయాతో పాటు సంబంధం లేని అర్జిత్ సింగ్ లాంటివాళ్లు చాలామంది ఉన్నారు. ఇక్కడ అస్సలు మర్యాద ఇవ్వడం లేదు. ఇప్పటివరకు నేను చూసినవాటిలో ఇదే అత్యంత నకిలీ ఇండస్ట్రీ. ఇది బాగుండాలని కోరుకునేది కొందరే. నేను మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను' అని బాబిల్ ఏడుస్తూ సదరు వీడియోలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: తెలుగు హీరోతో మృణాల్ ప్రేమ? నిజమేంటి?) గతంలో లంచ్ బాక్స్, పీకూ, పాన్ సింగ్ తోమార్ తదితర సినిమాలతో అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ కొడుకే ఈ బాబిల్ ఖాన్. 2020లో తండ్రి చనిపోయిన తర్వాత నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. పలు సినిమాల్లో సహాయ నటుడిగా చేశాడు. మొన్నీమధ్యే లాగౌట్ అనే ఓటీటీ మూవీలో హీరోగానూ చేశాడు.ఇప్పుడు చేసిన ఈ వీడియో పీఆర్ స్టంట్ లేదంటే నిజంగా బాధతో చెప్పాడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అర్జున్, అనన్య, షనయా నెపోటిజం అని అన్నాడు. అదే టైంలో తన తండ్రి వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాననే విషయాన్ని బాబిల్ మర్చిపోయినట్లున్నాడు. మరి దీని వెనుక ఏం మతలబు ఉందో?(ఇదీ చదవండి: భార్య, సవతి కలిసి భర్తని మాయం చేస్తే.. ఓటీటీ రివ్యూ) -
బాలీవుడ్ స్టార్లు... ఇష్టమైన టూర్లు... ఎందుకు ఇష్టమంటే..!
బాలీవుడ్ సెలబ్రిటీల జీవితాలు మనలో చాలా మందికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మనకు స్ఫూర్తినిచ్చేది ఆకర్షణీయమైన జీవనశైలి మాత్రమే కాదు, వారి ప్రయాణ గమ్యస్థానాల ఎంపిక కూడా. మరీ ముఖ్యంగా అందరం సమ్మర్ సీజన్ సందర్భంగా ఇలా టూర్ల వేటలో పడినప్పుడు...స్టార్లు ఎంచుకునే ప్రాంతాల వివరాలు తెలుసుకోవడం అంటే మన అభిరుచులను కలుసుకోవడం కూడా. కలలు కనే బీచ్ అయినా లేదా సందడిగా ఉండే నగరమైనా, బిజీ షెడ్యూల్ నుండి తప్పించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి తగిన ప్రదేశాలను కనుగొనే నైపుణ్యాన్ని లేదా వారి ఉత్తమమైన కలిగి ఉంటారు.– నేహా ధూపియా, జైపూర్ పాత–ప్రపంచ ఆకర్షణ ఆధునిక సౌకర్యాల కలయికను ఇష్టడుతుంది. కరీనా కపూర్ ఖాన్ తరచుగా నూతన సంవత్సర కాలంలో కుటుంబ సెలవుల కోసం స్విట్జర్లాండ్‌ను, ముఖ్యంగా గ్సా్టడ్ను సందర్శిస్తుంది.–షాహిద్ కపూర్ మీరా రాజ్‌పుత్ కపూర్: గ్రీస్, స్పెయిన్ స్విట్జర్లాండ్ వంటి యూరోపియన్ గమ్యస్థానాలను తమ పిల్లలతో సేదతీరుతుంటారు.–కర్ణాటకలోని కూర్గ్‌ను తనకు అత్యంత ఇష్టమైన ప్రదేశంగా బోమన్ ఇరానీ చెబుతారు.–సోను సూద్: షాపింగ్ కుటుంబ సందర్శనల కోసం వాషింగ్టన్, డి.సి.ని ఇష్టపడతాడు. –పారిస్‌కు తరచుగా వచ్చే సందర్శకురాలు ఫరా ఖాన్ కళ, చరిత్ర ఫ్యాషన్ మిశ్రమాన్ని :ఇష్టపడుతుంది.– తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో న్యూ ఇయర్‌కి నయనతార స్వాగతం పలికింది. –శ్రీలంకలో ప్రశాంతమైన బీచ్ స్నాప్షాట్లను దియా మీర్జా ఆస్వాదిస్తుంది. –బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా సందర్శించే గమ్యస్థానాలలో లండన్ ఒకటిగా నిలిచింది. సోనమ్ కపూర్, రియా కపూర్, సారా టెండూల్కర్ పరిణీతి చోప్రా వంటి తారలకు ఈ నగరం ఒక రొటీన్ ఎంపిక. ఐకానిక్ హైడ్ పార్క్ మీదుగా షికారు చేయడం నుంచి నగరంలోని ట్రెండీ రెస్టారెంట్లు ఆక్స్ఫర్డ్ స్ట్రీట్‌ను అన్వేషించడం వరకు లండన్ సరదాలను సాహసాలను వారు తరచుగా అభిమానులతో పంచుకుంటారు.–పారిస్ అనేది బాలీవుడ్ సెలబ్రిటీలు వదల్లేని మరొక హాట్‌స్పాట్. ఈ ’సిటీ ఆఫ్ లైట్స్’ దిల్జిత్ దోసాంజ్, మలైకా అరోరా వంటి తారలను తరచు రారమ్మంటుంది. ఫ్రెంచ్ వంటకాలను ఆస్వాదించడం నుంచి రిటైల్ థెరపీలో పాల్గొనడం వరకు భిన్న రకాలుగా స్టార్లు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు.–బాలీవుడ్ సెలబ్రిటీల ఎంపికలో మాల్దీవులు సైతం అగ్రస్థానంలో నిలుస్తుంటాయి. ప్రశాంతమైన బీచ్‌లు, అందమైన వాతావరణం అద్భుతమైన సూర్యాస్తమయాలతో, తమ బిజీ జీవితాల నుంచి తప్పించుకోవాలనుకునే తారలకు ఇది తరచుగా విహారయాత్రగా మారుతుంది. రకుల్ ప్రీత్ సింగ్, నేహా ధూపియా పరిణీతి చోప్రా ఇలా ఈ ద్వీప స్వర్గంలో కనిపించిన ప్రముఖులు ఎందరో.–న్యూయార్క్ నగరం కూడా సెలబ్రిటీలకు తప్పక సందర్శించాల్సిన ప్రదేశంగా మారింది. మీరా కపూర్, కరిష్మా కపూర్, ప్రియాంక చోప్రా అమీర్ ఖాన్ సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా న్యూయార్క్‌పై తమ ఇష్టాన్ని ప్రదర్శించారు, . సెంట్రల్ పార్క్ , టైమ్స్ స్క్వేర్ వంటి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌ల స్నాప్షాట్లను పంచుకున్నారు.–స్వదేశానికి దగ్గరగా ఉండాలి అలాగే రిలాక్స్డ్గా ఉండాలి అనుకునే స్టార్స్‌ను గోవా ఆకర్షించడం కొనసాగుతూనే ఉంది. భూమి పెడ్నేకర్, సారా అలీ ఖాన్ శిల్పా శెట్టి అక్కడి ప్రశాంతమైన బీచ్‌లను ఆస్వాదిస్తుంటారు. . గోవా లో ఉన్నప్పుడు వారు షేర్ చేసుకునే ఫోటోలు ఆ ప్రదేశం పట్ల వారి అభిమానాన్ని మనకు చూపిస్తాయి.–స్టార్ క్రికెటర్‌ను పెళ్లాడిన బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ... ఇష్టమైన గమ్యస్థానాలలో కరేబియన్ దీవులను పేర్కొంటారు. ఈ దీవులపై వారు పంచుకునే సోషల్ మీడియా పోస్ట్‌లు వారి ఇష్టాన్ని మనకు పట్టిస్తాయి. =తన బైక్‌పై రోడ్ ట్రిప్‌లకు వెళ్లడాన్ని ఇష్టపడే అమిత్ సాద్ ఇటీవల ముంబై నుంచి లేహ్–లడఖ్‌కు 5,288 కి.మీ. ప్రయాణించి నెలరోజుల పర్యటన చేపట్టారు. ‘‘రోడ్డులోని ప్రతి మలుపు వ్యక్తిగత పరివర్తనకు అవకాశం. తెలియని వాటిని తెలుసుకోవడం’’ అంటారాయన.–హిమాలయ శ్రేణి పట్ల సారా అలీఖాన్ ప్రేమ అంతులేనిది. కొన్ని నెలల క్రితం, ఆమె కాశ్మీర్‌కు కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేసింది. ఓ ఇంటర్వ్యూలో, సారా‘‘నాకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు వెళ్లి అక్కడ ట్రెక్కింగ్ చేయడం చాలా ఇష్టం. అలాఏ కాశ్మీర్ అంటే కూడా చాలా ఇష్టమని షేర్ చేసింది. మసాయి మారాలో అలియా భట్‌కు ప్రపోజ్ చేశాడు. రణ్‌బీర్ కపూర్ అప్పటి నుంచి ఈ జంటకు కెన్యా నేషనల్ రిజర్వ్ ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటిగా మారింది. -
మూడేళ్లుగా డేటింగ్.. ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సింగర్!
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ప్రకృతి కకర్ ఎంగేజ్మెంట్ చేసుకుంది. తన ప్రియుడు, వ్యాపారవేత్త అయిన వినయ్ ఆనంద్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. నా జీవితంలో ఏ విషయమైనా సరే జరిగే వరకు సీక్రెట్‌గానే ఉంచుతానని సింగర్ ప్రకృతి చెప్పుకొచ్చింది.వచ్చే ఏడాదిలో తామిద్దరు వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నామని ప్రకృతి కాకర్ వెల్లడించింది. తన కాబోయే భర్త ఇండస్ట్రీకి చెందినవారు కాదు.. అందువల్ల ప్రశాంతమైన జీవితాన్నే ఇష్టపడతాడని తెలిపింది. ఇదంతా రాత్రికి రాత్రే జరిగిన విషయం కాదని.. అతనితో మూడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నానని పేర్కొంది. తమ రిలేషన్‌ను పెళ్లి బంధంగా మార్చుకుంటున్నట్లు సింగర్ వివరించింది.తన ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. "మేము ఒక కుటుంబ వివాహానికి హాజరు కావడానికి లండన్ వెళ్లాం. అక్కడే వినయ్ అద్భుతంగా ప్లాన్ చేసిన వేడుకలో నాకు ప్రపోజ్ చేశారు. మా బంధువుల వివాహంలో అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. అదే సమయంలో వినయ్ తనకు ప్రపోజ్ చేశాడు. ఈ విషయాన్ని నా సిస్టర్స్‌తో పాటు అందరూ రహస్యంగా ఉంచారు. నాకు ఇప్పుడు కృతజ్ఞత తప్ప మరేలాంటి అనుభూతి చెందడం లేదు.. ఎందుకంటే నేను ఎప్పుడూ కలలు కనే విషయం.. చాలా అద్భుతంగా జరిగింది,' అని తెలిపింది. -
ప్రియురాలితో కలిసి బోనీకపూర్ ఇంటికి అమిర్ ఖాన్!
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ముంబయి చేరుకున్నారు. ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను పరామర్శించారు. రెండు రోజుల క్రితమే బోనీ కపూర్ తల్లి నిర్మల్ కపూర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బోనీ కపూర్‌ను కలిసి పరామర్శించారు. అమిర్‌తో పాటు ఆయన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి బోనీ కపూర్ నివాసానికి చేరుకుని ఆమెకు నివాళులర్పించారు.కాగా.. బోనీ కపూర్ మాతృమూర్తి నిర్మల్ కపూర్ మే 2న అనారోగ్యంతో మరణించారు. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆ తర్వాత ఎస్వీ రోడ్‌లోని విలే పార్లే శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బోనీ కపూర్ కుటుంబంతో సాన్నిహిత్య కారణంతో ఆమిర్ ఖాన్ ప్రత్యేకంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వీరితో పాటు కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, రాణి ముఖర్జీ లాంటి ప్రముఖులు కూడా బోనీ నివాసంలో కనిపించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ వచ్చింది!
ఓటీటీ వేదికలు వచ్చాక వినోద రంగంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆ మాటే అంగీకరించారు. ముంబైలో జరుగుతున్న ‘వరల్డ్ ఆడియో – విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్)లో మూడో రోజైన శనివారం సైఫ్ మెరిశారు. స్ట్రీమింగ్ వేదికలతో ఆవిర్భవించిన నవభారతం గురించి జరిగిన చర్చావేదికలో ఆయన పాల్గొన్నారు. ‘‘సినీ రంగానికి చెందిన మేము గతంలో గిరి గీసుకొని నిర్ణీత విధానాలకే కట్టుబడాల్సి వచ్చేది. కానీ, స్ట్రీమింగ్ వేదికలు అందుబాటులోకి వచ్చాక నటీనటులకూ, సినీ రూపకర్తలకూ మునుపటి సంకెళ్ళ నుంచి స్వేచ్ఛ లభించింది. మా కథలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనం చూసే వీలు చిక్కింది. సాంప్రదాయిక సినిమా మీడియమ్‌లో అయితే ఆ వీలుండేది కాదు’’ అని సైఫ్ అభి్రపాయపడ్డారు. నెట్‌ఫ్లిక్స్ కో–సీఈఓ టెడ్ సరండోస్ సైతం, ‘‘స్ట్రీమింగ్ వేదికల వల్ల భారత్‌లో సినీ రూపకల్పనలో ప్రజాస్వామ్యం సాధ్యమైంది’’ అన్నారు. డిజిటల్ యుగంలో కథాకథనంలో వస్తున్న మార్పులు, సృజనాత్మక స్వేచ్ఛపై స్ట్రీమింగ్ ప్రభావం, ప్రపంచ వినోదపటంలో పెరుగుతున్న భారత్ స్థానం లాంటి పలు అంశాలపై ఈ గోష్ఠిలో దృష్టి సారించారు.‘‘ఇప్పుడు ప్రేక్షకులు చూసేందుకు విభిన్నమైన కథలు అనేకం ఏకకాలంలో అందుబాటులో ఉన్నాయి. అంతటి వైవిధ్యమైన కథలను తెరపై చెప్పే స్వేచ్ఛ సృజనశీలురకు దక్కింది. సినిమా రూపకల్పనలో ప్రజాస్వామ్యమంటే ఇదే’’ అని సైఫ్ అన్నారు. ‘‘ఎన్ని మార్పులు వచ్చినా, సినిమాలకు కాలం చెల్లదు. ఇంకా చె΄్పాలంటే, స్ట్రీమింగ్, థియేటర్లు... రెండూ పరస్పరం పోటీదారులు కావు. ముందున్న మార్కెట్ పెద్దది గనక, రెండూ ఏకకాలంలో కొనసాగుతాయి’’ అని టెడ్ విశ్లేషించారు. కోవిడ్ అనంతరం భారతదేశ వ్యాప్తంగా వందకు పైగా పట్టణాలు, నగరాల్లో, దాదాపు పాతిక వేల మంది స్థానిక నటీనటులు, సాంకేతిక వర్గంతో నెట్‌ఫ్లిక్స్ చిత్రీకరణ సాగించిందనీ, తద్వారా ఎందరికో ఉపాధి కల్పించిందనీ ఆయన వివరించారు.నటించే ముందు ఊహించుకోవాలి! – హీరో ఆమిర్ ఖాన్ ‘‘పాత్రను పూర్తిగా అవగాహన చేసుకొని, దానిలోకి పరకాయ ప్రవేశం చేయాలి. నా వరకు నేను స్క్రిప్టుతో చాలా సమయం గడుపుతాను. పదే పదే స్క్రిప్టు చదువుతాను. స్క్రిప్టు బాగుంటే, ఆ పాత్ర, దాని రూపురేఖలు, మానసిక వైఖరి అన్నీ దాని నుంచే అర్థమైపోతాయి. పాత్ర, కథ గురించి దర్శకుడితో చర్చల వల్ల కూడా ఓ అవగాహన వస్తుంది’’ అన్నారు ఆమిర్ ఖాన్. ‘వేవ్స్’లో భాగంగా శనివారం ఆయన తన సుదీర్ఘ నటనా జీవితం నుంచి కొత్తవాళ్ళకు పనికొచ్చే పలు సూచనలు చె΄్పారు. ‘‘నాకు జ్ఞాపకశక్తి తక్కువ. అందుకే, చేతితో డైలాగులు రాసుకుంటా.కష్టమైన సీన్లు ముందుగా చేస్తా. డైలాగులు కంఠస్థం చేస్తా. డైలాగులు నోటికి వచ్చాక, వాటిని నాదైన పద్ధతిలో సొంతం చేసుకుంటా. అదే డైలాగును వల్లె వేస్తున్నప్పుడు దాన్ని అనేక విధాలుగా ఎలా చేయవచ్చో మనకే అర్థమవుతుంది’’ అని ఆమిర్ వివరించారు. ‘‘చేస్తున్న పనిలో ఎంత నిజాయతీగా ఉంటే, అంత బాగా నటించగలుగుతాం. సీన్లుప్రాక్టీస్ చేసేటప్పుడు నేను అద్దంలో చూస్తూ చేయను. నటించే ముందు ఆ సన్నివేశాన్ని మనసులో ఊహించుకుంటా’’ అని చె΄్పారు. ‘‘సన్నివేశం డిమాండ్ చేసింది చేయాలే తప్ప, అందులో నా వంతు ఏమిటి, నాకెంత పేరొస్తుందని చూస్తే దెబ్బతింటాం’’ అని విశ్లేషించారు.70 కోట్ల మంది చూస్తున్నారు!గత పాతిక ఏళ్ళ పైచిలుకు కాలంలో భారత మీడియా సాధించిన పురోగతి, మరీ ముఖ్యంగా వీడియో కంటెంట్ సృష్టి, ఆ కంటెంట్‌ను జనం చూడడం పెరిగిన తీరు అనూహ్యమని మీడియా నిపుణుడు, జియో స్టార్ వైస్‌ఛైర్మన్ ఉదయ్ శంకర్ విశ్లేషించారు. ఒకప్పుడు టీవీకే పరిమితమైతే... ఇప్పుడు 4జీ విప్లవం, హాట్‌స్టార్ సహా వివిధ వేదికల ఆవిర్భావంతో దాదాపు 70 కోట్ల మంది స్ట్రీమింగ్ కంటెంట్ చూస్తున్నారని అంచనా వేశారు.‘వేవ్స్’లో ఆయన మాట్లాడుతూ, ‘‘హిందీ సినిమా ఇప్పటికీ పాతకాలంలోనే ఆగిపోవడం వల్ల థియేటర్లలో వసూళ్ళు తగ్గాయనీ, తమిళ – తెలుగు సహా దక్షిణాది సినీ పరిశ్రమల్లో సృజనాత్మక ప్రయోగాలు, వాటితో పాటు వసూళ్ళు పెరిగాయనీ గుర్తు చేశారు. ‘‘అన్ని తెరలూ ఒకటే కావు. వెండితెర, బుల్లితెర, డిజిటల్ ... దేనికవే భిన్నమైనవి. ఒక్కోటీ ఒక్కో పరిణామ దశలో ఉన్నాయి. దేని ప్రయోజనం దానిదే. అది తెలుసుకోకుండా అన్నిటితో ఒకేలా వ్యవహరిస్తే వ్యాపారంలో దెబ్బ తింటాం’’ అని ఆయన వివరించారు.నాగపూర్‌లో ప్రపంచపు అతి పెద్ద స్క్రీన్‘‘ఇండియన్ ఎంటర్టైన్మెంట్ని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లాలన్నది ప్రధాని మోదీగారి లక్ష్యం. ఈ దిశలో వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ నిర్మించే అవకాశం మాకు దక్కడం గర్వకారణం. మా విజన్‌ని అర్థం చేసుకుని, నమ్మిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌గారికి కృతజ్ఞతలు’’ అని అభిషేక్ అగర్వాల్ అన్నారు. నాగపూర్‌లో వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్‌ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేయనున్నట్లు ‘వేవ్స్–2025’ వేదికగా నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘గొప్ప సినిమాలు తీయడమే కాదు, అద్భుతమైన థియేటర్లు నిర్మించాలన్నది మా ధ్యేయం. సినిమాను మరింత గొప్పగా మార్చడమే మా యూవీ క్రియేషన్స్ లక్ష్యం. ప్రపంచపు అతిపెద్ద స్క్రీన్ ని నాగపూర్‌లో నిర్మించ నున్నాం. మా సామర్థ్యాలపై నమ్మకం ఉంచిన మోదీగారికి కృతజ్ఞతలు’’ అన్నారు విక్రమ్ రెడ్డి. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
సచిన్ కూతురితో హీరో డేటింగ్..!
బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది గతేడాది యుధ్రా మూవీలో కనిపించారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ బోల్తా కొట్టింది. ప్రస్తుతం సిద్ధాంత్ ధడక్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ కూడా హీరోయిన్గా నటించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. త్వరలోనే రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. ఆ తర్వాత సిద్ధాంత్ చతుర్వేది దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ మూవీలో కనిపించనున్నారు.అయితే ఇదంతా పక్కనపెడితే సిద్ధాంత్ గతంలో అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలితో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయంలో ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా హీరో సిద్ధాంత్ చతుర్వేది టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో డేటింగ్లో ఉన్నారంటూ బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ఓ నివేదిక వెల్లడించింది. అయితే ఈ విషయంపై సిద్ధాంత్ కానీ.. సారా టెండూల్కర్ కానీ స్పందించలేదు. రిలేషన్‌పై ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ ఈ రూమర్స్ ఆగేలా కనిపించడం లేదు. కాగా.. సారా టెండూల్కర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా వేకేషన్లో ఉన్నారు. అక్కడ ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.కాగా.. గతంలో సిద్ధాంత్ చతుర్వేది.. అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలితో ప్రేమలో ఉన్నారని రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా సారా టెండూల్కర్ సైతం క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో రిలేషన్లో ఉన్నారంటూ వార్తల్లో నిలిచింది. కానీ వీరిద్దరు కూడా తమ రిలేషన్‌ను ధృవీకరించలేదు. మరోవైపు శుభ్ మన్ గిల్.. సైఫ్ కూతురు సారా అలీ ఖాన్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. గతంలో కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ సందర్భంగా సారా అలీ ఖాన్ ఈ విషయంపై ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) -
యానిమల్ మూవీ.. సందీప్ కాన్ఫిడెన్స్ వల్లే సాధ్యమైంది: నిర్మాత భూషణ్ కుమార్
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. మోస్ట్ వయొలెంట్ మూవీగా విమర్శలు వచ్చినప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పట్లో ఈ మూవీపై కొందరు సినీ ప్రముఖులు సైతం విమర్శలు చేశారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ కావడంపై నిర్మాత భూషణ్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. యానిమల్ మూవీ ఓపెనింగ్ రోజు ఆ స్థాయిలో కలెక్షన్స్ రావడానికి కారణం సందీప్ రెడ్డి వంగానే అన్నారు. ఈ మూవీ విజయానికి క్రెడిట్ అంతా సందీప్‌కే దక్కుతుందని తెలిపారు.భూషణ్ కుమార్ మాట్లాడుతూ..' యానిమల్ సినిమాపై సందీప్ నమ్మకం వేరే స్థాయిలో ఉండేది. అందుకే అతనికే ఎక్కువ క్రెడిట్ ఇస్తాను. ఇది ఒక డిఫరెంట్ సినిమా. రణ్‌బీర్ కపూర్ ఈ చిత్రంలో నటించడానికి చాలా ఆసక్తి చూపించాడు. ఎందుకంటే అంతకుముందు ఇలాంటి పాత్రను చేయలేదు. ఈ సినిమా ఎంత బాగా వర్కవుట్ అవుతుందో అప్పుడు మాకెవరికీ తెలియదు. ఈ మూవీపై భారీగానే విమర్శలు వచ్చినప్పటికీ వసూళ్లను సాధించింది. ఏ సర్వేలో చూసినా మోస్ట్ అవైటేడ్ చిత్రం యానిమల్ అనే వచ్చింది. ఈ సినిమా దర్శకుడిపై పూర్తి నమ్మకముంది. అందుకే సందీప్‌కే క్రెడిట్ ఇస్తాను. మొదటి కాపీ చూసినప్పుడు నిడివి చాలా ఎక్కువగా ఉందని అతనితో చెప్పా. కానీ సందీప్ నాతో.. సర్, నన్ను ఏమీ కట్ చేయమని అడగకండి. ఈ మూవీ అద్భుతమైన బిజినెస్ చేస్తుందని నాకు నమ్మకం ఉంది. మొదటి రోజే రూ.50 కోట్లకు పైగా సాధిస్తుందని సందీప్ నాతో అన్నారని' వివరించారు.సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో యానిమల్ పార్క్ పేరుతో సీక్వెల్ తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రివీల్ చేయలేదు. -
నానమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న జాన్వీ కపూర్..!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. తన నానమ్మ నిర్మల్ కపూర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తన చెల్లి ఖుషీ కపూర్, బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి గ్రాండ్ మదర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. బోనీ కపూర్ తల్లి అయిన నిర్మల్ కపూర్ వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యంతో బాధపడుతూ 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు.(ఇది చదవండి: శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట తీవ్ర విషాదం)కాగా.. జాన్వీ కపూర్ విషయానికొస్తే శ్రీదేవి ముద్దుల కూతురు టాలీవుడ్ సినిమాతో బిజీగా ఉంది. దేవరతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రామ్ చరణ్ సరసన కనిపించనుంది. బుచ్చి బాబు సనా డైరెక్షన్లో వస్తోన్న పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.#TFNExclusive: Visuals of #JanhviKapoor at her grand mother's last rites in Mumbai!#Janhvi #TeluguFilmNagar pic.twitter.com/3skROCvRXV— Telugu FilmNagar (@telugufilmnagar) May 3, 2025 -
ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక ఏడాపెడా వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్‌లు ఎక్కువగా ఆ జోనర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ జోనర్ ఇష్టపడే వారికోసం మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలోనే అలరించనుంది.రోషన్ మాథ్యూ , మోహిత్ రైనా, త్రినేత్ర ప్రధాన పాత్రల్లో నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కంకాజుర'. ఈ సిరీస్‌కు చందన్ అరోరా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ థ్రిల్లర్ సిరీస్ సోనీలివ్‌లో ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇజ్రాయెల్ సిరీస్ మ్యాగ్పీ ఆధారంగా ఈ సిరీస్నును హిందీలో తెరకెక్కించారు. టీజర్ చూస్తే తనను అవమానించిన వారిపై పగతీర్చుకునే ఓ యువకుడి కథ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. It’s fragile. It’s fatal. It’s coming.Kankhajura — Streaming on 30th May on Sony LIV.#KanKhajura #SoFragileYetSoFatal#MohitRaina @roshanmathew22 @sarahjanedias03 #TrinetraHaldarGummaraju #NinadKamat #MaheshShetty #HeebaShah pic.twitter.com/FxUDjHUsaW— Sony LIV (@SonyLIV) May 2, 2025 -
నా డ్రీమ్స్.. కరియర్ : ఇపుడు కొత్తగా, ప్రతీక్షణం ఆస్వాదిస్తున్నా
మాతృత్వం ఒక వరమే.కానీ అంతకుమించిన బాధ్యతల భారం కూడా. కుటుంబ సభ్యులు, భర్త సహకారం ఉన్నపుడు నిజంగా ఏ మహిళకైనా గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం, పాలిచ్చి పోషించడం లాంటి వన్నీ జీవితాంతం పదిలపర్చుకునే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఇంత ముఖ్యమైన విషయాన్ని అటు కుటుంబ సభ్యులు, ఇటు సమాజమూ గుర్తించాలన్న స్పృహ ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. దీనికి తోడు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ అంశంపై బహిరంగంగా చర్చిస్తుండటం మంచి పరిణామం. ఈ కోవలోకి తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే చేరింది.హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరు దీపికా పదుకొణే (Deepika Padukone). అందానికి తగ్గ అభినయం, అభిమానుల హృదయాలను దోచుకుంది. బాలీవుడ్లో అనేక బ్లాక్ బస్టర్ మూవీలను తన సొంతం చేసుకుంది. తనదైన నటనతో దర్శక నిర్మాతల ఫ్యావరేట్‌గా మారింది. హీరోయిన్గా కరియర్ కొనసాగిస్తూనే, బాలీవుడ్ హీరో,ప్రేమికుడు రణవీర్ సింగ్‌ను 2018లో వివాహం చేసుకుంది. 2024లో తొలి బిడ్డ దువాకు జన్మనిచ్చింది. వేవ్స్ సమ్మిట్ 2025లో దీపిక తన కూతురు దువాకుతో తనకున్న అనుబంధం, చిన్నారి వచ్చిన తరువాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడింది.ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన WAVES 2025 సమ్మిట్‌లో మాతృత్వం, బిడ్డ పెంపకం గురించి మాట్లాడినపుడు. దీపికా పదుకొనే మాతృత్వాన్ని స్వీకరించడం గురించి, దువా రాక తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది స్పష్టంగా,చాలా ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. పాపాయి రక్షణ కోసం ఎలాంటి ఆయాను (నానీ)ని నియమించుకోలేదు దీపిక. స్వయంగా తానే ఆ బాధ్యతను తానే తీసుకుంది. తల్లినయ్యాక కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నానని చెప్పింది. తల్లికాక ముందు, తన కలలు తన ఆశయాలు మాత్రమే ఉండేవి, కానీ ఇపుడంతా ఆమె గురించే. ఇదీ చదవండి: నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?"అమ్మ అయిన తర్వాత కొత్త జీవితాన్ని చూస్తున్నాను. బిడ్డను కన్న క్షణంనుంచి మరో ప్రాణిని పోషించే బాధ్యత వహించాలి. ముఖ్యంగా నాలాంటి జీవనశైలి ఉన్నవారికి, ముఖ్యంగా ఇల్లు వదిలి వెళ్ళడం, నా ఆశయం, నా కెరీర్ ఇలా ప్రతిదీ నా జీవితం, ఇలా ప్రతిదాని గురించి ఆలోచించాను. ఇప్పుడు, అకస్మాత్తుగా, పాపాయి మీద శ్రద్ద వహించాలి. తల్లి కావాలని కోరుకున్నాను కనుక, ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తున్నాను, " అని దీపికా పేర్కొన్నారు.మరోవైపు షారుఖ్ ఖాన్ దీపికా పదుకొణేను ప్రశంసల్లో ముంచెత్తారు. దువాకు తల్లి అయినందుకు షారుఖ్ దీపికను అభినందించారు. నటి పోషించగల ఉత్తమ పాత్ర నిజ జీవితంలోనే అని, ఇప్పుడు ఆమె తన పాప దువాకు తల్లి అని అన్నారు.చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్! -
జాక్‌పాట్ కొట్టేసిన ప్రముఖ సింగర్.. ఏకంగా మూడున్నర్ర కోట్ల లాభం!
ప్రముఖ సింగర్, బిగ్ బాస్ రన్నరప్ రాహుల్ వైద్య తన ఖరీదైన అపార్ట్మెంట్లను విక్రయించారు. ముంబయిలోని ఓషివారాలో ఉన్న తన రెండు విల్లాలను దాదాపు రూ.5 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. గతంలో అంటే 2008లో రాహుల్ వైద్య ఈ అపార్ట్మెంట్లను రూ.1.70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. తాజాగా వీటిని విక్రయించడంతో దాదాపు రూ.3.50 కోట్ల మేర ఆదాయం వచ్చింది. కాగా.. ఈ ప్రాంతంలో పలువురు సినీతారలు నివాసం ఉండడంతో ధరలు కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. ఇక్కడ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్గన్, సన్నీ లియోన్, సారా అలీ ఖాన్ వంటి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు కూడా ఆస్తులు కలిగి ఉన్నారు.కాగా.. సింగర్ రాహుల్ వైద్య ఇండియన్ ఐడల్ సీజన్ 1లో రెండో రన్నరప్‌గా నిలిచారు. అప్పటి నుంచి బాలీవుడ్లో రాణిస్తున్నారు. అతని కెరీర్లో తొలి మ్యూజిక్ ఆల్బమ్ తేరా ఇంతేజార్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అనేక బాలీవుడ్ పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా జో జీతా వోహి సూపర్ స్టార్,మ్యూజిక్ కా మహా ముఖాబ్లా వంటి రియాలిటీ షోలలో విజేతగా నిలిచారు. హిందీ బిగ్‌బాస్ సీజన్ -14 రన్నరప్‌గా నిలిచి మరింత ఫేమస్ అయ్యారు. అతను ప్రస్తుతం సెలబ్రిటీ కుకింగ్ రియాలిటీ షో లాఫ్టర్ చెఫ్స్‌లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv) -
21 రోజుల్లో 15 కిలోలు తగ్గా.. ఆ సీక్రెట్ మాత్రం చెప్పను: రకుల్ భర్త
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. జాకీ భగ్నానీ (Jackky Bhagnani) నిర్మాత మాత్రమే కాదు నటుడు కూడా! సినిమాల్లో నటుడిగా కనిపించడానికి ముందు ఏకంగా 60 కిలోలు తగ్గి అందర్నీ సర్ప్రైజ్ చేశాడు. ఆ తర్వాత 2009లో కల్ కిస్నే దేఖా చిత్రంతో వెండితెరకు నటుడిగా పరిచయమయ్యాడు. 2017లో ఓ సినిమా కోసం 15 కిలోలు తగ్గాడు. కేవలం 21 రోజుల వ్యవధిలోనే అంత బరువు ఎలా తగ్గాడని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ సీక్రెట్ మాత్రం ఎవరికీ చెప్పనంటున్నాడు జాకీ భగ్నానీ.అది ఆరోగ్యకరం కాదుతాజాగా జాకీ భగ్నానీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు తగ్గాను. కానీ అదంత ఆరోగ్యకరం కాదు. ఈ విషయంలో నేనెవరికీ సలహాలు, సూచనలు ఇవ్వను. ఒక షూట్ కోసం సడన్‌గా బరువు తగ్గాల్సి వచ్చింది. నా చేతిలో ఆప్షన్స్ లేవు. పైగా సమయం తక్కువే ఉంది. అప్పుడు నేను ఏం చేశానన్నది ఎవరికీ చెప్పదలుచుకోవడం లేదు. కానీ, దానివల్ల చాలా దుష్ప్రభావాలు ఎదురయ్యాయి.సైడ్ ఎఫెక్ట్స్ఒకేసారి ఎక్కువ బరువు కోల్పోయినప్పుడు యాసిడిటీ, జుట్టు కోల్పోవడం, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. శరీరం కూడా నీరసించిపోతుంది. ఎందుకంటే సడన్‌గా సన్నబడటం అనేది సహజమైన ప్రక్రియ కాదు కదా.. అయితే రోజంతా కడుపు మాడ్చుకోవాలి.. లేదంటే ఒంట్లో కొవ్వు తగ్గించేందుకు వేరే విధానాలు ఎంచుకోవాలి. ఈ రెండూ మంచివి కావు.శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుంటా..సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నేను నా బరువును కంట్రోల్లో ఉండేలా చూసుకుంటున్నాను. ఇందుకోసం ప్రతిరోజూ కష్టపడాల్సిందే! ఏదైనా వెకేషన్‌కు వెళ్లానంటే నోరు కట్టేసుకోకపోతే సహజంగానే లావెక్కుతాను. అప్పుడు మళ్లీ కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను అని జాకీ భగ్నానీ చెప్పుకొచ్చాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో జాకీ బరువు తగ్గడం గురించి మాట్లాడుతూ.. రోజుకు 10-15 కి.మీ. పరిగెత్తేవాడినని చెప్పాడు. కేవలం ఐదు గ్రాముల కార్బోహైడ్రేట్లను కూరగాయల రూపంలో ఆరగించేవాడినని తెలిపాడు.చదవండి: చికిత్సకు డబ్బుల్లేవ్.. నటుడు కన్నుమూత -
నా కొడుక్కి 'ఆదిపురుష్' చూపించి సారీ చెప్పా: దేవర విలన్
ప్రభాస్ తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న చిత్రం ఆదిపురుష్ (Adipurush Movie). ఈ సినిమాలో ప్రభాస్ లుక్ నుంచి వానరాలను చూపించిన విధానం వరకు ప్రతిదానిపైనా ట్రోలింగ్ జరిగింది. వీఎఫ్ఎక్స్ బాలేవని, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)కు ముందు ఐదు తలలు, దానిపైన ఐదు తలలు పెట్టడమేంటన్న కామెంట్లు వినిపించాయి. మొత్తంగా ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతోపాటు ట్రోలింగ్ మెటీరియల్‌గా మారిపోయింది.సినిమా చూపించా.. రియాక్షనే లేదుమూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాను తన కుమారుడిని కూర్చోబెట్టి చూపించానంటున్నాడు ఆదిపురుష్ రావణ్ అలియాస్ సైఫ్ అలీ ఖాన్. తాజా నెట్‌ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో సైఫ్ మాట్లాడుతూ.. నేను సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ ఉంటాను. అవి చూసి నా 9 ఏళ్ల కుమారుడు తైమూర్.. నువ్వసలు మంచివాడివా? చెడ్డవాడివా? అని అడుగుతుంటాడు. ఈ మధ్యే వాడికి ఆదిపురుష్ చూయించాను. వాడి నుంచి నాకు ఎటువంటి ఆహ్లాదకరమైన స్పందన రాలేదు. కాసేపటికి నన్నో చూపు చూశాడు. నాకు తన ఫీలింగ్ అర్థమై సారీ చెప్పా.. ఇట్స్ ఓకేలే అని నన్ను క్షమించేశాడు అని చెప్పుకొచ్చాడు.పర్సనల్ లైఫ్సైఫ్ అలీ ఖాన్.. నటి అమృత సింగ్‌ను 1991లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు సారా, కుమారుడు ఇబ్రహీమ్ సంతానం. దశాబ్దానికి పైగా అన్యోన్యంగా ఉన్న దంపతులు 2004లో విడిపోయారు. తర్వాత హీరోయిన్ కరీనా కపూర్‌తో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఐదేళ్లపాటు జంటగా కలిసున్న వీరు 2012లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2016లో తైమూర్, 2021లో జెహ్ జన్మించారు. సైఫ్.. దేవర: పార్ట్ 1 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.చదవండి: 'క' చిత్రానికి దక్కిన 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డ్ -
సొంతంగా ఖరీదైన ప్రైవేట్ జెట్.. అజయ్ దేవగణ్ ఏమన్నారంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ రైడ్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇవాళ విడుదలైంది. ఈ సినిమాను 2018లో వచ్చి రైడ్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ మూవీలో హీరోయిన్గా వాణి కపూర్ నటించింది.ఈ నేపథ్యంలో అజయ్ దేవగణ్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తనపై వస్తున్న రూమర్స్‌పై కూడా స్పందించారు. బాలీవుడ్లో మీరు తొలి ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేశారన్న దానిపై అజయ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి అదేం లేదని.. కానీ దానిని కొనాలని ప్లాన్ చేస్తున్నా.. ఒక ఒప్పందం కూడా చేసుకున్నా. కానీ చివరికీ అది జరగలేదంటూ అజయ్ క్లారిటీ ఇచ్చారు. అజయ్ దేవగణ్ సొంతం ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారని బాలీవుడ్లో చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు.తాజాగా విడుదలైన రైడ్-2 రైమ్ థ్రిల్లర్‌లో అజయ్ దేవగణ్ ఐఆర్ఎస్ అధికారి పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్ అభిషేక్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. -
అభిమానులకు గుడ్ న్యూస్.. తండ్రి కాబోతున్న ఛావా నటుడు
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ఛావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఛావా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలో మెప్పించారు.తాజాగా ఛావా నటుడు వినీత్ కుమార్ సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. కాగా.. వినీత్ కుమార్ సింగ్ 2021లో నటి రుచిరాను పెళ్లాడారు.వినీత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ సమయంలో తన భార్య రుచిరాను జాగ్రత్తగా చూసుకోవడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. వీలైనంత త్వరగా పని ముగించుకుని ఇంటికి వెళ్తా. నా షెడ్యూల్ నేను నిర్ణయించుకున్నా. ఆమెతో పాటు నేను కూడా డాక్టర్ వద్దకు వెళ్తాను. రాబోయే జూలైలో బిడ్డ పుట్టిన తర్వాత పితృత్వ సెలవు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నా'అని పంచుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే వినీత్ కుమార్ సింగ్.. ఛావాతో పాటు ఇటీవల విడుదలైన జాట్ మూవీతోనూ కనిపించారు. అంతకుముందు 'సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలెగావ్', గుంజన్ సక్సేనా, గుస్పాతియా, మ్యాచ్ ఫిక్సింగ్' లాంటి సినిమాలతో పాటు రంగ్‌బాజ్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించారు. -
తొమ్మిది గజాల చీరలో మహారాష్ట్ర అమ్మాయిలా స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన సింపుల్, ట్రెడిషనల్ ఫ్యాషన్‌తో అభిమానుల హృదయాలను గెల్చుకుంది. వేవ్స్ సమ్మిట్ 2025 ( WAVES Summit 2025) లో ఉత్సాహభరితమైన మహారాష్ట్ర రాష్ట్రంలో మహిళలు ధరించే ఒక ప్రత్యేకమైన నౌవారీ చీరలో అద్భుతంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.అలియా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా తనదైన మినిమలిస్టిక్ ఫ్యాషన్, స్టేట్మెంట్ లుక్‌తో 'వావ్' అనిపించిందిముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మే 1న జరిగిన ఈవెంట్లో మహారాష్ట్ర అమ్మాయిగా మారిపోయింది. తొమ్మిది గజాల నౌవారీ చీరలో ట్రెడిషనల్‌గా చాలా అందంగా కనిపించింది. "నౌ" అంటే తొమ్మిది, తొమ్మిది గజాల నౌవారీ చీర స్టైల్ మహారాష్ట్రలో ప్రసిద్ధి. పీచ్, నారింజ రంగుల కలయితో గులాబీ రంగు అంచుతో వచ్చిన ఈ చీరకు, పూల డిజైన్‌తో హైలైట్ చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరైన అలియా భట్, తన నటనా నైపుణ్యాలు, అందం, ఫ్యాషన్ స్టేట్మెంట్లు, అది సాంప్రదాయమైనా లేదా పాశ్చాత్యమైనా ఫ్యాన్స్‌ను ఫిదా చేయాల్సిందే.కాగా 2024లో మెట్ గాలాలో అరంగేట్రం చేసిన ఆలియా భట్, తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. సబ్యసాచి ముఖర్జీ నుండి అందమైన చీరలో బ్యూటిఫుల్‌గా కనిపించింది. నటిగాస్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బాలీవుడ్లో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2022 ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రి ఇచ్చింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌ని పెళ్లాడినా అలియా ఒక ఆడబిడ్డకు తల్లి కూడా. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఆస్తులు తాకట్టు పెట్టి సినిమా తీశాం.. మా బాధ మీకేం తెలుసు?
కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఏవో కొన్ని చిత్రాలు మినహా ఏవీ పెద్దగా కలెక్షన్స్ రాబట్టడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కు రావడం లేదు. అలా ఓ సినిమాను తన కుటుంబ ఆస్తులు తాకట్టు పెట్టి తీశానంటున్నాడు బాలీవుడ్ నిర్మాత, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ (Jackky Bhagnani).సగం కూడా వెనక్కు రాలేదా?ఇతడు గతేడాది అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌తో కలిసి 'బడే మియా చోటే మియా' సినిమా (Bade Miyan Chote Miyan) చేశాడు. ఇది దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిందని బీటౌన్‌లో గుసగుసలు వినిపించాయి. కానీ బాక్సాఫీస్ వద్ద కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవలేదు. టోటల్ రన్లో కేవలం రూ.111.49 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. భారీ నష్టంతో పూజా ఎంటర్టైన్మెంట్ (Pooja Entertainment) సంస్థ నిర్మాత వాసు భగ్నానీ కుదేలయ్యాడు. ముంబైలోని ఆఫీస్‌ను అమ్మేసి రూ.250 కోట్ల అప్పు తేర్చేసినట్లు ప్రచారం జరిగింది.అనుమానమే నిజమైందితాజాగా వాసు భగ్నానీ కుమారుడు జాకీ భగ్నానీ సదరు సినిమా నష్టంపై స్పందించాడు. ఆ మూవీ కోసం మేము చాలా డబ్బు ఖర్చు చేశామన్నది వాస్తవం. భారీ బడ్జెట్‌తో సినిమా తీశాం కానీ కంటెంట్ ఎక్కడో ప్రేక్షకులకు కనెక్ట్ అవదన్న అనుమానం వచ్చింది. మా అనుమానమే నిజమైంది. జనాలు సినిమాను తిప్పికొట్టారు. వారికి ఎందుకు నచ్చలేదన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎందుకంటే భవిష్యత్తులో మరోసారి ఆ తప్పును పునరావృతం చేయకూడదుగా.ఇప్పుడు చెప్పి ఏం లాభం?ఆస్తులు తాకట్టు పెట్టి ఈ సినిమా తీశాం. మా బాధ ఎవరికీ అర్థం కాదు. అయినా ఇప్పుడిదంతా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ, ఈ ఒక్క సంఘటనతో నేను చాలా నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. జాకీ భగ్నానీ.. కల్ కిస్నే దేఖా, రంగ్రేజ్, అజబ్ గజబ్ లవ్, వెల్కమ్ టు కరాచీ, మిత్రాన్ వంటి చిత్రాల్లో నటించాడు. కూలీ నెం.1, కట్‌పుత్లి, మిషన్ రాణిగంజ్, గణ్పథ్, బడే మియా చోటే మియా చిత్రాలు నిర్మించాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను 2024లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.చదవండి: చదివింది 'లా'.. ఫాలోవర్లు తగ్గారని విషాదం.. 'ఇలాంటి రోజు వస్తుందని తెలుసు -
చదివింది 'లా'.. ఫాలోవర్లు తగ్గారని విషాదం.. 'ఇలాంటి రోజు వస్తుందని తెలుసు'
సోషల్ మీడియా జనాల సమయాన్నే కాదు ప్రాణాల్ని కూడా కబళిస్తుందనడానికి ఇదే నిదర్శనం. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మిషా అగర్వాల్.. తన 25వ పుట్టినరోజుకు రెండు రోజుల ముందు ఏప్రిల్ 24న ప్రాణాలు తీసుకుంది. చిన్న వయసులోనే బలవన్మరణానికి పాల్పడటంపై పలువురూ విచారం వ్యక్తం చేశారు. మిషా ఆత్మహత్యకు గల కారణాన్ని ఆమె కుటుంబసభ్యులు తాజాగా వెల్లడించారు.డిప్రెషన్మిషా.. ఇన్స్టాగ్రామ్.. ఫాలోవర్లే తన ప్రపంచం అనుకుంది. 10 లక్షల మంది ఫాలోవర్లను సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ తను అనుకున్నదానికి భిన్నంగా ఫాలోవర్స్ తగ్గుతూ పోవడంతో తను చాలా బాధపడింది. ఏకంగా డిప్రెషన్లోకి వెళ్లింది. తనకసలు విలువే లేదని కుమిలిపోయింది. నా ఇన్‌స్టా ఫాలోవర్స్ డ్రాప్ అవుతున్నారు, నేనేం చేయను, నా కెరీర్ ముగిసిపోయినట్లే అని నన్ను హగ్ చేసుకుని భయపడుతూ ఏడ్చేది. ఇన్‌స్టాగ్రామే సర్వస్వం కాదని, ఏమీ కాదని ఓదార్చేవాళ్లం. న్యాయవిద్య చదివి..ఎల్ఎల్బీ (న్యాయ విద్య) పూర్తి చేశావ్.. పీసీఎస్జేకు ప్రిపేర్ అవుతున్నావు. త్వరలోనే జడ్జివి అవుతాను. కెరీర్ గురించి భయపడాల్సిన పనిలేదని వెన్నుతట్టాం. కానీ, తనకు మా మాటలు వినిపించలేదు. ఇన్స్టాగ్రామ్ కోసం ప్రాణాలు తీసుకునేవరకు వెళ్తుందని అనుకోలేదు అని ఆమె ఫ్యామిలీ మెంబర్ చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై హీరోయిన్ తాప్సీ పన్ను (Taapsee Pannu) స్పందించింది. ఇలాంటి రోజొకటి వస్తుందని చాలాకాలంగా భయపడుతూ వస్తున్నాను. జీవితాన్ని ప్రేమించడానికి బదులు సోషల్ మీడియాలో కనిపించే ఫాలోవర్లు, వచ్చే లైకుల సంఖ్యే ప్రేమనుకుంటున్నారు.వర్చువల్ ప్రేమ కబళించేసిందిఈ వర్చువల్ లవ్.. నిజమైన ప్రేమను కంటికి కనబడకుండా చేస్తుందన్న భయం ఉండేది. ఇప్పుడదే నిజమైంది. లైక్స్, కామెంట్స్ చూసి తాత్కాలికంగా సంబరపడిపోతున్నారు. మీరు పొందిన డిగ్రీపట్టాలకన్నా కూడా మీకు వచ్చిన లైక్స్, కామెంట్స్ చూసి విలువైనవారిగా పరిగణించడం నిజంగా బాధాకరంగా ఉంది. ఇలాంటివి చూస్తుంటే మనసు ముక్కలవుతోంది అని సామాజిక మాధ్యమాల్లో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Misha Agrawal (@themishaagrawalshow)ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: 'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు -
వినోదరంగంలో ‘వేవ్స్’.. ప్రారంభించనున్న మోదీ
‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్) – 2025 గురువారం ముంబైలో ప్రారంభం కానుంది. ప్రపంచ మీడియా పవర్ హౌస్‌గా భారత దేశాన్ని సమున్నతంగా నిలిపేందుకు ప్రభుత్వం నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సును ప్రధాని మోదీయే స్వయంగా ప్రారంభించనున్నారు.వేవ్స్ సమ్మిట్- ఉద్దేశంసినిమాలు, ఓటీటీ, గేమింగ్, కామిక్స్, డిజిటల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన అన్నింటిని ఒకే వేదికపై అనుసంధానిస్తూ మీడియా – వినోద రంగంలో మన దేశ సత్తాను చాటడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ‘కనెక్టింగ్ క్రియేటర్స్... కనెక్టింగ్ కంట్రీస్’ అన్న ట్యాగ్ లైన్‌తో ఈ ‘వేవ్స్’ (WAVES Summit 2025) ను నిర్వహిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి సృజనాత్మక కళాకారులు, స్టార్ట్ అప్లు, సినీవినోద రంగ ప్రముఖులు, విధాన నిర్ణేతలు ఇందులో పాల్గొంటున్నారు. 1100 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్ట్ అప్లు ఈ భారీ సదస్సులో పాలు పంచుకుంటున్నాయి. ఇప్పటికే లక్ష మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఈ ‘వేవ్స్ 2025’లో 1100 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. వివిధ సమావేశాలు, ప్రదర్శనలు, చర్చా గోష్ఠులు సాగే ఈ సదస్సుకు నటులు చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్, దర్శకుడు రాజమౌళి, ఆస్కార్ అవార్డు గ్రహీతలైన సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, కీరవాణి తదితరులు ప్రత్యేక ఆకర్షణ కానున్నారు.తొలిసారి ఆతిథ్యంసినిమాలు, డిజిటల్ మీడియా, బ్రాడ్ కాస్టింగ్ తదితర విభిన్న రంగాలపై లోతుగా చర్చలు జరగనున్నాయి. ఈ ‘వేవ్స్’లో భాగంగా దాదాపు 25 దేశాలకు చెందిన మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొనే ‘గ్లోబల్ మీడియా డైలాగ్’ (జి ఎం డి) కి మన దేశం తొలిసారిగా ఆతిథ్యం ఇస్తుండడం మరో పెద్ద విశేషం. చదవండి: రెట్రో మూవీ ట్విటర్ రివ్యూ.. సందడి లేదేంటి? -
నా కష్టానికి ప్రతిరూపం ఈ కారు.. బిగ్‌బాస్ బ్యూటీ కల సాకారం..
నటి, సింగర్ షెహనాజ్ గిల్ (Shehnaaz Kaur Gill) హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్‌తో ఎక్కువ పాపులరైంది. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన షెహనాజ్ తాజాగా కొత్త కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కలలు కనడం దగ్గరి నుంచి కారు నడిపేవరకు.. నా కష్టానికి ప్రతిఫలంగా ఈ నాలుగు చక్రాల కారు తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది అని ఓ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు చెప్తున్నారు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.ధర ఎంతంటే?షెహనాజ్.. మెర్సిడిస్ బెంజ్ కారు కొనుగోలు చేసింది. దీని ధర దాదాపు రూ.1.35 కోట్లుగా ఉంది. మ్యూజిక్ వీడియోలో, సాంగ్స్‌లో ఎక్కువగా కనిపించే షెహనాజ్ పంజాబ్‌లో పలు సినిమాలు చేసింది. 2019లో హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్లో పాల్గొంది. ఈ సీజన్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. 2023లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో యాక్ట్ చేసింది. థాంక్యూ ఫర్ కమింగ్ మూవీలోనూ నటించింది. విక్కీ విద్యాకా వో వాలా వీడియో సినిమాలో సజ్నా వె సజ్నా అనే స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం హిందీలో సబ్ ఫస్ట్ క్లాస్, పంజాబీలో ఇక్క్ కుడి చిత్రాలు చేస్తోంది. View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) చదవండి: ముమైత్ బ్రెయిన్లో ఏడు వైర్లు.. షూ లేస్ కట్టుకున్నా ప్రమాదమే! -
పిల్లలు పుట్టరని మధుబాలను వదిలేసిన స్టార్ హీరో.. చివరికేమైంది?
మొఘల్ ఇ ఆజామ్.. 1960లో వచ్చిన అద్భుతమైన సినిమా ఇది. సలీం, అనార్కలిగా దిలీప్ కుమార్ (Dilip Kumar), మధుబాల (Madhubala) నటించారు. ఆన్‌స్క్రీన్‌పై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వీళ్లు నిజ జీవితంలో కూడా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండాలనుకున్నారు. దంపతులుగా కనిపిస్తారనుకుంటే విడిపోయిన ప్రేమ పక్షులుగా మారారు. అసలు ఈ జంట ఎందుకు విడిపోయిందన్న విషయాన్ని ప్రముఖ నటి ముంతాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.పిల్లలు పుట్టరని..ముంతాజ్ మాట్లాడుతూ.. మధుబాల దిలీప్‌కు బ్రేకప్ చెప్పలేదు. అతడే ఆమెతో ప్రేమబంధాన్ని తెంచేసుకున్నాడు. తనకు పిల్లలు పుట్టరని వదిలేసి.. సైరా భానును పెళ్లి చేసుకున్నాడు. సైరా ఎంతో మంచి మనిషి. దిలీప్ అంటే ఆమెకు ఎంతో అభిమానం, ప్రేమ. అతడి చివరి శ్వాస వరకు ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. వీళ్లిద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువ. కానీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వల్లే జీవితాంతం కలిసి కొనసాగారు.మొఘల్ ఇ ఆజామ్ సినిమాలో ఓ దృశ్యంఅందుకే వదిలేశాడుదిలీప్కు పిల్లలంటే ఇష్టం. పిల్లలు కావాలన్న కోరికతోనే సైరాను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం నాకు స్వయంగా మధుబాల చెప్పింది. అప్పుడప్పుడు తనను కలుస్తూ ఉండేదాన్ని. తను సంతోషంగా కనిపించేది కాదు. నాతో ఏమనేదంటే.. జీవితంలో నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి యూసఫ్ (దిలీప్ కుమార్‌ను యూసఫ్ అని పిల్చుకునేది). నేను ఎప్పటికీ తల్లిని కానని తెలిసి నన్ను ఒంటరిగా వదిలేశాడు. నాకున్న గుండె సమస్య వల్ల పిల్లల్ని కంటే నేను బతకనని చెప్పారు.ఏనాడూ నిందించలేదుఅందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అయినా ఏ మగవాడికైనా పిల్లలు కావాలని ఉంటుంది కదా.. ఇందులో అతడి తప్పేముందిలే అనుకునేదే తప్ప దిలీప్‌ను నిందించేది కాదు. కానీ విషాదమేంటంటే.. దిలీప్- సైరా భానులకు సంతానమే లేదు. ఈ విషయంలో సైరాను చూస్తుంటే బాధగా అనిపించేది. కనీసం ఒక్కరైనా పుట్టుంటే వాళ్లెంతో మురిపెంగా చూసుకునేవాళ్లు అని ముంతాజ్ చెప్పుకొచ్చింది.వేర్వేరు దారుల్లో ప్రేమజంటదిలీప్ కుమార్ - మధుబాల దాదాపు దశాబ్దంపాటు కలిసున్నారు. వీరి బ్రేకప్ అనంతరం మధుబాల.. 1960లో కిషోర్ కుమార్‌ను పెళ్లి చేసుకుంది. 1969లో గుండెపోటుతో మరణించింది. దిలీప్ కుమార్ 1966లో తనకంటే 22 ఏళ్లు చిన్నదైన సైరా భానును పెళ్లి చేసుకున్నాడు. 1981లో రెహ్మాన్‌ను రెండో పెళ్లి చేసుకోగా 1983లో ఈమెకు విడాకులిచ్చేశాడు. తర్వాత సైరా భానుతోనే కలిసున్న దిలీప్ కుమార్ 2021లో మరణించాడు.చదవండి: అమ్మ చనిపోయి 5 నెలలు.. వీడియో డిలీట్ చేయమని అడుక్కున్నా: సోహైల్ -
విడాకుల తర్వాత కొత్తిల్లు కొన్న నటి.. 'నేను పేదదాన్ని అని మీకు చెప్పానా?'
విడాకులు తీసుకున్న మగవాడిని ఈ సమాజం పట్టించుకోదేమో కానీ ఆడవారిని మాత్రం చులకనగా చూస్తుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ అంటోంది బుల్లితెర నటి చారు అసోపా (Charu Asopa). హీరోయిన్ సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్‌ను 2019లో గోవాలో పెళ్లి చేసుకుంది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా జియానా అనే పాప కూడా పుట్టింది. కానీ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవి పెద్దవి కావడంతో విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. అలా 2023లో వీరికి విడాకులు మంజూరయ్యాయి.నెలకు రూ.1 లక్ష పైనే..ఆ తర్వాత ఆమెకు ముంబైలో ఇల్లు దొరకడం కూడా కష్టమైంది. సింగిల్ పేరెంట్ అని కొందరు, సెలబ్రిటీ అని మరికొందరు ఇల్లు ఇవ్వడానికే ఇష్టపడలేదు. చివరకు ఎలాగోలా సిటీ అంతా జల్లెడపట్టి అద్దెల్లు సంపాదించింది. కానీ చేతిలో సంపాదన లేనప్పుడు నగరంలో జీవించడం అంత ఈజీ కాదు. నెలవారీ ఖర్చులు లక్ష రూపాయల పైనే అవుతుండటంతో సొంతూరుకు వెళ్లిపోయింది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో తన పుట్టింట్లో ఉంటోంది. డబ్బెలా వస్తోంది?అక్కడే బట్టల వ్యాపారం ప్రారంభించింది. అలాగే తను కొన్న కొత్తింటిని కూడా వీడియో తీసి చూపించింది. ఆ ఇంటికి ఆమె నెలనెలా ఈఎమ్ఐ కడుతోంది. ఇది చూసిన జనాలు తనకు డబ్బులెలా వస్తున్నాయి? ఈ ఇల్లు ఎలా కొనగలిగింది? అంటూ రకరకాల కామెంట్లు చేశారు. వాటిపై చారు అసోపా తాజాగా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందించింది. నేను రైల్లో వెళ్లకుండా విమానంలో ఎందుకు ప్రయాణిస్తున్నాను? అని కొందరడిగారు. సింపతీ అక్కర్లేదుఆ ఎయిర్‌లైన్స్ వాళ్లు నన్ను ఆహ్వానించడం వల్లే విమానయానాన్ని ఎంచుకున్నాను. నేను షాపింగ్ చేస్తుంటే కూడా విమర్శిస్తున్నారు. కొత్తింటి విషయానికి వస్తే.. నెలనెలా అద్దె కట్టే బదులు అదే ఈఎమ్ఐ కడుతున్నాను. నన్ను విమర్శించడం ఆపండి.. మీ అందరికీ నేను చెప్పదలుచుకుందేంటంటే.. నేను పేదదాన్ని కాదు. దేవుడి దయ వల్ల నా ఖర్చులు నేను భరించగలను. నాకు ఎవరి సింపతీ అక్కర్లేదు. టీవీ ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. అందుకే ముంబై వదిలి వచ్చేశాను తప్ప పని లేక కాదు అని నటి వివరణ ఇచ్చింది.సీరియల్స్.. సినిమాచారు అసోపా.. అగ్లే జనం మోహే బిటియా హీ కిజో, యే రిష్తా క్యా కెహ్లాతా హై, బాల్వీర్, దేవోంక్ కె దేవ్.. మహాదేవ్, లవ్ బై ఛాన్స్, ఫిర్ జీనే కీ తమన్నా హై, లాడూ 2, జిజీ మా, కర్ణ్ సంగిని, విక్రమ్ బేతాల్ కీ రహస్య గాథ, కైసా హై యే రిష్తా అజంనా వంటి సీరియల్స్ చేసింది. ఇంపేషెంట్ వివేక్, కాల్ ఫర్ ఫన్, యోక్, జోహ్రి అనే సినిమాల్లోనూ నటించింది.చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు -
రాజకీయాల్లో ఎంట్రీపై హీరోయిన్‌కు ప్రశ్న.. నెటిజన్‌కు క్షమాపణలు చెప్పిన బ్యూటీ!
బాలీవుడ్ భామ ప్రీతి జింటా ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ యజమానిగా ఉన్న ప్రీతి బాలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా మూవీలో మెప్పించింది. ప్రస్తుతం లాహోర్1947 అనే మూవీతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది.అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ప్రీతి జింటా తాజాగా ఎక్స్‌తో అభిమానులతో ఓ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశారు. మీరు బీజేపీలో చేరుతున్నారా? అంటూ ప్రీతి జింటాను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు ఆమె కాస్తా ఘాటుగానే స్పందించారు. దీంతో ప్రీతిపై పలువురు నెటిజన్స్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతనికి క్షమాపణలు చెప్పింది. ఇంతకీ ప్రీతి జింటా ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసుకుందాం.ప్రీతి జింటా మాట్లాడుతూ.. 'నా సమాధానం మీకు కఠినంగా అనిపిస్తే నన్ను క్షమించండి. సోషల్ మీడియాతో వచ్చే ఇబ్బంది ఇదే. ప్రతి ఒక్కరూ మనల్ని జడ్జ్ చేస్తారు. నేను దేవాలయాలకు, కుంభమేళాలకు వెళ్తే భాజపాలో చేరతానని కాదు. విదేశాల్లో ఉన్న సమయంలో దేశం విలువ ఏంటో నాకు తెలిసింది. అందరి కంటే నేను ఇప్పుడు భారత్‌ను, భారతీయ సంస్కృతిని ఎక్కువగా గౌరవిస్తున్నా. విదేశాల్లో నివసించినా కూడా నా పిల్లలు సగం భారతీయులేనని మర్చిపోకుండా పెంచుతున్నా. అంతేకాదు మా పిల్లలను హిందువులుగానే పెంచుతున్నా. దురదృష్టవశాత్తూ నాపై విమర్శలు వస్తున్నాయి. నేను ఎవరో.. నా పిల్లలకు వారి మూలాలు, మతం గురించి బోధిస్తున్నందుకు గర్వపడుతున్నా' అని అన్నారు. అయితే ఇంత ఈ చిన్న ప్రశ్నకు ఇంతలా స్పందించాలా అంటూ కొందరు నెటిజన్స్ ప్రీతి జింటాను విమర్శిస్తున్నారు. I’m sorry if I sounded abrupt ! I have PTSD from this question. Appreciate your clarification 🙏After becoming a mom & living in a foreign country I wanna make sure my kids don’t forgot they are half Indian. Since my husband is agnostic we are bringing up our kids as Hindus.… https://t.co/ce0pHFKj8H— Preity G Zinta (@realpreityzinta) April 28, 2025 -
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
నాగిని పాత్రలో నటించి యమ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మౌనీ రాయ్. తొలుత టీవీ సీరియల్స్ చేసినప్పటికీ.. ప్రస్తుతం సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈమె చేసిన లేటెస్ట్ మూవీ 'భూత్ని'. మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న మౌనీ.. తనకెదురైన భయంకరమైన అనుభవాన్ని బయటపెట్టింది.'సరిగా గుర్తులేదు. ఓసారి ఒక ఊరికి వెళ్లాం. ఎవరో వ్యక్తి నా హోటల్ రూం తాళం దొంగింలించాడు. అర్థరాత్రి తాళం ఉపయోగించి నా రూంలోకి రావాలని తెగ ప్రయత్నించాడు. అదే టైంలో నా మేనేజర్ తో కలిసి నేను గదిలోనే ఉన్నాను. తొలుత షాకయ్యాం గానీ తర్వాత గట్టిగా అరిచాం'(ఇదీ చదవండి: యువ నటి ఇంట్లో భారీ దొంగతనం) 'ఈ సంఘటన గురించి హోటల్ రిసెప్షనిస్ట్ ని అడిగితే.. హౌస్ కీపింగ్ వాళ్లు అయ్యింటారని సమాధానమిచ్చారు. అర్థరాత్రి 12:30 గంటలకు హౌస్ కీపింగ్ ఏంటి? అని గట్టిగా అడిగా. అదే చాలా భయంకరమైన అనుభవం' అని మౌనీ రాయ్ చెప్పుకొచ్చింది.మౌనీ రాయ్ వ్యక్తిగత విషయానికొస్తే.. 2022లో సూరజ్ నంబియార్ అనే కేరళకు చెందిన బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటుంది.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) -
యువ నటి ఇంట్లో భారీ దొంగతనం
ప్రమఖ నటి నేహా మాలిక్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ.34 లక్షలు విలువ చేసే నగలు మాయమయ్యాయని సదరు నటి, ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన పనిమనిషి ఈ పని చేసి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది.(ఇదీ చదవండి: కుర్రాళ్ల సినిమా.. మనోళ్లకు ఎక్కేసింది!) ఎఫ్ఐఆర్ ప్రకారం.. నేహా మాలిక్ తల్లి మంజు పలు వేడుకలకు నగలు ధరించుకుని వెళ్లేది. తర్వాత తన రూంలోని చెక్క డ్రాయర్ లో వాటిని పెట్టేది. నేహా ఇంటి పనిమనిషి షహనాజ్ ముస్తాఫా ముందే చాలాసార్లు మంజు నగలు మార్చుకునేది. ఏప్రిల్ 25న ఉదయం నేహా మాలిక్ షూటింగ్ కి వెళ్లిపోగా.. ఈమె తల్లి మంజు గురుద్వార వెళ్లింది. దీంతో ఇంటిని శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి తన దగ్గరున్న తాళంతో ఇంటిని క్లీన్ చేసి వెళ్లిపోయింది. తర్వాత రోజు పనికిరాలేదు. ఈ క్రమంలోనే నేహా మాలిక్ ఇంట్లో ఓసారి వెతకగా నగలు కనిపించలేదు. వీటి విలువ దాదాపు రూ.34 లక్షలకు పైనే.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) దీంతో నేహా మాలిక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పని మనిషిపై అనుమానం వ్యక్తం చేసింది. అందుకు తగ్గట్లే దర్యాప్తు చేసిన పోలీసులు సదరు పనిమనిషిని అరెస్ట్ కూడా చేశారు.నేహా మాలిక్ విషయానికొస్తే.. 2012 నుంచి ఇండస్ట్రీలో ఉంది. గాంధీ ఫేర్ ఆగయా, ముసాఫిర్ 2020, పింకీ మోగే వాలి 2 తదితర చిత్రాల్లో నటించింది. ఇన్ స్టాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలు పెడుతూ హల్ చల్ చేస్తూ ఉంటుంది.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) -
దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి
బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ (Sajid Khan) తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటోంది బుల్లితెర నటి నవీనా బోలె (Navina Bole). గతంలో అతడి వల్ల ఎదురైన ఓ ఇబ్బందిని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. నవీనా బోలె మాట్లాడుతూ.. ఓ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని సాజిద్ పిలిస్తే అతడి ఆఫీసుకు వెళ్లాను. అతడు చేసిన పనికి.. జీవితంలో అతడిని కలవకూడదని ఫిక్సయ్యాను.ఇదేం పరీక్ష?ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆఫీసుకు వెళ్లాక ప్రాజెక్ట్ గురించి చెప్తాడేమో అని నేను చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. కానీ అతడు.. నీ దుస్తులు తీసేసి కూర్చోవచ్చుగా అని అడిగాడు. నీ శరీరంపై నీకెంత నమ్మకం ఉంది? దుస్తులు లేకున్నా సౌకర్యంగా కూర్చోగలవా? లేదా? అని టెస్ట్ చేస్తున్నాను అన్నాడు. ఇది 2004 లేదా 2006లో జరిగిందనుకుంటాను. అతడి మాటలకు నా నోరు మూగబోయింది. నేనేం సమాధానమివ్వలేదు. ఏమైంది? నువ్వు బికినీ వేసుకుంటావుగా.. అలాంటప్పుడు ఇదేం పెద్ద సమస్య కాదు.. నువ్వు నీలా ఉండు అంతే అన్నాడు. ఇంటికెళ్లి వస్తానని తప్పించుకున్నా..అలాగైతే నేను ఇంటికెళ్లి బికినీ తెచ్చుకుంటాను. అంతే తప్ప నీ ముందు దుస్తులు తీసేసి కూర్చోలేను అని చెప్పాను. తర్వాత ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాను. అప్పటికీ ఆయన వదల్లేదు. ఇంటికి చేరుకున్నావా? ఆఫీసుకు తిరిగొస్తానన్నావ్, ఇంకా రావడం లేదేంటి? అంటూ దాదాపు 50 సార్లు ఫోన్ చేశాడు అని చెప్పుకొచ్చింది.సాజిద్ ఖాన్‌పై గతంలోనూ ఆరోపణలుఇకపోతే 2018లో మీటూ ఉద్యమం ఉధృతమైన సమయంలో సాజిద్ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నటి రాచెల్ వైట్, అసిస్టెంట్ డైరెక్టర్ సలోని చోప్రా, జర్నలిస్ట్ కరిష్మా ఉపాధ్యాయ.. సాజిద్ ఖాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఇదిలా ఉంటే నవీనా బోలె.. మిలే జబ్ హమ్ తుమ్, జెన్నీ ఔర్ జుజు, సప్నా బబుల్ కా, బిడాయి, ఇష్క్బాజ్ వంటి హిందీ సీరియల్స్‌తో పాపులారిటీ సంపాదించుకుంది.చదవండి: ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు -
ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్ తాగా: నటుడు
బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ (Paresh Rawal) ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. తన యూరిన్ తాగి ఓ గాయం నుంచి త్వరగా కోలుకున్నట్లు తెలిపాడు. 'లాలంటాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరేశ్ రావల్ మాట్లాడుతూ.. ఓసారి నేను మోకాలి గాయంతో ముంబైలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాను. అప్పుడు అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) తండ్రి వీరు దేవ్‌గణ్ (Veeru Devgan) నన్ను చూసేందుకు వచ్చాడు.దానివల్లే కోలుకున్నా..త్వరగా కోలుకునేందుకు ఓ సలహా ఇచ్చాడు. ఉదయం నిద్ర లేచిన వెంటనే నా యూరిన్ తాగమని చెప్పాడు. అలాగే మందు, మాంసం, సిగరెట్ తాగడం వంటి అలవాట్లు మానేయమన్నాడు. ఆయన సలహాను పాటించాలనుకున్నాను. పదిహేను రోజులపాటు నా యూరిన్‌ను బీర్లా తాగాను. ఆ తర్వాత డాక్టర్ ఎక్స్‌రే తీసి చూసినప్పుడు షాకయ్యాడు. ఇంత త్వరగా గాయం ఎలా నయమవుతోంది అని ఆశ్చర్యపోయాడు. రెండున్నర నెలల తర్వాత డిశ్చార్జ్ అవ్వాల్సిన నేను వీరు దేవ్‌గణ్ చెప్పిన సలహా వల్ల నెలన్నరకే డిశ్చార్జ్ అయ్యాను. ఆయన సలహా నాకొక మ్యాజిక్‌లా పని చేసింది అని చెప్పుకొచ్చాడు.సినిమాపరేశ్ రావల్.. క్షణక్షణం, రిక్షావోడు, బావగారు బాగున్నారా?, శంకర్‌దాదా ఎంబీబీఎస్, తీన్మార్, ఆకాశమే హద్దుగా వంటి తెలుగు చిత్రాల్లో నటించాడు. హిందీలో సర్, వో చోక్రీ, మోహ్రా, రాజా, బందిష్, హీరో నెం.1, చాచీ 420, హీరా ఫెరి, ఆంఖెన్, యే తెరా ఘర్ యే మేరా ఘర్, హంగామా, హల్చల్, ఫిర్ హీరా ఫేరి, కూలీ నెం.1 ఇలా అనేక సినిమాలు చేశాడు. చివరగా 'ద స్టోరీటెల్లర్' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో కిట్టీ, భూత్ బంగ్లా, థామా, హీరా ఫేరి 3తో కలుపుకుని ఏడెనిమిది సినిమాలున్నాయి.గమనిక: ఇది కేవలం నటుడి అభిప్రాయం/ అనుభవం మాత్రమే. ఆరోగ్యపరమైన విషయాల్లో వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.చదవండి: హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని -
మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో మన దేశానికి చెందిన 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటికే ఇక్కడికి టూర్ కోసం వచ్చినవాళ్లు, త్వరలో వెళ్దామని అనుకున్నవాళ్లు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ నటుడు పహల్గామ్ వెళ్లారు.బాలీవుడ్ సీనియర్ నటుడు అతుల్ కులకర్ణి.. ఆదివారం పహల్గామ్ వెళ్లారు. అందరూ కశ్మీర్ తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. తాను ధైర్యంగా వచ్చానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఇన్ స్టాలో ఫొటో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) 'ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ భయం కంటే ధైర్యం ఎక్కువ. ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ ద్వేషాన్ని ప్రేమ ఓడిస్తుంది. కశ్మీర్ పోదాం పదండి. సింధు, జీలం నదుల్ని సందర్శిద్దాం పదండి. నేను వచ్చాను. మీరు కూడా రండి' అని అతుల్ కులకర్ణి చెప్పుకొచ్చారు.జయం మనదేరా, ఆంధ్రావాలా, చంటి, గౌరీ, లీలా మహల్ సెంటర్, పంజా, ద ఘాజీ, మజిలీ, వైల్డ్ డాగ్ తదితర తెలుగు సినిమాల్లో ఈయన నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, ఒరియా, మరాఠీ భాషల్లో తీసిన పలు చిత్రాల్లోనూ ఈయన నటించడం విశేషం.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by Atul Kulkarni (@atulkulkarni_official) -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ బుల్లితెర నటి.. వీడియో వైరల్!
ప్రముఖ బుల్లితెర నటి షిరీన్ మీర్జా తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ విషయాన్ని తన భర్తతో కలిసి ఓ వీడియో ద్వారా పంచుకుంది. తల్లిదండ్రులుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా.. ఈ బుల్లితెర భామ యే హై మొహబ్బతీన్ బాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించింది.తాజాగా షేర్ చేసిన వీడియోలో బేబీ బంప్‌తో కనిపించింది. కాగా.. ఆమె హసన్ సర్తాజ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. 2021లో ఆమె స్వస్థలమైన జైపూర్‌లో వివాహం చేసుకుంది. షిరీన్ మీర్జా ప్రెగ్నెన్సీ ప్రకటనతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటకు శ్రేయోభిలాషులు, సన్నిహితులు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. బాలీవుడ్లో యే హై చాహతీన్, బహుత్ ప్యార్ కర్తే హై, యే కహా ఆగయా హమ్, ధర్మక్షేత్ర్ లాంటి సీరియల్స్‌లో నటించింది. View this post on Instagram A post shared by Mirzashireen (@shireenmirza) -
తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు: నటి
బంధాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు.. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితులు తలకిందులైనప్పుడు చాలామంది ఆ బంధాన్ని కష్టంగా కొనసాగించడానికి బదులు తెంపుకోవడానికే ప్రయత్నిస్తారు. బుల్లితెర నటి శుభంగి ఆత్రే (Shubhangi Atre) కూడా అదే పని చేసింది. పరిస్థితి చేయిదాటిపోయిందని అర్థమయ్యాక భర్త పీయూశ్ పూరే (Piyush Poorey)తో విడాకులు ఇచ్చేసింది. ఇంతలోనే పీయూశ్ పూరే (ఏప్రిల్ 19న ) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు.విడాకులకు కారణం..ఈ క్రమంలో శుభంగి.. తమ అన్యోన్య దాంపత్యం చెల్లాచెదురవడానికి గల కారణాన్ని వెల్లడించింది. నేను టీవీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాను కాబట్టి భర్తను వదిలేశాను అని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు. అతడికున్న తాగుడు వ్యసనం వల్లే విడిపోవాల్సి వచ్చింది. మందుకు బానిసవడం వల్ల అది కుటుంబంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.ఎంతో ప్రయత్నించా..మా బంధాన్ని కాపాడుకోవాలని చాలారకాలుగా ప్రయత్నించాను. కానీ పరిస్థితులు చేయిదాటిపోయాయి. అతడితో మందు మాన్పించేందుకు రిహాబిలిటేషన్ సెంటర్‌కు కూడా పంపించాను. అయినా తనలో మార్పు రాలేదు. ఇరు కుటుంబాలు తనను మార్చాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆ వ్యసనం.. అతడిని నాశనం చేసింది. మాపై కూడా ప్రభావం చూపింది.ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదువిడాకులు ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. 2018-2019 సమయంలో ఆ ఆలోచన మొదలైంది. చివరకు ఈ ఏడాది విడాకులు తీసుకున్నాం. డివోర్స్ అయ్యాక కూడా నేను అతడితో టచ్‌లోనే ఉన్నాను. ఇంతలోనే అతడు కాలం చేశాడు. త్వరలోనే నేను, నా కూతురు.. ఇండోర్‌లో ఉన్న పీయూశ్ కుటుంబాన్ని కలుస్తాం అని చెప్పుకొచ్చింది.సీరియల్స్‌తో ఫేమస్శుభంగి ఆత్రే- పీయూశ్ 2003లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2005లో కూతురు పుట్టింది. 2022 నుంచి దంపతులిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. కాగా శుభంగి ఆత్రే 2006లో కసౌజీ జిందగీకే సీరియల్‌తో నటప్రయాణం ఆరంభించింది. కస్తూరి, బాబ్జీ ఘర్ పర్ హైర్, హవన్ వంటి పలు సీరియల్స్ చేసింది. చదవండి: పాకిస్తాన్‌కు ఎప్పుడు వస్తున్నావ్? దద్దమ్మ అంటూ సింగర్ కౌంటర్ -
పాకిస్తాన్‌కు ఎప్పుడు వస్తున్నావ్? దద్దమ్మ అంటూ సింగర్ కౌంటర్
పాకిస్తానీయులు భారత్‌ను తక్షణమే వదిలి వెళ్లిపోవాలని కేంద్రం రెండు రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురూ తట్టాబుట్టా సర్దుకుని పాకిస్తాన్‌కు పయనమైపోయారు. అది సరే.. మరి బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ (Adnan Sami) వంతు ఎప్పుడంటూ పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి సోషల్ మీడియాలో సెటైర్లు వేశాడు.ఈ దద్దమ్మకెలా అర్థమవుతుంది?దశాబ్దం క్రితమే భారతీయ పౌరసత్వం తీసుకున్న అద్నాన్ సమీ దీనిపై ఘాటుగా స్పందించాడు. ఈ చదువురాని దద్దమ్మకు ఎవరు చెప్తే అర్థమవుతుంది? అని కౌంటర్ ఇచ్చాడు. అద్నాన్ సమీ పేరెంట్స్ పాకిస్తానీయులు. వీరు ఇంగ్లాండ్‌లో సెటిలయ్యారు. అద్నాన్ సమీ అక్కడే పుట్టి పెరిగాడు. తర్వాత భారత్‌కు వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. 2015 డిసెంబర్లో భారత పౌరసత్వం తీసుకున్నాడు. ఈ విషయంలో తనను చాలామంది ట్రోల్ చేశారంటూ.. ఆ విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.మతం మార్చేస్తారు!అద్నాన్ సమీ మాట్లాడుతూ.. నువ్వు భారతీయుడివి అయిపోయావా? అయితే నీ మతం కూడా మార్చేస్తారు. ఇక నువ్వు ఏ స్వామివో అయిపోవాల్సిందే అంటూ నానారకాలుగా కామెంట్లు చేసేవారు. వాళ్లన్న మాటలే నిజమైతే.. అమెరికాలో ఉన్న పాక్ ప్రజలందరూ క్రిస్టియన్లు అయిపోవాలి లేదా ఇంగ్లాండ్‌లో ఉన్నవాళ్లందరూ నిరసనకారులుగా మారిపోవాలి. నేను మతం మారాలని చెప్పడానికి వాళ్లెవరు? దేశం మారితే మతం మారాలన్న రూల్ ఏం లేదు' అని చెప్పుకొచ్చాడు.సినిమాఅద్నాన్ సమీ.. ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించాడు. పలు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. లక్కీ: నో టైమ్ ఫర్ లవ్, ఏ రాస్తే హై ప్యార్ కే, ఢమాల్, 1920, ఛాన్స్ పె డ్యాన్స్, ముంబై సాల్సా, ఖుబ్సూరత్, శౌర్య చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశాడు. Who’s going to tell this illiterate idiot!!😂 https://t.co/OoH4w5iPQ3— Adnan Sami (@AdnanSamiLive) April 25, 2025 చదవండి: 30 సార్లు ఫోన్ చేసినా హిమాన్షి లిఫ్ట్ చేయలేదు.. బిగ్‌బాస్ విన్నర్ -
ప్రెగ్నెన్సీతో స్టార్ హీరోయిన్.. కోటి రూపాయల గిఫ్ట్!
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన కియారా అడ్వాణీ(Kiara Advani) ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. చివరగా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో కనిపించింది. ఈమె చేసిన రెండు సినిమాలు త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే ఈమెకు ఇప్పుడు భర్త ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. 2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్న కియారా.. బాలీవుడ్ కే చెందిన సిద్ధార్థ్ మల్హోత్రాని(Sidharth Malhotra) ప్రేమించింది. కలిసి సినిమాలు కూడా చేసిన వీళ్లిద్దరూ 2023లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో శుభవార్త చెప్పింది. తాను గర్భంతో(Pregnancy) ఉన్నానని బయటపెట్టింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టింది.(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) తాజాగా నెలవారీ చెకప్స్ కోసం భర్త సిద్దార్థ్ తో కలిసి ముంబైలోని ఓ ఆస్పత్రికి కియారా వెళ్లింది. వీళ్లిద్దరూ కూడా ఓ లగ్జరీ కారులో వచ్చారు. టొయాటో కంపెనీకి చెందిన వెల్ ఫైర్(Toyota Vellfire) అనే మోడల్ కారు ఇది. దీని ధర మార్కెట్ లో రూ.1.22 కోట్లకు పైనే ఉందని తెలుస్తోంది.కియారా ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఈమెకు ఈ కారుని బహుమతిగా ఇచ్చాడట. మిగతా వాటితో పోలిస్తే లోపల స్పేస్, కూర్చోవడానికి చాలా సౌకర్యంగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ విషయం గురించి బాలీవుడ్ లో మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
30 సార్లు ఫోన్ చేసినా హిమాన్షి లిఫ్ట్ చేయలేదు.. బిగ్‌బాస్ విన్నర్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది కన్నుమూశారు. వారిలో ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ నర్వాల్ ఒకరు. ఏప్రిల్ 16న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ నేవీ అధికారి.. హనీమూన్ కోసం ఏప్రిల్ 21న కశ్మీర్ వెళ్లారు. భార్యతో కలిసి కొత్త లైఫ్‌ను ప్రారంభించాలనుకున్నారు. కానీ, ఆ మరుసటి రోజు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ నేలకొరిగారు.పెళ్లయిన ఆరు రోజులకే..కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడం చూసి గుండెలు పగిలేలా రోదించింది భార్య హిమాన్షి. అందుకు సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. బిగ్‌బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ (Elvish Yadav) అయితే ఆ వీడియోలు చూసి మరింత షాక్‌కు గురయ్యాడు. హిమాన్షి కాలేజీలో రోజుల్లో తన క్లాస్మేట్ అని గుర్తు చేసుకున్నాడు. ఇంకా షాక్‌లోనే ఉన్నా..ఎల్విష్ మాట్లాడుతూ.. నేను హన్సరాజ్ కాలేజీలో చదువుకున్నాను. 2018లో నా చదువు పూర్తయింది. హిమాన్షిది కూడా అదే కాలేజ్.. ఆ రోజుల్లో మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్లం. మెట్రో స్టేషన్‌కు కూడా కలిసి వెళ్లేవాళ్లం. కాలేజ్ అయిపోయాక మళ్లీ మేము మాట్లాడుకోలేదు. కాకపోతే తన నెంబర్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. కానీ, ఇప్పుడామె ఫోన్ ఎత్తి మాట్లాడే పరిస్థితిలో లేదనుకుంటున్నాను. పైగా నేనే ఇంకా షాక్‌లో ఉన్నా.. అలాంటిది తన పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుంది!31వ సారి ఫోన్ ఎత్తిందిఅందుకే ఇది సరైన సమయం కాదేమో అనిపించి తనకు ఫోన్ చేసి మాట్లాడలేదు. నా ఫ్రెండ్ ఒకరు తనకు 30 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. 31వ సారి ఫోన్ ఎత్తింది. మీడియాలో వస్తున్నట్లుగానే మతం అడిగి తెలుసుకుని మరీ హిందువులను చంపేశారన్నది నిజం అని చెప్పుకొచ్చాడు. కాగా ఎల్విష్ యాదవ్.. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ రెండో సీజన్ విజేతగా నిలిచాడు.చదవండి: పారితోషికంగా నోట్ల కట్టలు.. హైదరాబాద్ కింగ్ నేనే: నాని -
'నెక్ట్స్ వేకేషన్ జమ్మూ కశ్మీర్‌లోనే'.. కేఎల్ రాహుల్ మామ సంచలన కామెంట్స్!
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సంచలన కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తన వేకేషన్ను జమ్మూ కశ్మీర్‌లోనే ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాశ్మీర్ లోయలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి.. ఉగ్రవాదంపై పోరాటానికి భారతీయులంతా ఏకం కావాలని ఆయన కోరారు. ముంబయిలో జరిగిన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు- 2025 వేడుకకు హాజరైన ఆయన పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమని.. ఇలాంటి సమయంలోనే మనం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరూ కూడా భయానికి కానీ.. ద్వేషానికి కానీ లోనుకావద్దని దేశ ప్రజలను సునీల్ శెట్టి కోరారు.సునీల్ శెట్టి మాట్లాడుతూ.. "మనం మానవాళికి చేసే సేవే భగవంతుని సేవ. సర్వశక్తిమంతుడు అన్నీ చూసి ప్రతిస్పందిస్తాడు. ప్రస్తుతం మనం భారతీయులుగా ఐక్యంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. భయం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వారి వలలో మనం పడకూడదు. ఇలాంటి సమయంలోనే మనమంతా ఐక్యంగా ఉండాలి. కశ్మీర్ మనదే.. ఎల్లప్పుడూ మనదే అని వాళ్లకి మనం చూపించాలి. అందుకే కాశ్మీర్లో తన విహారయాత్రను ప్లాన్ చేసుకుంటున్నా. మీరు కూడా కశ్మీర్లో పర్యటించాలని భారతీయ పౌరులను కోరుతున్నా. ఒక పౌరుడిగా మనం ఈ పని చేయాలి. మన తదుపరి వేకేషన్ కశ్మీర్‌లోనే ఉండాలి. ఎందుకంటే మనం భయపడలేదని.. మనకు భయం లేదని వారికి చూపించాలి' అని పిలుపునిచ్చారు.ఇప్పటికే తాను అధికారులను సంప్రదించానని.. అవసరమైతే కశ్మీర్లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సునీల్ పేర్కొన్నాడు. తమ సినిమాలను సైతం అక్కడే షూటింగ్ నిర్వహిస్తామని అధికారులకు వివరించినట్లు వెల్లడించారు. ఎందుకంటే మన కశ్మీరీలు ఎప్పటికీ మనకు తోడుగా నిలుస్తారని సునీల్ శెట్టి అన్నారు. ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ ప్రాంతం నుంచి పర్యాటకులు తరలివెళ్లడంతో అక్కడి స్థానికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లోని బైసారన్ లోయ వద్ద పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. 26 మందిని హతమార్చారు. ఈ ఘటనతో యావత్ భారతదేశం షాకింగ్‌కు గురైంది. View this post on Instagram A post shared by Visitkashmirtravel In (@visitkashmirtravel.in) -
పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ నటి.. నెటిజన్ల ఆగ్రహం!
2017లో రాయిస్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పాక్ నటి మహీరా ఖాన్. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించింది. ఈ దారుణ ఘటనలో బాధిత కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా, ఏ రూపంలోనైనా హింస అనేది పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించింది. ఇప్పటికే ఈ దాడిని పాకిస్తాన్‌కు చెందిన నటులు ఫవాద్ ఖాన్‌తో పాటు హనియా అమీర్, ఫర్హాన్ సయీద్, మావ్రా హోకానే, ఉసామా ఖాన్ లాంటి ప్రముఖులు ఖండించారు.అయితే మహీరా ఖాన్ తన పోస్ట్‌ను కొద్ది క్షణాల్లో డీలీట్ చేసింది. పహల్గామ్ మారణహోమంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే నటి తొలగించడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఇంత మాత్రానికి మీరు సానుభూతి ప్రకటించడం ఎందుకని మహీరాను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా.. అంతకుముందే ప్రముఖ పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ఈ ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఫవాద్ ఖాన్ సినిమాపై బ్యాన్..పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలను తెంచేసుకున్నట్లు ప్రకటించింది. గతంలో 2016లో యూరీ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ఆరిస్టులను ఇండియాలో పని చేయకుండా నిషేధించారు. తాజాగా పహల్గామ్ ఘటన తర్వాత మరోసారి పాక్ నటీనటులపై కేంద్ర నిషేధం విధించింది. అంతేకాకుడా ఫవాద్ ఖాన్ నటించిన సినిమాను విడుదలను బ్యాన్ చేసింది.పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన హిందీ సినిమా 'అబీర్ గులాల్' (Abir Gulaal Movie)ను భారత్‌లో విడుదల చేయకూడదని కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించగా.. బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ అతడికి జంటగా నటించింది. రిద్ధి డోగ్రా, లీసా హైడన్, ఫరీదా జలాల్, పర్మీత్ సేతి, సోనీ రజ్దాన్ కీలక ప్రాతలు పోషించారు. ఆర్తి ఎస్. బగ్దీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వివేక్ అగర్వాల్, అవంతిక హారి, రాకేశ్ సిప్పీ, ఫిరూజీ ఖాన్ నిర్మించారు. -
ఏఆర్ రెహమాన్‌కు షాక్.. రూ. 2 కోట్లు చెల్లించాల్సిందే!
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన సంగీతం అందించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోని ఓ పాటపై కాపీ రైట్ కేసులో బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం.. పిటిషన్‌దారుడికి రూ.2 కోట్లు చెల్లించాలని ఏఆర్ రెహమాన్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థను ఆదేశించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.పొన్నియిన్ సెల్వన్ సిరీస్‌లో భాగంగా తెరకెక్కించిన రెండో చిత్రం. ఈ మూవీలో విక్రమ్, రవి మోహన్, కార్తి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ రెండు సినిమాలకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. పొన్నియిన్ సెల్వన్ -2 చిత్రంలోని వీరా రాజ వీరా అనే పాట సంగీతాన్ని తన తండ్రి ఫయాజుదీన్ డగర్, మామ జాహిరుదీన్ డగర్ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్లు సింగర్ ఉస్తాద్ ఫయాజ్ వసిఫుదీన్ డగర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో శుక్రవారం ఢిల్లీ హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువడింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ రూ.2 కోట్లను పిటిషన్‌దారుడికి అందించాలని ఆదేశించింది. -
ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌గా విక్రాంత్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ జీవితం వెండితెరపైకి రానుంది. రవిశంకర్ జీవితంతో సినిమా రానుందని ఎప్పట్నుంచో ఓ వార్త ప్రచారంలో ఉంది. బాలీవుడ్ దర్శక–నిర్మాతలు సిద్ధార్థ్ ఆనంద్, మహావీర్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కూడా టాక్ వినిపించింది. ఈ చిత్రంలో రవిశంకర్ పాత్రను విక్రాంత్ మాస్సీ చేయనున్నారనే ఊహాగానాలూ నెలకొన్నాయి. అందుకు తగ్గట్టు గత ఏడాది రవిశంకర్ని కలిశారు విక్రాంత్.ఆయనపాత్రలో ఒదిగిపోవడానికి కావాల్సిన సలహాలు, సూచనలు తీసుకున్నారట. ఈ చిత్రం రెగ్యులర్ షూట్‌ని జూలైలో ఆరంభించాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ‘వైట్’ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి యాడ్ ఫిల్మ్ మేకర్ మౌంటూ బస్సీ దర్శకత్వం వహించనున్నారు.కొలంబియాలో జరిగిన అంతర్యుద్ధాన్ని పరిష్కరించడంలో రవిశంకర్ ఏ విధంగా కీలకపాత్ర పోషించారనేది ఈ చిత్రం ప్రధానాంశమని సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో రవిశంకర్పాత్రలో ఒదిగిపోవడానికి విక్రాంత్ మాస్సీ మేకోవర్ అవుతున్నారు. హిందీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించి, పలు భాషల్లో అనువదించి, రిలీజ్ చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది ‘వైట్’ విడుదల కానుంది. -
భర్తతో కలిసి కాస్ట్ లీ కారు కొన్న హీరోయిన్
హిందీలో అడపాదడపా సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha). ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ 'దబంగ్' మూవీతో పరిచయమైన అద్భుతమైన హిట్ సొంతం చేసుకుంది.మంచి హిట్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టినప్పటికీ తర్వాత సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది. మధ్యలో రజనీకాంత్ తో కలిసి 'లింగా' అనే మూవీ చేసింది కానీ బ్యాడ్ లక్. దీనికి తోడు బొద్దుగా ఉండటం కూడా ఈమెకు మైనస్ అయిందని చెప్పొచ్చు. అలా అప్పుడో ఇప్పుడో అన్నట్లు సినిమాలు చేస్తూ వచ్చింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) ఇకపోతే ఈమె తనతో పాటు నటించిన జహీర్ ఇక్బాల్(Zaheer Iqbal) అనే నటుడితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. కానీ ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడింది. గతేడాది జూలైలో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఎప్పటికప్పుడు వీళ్లిద్దరూ టూర్స్ వేస్తూనే ఉన్నారు.తాజాగా ఈ భార్యభర్తలిద్దరూ కొత్త బీఎండబ్ల్యూ కారు(BMW Car) కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని జహీర్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇకపోతే ఈ కారు ఖరీదు రూ.కోటి 30 లక్షలకు పైనే ఉంటుందని సమాచారం. సినిమాల విషయానికొస్తే సోనాక్షి నటించిన 'నికితా రాయ్' మే 30న విడుదల కానుంది. జహీర్ మాత్రం ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు.(ఇదీ చదవండి: ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' రివ్యూ) View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్, లగ్జరీ కారు.. ఎవరీ నటుడు?
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ - జైదీప్ అహ్లవత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్' (Jewel Thief: The Heist Begins) శుక్రవారం ఓటీటీలో విడుదలైంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంది. సిద్ధార్థ్ ఆనంద్ సమర్పణలో, రాబీ గ్రెవాల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జైదీప్ అహ్లవత్ లైఫ్ స్టైల్, ఆస్తులపై నెట్టింట చర్చ ఆసక్తికరంగా మారింది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడిగా ఉన్న జైదీప్ నికర విలువ ఎంత? ఇతర విలువైన ప్రాపర్టీస్ ఏంటి తెలుసుకుందామా..!తనదైన నటనతోపాటు, ఇటీవల కాలంలో బాగా బరువు తగ్గి సత్తా చాటుకుంటున్నాడు జైదీప్ అహ్లవత్ (Jaideep Ahlawat). వరుస అవకాశాలతో ఇర్ఫాన్ ఖాన్, మనోజ్ బాజ్‌పేయి, అశుతోష్ రాణా, రాజ్‌కుమార్ రావు, విజయ్ రాజ్, కేకే మీనన్ వంటి సినిమా దిగ్గజాల సరసన చోటు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 'జువెల్ థీఫ్'లో 'జాదు' పాటలో స్టెప్పులతో సంచలనం సృష్టించాడు. ఇప్పటికే పాతాళ్ లోక్ సీజన్ 2తో స్ట్రీమింగ్ రికార్డులను బద్దలు కొట్టాడు. దీంతో అతని నికర విలువ ఒక్కసారిగా పుంజుకుంది.2010లో ప్రియదర్శన్ చిత్రం 'ఖట్టా మీఠా'లో అరంగేట్రం చేశాడు జైదీప్ అహ్లవత్. ప్రస్తుతం అతడు ఎంజాయ్ చేస్తున్న సక్సెస్ అంత ఈజీగా రాలేదు. హర్యానాలోని ఖార్ఖరాలో పెరిగిన జైదీప్ భారత సైన్యంలో చేరాలని కలలు కన్నాడు. కానీ ఆ కల నెరవేరకపోవడంతో నాటకాలవైపు మళ్లాడు. ఇంగ్లీష్ సాహిత్యంలో ఎంఏ పూర్తి చేసి, FTIIలో చదివిన తర్వాత, సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఖార్ఖరా నుండి పూణే, ముంబైకి మధ్య తిరుగుతూ నటుడు కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్, పాతాళ్ లోక్ లో అద్భుతమైన నటన అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది.14 ఏళ్లకు పైగా కష్టపడి తాను అనుకున్నది సాధించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ తన రెమ్యూనరేషన్‌ను రూ. 40 లక్షల నుంచి రూ. 20 కోట్లకు పెంచుకోవడం అంటే మాటలు కాదు. తాజా నివేదికల ప్రకారం 'పాతాళ్ లోక్' మొదటి సీజన్ కోసం జైదీప్ రూ.40 లక్షలు వసూలు చేశాడు. పాతాళ్ లోక్ సీజన్ 2 సైన్ చేయడానికి ముందు జైదీప్ ఆస్తి రూ. 8 కోట్లు. ఈ సిరీస్‌లో 'హాథీ రామ్ చౌదరి' పాత్రను పోషించినందుకు రూ.20 కోట్లు తీసుకున్నాడట. అయితే అలాంటి వాదనలను ఖండించినప్పటికీ, జైదీప్ రెమ్యూనరేషన్ రూ. 40 లక్షల నుంచి రూ. 20 కోట్లకు చేరిందంటూ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి.చదవండి: సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!జైదీప్ జైదీప్ బహుళ ఆస్తులను కలిగి ఉన్నాడని కూడా మీడియా కోడై కూస్తోంది. కొన్ని లగ్జరీ కార్లతో పాటు, రూ. 1.32 కోట్ల విలువైన లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ GLS SUV కూడా జైదీప్ సొంతం. ప్రొఫెషనల్ డ్యాన్సర్ జ్యోతి హుడాను 2009లో అతడు వివాహం చేసుకున్నాడు.చదవండి: ఫ్యామిలీ మ్యాన్ 3 విలన్ జైదీప్ అహ్లవత్ : 110 నుంచి 83 కిలోలకు ఎలా? -
పాక్ నటుడికి బాలీవుడ్ బ్యూటీ సపోర్ట్.. వారిపై బ్యాన్ సరికాదంటూ!
పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ (Fawad Khan) బాలీవుడ్లో కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. అతడు హీరోగా నటించిన అబీర్ గులాల్ మూవీ (Abir Gulal Movie) మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. ఇంతలో జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరగడంతో పాక్‌పై భారత్ తీవ్ర చర్యలకు పూనుకుంది. పాకిస్తాన్ సింధూనదీ జలాలు ఇచ్చేది లేదని నిర్ణయించుకుంది. అలాగే పాక్ నటులపై, వారి సినిమాలపై నిషేధం విధించింది.పాక్ నటులపై ద్వేషం వద్దుఅబీర్ గులాల్ మూవీని భారత్‌లో బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఫవాద్ ఖాన్ రీఎంట్రీ పట్ల బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా (Dia Mirza) సంతోషం వ్యక్తం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో దియా మాట్లాడుతూ.. నటులపై బ్యాన్ విధించడం సరి కాదు. సినిమా, స్పోర్ట్స్‌ను ద్వేషంతో చూడకూడదు. ఫవాద్ తిరిగి రావడం సంతోషకరం. త్వరలోనే మనమంతా అతడిని వెండితెరపై చూడబోతున్నాం. తర్వాత అతడికి మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోపై నెట్టింట ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.ఇక చాలు ఆపండిపాక్ నటుడికి సపోర్ట్ చేయడమేంటని పలువురూ దిశాను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది. వాస్తవాలను తప్పుగా చూపించడం ఆపండి. ఏప్రిల్ 10న నా సినిమా కోసం ఈ ఇంటర్వ్యూ చేశాను. అంటే ఉగ్రదాడి జరగడానికి చాలా కాలం ముందు మాట్లాడిన వ్యాఖ్యలివి. వాటిని ఇప్పుడు తీసుకొచ్చి, అసందర్భంగా ప్రచారం చేయడం ఆపండి. ఇది అనైతికం.. అలాగే తీవ్ర అభ్యంతరకరం కూడా! అని రాసుకొచ్చింది. బాలీవుడ్లో అనేక సినిమాలు చేసిన ఈ బ్యూటీ తెలుగులో వైల్డ్ డాగ్ చిత్రంలో యాక్ట్ చేసింది. ఇకపోతే ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు.చదవండి: ప్రభాస్ ది రాజాసాబ్.. టీజర్ రిలీజ్‌పై హింట్ ఇచ్చిన డైరెక్టర్! -
రామాయణ.. సాయిపల్లవి కంటే ముందు నాకే ఛాన్స్..: శ్రీనిధి
రామాయణ సినిమాలో సాయిపల్లవి కంటే ముందు కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)కే సీతగా నటించే ఛాన్స్ వచ్చిందని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై స్పందించిన శ్రీనిధి అవి నిజమేనంటోంది. హిట్ 3 సినిమా ప్రమోషన్స్‌లో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. రామాయణ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఇప్పుడీ విషయం చెప్పొచ్చనే అనుకుంటున్నాను.స్క్రీన్ టెస్ట్ పూర్తిరామాయణ సినిమా (Ramayana Movie)లో మొదట నన్నే సీతగా అనుకున్నారు. స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. మూడు సన్నివేశాల కోసం నేను ప్రాక్టీస్ కూడా చేశాను. నా యాక్టింగ్‌కు మంచి స్పందనే వచ్చింది. అందరూ నా నటనను చూసి మెచ్చుకున్నారు. యష్ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నాడని తెలిసింది. సరిగ్గా అప్పుడే కేజీఎఫ్ 2 రిలీజైంది. మా జోడీ జనాలకు బాగా నచ్చేసింది. అలాంటప్పుడు ఈ మూవీలో యష్ రావణుడిగా.. నేను సీతగా నటిస్తే జనాలు ఎలా స్వీకరిస్తారని ఆలోచించాను. అవకాశం చేజారిందంటే..కచ్చితంగా వాళ్లు మమ్మల్నిలా చూసి జీర్ణించుకోలేరేమో అనిపించింది. ఈ సినిమా మాకు వర్కవుట్ అవొచ్చు, కాకపోవచ్చు అనుకున్నాను. ఏదేమైనా సీత పాత్రకు సాయిపల్లవి (Sai Pallavi) పూర్తి న్యాయం చేయగలదు. తనను సీతగా చూసేందుకు ఎదురుచూస్తున్నాను. మనకు ఏదైనా కలిసొచ్చిందంటే (అవకాశం వచ్చిందంటే) సంతోషపడాలి.. అది చేజారిందంటే.. ఇంకోచోట మనకోసం ఏదో అవకాశం వేచి ఉందని అనుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను అని చెప్పుకొచ్చింది.సినిమాశ్రీనిధి శెట్టి.. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాల్ని అందుకుంది. ఈ బ్యూటీ హిట్: ద థర్డ్ కేస్‌తో టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది.చదవండి: బిగ్‌బాస్ షో హోస్ట్‌గా మళ్లీ..? నాని ఆన్సర్ ఇదే! -
పహల్గాం ఉగ్రదాడి ప్రాంతంలో షూటింగ్స్ జరుకున్న చిత్రాలివే
-
కేసరి - 2.. హిట్ టాక్ ఫుల్.. కలెక్షన్ నిల్
-
డాన్‌తో జోడీ?
బాలీవుడ్ కొత్త డాన్ రణ్వీర్ సింగ్ సరసన కృతీసనన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బాలీవుడ్ ‘డాన్ ’ ఫ్రాంచైజీలో రూపొందనున్న కొత్త చిత్రం ‘డాన్ 3’. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించను న్నారు. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించనున్న ఈ మూవీని 2023 ఆగస్టులోనే ప్రకటించారు. కానీ, వివిధ కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ వేసవి నుంచి షూటింగ్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా కియారా అద్వానీని ఎంపిక చేసుకున్నారు మేకర్స్. కానీ, ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉండటంతో ఈ మూవీలో హీరోయిన్ గా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ‘డాన్ 3’ కోసం కొత్త హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో పడ్డారు ఫర్హాన్ అక్తర్. అందులో భాగంగా ఇటీవల శర్వారీ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా కృతీసనన్ పేరు బాలీవుడ్లో వినిపిస్తోంది. మరి.. ‘డాన్ 3’ లో రణ్వీర్ సింగ్ సరసన కృతీసనన్ కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. కాగా హిందీలో వచ్చిన ‘డాన్ ’ (2006), ‘డాన్ 2’ (2011) సినిమాల్లో షారుక్ ఖాన్ హీరోగా, 1978లో వచ్చిన ‘డాన్ ’లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. -
సినిమా హిట్.. కలెక్షన్స్ మాత్రం దారుణం
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar).. ఏడాదికి కచ్చితంగా మూడు నాలుగు సినిమాలైనా రిలీజ్ చేస్తుంటాడు. అలాంటిది ఇతడికి గత నాలుగేళ్లుగా సరైన హిట్ అన్నది లేకుండా పోయింది. 20కి పైగా చిత్రాల్లో నటిస్తే మధ్యలో ఒకటి కాస్త పర్వాలేదనిపించుకోగా.. ఇన్నాళ్లకు 'కేసరి 2'(Kesari 2) రూపంలో అద్భుతమైన హిట్ దక్కింది. కానీ వసూళ్లే దారుణంగా ఉన్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్)చిన్నాచితకా హీరోలైతే కాస్త నిదానంగా వసూళ్లు వస్తాయి. కానీ స్టార్ హీరోల సినిమాలకు హిట్ టాక్ వస్తే మంచి నంబర్స్ నమోదు అవుతుంటాయి. కానీ అక్షయ్ కుమార్ 'కేసరి 2' పరిస్థితి మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే రిలీజైన రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. ఉత్తరాది సైట్లన్నీ 3కి పైగా రేటింగ్ కూడా ఇచ్చాయి. కానీ జనాలు ఎందుకో దీన్ని చూసేందుకు ఆసక్తి చూపించట్లేదు.ఇప్పుడు దీనికి నిదర్శనం అన్నట్లు ఐదు రోజుల్లో రూ.39.16 కోట్ల నెట్ కలెక్షన్స్(Movie Collection) మాత్రమే వచ్చాయి. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థనే అధికారికంగా ప్రకటించింది. మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు లేకపోవడం ఈ చిత్రానికి ఓ రకంగా మైనస్ అని చెప్పొచ్చు. కోర్ట్ రూమ్ డ్రామా కావడంతో ఓటీటీలోకి వచ్చాక చూద్దాంలే అనే ఆలోచనతో చాలామంది ప్రేక్షకులు భావిస్తున్నట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)బహుశా ఇలాంటి కారణాల వల్లే సినిమా హిట్ అయినా కలెక్షన్స్ మాత్రం రోజురోజుకీ డ్రాప్ అవుతూ వస్తున్నాయి. అక్షయ్ గత చిత్రాల ఫ్లాప్ ప్రభావం దీనిపై పడిందా అనే సందేహం కూడా వస్తోంది. ఇకపోతే ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. రెండు నెలల తర్వాతే స్ట్రీమింగ్ ఉండే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే రూ.100 కోట్ల మార్క్ అందుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో ఏంటో?(ఇదీ చదవండి: సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి) -
ఆడవారికి ముద్దులు.. ఆయనది వంకరబుద్ధి.. నేనైతే చితకబాదేవాడిని!
అభిమానులతో సెల్ఫీలు దిగుతారు, ఆటోగ్రాఫ్‌లు ఇస్తారు.. కానీ ఈ సింగర్ మాత్రం ఏకంగా వారికి ముద్దులు పెట్టేశాడు. అతడే ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్. ఆ మధ్య ఈయన ఓ షోలో.. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన మహిళా అభిమానులకు ముద్దులు పెట్టడం వివాదంగా మారింది. తాజాగా ఈ వివాదంపై సింగర్ అమిత్ టండన్ (Amit Tandon) స్పందిస్తూ.. ఉదిత్‌కు వయసుతో పాటు వంకర బుద్ధి కూడా పెరిగిందని వ్యాఖ్యానించాడు.ఆయనది వక్రబుద్ధిఅమిత్ మాట్లాడుతూ.. ఉదిత్ నారాయణ్ (Udit Narayan) పాటలంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆయనకు వంకర బుద్ధి ఉంది. ఇలా చెప్పొచ్చే, లేదో నాకు తెలీదు కానీ, ఏ పరిస్థితినైనా ఆయన అడ్వాంటేజ్‌గా తీసుకుంటాడు. నేను కూడా చాలా షోలు చేశాను. అభిమానులు నాకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించేవారు. వారిని మనం ఎంత దగ్గరకు రానివ్వాలి? ఎక్కడ ఉంచాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా సరే లిమిట్‌లోనే ఉండాలి.హద్దుల్లో ఉంటే బెటర్ఒకవేళ నేనే గనక నా ప్రియురాలు లేదా భార్యతో అతడి షోకు వెళ్లాననుకోండి. నా పార్ట్నర్ ఆయనతో ఫోటో తీసుకుంటుంటే దాన్ని ఆయన అడ్వాంటేజ్‌గా తీసుకుని ముద్దు పెడితే మాత్రం ఊరుకునేవాడిని కాదు. కచ్చితంగా అతడిని చితకబాదేవాడిని. అయితే గాయకుడిగా మాత్రం నాకు ఆయనపై విపరీతమైన గౌరవం ఉంది. కాకపోతే మనకంటూ కొన్ని పరిమితులు గీసుకుంటే మంచిది. హద్దులు దాటకుండా ఉంటేనే అందరికీ ఉత్తమం.తండ్రి అలా.. కొడుక్కేమో యాటిట్యూడ్ఉదిత్ కుమారుడు అదిత్ నారాయణ్ ఓ షోలో జనాలపైకి మైక్ విసరడం చూశాను. ఏదేమైనా సరే హుందాగా ప్రవర్తించాలే తప్ప ఇలా యాటిట్యూడ్ చూపించకూడదు. అదిత్ నాకు వ్యక్తిగతంగా తెలియదు.. బహుశా అతడు మంచివాడు కావచ్చు. కానీ సోషల్ మీడియాలో చూస్తున్న విజువల్స్‌లో మాత్రం తనకు యాటిట్యూడ్ ఉందని ఇట్టే అర్థమవుతోంది అని అమిత్ చెప్పుకొచ్చాడు.చదవండి: పహల్గాంలోనే ఉన్నా.. పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే: ఆర్జే కాజల్ -
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
ఓపక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మరోపక్క నటుడిగా ప్రయత్నిస్తున్నాడు ఈశ్వర్ హారిస్. అంతేకాదు.. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు బాడీ డబుల్ (డూప్)గా కూడా చేస్తున్నాడు. అంటే కొన్ని సీన్లలో తారక్ స్థానంలో ఈయనే నటిస్తాడన్నమాట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈశ్వర్ (Eshwar Harris).. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.అలా ఆర్ఆర్ఆర్లో అవకాశంఅతడు మాట్లాడుతూ.. జార్జ్ రెడ్డి సినిమాలో విలన్‌గా చిన్న పాత్రలో నటించాను. కొత్తపోరడు, పులిమేక వంటి వెబ్‌సిరీస్‌లు చేసుకుంటూ వచ్చాను. ఆచార్యలో రామ్‌చరణ్ ఫ్రెండ్‌గా నటించాను. అయితే ఎడిటింగ్‌లో నా సీన్లు పోయాయనుకోండి. కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నువ్వు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లాగే ఉన్నావ్ అన్నాడు. రాజమౌళి టీమ్ నీ గురించి నెల రోజుల నుంచి వెతుకుతున్నారు అని చెప్పాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలో భాగమయ్యాను.కొమురం భీముడో పాటలో..ఉదయం 6 గంటలకల్లా సెట్స్‌లో ఉండాలనేవారు. ఓరోజు నేను రావడం ఐదు నిమిషాలు ఆలస్యమయ్యేసరికి వందల ఫోన్ కాల్స్ వచ్చాయి. రాజమౌళి ఆరింటికే షూటింగ్ మొదలుపెట్టేస్తాడు. చాలా పక్కాగా ఉంటాడు. కొమురం భీముడో పాటలో మూడు, నాలుగు షాట్స్ నావే ఉంటాయి. తారక్ అన్న స్థానంలో నన్ను వేలాడదీశారు.. నా కాళ్లు, చేతులకు రక్తం కారే సన్నివేశాలు షూట్ చేశారు. ఆ పాటలో కాళ్లు, చేతులు నావే కనిపిస్తాయి. ఫైటింగ్స్‌లాంటివైతే నేనేం చేయలేదు.వార్ 2 కోసం అడిగారుమొన్న వార్ 2 సినిమా (War 2 Movie) కోసం అడిగారు. అర్జంట్‌గా ముంబై వచ్చేయాలన్నారు. కానీ విమానయాన ఛార్జీలకు కూడా డబ్బులివ్వనన్నారు. మనకన్నా బాలీవుడ్ దారుణంగా ఉందనిపించింది. రెమ్యునరేషన్ నచ్చకపోవడంతో రానని చెప్పేశాను. ఈ మధ్యే జూనియర్ ఎన్టీఆర్.. జెప్టో యాడ్ కూడా చేశాను. జూనియర్ ఎన్టీఆర్ అన్నను చూడగానే నాకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. సింగిల్ టేక్‌లో చాలా సింపుల్‌గా నటిస్తాడు.జెప్టో యాడ్ చేశా..అయితే యాడ్ షూటింగ్ అప్పుడు ఆయనకు కాస్త జ్వరం వచ్చింది. పైగా డైట్లో ఉన్నాడు. అసలే వార్ 2లో హృతిక్ రోషన్‌ను మ్యాచ్ చేయాలి కదా మరి! హృతిక్‌ను మ్యాచ్ చేయడమంటే మామూలు విషయం కాదు. జెప్టో యాడ్‌లో క్యారవాన్ ఇచ్చి మంచి భోజనం పెట్టి తారక్ అన్నతో సమానమైన గౌరవం ఇచ్చారు. బాడీ డబుల్‌గా చేసినప్పుడు సినిమాను బట్టి లక్షల్లో పారితోషికం ఇస్తారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈశ్వర్.. భీమా, స్వయంభూ వంటి పలు చిత్రాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Eshwar Harris (@eshwar_harris) చదవండి: సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన నటి.. ధర ఎంతంటే?
సెక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్‌తో ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ కుబ్రా సైత్. ఇటీవలే విడుదలైన షాహిద్ కపూర్ మూవీ దేవాలో కీలక పాత్రలో కనిపించింది. పూజా హేగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ సినిమాలో కుబ్రా ఎస్సై పాత్రలో అభిమానులను ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతకుముందు హిందీలో పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో నటించింది.తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ప్రముఖ కార్ల బ్రాండ్ అయిన మహీంద్రా ఈవీని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఈవీ కారు ధర దాదాపు రూ.31 లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై తాను పెట్రోల్ బంకుల్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది కుబ్రా సైత్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బాలీవుడ్ భామకు అభినందనలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Kubbra Sait (@kubbrasait) -
ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం.. ప్రపంచస్థాయి అవార్డ్‌కు ఎంపిక
బాలీవుడ్ హీరోయిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ29 సినిమాలో కనిపించనుంది. రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న తొలి చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్ర పోషించనుంది. ఇటీవలే ఒడిశాలో జరిగిన షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది.అయితే తాజాగా ప్రియాంక చోప్రాకు అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రముఖ గోల్డ్ హౌస్ గాలా సంస్థ అందించే గ్లోబల్ వాన్గార్డ్ హానర్ అవార్డ్‌కు ఎంపికైంది. ఈ బాలీవుడ్ స్టార్‌తో పాటు హాలీవుడ్ రాపర్ మేగాన్ థీ స్టాలియన్, అకాడమీ అవార్డు దర్శకుడు ఆంగ్ లీ, చిత్రనిర్మాత జాన్ ఎంచు కూడా ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు. ఈ అవార్డ్‌ను ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన లీడర్లకు అందించనున్నారు. ఈ అవార్డ్‌ను మే 10న లాస్ ఏంజిల్స్‌లోని మ్యూజిక్ సెంటర్లో జరిగే గోల్డ్ హౌస్ గాలా నాల్గవ వార్షిక సమావేశంలో ప్రియాంక చోప్రాను సత్కరించనున్నారు.గోల్డ్ హౌస్ గాలా- ఏ100 జాబితాను వెల్లడించనుంది. సంస్కృతి, వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన 100 ఆసియా పసిఫిక్ లీజర్లను ప్రతి ఏటా ఎంపిక చేస్తారు. ఈ సంవత్సరం ఏ100 జాబితా మే 1న వెల్లడించనున్నాురు. ఈ వేడుకకు ముందు సినిమా, సాంకేతికత, మీడియాతో సహా వివిధ పరిశ్రమలకు చెందిన 600 మందికి పైగా అతిథులను ఆహ్వనించనున్నారు.కాగా.. 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హిందీ సినిమాలో దాదాపు 25 ఏళ్ల తన కెరీర్లో రాణించింది. ఆ తర్వాత ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోనూ నటించింది. ప్రస్తుతం ఆమె ఆమె జాన్ సెనా, ఇద్రిస్ ఎల్బాతో కలిసి హాలీవుడ్ చిత్రం 'హెడ్స్ ఆఫ్ స్టేట్'లో కూడా కనిపించనుంది. -
జలియన్ వాలాబాగ్ నేపథ్యంగా కేసరి-2.. బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం కేసరి చాప్టర్-2. ఈ మూవీలో లైగర్ భామ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. ఇటీవల గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఏప్రిల్ 18న బిగ్ స్క్రీన్‌పైకి వచ్చిన కేసరి-2.. వసూళ్లపరంగా రాణించలేకపోతోంది. తొలి రోజు ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.7.84 కోట్ల నికర వసూళ్లు మాత్రమే సాధించింది. శని, ఆదివారాల్లో బాగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. సోమవారం వచ్చేసరికి కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో కేవలం రూ.4.50 కోట్లకే పరిమితమైంది.ఈ లెక్కన కేసరి-2 విడుదలైన నాలుగు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా రూ.34.12 కోట్ల నికర వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన ధైర్యవంతుడైన భారతీయ న్యాయవాది సి శంకరన్ నాయర్ పాత్రలో నటించారు. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సన్నీ డియోల్ 'జాట్' నుంచి బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. థ్రిల్లర్ సినిమా కావడంతో వసూళ్ల పరంగా నిలకడగా రాణిస్తోంది. కాగా.. ఈ సినిమాలో ఆర్ మాధవన్ కీలక పాత్రలో మెప్పించారు.కాగా..'కేసరి చాప్టర్ 2' చిత్రాన్ని కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో కరణ్ జోహార్ నిర్మించారు. ఏప్రిల్ 13, 1919న జరిగిన జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత.. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా న్యాయవాది సి శంకరన్ నాయర్ చూపించిన ధైర్యసాహసాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. Truth spoke. Theatres roared. Numbers soared. Book your tickets NOW.🔗 - https://t.co/YSydXCA78f#KesariChapter2 in cinemas now, worldwide pic.twitter.com/MaCWzgncsU— Dharma Productions (@DharmaMovies) April 22, 2025 -
మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన సైఫ్ అలీఖాన్, కారణం ఏంటో తెలుసా?
విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనపై కత్తి దాడి జరిగిన కొన్ని నెలల తరువాత ఖతార్‌లో మరో ఇల్లు కొనుగోలు చేశాడు. ఖతార్‌లోని దోహాలోని ది పెర్ల్‌లోని ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ద్వీపంలో తాను పెట్టుబడి పెట్టానని సైఫ్ అలీ ఖాన్ ఇటీవల వెల్లడించాడు. ఇండియాకి దగ్గరగా ఉండటంతోపాటు, ఇది చాలా సేఫ్ అని కూడా తెలిపారు. ఖతార్‌లో ఇల్లు కొనాలనే తన నిర్ణయం గురించి సైఫ్ అలీ ఖాన్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం.భద్రత, బ్యూటీతో పాటు భారతదేశానికి దగ్గర ఉన్నందు వల్ల ఖతార్‌లోని దోహాను ఎంచుకున్నట్టు అల్ఫర్డాన్ గ్రూప్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైఫ్ తెలిపాడు. అందమైన ప్రదేశాలతో, పరిపూర్ణమైన హాలిడే హోమ్ అని కూడా దోహాపై ప్రశంసలు కురిపించాడు. అందుకే ఆ దేశం తనను సురక్షితంగా ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగేలా చేసిందన్నాడు. ఒకటి రెండు రోజులు సెలవులు దొరికితే తనకు గుర్తొచ్చేది దోహా. పైగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అది చాలా సురక్షితంగా ఉంటుందనీ, ఒక ద్వీపం లోపల ద్వీపం అనే భావన ఇంకా లగ్జరీగా ఉంటుంది, నిజంగా ఉండటానికి దానికి మించిన ప్రదేశం అందుకే అక్కడ ఉండటం తనకు చాలా సంతోషాన్నిస్తుందని చెప్పుకొచ్చాడు. సేఫ్టీ, ప్రైవసీ, లగ్జరీ అద్భుతమైన కలయిక దోహా, ‘ఇల్లు తరువాత మరో ఇల్లు’ (హోం అవే ఫ్రం హోం) అని పేర్కొన్నాడు. షూటింగ్లో భాగంగా అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అప్పడు బాగా నచ్చేసింది, మరో విధంగా చెప్పాలంటే అక్షరాలా ఇంటి నుండి దూరంగా ఉన్న మరో ఇల్లులా అనిపించింది, ప్రశాంతంగా .ఏకాంతంగా ఉంటుందని, త్వరలోనే పిల్లల్నీ,ఫ్యామిలీని అక్కడికి తీసుకెళతానని పేర్కొన్నాడు.లగ్జరీ జీవన శైలి, ఆస్తులు హైప్రొఫైల్ నేపథ్యం, రాజ కుటుంబ వారసత్వం, విలావసవంతమైన కార్లు, వాచెస్.. లగ్జరీ ఇల్లు ఇదీ జీవన శైలి. సైఫ్ తన భార్య, సినీ నటి కరీనాకపూర్‌తో కలిసి ముంబైలోని సద్గురుశరణ్‌లోని విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాడు. దీనిక విలువ రూ.55 కోట్లు. ఇది కాకుండా సైప్, కరీనా జంటకు స్విట్జర్లాండ్‌లోని గస్టాడ్ ప్రాంతంలో రూ.33 కోట్ల విలువ చేసే మరో ఇల్లు కూడా ఉంది. పూర్వీకుల పటౌడీ ప్యాలెస్, లండన్ కూడా ఆస్తులు ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం వారసత్వంగా వచ్చిన సంపదతోపాటు సైఫ్ ఆస్తుల విలువ రూ.1,200 కోట్లకు పైమాటే. అంచనా. బెంజ్ ఎస్ క్లాస్‌కు చెందిన ఎస్350డీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, ఆడీ క్యూ7, జీప్ రాంగ్లర్ వింటికి సైఫ్ కార్లు. పర్ఫ్యూమ్స్, ఫుట్‌వేర్, హోమ్ డెకార్ రంగాల్లో వ్యాపారాన్ని కూడా విస్తరించాడు. ఒక్కో సినిమాకు సైఫ్ రెమ్యూనరేషన్ సినిమాకు రూ.10-15 కోట్లు ద ఎండార్స్మెంట్ల ద్వారా కోట్ల సంపాదన. దీనికి తోడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సతీమణి కరీనా సంపాదన కూడా తక్కువేమీ కాదు.కత్తిపోట్లు ఘటనకత్తిపోట్టు ఈ ఏడాది జనవరిలో తన సొంత ఇంట్లో సైఫ్ అలీ ఖాన్ కత్తి పోట్లుకు గురి కావడం కలకలం రేపింది. ముంబైలోని లీలావతి ఐదు రోజులు చికిత్స పొందిన అనతరం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.'జువెల్ థీఫ్' తన రాబోయే థ్రిల్లర్ 'జువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్' లో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఏప్రిల్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. సైఫ్ ఈ మూవీలో జైదీప్ అహ్లవత్, కునాల్ కపూర్ , నికితా దత్తా కూడా నటించారు. కూకీ గులాటి , రాబీ గ్రేవాల్ దీనికి దర్శకత్వం వహించారు. -
జాన్వీ కపూర్‌కు స్టార్ హీరో స్కూటీ పాఠాలు.. బిగ్‌బాస్ దివి స్టన్నింగ్ అవుట్‌ఫిట్!
జాన్వీ కపూర్‌కు స్కూటీ నేర్పిస్తోన్న స్టార్ హీరో..అమ్మకు బర్త్ డే విషెస్ చెప్పిన మీనాక్షి చౌదరి..స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో బిగ్‌బాస్ దివి పోజులు..డీసెంట్ లుక్‌లో నాసామిరంగ బ్యూటీ ఆషిక రంగనాథ్...బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
ఛావా మరో క్రేజీ రికార్డ్.. పుష్ప-2 సరసన చేరిన బాలీవుడ్ మూవీ!
విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ సినిమా ఛావా(Chhaava Movie). ఈ ఏడాది ఫిబ్రవరి 14న హిందీలో రిలీజై బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఛావా సినిమాకు బాలీవుడ్లో హిట్ టాక్ రావడంతో.. మార్చి 7న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. టాలీవుడ్‌లోనూ అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఛావా' దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది.తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సాధించింది. కేవలం హిందీలో దేశవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది. పుష్ప-2, స్త్రీ-2 తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన మూడో చిత్రంగా ఛావా చోటు దక్కించుకుంది. స్త్రీ-2 తర్వాత ఈ రికార్డ్ కొల్లగొట్టిన రెండో బాలీవుడ్ మూవీగా అవతరించింది. ఈ విషయాన్ని విక్కీ కౌశల్ తండ్రి, బాలీవుడ్లో దర్శకుడైన శామ్ కౌశల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 600 నాట్అవుట్ అంటూ పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ గణాంకాలను వెల్లడించారు. ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా మార్చడంలో మద్దతు ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా కూడా కీలక పాత్రల్లో నటించారు. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.హిందీలో టాప్- 10 నెట్ వసూళ్లు సాధించిన చిత్రాలు..1 పుష్ప: ది రూల్ - పార్ట్ 2- రూ.812.14 కోట్లు2 స్ట్రీ- 2 - రూ.597.99 కోట్లు3 ఛావా- రూ.585.43 కోట్లు4 జవాన్ -రూ.582.31 కోట్లు5 గదర్ 2- రూ.525.7 కోట్లు6 పఠాన్ -రూ.524.53 కోట్లు7 బాహుబలి 2 ది కన్‌క్లూజన్- రూ.510.99 కోట్లు8 యానిమల్- రూ.502.98 కోట్లు9 కేజీఎఫ్ చాప్టర్ 2- రూ.435.33 కోట్లు10 దంగల్ - రూ.374.43 కోట్లు View this post on Instagram A post shared by Sham Kaushal (@shamkaushal09) -
సన్నీ డియోల్ జాట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సెంచరీ!
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం జాట్(Jaat Movie). ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించారు. తెలుగు సినిమా కథతో తెరకెక్కించడంతో అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ సినిమాల విడుదలైంది. ఈనెల 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.తాజాగా ఈ మూవీ వసూళ్లను మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ విడుదలైన 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.102 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ట్వీట్ చేసింది. ఈ మార్క్ చేరుకునేందుకు దాదాపు 11 రోజులు పట్టింది. తొలిరోజు కేవలం రూ.11 కోట్లకే పరిమితమైన జాట్ .. నాలుగు రోజులైనా యాభై కోట్ల మార్క్ దాటలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో కేవలం రూ.32.20 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లో కేవలం రూ.49.3 కోట్లకు పైగా వసూళ్లకే పరిమితమైంది. కాగా.. ఈ చిత్రం విలన్‌గా రణ్‌దీప్ హుడా నటించారు. The celebration of mass commercial cinema. A feast for the Single Screens continues 💥💥#JAAT collects 102.13 CRORES GROSS WORLDWIDE ❤🔥Book your tickets for the MASS FEAST now!▶️ https://t.co/sQCbjZ5zOEStarring Action Superstar @iamsunnydeolDirected by @megopichand… pic.twitter.com/akWwV9tApq— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2025 -
కాజల్ సీన్లు లేపేశారు.. అందుకే సినిమా డిజాస్టర్!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. తన ఖాతాలో వరుసగా డిజాస్టర్లు పడుతున్నాయి. అతడు నటించిన లేటెస్ట్ మూవీ సికందర్ (Sikandar Movie) కూడా బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్ర పోషించింది.కాజల్ సీన్ డిలీట్అయితే సినిమాలో కాజల్ (Kajal Aggarwal) సీన్ డిలీట్ చేశారంటూ నెట్టింట గగ్గోలు వినిపిస్తోంది. ఈ మేరకు ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఏముందంటే.. అత్తింట్లో కాజల్ చనిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను ఎలాగోలా కాపాడతారు. అయితే ఆమె మామ మాత్రం.. చనిపోవడానికి మా ఇల్లే దొరికిందా? అని నిందిస్తారు. ఈ చావేదో పుట్టింట్లో చావు అని శాపనార్థాలు పెడతారు. అప్పుడే అటుగా వెళ్తున్న సల్మాన్ ఇదంతా చూస్తాడు. పెద్ద డైలాగ్ చెప్తాడు. ఆడవారికి కావాల్సింది డబ్బు కాదని, మనమిచ్చే సపోర్ట్ అని చెప్పుకుంటూ పోతాడు.ఇంత చెత్త ఎడిటింగా?ఈ సీన్‌ను ఎక్స్ (ట్విటర్)లో చూసిన అభిమానులు.. 'అదేంటి? ఈ సన్నివేశం సినిమాలో లేదా? అందుకే డిజాస్టర్ అయింది, ఇది ఉండుంటే సినిమాకు ప్లస్సయ్యేది..', 'ఫస్ట్ డే సినిమా చూసినప్పుడు ఈ సన్నివేశాన్ని అలాగే ఉంచినట్లు గుర్తు.. ఇప్పుడు దాన్ని లేపేశారా?', 'జనాలు కచ్చితంగా చూడాల్సిన ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని కట్ చేసి పడేస్తే ఎలా? ఇంత చెత్త ఎడిటింగ్ ఎందుకు?' అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సికందర్ సినిమా విషయానికి వస్తే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 21 రోజుల్లో రూ.110 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. Why was this scene cut from the Film by Editing??@BeingSalmanKhan that was a great and important scene for people to see... WHY THIS BAD EDITING??#Sikandar pic.twitter.com/FpV6zdRwR6— Ldpe414 (@ldpe414) April 20, 2025 చదవండి: బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి -
సైన్యంలోనే కాదు ఇక్కడా హీరోనే.. అక్కపై హీరోయిన్ ప్రశంసలు
పాడుబడ్డ ఇంట్లో చంటిపాప ఏడుపు.. ఆకలిదప్పికలతో ఎంతసేపటినుంచి అలమటిస్తుందో.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) అక్క ఖుష్బూకు ఆమె ఆకలికేకలు, ఆర్తనాదాలు వినిపించాయి. వెంటనే సగానికి పైగా కూలిపోయి ఉన్న ఇంట్లోకి వెళ్లి చూసింది. అక్కడ ఓ చిన్నారి ఒంటరిగా కనిపించింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. ఆకలేస్తే మట్టి తిన్నదో ఏమో.. ముఖమంతా మట్టికొట్టుకుపోయి ఉంది. చిన్నారిని కాపాడిన మేజర్ఆ చిన్నారిని ఖుష్బూ (Major Khushbu Patani) జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి అధికారులకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన జరిగింది. ఇది జరిగిన మరుసటి రోజు ఖుష్బూ.. ఆస్పత్రికి వెళ్లి చిన్నారి పరిస్థితిని సమీక్షించారు. పాపను ఎత్తుకుని ఆడించారు. అలాగే ఓ శుభవార్త కూడా చెప్పారు. పోలీసులు.. ఆ చిన్నారి పేరెంట్స్‌ను కనుగొన్నారని వెల్లడించారు. పేరెంట్స్ చెంతకు పాపఅయితే ఎవరో దుండగులు పాపను కిడ్నాప్ చేశారని, వాళ్లే ఇలా వదిలేసి పోయారని వివరణ ఇచ్చారు. ఇకపై పాపను మిస్ అవుతానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు మీరు చాలా గ్రేట్, పాపను పేరెంట్స్ చెంతకు చేర్చారు అని కామెంట్లు చేస్తున్నారు. ఖుష్బూ సోదరి సైతం.. అక్కా, నువ్వు నిజమైన హీరో అని కామెంట్ చేసింది.అక్క మేజర్, చెల్లెలు హీరోయిన్ఖుష్బూ గతంలో ఇండియన్ ఆర్మీలో పని చేశారు. మేజర్‌గానూ సేవలందించారు. సైన్యంలో తన సేవలకు రిటైర్మైంట్ ప్రకటించిన ఆమె ప్రస్తుతం ఫిట్నెస్ కోచ్‌గా పని చేస్తున్నారు. ఖుష్బూ చెల్లెలు దిశా పటానీ విషయానికి వస్తే.. ఈమె 'లోఫర్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. గతేడాది వచ్చిన ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీలోనూ యాక్ట్ చేసింది. 'ఎంఎస్ ధోని: ద అన్‌టోల్డ్ స్టోరీ', 'ఏక్ విలన్ రిటర్న్స్', 'భాగీ 2', 'భరత్', 'మలంగ్', 'రాధే', 'యోధ' సినిమాలతో పాపులర్ అయింది. ప్రస్తుతం 'వెల్కమ్ టు ద జంగిల్' మూవీలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani)చదవండి: మమ్మల్నే కాదు, మా అమ్మను కూడా.. చాలా డిస్టర్బ్ అయ్యా: విష్ణుప్రియ -
ఆ వయస్సు దాటితే హీరోయిన్గా కష్టమే: దియా మీర్జా ఆసక్తికర కామెంట్స్
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ దియా మీర్జా ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల అవకాశాలపై ఆమె మాట్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గిపోతాయని వెల్లడించింది. పెళ్లి తర్వాత తన కెరీర్ ఎలా ప్రభావితం అయిందో వివరించింది. దాదాపు 25 ఏళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగిన దియా మీర్జా ఇటీవల నాదానియాన్ మూవీలో ఓ పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో ఇబ్రహీమ్ అలీ ఖాన్‌కు తల్లిపాత్రలో నటించింది. అయితే ప్రస్తుతం ఓటీటీల వల్ల కొత్తగా అవకాశాలు వస్తున్నాయని పేర్కొంది. తాను నటించిన 2019 వెబ్ సిరీస్‌ను మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్ల అవకాశాలపై స్పందించారు.దియా మీర్జా మాట్లాడుతూ..' నిజ జీవితంలో మాతృత్వాన్ని స్వీకరించిన తర్వాత సినిమాల్లో ఎంపిక చేసే విధానం మారింది. గత ఐదేళ్లలో నేను నా కొడుకు పుట్టడానికి ముందు.. పుట్టిన తరువాత నేను చేసిన ప్రతి క్యారెక్టర్ అతను చూడాలని కోరుకునే ప్రాజెక్ట్‌లు. కథలను ఎంచుకోవడంలో నా ప్రాధాన్యత అలానే ఉంటుంది. హీరోయిన్లకు వయస్సు, పెళ్లి, మాతృత్వం తర్వాత అవకాశాలపై ప్రభావం ఉంటుంది. నా వయస్సు కారణంగా ఛాన్సులు రావడం లేదని నమ్మడం ప్రారంభించా. చాలా సినీ ఇండస్ట్రీల్లోనూ ఇదే జరుగుతుంది. దాదాపు 35 నుంచి 48 వయస్సు మధ్యలో హీరోయిన్గా అవకాశాలు కష్టమే. ఆ తర్వాత మీరు తల్లి, సోదరి పాత్రలు చేయడం ప్రారంభిస్తారు. కానీ ఓటీటీ వల్ల మహిళలకు అవకాశాలను పెంచిందని' తెలిపింది.దియా మాట్లాడుతూ..' ఈ రోజుల్లో సోషల్ మీడియా ఫాలోయింగ్‌పై విచారం వ్యక్తం చేసింది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక సరికొత్త అర్ధంలేని పని జరుగుతోంది. సోషల్ మీడియాలో వ్యక్తులకున్న పాపులారిటీ ఆధారంగా చాలా మంది నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇది చాలా అన్యాయం. కొందరు అత్యద్భుతమైన ప్రతిభావంతులు సోషల్ మీడియాలో తమ వాయిస్‌ని బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ దాని అర్థం వారికి అర్హత లేదని కాదు. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొత్త సంస్కృతి" అని ఆమె అన్నారు. -
పాడుబడ్డ ఇంట్లో అనాథగా చిన్నారి.. కాపాడిన హీరోయిన్ సోదరి
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) సోదరి ఖుష్బూ (Khushboo Patani) ఆర్మీలో మేజర్‌గా సేవలందించారు. 12 ఏళ్లపాటు దేశానికి సేవ చేసిన ఆమె రెండేళ్ల క్రితం స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఫిట్నెస్ కోచ్‌గా పని చేస్తున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో జనాల హృదయాలను కదిలిస్తోంది.పాడుబడ్డ ఇంట్లో చిన్నారిఉత్తరప్రదేశ్ బరేలీలో నివసిస్తున్న ఖుష్బూ.. ఆదివారం ఉదయం అలా బయటకు నడుచుకుంటూ వెళ్లారు. పాడుబడ్డ ఇంట్లో ఏవో శబ్దాలు వినిపించడంతో లోనికి వెళ్లి చూడగా అక్కడ ఓ చిన్నారి కనిపించింది. నేలపై ఒళ్లంతా మట్టితో ఉన్న ఆ చిన్నారిని చూడగానే ఖుష్బూ మనసు తరుక్కుపోయింది. పసిపాపను ఇలా అనాథను చేసి వదిలేశారేంటని ఆమె బాధపడ్డారు. మీరేం తల్లిదండ్రులు?ఆ పాపాయిని జాగ్రత్తగా తన ఒడిలోకి తీసుకున్నారు. చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుంటే ఆమెను లాలించారు. చివర్లో పాప ముఖాన్ని దగ్గరి నుంచి చూపిస్తూ.. ఈ చిన్నారి గురించి తెలిసినవారు తనను సంప్రదించమని కోరారు. ఈ పసిపాపను పాడుబడ్డ ఇంట్లో వదిలేసిన తల్లిదండ్రులపై ఖుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేం తల్లిదండ్రులు? పాప భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసినందుకు సిగ్గుపడండి అని మండిపడ్డారు.ఇంకా ఎన్నాళ్లీ దారుణాలు..'దేవుడే రక్షణగా నిలబడే వ్యక్తికి ఎవరూ హాని తలపెట్టలేరు. ఈ చిన్నారిని అధికారులకు అప్పగించాం. తను మంచి చేతుల్లోకి వెళ్లేలా చూసుకుంటాను. కచ్చితంగా తన భవిష్యత్తు బాగుంటుంది. మన దేశంలో ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతాయి? దయచేసి ఆడపిల్లల్ని కాపాడండి' అని ఖుష్బూ కోరారు.ప్రభాస్‌తో నటించిన దిశా..ఖుష్బూ చెల్లెలు దిశా పటానీ విషయానికి వస్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో జన్మించిన ఈ బ్యూటీ 'లోఫర్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. గతేడాది వచ్చిన ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీలోనూ యాక్ట్ చేసింది. ఎక్కువగా హిందీ సినిమాలే చేసింది. 'ఎంఎస్ ధోని: ద అన్‌టోల్డ్ స్టోరీ', 'భాగీ 2', 'భరత్', 'మలంగ్', 'రాధే', 'ఏక్ విలన్ రిటర్న్స్', 'యోధ' సినిమాలతో పాపులర్ అయింది. ప్రస్తుతం 'వెల్కమ్ టు ద జంగిల్' మూవీలో నటిస్తోంది. View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) చదవండి: నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. ఆ సినిమా చేయడమే: ప్రియదర్శి -
స్టార్ హీరోకి ఐదేళ్ల తర్వాత హిట్.. కలెక్షన్ ఎంతొచ్చాయంటే?
బాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా పరిస్థితి అస్సలేం బాగోలేదు. మరీ ముఖ్యంగా కొందరు స్టార్ హీరోలు హిట్ ముఖం చూసి చాలారోజులైంది. అలాంటి వారిలో అక్షయ్ కుమార్(Akshay Kumar) ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే ఇతడికి గత ఐదేళ్లలో సరైన హిట్ అన్నదే పడలేదు. ఇన్నాళ్లకు సాలిడ్ సక్సెస్ అందుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: చాలా అసహ్యంగా నటించా.. ఇప్పుడు చూస్తే సిగ్గేస్తుంది: సమంత)అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కేసరి చాప్టర్ 2'(Kesari Chapter 2). గతంలో వచ్చిన దేశభక్తి నేపథ్యంగా వచ్చిన 'కేసరి'కి దీన్ని కొనసాగింపుగా తెరకెక్కించారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ నేపథ్య కథతో రెండో భాగాన్ని తీశారు. ఇందులో అక్షయ్ తో పాటు మాధవన్, అనన్య పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు.ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తొలిరోజు రూ.7.84 కోట్లు సొంతం చేసుకోగా.. రెండో రోజుకి రూ.10.08 కోట్లు వచ్చాయి. మొత్తంగా రెండు రోజుల్లో రూ.17.92 కోట్ల వసూళ్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోకి ఈ కలెక్షన్స్ తక్కువగానే స్టడీగా ఉన్న ఈ వసూళ్లు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఆ సినిమా ఆడలేదని చనిపోదామనుకున్నా..: రాజేంద్రప్రసాద్)కేసరి 2 విషయానికొస్తే.. 19191లో జలియన్ వాలా బాగ్ మరణకాండ జరిగింది. దీనికి కారకుడు అప్పటి పంజాబ్ జనరల్ మైకేల్ డయ్యర్. తన అధికారం ఉపయోగించి ఈ సంఘటన గురించి వార్తాపత్రికల్లో ఎక్కడా రాకుండా మేనేజ్ చేస్తాడు. అలానే బ్రిటీష్ వైస్రాయ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్)తో ఓ కమిషన్ ఏర్పాటు చేసి, తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని జనరల్ డయ్యర్ కోరతాడు.కానీ జలియన్ వాలా బాగ్ ఘటన గురించి అర్థం చేసుకున్న శంకరన్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. జనరల్ డయ్యర్ పై కేసు వేస్తాడు. దీంతో మైకేల్ డయ్యర్ తనని తాను కాపాడుకునేందుకు నెవిల్లే మెక్ కిన్లే (మాధవన్)ని అపాయింట్ చేసుకుంటాడు. మరి జలియన్ వాలా బాగ్ కేసులో శంకరన్ ఎలాంటి వాదనలు వినిపించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: భరించలేని నొప్పితో ఆస్పత్రిలో చేరిన రష్మీ గౌతమ్..) -
ఊర్వశి రౌతేలా నోటి దూల.. అర్చకులు సీరియస్ వార్నింగ్
-
బాలీవుడ్లో బిజీ బిజీ
జాన్ అబ్రహాం సరసన నటించనున్నారట తమన్నా. జాన్ అబ్రహాం హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ బయోగ్రాఫికల్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ తమన్నాను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. దివంగత ముంబై పోలీస్ కమిషనర్ రాజేశ్ మారియా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రాకేశ్‌గా జాన్ అబ్రహాం నటిస్తున్నారు.ఆయన భార్య ప్రీతి మారియాగా తమన్నా కనిపిస్తారట. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల నుకుంటున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే అజయ్ దేవగన్ ‘రేంజర్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు తమన్నా. అర్జున్ కపూర్–వరుణ్‌ధావన్ కలిసి నటించనున్న హిందీ చిత్రం ‘నో ఎంట్రీ 2’లో తమన్నాకు చాన్స్ లభించిందనే టాక్ వినిపిస్తోంది.ఇప్పుడు రాజేశ్ మారియా బయోగ్రాఫికల్ డ్రామాలో చాన్స్ వచ్చిందని టాక్. ఇంకా అజయ్ దేవగన్ ‘రైడ్ 2’లో తమన్నా ‘నిషా’ అనే స్పెషల్ సాంగ్ చేశారు. చూస్తుంటే... ఇలా వరుస అవకాశాలతో తమన్నా హిందీలో బిజీ బిజీగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగులో తమన్నా లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల 2’ ఈ నెల 17న విడుదలైంది. -
ఊర్వశీ రౌతేలా, అర్చకులు మధ్య వివాదం.. క్లారిటీ ఇచ్చిన టీమ్
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) తనకు దక్షిణాదిన గుడి కట్టి తీరాల్సిందేనని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉత్తరాఖండ్‌లో తనకు ఓ గుడి కట్టారని. ఆపై బద్రీనాథ్‌కు దగ్గర్లోనే ఊర్వశి దేవాలయం ఉందని ఒక ఇంటర్వ్యూలో ఆమె కామెంట్ చేశారు. ఎప్పుడూ ఎదో వివాదంలో చిక్కుకునే ఈ బ్యూటీ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై తాజాగా తన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆమె చేసిన కామెంట్స్‌ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని ఊర్వశీ టీమ్ పేర్కొంది.'ఊర్వశీ తన పేరు మీద ఆలయం ఉందని మాత్రమే చెప్పారు. కానీ, అది తన ఆలయమని ఆమె ఎక్కడా చెప్పలేదు. అయితే, కొందరు ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేస్తున్నారు. మీరందరు కూడా మరోసారి ఊర్వశీ మాట్లాడిన వీడియోను చూడండి. అప్పుడు ఆమె మాటలను అర్థం చేసుకుంటారని అందరినీ కోరుతున్నాం. ఢిల్లీ యూనివర్సిటీలో ఊర్వశీ ఫోటోకు దండలు వేసి పూజలు చేస్తారని చెప్పడం నిజమే.. కావాలంటే ఎవరైనా విచారించుకోవచ్చు. ఇప్పటికే పలు ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం కూడా అందుబాటులో ఉన్నాయి. ఆమె వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని అవమానకరమైన కామెంట్లు చేయడం చాలా దారుణం. అందరినీ గౌరవించండి.' అంటూ ఊర్శశీ టీమ్ ఒక పోస్ట్ చేసింది.బద్రీనాథ్‌కు ఎవరైనా వెళితే పక్కనే ఉన్న తన ఆలయాన్ని సందర్శించాలని ఊర్వశీ కోరడంతో బద్రీనాథ్ సమీపంలోని ఆలయాల అర్చకులు భగ్గుమన్నారు. ఊర్వశీ తన వ్యాఖ్యలతో భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు తెలిపారు. ఇలాంటి పద్ధతి ఎంతమాత్రం మంచిది కాదని వార్నింగ్ ఇచ్చారు. బద్రీనాథ్ సమీపంలో ఉన్న బామ్నిలో ఊర్వశీ పేరుతో ఒక ఆలయం ఉన్నమాట వాస్తవమేనని అర్చకులు క్లారిటీ ఇచ్చారు. కానీ, ఆ ఆలయానికీ, ఊర్వశీకి ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు. -
అబ్బాయిలు అస్సలు భరించలేరు: జాన్వీ కపూర్
నెలసరిలో అమ్మాయిలు ఎదుర్కునే ఇబ్బందులు అబ్బాయిలకు అర్థం కావు అంటోంది హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). మన పరిస్థితిని కొంచెమైనా అర్థం చేసుకోరని, మన బాధ వాళ్లకు పట్టదని పేర్కొంది. తాజాగా ఆమె రుతుక్రమం గురించి మాట్లాడుతూ.. పీరియడ్స్ సమయంలో మేమేదైనా చెప్తున్నా.. వాదిస్తున్నా మీరేమంటారో తెలుసా? నెలసరిలో ఉన్నావా? అని కొట్టిపారేస్తారు. నిజంగా మీరు మమ్మల్ని అర్థం చేసుకునేవారే అయితే.. సరే.. కొంచెం సమయం తీసుకో.. నెలసరిలో ఉన్నట్లున్నావ్ అని పద్ధతిగా అడుగుతారు.మీరు భరించలేరుపీరియడ్స్లో ఉన్నప్పుడు మా శరీరంలో హార్మోన్ల అసమతుల్యత జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఎప్పుడు, ఎలా ఉంటామో అర్థం కాదు. మేం అనుభవించే బాధను మీరు అర్థం చేసుకుంటే సంతోషిస్తాం. కానీ కొందరు అస్సలు పట్టించుకోరు. నిజం చెప్తున్నా.. అబ్బాయిలు నెలసరి నొప్పిని, మూడ్ స్వింగ్స్‌ను ఒక్క నిమిషం కూడా భరించలేరు. పురుషులకు పీరియడ్స్ వస్తే ఎలాంటి అణు యుద్ధం జరుగుతుందో ఎవరికి తెలుసు? అని చెప్పుకొచ్చింది.చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీజాన్వీ కపూర్ చివరగా దేవర:పార్ట్ 1 సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె సన్నీ సంస్కారీకి తులసి కుమారి సినిమాతో బిజీగా ఉంది. అలాగే పరమ సుందరి, పెద్ది చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. తెలుగు సినిమా పెద్ది విషయానికి వస్తే.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయనున్నారు.చదవండి: పిట్ట కొంచెం...కలెక్షన్స్ ఘనం.. ఎత్తు 4అడుగులు కలెక్షన్లు -
ప్రియురాలితో అమిర్ ఖాన్ సందడి.. టీమిండియా క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్ కూడా!
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ఇటీవలే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్ గురించి బయటపెట్టాక ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిపోయారు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో ఏడాది కాలంగా డేటింగ్లో ఉన్నట్లు ఓ తన బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వెల్లడించారు. దాదాపు 60 ఏళ్ల వయసులో డేటింగ్ ఉన్నానంటూ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చారు.అయితే తాజాగా అమిర్ ఖాన్, తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసి సందడి చేశారు. వారితో పాటు టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న సోఫీ షైన్ కూడా ఉన్నారు. చైనాలో జరిగిన రెండో మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్లో వీరు కనిపించారు. వీరితో పాటు అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కూడా ఉన్నారు.గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్కాగా.. ఇటీవలే తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌కు మీడియాను పరిచయం చేశాడు. వీరిద్దరూ దాదాపు 25 సంవత్సరాల క్రితం కలుసుకున్నారు. బెంగళూరులో నివసించే గౌరికి గతంలోనే వివాహమై ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. తాజాగా ఈ జంట చైనాలోని మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్లో జంటగా కనిపించారు. కాగా.. అమిర్ ఖాన్ అంతకుముందు డైరెక్టర్ కిరణ్ రావుతో జూలై 2021లో విడాకులు తీసుకుంటున్నారు. అంతకుముందే రీనా దత్తాను పెళ్లాడిన ఆయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అమీర్ సితారే జమీన్ పర్ మూవీలో కనిపించనున్నారు. చివరిసారిగా లాల్ సింగ్ చద్దాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడంతో విఫలమైంది. -
నటుడికి క్యాన్సర్ నాలుగో స్టేజ్.. ఆదుకోమని వేడుకోలు..
బుల్లితెర నటుడు విభు రాఘవ్ (VIBHU k RAGHAVE) పెద్ద పేగు క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ప్రస్తుతం అతడికి క్యాన్సర్ నాలుగో స్టేజీలో ఉంది. దీనికి ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడికి చేతనైనంత సాయం చేద్దామని పిలుపునిచ్చాడు హిందీ బిగ్‌బాస్ 18 విన్నర్, నటుడు కరణ్ వీర్ మెహ్రా. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు. మన స్నేహితుడు విభుకి క్యాన్సర్ నాలుగో స్టేజీలో ఉంది. ముంబైలోని టాటా ఆస్పత్రిలో తను చికిత్స పొందుతున్నాడు. దయచేసి..ప్రస్తుతం కీమోథెరపీ జరుగుతోంది. చికిత్స కోసం పెద్దమొత్తంలో డబ్బు ఖర్చవుతోంది. దయచేసి మీకు తోచినంత సాయం చేయండి. ఇంతకుముందు కూడా మీరు సాయం చేశారు. మరోసారి కూడా సాయం చేసేందుకు ముందుకువస్తారని ఆశిస్తున్నాను. తన ట్రీట్మెంట్ సజావుగా సాగేందుకు తోడ్పడండి. అలాగే తను కోలుకోవాలని ప్రార్థించండి అని కోరాడు. అనుపమ సీరియల్ నటి అనేరి విజాని సైతం.. విభుకు ఆర్థిక సాయం చేయమని అర్థించింది.ఒక్కరోజులో జీవితమే తలకిందులుకాగా 2022లో రాఘవ్ క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించాడు. "నేను ఆస్పత్రిలో ఉన్నాను. నా పరిస్థితి మీకందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. కొద్ది రోజులుగా నా ఆరోగ్యం ఏమీ బాగోలేదు. రెండువారాల క్రితం నాకు క్యాన్సర్ నాలుగో దశలో ఉందని తెలిసింది. ఇది నేను ఊహించలేదు. ఒక్క రోజులో నా జీవితమే తలకిందులైంది. ధైర్యంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను" అని పోస్ట్ పెట్టాడు. విభు.. సవ్రీన్ గుగ్గల్: టాపర్ ఆఫ్ ద ఇయర్ సీరియల్లో నటించాడు. రిథమ్, పిచ్ఫోర్క్ సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Aneri.Vajani (@vajanianeri) View this post on Instagram A post shared by VIBHU k RAGHAVE ✨ विभु राघव (@vibhuzinsta) -
ఎవడ్రా కూసేది.. 2028 వరకు ఖాళీ లేదిక్కడ.. ఇచ్చిపడేసిన అనురాగ్ కశ్యప్
బాలీవుడ్ పరిస్థితి అధ్వాణ్నంగా తయారైందని.. అక్కడ తాను ఉండలేనన్నాడు దర్శకనటుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap). అందుకే హిందీ ఇండస్ట్రీని వీడుతున్నట్లు ప్రకటించి దక్షిణాది చిత్రపరిశ్రమకు షిఫ్ట్ అయిపోయాడు. ఇది చూసిన కొందరు సినిమాలే వదిలేస్తున్నాడేమో.. రిటైర్మెంట్ అని నేరుగా చెప్పకుండా ఇలా ఏదేదో వాగుతున్నాడు అని విమర్శించారు.షారూఖ్ కంటే బిజీదీనిపై అనురాగ్ కశ్యప్ ఎక్స్ (ట్విటర్) వేదికగా కౌంటర్ ఇచ్చాడు. నేను సిటీ మారానంతే.. సినిమాలు మానలేదు. తిక్కతో అన్నీ వదిలేసి వెళ్లిపోయాననుకునేవాళ్లకు నేను చెప్పేదేంటంటే.. ప్రస్తుతం నేను షారూఖ్ ఖాన్ కంటే బిజీగా ఉన్నాను. (అంతే బిజీగా ఉండాలి కూడా.. కాకపోతే ఆయనంత డబ్బు సంపాదించను) 2028 వరకు నా డేట్స్ ఖాళీగా లేవు. చేతినిండా సినిమాలుప్రస్తుతం డైరెక్టర్‌గా నా చేతిలో ఐదు సినిమాలున్నాయి. మూడు ఈ ఏడాది.. మరో రెండు వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్తాయి. క్షణం కూడా ఖాళీగా లేనంత పని దొరికింది. దీనివల్ల రోజుకు మూడు ప్రాజెక్టులైనా తిరస్కరించాల్సి వస్తోంది. కాబట్టి మీరు నోరు మూసుకోండి అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్.. మహారాజ, విడుదల:2, రైఫిల్ చిత్రాలతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఇతడు డకాయిట్ సహా పలు సినిమాలు చేస్తున్నాడు. I have relocated cities.i have not left filmmaking . For all the people who think I am frustrated and gone . I am here and I am busier than shah rukh khan ( I have to be, I don’t make As much money😂) I don’t have dates until 2028. I have five directorial hopefully coming out…— Anurag Kashyap (@anuragkashyap72) April 17, 2025 చదవండి: ప్రియాంక చోప్రా భర్తతో మహేశ్ ఫ్యామిలీ.. థాంక్స్ చెప్పిన నమ్రత -
మొన్నే సినిమా రిలీజ్.. ఇప్పుడు టీమ్ పై పోలీస్ కేసు
వారం క్రితం థియేటర్లలో రిలీజైన సినిమాకు వరస షాకులు తగులుతూనే ఉన్నాయి. తొలుత తమిళనాడులో వ్యతిరేకత రాగా.. తర్వాత క్రైస్తవుల నుంచి వచ్చింది. ఇప్పుడు ఏకంగా మూవీ టీమ్ అందరిపై పోలీస్ కేసు(FIR On Jaat Team) నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలేమైంది?తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన లేటెస్ట్ సినిమా 'జాట్'(Jaat Movie). బాలీవుడ్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) నటించాడు. టాలీవుడ్ యాక్టర్స్ జగపతిబాబు, రమ్యకృష్ణ, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు వివాదాలు మాత్రం తప్పట్లేదు. తమిళుల హక్కుల కోసం పోరాడిన ఎల్టీటీఈని ఓ ఉగ్రవాద సంస్థగా చూపించారని కొందరు తమిళియన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చర్చిల కొన్ని సన్నివేశాలు తీయడంపై పలు క్రైస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మూవీని బ్యాన్ చేయాలని కోరాయి.ఇప్పుడు మనోభావాలు దెబ్బతీశారని జాట్ మూవీ టీమ్ పై.. పంజాబ్ లోని జలంధర్ లో పోలీస్ కేసు పెట్టారు. వికల్ప్ గోల్డ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రంలో శిలువను కించపరిచేలా చూపించారని, క్రైస్తవుల పర్వదినాలైన గుడ్‌ప్రైడే, ఈస్టర్ వచ్చే నెలలో ఈ మూవీని ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేశారని వికల్ప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి విక్రమ్ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
ఆడవాళ్లు కనిపిస్తే వదలడు.. అలాంటి నటుడితో నన్ను..: టాలీవుడ్ హీరోయిన్
బాలీవుడ్ నటి అమృత అరోరా సోదరి, నటి ప్రీతిక రావు (Preetika Rao).. ఓ నెటిజన్‌పై భగ్గుమంది. వద్దంటున్నా వినకుండా నటుడు హర్షద్ అరోరా (Harshad Arora)తో కలిసున్న వీడియోను పదేపదే షేర్ చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఒకసారి చెప్తే అర్థం కాదా? అంటూ విరుచుకుపడింది. హర్షద్ అరోరా, ప్రతీక రావు బెయింటెహా సీరియల్లో కలిసి నటించారు. అందులోని సీన్లను ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అవి ప్రీతికకు నచ్చలేదు. వాటిని తీసేయమని కోరింది. దీంతో సదరు అభిమాని.. పదేళ్ల క్రితం మీరు అతడితో కలిసి నటించినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు? అని ప్రశ్నించాడు. బుర్ర లేదా? చెప్తే అర్థం కాదా?అందుకామె.. ఓరి నీ తెలివితక్కువవాడా.. నీకేం చెప్పినా అర్థం కాదు. కొన్ని సన్నివేశాలు సడన్‌గా చెప్పి చేయమంటారు. అందుకే నేను టీవీలో అలాంటి సీన్లలో నటించాను. అంతమాత్రానికి ఆ సీన్ వీడియోలను పదేపదే షేర్ చేయాల్సిన అవసరం ఏంటి? నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది. ఇండస్ట్రీలో కొత్తగా ఎవరొస్తే వారితో పడక పంచుకునే వ్యక్తి తను.. అలాంటివాడితో కలిసి నటించిన వీడియోలు పోస్ట్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవే.. నా మనసుకు నచ్చని పని చేస్తున్నావు. అనుభవిస్తావ్..అందుకు కర్మ అనుభవిస్తావ్. బెయింటెహా సీరియల్లో 95 శాతం వరకు సాధారణ సీన్లే ఉంటాయి. కేవలం 5 శాతం మాత్రమే ఎక్కువ సాన్నిహిత్యంతో ఉన్న సన్నివేశాలున్నాయి. నా మాట లెక్క చేయకుండా వాటిని షేర్ చేస్తూనే ఉన్నావ్.. ఇంతకింతా అనుభవిస్తావ్ అని శపించింది. ఈ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో హిట్ సీరియల్బెయింటెహా సీరియల్ 2013లో ప్రసారమైంది. ఇందులో ప్రీతిక- హర్షద్ జంటగా నటించారు. అప్పట్లో ఈ ధారావాహిక విజయవంతంగా కొనసాగింది. తర్వాత ప్రీతిక.. లవ్ కా హై ఇంతేజార్, లాల్ ఇష్క్ వంటి సీరియల్స్ చేసింది. తెలుగులో 'ప్రియుడు' సినిమాలో వరుణ్ సందేశ్ సరసన కథానాయికగా యాక్ట్ చేసింది. తమిళంలో 'చిక్కు బుక్కు', కన్నడలో 'రెబల్' సినిమాలు చేసింది. హర్షద్.. ఘమ్ హై కిసీకే ప్యార్ మే, సాసురాల్ సిమర్ కా, డల్హీజ్, దేవోంకే దేవ్.. మహదేవ్ వంటి సీరియల్స్‌లో నటించాడు.చదవండి: 'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ -
బద్రీనాథ్ పక్కనే నా పేరుపై గుడి.. నాకు పూజలు, పూలదండలు: ఊర్వశి
ఊర్వశి రౌతేలా (Urvashi Rautela).. ఐటం సాంగ్స్‌తోనే కాదు ఆసక్తికర వ్యాఖ్యలతోనూ నిత్యం వార్తల్లో ఉంటుంది. ఆ మధ్య బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి గురించి మాట్లాడమంటే.. తన వేలికున్న డైమండ్ రింగ్ చూపిస్తూ షోఆఫ్ చేసింది. తన తీరుపై విమర్శలు రావడంతో సారీ చెప్పింది. తర్వాత రామ్‌చరణ్-కియారాల గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవడం, తను ఐటం సాంగ్‌తో పాటు చిన్న పాత్ర చేసిన డాకు మహారాజ్ హిట్టవడంతో సంతోషం తట్టుకోలేకపోయింది. నేనే గొప్ప అన్నట్లుగా..చూశారా? నా సినిమా సూపర్ హిట్టయింది. కియారా నటించిన గేమ్ ఛేంజర్ షెడ్డుకు వెళ్లిపోయింది. ఇందులో నా తప్పయితే లేదు సుమీ.. సినిమా బాగోలేకపోతే జాకీలు పెట్టి లేపినా జనాలు లెక్కచేయరు అని కామెంట్లు చేసింది. కొద్ది రోజుల క్రితం హీరో షారూఖ్ ఖాన్ తర్వాత సినిమా కోసం భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసేది నేనే.. హాలీవుడ్ వాళ్లు కూడా వారి సినిమా కోసం నన్నే ప్రమోషన్స్ చేయమన్నారు అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంది.ఇక్కడో గుడి.. సౌత్‌లో కూడా ఉంటే..ఇప్పుడేకంగా తనకు దక్షిణాదిన గుడి కట్టి తీరాల్సిందే అని చెప్తోంది. తాజాగా ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో నాకు ఓ గుడి కట్టారు. బద్రీనాథ్‌కు దగ్గర్లోనే ఊర్వశి దేవాలయం ఉంది. జనాలు అక్కడికి వెళ్లి నా ఆశీర్వాదం తీసుకుంటారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు నన్ను భక్తిగా పూజ చేసి నా ఫోటోకు దండలు కూడా వేస్తారు. నన్ను ఆ గుడిలో దండమామై అని పిలుస్తుంటారు. పనిలో పనిగా దక్షిణాదిన కూడా నాకో గుడి కడితే బాగుంటుంది అని పేర్కొంది. ఊర్వశి.. చివరగా సన్నీడియోల్ 'జాట్' సినిమాలో సారీ బోల్ పాటలో కనిపించింది.చదవండి: ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో.. -
నలుగురికిపైగా హీరోయిన్లు.. అందులో తమన్నా కూడా!
బాలీవుడ్ ‘నో ఎంట్రీ’ సీక్వెల్లో తమన్నా (Tamannaah Bhatia)కు ఎంట్రీ లభించిందని సమాచారం. వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, దిల్జీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించనున్న హిందీ చిత్రం ‘నో ఎంట్రీ 2’. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, ఫర్దీన్ ఖాన్, బిపాసా బసు, ఈషా డియోల్ ప్రధాన పాత్రధారులుగా అనీస్ బాజ్మి దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన హిందీ బడ్డీ రొమాంటిక్ కామెడీ మూవీ ‘నో ఎంట్రీ’. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘నో ఎంట్రీ 2’ సినిమా తీస్తున్నారు అనీస్ బాజ్మీ, బోనీ కపూర్. నలుగురికి పైగా హీరోయిన్లు..ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నలుగురు కథానాయికలకు పైగా నటిస్తారని టాక్. వీరిలో ఇప్పటికి తమన్నా, అదితీ రావ్ హైదరీలను సంప్రదించారని, కథ నచ్చడంతో ఈ కథానాయికలు ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, వీలైతే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని బీటౌన్ టాక్. ఈ విషయాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.చదవండి: నేనే అమ్మాయినైతే.. శివరాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు -
విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే.. నోరు మూయించిన సోనాక్షి
సోనాక్షి సిన్హ (Sonakshi Sinha)- జహీర్ ఇక్బాల్ (Zaheer Iqbal).. ప్రేమించుకున్నారు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. ఈ సంతోషాన్ని చూసి కొందరు జనాలకు కళ్లు మండుతున్నాయి. కులమతాలకు అతీతమైనది ప్రేమ అని వీరు చాటి చెప్తుంటే వాళ్ల కడుపు మండిపోతోంది. ఆ కడుపు మంట చల్లార్చుకునేందుకు వీరి కాపురంలో నిప్పులు పోసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీళ్లు విడిపోవాలని ఎదురుచూస్తున్నారు. ఏ పోస్టు పెట్టినా విడాకుల గురించే కామెంట్లు చేస్తున్నారు. కచ్చితంగా విడాకులు తీసుకుంటాంతాజాగా ఆమె పోస్ట్ కింద ఓ వ్యక్తి మీరు విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే ఉంది అని శపించాడు. అది చూసిన సోనాక్షికి సహనం చచ్చిపోయింది. అవునా.. ముందు మీ అమ్మానాన్నకు విడాకులు అవనీ.. తర్వాత కచ్చితంగా మేము తీసుకుంటాం. ఒట్టు అని వ్యంగ్యంగా రిప్లై ఇచ్చింది. అది చూసిన జనాలు.. ఇలాంటివాళ్లకు ఇలాగే గడ్డిపెట్టాలని సోనాక్షిని సపోర్ట్ చేస్తున్నారు. సోనాక్షి, జహీర్ ఇక్బాల్ ఏడేళ్లపాటు ప్రేమించుకున్నారు. 23 జూన్, 2024న పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి వీరిపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ట్రోలింగ్‌పై హీరోయిన్ తండ్రి ఫైర్దీనిపై సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హ స్పందిస్తూ.. పనీపాటా లేక ఖాళీగా తిరుగుతున్న అందరికీ ఇదొక్కటే పనుంది. నా కూతురు రాజ్యాంగవిరుద్ధంగా, చట్టాన్ని అతిక్రమించే విధంగా ఏ తప్పూ చేయలేదే? పెళ్లనేది ఇద్దరు వ్యక్తులు తీసుకునే నిర్ణయం. వారి మధ్యలోకి దూరేందుకు ఎవరికీ అర్హత లేదు. వాళ్లను విమర్శించేవాళ్లకు నేనొక్కటే చెప్పదల్చుకున్నా.. వెళ్లి మీ పని చూసుకోండి.. మీ జీవితాన్ని ముందు చక్కదిద్దుకోండి అని చెప్పుకొచ్చాడు.చదవండి: రాజ్‌తరుణ్ పేరెంట్స్‌ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య -
ఆరెంజ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న హీరోయిన్ దిశ పటాని (ఫొటోలు)
-
సమంత 'సిటాడెల్ 2' లేనట్లే.. ప్రకటించిన అమెజాన్
ఏ మాయ చేశావె సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది సమంత (Samantha Ruth Prabhu). తొలి చిత్రంలో అమాయకంగా కనిపించిన సామ్ తర్వాత యాక్షన్, ఛాలెంజింగ్ రోల్స్ చేసింది. 25 ఏళ్ల కెరీర్లో ఆమె ఎక్కువ కష్టపడ్డది సిటాడెల్ కోసమే! ఓపక్క మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పుడే సిటాడెల్లో యాక్షన్ సిరీస్ పూర్తి చేసింది.ఇండియన్ సిటాడెల్ :హనీ బన్నీలో వరుణ్ ధావన్- సమంతహాలీవుడ్ సిరీస్‌కు ఇండియన్ వర్షన్నిజానికి ఇది ఒరిజినల్ కాదు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటించిన అమెరికన్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel)కు ఇది ఇండియన్ వర్షన్‌గా రూపొందింది. ఒరిజినల్ వర్షన్లో హాలీవుడ్ స్టార్ రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జంటగా నటించారు. న్యూటన్ థామస్- జెస్సికా ద్వయం రూపొందించారు. దీని ఇండియన్ వర్షన్ సిటాడెల్: హనీ బన్నీ (Citadel: Honey Bunny)లో వరుణ్ ధావన్, సమంత లీడ్స్ రోల్లో నటించగా రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇది గతేడాది నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది.హాలీవుడ్ సిటాడెల్లో రిచర్డ్ మాడెన్- ప్రియాంక చోప్రాఇకపై లేనట్లేతాజాగా దీనికి సీక్వెల్ నిలిపివేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. సిటాడెల్ ఇండియన్ వర్షన్‌తో పాటు ఇటాలియన్ వర్షన్ (సిటాడెల్: డయానా) సీక్వెల్స్ ఆపేసి, బదులుగా వీటిని మాతృకలో విలీనం చేయనున్నారు. దీని గురించి అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. సిటాడెల్: హనీ బన్నీ, సిటాడెల్: డయానా సిరీస్‌లను కొనసాగించడం లేదు. దానికి బదులుగా వీటిని మాతృకలో విలీనం చేసి సిటాడెల్ సెకండ్ సీజన్‌ను ముందుకు తీసుకొస్తాం. 2026లో రెండో సీజన్‌ను ముందుకు తీసుకొస్తాం అని పేర్కొన్నారు.చదవండి: ఘనంగా నటి అభినయ పెళ్లి.. ఫోటో చూశారా? -
దక్షిణాది సినిమాలు అందుకే హిట్.. అదుర్స్ నటుడు ఆసక్తికర కామెంట్స్
బాలీవుడ్ సీనియర్ నటుడు మహేశ్ మంజ్రేకర్ ప్రస్తుతం సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ మూవీ అదుర్స్‌లో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో తనదైన నటన, కామెడీతో అలరించారు. బాలీవుడ్‌లోనూ పలువు సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం మరాఠీ చిత్రంలో నటిస్తున్నారు. 'దేవ్మనుస్' అనే మరాఠీ చిత్రంలో కనిపించనున్నారు. తేజస్ ప్రభ విజయ్ దేవస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారాయన. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహేశ్ మంజ్రేకర్ సినిమా కంటెంట్ గురించి మాట్లాడారు. ఇప్పుడున్న సినిమాల్లో కంటెంట్ పరంగా చూస్తే కేవలం మరాఠీ, మలయాళ ఇండస్ట్రీలు మాత్రమే సరైన కంటెంట్‌ను అందిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మిగిలిన ఇండస్ట్రీలన్నీ సినిమా అంటే కమర్షియల్ కోణంలోనే చూస్తున్నాయని తెలిపారు. మరాఠీ సినిమాలో కథలు బాగున్నప్పటికీ.. పోటీ, స్థాయి లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతోందని అన్నారు.మరాఠీ చిత్రాలను వారి సొంత రాష్ట్రంలో కూడా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. మహారాష్ట్ర వందశాతం హిందీని అర్థం చేసుకోవడం కూడా ఇక్కడ అతిపెద్ద సమస్య అని వెల్లడించారు. దీని వల్ల ప్రేక్షకులు భారీ బడ్జెట్ హిందీ చిత్రాల వైపే మొగ్గు చూపుతున్నారని వివరించారు. మలయాళం, మరాఠీ సినీ పరిశ్రమలు అర్ధవంతమైన కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయని వెల్లడించారు.దక్షిణ భారత సినిమాల విషయానికొస్తే.. వారి ప్రేక్షకులు భారీగా ఉంటారని.. అందువల్లే వారి కలెక్షన్లు భారీగా ఉంటాయని మహేశ్ అన్నారు. అందుకే వారు హిందీ సినిమాతో సమానంగా.. భారీ బడ్జెట్ సినిమాను నిర్మించగలరని అన్నారు. అందువల్ల వారి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయని తెలిపారు. మరాఠీ సినిమా కూడా అదే స్థాయికి చేరుకుని పాన్ ఇండియాలో విడుదల చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరాఠీలో ఎక్కువ సినిమాలు రావడం కంటే.. నాణ్యమైన చిత్రాలు వస్తే మరింత బాగుంటుందని అన్నారు. మారుతున్న ప్రేక్షకుల ప్రాధాన్యతలను బాలీవుడ్ చిత్రాలే కాదు.. సౌత్ సినిమాలు కూడా గుర్తించడం లేదన్నారు. ప్రభాస్ చివరిగా వచ్చిన సినిమా అది అస్సలు పని చేయలేదు. నేను ప్రభాస్, శ్రద్ధా కపూర్లతో చేసిన సాహో మూవీ కూడా హిట్ కాలేదని గుర్తు చేసుకున్నారు.పాన్-ఇండియా సినిమాలు విజయం సాధించడానికి గల కారణాలను మహేశ్ మంజ్రేకర్ వివరించారు. దక్షిణ భారత చిత్రాలన్నీ పాన్-ఇండియాగా వస్తున్నాయని.. నేను అదే ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. గత పదేళ్లలో కేవలం ఎనిమిది సినిమాలు మాత్రమే తీశారని గుర్తు చేశారు. అంటే ఏడాదికి ఒక్క సినిమా కూడా కాదు. అందులో మూడు కన్నడ, కేజీఎఫ్, కేజీఎఫ్ 2, పుష్ప-1, పుష్ప-2, కాంతార, ఆర్ఆర్ఆర్ అని వెల్లడించారు. మరాఠీ సినిమాల్లో కంటెంట్ ఉన్నప్పటికీ హిందీ, తమిళం, తెలుగు, కర్ణాటక, బెంగాలీ, పంజాబీల చిత్రాల నుంచి పోటీని ఎదుర్కొంటుందని మహేశ్ మంజ్రేకర్ అన్నారు. కానీ మేము దాని నుండి బయటపడతామమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.. -
మరో కాంట్రవర్సీలో 'జాట్'.. ఏకంగా బ్యాన్ చేయాలంటూ
ఒకప్పుడు సినిమాలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాసరే పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా దెబ్బకు ఎప్పుడు ఎవరికీ మనోభావాలు దెబ్బతింటాయో తెలియని పరిస్థితి. తాజాగా రిలీజైన జాట్ సినిమాకు ఇలానే పరిస్థితి ఎదురైంది. మొన్న తమిళ ప్రేక్షకులు హర్ట్ కాగా.. తాజాగా పలు క్రైస్తవ సంఘాలు సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.జాట్ సినిమాలోని ఓ సన్నివేశంలో విలన్ రణ్ దీప్ హుడా.. గుండాయిజం, బెదిరింపు లాంటివి చేస్తాడు. అలానే రక్తపాతానికి సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటిపై పలు క్రైస్తవ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. రెండు రోజుల్లో చర్యలు తీసుకోవాలని, అలానే సినిమాని బ్యాన్ చేయాలని హెచ్చరిస్తున్నాయి.(ఇదీ చదవండి: 'పుష్ప 2'కి నా మ్యూజిక్ పెట్టుకోలేదు.. అయినా బాధ లేదు) కొన్నిరోజుల క్రితం తమిళ ప్రేక్షకుల నుంచి నిరసన వినిపించింది. సినిమాలోని కొన్ని సీన్లలో శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన ఎల్టీటీఈని ఓ ఉగ్రవాద సంస్థగా చూపించారని కొందరు తమిళియన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రిలీజై వారం రోజులు కూడా కాకముందే వరస వివాదాల్లో చిక్కుకోవడం 'జాట్' వార్తల్లో నిలుస్తుంది. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. 6 రోజుల్లో రూ65.45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: స్టార్ హీరో డ్రగ్స్ మత్తు.. నటిపై అసభ్యకర కామెంట్స్) -
MAMI ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
బుల్లితెర జంటపై విడాకుల రూమర్స్.. నటుడు ఏమన్నారంటే?
సినీ తారలపై రూమర్స్ రావడం ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా డేటింగ్, బ్రేకప్, విడాకుల వార్తలు ఎక్కువ వింటుంటాం. ప్రస్తుత సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాటికి కొదువే లేదు. అయితే ఇలాంటి సినీ తారలు కూడా పెద్దగా పట్టించుకోరు. అలా ఓ బుల్లితెర జంటపై ఇటీవల కొన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్లో ప్రముఖ జంటగా గుర్తింపు తెచ్చుకున్న వివేక్ దహియా, దివ్యాంక త్రిపాఠి త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి.ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విడాకుల రూమర్స్‌పై నటుడు వివేక్ దహియా స్పందించారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చారు. అవన్నీ కేవలం ఊహగానాలేనని కొట్టిపారేశారు. వాటిని చూసి తాము నవ్వుకుంటున్నామని తెలిపారు. తన మ్యూజిక్ వీడియో ఇష్టం లాంఛ్ సందర్భంగా మీడియాకు క్లారిటీ ఇచ్చారు.వివేక్ దహియా మాట్లాడుతూ..' అలాంటి వార్తలు చూసి నేను, దివ్యాంక నవ్వుకుంటాం. ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తాం. ఇంకా చాలాసేపు మాట్లాడుకోవాలనుకుంటే అలాగే పాప్‌కార్న్ ఆర్డర్ చేసుకుని మరీ తింటాం. నేను కూడా యూట్యూబ్ వ్లాగింగ్ చేస్తా. కాబట్టి క్లిక్ బైట్ ఎలా పని చేస్తుందో నాకు బాగా తెలుసు. ఇవన్నీ నాకు బాగా అర్థమవుతాయి. మీరు ఏదైనా సంచలనాత్మకంగా ఉంచితేనే ప్రజలు వాటిని చూస్తారు. కానీ అందులో అసలు నిజం ఉండదు. అలాంటి అవాస్తవాలను మనం ప్రోత్సహించకూడదు' అని అన్నారు.కాగా.. ఫీల్ గుడ్ ఒరిజినల్స్ బ్యానర్‌పై సురభి చందనా నిర్మించిన 'ఇష్టం' అనే కొత్త మ్యూజిక్ వీడియోలో నటుడు అనైరా గుప్తా సరసన వివేక్ దహియా నటించారు. ఈ వీడియో ఏప్రిల్ 14న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో వివేక్ మాట్లాడారు. అంతకుముందు వివేక్ దహియా, నటి దివ్యాంక త్రిపాఠి 'యే హై మొహబ్బతే' సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత డేటింగ్ ప్రారంభించారు. అనంతరం 2016లో వివాహం చేసుకున్నారు. -
విజయ్ జస్ట్ టైర్-2 హీరో.. ఇక్కడ దేవుడిలా ట్రీట్ చేస్తున్నారు!
హీరో విజయ్ దేవరకొండకు హిట్ పడి చాలాకాలమైపోయింది. 'అర్జున్ రెడ్డి' తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు గానీ సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. గత రెండు చిత్రాలు లైగర్, ద ఫ్యామిలీ స్టార్ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ప్రస్తుతం 'కింగ్ డమ్' మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ మధ్య కాలంలో మీడియా కంట కూడా విజయ్ పడలేదు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)అలాంటిది ఇప్పుడు ఓ బాలీవుడ్ జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్.. విజయ్ దేవరకొండపై తీవ్ర విమర్శలు చేశాడు. ఇతడి పట్ల హిందీ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడూతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.'లైగర్ మూవీ ట్రైలర్ లాంచ్ చూసి నేను చాలా అప్ సెట్ అయ్యాను. ఎందుకంటే మన మీడియా(బాలీవుడ్) విజయ్ దేవరకొండని సూపర్ స్టార్ లా చూపిస్తోంది. సౌత్ కి వెళ్తే కేవలం టైర్-2 హీరో మాత్రమే. అతడేం సూపర్ స్టార్ కాదు. మన జర్నలిస్ట్ ఒకరు.. మన దగ్గర సల్మాన్ ఉంటే అక్కడ విజయ్ ఉన్నాడని అన్నారు. విజయ్ 12 సినిమాలు తీస్తే అందులో 9 ఫ్లాప్స్. ఓ మూడు హిట్స్ ఉన్నాయంతే'(ఇదీ చదవండి: నా కళ్లు అందుకే ఎర్రగా ఉన్నాయ్.. రష్మిక వీడియో)'లైగర్ సినిమా కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పారు. కానీ ఫుల్ రన్ లో రూ.20 కోట్లు వచ్చాయి. ఇక్కడి పీఆర్స్ విజయ్ దేవరకొండ పెద్ద బ్రాండ్, స్టార్ అన్నట్లు చూపించారు. అలాంటిది ఇతడిని సల్మాన్ ఖాన్ తో పోలుస్తున్నారు. సల్మాన్ ఫ్లాప్ సినిమా కూడా రూ.100 కోట్లు వసూలు చేసింది' అని సదరు జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్ చెప్పుకొచ్చాడు.మరి ఉన్నట్లుండి ఈ బాలీవుడ్ జర్నలిస్ట్ విజయ్ దేవరకొండపై ఎందుకు పడ్డాడనేది అర్థం కాలేదు. విమర్శలు ఘాటుగా ఉన్నప్పటికీ ఇందులో కొన్ని నిజాలు లేకపోలేదు. మరి 'కింగ్ డమ్'తో హిట్ కొట్టి, ఇలాంటోళ్ల నోళ్లు విజయ్ దేవరకొండ మూయిస్తాడా లేదా అనేది మరికొన్నిరోజుల్లో తెలుస్తుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)I was shocked when our media hyped #VijayDeverakonda like a demiGod.He’s a tier 2 hero in the south, not a superstar. #Liger made - 20cr, yet he was compared to #SalmanKhan, whose flops still earn 100cr.— Pink Villa Himesh Mankad pic.twitter.com/yRG1eSNYKx— Telugu Chitraalu (@TeluguChitraalu) April 13, 2025 -
నా కళ్లు అందుకే ఎర్రగా ఉన్నాయ్.. రష్మిక వీడియో
రష్మిక(Rashmika Mandanna) ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. తెలుగుతో పాటు హిందీలోనూ వరస సినిమాలు చేస్తోంది. గతేడాది చివర్లో 'పుష్ప 2'తో(Pushpa 2 Movie) బ్లాక్ బస్టర్ కొట్టింది. కానీ రీసెంట్ గా 'సికిందర్'తో డిజాస్టర్ అందుకుంది. ప్రస్తుతం 'థామా' అనే హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఈ బ్యూటీ క్యూట్ వీడియో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)గత కొన్నిరోజులుగా నైట్ షూట్స్ లో పాల్గొంటున్న రష్మిక.. ఇప్పుడు దాని గురించి చెప్పింది. రోజూ ఇలా రాత్రుళ్లు చిత్రీకరణ వల్ల కళ్లన్నీ ఎర్రగా మారాయని చూపించింది. ఈ వీడియో ఊరికే చేశానని, అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్పుకొచ్చింది. పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసేందుకు ఇలా చేశానని క్లారిటీ ఇచ్చింది.కొన్నిరోజుల క్రితం ఒమన్ దేశంలో రష్మిక తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. అయితే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కూడా రష్మికతో పాటు అక్కడికి వెళ్లాడని, వీరిద్దరూ వేర్వేరుగా పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తుంటే అర్థమవుతుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ కూడా చేశారు. మరి వీళ్లిద్దరూ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో ఏంటో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
సల్మాన్‌ను లేపేస్తాం అంటూ వార్నింగ్.. పోలీసుల అదుపులో నిందితుడు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)ను చంపేస్తామని మరోసారి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. కొన్ని గంటల్లోనే ఆ మెసేజ్ పంపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్‌ను చంపేస్తామని హెచ్చరించిన వ్యక్తి గుజరాత్‌కు చెందిన వాడని పోలీసులు తెలిపారు. అతనొక మానసిక రోగి అంటూ వారు పేర్కొన్నారు. సల్మాన్‌ను హత్య చేస్తామంటూ ఇప్పటికే చాలామంది హెచ్చరించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి కొంతకాలంగా వార్నింగ్స్ వస్తోన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కొందరు ఆకతాయిలు కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడటంతో పోలీసులకు పెద్ద తలపోటుగా మారింది.సల్మాన్‌ను చంపేస్తామంటూ వర్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు సోమవారం ఒక మెసేజ్ వచ్చింది. ఆయన ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతామని అందులో ఉంది.. లేదంటే ఆయన కారులో బాంబు పెట్టి పేల్చేస్తామని వాట్సప్ ద్వారా మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమయిన పోలీసులు అతన్ని కొన్ని గంటల్లోనే పట్టకున్నారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు -
సైఫ్ అలీ ఖాన్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం జ్యువెల్ థీఫ్య ది హెయిస్ట్ బిగిన్స్ అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు కూకీ గులాటి, రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఖరీదైన వజ్రాలను దొంగతనం చేసే వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్ఫిక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ బాలీవుడ్ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ దొంగ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో జైదీప్ అహ్లావత్,కునాల్ కపూర్ రాయ్, వికితా దత్తా ప్రధాన పాత్రలు పోషించారు. Danger. Deception. Desire. And a diamond that's worth everything 💎🔥Watch Jewel Thief, out 25 April, only on Netflix.#JewelThiefOnNetflix #SaifAliKhan pic.twitter.com/sg58YnJ8oz— Netflix India (@NetflixIndia) April 14, 2025 -
బాలీవుడ్ నన్ను పట్టించుకోలేదు.. తెలుగోళ్లే బెస్ట్
బాలీవుడ్ తీరుపై మరో హిందీ నటుడు అసంతృప్తి బయటపెట్టాడు. చాన్నాళ్లుగా హిందీలో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న రణ్ దీప్ హుడా(Randeep Hooda).. ఇప్పుడు సొంత ఇండస్ట్రీనే తన సరిగా పట్టించుకోలేదని అన్నాడు. తెలుగు ఇండస్ట్రీ నుంచి తనకు ప్రశంసలు వచ్చాయని అన్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)2001 నుంచి ఇండస్ట్రీలో ఉన్న రణ్ దీప్ హుడా.. చాలానే హిందీ సినిమాల్లో నటించాడు. కానీ అనుకున్నంత పేరు రాలేదనే చెప్పొచ్చు. మధ్యమధ్యలో ఒకటి రెండు ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించాడు. 2020లో రిలీజైన 'ఎక్స్ ట్రాక్షన్'(Extraction Movie) అనే హాలీవుడ్ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. కానీ బాలీవుడ్ నుంచి తనకు సరైన ప్రశంసలు దక్కలేదని బాధపడుతున్నాడు.కానీ తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు యాక్షన్ డైరెక్టర్స్ మాత్రం తాను చేసిన 'ఎక్స్ ట్రాక్షన్' సినిమా గురించి మాట్లాడి, తన యాక్షన్ ని మెచ్చుకున్నారని హుడా చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ తో పోలిస్తే తనకు టాలీవుడ్ లోనే గౌరవం దక్కిందని తాజాగా ఓ చోట మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)తాను నటుడిగా మంచి సినిమాలు చేస్తూ సక్సెస్ అయ్యేసరికి బాలీవుడ్ లో కొందరు భయపడ్డారని, అందుకే పబ్లిక్ గా తనని ప్రశంసించలేకపోయారని హుడా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతడు విలన్ గా నటించిన లేటెస్ట్ మూవీ 'జాట్'(Jaat Movie). తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజై నాలుగు రోజులైంది. రణ్ దీప్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.ఏదేమైనా ఈ మధ్య కాలంలో పలువురు హిందీ నటీనటులే.. బాలీవుడ్ తీరుని ఎండగడుతూ, సొంత ఇండస్ట్రీ పరువు తీసేస్తున్నారు. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ తో తెలుగు చిత్రసీమ దూసుకెళ్తోంది.(ఇదీ చదవండి: నోరు జారిన కుర్రాడు.. నిధి అగర్వాల్ మాత్రం) -
సన్నీ డియోల్ జాట్ మూవీ.. నాలుగు రోజులైనా ఆ మార్క్ దాటలేదు!
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం జాట్(Jaat Movie). ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించారు. తెలుగు సినిమా కథతో తెరకెక్కించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.(ఇది చదవండి: 'జాట్' సినిమాను బాయ్‌కాట్ చేయండి.. ఫైర్ అవుతున్న తమిళులు)అయితే ఊహించని విధంగా జాట్ మూవీకి కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించలేకపోతోంది. తొలిరోజు కేవలం రూ.11 కోట్లకే పరిమితమైన జాట్ .. నాలుగు రోజులైనా ఇప్పటి వరకు యాభై కోట్ల మార్క్ దాటలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో(Day 3 Collection) కేవలం రూ.32.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఈనెల 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో కేవలం రూ.49.3 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది. కాగా.. ఈ చిత్రం విలన్‌గా రణ్‌దీప్ హుడా నటించారు. A SENSATIONAL FIRST WEEKEND for #Jaat at the box office ❤️🔥#JAAT collects 49.3 CRORES+ DOMESTIC GBOC in 4 days 💥💥Book your tickets for the MASS FEAST now!▶️ https://t.co/sQCbjZ5zOE#BaisakhiWithJaat Starring Action Superstar @iamsunnydeolDirected by @megopichand… pic.twitter.com/BNlBTSjYZX— Mythri Movie Makers (@MythriOfficial) April 14, 2025 -
ఆరేళ్లుగా వెండితెరకు దూరం.. మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న నటాషా!
నటాషా స్టాంకోవిచ్ (Nataša Stanković).. హిందీలో పలు సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసింది. 2019లో వచ్చిన ద బాడీ మూవీలో జలక్‌దిక్‌లాజా రీలోడెడ్ పాటలో చివరిసారిగా మెరిసింది. తర్వాత మరే సినిమా సాంగ్‌లోనూ కనిపించనేలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తరచూ తన పేరు వినిపిస్తూనే ఉంది. కారణం.. భర్త, క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడిపోవడమే! గతేడాది వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ మధ్య నటాషా.. తన కుమారుడిని తీసుకుని కొన్నాళ్లు సెర్బియాలో ఉండి వచ్చింది.నటాషా రీఎంట్రీ?తాజాగా ముంబైలో బాంబేటైమ్స్ నిర్వహించిన ఫ్యాషన్ వీక్‌కు హాజరైంది. మోడల్‌గా ర్యాంప్ వ్యాక్ కూడా చేసింది. ఈ కార్యక్రమం అనంతరం నటాషా మాట్లాడుతూ.. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేయాలనుందని.. ఆ దిశగా ఏమైనా చర్చలు జరుగుతాయేమో చూడాలి అని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇకపోతే నటాషా ర్యాంప్ వాక్ చేస్తుంటే.. మోడల్, ఫిట్నెస్ కోచ్ అలెగ్జాండర్.. అగస్త్యను ఆడిస్తున్న వీడియో సైతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. పిల్లాడిని తీసుకెళ్లే ప్లేస్ అది కాదని కామెంట్లు చేస్తున్నారు. మోడల్‌గా కెరీర్ ఆరంభం..సెర్బియాకు చెందిన నటాషా.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. పలు వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది. సత్యాగ్రహ్ సినిమాలో అయ్యో జీ అనే స్పెషల్ సాంగ్‌తో వెండితెరపై అడుగుపెట్టింది. అనంతరం హిందీ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లోనూ పాల్గొంది. కాకపోతే నెల రోజులకే ఎలిమినేట్ అయింది. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన గుర్తింపుతో మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఐటం సాంగ్స్‌తో ఫేమస్ప్రైవేట్ సాంగ్స్‌తో పాటు సినిమాలో ఐటం సాంగ్స్ చేసుకుంటూ పోయింది. 2016లో 7 హవర్స్ టు గో అనే సినిమాలో పోలీస్‌గా నటించింది. ఎక్కువగా డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసే నటాషా నాచ్ బలియే 9 రియాలిటీ షోలో పాల్గొంది. ఈ షోలో నటుడు అలీగోనీతో కలిసి జంటగా పార్టిసిపేట్ చేసింది. ఈ జోడీ ఫినాలే వరకు చేరుకుని థర్డ్ రన్నరప్స్గా నిలిచింది. 2020లో ఫ్లెష్ అనే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) చదవండి: వచ్చే జన్మలోనైనా ఎక్కువకాలం కలిసుందాం: నటి ఎమోషనల్ -
ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలి?.. సలహా కోరిన అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ నటుటు అమితాబ్ బచ్చన్ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సరదా పోస్టులతో అలరిస్తుంటారు. అయితే ట్విటర్ వేదికగా మరోసారి తన ఫ్యాన్స్‌తో ముచ్చటించారు బిగ్ బీ. ఈ సందర్భంగా తన ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలో సలహా ఇవ్వండని కోరారు. ప్రస్తుతం నాకు 49 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని.. ఆ సంఖ్యను పెంచేందుకు సలహా ఇవ్వమని పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ తమకు నచ్చిన విధంగా అమితాబ్‌కు సలహాలు, సూచనలు ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులతో నింపేస్తున్నారు. మరి వారిచ్చిన సలహాలేవో చూసేద్దాం పదండి.అయితే అమితాబ్ పోస్ట్‌కు పలువురు నెటిజన్స్ స్పందించారు. కొందరైతే మీ సతీమణి జయాబచ్చన్‌తో ఓ వీడియో చేసి పోస్ట్ చేయండని సలహా ఇచ్చారు. మరికొందరేమో కేవలం పెట్రోల్ ధరల గురించి మాట్లాడితే ఒక్కరోజులో మీ సంఖ్యం 50 మిలియన్ల మంది ఫాలోవర్లు దాటిపోవడం గ్యారెంటీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరైతే ఏకంగా నటి రేఖను పెళ్లి చేసుకోవాలని సరదాగా పోస్ట్ చేశాడు. ఒకరేమో జయా బచ్చన్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయండని వారికి తోచిన విధంగా కామెంట్స్ పెడుతున్నారు.అయితే చాలా మంది నటి రేఖ పేరు ప్రస్తావించడంపై నెట్టింట చర్చ మొదలైంది. దీనికి కారణం వీరిద్దరు కలిసి గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అమితాబ్- రేఖ.. దో అంజానే, అలాప్, ఖూన్ పసీనా, గంగా కీ సౌగంద్, రామ్ బలరామ్, సిల్సిలా లాంటి చిత్రాల్లో కలిసి పనిచేశారు. వీరి జోడీపై గతంలో చాలా రూమర్స్ కూడా వినిపించాయి. ఆ తర్వాత అలాంటి ప్రచారాలకు చెక్ పెడుతూ ఆయన జయా బచ్చన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే చివరిసారిగా కల్కిలో కనిపించిన అమితాబ్.. ఆ తర్వాత కౌన్ బనేగా కరోడ్‌పతి రియాల్టీ షోకు హోస్ట్‌గా పనిచేశారు.T 5347 - बड़ी कोशिश कर रहे हैं, लेकिन ये 49M followers का नंबर बढ़ ही नहीं रहा है ।कोई उपाय हो तो बताइए !!!— Amitabh Bachchan (@SrBachchan) April 13, 2025 -
వచ్చే జన్మలోనైనా ఎక్కువకాలం కలిసుందాం: నటి ఎమోషనల్
నచ్చినవారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించేవాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఇంకొన్నాళ్లయినా వారు తమతోనే ఉంటే బాగుండని బాధపడేవాళ్లు చాలామంది. బాలీవుడ్ నటి దియా మీర్జా (Dia Mirza) ఏళ్ల తరబడి అలాంటి బాధను అనుభవిస్తోంది. ఆమె తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి ఫ్రాంక్ హ్యాండ్రిచ్ను కోల్పోయింది. నాన్న చిన్నవయసులోనే వదిలిపెళ్లిపోయాడని, ఆయన ఇంకొంతకాలం తనతో ఉంటే బాగుండేదని ఎన్నోసార్లు అనుకుంది. అన్నీ కళ రూపంలోనే..ఈ క్రమంలో తండ్రి ఫ్రాంక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను తల్చుకుని భావోద్వేగానికి లోనైంది. నేను గట్టిగా అరవాలనుకున్నప్పుడు ఏదైనా పెయింటింగ్ వేసేవాడినని నాన్న చెప్తూ ఉండేవాడు. ఆయన గొంతుక, ప్రార్థన, నిరసన.. అన్నీ కూడా కళ రూపంలోనే ప్రదర్శించేవాడు. తన మెదడులో తిరిగే భావాలను, ప్రపంచంలోని గొడవలను అన్నింటినీ కళగానే ముందుంచేవాడు. దాన్నొక బాధ్యతగా భావించేవాడు.చీమ నేర్పే పాఠాలుఅలాగే ప్రకృతితోనూ మమేకమయ్యేవాడు. చీమ పనితనం గురించి, అది మనకు నేర్పించే పాఠాల గురించి ఎక్కువగా చెప్పేవాడు. అవి ఎప్పుడూ కలిసికట్టుగా పని చేస్తూనే ఉంటాయి కానీ ఫిర్యాదులు చేయవని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పనిని ఆపవు అని చెప్పేవాడు. తనకన్నా 10 రెట్లు ఎక్కువ బరువును మోస్తుందనేవారు. ఆ చీమలు మనకు ఐకమత్యం, క్రమశిక్షణతో పాటు ఏ పనీ చిన్నది కాదని నేర్పిస్తాయన్నమాట!వచ్చే జన్మలో అయినా..హ్యాపీ బర్త్‌డే పప్పా.. మరో జన్మంటూ ఉంటే మనిద్దరం ఎక్కువకాలం కలిసుందాం. అప్పటివరకు నిన్ను నా ప్రతి అడుగులోనూ తలుచుకుంటూనే ఉంటాను అని రాసుకొచ్చింది. హిందీలో ఎన్నో సినిమాలు చేసిన ఆమె తెలుగులో వైల్డ్ డాగ్ మూవీలో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) చదవండి: అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగనివ్వను: సమంత -
నా మనవరాలిని చూసిన ఆనందం.. నా సంపాదనలో కనిపించలేదు: సునీల్ శెట్టి
బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ గతేడాది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన అతియా శెట్టి బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహా వేడుక ముంబయిలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా జరిగింది.అయితే అతియాశెట్టి కూతురు పుట్టడంతో తాతయ్య సునీల్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. తన మనవరాలు పుట్టిన తర్వాత తన జీవితం మారిపోయిందని అన్నారు. తనను చూసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని తెలిపారు. తన జీవితమంతా సినిమా చేస్తూ, వ్యాపారాలు చేసుకుంటూ గడిపానని.. ఈరోజు తన మనవరాలిని పట్టుకున్నంత ఆనందం ఎప్పుడూ కనిపించలేదని సునీల్ శెట్టి ఎమోషనల్ నోట్లో రాసుకొచ్చారు. తన మనవరాలి చేయి పట్టుకుని ఉన్న తన తల్లిని చూడటం కూడా జీవితాంతం గుర్తుండిపోయే అందమైన క్షణమని చెప్పారు.సునీల్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'ఇటీవల తాతగా మారడం నాకు వర్ణించలేని అనుభూతి. ఇది ప్రపంచం ఇచ్చే స్వచ్ఛమైన ఆనందం. నేను దశాబ్దాలుగా వ్యాపారాలు నడుపుతున్నా. సినిమాలు చేస్తున్నా. నా జీవితంలో అర్ధవంతమైన పనిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నా. ఈ విషయంలో నేను గర్వపడుతున్నా. కానీ నేను నా మనవరాలిని పట్టుకున్నప్పుడు ఇవేమీ గుర్తుకు రాలేదు. ఇప్పుడు నా మనస్సు మంగుళూరులోని నా చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చింది. చెప్పులు లేకుండా పరిగెత్తడం, బహిరంగ మైదానంలో ఆడుకోవడం, ప్రేమ తప్ప మరేమీ లేకుండా చేసిన తాజా భోజనం తినడం నిజమైన ఆనందాన్ని ఇచ్చిందని' రాసుకొచ్చారు. నా కుమార్తె అతియా శెట్టి తల్లి కావడం చూస్తుంటే తన మనసుకు చాలా ప్రశాంతంగా ఉందని ఒక తండ్రిగా గర్వంగా కూడా ఉందని పోస్ట్ చేశారు. కాగా.. అతియా శెట్టికి మార్చి 24న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితేఇంకా పాప పేరును ప్రకటించలేదు. -
ఆ హీరోకు నా సినిమాతో ఏం పని? నన్ను పక్కనపడేసి..: 'జాట్' విలన్
రణ్‌దీప్ హుడా (Randeep Hooda).. సినిమా అంటే ఎంత పిచ్చో మాటల్లో చెప్పలేదు. చేతల్లో చూపించాడు. సినిమా కోసం ఎన్ని కష్టాలైనా పడతాడు. తన శరీరాన్ని నచ్చినట్లుగా మార్చేస్తాడు. సర్‌బిజత్ సినిమా కోసం నెల రోజుల్లోనే 18 కిలోలు తగ్గిపోయాడు. గతేడాది వచ్చిన స్వతంత్ర వీర్ సావర్కర్ కోసం ఏకంగా 30 కిలోలకు పైనే తగ్గిపోయాడు. ఇందుకోసం తిండిమానేసి కడుపు కాల్చుకున్నాడు. జాట్ మూవీతో ఫుల్ క్రేజ్ఈ సినిమా కోసం పైసాపైసా కూడబెట్టి కొన్న రెండు,మూడు ప్లాట్లను అమ్మేశాడు. దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా నష్టాల్ని మిగిల్చింది. తాజాగా ఇతడు జాట్ సినిమాతో పలకరించాడు. తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ సినిమాలో సన్నీడియోల్ హీరోగా, రణ్‌దీప్ విలన్‌గా నటించారు. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. కలెక్షన్స్ మాట పక్కనపెడితే విలన్‌గా రణ్‌దీప్‌కు మాత్రం మరింత గుర్తింపు తీసుకొచ్చింది.ఆ సినిమాకు నేను హీరో..తాజాగా అతడు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని తల్చుకుని బాధపడ్డాడు. రణ్‌దీప్ హుడా మాట్లాడుతూ.. ఆలియా భట్ (Alia Bhatt)తో కలిసి నేను హైవే సినిమా చేశాను. కానీ ప్రమోషన్స్‌లో నా స్థానంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఉన్నాడు. రణ్‌బీర్- ఆలియా ప్రమోషన్స్ చూసి నేను షాకయ్యాను. ఎందుకంటే ఆయనకు నా సినిమాతో ఏం పని? హైవేలో నేను హీరో. మరి ప్రమోషన్స్‌లో తనెందుకు ఉన్నాడో అర్థం కాలేదు. సరే, పోనీ.. కనీసం ప్రమోషన్స్‌కు నన్నైనా పిలవాలి కదా.. పిలవలేదు. అప్పుడు చాలా బాధేసింది. ఆ సమయంలో నాకు సపోర్ట్‌గా నిలబడి ప్రమోషన్స్‌కు పిలిచుంటే అది నా కెరీర్‌కు సాయపడేదేమో!లవ్ జర్నీ..బహుశా.. హైవే ప్రమోషన్స్ అప్పుడే రణ్‌బీర్, ఆలియా ప్రేమలో పడ్డారేమో! నా సినిమా వల్ల వారిద్దరి మనసులు దగ్గరయ్యాయంటే అది నాకు సంతోషమే! కానీ నన్ను పట్టించుకుంటే బాగుండేదనిపించింది. అయితే వారి ప్రమోషన్స్‌తో సినిమాకు పెద్దగా హైప్ రాకపోవడంతో రిలీజ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు నన్ను ప్రమోషన్స్‌కు పిలిచారు అని చెప్పుకొచ్చాడు.చదవండి: అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగనివ్వను: సమంత -
పృథ్వీరాజ్ కొత్త సినిమా ప్రకటన.. రెండేళ్ల పెద్ద హీరోయిన్‌తో జోడీ
‘లూసిఫర్ 2: ఎంపురాన్’ చిత్రం తర్వాత మరో కొత్త సినిమా పనిలో పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran) ఉన్నారు. మేఘనా గుల్జార్ (Meghna Gulzar) తెరకెక్కిస్తున్న ‘దైరా’ అనే పాన్ ఇండియా చిత్రంలో పృథ్వీరాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన సరసన హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ నటించడం విశేషం. ఇందులో ఆయన శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను మేఘనా గుల్జార్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఆమెను సరికొత్త అవతారంలో చూపించనున్నారు మేఘనా గుల్జార్.ముంబైకి చెందిన మేఘనా గుల్జార్ దర్శకురాలిగా బాలీవుడ్లో పలు చిత్రాలు నిర్మించింది. రాజీ (అలియాభట్), చపాక్(దీపికా పడుకోణె), సామ్ బహదూర్ (విక్కీ కౌషల్) వంటి సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. కాల్షీట్స్ కారణంగా ఆయుష్మాన్ ఖురానా, సిద్ధార్థ్ మల్హోత్రా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. ఇప్పుడీ చిత్రంలో పృథ్వీరాజ్, కరీనా కపూర్ ఎంట్రీ ఇచ్చేశారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, వయసు రిత్యా పృథ్వీరాజ్ సుకుమారన్( 42) కంటే కరీనా కపూర్(44) రెండేళ్లు పెద్ద కావడం గమనార్హం.Some stories stay with you from the moment you hear them.DAAYRA is that for me.Excited to work with @meghnagulzar, the incredible #KareenaKapoorKhan and @JungleePictures! Wish you all a very happy Vishu! 🙂#Daayra@vineetjaintimes #AmritaPandey #YashKeswani #SimaAgarwal… pic.twitter.com/vSHXSVh8vC— Prithviraj Sukumaran (@PrithviOfficial) April 14, 2025 -
నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి
బాలీవుడ్ నటి, పాప్ గాయని, బిజినెస్ ఉమెన్... మరెన్నో రంగాల్లో ప్రసిద్ధి చెందిన 'కునిక సదానంద్ లాల్' తన వైవిధ్యమైన పాత్రలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ముంబైలో చలనచిత్రరంగానికి మారడానికి ముందుగానే కునిక నటనా జీవితం ఢిల్లీలో ప్రారంభమైంది, ఆమె తొలుత అనేక టీవీ సిరీస్‌లలో కనిపించింది. ప్రముఖ హాస్యనటుడు అస్రానీ భార్య మంజు అస్రానీ టీవీ సిరీస్‌లో ఓ అద్భుతమైన పాత్రతో బ్రేక్ అందుకుని సినిమా తారగా మారారు. దాదాపుగా 125 సినిమాల్లో నటించారు. గుమ్రాహ్, బేటా వంటి సినిమాల్లో విలన్‌గానూ మెప్పించారు. ఆమె సినిమా విజయాలకు మించి, ప్రైవేటు ఆల్బమ్స్ ద్వారా గాయనిగా పేరొందారు. విజయవంతమైన పలు సంస్థల వ్యవస్థాపకురాలు, సామాజిక కార్యకర్త కూడా. ముంబైలోని గోరేగావ్ శివారులో, వైట్ ఇటాలియన్ కేఫ్, జింగ్కేఫ్ మెజెస్టికా ది రాయల్ బాంక్వెట్ హాల్, అలాగే ఎక్స్హేల్ స్పా వంటివి నిర్వహిస్తున్నారు. తాజాగా సిద్ధార్థ్ కన్నన్ షోలో కనిపించినప్పటి నుంచి కునికా సదానంద్ వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆ షో లొ ఆమె చాలా ఓపెన్ అయ్యారు గాయకుడు కుమార్ సానుతో తన ప్రేమ వ్యవహారం గురించి అంతేకాదు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పలువురు హీరోయిన్లతో నడిపిన వ్యవహారాల గురించి కూడా మాట్లాడడం విశేషం. ఆమె మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ గురించి కూడా ప్రస్తావించారు అంతేకాదు గతంలో హీరోయిన్లను లొంగదీసుకోవాలని లైట్మెన్లతో సహా ఎలా ట్రై చేసేవారో కూడా వెల్లడించారు. దాంతో ఆ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అక్షయ్ కుమార్ ఎఫైర్స్‌పై కామెంట్లుఅక్షయ్ కుమార్‌కి హీరోయిన్లతో ఉన్న ఎఫైర్స్ గురించి ఆమె మాట్లాడుతూ ‘అతను చాలా అందంగా ఉంటాడు అంతేకాదు అతను నా కంటే ఒక సంవత్సరం చిన్నవాడు అయినా కూడా అతను ఇంకా ఫిట్‌గానే ఉన్నాడు‘ మగవాళ్లలో మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్థాయిలు చురుకుగా ఉన్నప్పుడు, మంచి ఫిట్నెస్ పొందుతారని అది సాధారణమేనని చెప్పారు. అంటే మగతనం ఎక్కువైతే ఫిట్నెస్ దాంతో ఆడవాళ్ళ కు ఆకర్షణ కలగడం.. వల్ల ఇలాంటి ఎఫైర్స్ పుట్టుకొస్తాయన్నట్టుగా అభిప్రాయపడ్డారు. అదే ఇంటర్వ్యూలో తన నటనా జీవితంలో ప్రారంభంలో బాలీవుడ్ టాప్ సింగర్ కుమార్ సానుని కలుసుకున్నానని తొలిచూపులోనే నచ్చడంతో అదొక తక్షణ ఆకర్షణగా భావించానని వెల్లడించారు. తాను ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా ఊటీలో ఉన్నప్పుడు అదే సమయంలో కుమార్ సాను కూడా తన సోదరి, మేనల్లుడితో విహారయాత్రలో ఉన్నాడని అలా తమ మధ్య బలమైన అనుబంధం ఏర్పడిందన్నారు.పరిశ్రమలో తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్న ఆమె... గతంలో గౌరవప్రదమైన కుటుంబాలకు చెందిన మహిళలు అరుదుగా మాత్రమే సినిమాల్లో కెరీర్‌ను ఎంచుకునేవారని అన్నారు. దానికి తగ్గట్టే అప్పటి పరిస్థితులు ఉండేవని చెప్పారు. లైటింగ్ టెక్నీషియన్లు కూడా నటీమణుల పట్ల తరచుగా అనుచితమైన ఆలోచనలతో ఉంటారని, ఆమె వెల్లడించడం విశేషం ‘వారు తమ చేతులపై పెర్ఫ్యూమ్తో వస్తారు, వాటిని హీరోయిన్ వైపు చాచేవారని అంతేకాక హీరోయిన్ల చెవుల్లో అసభ్యకరమైన విధంగా గుసగుసలాడేవారు‘ అని ఆమె అన్నారు. ఈ నేపధ్యంలో అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరమన్నారు. తానెలా ఇలాంటి పరిస్థితుల నుంచి తనను తాను కాపాడుకున్నానో కూడా వివరించారు.‘షూటింగ్ సమయం అయిపోయాక ఆకలితో ఉన్న సింహాలు బయటికి వచ్చి, బయట తిరుగుతున్నట్లుగా ఉండేది. కొంతమంది చాలా మర్యాదగా సాయంత్రం కలుద్దామా? అని ఫోన్లు చేస్తే, మరికొందరు మాత్రం మరింత దూకుడుగా ప్రవర్తించేవారు అంటూ వెల్లడించారు. అలాంటి సందర్భాల్లో తన హెయిర్‌డ్రెస్సర్ తరచుగా తన గదిలో రక్షణగా ఉండేవాడని చెప్పారామె తాను అందుబాటులో లేనని లేదా డిన్నర్‌కి బయటకు వెళ్లారని చెబుతూ, ఆమె హెయిర్డ్రెసర్ వారిని తెలివిగా తప్పించేవాడని గుర్తు చేసుకున్నారు. -
కారులో బాంబు పెట్టి లేపేస్తాం.. సల్మాన్‌కు వార్నింగ్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ముంబై రవాణాశాఖ విభాగానికి వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. దీనిపై అధికారులు అప్రమత్తమయ్యారు. వర్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.ఎందుకీ బెదిరింపులు?1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్‌పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోను చంపుతామని పలుమార్లు హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే 2024లో.. కృష్ణజింకను వేటాడి తప్పు చేసినందుకుగానూ గుడికి వెళ్లొచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలంది. తర్వాత అదే ఏడాది ఓ గుర్తు తెలియని వ్యక్తి తనకు రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.పన్వేల్‌లో ఉన్న సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్‌లో కొందరు ఫేక్ ఐడీలతో చొరబడేందుకు ప్రయత్నించారు. గత డిసెంబ్లోనూ సల్మాన్ సినిమా సెట్లోకి ఓ వ్యక్తి ప్రవేశించి.. లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రస్తావిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. గతేడాది సల్మాన్ ఇంటి ముందు పలుమార్లు కాల్పులు జరగడంతో అతడు ఇంటి బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను పెట్టించుకున్నాడు.వరుస బెదిరింపులపై ఇటీవల సల్మాన్ మాట్లాడుతూ.. నేను భగవంతుడిని నమ్ముతాను. దేవుడు నాకు ఆయుష్షు ఎంతవరకు ఇస్తే అంతవరకు మాత్రమే బతుకుతాను. నా జీవితం దేవుడి చేతుల్లోనే ఉంది. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ మన చేతిలో ఏమీ ఉండదు అన్నాడు.చదవండి: స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా? -
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు
-
ముంబై పై హైదరాబాద్ పై చేయి... ఇండియన్ సినిమా అడ్రెస్ మారనుందా?
భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఇక్కడివాడే, అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు ఇక్కడివాడే, అత్యధిక చిత్రాలు రూపొందేది ఇక్కడే...ఇలాంటి అనేకానేక విశేషాలతో ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ టాలీవుడ్‌కి రాజధానిగా ఉన్న హైదరాబాద్... ఇప్పుడు శరవేగంగా భారతీయ సినిమాకు రాజధానిగా మారిపోతోంది. నిజానికి ముంబై చాలా కాలంగా భారతదేశ చలనచిత్ర రాజధాని అనేది తెలిసిందే, దేశంలో ఏ భాషా చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులైనా, దర్శకులైనా, సాంకేతిక నిపుణులైనా తమ కెరీర్లో కనీసం ఒక్కసారైనా హిందీ సినిమా చేయాలని కలలు కంటారు. అలా చేయడం అంటే తమకు ప్రమోషన్ వచ్చినట్టుగా భావిస్తారు. ఒకప్పుడు దక్షిణాది సూపర్స్టార్లు అనేక మంది హిందీ సినిమాల ద్వారా బాలీవుడ్‌పై తమదైన ముద్ర వేయాలని విఫలయత్నం చేసినవారే.ఆ ఆధిపత్యం ఇక గతం...?అయితే ఇండియన్ మూవీపై ముంబై ముద్ర ఇక గతంగా మారనుందా? ఇప్పటిదాకా ముంబై కేంద్రంగా సాగుతున్న భారతీయ సినిమా పరిశ్రమ క్రమంగా హైదరాబాద్ తన స్థానాన్ని ఆక్రమించడంతో తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.గతంలో, బాలీవుడ్ అవకాశాల కోసం చాలా మంది తెలుగు తమిళ నటీనటులు ముంబైకి తరచుగా వచ్చేవారు. అంతేకాదు బాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు అంటే దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ ఉండేది. అక్కడి చిన్నా చితకా నటీనటులు కూడా హైదరాబాద్ వచ్చి తెలుగు సినిమాల్లో నటించాలంటే డబుల్, త్రిబుల్ ఫీజులు డిమాండ్ చేసేవారు. అయినా వాళ్లనే తెచ్చుకుని నిర్మాతలు గొప్పలు చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ రివర్స్ అయింది.ఛలో హైదరాబాద్...అంటున్న దర్శక నిర్మాతలుతెలుగులో రూపొందిన పాన్–ఇండియా చిత్రాల వెల్లువ పరిశ్రమను పునర్నిర్మించింది, హిందీ సినిమాను చాలా పెద్ద మార్కెట్లో ఓ చిన్న భాగం గా మార్చేసింది. రాజమౌళి బాహుబలి సిరీస్ నుంచి, మనవాళ్లు పాన్–ఇండియా చిత్రాల వైపు మళ్లడం మరింత పెరిగింది. అకస్మాత్తుగా ఊపందుకున్న ఈ ట్రెండ్‌తో ఉక్కిరి బిక్కిరవుతున్న ముంబై చిత్రనిర్మాత దర్శకులు ఆ స్థాయి చిత్రాల కోసం దక్షిణ భారత పరిశ్రమపై, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న వారిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ముంబై నుంచి దర్శక నిర్మాతలు ఇక్కడి నటీనటుల కాల్షీట్స్ కోసం ప్రయత్నించే క్రమంలో హైదరాబాద్ వస్తున్నారు.ముంబైకి చెందిన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా తెలుగు సినిమా నిర్మాతలతో ప్రాజెక్ట్‌ల గురించి చర్చించేందుకు హైదరాబాద్‌కు ఛలో అంటున్నారు.నటీనటులు సైతం అదే బాట...ముంబైకి చెందిన చాలా మంది నటులు నటీమణులు క్రమం తప్పకుండా హైదరాబాద్‌కు వస్తున్నారు, నిర్మాతలు దర్శకులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. తెలుగు దర్శకుడు సందీప్ వంగా యానిమల్ సినిమా ద్వారా బాబీ డియోల్‌కి అందించిన బాక్సాఫీస్ హిట్ లాగే పాన్–ఇండియా చలనచిత్రాలు తమ కెరీర్ పునరుజ్జీవనాన్ని అందిస్తాయని ఆశిస్తూ బాలీవుడ్‌లోని అగ్రశ్రేణి నటీనటులు కూడా హైదరాబాద్‌కు చెందిన చిత్ర నిర్మాత దర్శకులతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు.తిరిగొస్తున్న వలస ప్రముఖులుదూరపు కొండల నునుపును చూసి ముచ్చటపడిన పలువురు దర్శకులు, నటీనటులు తూచ్ అనుకుంటున్నారు. గతంలో దర్శకుడు పూరీ జగన్నాధ్, ముంబైలో స్థిరపడాలని భావించాడు. అయితే తిరిగి హైదరాబాద్‌కు మారాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఇక్కడ అవకాశాలు బాగున్నా సరే బాలీవుడ్ ఛాన్సుల కోసం పెట్టె బేడా సర్ధుకున్న పలువురు తారలు సైతం తిరిగి హైదరాబాద్ వైపు చూస్తున్నారు. నిజానికి ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ, మళయాళ చిత్రాలు సైతం భారతీయ సినిమా రంగంలో సత్తా చాటుతున్నాయి. ఇలా మొత్తంగా దక్షిణాది చిత్రాలు భారీ విజయాలు నమోదు చేస్తున్న నేపధ్యంలో ఏర్పడిన పరిస్థితి హైదరాబాద్‌కు లాభించిందని చెప్పాలి. మిగిలిన ఏ దక్షిణాది భాషా చిత్ర పరిశ్రమకూ హైదరాబాద్ లాంటి వైవిధ్యభరిత అవకాశాలు అందించే అత్యాధునిక నగరం లేకపోవడం కూడా మరో కారణం. ఇటీవల బాలీవుడ్ తారలు, ప్రముఖులు హైదరాబాద్‌లో రెస్టారెంట్లు, జిమ్స్, బొటిక్స్ తదితర వ్యాపారాలు ప్రారంభిస్తూ హైదరాబాద్‌కు తరచుగా రాకపోకలు సాగించేందుకు మరికొన్ని కారణాలు సృష్టించుకుంటున్నారు. ఇలాంటి వ్యాపారాల్లో టాలీవుడ్ ప్రముఖులు సైతం పార్ట్‌నర్స్‌గా మారుతున్నారు. -
పెళ్లికి ముందే చెట్టాపట్టాల్.. ప్రియురాలితో స్టార్ హీరో
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ-పెళ్లి-విడాకులు.. ఇలాంటి మాటలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా లేటు వయసు ప్రేమలు కూడా కనిపిస్తుంటాయి. అలాంటిదే ఆమిర్(Aamir Khan) ప్రేమకథ.(ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. ముద్దు ఫోటోలు వైరల్)ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని.. భార్యలకు విడాకులు ఇచ్చేసిన హీరో ఆమిర్ ఖాన్ కొన్నిరోజుల క్రితం తన 60వ పుట్టినరోజు సందర్భంగా తాను గౌరీ స్ప్రాట్(Gauri Spratt) అనే మహిళతో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత గౌరీ ఇంట్లో జరిగిన వేడుకలకు కూడా హాజరయ్యాడు.తాజాగా ఆమిర్-గౌరీ పబ్లిక్ గా కనిపించారు. మకావు దేశంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్లో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఫొటోలకు పోజులిచ్చారు. పెళ్లికి ముందే చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్న ఈ సీనియర్ జంట.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ) -
ఆ నిర్ణయంతో బాధపడ్డాను
‘‘నేను హీరోయిన్గా నటించిన ‘డ్రీమ్ గర్ల్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘డ్రీమ్ గర్ల్ 2’ రూపొందింది. సీక్వెల్లోనూ నన్నే కథానాయికగా తీసుకుంటారని ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. అయితే, నన్ను కాదని అనన్యా పాండేను హీరోయిన్గా తీసుకున్నారు. వారి నిర్ణయంతో బాధపడ్డాను’’ అని బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ బరుచా తెలిపారు. ఆయుష్మాన్ ఖురానా, నుష్రత్ బరుచా జోడీగా రాజ్ శాండిల్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డ్రీమ్ గర్ల్’. 2019 సెప్టెంబరు 13న విడుదలైన ఈ మూవీ బాలీవుడ్లో హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘డ్రీమ్ గర్ల్ 2’ రూపొందింది.సీక్వెల్లోనూ ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిగా రాజ్ శాండిల్యనే దర్శకత్వం వహించారు. అయితే హీరోయిన్గా అనన్యా పాండేను తీసుకున్నారు. 2023 ఆగస్టు 24న విడుదలైన ఈ చిత్రం కూడా మంచి విజయం అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నుష్రత్ బరుచా మాట్లాడుతూ– ‘‘డ్రీమ్ గర్ల్’లోని నటీనటులందరూ ‘డ్రీమ్ గర్ల్ 2’లోనూ నటించారు. అయితే హీరోయిన్ పాత్రలో నాకు బదులు అనన్యా పాండేని తీసుకున్నారు.యూనిట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయాను. కానీ ఈ విషయంపై నేను యూనిట్‌లోని వారితో మాట్లాడలేదు. ఎందుకంటే అవతలి వారి నిర్ణయాలను మనం కంట్రోల్ చేయలేం కదా? తమ సినిమాలో ఎవర్ని తీసుకోవాలి? అనేది మేకర్స్‌పై ఆధారపడి ఉంటుంది. వాళ్ల ఇష్టాన్ని మనం ప్రశ్నించడానికి లేదు. అందుకే బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయాను’’ అని పేర్కొన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్లో వైరల్‌గా మారాయి. -
క్రిష్ 4లో?
బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్’ నుంచి ‘క్రిష్ 4’ రానున్న సంగతి తెలిసిందే. ‘క్రిష్’ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాల్లో హీరోగా నటించిన హృతిక్ రోషన్... ‘క్రిష్ 4’ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. రాకేష్ రోషన్, ఆదిత్యా చోప్రా నిర్మించనున్నారు.వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీలో ప్రీతీ జింతా, వివేక్ ఓబెరాయ్ వంటి వారు నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ప్రియాంకా చోప్రా పేరు తెరపైకి వచ్చింది. కాగా ఇటీవల ప్రియాంకా చోప్రా – నిక్ జోనస్ (ప్రియాంక భర్త)లను హృతిక్ అమెరికాలో కలిసి, మాట్లాడటంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. వీరి మధ్య ‘క్రిష్ 4’ అంశం కూడా చర్చకు వచ్చిందని, ఈ మూవీలో ప్రియాంకా చోప్రా దాదాపు ఖరారు అయ్యారని ప్రచారం జరుగుతోంది. -
స్టార్ సింగర్స్ మధ్య మనస్పర్థలు.. బ్రేకప్ ట్వీట్ వైరల్
మన దేశంలో చాలామంది సింగర్స్ ఉన్నారు. వాళ్లలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే గాయకుల లిస్ట్ తీస్తే కచ్చితంగా ఉండే పేరు నేహా కక్కర్. ఇప్పుడు సింగింగ్ షో జడ్జిగా పేరు తెచ్చుకుంది గానీ ఒకప్పుడు పాటలు బాగానే పాడింది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి.(ఇదీ చదవండి: మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్) నేహా కక్కర్ కు అక్క సోనూ కక్కర్, తమ్ముడు టోనీ కక్కర్ ఉన్నారు. వీళ్లు ముగ్గురు కూడా సింగర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కలిసి పాటలు పాడారు. స్టేజీ ఫెర్మార్మెన్స్ లు కూడా ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు అక్క సోనూ కక్కర్ షాకింగ్ ట్వీట్ చేసింది.తాను తమ్ముడు చెల్లి నుంచి విడిపోతున్నానని.. ఇక నుంచి వాళ్లకు తనకు సంబంధం లేదని సోనూ కక్కర్ ట్వీట్ చేసింది. తర్వాత కొన్ని గంటలకే ఈ ట్వీట్ డిలీట్ చేసింది. దీంతో నెటిజన్లు రెచ్చిపోయారు. ఇదంతా కొత్త ఆల్బమ్ కోసం చేస్తున్న స్టంట్ అని, పీఆర్ స్టంట్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏం జరిగిందనేది కక్కర్ సిస్టర్స్ చెబితే గానీ క్లారిటీ రాదు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) -
ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లపైనే.. ఆ సీన్లలో సిగ్గెందుకు?
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. పాత్ర డిమాండ్ చేస్తే నచ్చకపోయినా సరే ఇంటిమేట్ సీన్స్‌లో నటించాల్సిందే. తెరపై రొమాన్స్ చేస్తున్నప్పడు ఒక్కోసారి హీరోయిన్లు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి. అయితే, వాటిని బహిరంగంగా హీరోయిన్స్ చెప్పుకోలేరు. అయితే, బాలీవుడ్‌కు చెందిన ఈషా గుప్తా ఒక వెబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్ చేయడం తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని బాలీవుడ్ లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.2012లో జన్నత్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈషా గుప్తా(Esha Gupta) తెలుగులో 'వినయ విధేయ రామ' మూవీలోని పాటలో సందడి చేసింది. అయితే, ఆశ్రమ్ సీజన్ 3 (2022) వెబ్ సిరీస్‌లో సోనియాగా మెప్పించిన ఈ బ్యూటీ.. బాబీ డియోల్‌తో(Bobby Deol) ఒక ఇంటిమేట్ సీన్లో దుమ్మురేపింది. తాజాగా ఆ సీన్ గురించి ఇలా చెప్పింది. 'బాబీ డియోల్‌తో ఇంటిమేట్ సీన్ చేయడం నాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. చాలా ఇష్టంతోనే చేశాను. అలాంటి సీన్స్ చేయడంలో ఎందుకు సిగ్గు ఉంటుంది. అప్పటికే పదేళ్ల పాటు చిత్రపరిశ్రమలో ఉన్నాను. పరిణతి చెందిన వ్యక్తులతో ఎలాంటి సీన్స్ చేసినా సమస్య ఉండదు. బాబీ డియోల్ అప్పటికే అలాంటి రొమాన్స్ సీన్స్ చేసి ఉంటాడు. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆయన కూడా గతంలో కంటే ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. కథ మేరకు మాత్రమే ఆయన నాతో సన్నిహితంగా నటించాడు. తనని తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది బాబీ డియోల్‌కు తెలుసు.' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆశ్రమ్ వెబ్ సిరీస్‌లో బాబీతో ఉన్న ఇంటిమేట్ సీన్లను చూసిన వారు తనను సమర్థించగలరని ఆశిస్తున్నానని చెబుతూ ఆ ఇంటర్వ్యూను ఈషా ముగించింది. -
జాన్వీ కపూర్‌కు లంబోర్గిని కారు గిఫ్ట్.. అందుకోసమేనా?
నచ్చినవారికి గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. ఎవరికి తోచిన రీతిలో వారు ఆయా బహుమతులు ఇస్తుంటారు. అయితే ఇక్కడ ఓ అమ్మాయి మాత్రం ఏకంగా కోట్లు విలువ చేసే లగ్జరీ కారును తన స్నేహితురాలికి గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇంతకీ ఆ కారును అందుకుంది ఎవరో కాదు హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సింగర్, ఎంటర్ప్రెన్యూర్ అనన్య బిర్లా (Ananya Birla).. పర్పుల్ కలర్ లంబోర్గినిని జాన్వీకి శుక్రవారం నాడు గిఫ్ట్‌గా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ వ్యక్తి ఆ లంబోర్గిని కారును జాన్వీ ఇంటికి డ్రైవ్ చేసుకుని వెళ్లి ఇచ్చేశాడు. అంతేకాదు ఆ కారులో ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది. ఇక లంబోర్గిని కారు విలువ దాదాపు రూ.5 కోట్లు.ఎవరీ అనన్య బిర్లా?బిజినెస్ టైకూన్ కుమార్ మంగళం- నీరజ బిర్లాల కూతురే అనన్య. ఈమె సింగర్ మాత్రమే కాదు ఎంటర్ప్రెన్యూర్ కూడా! తాజాగా ఆమె మేకప్ బ్రాండ్‌ను కూడా లాంచ్ చేసింది. దీనికి జాన్వీ ప్రచారకర్తగా ఉండనుందని, అందుకు కృతజ్ఞతగా ఈ బహుమతిని పంపించిందని తెలుస్తోంది.జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురిగా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ధడక్ చిత్రంతో సినీప్రయాణం ఆరంభించింది. గుంజన్ సక్సేనా, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి వంటి సినిమాలు చేసింది. దేవర: పార్ట్ 1 చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో పెద్ది మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే ఆమె చేతిలో పరమ సుందరి, సన్నీ సంస్కారీ కి తులసి కుమారి చిత్రాలున్నాయి. View this post on Instagram A post shared by Hashtag Magazine (@hashtagmagazine.in) View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla)చదవండి: థియేటర్లలో ఆల్కహాల్ అమ్మకాలు.. తూలుతూ సినిమా చూడొచ్చు! -
బాలీవుడ్ లో తమన్నాకు వింత పరిస్థితులు హీరోయిన్ గా కెరీర్ ఖతమేనా ?
-
ఓటీటీలో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఎప్పటినుంచంటే?
హారర్ కంటెంట్‌ను ఇష్టపడనివారు ఎవరుంటారు? ఈ మధ్య యాక్షన్, ప్రేమకథా చిత్రాలెక్కువైపోవడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓ కొత్త హారర్ సిరీస్‌ను ఓటీటీ (OTT) ప్రియుల ముందుకు తీసుకొస్తోంది. అదే ఖౌఫ్. ఈ సిరీస్ కథేంటంటే.. ఓ అమ్మాయి స్వేచ్ఛగా బతకాలని పట్టణంలోని ఓ హాస్టల్లోకి అడుగుపెడుతుంది.ఏం జరిగింది?అప్పటికే అక్కడున్నవారు వెంటనే వెళ్లిపోమని సలహా ఇస్తారు. తర్వాత వెళ్లాలనుకున్నా వెళ్లలేవని హెచ్చరిస్తారు. వారి మాటల్ని ఆ అమ్మాయి లెక్క చేయదు. ఇంతకీ తన గదిలో ఏముంది? ఆ హాస్టల్ నుంచి అమ్మాయిలు ఎందుకు బయటపడలేకపోతున్నారు? చివరకు ఏం జరిగింది? వంటి అంశాలు తెలియాలంటే ఖౌఫ్ (Khauf Web Series) చూడాల్సిందే!ఓటీటీలో ఎప్పుడంటే?మోనిక పన్వర్, రజత్ కపూర్, గీతాంజలి కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించిన ఖౌఫ్ సిరీస్‌ను పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ డైరెక్ట్ చేశారు. మ్యాచ్బాక్స్ షార్ట్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సిరీస్ ఏప్రిల్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఖౌఫ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో హాస్టల్ గదిలోని అమ్మాయిలు భయంతో వణికిపోతున్నట్లుగా చూపించారు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోవాలనుకున్న వారి కంఠం తెగడాన్ని చూపించారు. హారర్ కథల్ని ఇష్టపడేవారు వచ్చే శుక్రవారం ప్రైమ్‌లో ఖౌఫ్ చూసేయండి.. చదవండి: సర్కస్ చూస్తున్నట్లే ఉంది.. ధోని తీరుపై హీరో అసహనం