
బాలీవుడ్ తీరుపై మరో హిందీ నటుడు అసంతృప్తి బయటపెట్టాడు. చాన్నాళ్లుగా హిందీలో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న రణ్ దీప్ హుడా(Randeep Hooda).. ఇప్పుడు సొంత ఇండస్ట్రీనే తన సరిగా పట్టించుకోలేదని అన్నాడు. తెలుగు ఇండస్ట‍్రీ నుంచి తనకు ప్రశంసలు వచ్చాయని అన్నాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)
2001 నుంచి ఇండస్ట్రీలో ఉన్న రణ్ దీప్ హుడా.. చాలానే హిందీ సినిమాల్లో నటించాడు. కానీ అనుకున్నంత పేరు రాలేదనే చెప్పొచ్చు. మధ్యమధ్యలో ఒకటి రెండు ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించాడు. 2020లో రిలీజైన 'ఎక్స్ ట్రాక్షన్'(Extraction Movie) అనే హాలీవుడ్ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. కానీ బాలీవుడ్ నుంచి తనకు సరైన ప్రశంసలు దక్కలేదని బాధపడుతున్నాడు.
కానీ తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు యాక్షన్ డైరెక్టర్స్ మాత్రం తాను చేసిన 'ఎక్స్ ట్రాక్షన్' సినిమా గురించి మాట్లాడి, తన యాక్షన్ ని మెచ్చుకున్నారని హుడా చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ తో పోలిస్తే తనకు టాలీవుడ్ లోనే గౌరవం దక్కిందని తాజాగా ఓ చోట మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)
తాను నటుడిగా మంచి సినిమాలు చేస్తూ సక్సెస్ అయ్యేసరికి బాలీవుడ్ లో కొందరు భయపడ్డారని, అందుకే పబ్లిక్ గా తనని ప్రశంసించలేకపోయారని హుడా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతడు విలన్ గా నటించిన లేటెస్ట్ మూవీ 'జాట్'(Jaat Movie). తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజై నాలుగు రోజులైంది. రణ్ దీప్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఏదేమైనా ఈ మధ్య కాలంలో పలువురు హిందీ నటీనటులే.. బాలీవుడ్ తీరుని ఎండగడుతూ, సొంత ఇండస్ట్రీ పరువు తీసేస్తున్నారు. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ తో తెలుగు చిత్రసీమ దూసుకెళ్తోంది.
(ఇదీ చదవండి: నోరు జారిన కుర్రాడు.. నిధి అగర్వాల్ మాత్రం)