అడవిలో థామా | Ayushmann Khurrana-Rashmika Mandanna Thama completes its final phase in Ooty | Sakshi
Sakshi News home page

అడవిలో థామా

May 6 2025 12:16 AM | Updated on May 6 2025 12:16 AM

Ayushmann Khurrana-Rashmika Mandanna Thama completes its final phase in Ooty

‘థామా’ సినిమా కోసం దాదాపు నెలపాటు అడవిలో జరిగే షూటింగ్‌లో పాల్గొంటున్నారట హీరోయిన్‌ రష్మికా మందన్నా. ఆయుష్మాన్‌ ఖురానా, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న హిందీ చిత్రం ‘థామా’. ఆదిత్య సర్పోత్దార్‌ దర్శకత్వంలో దినేష్‌ విజన్‌ నిర్మిస్తున్న ఈ హారర్‌ కామెడీ ఫిల్మ్‌ ఈ దీపావళికి రిలీజ్‌ కానుంది. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఊటీతోపాటు అక్కడి ఫారెస్ట్‌లో జరుగుతోందట.

ఆయుష్మాన్, రష్మికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సన్నివేశాల తర్వాత ఆయుష్‌– రష్మిక– నవాజుద్దీన్‌ సిద్ధిఖీలపై క్లైమాక్స్‌ సన్నివేశాలను కూడా ఇదే షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారని బాలీవుడ్‌ టాక్‌. ఈ షెడ్యూల్‌తో ‘థామా’ షూటింగ్‌ టాకీపార్ట్‌ దాదాపు పూర్తవుతుందని,పాటలు మాత్రమే బ్యాలెన్స్‌ ఉంటాయని సమాచారం.   ఇక మడాక్‌ ఫిల్మ్స్‌(నిర్మాత దినేష్‌ విజన్‌) హారర్‌ కామెడీ యూనివర్స్‌లో భాగంగా ‘థామా’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement