ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌గా విక్రాంత్‌ | Vikrant Massey to portray Gurudev Sri Sri Ravi Shankar in upcoming thriller White | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌గా విక్రాంత్‌

Apr 26 2025 3:35 AM | Updated on Apr 26 2025 6:19 AM

Vikrant Massey to portray Gurudev Sri Sri Ravi Shankar in upcoming thriller White

కొలంబియా అంతర్యుద్ధం ప్రధానాంశంగా ‘వైట్‌’

 ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ జీవితం వెండితెరపైకి రానుంది. రవిశంకర్‌ జీవితంతో సినిమా రానుందని ఎప్పట్నుంచో ఓ వార్త ప్రచారంలో ఉంది. బాలీవుడ్‌ దర్శక–నిర్మాతలు సిద్ధార్థ్‌ ఆనంద్, మహావీర్‌ జైన్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కూడా టాక్‌ వినిపించింది. ఈ చిత్రంలో రవిశంకర్‌ పాత్రను విక్రాంత్‌ మాస్సీ చేయనున్నారనే ఊహాగానాలూ నెలకొన్నాయి. అందుకు తగ్గట్టు గత ఏడాది రవిశంకర్‌ని కలిశారు విక్రాంత్‌.

ఆయనపాత్రలో ఒదిగిపోవడానికి కావాల్సిన సలహాలు, సూచనలు తీసుకున్నారట. ఈ చిత్రం రెగ్యులర్‌ షూట్‌ని జూలైలో ఆరంభించాలనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ‘వైట్‌’ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ మౌంటూ బస్సీ దర్శకత్వం వహించనున్నారు.

కొలంబియాలో జరిగిన అంతర్యుద్ధాన్ని పరిష్కరించడంలో రవిశంకర్‌ ఏ విధంగా కీలకపాత్ర పోషించారనేది ఈ చిత్రం ప్రధానాంశమని సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో రవిశంకర్‌పాత్రలో ఒదిగిపోవడానికి విక్రాంత్‌ మాస్సీ మేకోవర్‌ అవుతున్నారు. హిందీ, ఇంగ్లిష్, స్పానిష్‌ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించి, పలు భాషల్లో అనువదించి, రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది ‘వైట్‌’ విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement