తొమ్మిది గజాల చీరలో మహారాష్ట్ర అమ్మాయిలా స్టార్‌ హీరోయిన్‌ | WAVES Summit 2025 Alia Bhatt Maharashtrian Elegance In Nauvari Saree | Sakshi
Sakshi News home page

WAVES Summit 2025 తొమ్మిది గజాల చీరలో మహారాష్ట్ర అమ్మాయిలా స్టార్‌ హీరోయిన్‌

May 1 2025 4:56 PM | Updated on May 1 2025 5:18 PM

WAVES Summit 2025 Alia Bhatt Maharashtrian Elegance In Nauvari Saree

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌ తన సింపుల్‌, ట్రెడిషనల్‌  ఫ్యాషన్‌తో అభిమానుల  హృదయాలను గెల్చుకుంది.   వేవ్స్ సమ్మిట్ 2025 ( WAVES Summit 2025) లో ఉత్సాహభరితమైన  మహారాష్ట్ర రాష్ట్రంలో మహిళలు ధరించే ఒక ప్రత్యేకమైన నౌవారీ చీరలో అద్భుతంగా కనిపించింది. దీనికి  సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

అలియా వరల్డ్ ఆడియో విజువల్‌ అండ్‌  ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌కు హాజరైంది. ఈ సందర్భంగా తనదైన మినిమలిస్టిక్ ఫ్యాషన్, స్టేట్‌మెంట్‌ లుక్‌తో  'వావ్' అనిపించిందిముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో  మే 1న జరిగిన ఈవెంట్‌లో మహారాష్ట్ర అమ్మాయిగా  మారిపోయింది.   తొమ్మిది గజాల నౌవారీ చీరలో ట్రెడిషనల్‌గా చాలా అందంగా కనిపించింది. "నౌ" అంటే తొమ్మిది, తొమ్మిది గజాల  నౌవారీ చీర స్టైల్‌  మహారాష్ట్రలో ప్రసిద్ధి. పీచ్, నారింజ రంగుల కలయితో గులాబీ రంగు అంచుతో వచ్చిన ఈ చీరకు, పూల డిజైన్‌తో హైలైట్ చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరైన అలియా భట్, తన నటనా నైపుణ్యాలు, అందం, ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లు,  అది సాంప్రదాయమైనా లేదా పాశ్చాత్యమైనా ఫ్యాన్స్‌ను ఫిదా చేయాల్సిందే.

కాగా 2024లో మెట్ గాలాలో అరంగేట్రం చేసిన ఆలియా భట్, తన లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది.  సబ్యసాచి ముఖర్జీ నుండి అందమైన చీరలో బ్యూటిఫుల్‌గా  కనిపించింది.  నటిగాస్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. బాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2022 ఆర్.ఆర్.ఆర్  చిత్రంతో   టాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చింది. బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌ని పెళ్లాడినా అలియా ఒక ఆడబిడ్డకు తల్లి కూడా.

Advertisement
 
Advertisement
Advertisement