
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. తన నానమ్మ నిర్మల్ కపూర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తన చెల్లి ఖుషీ కపూర్, బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి గ్రాండ్ మదర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. బోనీ కపూర్ తల్లి అయిన నిర్మల్ కపూర్ వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యంతో బాధపడుతూ 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు.
(ఇది చదవండి: శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట తీవ్ర విషాదం)
కాగా.. జాన్వీ కపూర్ విషయానికొస్తే శ్రీదేవి ముద్దుల కూతురు టాలీవుడ్ సినిమాతో బిజీగా ఉంది. దేవరతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రామ్ చరణ్ సరసన కనిపించనుంది. బుచ్చి బాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
#TFNExclusive: Visuals of #JanhviKapoor at her grand mother's last rites in Mumbai!#Janhvi #TeluguFilmNagar pic.twitter.com/3skROCvRXV
— Telugu FilmNagar (@telugufilmnagar) May 3, 2025