క్రిష్‌ 4లో? | Bollywood: Priyanka Chopra reunites with Hrithik Roshan for Krrish 4 | Sakshi
Sakshi News home page

క్రిష్‌ 4లో?

Apr 13 2025 3:44 AM | Updated on Apr 13 2025 3:44 AM

Bollywood: Priyanka Chopra reunites with Hrithik Roshan for Krrish 4

బాలీవుడ్‌ సూపర్‌ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్‌’ నుంచి ‘క్రిష్‌ 4’ రానున్న సంగతి తెలిసిందే. ‘క్రిష్‌’ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాల్లో హీరోగా నటించిన హృతిక్‌ రోషన్‌... ‘క్రిష్‌ 4’ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. రాకేష్‌ రోషన్, ఆదిత్యా చోప్రా నిర్మించనున్నారు.

వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది.  ఇప్పటికే ఈ మూవీలో ప్రీతీ జింతా, వివేక్‌ ఓబెరాయ్‌ వంటి వారు నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ప్రియాంకా చోప్రా పేరు తెరపైకి వచ్చింది. కాగా ఇటీవల  ప్రియాంకా చోప్రా – నిక్‌ జోనస్‌ (ప్రియాంక భర్త)లను హృతిక్‌ అమెరికాలో కలిసి, మాట్లాడటంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. వీరి మధ్య ‘క్రిష్‌ 4’ అంశం కూడా చర్చకు వచ్చిందని, ఈ మూవీలో ప్రియాంకా చోప్రా దాదాపు ఖరారు అయ్యారని ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement