
ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. థియేటర్లలో రిలీజైన చాలా సినిమాలు.. తక్కువ రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కానీ రీసెంట్ గా 'భోల్ చుక్ మాఫ్' అనే హిందీ చిత్రం మాత్రం విడుదలకు మరోరోజు ఉందనగా.. ఓటీటీలోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకెక్కింది.
లెక్క ప్రకారం 'భోల్ చుక్ మాఫ్' సినిమా మే 09న థియేటర్లలో రిలీజ్ అవ్వాలి. అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ చేశారు. థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. చాలామంది టికెట్స్ కూడా కొనుకున్నారు. కానీ రిలీజ్ కి ఒకరోజు ముందు నిర్మాతలు అందరికీ షాకిచ్చారు. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఒక్క ఫ్రేమ్ లో 19 మంది తెలుగు యంగ్ డైరెక్టర్స్.. ఏంటి విశేషం?)
దీంతో ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్.. బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. ఈ సినిమా కోసం తాము చాలా ఖర్చు చేశామని, ఇప్పుడు ఇలా ఓటీటీలో రిలీజ్ చేయడం సరికాదని రూ.60 కోట్ల దావా వేసింది. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై హైకోర్ట్ స్టే ఇచ్చింది. అంటే తదుపరి ఆర్డర్ వచ్చేంతవరకు మూవీని ఎక్కడా విడుదల చేయడానికి వీల్లేదనమాట.
రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలో భారత క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ)