ఒక్క ఫ్రేమ్ లో 19 మంది తెలుగు యంగ్ డైరెక్టర్స్.. ఏంటి విశేషం? | Hit 3 Director Sailesh Kolanu Party With Telugu Directors | Sakshi
Sakshi News home page

Sailesh Kolanu: ఒక్క సినిమా సక్సెస్.. పార్టీ చేసుకున్న యువ దర్శకులు

May 11 2025 1:05 PM | Updated on May 11 2025 1:16 PM

Hit 3 Director Sailesh Kolanu Party With Telugu Directors

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడంతా యువ దర్శకులదే హవా. ఒకప్పుడు వెలుగువెలిగి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన చాలామంది డైరెక్టర్స్.. ఇప్పుడు సీనియర్లు అయిపోయారు. కెరీర్ పరంగా సైలెంట్ ‍అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా హిట్ 3 సినిమా సక్సెస్ అయిన సందర్భంగా యంగ్ డైరెక్టర్స్ అంతా ఒక్క చోటకు చేరారు.

(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) 

హిట్ 3 దర్శకుడు శైలేష్ కొలను ఇప్పుడు ట్వీట్ పెట్టడంతో తెలుగు యంగ్ డైరెక్టర్స్ మధ్య ఎంత బాండింగ్ ఉందో బయటపడింది. తామంతా ఎప్పుడు పార్టీ చేసుకుంటామని, ఒకరి సినిమా గురించి మరొకరం డిస్కస్ చేసుకుంటామని, కాకపోతే ఇలా ఇన్నాళ్లకు బయటపడిందని శైలేష్ చెప్పుకొచ్చాడు.

శైలేష్ పోస్ట్ చేసిన ఫొటోలో ఏకంగా 19 మంది యంగ్ డైరక్టర్స్ ఉన్నారు.  వీళ్లలో శైలేష్ తో పాటు పవన్ సాధినేని, రాహుల్ సంక్రిత్యాన్, మున్నా, అనుదీప్, బుచ్చిబాబు, సాయి రాజేశ్, శివ నిర్వాణ, శ్రీరామ్ ఆదిత్య, చందు మొండేటి, సందీప్ రాజ్, హసిత్ గోలి, వశిష్ఠ, వెంకీ కుడుముల, వివేక్ ఆత్రేయ, వినోద్ అనంతోజు, సాగర్ కె చంద్ర, ఆర్ఎస్ జే స్వరూప్, భరత్ కమ్మ ఉన్నారు.

(ఇదీ చదవండి: సూర్యకు గిఫ్ట్‌ ఇచ్చిన 'రెట్రో' డిస్ట్రిబ్యూటర్‌..) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement