Chandoo Mondati
-
ఒక్క ఫ్రేమ్ లో 19 మంది తెలుగు యంగ్ డైరెక్టర్స్.. ఏంటి విశేషం?
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడంతా యువ దర్శకులదే హవా. ఒకప్పుడు వెలుగువెలిగి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన చాలామంది డైరెక్టర్స్.. ఇప్పుడు సీనియర్లు అయిపోయారు. కెరీర్ పరంగా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా హిట్ 3 సినిమా సక్సెస్ అయిన సందర్భంగా యంగ్ డైరెక్టర్స్ అంతా ఒక్క చోటకు చేరారు.(ఇదీ చదవండి: దర్శకుడి డ్రీమ్ కార్.. గిఫ్ట్ ఇచ్చిన సూర్య-కార్తీ) హిట్ 3 దర్శకుడు శైలేష్ కొలను ఇప్పుడు ట్వీట్ పెట్టడంతో తెలుగు యంగ్ డైరెక్టర్స్ మధ్య ఎంత బాండింగ్ ఉందో బయటపడింది. తామంతా ఎప్పుడు పార్టీ చేసుకుంటామని, ఒకరి సినిమా గురించి మరొకరం డిస్కస్ చేసుకుంటామని, కాకపోతే ఇలా ఇన్నాళ్లకు బయటపడిందని శైలేష్ చెప్పుకొచ్చాడు.శైలేష్ పోస్ట్ చేసిన ఫొటోలో ఏకంగా 19 మంది యంగ్ డైరక్టర్స్ ఉన్నారు. వీళ్లలో శైలేష్ తో పాటు పవన్ సాధినేని, రాహుల్ సంక్రిత్యాన్, మున్నా, అనుదీప్, బుచ్చిబాబు, సాయి రాజేశ్, శివ నిర్వాణ, శ్రీరామ్ ఆదిత్య, చందు మొండేటి, సందీప్ రాజ్, హసిత్ గోలి, వశిష్ఠ, వెంకీ కుడుముల, వివేక్ ఆత్రేయ, వినోద్ అనంతోజు, సాగర్ కె చంద్ర, ఆర్ఎస్ జే స్వరూప్, భరత్ కమ్మ ఉన్నారు.(ఇదీ చదవండి: సూర్యకు గిఫ్ట్ ఇచ్చిన 'రెట్రో' డిస్ట్రిబ్యూటర్..) We have been wanting to catch up for a long time now and what better way than to share the success of my movie with this bunch of people who stood by me in the toughest of times. You may not know this but this group of directors in TFI keep in touch, check on each other and make… pic.twitter.com/k7zYQlsvXY— Sailesh Kolanu (@KolanuSailesh) May 11, 2025 -
తండేల్ 2లో రామ్..?
-
సూర్యతో తండేల్ 2..!
-
మ్యాడ్లీ మిస్సింగ్
వీడ్కోలు ఎప్పుడూ బాధగానే ఉంటుంది. కలిసి పనిచేసిన టీమ్‌కు టాటా బై బై చెప్పడం కొంచెం కష్టమే. ఇప్పుడు మాధవన్ ‘సవ్యసాచి’ టీమ్‌కు వీడ్కోలు పలుకుతున్నారు. చందూ మొండేటి డైరెక్షన్లో నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మాధవన్ నెగటివ్ రోల్లో కనిపించనున్నారు. ‘సవ్యసాచి’ సినిమా షూటింగ్లో తన పార్ట్‌కు ప్యాకప్ చెబుతూ– ‘‘ఈ సినిమా చేస్తున్నంత సేపూ చాలా ఎంజాయ్ చేశాను. రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు మాధవన్. తను ‘సవ్యసాచి’ టీమ్‌ను ఎంత మిస్ అవుతున్నారో ఆ టీమ్ కూడా మాధవన్‌ను అంతే మిస్ అవుతోంది. అందుకే లాస్ట్ డే షూట్లో టీమ్ అందరి తరఫున మాధవన్‌కు ఓ లెటర్ రాశారు. అందులోని సారాంశం ఏంటంటే... ‘డియర్ మ్యాడీ సార్, పదిహేడేళ్లు అవుతోంది మేమందరం మీతో ప్రేమలో పడి. వీడియో జాకీ నుంచి ప్యాన్ ఇండియా స్టార్‌గా మీ జర్నీ చాలామందికి ఇన్స్పిరేషన్. జెంటిల్మెన్, డైరెక్టర్స్ విజన్‌కు కట్టుబడే ఒక ఆర్టిస్ట్‌తో అసోసియేట్ అవ్వడం ఆనందంగా ఉంది. స్క్రీన్ మీద మీ పెర్ఫార్మెన్స్ చూడటం ప్లెజర్. అలాంటిది సెట్స్‌లో డైరెక్ట్‌గా మీ పెర్ఫార్మెన్స్ చూడటం అదృష్టం. మీరు స్ట్రైట్ తెలుగు సినిమాలు చేద్దాం అనుకోవడం, అది మా ‘సవ్యసాచి’ ద్వారా అవ్వాలి అనుకోవడంతోనే మేం సగం విజయం సాధించినట్టే. మా టీమ్ అందరూ మిమ్మల్ని హృదయపూర్వకంగా తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్ చేస్తున్నాం. గత సంవత్సరాల్లాగే ఈ సంవత్సరం కూడా మీకు ‘ది బెస్ట్’గా ఉండాలని కోరుకుంటూ’... ప్రేమతో చందూ మొండేటి, టీమ్ సవ్యసాచి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది. -
ఫిబ్రవరి 9న ‘కిర్రాక్ పార్టీ’ రిలీజ్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ని తెలుగు రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా కథానాయికలుగా నటిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు సమకూరుస్తుండడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, ప్రస్తుతం రాజమండ్రిలో కీలక సన్నివేశాల చిత్రీకరణతోపాటు హైద్రాబాద్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోంది.ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. నిఖిల్ మాచో లుక్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచాయి. ‘హ్యాపీడేస్’ తర్వాత తెలుగులో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న పూర్తి స్థాయి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ‘కిర్రాక్ పార్టీ’ నిలుస్తుంది. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా మా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. -
'కార్తికేయ 2' వచ్చే ఏడాది మొదలవుతోంది..!
నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ. సుబ్రమణ్యం స్వామి గుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. స్వామిరారా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న నిఖిల్ కు 'కార్తికేయ' సక్సెస్ స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అందుకే కార్తికేయ రిలీజ్ తరువాత ఆ సినిమాకు సీక్వెల్ ను రూపొందించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ప్రస్తుతం కన్నడ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్న నిఖిల్, మరోసారి కార్తీకేయ సీక్వల్ పై క్లారిటీ ఇచ్చాడు. తొలి భాగం రిలీజ్ అయి మూడేళ్లు అవుతున్న సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారికి వచ్చే ఏడాది సీక్వల్ మొదలవుతుందని తెలిపారు. తొలి భాగాన్ని ఒక గుడి నేపథ్యంలోనే తెరకెక్కించిన చందూ రెండో భాగాన్ని అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా గతంలో వార్తలు వినిపించాయి. Karthikeya Part 2... Script Loading... ☺️ https://t.co/bo941J83fT — Nikhil Siddhartha (@actor_Nikhil) 24 October 2017 3 yrs went by quick.. It's my most favorite film... There will be a 2nd installement starting next year.. #Karthikeya #3yrs @chandoomondeti https://t.co/Aic6d7j7FW — Nikhil Siddhartha (@actor_Nikhil) 24 October 2017 -
ప్రేమమ్ కాంబినేషన్లో మరో సినిమా
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ప్రేమమ్. మలయాళ సూపర్ హిట్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. కార్తీకేయ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన చందూ మొండేటి ప్రేమమ్ సక్సెస్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. మలయాళ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచిన చందూ అక్కినేని హీరోలతో మరో ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పనులను దాదాపుగా పూర్తి చేసిన నాగచైతన్య, కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలో ప్రేమమ్ ఫేం అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించనుంది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీమేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రేమమ్ కాంబినేషన్ సినిమాను నిర్మిస్తోంది.