మ్యాడ్లీ మిస్సింగ్‌ | R Madhavan wraps up Naga Chaitanya-Chandoo Monteni | Sakshi
Sakshi News home page

మ్యాడ్లీ మిస్సింగ్‌

Apr 18 2018 12:50 AM | Updated on Apr 18 2018 12:50 AM

R Madhavan wraps up Naga Chaitanya-Chandoo Monteni - Sakshi

వీడ్కోలు ఎప్పుడూ బాధగానే ఉంటుంది. కలిసి పనిచేసిన టీమ్‌కు టాటా బై బై చెప్పడం కొంచెం కష్టమే. ఇప్పుడు మాధవన్‌ ‘సవ్యసాచి’ టీమ్‌కు వీడ్కోలు పలుకుతున్నారు. చందూ మొండేటి డైరెక్షన్‌లో నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మాధవన్‌ నెగటివ్‌ రోల్‌లో కనిపించనున్నారు. ‘సవ్యసాచి’ సినిమా షూటింగ్‌లో తన పార్ట్‌కు ప్యాకప్‌ చెబుతూ– ‘‘ఈ సినిమా చేస్తున్నంత సేపూ చాలా ఎంజాయ్‌ చేశాను. రిలీజ్‌ కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు మాధవన్‌. తను ‘సవ్యసాచి’ టీమ్‌ను ఎంత మిస్‌ అవుతున్నారో ఆ టీమ్‌ కూడా మాధవన్‌ను అంతే మిస్‌ అవుతోంది. అందుకే లాస్ట్‌ డే షూట్‌లో టీమ్‌ అందరి తరఫున మాధవన్‌కు ఓ లెటర్‌ రాశారు.

అందులోని సారాంశం ఏంటంటే... ‘డియర్‌ మ్యాడీ సార్, పదిహేడేళ్లు అవుతోంది మేమందరం మీతో ప్రేమలో పడి. వీడియో జాకీ నుంచి ప్యాన్‌ ఇండియా స్టార్‌గా మీ జర్నీ చాలామందికి ఇన్‌స్పిరేషన్‌. జెంటిల్‌మెన్, డైరెక్టర్స్‌ విజన్‌కు కట్టుబడే ఒక ఆర్టిస్ట్‌తో అసోసియేట్‌ అవ్వడం ఆనందంగా ఉంది. స్క్రీన్‌ మీద మీ పెర్ఫార్మెన్స్‌ చూడటం ప్లెజర్‌. అలాంటిది సెట్స్‌లో డైరెక్ట్‌గా మీ పెర్ఫార్మెన్స్‌ చూడటం అదృష్టం. మీరు స్ట్రైట్‌ తెలుగు సినిమాలు చేద్దాం అనుకోవడం, అది మా ‘సవ్యసాచి’ ద్వారా అవ్వాలి అనుకోవడంతోనే మేం సగం విజయం సాధించినట్టే. మా టీమ్‌ అందరూ మిమ్మల్ని హృదయపూర్వకంగా తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్‌ చేస్తున్నాం. గత సంవత్సరాల్లాగే ఈ సంవత్సరం కూడా మీకు ‘ది బెస్ట్‌’గా ఉండాలని కోరుకుంటూ’... ప్రేమతో చందూ మొండేటి, టీమ్‌ సవ్యసాచి. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్‌ 14న విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement