ఆ సినిమా వల్లే బాలీవుడ్‌లో ఆఫర్‌ వచ్చింది: శ్రీ విష్ణు | Tollywood Hero Sri Vishnu about his Bollywood Offer in Single promotions | Sakshi
Sakshi News home page

Sree Vishnu: ఆ సినిమా తర్వాతే బాలీవుడ్‌లో ఆఫర్‌ వచ్చింది: శ్రీ విష్ణు

May 11 2025 8:41 PM | Updated on May 11 2025 8:41 PM

Tollywood Hero Sri Vishnu about his Bollywood Offer in Single promotions

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు సింగిల్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నెల 9 నుంచి సింగిల్‌ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొత్తం రెండురోజుల్లోనే బాక్సాఫీస్‌ వద్ద రూ. 11.2 కోట్లు సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. శ్రీవిష్ణు కెరీర్‌లో మరో భారీ హిట్‌గా సింగిల్ మూవీ నిలిచింది.

సింగిల్ రిలీజ్‌ నేపథ్యంలో శ్రీ విష్ణు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రతి సినిమాతో ఏదో ఒక అనుభవాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రారంభంలో చిరంజీవి, వెంకటేశ్ లాంటి పెద్ద హీరోలు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా ఎనర్జీ ఇచ్చేదన్నారు. బ్రోచెవారేవరురా లాంటి సినిమాకు చాలా ప్రశంసలు వచ్చాయి.. ఆ సమయంలో గొప్ప ఫీలింగ్ కలిగిందని తెలిపారు. బన్నీ, రవితేజ నా ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తుంటారని వెల్లడించారు.

ఇక స్వాగ్ సినిమా విషయానికొస్తే.. తమిళం నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. అలాగే మొదటిసారి స్వాగ్‌ మూవీ తర్వాత బాలీవుడ్‌ నుంచి ఆఫర్ వచ్చిందని శ్రీ విష్ణు వెల్లడించారు. కాగా.. సింగిల్ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా  నటించారు. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రంగా దర్శకుడు కార్తీక్‌ రాజు ఈ మూవీని తెరకెక్కించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్‌ చౌదరి సంయుక్తంగా నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement