
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. పాత్ర డిమాండ్ చేస్తే నచ్చకపోయినా సరే ఇంటిమేట్ సీన్స్‌లో నటించాల్సిందే. తెరపై రొమాన్స్ చేస్తున్నప్పడు ఒక్కోసారి హీరోయిన్లు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి. అయితే, వాటిని బహిరంగంగా హీరోయిన్స్ చెప్పుకోలేరు. అయితే, బాలీవుడ్‌కు చెందిన ఈషా గుప్తా ఒక వెబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్ చేయడం తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని బాలీవుడ్ లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.
2012లో జన్నత్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈషా గుప్తా(Esha Gupta) తెలుగులో 'వినయ విధేయ రామ' మూవీలోని పాటలో సందడి చేసింది. అయితే, ఆశ్రమ్ సీజన్ 3 (2022) వెబ్ సిరీస్‌లో సోనియాగా మెప్పించిన ఈ బ్యూటీ.. బాబీ డియోల్‌తో(Bobby Deol) ఒక ఇంటిమేట్ సీన్‌లో దుమ్మురేపింది. తాజాగా ఆ సీన్ గురించి ఇలా చెప్పింది. 'బాబీ డియోల్‌తో ఇంటిమేట్ సీన్ చేయడం నాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. చాలా ఇష్టంతోనే చేశాను. అలాంటి సీన్స్ చేయడంలో ఎందుకు సిగ్గు ఉంటుంది.
అప్పటికే పదేళ్ల పాటు చిత్రపరిశ్రమలో ఉన్నాను. పరిణతి చెందిన వ్యక్తులతో ఎలాంటి సీన్స్ చేసినా సమస్య ఉండదు. బాబీ డియోల్ అప్పటికే అలాంటి రొమాన్స్ సీన్స్ చేసి ఉంటాడు. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆయన కూడా గతంలో కంటే ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. కథ మేరకు మాత్రమే ఆయన నాతో సన్నిహితంగా నటించాడు. తనని తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది బాబీ డియోల్‌కు తెలుసు.' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఆశ్రమ్ వెబ్ సిరీస్‌లో బాబీతో ఉన్న ఇంటిమేట్ సీన్లను చూసిన వారు తనను సమర్థించగలరని ఆశిస్తున్నానని చెబుతూ ఆ ఇంటర్వ్యూను ఈషా ముగించింది.