
‘‘ఇన్ని రోజులు మనం యుద్ధం రాకూడదనే కోరుకున్నాం. కానీ, ఉగ్రవాదులు మన ప్రజలను చంపుతుంటే సహించేది లేదు. భారత్ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వలేదు. ఇన్ని రోజులు మన మీద జరిగిన దాడుల తర్వాత ఆ బాధను తీర్చుకోవడానికే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. వారి దుశ్చర్యలను తిప్పి కొడుతున్నాం. మనది దూకుడు కాదు... దశాబ్దాల బాధకు సమాధానం. అసలు ఉగ్రవాదులు భూమ్మీద ఉండకూడదు’’ అని హీరోయిన్ జాన్వీ కపూర్ పేర్కొన్నారు.
కశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఇండియన్ ఆర్మీపై ప్రశంసలు కురుపిస్తూ, వారికి మద్దతుగా సోషల్ మీడియాలోపోస్టులు పెడుతున్నారు. జాన్వీ కపూర్ కూడా ఇప్పటికే పలుపోస్టులు పెట్టినప్పటికీ, తాజాగా తన ఇన్ స్టా్రగామ్‌లో సుదీర్ఘమైనపోస్ట్ పెట్టారు. ‘‘ఇండియా– పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జమ్మూపై దాడుల విజువల్స్ చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను.
పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడులు నన్ను ఎంతో బాధించాయి. ఇది నేను ఇప్పటివరకూ ఎప్పుడూ అనుభవించని బాధ. ఇన్ని రోజులు విదేశాల్లో ఇలాంటి దాడులు జరుగుతుంటే శాంతిని పాటించాలని కోరుకున్నాం. కానీ ఇప్పుడు అదే పరిస్థితి మనవరకు వచ్చింది. మన సైనికులు సరిహద్దు దగ్గరపోరాడుతూ మనల్ని కా పాడుతున్నారు. మన దేశ సార్వభౌమత్వాన్ని రక్షిస్తున్న సైనికులకు ఎప్పటికీ రుణపడి ఉండాలి.
వాళ్ల వల్లే మనం సురక్షితంగా ఉంటున్నాం. ఇలాంటి సమయంలో దేశం మొత్తం మన భారతీయ జవానులకు మద్దతుగా నిలవాలి. ఈ యుద్ధంలో అమాయకులుప్రాణాలు కోల్పోవడం నన్ను బాధిస్తోంది. త్వరలోనే ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను. మన సైనికుల కోసంప్రార్థిస్తుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి పుకార్లను ఇతరులతో పంచుకోవద్దు’’ అంటూ జాన్వీ కపూర్‌పోస్ట్ చేశారు. ఆమెపోస్ట్‌పై పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.