
బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. అతను హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న హౌస్ అరెస్ట్ అనే షోలో విపరీతమైన, అసభ్యకరమైన కంటెంట్‌తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఈ షోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోను ఇప్పటికే సదరు ఓటీటీ సంస్థ బ్యాన్ చేసింది. ఈ అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేస్తోన్న అజాజ్ ఖాన్‌పై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదంలో నడుస్తుండగానే అజాజ్ ఖాన్‌పై ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకుంటానని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అజాజ్ ఖాన్‌పై చార్‌కోప్ పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో అతనిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.
అజాజ్ ఖాన్ తన ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో తనకు ఓ పాత్ర ఆఫర్ చేశాడని ఆమె తెలిపింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తనకు లవ్ ప్రపోజ్ చేశాడని నటి ఆరోపించింది. మార్చి 25న తన నివాసంలోనే నాపై అత్యాచారం చేశాడని.. రెండు సార్లు తనను పెళ్లి చేసుకుంటానని హామీ కూడా ఇచ్చాడని చార్కోప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మాకు నాలుగు వివాహాలకు అనుమతి ఉందని తనకు చెప్పాడని నటి ప్రస్తావించింది. ఆమె ఆరోపణలతో కేసు నమోదు చేసిన చార్కోప్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో మహిళలను అసభ్యకరంగా చూపించినందుకు అజాజ్ ఖాన్‌పై అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.