విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే.. నోరు మూయించిన సోనాక్షి | Sonakshi Sinha Hit Back Troll Claiming Her Divorce From Zaheer Iqbal Is No Far | Sakshi
Sakshi News home page

త్వరలోనే విడిపోతారు.. తప్పకుండా విడాకులు తీసుకుంటామన్న హీరోయిన్‌.. కాకపోతే!

Apr 17 2025 4:10 PM | Updated on Apr 17 2025 4:26 PM

Sonakshi Sinha Hit Back Troll Claiming Her Divorce From Zaheer Iqbal Is No Far

సోనాక్షి సిన్హ (Sonakshi Sinha)- జహీర్‌ ఇక్బాల్‌ (Zaheer Iqbal).. ప్రేమించుకున్నారు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కలిసి సంతోషంగా జీవిస్తున్నారు. ఈ సంతోషాన్ని చూసి కొందరు జనాలకు కళ్లు మండుతున్నాయి. కులమతాలకు అతీతమైనది ప్రేమ అని వీరు చాటి చెప్తుంటే వాళ్ల కడుపు మండిపోతోంది. ఆ కడుపు మంట చల్లార్చుకునేందుకు వీరి కాపురంలో నిప్పులు పోసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీళ్లు విడిపోవాలని ఎదురుచూస్తున్నారు. ఏ పోస్టు పెట్టినా విడాకుల గురించే కామెంట్లు చేస్తున్నారు. 

కచ్చితంగా విడాకులు తీసుకుంటాం
తాజాగా ఆమె పోస్ట్‌ కింద ఓ వ్యక్తి మీరు విడాకులు తీసుకునే రోజు దగ్గర్లోనే ఉంది అని శపించాడు. అది చూసిన సోనాక్షికి సహనం చచ్చిపోయింది. అవునా.. ముందు మీ అమ్మానాన్నకు విడాకులు అవనీ.. తర్వాత కచ్చితంగా మేము తీసుకుంటాం. ఒట్టు అని వ్యంగ్యంగా రిప్లై ఇచ్చింది. అది చూసిన జనాలు.. ఇలాంటివాళ్లకు ఇలాగే గడ్డిపెట్టాలని సోనాక్షిని సపోర్ట్‌ చేస్తున్నారు. సోనాక్షి, జహీర్‌ ఇక్బాల్‌ ఏడేళ్లపాటు ప్రేమించుకున్నారు. 23 జూన్‌, 2024న పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి వీరిపై ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంది. 

ట్రోలింగ్‌పై హీరోయిన్‌ తండ్రి ఫైర్‌
దీనిపై సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హ స్పందిస్తూ.. పనీపాటా లేక ఖాళీగా తిరుగుతున్న అందరికీ ఇదొక్కటే పనుంది. నా కూతురు రాజ్యాంగవిరుద్ధంగా, చట్టాన్ని అతిక్రమించే విధంగా ఏ తప్పూ చేయలేదే? పెళ్లనేది ఇద్దరు వ్యక్తులు తీసుకునే నిర్ణయం. వారి మధ్యలోకి దూరేందుకు ఎవరికీ అర్హత లేదు. వాళ్లను విమర్శించేవాళ్లకు నేనొక్కటే చెప్పదల్చుకున్నా.. వెళ్లి మీ పని చూసుకోండి.. మీ జీవితాన్ని ముందు చక్కదిద్దుకోండి అని చెప్పుకొచ్చాడు.

చదవండి: రాజ్‌తరుణ్‌ పేరెంట్స్‌ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement