
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ప్రకృతి కకర్ ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. తన ప్రియుడు, వ్యాపారవేత్త అయిన వినయ్ ఆనంద్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. నా జీవితంలో ఏ విషయమైనా సరే జరిగే వరకు సీక్రెట్‌గానే ఉంచుతానని సింగర్ ప్రకృతి చెప్పుకొచ్చింది.
వచ్చే ఏడాదిలో తామిద్దరు వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నామని ప్రకృతి కాకర్ వెల్లడించింది. తన కాబోయే భర్త ఇండస్ట్రీకి చెందినవారు కాదు.. అందువల్ల ప్రశాంతమైన జీవితాన్నే ఇష్టపడతాడని తెలిపింది. ఇదంతా రాత్రికి రాత్రే జరిగిన విషయం కాదని.. అతనితో మూడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నానని పేర్కొంది. తమ రిలేషన్‌ను పెళ్లి బంధంగా మార్చుకుంటున్నట్లు సింగర్ వివరించింది.
తన ప్రేమ, డేటింగ్ గురించి మాట్లాడుతూ.. "మేము ఒక కుటుంబ వివాహానికి హాజరు కావడానికి లండన్ వెళ్లాం. అక్కడే వినయ్ అద్భుతంగా ప్లాన్ చేసిన వేడుకలో నాకు ప్రపోజ్ చేశారు. మా బంధువుల వివాహంలో అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. అదే సమయంలో వినయ్ తనకు ప్రపోజ్ చేశాడు. ఈ విషయాన్ని నా సిస్టర్స్‌తో పాటు అందరూ రహస్యంగా ఉంచారు. నాకు ఇప్పుడు కృతజ్ఞత తప్ప మరేలాంటి అనుభూతి చెందడం లేదు.. ఎందుకంటే నేను ఎప్పుడూ కలలు కనే విషయం.. చాలా అద్భుతంగా జరిగింది,' అని తెలిపింది.