ప్రెగ్నెన్సీతో స్టార్ హీరోయిన్.. కోటి రూపాయల గిఫ్ట్! | Sidharth Malhotra Gifted Car To Kiara Advani Worth 1 Crore | Sakshi
Sakshi News home page

Kiara Advani: ఈ రేంజ్ కాస్ట్ లీ బహుమతి.. ఏమిచ్చాడంటే?

Apr 26 2025 4:26 PM | Updated on Apr 26 2025 4:58 PM

Sidharth Malhotra Gifted Car To Kiara Advani Worth 1 Crore

తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన కియారా అడ్వాణీ(Kiara Advani) ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. చివరగా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'లో కనిపించింది. ఈమె చేసిన రెండు సినిమాలు త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే ఈమెకు ఇప్పుడు భర్త ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చాడు. 

2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్న కియారా.. బాలీవుడ్ కే చెందిన సిద్ధార్థ్ మల్హోత్రాని(Sidharth Malhotra) ప్రేమించింది. కలిసి సినిమాలు కూడా చేసిన వీళ్లిద్దరూ 2023లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.  ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో శుభవార్త చెప్పింది. తాను గర్భంతో(Pregnancy) ఉన్నానని బయటపెట్టింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ కూడా పెట్టింది.

(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ

తాజాగా నెలవారీ చెకప్స్ కోసం భర్త సిద్దార్థ్ తో కలిసి ముంబైలోని ఓ ఆస్పత్రికి కియారా వెళ్లింది. వీళ్లిద్దరూ కూడా ఓ లగ్జరీ కారులో వచ్చారు. టొయాటో కంపెనీకి చెందిన వెల్ ఫైర్(Toyota Vellfire) అనే మోడల్ కారు ఇది. దీని ధర మార్కెట్ లో రూ.1.22 కోట్లకు పైనే ఉందని తెలుస్తోంది.

కియారా ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఈమెకు ఈ కారుని బహుమతిగా ఇచ్చాడట. మిగతా వాటితో పోలిస్తే లోపల స్పేస్, కూర్చోవడానికి చాలా సౌకర్యంగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ విషయం గురించి బాలీవుడ్ లో మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు

Advertisement
 
Advertisement
Advertisement