ఏఆర్‌ రెహమాన్‌కు షాక్.. రూ. 2 కోట్లు చెల్లించాల్సిందే! | Music Director AR Rahman Pay 2 Crore Rupees In Copy Right Issue | Sakshi
Sakshi News home page

A. R. Rahman: ఢిల్లీ హైకోర్టులో ఏఆర్ రెహమాన్‌కు షాక్.. రెండు కోట్లు ఇవ్వాల్సిందే!

Apr 26 2025 7:18 AM | Updated on Apr 26 2025 8:52 AM

Music Director AR Rahman Pay 2 Crore Rupees In Copy Right Issue

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ ఏఆర్ రెహమాన్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన సంగీతం అందించిన పొన్నియిన్ సెల్వన్‌ చిత్రంలోని ఓ పాటపై కాపీ రైట్ కేసులో బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం.. పిటిషన్‌దారుడికి రూ.2 కోట్లు చెల్లించాలని ఏఆర్ రెహమాన్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థను ఆదేశించింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.

పొన్నియిన్ సెల్వన్‌ సిరీస్‌లో భాగంగా తెరకెక్కించిన రెండో చిత్రం. ఈ మూవీలో  విక్రమ్, రవి మోహన్, కార్తి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ రెండు సినిమాలకు ఏఆర్ రెహమాన్‌ సంగీతమందించారు. కాగా.. పొన్నియిన్‌ సెల్వన్‌ -2 చిత్రంలోని వీరా రాజ వీరా అనే పాట సంగీతాన్ని తన తండ్రి ఫయాజుదీన్‌ డగర్, మామ జాహిరుదీన్‌ డగర్‌ సంగీతం అందించిన శివస్తుతి పాట నుంచి కాపీ చేసినట్లు  సింగర్ ఉస్తాద్‌ ఫయాజ్‌ వసిఫుదీన్‌ డగర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో శుక్రవారం ఢిల్లీ హైకోర్టు మధ్యంతర తీర్పు వెలువడింది. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్, చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్‌ టాకీస్‌ రూ.2 కోట్లను  పిటిషన్‌దారుడికి అందించాలని ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement