వారికి ఆ ధైర్యం లేదు.. అందుకే సందీప్‌ రెడ్డి వంగాను టార్గెట్‌ చేశారు: వివేక్ అగ్నిహోత్రి | Vivek Agnihotri says directors dont have guts to slam like Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

Vivek Agnihotri: ఆ ధైర్యం లేకనే సందీప్‌ రెడ్డిపై విమర్శలు: వివేక్ అగ్నిహోత్రి

May 14 2025 4:20 PM | Updated on May 14 2025 5:28 PM

Vivek Agnihotri says directors dont have guts to slam like Ranbir Kapoor

ది కశ్మీర్‌ ఫైల్స్ మూవీతో పాన్ ఇండియాలో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్‌ వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ పండిట్ల నేపథ్యంలో వచ్చిన  ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాతో వివేక్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్‌ దర్శకులను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ముఖ్యంగా యానిమల్ మూవీ దర్శకుడిపై విమర్శలు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగాను మాత్రమే టార్గెట్ చేశారని.. రణ్‌బీర్‌ కపూర్‌ను విమర్శించే ధైర్యం బాలీవుడ్‌లో ఏ డైరెక్టర్‌కు లేదని అన్నారు.

వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..'యానిమల్ విషయంలో సందీప్ రెడ్డి వంగాను మాత్రమే టార్గెట్ చేశారు. ఎందుకంటే రణ్‌బీర్‌ కపూర్‌ను విమర్శించే ధైర్యం ఎవరికీ లేదు. ఇండస్ట్రీలో అతను చాలా పవర్‌ఫుల్‌.  అందుకే అతన్ని విమర్శించడానికి ఎవరూ లేరు. వారికి అంత ధైర్యం ఉంటే ప్రయత్నించి చూడమనండి.బాలీవుడ్‌లో చాలా మంది దర్శకులు హీరోల గురించి కేవలం వారి వెనుక మాత్రమే మాట్లాడుతారు. వారికి బహిరంగంగా ఏదైనా చెప్పే ధైర్యం కూడా వారు చేయరు. కాబట్టి వారు ఇబ్బంది పడక తప్పదు. ‍అలాంటి ఎంత నీచంగా నటించినా రూ.150 కోట్లు ఇస్తారు. 51 ఏళ్ల నటులు తమంతట తాము నిజమైన స్టార్లు అయితే ఎంత సంపాదించినా తనకు అభ్యంతరం లేదు.నా సమస్య ఏమిటంటే స్టార్‌డమ్ లేకున్నా స్టార్లలా ప్రవర్తించే వ్యక్తులతోనే. అలా చలామణి అయ్యే వారంటే నాకు నచ్చదు' అని  అన్నారు.

కాగా.. అంతకుముందు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'యానిమల్‌పై విమర్శలపై స్పందించారు. అందరు విమర్శకులు తననే టార్గెట్‌ చేశారని అన్నారు. మరోవైపు రణ్‌బీర్‌ కపూర్‌ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. ఎందుకంటే వారంతా రణ్‌బీర్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నారని నాకు అర్థమైందని సందీప్ వంగా వెల్లడించారు. నేను బాలీవుడ్‌ కొత్త కావడం నాపై విమర్శలు చేయడం వారికి సులభమని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement