
బాలీవుడ్ భామ ప్రీతి జింటా ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ యజమానిగా ఉన్న ప్రీతి బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన ప్రేమంటే ఇదేరా మూవీలో మెప్పించింది. ప్రస్తుతం లాహోర్1947 అనే మూవీతో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది.
అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ప్రీతి జింటా తాజాగా ఎక్స్‌తో అభిమానులతో ఓ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశారు. మీరు బీజేపీలో చేరుతున్నారా? అంటూ ప్రీతి జింటాను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు ఆమె కాస్తా ఘాటుగానే స్పందించారు. దీంతో ప్రీతిపై పలువురు నెటిజన్స్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు అతనికి క్షమాపణలు చెప్పింది. ఇంతకీ ప్రీతి జింటా ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసుకుందాం.
ప్రీతి జింటా మాట్లాడుతూ.. 'నా సమాధానం మీకు కఠినంగా అనిపిస్తే నన్ను క్షమించండి. సోషల్ మీడియాతో వచ్చే ఇబ్బంది ఇదే. ప్రతి ఒక్కరూ మనల్ని జడ్జ్ చేస్తారు. నేను దేవాలయాలకు, కుంభమేళాలకు వెళ్తే భాజపాలో చేరతానని కాదు. విదేశాల్లో ఉన్న సమయంలో దేశం విలువ ఏంటో నాకు తెలిసింది. అందరి కంటే నేను ఇప్పుడు భారత్‌ను, భారతీయ సంస్కృతిని ఎక్కువగా గౌరవిస్తున్నా. విదేశాల్లో నివసించినా కూడా నా పిల్లలు సగం భారతీయులేనని మర్చిపోకుండా పెంచుతున్నా. అంతేకాదు మా పిల్లలను హిందువులుగానే పెంచుతున్నా. దురదృష్టవశాత్తూ నాపై విమర్శలు వస్తున్నాయి. నేను ఎవరో.. నా పిల్లలకు వారి మూలాలు, మతం గురించి బోధిస్తున్నందుకు గర్వపడుతున్నా' అని అన్నారు. అయితే ఇంత ఈ చిన్న ప్రశ్నకు ఇంతలా స్పందించాలా అంటూ కొందరు నెటిజన్స్ ప్రీతి జింటాను విమర్శిస్తున్నారు.
I’m sorry if I sounded abrupt ! I have PTSD from this question. Appreciate your clarification 🙏After becoming a mom & living in a foreign country I wanna make sure my kids don’t forgot they are half Indian. Since my husband is agnostic we are bringing up our kids as Hindus.… https://t.co/ce0pHFKj8H
— Preity G Zinta (@realpreityzinta) April 28, 2025