
చిన్న సినిమాలు అప్పుడప్పుడు అద్భుతాలు చేస్తుంటాయి. ఇప్పుడు కూడా 'సయారా' అనే బాలీవుడ్ మూవీ ఎవరూ ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. అలానే కొన్ని రికార్డ్స్‌ని కూడా బ్రేక్ చేస్తోంది. ఇప్పుడు అలానే ఏకంగా 'ఛావా'ని దాటేయడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: బర్త్‌డే ప్రకటన.. గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్)
విక్కీ కౌశల్, రష్మిక నటించిన చారిత్రక సినిమా 'ఛావా'. ఛత్రపతి శివాజీ కుమారుడి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం.. ఊహించని వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు ఆ నంబర్లని 'సయారా' అధిగమించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన 'ఛావా'.. ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర రూ.91 కోట్లు సాధించింది. ఇప్పుడు ఆ నంబర్‌ని సయారా.. కేవలం 13 రోజుల్లోనే అధిగమించిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇప్పటివరకూ సయరా సినిమాకు ఓవర్సీస్‌లో రూ.94 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
ఓవరాల్‌గా చూసుకుంటే యువతని ఆకట్టుకుంటున్న సయారా చిత్రానికి ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ ఈ మధ్యనే చెప్పుకొచ్చింది. కేవలం మన దేశంలోనే రూ.260 కోట్లు వరకు వచ్చాయని సమాచారం. పరిస్థితి చూస్తుంటే రూ.500 కోట్ల మార్క్ కూడా మరికొన్నిరోజుల్లో దాటేయడం గ్యారంటీ. ఇంతకీ సయారా బడ్జెట్ ఎంతనుకున్నారు? కేవలం రూ.30 కోట్లు. ఈ లెక్కన చూసుకుంటే నిర్మాణ సంస్థకు వేరే లెవల్ లాభాలు వచ్చినట్లే.
(ఇదీ చదవండి: ఫిష్ వెంకట్ ఘటన మరవకముందే మరో విషాదం)