
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)ను చంపేస్తామని మరోసారి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. కొన్ని గంటల్లోనే ఆ మెసేజ్ పంపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్‌ను చంపేస్తామని హెచ్చరించిన వ్యక్తి గుజరాత్‌కు చెందిన వాడని పోలీసులు తెలిపారు. అతనొక మానసిక రోగి అంటూ వారు పేర్కొన్నారు. సల్మాన్‌ను హత్య చేస్తామంటూ ఇప్పటికే చాలామంది హెచ్చరించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి కొంతకాలంగా వార్నింగ్స్ వస్తోన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కొందరు ఆకతాయిలు కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడటంతో పోలీసులకు పెద్ద తలపోటుగా మారింది.
సల్మాన్‌ను చంపేస్తామంటూ వర్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు సోమవారం ఒక మెసేజ్ వచ్చింది. ఆయన ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతామని అందులో ఉంది.. లేదంటే ఆయన కారులో బాంబు పెట్టి పేల్చేస్తామని వాట్సప్ ద్వారా మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమయిన పోలీసులు అతన్ని కొన్ని గంటల్లోనే పట్టకున్నారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు