వినోదరంగంలో ‘వేవ్స్‌’.. ప్రారంభించనున్న మోదీ | WAVES Summit 2025: PM Modi to inaugurate in Mumbai | Sakshi
Sakshi News home page

వినోదరంగంలో ‘వేవ్స్‌’.. హాజరు కానున్న 90 దేశాల ప్రతినిధులు

May 1 2025 9:40 AM | Updated on May 1 2025 11:48 AM

WAVES Summit 2025: PM Modi to inaugurate in Mumbai

నేటి నుంచి ముంబైలో అంతర్జాతీయ సదస్సు

ప్రారంభించనున్న ప్రధాని మోదీ

‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌’ (వేవ్స్‌) – 2025 గురువారం ముంబైలో ప్రారంభం కానుంది. ప్రపంచ మీడియా పవర్‌ హౌస్‌గా భారత దేశాన్ని సమున్నతంగా నిలిపేందుకు ప్రభుత్వం నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సును ప్రధాని మోదీయే స్వయంగా ప్రారంభించనున్నారు.

వేవ్స్‌ సమ్మిట్‌- ఉద్దేశం
సినిమాలు, ఓటీటీ, గేమింగ్, కామిక్స్, డిజిటల్‌ మీడియా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మొదలైన అన్నింటిని ఒకే వేదికపై అనుసంధానిస్తూ మీడియా – వినోద రంగంలో మన దేశ సత్తాను చాటడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ‘కనెక్టింగ్‌ క్రియేటర్స్‌... కనెక్టింగ్‌ కంట్రీస్‌’ అన్న ట్యాగ్‌ లైన్‌తో ఈ ‘వేవ్స్‌’ (WAVES Summit 2025) ను నిర్వహిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి సృజనాత్మక కళాకారులు, స్టార్ట్‌ అప్‌లు, సినీవినోద రంగ ప్రముఖులు, విధాన నిర్ణేతలు ఇందులో పాల్గొంటున్నారు. 

1100 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు
90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్ట్‌ అప్‌లు ఈ భారీ సదస్సులో పాలు పంచుకుంటున్నాయి. ఇప్పటికే లక్ష మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఈ ‘వేవ్స్‌ 2025’లో 1100 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. వివిధ సమావేశాలు, ప్రదర్శనలు, చర్చా గోష్ఠులు సాగే ఈ సదస్సుకు నటులు చిరంజీవి, నాగార్జున, రజనీకాంత్, దర్శకుడు రాజమౌళి, ఆస్కార్‌ అవార్డు గ్రహీతలైన సంగీత దర్శకులు ఏఆర్‌ రెహమాన్, కీరవాణి తదితరులు ప్రత్యేక ఆకర్షణ కానున్నారు.

తొలిసారి ఆతిథ్యం
సినిమాలు, డిజిటల్‌ మీడియా, బ్రాడ్‌ కాస్టింగ్‌ తదితర విభిన్న రంగాలపై లోతుగా చర్చలు జరగనున్నాయి. ఈ ‘వేవ్స్‌’లో భాగంగా దాదాపు 25 దేశాలకు చెందిన మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొనే ‘గ్లోబల్‌ మీడియా డైలాగ్‌’ (జి ఎం డి) కి మన దేశం తొలిసారిగా ఆతిథ్యం ఇస్తుండడం మరో పెద్ద విశేషం. 

చదవండి: రెట్రో మూవీ ట్విటర్‌ రివ్యూ.. సందడి లేదేంటి?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement