
ఇటీవల హౌస్ అరెస్ట్ షో వివాదం తర్వాత అజాజ్ ఖాన్ పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ షోలో అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేయడం వివాదంగా మారింది. దీంతో ఆ షోను ప్రసారం చేస్తున్న ఓటీటీ సంస్థ కూడా బ్యాన్ విధించింది. ఆ తర్వాత ఓ నటి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అజాజ్ ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అజాజ్ ఖాన్ తన ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారైనట్లు తెలుస్తోంది.
తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఒక నటి ముంబయిలోని చార్‌కోప్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అజాజ్ ఖాన్‌ను సంప్రదించేందుకు పోలీసులు యత్నించగా.. ఇంటి వద్ద అందుబాటులో లేడని తెలిపారు. అంతేకాకుండా ఫోన్ నంబర్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో పరారైనట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. 'హౌస్ అరెస్ట్' షోలో పాత్రను ఆఫర్ చేశాడని.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని నటి ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే 'హౌస్ అరెస్ట్' అనే షోలో అనుచిత కంటెంట్‌ను ప్రసారం చేసినందుకు మరో కేసులో కూడా పోలీసులు అతనికి సమన్లు జారీ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రోత్సహించినందుకు అతనితో పాటు, ఉల్లు ఓటీటీ యజమానులపై ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ షోను వెంటనే నిషేధించాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.