Pawan Kalyan
-
‘కాంగ్రెస్ రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడింది’
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సరిగా జరగలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజనలో కాంగ్రెస్ రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆత్మవంచనతో పనిచేస్తుందని విమర్శించారు. ఏపీ విభజనలో వారసత్వపు ఆస్తుల వివాదాలు ఇంకా అలానే ఉన్నాయని, తెలంగాణలో తన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. 12 ఏళ్లు అయినా ఇప్పటికీ తెలంగాణ అమరులను గుర్తించలేదన్నారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఈరోజు( సోమవారం, జూన్ 15వ తేదీ) పవన్ అంతకుముందు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని విమర్శించారు. తెలంగాణ ఎలా వచ్చిందో ఆ సినీనటుడు తెలుసుకోవాలంటూ ధ్వజమెత్తారు. ‘ఎవరో ఉప్పందిస్తే పవన్ మాట్లాడడం మానుకోవాలి. ఇదేం సినిమా కాదని పవన్ కల్యాణ్ గుర్తు పెట్టుకోవాలి. విభజన గురించి మాట్లాడడమంటే వ్యతిరేకించినట్లే’’ అని చెప్పారు. -
ఆ సినీనటుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర విభజన గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరుపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.మహేశ్‌కుమార్ గౌడ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని విమర్శించారు. తెలంగాణ ఎలా వచ్చిందో ఆ సినీనటుడు తెలుసుకోవాలంటూ మండిపడ్డారు.‘‘ఎవరో ఉప్పందిస్తే పవన్ మాట్లాడడం మానుకోవాలి. ఇదేం సినిమా కాదని పవన్ కల్యాణ్ గుర్తు పెట్టుకోవాలి. విభజన గురించి మాట్లాడడమంటే వ్యతిరేకించినట్లే’’ అని చెప్పారు. కాగా, పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరుపై తెలంగాణ నేతల నుంచి కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. -
బాబూ.. పవన్, లోకేశ్ వెళ్తే సరిపోతుందా?
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన విషాదం మాటలకందనిది. మామూలుగా వేడి నీళ్లు పడితేనే తట్టుకోలేం. అలాంటిది 1600 డిగ్రీల వేడి ఉన్న ఇనుప ద్రవం మీద పడితే అది ఎంత దారుణ పరిస్థితి అవుతుందో చెప్పనవసరం లేదు. అలాంటి వాతావరణంలో పనిచేయడమే కష్టం. ఇక ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎంత కష్టం. ఈ ఘటనలో తొమ్మిది మంది కార్మికులు మరణించడం అత్యంత విచారకరం. వారి కుటుంబ సభ్యులు పడే మనోవేదన ఇంతింత కాదు. వారు అంత కష్టంలో ఉన్నప్పుడు రాజకీయ నేతలు వెళ్లి ఓదార్చే యత్నం చేస్తారు. ఆ సమయంలో కార్మిక సంఘాల నేతలు వచ్చి తమ సమస్యలను వివరిస్తారు. వాటిని వినే ఓపిక పరామర్శకు వెళ్లిన నేతలకు ఉండాలి. అధికారం ఉంది కదా అని ఏమైనా మాట్లాడవచ్చనుకుంటే అది పొరపాటు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్‌లు కార్మికులను ఎంతవరకు ఓదార్చారో కాని, వారి మాటలు పుండుమీద కారం చల్లినట్లయిందని కార్మికులు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ విశాఖలో కార్మికుల కుటుంబాలను పరామర్శించిన తీరుకు, లోకేష్, పవన్‌ల వ్యవహార సరళికి మధ్య ఉన్న అంతరాన్ని అంతా చర్చించుకుంటున్నారు. కూటమి నేతలు తమ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తే, జగన్ మాత్రం బాధితుల కుటుంబాలకు భరోసా ఇచ్చేలా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తం అయింది.ఇలాంటి ప్రమాద ఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు బాధితుల వద్దకు వెళ్లాలి. వారికి అవసరమైన భరోసా ఇచ్చి రావాలి. చంద్రబాబుకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలా మసులుకోవాలో తెలుసు. అయినా ఆయన ఎందుకు విశాఖ వెళ్లలేదో, కార్మికులను పరామర్శించలేదో తెలియదు. బహుశా తన తరపున కీలక మంత్రిగా ఉన్న లోకేష్ వెళితే సరిపోతుందని అనుకున్నారేమో తెలియదు. లేదా గతంలో కార్మికులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు నిలదీసే అవకాశం ఉందని అనుకున్నారేమో చెప్పలేం.మరో వైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అక్కడకు వెళ్లారు. సహజంగానే పవన్ కళ్యాణ్ కన్నా, లోకేష్‌కే ఎల్లో మీడియా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ విషయాన్ని జనసేన నేతలు గమనించకపోలేదు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు ఒక పార్టీకి అధినేతగా కూడా ఉన్నారు. తాను వెనుకబడిపోకూడదని అప్పటికప్పుడు వెళ్లారేమో తెలియదు. ఇంత పెద్ద ఘటనలు జరిగినప్పుడు కార్మిక వర్గాలలో ఆవేదన, ఆక్రోశం ఉంటుంది. తమ బాధను నేతలకు చెప్పుకునే యత్నం చేస్తారు. కొన్నిసార్లు నేతలను విమర్శిస్తుంటారు. అయినా అధికారంలో ఉన్నవారు సంయమనంతో ఉండి వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలి. కాని దురదృష్టావశాత్తు లోకేష్, పవన్ కళ్యాణ్ లు మాట్లాడిన విషయాలు చూడండి. కార్మిక నేతలు ప్రశ్నలు వేస్తుంటే, లోకేష్ అసహనానికి గురై ఎందుకు గొడవపడుతున్నారు. రాజకీయం చేయడానికి వచ్చారా? మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదుగా!' అని వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.స్టీల్ ప్లాంట్‌ను తామే కాపాడామని, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ వైపు చూస్తూ వీరు పోరాడారు అని లోకేష్ అన్నారు. ఆ మంత్రి ఎప్పుడు పోరాడారో ఎవరికి తెలియదు. పైగా స్టీల్ ప్లాంట్‌ను కాపాడామని లోకేష్ అనగానే అందుకే ఇంతమంది చనిపోయారా?అని కార్మిక నేత ఒకరు ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. మరో సందర్భంలో టీమ్ లెవెన్ కెప్టెన్ వచ్చారా అని జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించడంపై అంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు రాలేదన్న విషయాన్ని విస్మరించి జగన్ పై వ్యాఖ్య చేయడమేమిటా అన్న ప్రశ్న వచ్చింది.స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ కేవలం బ్యాంకు రుణాలు చెల్లించడానికి, కార్మికులకు వీఆర్ఎస్ చెల్లించడానికే ఖర్చు చేశారు తప్ప, ప్లాంట్ అభివృద్దికి పెట్టలేదని, ఇదే ప్రైవేటైజేషన్‌కు జరిగే కుట్ర అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక కర్మాగార యాజమాన్యం 25 లక్షల ఆర్థికసాయం ప్రకటించడంపై కూడా అసంతృప్తి వ్యక్తం అయింది. దీనికి లోకేష్ తగు సమాధానం ఇవ్వకపోగా, కార్మిక సంఘాలు అడుగుతాయని, వారిదేం పోయిందని వ్యాఖ్యానించడం అభ్యంతరకరంగా కనిపిస్తుంది.గతంలో విశాఖలో ఎల్.జి.ఫాలిమార్ కంపెనీలో గ్యాస్ లీక్ అయి పదమూడు మంది మరణించగా, జగన్ అప్పటికప్పుడు కోటి రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రభుత్వ పక్షాన ప్రకటించారు. అప్పుడు విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కోటి రూపాయలు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. కాని ఇప్పుడేమో ప్రభుత్వపరంగా సాయం ప్రకటించలేదు. ఒకవైపు రకరకాల పబ్లిసిటీ కార్యక్రమాలకు కోట్లకు కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం, విశాఖ ఉక్కులో ఇంత ఘోర ప్రమాదంలో మరణించిన కుటుంబాలవారికి సాయం చేయలేరా అన్న ప్రశ్న వచ్చింది. పవన్ కళ్యాణ్ యధా ప్రకారం తనకు ఈ ప్లాంట్ విషయంలో అంత అనుభవం లేదని వ్యాఖ్యానించడం కార్మిక సంఘాలకు ఆశ్చర్యం కలిగించింది.గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనిని ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నించిందని తప్పుడు ఆరోపణ చేసి మళ్లీ దొరికిపోయారు. మరుసటి రోజు జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత లోకేష్, పవన్ లకు గట్టి జవాబు ఇచ్చారు. తమ హయాంలో ప్రధానికి ఎన్నిసార్లు లేఖలు రాసింది.. ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆధార సహితంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గతంలో ఈ అంశం ప్రస్తావించి జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసిందని, అందువల్లే ఆ కార్యక్రమం జరగలేదని చెప్పిన వీడియో కూడా ప్రముఖంగా సోషల్ మీడియాలో కనిపించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ ప్లాంట్‌ను జగన్ ప్రభుత్వం ఎలా ప్రైవేటైజ్ చేస్తుందని సోషల్ మీడియాలో పవన్‌కు ప్రశ్నలు సందించి ఎద్దేవా చేశారు. ఇక లోకేష్ వ్యవహార శైలిపై జగన్ మండిపడుతూ లోకేష్ వంటి మనుషులు కూడా ఉంటారా అనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంలో కార్మిక సంఘాలు అడిగిన సూటి ప్రశ్నలకు జవాబివ్వకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతూ, ఎదురు సంఘాలపైనే లోకేష్, పవన్ లు విమర్శలు చేయడం కూడా బాగోలేదు. అలా కాకుండా ప్యాకేజీని ఎందుకు ప్లాంట్ అభివృద్దికి వ్యయం చేయలేదు?సుమారు పదివేల మంది కార్మికులను ఎందుకు తొలగించారు? పలు ముఖ్యమైన విభాగాలను ప్రైవేటు రంగానికి ఎందుకు అప్పగిస్తున్నారు? ప్రైవేటు రంగంలో స్థాపిస్తున్న మిట్టల్ స్టీల్ కు కాప్టివ్ మైన్ ఇంత త్వరగా ఎలా కేటాయించారు. అరవై ఏళ్లకు పైగా నడుస్తున్న విశాఖ స్టీల్‌కు ఎందుకు కాప్టివ్ మైన్స్ ఇవ్వలేదు? అన్న ప్రశ్నలకు ఓపికగా వీరిద్దరూ జవాబు ఇచ్చి ఉంటే బాగుండేది. కాని వారికి ఆ విషయాలపై అంత పరిజ్ఞానం ఉందో, లేదో గాని, వాటికి సమాధానం ఇవ్వలేదు. జగన్ మాత్రం అందుకు భిన్నంగా కార్మిక సంఘాలతో ఓపికగా మాట్లాడి స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించడానికి తన ప్రయత్నాలను సావధానంగా వివరించారు. అలాగే బాధిత కుటుంబాలవారిని తనదైన శైలిలో ఓదార్చారు. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆ పరిహారం ఇవ్వకపోతే, తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చి తీరుతామని స్పష్టం చేయడంతో బాధితులకు కొంత సాంత్వన చేకూర్చినట్లయింది.గతంలో తన ప్రభుత్వం చేసిన మాదిరే అసెంబ్లీలో ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చంద్రబాబు సర్కార్‌కు ఆయన సవాల్ చేశారు. దీనిపై కూటమి నేతలు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. జగన్ విశాఖకు వచ్చినప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎల్లో మీడియా తట్టుకోలేకపోయింది. ఏవేవో పిచ్చి ఆరోపణలు చేసి జగన్ టూర్ పై విషం చిమ్మే యత్నం చేసింది. ఏది ఏమైనా ఇలాంటి విషాదాలు జరిగినప్పుడు ఎలా ప్రవర్తించాలో పవన్ కళ్యాణ్, లోకేష్ లు ముందుగా తెలుసుకుని రావాలని కార్మిక సంఘాలు చేస్తున్న సూచన అర్థవంతమైనదే అనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జిత్తులమారి లెక్కలు.. కూటమి అవినీతి బయటపెట్టిన కేంద్రం
-
ప్రమాదం వెనుక నిజం.. మీ ఇంట్లో వాళ్లు చనిపోలేదు కదా లోకేష్.. పవన్ కామెంట్స్ వైరల్
-
ఇంత క్రూర పరిహాసమా స్వామీ!
తిరుపతి సమీపాన నిన్న కూటమి సర్కార్ రెండేళ్ల పండుగ సభ జరిగింది. ఆ సభలో చెప్పుకోవడానికి విశేషాలు చాలానే ఉన్నాయట! సభా ప్రాంగణంలో లోకేశ్‌బాబు కలియతిరిగారట. మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముచ్చటించారట! ఆంధ్రజ్యోతి రాసింది. మూడో క్లాస్ చదువుతున్న అనిత్‌రాజ్ అనే బాలుడు ‘డిప్యూటీ సీఎంతో ఫోటో దిగాలని ఉంద’ని ఓ ప్లకార్డు పట్టుకొని వేదిక సమీపంలో నిలబడ్డాడట! అది చూసిన పవన్ కల్యాణ్ వేదికపైకి అనిత్రాజ్ను పిలిపించుకున్నారట! ఈనాడు రాసింది.వేదిక పైకి వచ్చిన అనిత్‌రాజ్ పవన్‌ను బాబాయ్ అని, చంద్రబాబును తాతయ్యా అని పిలిచాడట! లోకేశ్‌బాబును ఏమని పిలిచాడో ఈనాడు రాయలేదు. బహుశా ఆయన కలవ లేదేమో! తాతయ్యా అన్న బాలుని పిలుపుతో చంద్రబాబు ఉత్సాహం పొందినట్టున్నారు. యువత కలలను సాకారం చేసే బాధ్యత తమదేనని ఓ ట్వీట్ రువ్వారు. ఇది కూడా ఈనాడే రాసింది. మూడో క్లాసు చదివే అనిత్రాజ్కు ఎనిమిదేళ్లుంటా యేమో! ఆ సభలో తాతయ్య ప్రసంగం వినిఉండకపోవచ్చు. విన్నా అర్థం చేసుకునే వయసు కాదు.డియర్ అనిత్‌రాజ్, ఆ తాతయ్య మాటల్లో కొసరుగా విసిరిన ఓ అవశేషంలో ఎంత నమ్మకద్రోహం దాగి ఉన్నదో నీకు బోధపడకపోవచ్చు. నీకంటే పదేళ్లు పెద్దవాళ్లయిన పెద్దక్కల దగ్గర్నుంచి, అమ్మ వయసు అత్తలూ, పెద్దమ్మలూ, పిన్నమ్మల వయసువాళ్లకూ, యాభై తొమ్మిదేళ్ల లోపు వుండే అమ్మమ్మలూ, నానమ్మలకూ వేదికపైనున్న తాతయ్య తీరని ద్రోహం చేశారు. దీన్నే నయవంచన అని కూడా అంటారు. ఆ వయసువాళ్ల ఆత్మీయ మహిళలందరికీ వెన్నుపోటు పొడిచిన తాతయ్య మీ కలలను నెరవేరుస్తారంటే నమ్మశక్యమేనా?అన్నిటికంటే పెద్ద విశేషమేమిటంటే ఈ సభకు ‘నమ్మకం’ అనే పేరు పెట్టుకున్నారు. ‘రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిల బెట్టుకున్నాం, అదే కూటమి ప్రభుత్వ విజయం’ అనే మకుటంతో మీడియాలో అడ్వరై్టజ్మెంట్లను హోరెత్తించారు. ఆ సభ వేదికపై నుంచి మాట్లాడుతూనే ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి ఆర్థిక సమస్యలున్నాయనీ, పీ–4 పథకంతో వారికి సహాయం చేస్తా మనీ ముఖ్యమంత్రి సన్నాయి నొక్కులు నొక్కారు. సూపర్ సిక్స్ పథకాలకు కూటమి మేనిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యతనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానమైన ఈ ఆరు హామీలను నెరవేర్చడా నికి ఆర్థికపరమైన ఇబ్బందులేమీ ఉండవని ఎన్నికల సభల్లో చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు.2024 జూన్ నుంచే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలుచేస్తా మని కూటమి వాగ్దానం చేసింది. రెండేళ్లు గడిచిపోయాయి. తల్లికి వందనం పథకానికి కూడా మొదటి సంవత్సరం ఎగ నామం పెట్టి, రెండో సంవత్సరం అమలు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకొని రెండేళ్లు ఆలస్యంగానైనా ‘ఆడబిడ్డ నిధి’ని అమలుచేస్తారేమోనని కోటీ ఎనభై లక్షలమంది మహిళలు ఎదురు చూస్తున్నారు. వారి ఆశలపై చంద్రబాబు తిరుమలేశుని సాక్షిగా చల్లనీళ్లు చల్లారు. ఏపీలో ఓటుహక్కు ఉన్న మహిళలు రెండు కోట్ల ఏడు లక్షలమంది. వీరిలో అరవై, అంతకుమించిన వయసున్నవారు 12 శాతం వరకు ఉంటారని సెన్సస్ లెక్కలు చెబుతున్నాయి. వారిని మినహాయించి సుమారు ఒక కోటి ఎనభై లక్షలమంది మహిళలకు కూటమి సర్కార్ ఇప్పటికే ఒక్కొ క్కరికి ఏటా 18 వేలు చొప్పున రెండేళ్ల నిధులు బకాయి పడింది. ఇప్పుడు మొత్తానికే పథకాన్ని ఎత్తేస్తున్నట్టు ప్రకటించారు.పీ–4 పథకంతో ఆదుకుంటామనేది పచ్చి బూటకం. అసలీ పథకమే పౌరుల ఆత్మగౌరవాన్ని అంగట్లో పెట్టే అమానవీయ స్వభావం గలది. తమకు దిక్కు దివాణం లేదని పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలట! దయగలిగిన ధనవంతులు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని వారికి సహాయం చేయా లట! ఇది అయ్యే పనేనా? పేదరికం నుంచి ప్రజలను విముక్తం చేయడం ప్రభుత్వాల బాధ్యత. నాణ్యమైన విద్యను వారికి అందజేయడం ద్వారా, అభ్యున్నతికి చేరుకునే అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు చేయాలి. వనరుల్లో వారికి తగినంత వాటా కల్పించాలి. ఇది రాజ్యాంగబద్ధమైన ఆదేశం. అలాకాకుండా ధనవంతుల దొడ్లో పేదవాళ్లను కట్టేయ డమనేది బానిస వ్యవస్థ లక్షణం.అయినా పీ–4 విధి విధానాలకు, ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి సారూప్యత ఎక్కడున్నది! మహిళల కోసం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ‘చేయూత’, ‘ఆసరా’ పథకాలకు దీటుగా ప్రకటించిన పథకం ‘ఆడబిడ్డ నిధి’. ఈవిధంగా ఎన్నిక లకు ముందు నమ్మబలికి ఇప్పుడీ పథకాన్ని పూర్తిగా అటకెక్కించారు. మహిళల ఆత్మగౌరవానికీ, సాధికారతకూ పెద్దపీట వేస్తూ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మకమైన ‘అమ్మవొడి’ పథకానికి బదులుగా ‘తల్లికి వందనం’ పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది.పేద కుటుంబాల పిల్లలు కూడా నాణ్యమైన విద్యను అభ్యసించాలని అభిలషిస్తూ ప్రభుత్వ పాఠశాలల స్థాయినీ, బోధనా పద్ధతులనూ అనూహ్యమైన స్థాయిలో ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా మెరుగుపరిచింది జగన్ సర్కార్. జగన్ మోహన్‌రెడ్డి స్వయంగా పరిశీలించి విద్యార్థులందరికీ మంచి స్కూల్ బ్యాగ్‌లు, బూట్లు, బెల్ట్, శ్రేష్ఠమైన పౌష్ఠికాహారాన్ని ఎంపిక చేసిన సంగతి పాఠకులకు విదితమే. డిజిటల్ బోర్డులు, ట్యాబ్లూ ప్రభుత్వ బడుల్లో ప్రవేశించాయి. శిథిలమైన బడి భవనాలు, విరిగిపోయిన బల్లలు, అసహ్యకరమైన పరిస్థితుల్లో ఉండే సింగిల్ వాష్రూముల ముందట లైన్లో నిలబడే పిల్లలు, అసలు వాష్రూములే లేక బడి మానేసే ఆడపిల్లలు, తాగడానికి మురికి నీళ్లే గతి అనే పరిస్థితులను మార్చి కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో వాష్‌రూమ్‌లూ, శుభ్రమైన తాగునీరూ అందేలా జగన్ ఏర్పాట్లు చేశారు.ఒకపక్క ఇంత నాణ్యమైన విద్యకు మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూనే ఇంగ్లీషు మీడియం బోధననూ, సీబీఎస్ఈ సిలబస్‌నూ పేద బిడ్డలకు పూర్తి ఉచితంగానే అందుబాటులోకి తెచ్చారు. దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్లు ఉండకుండా బిడ్డలను బడికి పంపేలా తల్లిని ప్రోత్సహించడం కోసం జగన్మోహన్రెడ్డి ‘అమ్మవొడి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. నాణ్యమైన విద్య ద్వారా ఉన్నతమైన సమాజాన్ని నిర్మించాలనే ఒక సమగ్ర వ్యూహంలో ‘నాడు–నేడు’ ‘అమ్మవొడి’ అనేవి రెండు అవిభాజ్యమైన అంశాలు. ఈ వ్యూహంలో అమ్మది కేంద్ర స్థానం.‘అమ్మవొడి’ పథకం నేపథ్యంలో ఉన్న ఉన్నతమైన తాత్విక భూమిక ‘తల్లికి వందనం’ పథకానికి లేదు. అటువంటి ఉన్నత లక్ష్యమే ఉన్నట్లయితే ‘నాడు–నేడు’ పథకం కొనసాగి ఉండేది. ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, సబ్జెక్ట్ టీచర్ మోడల్ కొనసాగి ఉండేవి. ఇప్పుడివేమీ లేవు. ప్రభుత్వ బడులకు మళ్లీ పూర్వపు రోజులు వచ్చాయి. దాదాపు పది లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టినట్టు సమాచారం. ప్రభుత్వం ఈ లెక్కలను ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతున్నది. ఎంత మంది విద్యార్థులు చదువు మానేశారో లెక్కల్లేవు. జగన్ ప్రభుత్వం ప్రతి విద్యార్థిని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ట్రాకింగ్ సిస్టమ్ ఇప్పుడు లేదు. ప్రభుత్వ బడుల పునరుజ్జీవనం, పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య లభించాలనే ఉద్దేశంతో ‘అమ్మవొడి’ని జగన్ తీర్చిదిద్దారు. కేవలం ఎన్నికల్లో తనకు సహకరించే కార్పొరేట్ స్కూళ్ల లాబీకి కాసుల వర్షం కురిపించేలా తల్లికి వందనం పథకాన్ని కూటమి డిజైన్ చేసింది. ఇదీ తేడా!లక్ష్యం ఇంత హేయమైనది కనుకనే నీకు పదిహేను, నీకు పదిహేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలంటూ చౌకబారు ప్రచారాన్ని కూటమి చేసింది. పోనీ ముందుగా చెప్పినట్టు పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తున్నదా? జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వం, ప్రైవేట్ స్కూళ్లలో 80 లక్షలకు పైగా విద్యార్థులుండేవారు. తల్లికి వందనం పథకానికి మాత్రం 67 లక్షల మందినే అర్హులుగా తేల్చారు. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ బడుల్లో చేరినవారిలో లక్షమందిని లబ్ధి దారుల జాబితా నుంచి తొలగించారు. కేంద్ర స్కాలర్షిప్ను పొందుతున్న మరో లక్షమందిని తొలగించారు. ఆధార్ సరిగా లేదనీ, అడ్రస్ సరిగా లేదనీ మూడు లక్షలమందికి మొండిచేయి చూపారు. పంచ పాండవులు – మంచం కోళ్ల సామెతలా సాగు తున్న ఈ పథకం చివరకు ఎక్కడ ఆగుతుందో చూడాలి.అధికార యంత్రాంగంలో, రాజకీయ నేతలలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ప్రతిపక్షం కాదు... అధికార పక్షానికి అనుకూలంగా ఉండేవారే విమర్శిస్తున్నారు. అమరావతి ప్రయోగం డిజాస్టర్‌గా మిగలబోతున్నదనీ, పోలవరం పనులు పరమ నాసిరకంగా జరుగుతున్నాయనీ నిపుణులు ఆరోపిస్తు న్నారు. డీఎస్సీ పరీక్షలో సాక్షాత్తూ ప్రభుత్వ ముఖ్యులే అవినీతికీ, ఆశ్రిత పక్షపాతానికీ తెరలేపి లక్షలాది మంది యువకుల కల లను కల్లలు చేశారు. వ్యవస్థల విశ్వసనీయత పట్ల యువతరంలో నమ్మకం సన్నగిల్లుతున్నది. పేదలు, మధ్యతరగతి ప్రజల పాలిట అపర సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి మరణ శాసనం అమలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఫార్సుగా మార్చారు. వృద్ధుల సంఖ్య పెరుగుతున్నదనీ, ముగ్గురు నలు గురు పిల్లల్ని కనాలనీ బోధిస్తున్న చంద్రబాబు సామాజిక పెన్షన్లలో మాత్రం వృద్ధుల సంఖ్యను తగ్గిస్తున్నారు. ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రభుత్వాంగాలన్నీ అవినీతి రోగగ్రస్థం అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. ఓట్లకోసం ప్రజల అరచేతుల్లోకి వైకుంఠం సినిమాను ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు వారందరికీ సామూహికంగా వెన్నుపోటు పొడిచిన తర్వాత నమ్మకాన్ని నిలబెట్టుకున్నామంటూ సభ పెట్టడం న్యాయమా? సమాజం మీద ఇంత క్రూరమైన పరిహాసమేమిటి స్వామీ!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
తిరుమలలో పవన్ కళ్యాణ్ పుస్తకం ఆవిష్కరణ
-
సుగాలి ప్రీతీ కేసును వాడుకొని... నీచమైన క్యాబేజి.. పవన్ కళ్యాణ్
-
Balaraju: కారులో గన్ తీసుకురండిరా.. కాల్చేద్దాం
-
పవన్ పార్టీలో కలకలం.. ఎమ్మెల్యేకు కార్యకర్త సవాల్!
సాక్షి, ఏలూరు జిల్లా: పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై జనసేన కార్యకర్త పూనెం వంశీ తీవ్ర ఆరోపణలు చేస్తూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఆయన క్యాంపు కార్యాలయ సిబ్బందిపై తాను దాడి యత్నం చేశానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వంశీ ఆరోపించారు. ఒక సాధారణ కార్యకర్తగా తాను.. ఎమ్మెల్యేపై దాడి చేయగలనా అని ప్రశ్నించారు. తన బైక్‌ను పోలీస్ స్టేషన్లో ఉంచి ఇబ్బందులకు గురిచేయడంతో ఆ విషయంపై వివరణ కోరేందుకే ఎమ్మెల్యే వద్దకు వెళ్లానని చెప్పారు.అయితే సమస్యను పరిష్కరించాల్సిందిపోయి ఎమ్మెల్యే, ఆయన అనుచరులే తనపై దాడి చేశారని వంశీ ఆరోపించారు. అంతేకాకుండా కారులో నుంచి తుపాకీ తీసుకువచ్చి తనను కాల్చేయాలని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. తాను కేవలం "నేను చేసిన తప్పేంటి?" అని మాత్రమే ప్రశ్నించానని, దానికి బదులుగా ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేసి తనను జైలుకు పంపించాలని ప్రయత్నించారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసిన ఆరోపణలకు సంబంధించిన మూడు అంశాలను నిరూపించాలని వంశీ డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేశానని, మాజీ ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్నాయని, తనకు రూ.1 లక్ష ఇచ్చారని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. ఇందుకోసం మూడు రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిరూపించలేకపోతే ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీని కలవడానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరని వంశీ తెలిపారు. తన తరఫున కుటుంబ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేస్తారని చెప్పారు. జనసేన కార్యకర్తగా తనకే న్యాయం జరగడం లేదని, అలాంటప్పుడు ఇతర కార్యకర్తలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ అంశంపై నియోజకవర్గంలోని జనసేన నాయకులు స్పందించాలని కోరారు. వంశీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పోలవరం జనసేనలో నెలకొన్న అంతర్గత విభేదాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. -
గెలిచాడు.. పోటు పొడిచాడు
-
ఏం బాబూ.. ఇదేనా పొదుపు?
సాక్షి, టాస్క్ ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభకు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేశారు. పబ్లిసిటీ కోసం పొదుపు పాటిస్తున్నాం అని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు.. ఆచరణలో మాత్రం అమలు చేయకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద శుక్రవారం టీడీపీ ప్రభుత్వం విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరయ్యే నేతలు నాలుగు విమానాలు, ఓ హెలికాప్టర్ వినియోగించినట్లు రేణిగుంట విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్లో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక చాపర్‌లో రేణిగుంటకు చేరుకున్నారు. మంత్రి లోకేశ్, జిల్లా టీడీపీ ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, మరి కొందరు మంత్రులు మరో మూడు ప్రత్యేక విమానాల్లో రేణిగుంటకు చేరుకున్నట్లు తెలిపారు. పొదుపు మంత్రంలో భాగంగా వారంలో ప్రతి శుక్రవారం నో వెహికల్స్ డే అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ విజయోత్సవ సభకు భారీఎత్తున వాహనాలు వినియోగించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు దామినేడు సభాస్థలి వరకు కాన్వాయ్‌లో చేరుకున్నారు. విజయోత్సవ సభకు జన సమీకరణ కోసం ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ఆటోలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలోని మారుమూల గ్రామాలకు సైతం ప్రత్యేక వాహనాలను పంపి స్థానికులను రప్పించుకున్నారు. ఈ వాహనాల కోసం భారీగా ఖర్చు చేశారు. ఈ నెల 7 నుంచి 12 వరకు ఉండేలా సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లకు మొత్తంగా రూ.3 కోట్లు అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. -
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు ట్విట్టర్లో సెకండ్ ప్లేస్
-
లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు, పవన్ ఆంధ్రా మోసగాడు..
-
‘లోకేష్ ఆలిండియా.. పవన్ ఆంధ్రా మోసగాడు’
సాక్షి, గుంటూరు: గుంటూరులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించారు. లాడ్జి సెంటర్లో అంబటి రాంబాబుని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అంబటి రాంబాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి సర్కార్ వచ్చి రెండేళ్లయింది.. ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చలేదని మండిపడ్డారు.‘‘సూపర్ సిక్స్‌లో ముఖ్యమైనవి అసలు అమలు చేయలేదు. స్త్రీ నిధి ఇవ్వలేదు. ప్రధాన వాగ్ధానాన్ని వదిలేశారు. నిరుద్యోగి భృతి ఇవ్వలేదు. యువగళం గాలికి పోయింది. యాభై ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ అన్నారు. ముగ్గురు మోసగాళ్ల ప్రభుత్వం ఇది. చంద్రబాబు ప్రపంచ మోసగాడు. లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు.. పవన్ కల్యాణ్ ఆంధ్రా మోసగాడు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.డీఎస్సీపై మాట్లాడటం లేదు. లోకేష్ డీఎస్సీలో ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నాడు. చంద్రబాబ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే డీఎస్పీ అడ్డుకున్నారు. తెలుగుదేశం నాయకులు వైఎస్ జగన్ దిష్టి బొమ్మ తగులపెడితే పోలీసులు రక్షణ కల్పిస్తారు. గుంటూరు పోలీసులకు ఏం పోయేకాలం?. రాబోయేది జగన్ పాలనే. వచ్చే నెల 29 తేదీన వినతి పాదయాత్ర చేస్తాను’’ అని అంబటి రాంబాబు వెల్లడించారు. -
నువ్వు OG కాదు.. పెద్ద క్యాబేజీ
-
ప్యాకేజీ స్టార్ కాదు.. ఇప్పుడు క్యాబేజీ స్టార్!
సాక్షి, తిరుపతి: సూపర్ సిక్స్ హామీలన్నీ గాలికి కొట్టుకుపోయానని.. వెన్నుపోటు వీరుడు చంద్రబాబు మహిళలను సైతం మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు. నగిరి నియోజకవర్గంలో ఆమె ఆధ్వర్యంలో గురువారం వైఎస్సార్సీపీ "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టిన ఆమె.. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని రోజా అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పైనా ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఒకప్పుడు ప్యాకేజీ స్టార్‌గా ఉన్న పవన్.. ఇప్పుడు క్యాబేజీ స్టార్‌గా మారిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన వ్యక్తి.. తన బాధ్యతలను విస్మరించారన్నారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని గతంలో ప్రకటించిన పవన్.. ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని రోజా గుర్తుచేశారు. ఇక.. మహిళల సంక్షేమం విషయంలోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రోజా విమర్శించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్పిన చంద్రబాబు సర్కార్.. చివరకు వారికే వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు.అలాగే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాలనతో పోల్చుకుంటే.. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 10 శాతం పనితీరును కూడా సాధించలేకపోయిందని అన్నారామె. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం సాధారణ పరిస్థితుల్లోనూ హామీలను నెరవేర్చలేకపోతోందని రోజా మండిపడ్డారు. ఈ నిరసన సందర్భంగా అందరికీ చంద్రబాబు పంగనామాలు పెట్టారంటూ సింబాలిక్‌గా నిరసనలు నిర్వహించారామె. -
రెండేళ్ల బాబు పాలన.. ప్రసంగాలకే పరిమితం!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రోజురోజుకు బలహీనపడుతోంది. ప్రజలలో విశ్వాసం కోల్పోతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచు చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. నిత్యం హెలికాఫ్టర్ వేసుకుని ఎక్కడో చోటకు వెళ్లి ప్రసంగం చేయకపోతే ఆయనకు నిద్రపట్టదేమో తెలియదు. ఒకవైపు దుబారా వ్యయం అదుపు చేయాలని ఆయన ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది.స్వయంగా సీఎం గారే అవసరం ఉన్నా, లేకపోయినా హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలలో పర్యటిస్తూ లక్షలు, కోట్ల రూపాయలు నీళ్లమాదిరి వ్యయం చేస్తుంటారు. పోనీ ప్రసంగాలలో ఏమైనా నిజాయితీ, ఆదర్శం, నిబద్ధత కనిపిస్తాయా అంటే అదేమీ ఉండదు. ఆయన స్పీచ్ ఇచ్చినంతసేపు వైఎస్సార్ కాంగ్రెస్‌ను, మాజీ సీఎం జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకుంటారు. మాట్లాడితే గొడ్డలి పార్టీ అని, విధ్వంసం అని రకరకాల పదజాలాలతో ప్రజలను విసిగిస్తుంటారు. లేదంటే తాను చాలా చేసేసినట్లు అతిశయోక్తులు చెప్పి ప్రజలు విస్తుపోయేలా చేస్తుంటారు. తత్ఫలితంగా ఆయన సీనియారిటీ అంతా ఇలా ప్రత్యర్ధులపై బురద జల్లడానికే సరిపోతుంది. అందువల్లే ఆయన ప్రజలలో గౌరవం పెంచుకోలేకపోతున్నారు.మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వైసీపీ ప్రత్యేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో చేపడుతున్న ఈ నిరసనలలో వైసీపీవారు లేవనెత్తుతున్న అంశాలకు చంద్రబాబు కాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాని, కీలక మంత్రి లోకేష్ గాని సూటిగా జవాబు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రెండేళ్లలో సాగిన అరాచకాలు, హామీల ఎగవేత మొదలైన అంశాలను వీరు ప్రస్తావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ లెట్ కూడా విడుదల చేశారు. వీటిని వైసీపీ నేతలు చదివి వినిపిస్తున్నారు. గ్రామ, మండల కేంద్రాలలో నిరసనలు చేపట్టారు.12వ తేదీన నియోజకవర్గ కేంద్రాలలో భారీ ర్యాలీలు తీసి ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇచ్చిన బాండ్లను దహనం చేయ సంకల్పించారు. ఇది సహజంగానే చంద్రబాబుకు చికాకుగా ఉంటుంది. ఆ బాండ్లలో ఉన్న హామీలు ఏ మేరకు తీర్చింది? ఇంకెన్ని నెరవేర్చాలి? అందుకు ఇంకెంత సమయం తీసుకుంటారు? మొదలైన వాటి గురించి చంద్రబాబు, పవన్, లోకేష్‌లు చెప్పలేకపోతున్నారు. తాము ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టోని ప్రజల ముందు పెట్టి ధైర్యంగా ఇవి చేశాం అని చెప్పగలిగితే చంద్రబాబు మాటలకు విలువ ఉంటుంది. అలాకాకుండా సూపర్ సిక్స్ చేసేశాం అని దబాయించితే సరిపోతుందా! వృద్దాప్య పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడం మినహా మరే హామీని పూర్తిగా నెరవేర్చినట్లు కనిపించదు.వృద్దాప్య పెన్షన్లలో కొన్ని లక్షల మందికి కోత పెట్టారన్న విమర్శ ఉంది. అలాగే కొన్ని లక్షలమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఎప్పటికి ఇస్తారో తెలియదు. కాకపోతే ఎల్లో మీడియా అది జరిగిపోతుంది.. ఇది జరిగిపోతుంది అని ప్రజలలో భ్రమలు కల్పించడానికి నానా పాట్లు పడుతోంది. సూపర్ సిక్స్ లోని ముఖ్యమైన ఆడబిడ్డ నిధి హామీ గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. ఆ మద్య పీ-4 ద్వారా వీరికి ఏదో చేసేశామని చెప్పే యత్నం చేశారు. కాని జనం దానిని అసలు స్వీకరించలేదు. ఆ విషయాన్ని గుర్తించారేమో పీ-4 గురించి పెద్దగా మాట్లాడడం లేదు. నిరుద్యోగ భృతి కింద నెలకు మూడువేలు ఇస్తామన్న హామీని అలాగే గాయబ్ చేశారు. పైగా 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, 24 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నట్లు మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. అది కూడా ప్రజలలో ఆగ్రహానికి కారణం అవుతోంది.బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని బాండ్ రాసిచ్చారు. కాని దాని ఊసే ఎత్తడం లేదు. ఇలా అనేక హామీలను నెరవేర్చలేకపోయారు. చంద్రబాబు కొత్తగా నాగలి బాధలు గొడ్డలికి తెలియవు అంటూ చిత్రమైన వ్యాఖ్య చేశారు. ఒక వ్యక్తి చేసిన దుర్మార్గానికి రాష్ట్రాన్ని దారిలో పెట్టడానికి మూడేళ్లు పడుతుందని సెలవిచ్చారు. ఇంతకీ జగన్ టైమ్‌లో జరిగిన దుర్మార్గం ఏమిటో మాత్రం చెప్పరు. అప్పుడు జరిగిన విధ్వంసం ఏమిటో వివరించలేరు. జగన్ రెండేళ్ల కరోనా సంక్షోభ ఉన్నప్పటికీ, ఐదేళ్లలో చేసిన అప్పు మూడున్నర లక్షల కోట్లు అయితే, రెండేళ్లలోనే అంత చంద్రబాబు సర్కార్ ఎలా చేసిందని ఎవరు అడిగినా జవాబు ఇవ్వరు. పైగా జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చేసిందని పచ్చి అబద్ధాన్ని చెప్పడం ఆయన వయసుకు తగినదేనా?జగన్ కంటే ఎక్కువ సంక్షేమ స్కీమ్‌లు అమలు చేస్తామని చెప్పారా? లేదా? మరి ఎందుకు అమలు చేయడం లేదు? ఏకకాలంలో లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చిన జగన్ నిరుద్యోగులకు అన్యాయం చేశారట. రెండున్నర లక్షలమంది వలంటీర్లను నియమించి అటు ప్రజలకు సేవలు, ఇటువారికి స్థానికంగా ఉపాది కల్పించిన జగనేమో ఏమీ చేయలేదట. వలంటీర్లకు ఐదువేలు కాదు.. పదివేలు ఇస్తానని హామీ ఇచ్చి మొత్తానికి మంగళం పలికిన ఆయన పాలనేమో గొప్పదట. సచివాలయ ఉద్యోగులపై రకరకాల భారాలు పెడుతూ వారిని వేధిస్తున్న సంగతి అంతా గమనిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను విపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టి, ఆకాశమే హద్దుగా వాగ్ధానాలు చేసి, పవర్ చేతికి వచ్చాక వాటన్నిటిని గాలికి వదలివేసిన దానిపై ప్రభుత్వ ఉద్యోగులు నోరు విప్పుతున్నారు. మరి అందుకు జవాబు ఏది?వైసీపీవారిపై ఏది పడితే మాట్లాడతారు. గంజాయి బాచ్ అంటారు. తీరా చూస్తే ఆయన పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్ కేసులో పట్టుబడిన సంగతి మాత్రం కనుమరుగు చేయాలని చూస్తారు. ఇది రైతు ప్రభుత్వం అని చెబుతారు. కాని అన్నదాత సుఖీభవ కింద ఎంత ఇస్తామని చెప్పారు? ఎంత ఇచ్చారు. అసలు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం ఎన్ని స్కీములను ఎగవేసింది ప్రజలకు తెలియదా? మాట్లాడితే గొడ్లలి పార్టీ అని అంటే సరిపోతుందా? ప్రజలకు కడుపు నిండుతుందా? హామీల బాండ్ల గురించి జనం మర్చిపోతారా?జగన్ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వరంగంలో తీసుకువస్తే, వాటిని ప్రైవేటీకరించడమే లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నారు. దానిని కదా విధ్వంసం అనాల్సింది. నాలుగు పోర్టులను జగన్ టైమ్‌లో నిర్మించే కృషి ఆరంభించారు. వాటిని ప్రైవేటురంగానికి అప్పగించడానికి ఆలోచన చేస్తున్నారు. దానిని కదా ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేడం అనేది. ఆర్టీసీని నీరుకార్చి ప్రైవేటురంగానికి ఆస్తిగా మార్చుతున్నారన్న అభిప్రాయం కార్మికులలో ఏర్పడింది. దానిని కదా దోపిడీ అనాల్సింది. అమ్మకానికి మున్సిపల్ ఆస్తులు, పట్టణ సేవలన్నిటిని ప్రైవేటీకరించడం, తద్వారా ప్రజలపై విపరీత భారం వేసే యోచనను కదా ప్రజా వ్యతిరేక పాలన అని అనాల్సింది. బీచ్‌లలో బార్లు, మద్యం షాపులను ఏర్పాటు చేయడాన్ని కదా వినాశన విధానాలు అని అనాల్సింది.మద్యం విచ్చలవిడిగా పారిస్తూ ఆంధ్ర సమాజాన్ని పాడు చేస్తున్న ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ రికార్డు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదని చంద్రబాబే చెబుతారు. అధికారులు ఆశించిన రీతిలో స్పందించలేదని ఆయనే అంటారు. అయినా ప్రభుత్వం బ్రహ్మాండం అని జనానికి చెబితే ఎలా నమ్మాలి. అంతెందుకు కుప్పంలో జరుగుతున్న అక్రమాలపై వస్తున్న ఫిర్యాదులపై ఆయనే భయపడిపోయి, తాను ఇన్‌చార్జీగా పెట్టిన వ్యక్తినే మార్చేసుకున్నారే! ఈ నేపథ్యంలోనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ రెండేళ్లలో కూటమి పాలన గాడితప్పిందని అన్నారు. ఏమి సాధించారని ప్రజలలోకి వెళతారని, స్వర్ణాంధ్ర కాదు.. విషాదాంధ్రగా మార్చారని ధ్వజమెత్తారు.ఇక గొడ్డలి అంటూ చంద్రబాబు చేసే అర్థం, పర్ధం లేని వాఖ్యలను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తిప్పికొట్టారు. జగన్ హీరో, చంద్రబాబు విలన్ అని, అందుకే రాజకీయంగా చంద్రబాబు పాలనను అంతం చేసే గొడ్డలి జగన్ చేతిలో ఉందని ఆయన భయపడుతున్నారని సజ్జల బదులిచ్చారు. పరశురాముడి గొడ్డలి అన్యాయం, అక్రమాలపై వేటు వేసిందని, అలాగే చంద్రబాబు అరాచక పాలనను అంతం చేయడమే తమ పార్టీ లక్ష్యం అని ఆయన అన్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తాను ఇచ్చిన హామీల మేరకు ఏమి పూర్తి చేసింది చెబితే ఉపయోగం తప్ప, గొడ్డలి, విధ్వంసం అంటూ పిచ్చి డైలాగులు చెబితే తమకు ఏమి లాభం అని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం కలుగుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
OG 2 Update: ‘ఓజీ’ మళ్లీ వస్తున్నాడు..ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG). ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా చేశాడు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. గతేడాది సెప్టెంబరులో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం ఆకట్టుకుంది. ఈ చిత్రానికి పార్ట్ 2 చేసే అవకాశం ఉందని ప్రమోషన్స్‌లోనే చెప్పాడు సుజీత్. ఓజీ’ ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని పవన్ కల్యాణ్ కూడా వెల్లడించారు. అయితే పార్ట్ 2 ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ఇద్దరు క్లారిటీ ఇవ్వలేదు. రాజకీయంగా పవన్ బిజీ కావడంతో ఓజీ 2 రావడం కష్టమే అని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులకు శుభవార్త చెప్పాడు పవన్. ‘ఓజీ 2’అప్డేట్ ఇచ్చాడు.‘ఇచ్చిన మాట ప్రకారమే ఆయన చేస్తారు. అయితే ఎప్పుడు అనేది ఆయనే చెబుతారు. విదేశాల నుంచి సుజీత్ తిరిగి వచ్చిన తర్వాత చర్చలు మొదలవుతాయి’ అంటూ పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ చేసింది. దీంతో ఓజీ 2 కచ్చితంగా ఉంటుందనే విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. అయితే ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం సుజిత్.. నానితో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ని కూడా ప్రారంభించారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఓజీ2 ప్రాజెక్టును మొదలు పెట్టాలని సుజిత్ భావిస్తున్నాడట. As promised, he will. The timing, he will let us know. Once @Sujeethsign returns from abroad, we will discuss.#OG2— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 11, 2026 -
టీడీపీ గేమ్ ప్లాన్.. పవన్ కళ్యాణ్ కొత్త వేషం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త దళాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా ఉంది. జెన్-జీ ఆశయాలకు అనుగుణంగా గొంతు వినిపింంచేదుకు సేనా గళంను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం ఒక కమిటీని కూడా వేస్తున్నట్లు తెలిపారు. ఆయన చిత్తశుద్ధితో ఈ ప్రకటన చేసి ఉంటే స్వాగతించవలసిందే. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కీలక మంత్రి లోకేష్‌లు కూడా జెన్-జీ అంటూ మాట్లాడి వారి ఆశయాలకంటే ఎక్కువే పనిచేస్తున్నామని తమకు తామే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు.ఒక వైపు ఏపీలో ప్రశ్నించే గొంతుకలే లేకుండా చేయాలని ప్రయత్నిస్తూ, మరో వైపు జెన్-జీలో కలిసిపోయే వ్యూహంలోకి టీడీపీ, జనసేన నేతలు వెళుతున్నట్లు అనిపిస్తుంది. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దేశంలో సంచలనం సృష్టించిన క్రాకోచ్ జనతా పార్టీ పరిణామాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆయనకు తెలిసి అన్నారో, తెలియక అన్నారో కాని, తదుపరి చంద్రబాబు దాని జోలికి వెళ్లలేదు. కాని వ్యూహాత్మకంగా జెన్-జీ భాషను వినియోగించుకోవడం ఆరంభించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళుతున్నారా? లేక చిత్తశుద్దితో చేస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది.నేపాల్‌లో కొంతకాలం క్రితం జెన్-జీ పేరుతో పెద్ద విప్లవమే వచ్చింది. యువత వీధులలోకి వచ్చి పెద్ద ఎత్తున గళం విప్పారు. దానిని అణచివేయడానికి ఆనాటి ప్రభుత్వం కాల్పులవరకు వెళ్లింది. దాని ఫలితంగా పలువురు యువకులు మరణించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో పాలక పార్టీ పూర్తిగా తుడుచుకుపోయి కొత్త తరం నేతలు, కొత్త పార్టీ పేరుతో అధికారంలోకి వచ్చేశారు. అనంతరం కాల్పులకు కారణమైన ఆనాటి నేపాల్ ప్రధాన మంత్రి, మంత్రులను జైళ్లకు పంపారు. ప్రభుత్వ అవినీతిపై పోరాడడానికి సోషల్ మీడియాను నేపాల్ యువత ఒక ఆయుధంగా మార్చుకుంది. దానిని తట్టుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫారంలను ప్రభుత్వం నిషేధించడంతో అది తీవ్ర నిరసనగా మారి ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది.అప్పటి నుంచే జెన్-జీ అన్నది బాగా పాపులర్ అయింది. గతంలో ఆయా వయసులను బట్టి తరాలు అనేవారు. కాని ఇప్పుడుమారిన సాంకేతిక యుగంలో, డిజిటల్ కాలంలో జన్ జడ్, జెన్ ఆల్ఫా, బీటా ఇలా పేర్లు పెడుతున్నారు. వాటన్నిటి లక్ష్యం ఒకటే. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సమాజంలోనూ, పాలన వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావడమే. ప్రధానంగా యువత సోషల్ మీడియాను వాడుతున్న తీరు, సెల్‌ఫోన్, టాబ్ వంటి సాంకేతిక పరికరాలపై గడుపుతున్న టైమ్ మొదలైనవాటిని పరిశీలించి ఈ పేర్లు పెడుతున్నారు.స్థూలంగా చెప్పాలంటే కొత్త తరం ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలన్న సంకల్పం అన్నమాట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జెన్-జీ ఆశయాల కోసం సేవాగళం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం వినడానికి అయితే బాగుంది. కాని ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నదేమిటి? ప్రశ్నించే గళాలను అణచివేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు అమలు చేస్తున్న రెడ్ బుక్ పర్వంపై పవన్ కళ్యాణ్ కాని, ఆయన పార్టీ వారు కాని ప్రశ్నించి ఉంటే కచ్చితంగా ఇలాంటి సేనా గళం ఏర్పాటుకు అర్హులు అవుతారు.ప్రతిపక్ష వైఎస్సార్సీపీపైన దాడులే కాదు. తన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపై సాగుతున్న దాడులను పవన్ ప్రశ్నించలేకపోతున్నారు. అధికారానికి అలవాటు పడి, జనసేన వారు సైతం అలాంటి దాడులను భరించాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులో ఒక తెలివి ఉంది. అది దేశంలో లేదా, ఏదైనా విదేశంలో కొత్త మార్పు వస్తుంటే అది తనకు ప్రచారానికి ఉపయోగపడుతుందనుకుంటే వెంటనే అందులోకి వెళ్లి పోతుంటారు.ఉదాహరణకు 2012 ప్రాంతంలో దేశంలో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఆధ్వర్యంలో ఒక ఉద్యమం వచ్చింది. అప్పట్లో దేశ వ్యాప్తంగా దానికి మద్దతు వచ్చింది. అంతే! చంద్రబాబు తెలివిగా తానూ అన్నాహజారేకి మద్దతు ఇస్తున్నానని చెప్పి హైదరాబాద్‌లోని తన పార్టీ ఆఫీస్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబుపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినా ఆయన ధైర్యంగా ఆ ర్యాలీ తీశారు.దానిపై చంద్రబాబును ఎద్దేవా చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా పాపులర్ అయ్యాయి. ఏదైనా వ్యతిరేకత వచ్చే విషయం జరిగితే వెంటనే దానిని తన రాజకీయ ప్రత్యర్ధికి అంటగట్టేయడం కూడా చేస్తుంటారు. ఉదాహరణకు 2022 ప్రాంతంలో శ్రీలంకలో ప్రజలు తిరగబడి అధ్యక్ష భవనంలోకి కూడా దూసుకువెళ్లారు. ఆ దేశం అప్పుల కారణంగా దివాళా తీసినంత పనైంది. అంతే! చంద్రబాబు ఆ పరిస్థితిని అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వానికి రుద్దేశారు. ఏపీ శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేశారు. ఏపీ 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని అబద్దాన్ని సృష్టించారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా తబాలా వాయించేవి.పవన్ కళ్యాణ్‌తో పాటు, బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి కూడా అదే దుష్ప్రచారం చేశారు. చిత్రమేమిటంటే ఉమ్మడి ఏపీకి తానే అత్యధిక కాలం సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత విభజిత ఏపీకి కూడా తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన టైమ్‌లో చేసిన అప్పుల్ని కూడా జగన్ ప్రభుత్వానికి అంటగట్టి పచ్చి అబద్దాన్ని జనంలోకి తీసుకువెళ్లే యత్నం చేశారు. ఇలా ఉంటుంది ఆయన ధోరణి. తన కుమారుడు లోకేష్‌కు కూడా అలాంటి ట్రైనింగే ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఏపీలో జెన్-జీ ఉద్యమం వస్తే అది ఎవరికి వస్తుంది? కూటమి ప్రభుత్వంపైనే కదా! ఈ రెండేళ్లలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు మరే రాష్ట్రంలో జరగలేదు కదా! సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి పోలీసులను ప్రయోగిస్తున్నది కూటమి సర్కారే కదా! నేపాల్‌లో కూడా అలా చేయబట్టే ప్రజలలో తిరుగుబాటు వచ్చింది. బహుశా ఆ భయంతోనే తెలివిగా తాము కూడా జెన్-జీ అంటూ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్‌కు చిత్తశుద్ది ఉంటే, ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించాలి.ఉదాహరణకు డీఎస్సీకి సంబంధించి వచ్చిన అనేక వార్తలపై స్పందించి ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా! రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ హత్యల గురించి, టీడీపీ గూండాల దాడి గురించి మాట్లాడాలి కదా! జనసేన నేత ఇంటినే మచిలీపట్నంలో కూల్చితేనే కనీసం స్పందించలేదే! ఒక మహిళా నేత ప్రైవేటు వీడియోలను టీడీపీ ఎమ్మెల్యే తీయించారన్న ఆరోపణలపై ముఖ్యమంత్రిని నిలదీయలేదే! అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తెచ్చి, దానిని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణపై పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసే సేనాగళం మాట్లాడుతుందా?కేవలం పవన్ కళ్యాణ్ పై వచ్చే రాజకీయ విమర్శలకు మాత్రమే బదులు ఇవ్వడానికి దీనిని ఏర్పాటు చేస్తున్నారా? ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక రాజకీయ విశ్లేషణపైనే కేసు పెట్టిన జనసేన జెన్-జీ గురించి, సేనా గళం గురించి చెబుతుంటే విడ్డూరంగానే కనిపిస్తుంది. తెలంగాణలో పవన్ కొనుగోలు చేసినట్లు చెబుతున్న చెరువు భూమిపై వివరణ ఇచ్చి ఉండాల్సింది కదా! చంద్రబాబు, లోకేష్‌లు ఏదైనా మంచి పని చేస్తే పవన్ కీర్తించవచ్చు. కాని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని మానేశారని కదా ఆ పార్టీవారు వాపోతున్నది.కనుక ముందుగా పవన్ కళ్యాణ్ తన గురించి తానే ప్రశ్నించుకుని ఆ తర్వాత సేనాగళానికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగిస్తే సముచితంగా ఉంటుందేమో! లేకుంటే ఇది కూడా టీడీపీ గేమ్ ప్లాన్‌లో భాగమేనేమో అన్న అనుమానం వస్తుంది. ఏపీలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించేవారిని అణచివేయడానికి కొత్త వేషంలో వస్తున్నారేమో అన్న అభిప్రాయం కలగకుండా పవన్ సేనాగళం పనిచేస్తుందా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఢిల్లీ వెళ్లగానే నోరు తిరగబడిందా..? పవన్ పై కారుమూరి పంచ్ లు
-
అనుభవం లేనప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు? ఏకిపారేసిన వెల్లంపల్లి
-
మీనాక్షికి EC షాక్.. వైజాగ్ లో పవన్, లోకేష్ ల డ్రామా..
-
ఒక్కోసారి యాక్సిడెంట్లు జరుగుతుంటాయ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో నిపుణులను తొలగించడం, సిబ్బందిని తగ్గించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘‘నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. నేనేమి చేయగలను. లోటుపాట్లను అర్థం చేసుకోవడం నాలాంటి వాళ్ల వల్ల కాదు. ప్లాంట్ నిర్వహణ లోపాలపై విచారణ కమిటీ వచ్చాకే చెప్పగలను..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక్కోసారి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయన్నారు. స్టీల్ ప్లాంటు ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఇటువంటి సందర్భాల్లో అందరూ ఒకేసారి మీద పడిపోతే పరిష్కారం కాదన్నారు. యాజమాన్యాలు ఒకటికి పది సార్లు చూసుకోవాలని... ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రమాదాలపై నాలుగైదు గంటలు... అవసరమైతే ఒకరోజు తీసుకుని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానన్నారు. గతంలో తాను క్యాప్టివ్ మైన్స్ గురించి మాట్లాడేందుకు ఢిల్లీకి తీసుకెళతానంటే కార్మిక సంఘాల నేతలు ఒక్కరు కూడా రాలేదని వ్యాఖ్యానించారు. -
‘విశాఖలో లోకేష్, పవన్ కళ్యాణ్ తీరు అమానుషం’
మచిలీపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయిన సమయంలో, బాధితులను ఓదార్చాల్సిన రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మానవత్వం మరచి రాజకీయ వ్యాఖ్యలకు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తీవ్రంగా ఆక్షేపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం, సిబ్బంది కోతలు, కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రమాదానికి కారణమని ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించి రాజకీయ ప్రచారంలో నిమగ్నమైందని విమర్శించారు. మచిలీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు.మంత్రులు అహంకారంగా వ్యవహరించడం బాధాకరంవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి 22 మంది చేయాల్సిన పనిని కేవలం 11 మందితో చేయించడంతో పాటు, గత రెండేళ్లుగా వీఆర్ఎస్ పేరుతో అనుభవజ్ఞులైన కార్మికులను ఇంటికి పంపివేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడం యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనం. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో ఉంటే వారిని ఓదార్చాల్సిన మంత్రులు అహంకారంగా వ్యవహరించడం బాధాకరం. ప్రమాద స్థలానికి వెళ్లిన నారా లోకేష్ కార్మికుల బాధను వినాల్సింది పోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రూ.25 లక్షల పరిహారం కూడా కొత్తగా ప్రభుత్వం ఇచ్చింది కాదు. గతంలోనే స్టీల్ ప్లాంట్‌లో అమలులో ఉన్న విధానం ప్రకారమే ఆ మొత్తం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అదనంగా చేసిన సాయం ఏమిటో చెప్పాలి. అధికారంలో ఉన్నవారు మరింత బాధ్యత, సంయమనంతో వ్యవహరించాలి.రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేసిన సాయం ఏమిటో?వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. కానీ అవి శాశ్వత ఉద్యోగాలు కావు, తాత్కాలిక నియామకాలే. స్టీల్ ప్లాంట్ భవిష్యత్తే అనిశ్చితిలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగాల భద్రతపై కూడా సందేహాలున్నాయి. మృతుల కుటుంబాలకు ఇస్తున్న రూ.25 లక్షల పరిహారం కూడా కొత్తగా ప్రభుత్వం ప్రకటించింది కాదు. స్టీల్ ప్లాంట్‌లో ఇప్పటికే అమలులో ఉన్న సంప్రదాయం, వేజ్ అగ్రిమెంట్ ప్రకారమే ఆ మొత్తం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా చేసిన సాయం ఏమిటో చెప్పాలి. ప్రమాదం తర్వాత మంత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లడం మంచిదే. అయితే బాధితులను పరామర్శించే సమయంలో హుందాగా, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్లి వైఎస్ జగన్ గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఘటనాస్థలానికి వెళ్లకుండా, విజయవాడలోనే సమీక్షలు నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర మంత్రి మాత్రం వెంటనే విశాఖకు చేరుకున్నారు. ఇలాంటి విషాద సమయంలో రాజకీయ వ్యాఖ్యలకు బదులుగా బాధిత కుటుంబాలకు అండగా నిలవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.పవన్‌వి పచ్చ దగాకోరు మాటలువిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించారని చెప్పడం పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రచారం. పచ్చి దగాకోరు మాటలే. 2020లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కార్మికుల ఉద్యమం, ప్రజా వ్యతిరేకత కారణంగానే ఆ నిర్ణయం అమలుకాలేదు. 2025 జనవరిలో కేంద్ర మంత్రి కుమారస్వామి స్వయంగా విశాఖకు వచ్చి, కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ఇప్పటి వరకు కేంద్రం ఆ నిర్ణయాన్ని అధికారికంగా వెనక్కి తీసుకోలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో మీ ప్రభుత్వాలే ఉన్నప్పుడు గత రెండేళ్లలో ఒక్కసారైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా? క్యాప్టివ్ మైన్స్ కోసం గానీ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం గానీ ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలి. వాస్తవాలను దాచిపెట్టి వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమే.బాధిత కుటుంబాలకు అండగా నిలవాలినాడైనా, నేడైనా వైఎస్సార్సీపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వంద శాతం వ్యతిరేకిస్తోంది. ప్రతిపక్షంలో ఉంటే ఉద్యమం చేస్తాం, అధికారంలో ఉంటే కేంద్రం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఈ విషాద ఘటనను రాజకీయాలకు వేదికగా మార్చకుండా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు పూర్తి సహాయం అందించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకుని, ప్లాంట్ భవిష్యత్తును కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి.ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన విధంగానే, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించి వారికి తగిన పరిహారం, భరోసా కల్పించాలి. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేకపోయినా, వారి కుటుంబాలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అంటూ మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. -
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి..! ఇద్దరికి ఇచ్చి పడేసిన అడ్వకేట్ రజిని
-
స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు
-
ప్రస్టేషన్ ఎక్కువై YSRపై నిందలు, KVP మొట్టికాయలు
-
మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్రేషియా ఇవ్వండి స్టీల్ ప్లాంట్ ఘటనపై కేఏ రియాక్షన్
-
అత్తారింటికి దారేది సీన్ గుర్తొస్తోందా?.. పవన్‌పై విమర్శలు
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను నటించిన సినిమాలలోని కొన్ని సన్నివేశాలను గుర్తుంచుకునైనా మాట్లాడితే ఇంత అప్రతిష్ట మూట కట్టుకునేవారు కారన్న మాట రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. అందులో హాస్య నటుడు బ్రహ్మానందం అబద్ధాలు చెబితే ఒక చెట్టు ఆకులు రాలుతుంటాయి. దాంతో ఆయన ఇరుకున పడతారు. ఇది పవన్ కళ్యాణ్ కు వర్తిస్తుందనిపిస్తుంది. అబద్దం చెబితే అతికినట్లు ఉండాలన్నది ఒక సామెత. ఈ విషయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న నేర్పరితనం పవన్ కు ఇంకా రాలేదనుకోవాలి. చంద్రబాబు ప్రత్యర్థులు ఈ విషయం ప్రస్తావిస్తుంటారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగల శక్తి చంద్రబాబుకు మాత్రమే ఉందని ఎద్దేవ చేసేవారు. అది వేరే కథ. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఏదో ఒక ప్రకటన చేయడం, ఆ తర్వాత అనతికాలంలోనే దానికి విరుద్ధంగా మాట్లాడడం వంటివి తరచు చేస్తుంటారన్న విమర్శ ఉంది. వాటిని నిర్ధారించే వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా కనిపిస్తాయి. గతంలో కాపుకులం వారైనా తనకు మద్దతు ఇవ్వాలని బహిరంగంగా కోరడం, ఇప్పుడేమో, తాను కాపులకోసమే పార్టీ పెట్టలేదన్నట్లుగా మాట్లాడడం, కాపులు మద్దతు ఇస్తే సీఎం అయి చూపుతానని ఒకసారి, తనకు అంత శక్తి ఎక్కడిదని ఇంకోసారి మాట్లాడారు.కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తనకు ఏపీలోనే దిక్కులేదని, తెలంగాణలో సీఎం అవుతానా అని వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరిచారు. అది ఫ్రస్టేషనా? లేక ఇంకేదైనా కారణమో తెలియదు. ఈ క్రమంలోనే దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై పవన్ కళ్యాణ్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తారేమో అన్న అనుమానంతో ఆయనను ఇబ్బంది పెట్టాలని వైఎస్ అనుకున్నట్లు, ఆ విషయాన్ని ఒక పోలీసు అధికారి చెప్పినట్లు పేర్కొన్నారు. రోడ్డుపైకి వస్తే కాల్చేసే రోజులని, తాను తుపాకి పోలీసులకు ఇచ్చేసి ప్రాణాలకు తెగించి రాజకీయాలలోకి వచ్చానని ఆయన తెలిపారు. ఇది విన్న కొత్త తరం వారికి అందులో నిజం ఉందేమో అనుకునే అవకాశం ఉంటుంది. కాని అప్పటి నుంచి రాజకీయాలను చూస్తున్న వారికి పవన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.ఇంత ఘోరంగా అసత్యాలు చెప్పవలసిన అవసరం ఏమి ఉంది అన్న ప్రశ్న వచ్చింది. దీనిని ఖండించి, ఎవరూ వాస్తవాలు చెప్పలేరులే అన్న ధైర్యమో, లేక నిజాలు తెలిసినా పర్వాలేదులే.. తాను చెప్పినవాటిని నమ్మే జనం ఉంటారులే అన్న భావమో తెలియదు. కాని దీనివల్ల తన పరువుకు భంగం అని ఆయన ఆలోచించలేకపోతున్నారు. ఆ వెంటనే కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు పాత చరిత్రను తవ్వారు. పవన్ తుపాకి కథకు సంబంధించిన వీడియోలను వెలికి తీశారు. వాటిని చూస్తే పవన్ కళ్యాణ్ అనవసరంగా గెలుక్కున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. పైగా అసందర్భంగా మాట్లాడినట్లు కూడా అర్థం అవుతుంది.కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఈ నేపథ్యంలోనే ఆయనకు సవాల్ విసిరారు. 2005 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పెద్దగా జనంలో ప్రాచుర్యం పొందిన నేతకాదు. కేవలం ఒక సినిమా నటుడిగా, అది కూడా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మాత్రమే గుర్తింపు ఉండేది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన తర్వాత పవన్ ను యువరాజ్యం అధ్యక్షుడిని చేశారు. ఆ తర్వాత ఇందిరాపార్క్ వద్ద జరిగిన ఒక ధర్నాలో కాంగ్రెస్ వాళ్ల పంచెలూడదీసి కొట్టాలి అన్న వివాదాస్పద డైలాగుతో పవన్ బాగా ప్రచారంలోకి వచ్చారు. ఆ తర్వాత పరిణామాలలో 2014లో జనసేన ఆవిర్భావంతో ఒక ప్రముఖ రాజకీయ నేతగా అవతరించారు.2005 ప్రాంతంలో చిరంజీవి కుమార్తె ఒకరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి కుటుంబపరంగా ఏవో సమస్యలు వచ్చాయి. ఆ క్రమంలో ఆమె పవన్ పై ఒక ఆరోపణ చేశారు. ఆయన వల్ల తమకు ప్రమాదం ఉందని అన్నారు. దాంతో పవన్ తన వద్ద ఉన్న తుపాకిని తెచ్చి పోలీసులకు అందచేశారు. ఆ టైమ్ లో అవే విషయాలను ఆయన మాట్లాడారు. కాని రెండు దశాబ్దాల తర్వాత ఆ ఉదంతాన్ని వక్రీకరించి వైఎస్ఆర్పై నింద మోపడంతో మరోసారి నిజాలు వెలుగులోకి వచ్చాయి. అత్తారింటికి దారేది సినిమాలో అబద్ధాలు ఆడితే ఆకులు రాలినట్లుగా, వీడియోలతో అసలు సన్నివేశం తెలిసిపోయింది. దీనిపై తొలుత వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని స్పందిస్తూ పవన్ కళ్యాణ్ రౌడీయిజం చేయబోతే చిరంజీవి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసిందని వ్యాఖ్యానించారు.కాస్త ఆలస్యంగా కేవీపీ రామచంద్రరావు ఒక లేఖను పవన్ కు రాస్తూ తన ఆక్షేపణ తెలిపారు. పవన్ అసత్యాలు చెబుతున్నారని అందులో స్పష్టం చేశారు. వైఎస్ పై ఆరోపణలను రుజువు చేస్తే పది కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి, లేదా స్వచ్ఛంద సంస్థకు అందచేస్తామని సవాల్ చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కుటుంబపరంగా మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప, ఎలాంటి రాజకీయ కేసులు లేవని కేవీపీ స్పష్టం చేశారు. సంబంధిత పోలీసు అధికారి ఎవరో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధపడితే ఈ చాలెంజ్ స్వీకరించాలని అన్నారు. పవన్ కాంగ్రెస్ వారిని ఉద్దేశించి అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు(పంచెలూడగొట్టాలని) చేస్తేనే కేసు పెట్టలేదని ఆయన గుర్తు చేశారు.ఈ సందర్భంలో కేవీపీ కూడా బహుశా కంపల్షన్ రీత్యా ఒక వ్యాఖ్య చేసినట్లు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డికి, వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని చాలామందిలాగానే పవన్ కూడా గుర్తించడంలో విఫలం అయ్యారని కేవీపీ అన్నారు. వైఎస్ ఆర్ మరణించాక ఆయన పేరు చార్జీషీట్ లో చేర్చిన రోజే కాంగ్రెస్ తో బంధం తెగిపోయిందని చాలామంది నమ్ముతారు. వైఎస్ వారసత్వాన్ని జగన్ కొనసాగించి ఉండకపోతే ఈపాటికి కాంగ్రెస్ పార్టీ ఆయనను పూర్తిగా వదలివేసి ఉండేదేమో!ఈ మధ్యకాలంలో వైఎస్ ఆర్ పైన, ఆయన కుటుంబంపైన అంత నీచంగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా జవాబు ఇచ్చి ఖండించిందా? లేదే! పైగా ఏపీలో కాంగ్రెస్ నాయకత్వం టీడీపీతో మిలాఖత్ అయిందన్న ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి కదా! పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరో అడిగితేనే కాని స్పందించలేదని ఆయనే చెప్పడం కూడా గమనించదగిందే! కనీసం ఇప్పటికైనా స్పందించి అప్పటి పరిస్థితులను వివరించడం ద్వారా తన ఆప్త మిత్రుడైన వైఎస్ కు కేవీపీ కొంతలో కొంత న్యాయం చేసినట్లయింది.కేవీపీ చేసిన ఈ సవాల్ ను పవన్ స్వీకరిస్తారా అన్నది అనుమానమే. దానికి తగినట్లే ఆయన జవాబిచ్చినట్లు కనిపించలేదు. ఎందుకంటే ఈ పన్నెండేళ్లలో పవన్ కళ్యాణ్ చేసిన అనేక ప్రకటనలు, ఆ తర్వాత వాటికి విరుద్ధంగా ఆయనే మాట్లాడిన వీడియోలు కోకొల్లలుగా కనిపిస్తాయి. గతంలో జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెచ్చిపోయి మాట్లాడిన పవన్, తెలంగాణలో మాత్రం రేవంత్, కేటీఆర్ తదితరులను పొగుడుతున్న తీరును జనం గమనించకపోలేదు. ఎప్పటికీ అది ప్రస్తుతమో అన్నట్లుగా కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ పనిచేస్తుంటారన్న భావన ఉంది. వైఎస్ పై కూడా దురుద్దేశంతో చేసిన వ్యాఖ్య ఆయనకే తగిలినట్లయింది. పవన్ కళ్యాణ్ అనవసరంగా తెలంగాణలో వేలుపెట్టి వివిధ వర్గాలవారిని రెచ్చగొట్టి ఆంధ్రులకు ఇక్కట్లు తెచ్చి పెట్టకుండా ఉంటే అదే పదివేలు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
విశాఖలో విషాదం.. పవన్ కు కాపు జాతి షాక్
-
పవన్ కళ్యాణ్ పై చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఫైర్
-
ప్లాన్ రెడీ... పవన్ పై చంద్రబాబు బిగ్ స్కెచ్..!
-
లింగమనేని కరకట్ట రుణం బాబు తీర్చుకుంటే.. బాబు ప్యాకేజీ రుణం పవన్ తీర్చుకున్నాడు...!
-
ఔను.. వాళ్ళదే రాజ్యం! సానా కధలున్నాయ్
-
నిందలు కాదు.. నిజాలు తెలుసుకో
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ: వంగవీటి రంగాను కాపాడుకోలేదని ఏపీలోని కాపులను.. గద్దర్‌కు వెన్నులో తూటాలు దించితే కాపాడలేదని తెలంగాణ సమాజాన్ని నిందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రెండు ఘటనలూ టీడీపీ హయాంలోనే జరిగాయనే నిజాలను ఎందుకు విస్మరిస్తున్నారని కాపు నేతలు సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా రంగా పేరును ప్రస్తావించకుండా, కాపులను నిందించకుండా.. నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్, రామ్ తాళ్లూరి డైరెక్షన్లో మీ పార్టీని మీరు నడుపుకోవాలని పవన్‌కు సూచించారు. పవన్ అండ చూసుకుని సీఎం చంద్రబాబు కాపుల పట్ల తీవ్ర కులవివక్ష చూపిస్తున్నారని, సరైన సమయంలో ఓటు ద్వారా గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.ఈమేరకు రాజమహేంద్రవరంలో నిర్వహించిన కాపు ఆత్మగౌరవ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్పీఎస్) రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు, వర్కింగ్ చైర్మన్ మాసాబత్తుల శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్, రాష్ట్ర కో–ఆర్డినేటర్లు జానపాముల నాగేంద్రకుమార్, జేటీ రామారావు, రాష్ట్ర కో–కన్వీనర్ బోడపాటి పెదబాబు, కాకిలేటి హరనాథ్, వంగా ఆంజనేయులు సోమవారం మీడియాకు వెల్లడించారు. కాపు రాజ్యాధికార పోరాట సమితి, కాపు రక్షణ చట్టం పోరాట సమితి ముఖ్య ప్రతినిధులు ఆత్మగౌరవ సమావేశానికి హాజరయ్యారు.ఇటీవల మంగళగిరి, రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశాల్లో కాపు నాయకులు, కాపు సంఘాలు, కాపు సమాజాన్ని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. తామంతా కాపు సంఘాల్లో మూడు దశాబ్దాలకుపైగా పనిచేస్తూ కాపుల సంక్షేమం, రిజర్వేషన్లు, రాజ్యాధికారం కోసం నిరంతర పోరాటం కొనసాగిçస్తున్నట్లు గుర్తు చేశారు. గత రెండేళ్లలో కాపు నాయకులెవరూ పవన్‌ను కలిసిందీ లేదు.. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిందీ లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్‌ను ఉద్దేశించి కాపు నేతలు పలు ప్రశ్నలు సంధించారు. ⇒ కాపు నాయకులు కన్వీనియంట్ రాజకీయాలు చేస్తున్నారని రాజమహేంద్రవరం వేదికగా పవన్ వ్యాఖ్యలు చేశారు. నిజానికి మీఅంత కన్వీనియంట్ పొలిటీషియన్ మరొకరున్నారా పవన్? మీ అంత స్థిరత్వం లేని పొలిటీషియన్ మరొకరున్నారా? పాచిపోయిన లడ్డూలు అన్నదెవరు? ఉత్తరాది, దక్షిణాది అనే ఫీలింగ్ చూపిస్తున్నారని అన్నదెవరు? ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కవాతు చేస్తానని ప్రకటించి ఆ తరువాత కనపడనిది ఎవరు? మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం తీసుకోవడమేమిటని అమరావతి పర్యటనలో ప్రశ్నించి తర్వాత ఆ విషయాన్ని వదిలేసిందెవరు? మా నాన్న హేతువాది.. సోషలిస్టు.. రామకోటి రాశారని రకరకాలుగా మాట్లాడిందెవరు? తనది వామపక్ష భావజాలమని, భగత్‌సింగ్, చేగువేరా తనకు ఆదర్శమని చెప్పిందెవరు? నాకు కులం లేదు.. మతంలేదు అంటూనే నిరంతరం కులాలు, మతాల గురించి మాట్లాడుతున్నది మీరు కాదా? ⇒ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఇదే రాజమహేంద్రవరంలో ఎన్నికల ముందు పవన్ చెప్పలేదా? కశ్మీర్ సమస్యకైనా పరిష్కారం దొరికింది కానీ కాపుల సమస్యకు పరిష్కారం లేదా? అని అనలేదా? కాపులు తనకు ఓట్లు వేయకపోయినా పర్వాలేదని ఇప్పుడు ఎలా అనగలుగుతున్నారు? కాపుల ఓట్లు తమకు అవసరం లేదని చంద్రబాబు, లోకేశ్‌తో చెప్పించగలరా? ⇒ రాజకీయ ప్రత్యర్థి గా అంబటి రాంబాబును పవన్ విమర్శించారని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రజారాజ్యం, జనసేన కోసం పనిచేసిన దాసరి రామును ఉద్దేశించి పవన్ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదు. కాపులు తనకు అండగా నిలబడలేదని.. తోట చంద్రశేఖర్, జేడీ లక్ష్మీనారాయణ తనను వదిలేసి వెళ్లిపోయారని అంటున్న పవన్ అధికారంలోకి వచ్చాక బొలిశెట్టి సత్యనారాయణ ఎందుకు వెళ్లిపోయారో చెప్పగలరా? కాపు నాయకుల మూలాల మీదకు వెళతాం, వారి చిట్టాలు విప్పుతామని బెదిరిస్తున్న పవన్.. మెగా కుటుంబానికి మూల స్తంభంగా కాపు కాసింది కాపులేనని విస్మరిస్తున్నారు. కాపులను నిందించి, బెదిరించి పవన్ తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారనే విషయం అర్థమవుతోందా? ⇒ మీరంతా నా వెనుక ఉంటే ముఖ్యమంత్రినవుతానని గతంలో మీరు అన్న మాట ఎక్కడికి పోయింది పవన్? చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం కులాన్ని ఫుట్‌బాల్ ఆడుకుంటారా పవన్? వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని బొండా ఉమాతో ఉద్యమం చేయించిన చంద్రబాబును రెండేళ్లుగా ప్రశ్నించకపోవడం కన్వీనియంట్ రాజకీయం కాదా? ⇒ కాపు సమాజంలో ఎందరో మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖులున్నా కూటమి ప్రభుత్వం ఒక్కరినైనా గుర్తించిందా? కనీసం ఒక్క జిల్లాకైనా కాపు నేతల పేరు పెట్టిందా? ⇒ హైకోర్టు సమర్థించిన కాపు రిజర్వేషన్ల జీవోను తుంగలోకి తొక్కేసిన చంద్రబాబు కాపులకు తీరని అన్యాయం చేశారు. అదే చంద్రబాబు మైనారీ్టల రిజర్వేషన్ల విషయంలో రెండుసార్లు హైకోర్టు కొట్టివేసినా సమర్థి స్తున్నారు. ఇదేనా సమ ధర్మం? సమ న్యాయం? సామాజిక న్యాయం? -
నాగబాబు.. ప్రకాష్ రాజ్ లొల్లి, మధ్యలో ఎంట్రీ ఇచ్చిన రాహుల్
-
ఉప్మా మంత్రి.. మాట్లాడితే మా నాన్న.. మా నాన్న.. పవన్ పై మాస్ ర్యాగ్లింగ్
-
పవన్ కు కమెడియన్ చురకలు.. నీ గొప్పలు పక్కకు పెట్టి.. వీటికి సమాధానం చెప్పు
-
డబ్బులున్న వారికే టికెట్.. జెండా మోసిన కూలీలు బానిసలు..
-
ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్‌కు రాహుల్ రామకృష్ణ చురకలు!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ నటుల్లో రాహుల్ రామకృష్ణ ఒకరు. కేవలం సినిమా కబుర్లనే కాకుండా సమాజంలో చోటు చేసుకున్న పలు అంశాలపై తనదైన శైలీల్లో స్పందిస్తుంటాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై ఈ కమెడియన్ ఎక్స్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించాడు. మీ గొప్పలు పక్కన పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు నిర్వహించే శాఖల్లోని సమాచారాన్ని వెల్లడిస్తున్నారా? అంటూ పవన్‌ని నిలదీస్తూ ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టాడు.‘ PESA 1/70 చట్టం (ది పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్), గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి అడిగి చూపించండి. అటవీకరణ కార్యక్రమాలు మీరు చేశారా? ఓ స్వతంత్ర సంస్థ కన్ఫర్మ్ చేసిన లెక్కల ప్రకారం అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను దాఖలు చేసి గుర్తించిన ఫలితాలను అడుగుతున్నా.' అంటూ చివర్లో ‘జై తెలంగాణ’ అని ట్వీట్ చేశాడు.ఆ తర్వాత మరో ట్వీట్లో ‘మీరు సాధారణంగా చేసే ఆర్భాటాలు పక్కన పెడితే.. మీరు నిర్వహించే ప్రతి శాఖలో సమాచార హక్కు చట్టంలోని క్రియాశీల సమాచారాన్ని బహిర్గతం చేయడానికి సంబంధించిన సెక్షన్ 4.1(బి)ని అమలు చేశారా సార్? నేను మీ అభిమానిగా అడుగుతున్నా.. ప్రశ్నలకు నిరంతరం సమాధానం చెప్పాలి. ప్రశ్నించినందుకు నేను దేశద్రోహిని కాదు’ అని రాహుల్ రామకృష్ణ తనదైన శైలీలో పవన్‌కు చురకలు అంటించాడు. కాగా,ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘తెలంగాణ మీ అయ్య జాగీరా ’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ .. హైదరాబాద్‌లో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పెట్టేందుకు ప్రయత్నించగా.. తెలంగాణ పోలీసులు అనుమతించకపోవడంతో అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మినహా తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. తెలంగాణ మేధావులు కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. Apart from your usual bravado, have you implemented section 4.1(b) of proactive disclosure of the Right To Information Act in every department of every position you hold sir?I’m asking because I’m you’re fan and you need to constantly answer our questions— Rahul Ramakrishna (@eyrahul) June 7, 2026Asking questions doesn’t make me an anti national— Rahul Ramakrishna (@eyrahul) June 7, 2026 -
లింగమనేనికే సీటు ఎందుకు..? పవన్ పై తిరగబడ్డ జనసేన కీలక నేతలు
-
మహిళలపై కక్ష కట్టిన బాబు, పవన్ కళ్యాణ్
-
నీ అయ్య జాగీరా.. పవన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
-
గద్దర్ కు కారు కొనిచ్చావా..! పవన్ కి ఓ రేంజ్ లో ఇచ్చిపడేసిన కవిత
-
బాబుకు ఇల్లు గిఫ్ట్.. పవన్ కు ల్యాండ్ గిఫ్ట్.. లింగమనేనికి RS సీటు గిఫ్ట్..
-
బానిస బతుకు బతకడానికి మేము గొర్రెలం కాదు, ప్రకాష్ రాజ్ కౌంటర్
-
పవన్ పై కే ఏ పాల్ పంచులే పంచులు
-
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
సాక్షి,అమరావతి: జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్‌ను ఖరారు చేసింది. అధికారికంగా జనసేన ప్రకటించిన ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో లింగమనేని రమేష్‌కు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. చంద్రబాబుకు లింగమనేని కరకట్ట వద్ద గెస్ట్ హౌస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ భవనం అక్రమ నిర్మాణమని గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్ధారించింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో హెరిటేజ్‌తో పాటు లింగమనేని రమేష్‌కు లావాదేవీలు ఉన్నాయి. లింగమనేని రమేష్ రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలోనే పవన్ కళ్యాణ్ నివాసం, అలాగే జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. టీడీపీ కోటాలో చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకపోవడంతో, జనసేన కోటాలో పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడికి రాజ్యసభ స్థానం కల్పించారు. సోషల్ ఇంజనీరింగ్‌లో భాగంగా లింగమనేని రమేష్‌కు అవకాశం ఇచ్చినట్లు జనసేన ప్రకటించింది. -
ఏపీలో జనసైనికులను ఎగిరెగిరి తన్నుతుంటే దిక్కులేదు తెలంగాణాలో మీటింగ్ పెడతాడంటా..!
-
కేబినెట్ మీటింగ్ లో పవన్ కు బాబు వెన్నుపోటు
-
రేవంత్ రెడ్డి ఫ్రెండ్ అన్నావ్.. KTR ఫ్రెండ్ అన్నావ్ మీ అయ్యా జాగీరా అని ఎవరినన్నావ్
-
నీ అయ్య జాగీరా..? దాని ఫలితం ఇప్పుడు అర్థమైందా రాజా
-
పరిటాల గుండు కొడితే.. గద్దర్ మధ్యవర్తిత్వం కోసం పవన్ చేగువేరా అవతారం..
-
తెలంగాణలో తిట్టించుకుని.. AP పరువు తీసిన పవన్
-
మీపై కుట్ర అవసరం వైఎస్సార్‌కు లేదు
సాక్షి, హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా తనపై రాజకీయ కుట్ర చేశారని ఓ పోలీస్ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేశారు. పవన్‌కల్యాణ్‌పై కుట్ర చేయాల్సిన అవసరం వైఎస్సార్‌కు లేదని, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్‌పై లేదా ఆయన కుటుంబ సభ్యులపై రాజకీయ కక్షతో కేసులు పెట్టినట్టుగా ఆధారాలు ఏవీ లేవని పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రి తన రాజకీయ వ్యూహాలను పోలీసు అధికారులతో పంచుకోవడం కూడా వాస్తవ దూరమని తెలిపారు. పవన్ కల్యాణ్ ప్రస్తావించిన పోలీసు ఉన్నతాధికారి లై డిటెక్టర్ పరీక్షకు హాజరై వైఎస్సార్ అలాంటి వ్యాఖ్యలు చేశారని చెబితే, తాను, వైఎస్సార్ అభిమానులు కలిసి రూ.10 కోట్లను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లేదా పవన్ సూచించే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. ఆరోపణలపై నిజంగా విశ్వాసం ఉంటే ఈ సవాల్‌ను స్వీకరించాలని కోరారు. ఈ మేరకు గురువారం పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. మీపై అంత ప్రజాభిమానం అప్పుడూ లేదు..‘కొంత మంది తెలంగాణ నాయకులు.. మిమ్మల్ని ప్యాకేజీ స్టార్ అని పెయిడ్ ఆర్టిస్ట్ అని అనడం మీ హృదయాన్ని ఎంతో గాయపరిచిందని అర్థం చేసుకోగలను. అయితే జనం మెచ్చిన నాయకుడు వైఎస్సార్‌పై అసత్య ఆరోపణలు చేస్తే ఆయన అభిమానులు బాధపడతారు. రాజశేఖరరెడ్డి ఉంటే తమకు అన్యాయం జరగదని అనుకున్న వారి అచంచల విశ్వాసమే ఆయన లేనప్పుడు కూడా ఆ అభిమానాన్ని చూపిస్తున్నాయి. ప్రజల విశ్వాసం గెలుచుకున్న గొప్పదనం ఆయనది. 2005–06 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌కు అపార ప్రజాదరణ ఉండేది. అప్పట్లో రాజకీయాల్లో లేని మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేయాల్సిన అవసరం వైఎస్సార్‌కు లేదు. ఆ సమయంలో మీ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అప్పటికి మీరు, మీ కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు. వస్తున్నట్లు పొగ కూడా లేదు. కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది ఒక అసంబద్ధ ఆరోపణ. నిజానికి అంత ప్రజాభిమానం మీపట్ల అప్పుడూ లేదు.. ఆ తర్వాత లేదన్నది సత్యం. మీ పట్ల ప్రజలకు ఉన్న రాజకీయ అభిమానాన్ని కొలవడానికి వేరే ప్రమాణాలు అవసరం లేదు. 2019లో రెండుచోట్ల స్వయంగా పోటీ చేసి ఓడిపోవడం, 2023లో తెలంగాణ శాసనసభ, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చాలు. ఇలా అర్థం లేని ఆరోపణలు చేయడం తగని పని..’ అని ఆ లేఖలో కేవీపీ పేర్కొన్నారు. -
హంగులు, అందాలకు భారీగా ఖర్చు AP కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
-
బరెల్లక్క కన్నా హీనం... ఇక్కడే దిక్కులేదు.. తెలంగాణలో ఏం పీకుతావ్
-
కొంచెమైనా సిగ్గుండాలి మాదాపూర్ కోడి కళ్యాణ్.. వెంకట్ రెడ్డి పంచులు
-
పవన్ కల్యాణ్‌కు కేవీపీ ఓపెన్ ఛాలెంజ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కేవీపీ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ విషయంలో పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ మీపై కేసులు పెట్టమన్నారని నిరూపించగలరా? అంటూ పవన్ కల్యాణ్‌కు కేవీపీ బహిరంగ లేఖ రాశారు.‘‘వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు మీపై ఎలాంటి కేసులు పెట్టలేదు. వైఎస్సారే కేసులు పెట్టమన్నారన్న పోలీస్ అధికారికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి. నిరూపిస్తే వైఎస్సార్ అభిమానులందరం కలిసి సీఎంఆర్ఎఫ్కు రూ.10 కోట్లు ఇస్తాం’’ అని కేవీపీ సవాల్ విసిరారు. -
ఏం మాట్లాడుతున్నారు మీరు.. పవన్ మా పార్టనర్, అలా మాట్లడరు.. మీరే సృష్టించారు
-
AP క్యాబినెట్ మధ్య నుంచే వెళ్లిపోయిన పవన్.. ఎందుకంటే..!
-
తెలంగాణలో ఏం వాగుతున్నావ్!? పవన్ వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ స్ట్రాంగ్ రియాక్షన్
-
పవన్ కల్యాణ్‌కు అస్వస్థత
సాక్షి,అమరావతి: పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గురువారం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశం కొనసాగుతుండగా మధ్యలోనే పవన్ కల్యాణ్ వెళ్లిపోయారు. అయితే కేబినెట్ సమావేశం మధ్యలో పవన్ అస్వస్థతకు గురైనట్లు జనసేన నేతలు చెబుతున్నారు. వెన్నునొప్పితో కేబినెట్ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు వెళ్లిపోయారు. -
పవన్ స్క్రిప్ట్‌లో మిస్సయిన మెయిన్ మెసేజ్!
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సడన్ గా హైదరాబాద్ లో తెలంగాణ రాజకీయ పార్టీలపైన లొల్లికి దిగడంలో వ్యూహం ఏమైనా ఉందా? లేక కాకతాళీయంగా జరిగిందా? ఆయన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించకపోవడం, తదుపరి హైకోర్టులో కూడా చుక్కెదురవడంతో మీడియా మీట్ పెట్టి దాదాపు గంటసేపు తన భావజాలాన్ని ప్రదర్శించారు. అప్పుడప్పుడు ఆయనలో కనిపించే సినిమాటిక్ హాహా భావాలు, గొంతెత్తి అరవడం వంటివి ఆయన అభిమానులకు సంతోషం కలిగించవచ్చు. కాని అసలు ఆయన ఈ మీడియా సమావేశం ఎందుకు పెట్టారు? ఏమి మాట్లాడాలని అనుకన్నారు? ఏమి మాట్లాడారు? ఒకదానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడడం, పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం వంటివి యథాప్రకారం జరిగాయనిపిస్తుంది.ఆయన ఏమి చెప్పారో పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మెచ్చుకోవాల్సిందే. గందరగోళంగా సాగిన ఆయన ప్రసంగంలో కొన్ని అంశాలు అందరి దృష్టిని బాగా ఆకర్షించాయని చెప్పాలి. ఆంధ్రలోనే తనకుదిక్కు లేదని, ఇక తెలంగాణలో సీఎం అవుతానా అని ఆయన అన్న వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఆంధ్రలో దిక్కులేదని అనడం ఏమిటి? అంటే తాను సీఎం కాలేనని మరోసారి స్పష్టం చేశారని అనుకోవాలా? తెలంగాణలో తానేమి చేయగలనన్నదానికి కట్టుబడి ఉన్నారా! అంటే లేదు. ఈరోజు చెబుతున్నా.. తెలంగాణలో జనసేన పోటీచేస్తుంది అని పవన్ చెప్పారు. తెలంగాణలో బలం లేదని తెలిసి కూడా ఎందుకు పోటీచేస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉండి ఉండాలి.ఇదేదో మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నట్లు పిక్చర్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. కానీ తెలంగాణలో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీజేపీతో కలిసి జనసేన పోటీచేసింది. ఏడుచోట్ల పోటీచేస్తే ఆరుచోట్ల డిపాజిట్లు రాలేదు. కొద్ది నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికలలో వేళ్లమీద లెక్కించదగిన వార్డులలో గెలిచారట. అది గొప్ప విషయంగా ఆయన భావిస్తున్నట్లు ఉంది. తెలంగాణకు వస్తే తిరగనివ్వమని బెదిరిస్తారా? ఇది మీ అయ్య జాగీరా అని ఆయన ప్రశ్నించారు. దానికి జవాబుగా మంత్రి పొన్నం ప్రభాకర్ అవును.. ఇది మా అయ్య జాగీరే.. తెలంగాణ ప్రజల జాగీరే అంటూ ఘాటుగా బదులిచ్చారు. నిజానికి పవన్ ను ఎవరూ ఇక్కడ తిరగనివ్వబోమని అనలేదు. అన్నా దానిని ఎవరూ అంగీకరించజాలరు. కాని తెలంగాణవారిపై ఏపీ పోలీసులతో దాడులు చేయిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.ఇదంతా డైవర్షన్ రాజకీయమా? అనే చర్చ జరుగుతోంది. తన పదెకరాల పొలం కోడి చెరువులో ఉందన్న ఆరోపణపై ఆయన నేరుగా స్పందించి, అందులో తప్పు జరిగిందా? లేదా? తాను తెలిసి కొన్నారా? తెలియక కొన్నారా? కొందరు జర్నలిస్టులు ఆరోపిస్తున్నట్లుగా నిషేధిత జాబితా నుంచి ఆ ప్రదేశాన్ని తొలగించడం నిజమా? కాదా? పదెకరాల భూమిని ఒకేసారి కాకుండా మూడు ఎకరాల చొప్పున విడతలవారీగా మ్యుటేషన్ చేయించుకోవడంలో ఉన్న రహస్యం ఏమిటి. అక్కడ బోర్ వేయడం కాని, పెన్సింగ్ ఏర్పాటు చేయడంపై కాని పవన్ కళ్యాణ్ వివరించి, జర్నలిస్టుల వాదన అసంబద్ధమని రుజువు చేసి ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది. అలాకాకుండా తన భూమి చెరువులో ఉందని తేలితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇది కొంత నయమే అయినప్పటికీ, ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి రేవంత్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవిగా ఉన్నాయి.రేవంత్ అంటే తనకు ఇష్టం అని, గౌరవం అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమి ఉంది? మర్యాద ఇవ్వడం తప్పుకాదు. కోడి చెరువు ప్రస్తావన సమయంలోనే ఈ మాటలు అనేసరికి, ఇదేదో మాచ్ ఫిక్సింగేమో అన్న సందేహానికి ఆస్కారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా టీడీపీతో పరోక్ష స్నేహం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. మామూలుగా అయితే చెరువుల కబ్జా ఆరోపణలు రాగానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పలుమార్లు వాయువేగంతో స్పందించి, కొన్నిచోట్ల భవనాలను కూల్చివేసింది. పేద, మద్య తరగతి ప్రజలు పలువురు దీనితో రోడ్డున పడే పరిస్తితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ కు చెందిన భూమి విషయంపై వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, ప్రభుత్వం అందులోని నిజానిజాలను ఎందుకు తేల్చలేదో తెలియదు. ఈ విషయంలో తప్పు జరగలేదని ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైతే పవన్ కళ్యాణ్ కే మంచిది కదా!గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన పోటీచేస్తున్నట్లే పవన్ చెప్పకనే చెప్పారు. తప్పు లేదు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. అది ప్రజాస్వామ్య హక్కు. అయితే టీడీపీ, బీజేపీతో కలిసి పోటీచేస్తారా? లేదా? అన్నది చెప్పలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికేనని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. కాగా ఇదంతా బీజేపీ గేమ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తో రహస్య రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నది అందరికి తెలిసిందే. గత శాసనసభ ఎన్నికలలో కాని, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కాని, ఎన్.టి.ఆర్.విగ్రహావిష్కరణ సభలో కాని ఇవన్ని ఓపెన్ గానే కనిపించాయి.చంద్రబాబును కాదని పవన్ కళ్యాణ్ తెలంగాణలో సొంత రాజకీయం చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. బహుశా ఆయనకు చెప్పే పవన్ ఇక్కడ ఈ మీడియా మీట్ పెట్టి ఉండవచ్చన్న అభిప్రాయం పలువురిలో ఉంది. ఒకవేళ చంద్రబాబు హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ప్రకటించాల్సి వస్తే, అప్పుడు రేవంత్ రెడ్డి ఇరుకున పడతారు. తెలంగాణలో టీడీపీ బలపడేందుకు పని చేస్తామని వర్కింగ్ అధ్యక్షుడు లోకేష్ చెప్పడం కూడా గమనించదగిందే. వీరు కాంగ్రెస్ కు మేలు చేయడానికి వ్యూహ రచన చేస్తున్నారా? లేక ప్రధాని మోడీ ఆశించినట్లు బీజేపీకి ఉపయోగపడాలని అనుకుంటున్నారా? అన్నది తేలవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా జరిగినా బీఆర్ఎస్ ను దెబ్బగొట్టే వ్యూహమే ఉండవచ్చన్నది పలువురి భావనగా ఉంది.ప్రస్తుత పరిస్థితిలో హైదరాబాద్ లోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల వ్యక్తిగత ప్రయోజనాలు అధికంగా ఇమిడి ఉన్నందున కాంగ్రెస్ కు నష్టం చేసే పని చేయకపోవచ్చు. ఫ్రొఫెసర్ నాగేశ్వర్ అంశాన్ని కూడా పరోక్షంగా పవన్ మాట్లాడారు కాని, అదేమి అర్దవంతంగా లేదని చెప్పాలి. తానేమో అనేక అంశాలను ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడతారు. నాగేశ్వర్ రాజకీయ వ్యాఖ్యలపై జనసేన వారితో కేసులు పెట్టించడం పవన్ పై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత పెంచింది. ఈ నేపథ్యంలో దానిపై వివరణ ఇవ్వడానికి యత్నించినట్లు ఉంది. తానెప్పుడూ కేసీఆర్ ను ఏమీ అనలేదని ఆయన చెప్పడంపై కూడా విమర్శలు వచ్చాయి. గతంలో కేసీఆర్ ను ఉద్దేశించి తాట తీస్తానని పవన్ అనడం, అందుకు ప్రతిగా కేసీఆర్ మరింత ఘాటుగా వ్యాఖ్యానించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అని పవన్ అన్నారు. ఆయనది ప్రాంతీయ పార్టీనా? కాదా? అన్నది చెప్పాలి. అసలు ప్రాంతీయ వాదంతోనే పుట్టిన తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తు ఎలా పెట్టుకున్నారు? తెలంగాణ రాష్ట్ర సాధనకు టీఆర్ఎస్ ఏర్పడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారింది. దీనిని ఎలా చూస్తారు? బీజేపీ, కాంగ్రెస్ లు ప్రాంతీయ పార్టీలతో దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకుంటున్నాయే. ప్రాంతీయ, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్దహస్తులే అన్న విమర్శలు ఉన్నాయి.తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు 11 రోజులు నిరశన దీక్ష చేశానని ఆయనే ఒకసారి అంటారు. మరోసారి తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చెబుతారు. తెలంగాణవారి దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు దగ్ధం అయ్యాయని కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య ఇప్పటికీ తెలంగాణవాదుల గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంటుంది. గద్దర్ కు వెన్నులో బులెట్ దిగినప్పుడు ఆయన అడిగితే కారు కొని ఇచ్చానని చెబుతారు.. కాని గద్దర్ పై టీడీపీ ప్రభుత్వ టైమ్ లోనే కాల్పులు జరిగిన సంగతిని విస్మరిస్తారు. కొండగట్టుకు 30 కోట్ల డబ్బు ఇచ్చానని అంటారు. అది టీడీపీ డబ్బు కదా! అందులో తెలంగాణ భక్తుల సొమ్ముకూడా ఉంటుంది కదా అని తెలంగాణ వాదుల వ్యాఖ్య. వంగవీటి రంగాను కాపాడుకోలేకపోయారని కాపునేతలను విమర్శిస్తారు. రంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే హత్యకు గురయ్యారు. టీడీపీ నేతలే ఈ హత్య చేశారని అంతా చెబుతారు. అయినా అదే టీడీపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారు.ఇలా పరస్పర విరుద్ధమైన రీతిలో ఏపీలో అనేక మార్లు వ్యవహరించినట్లుగానే తెలంగాణలో కూడా గందరగోళంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది. తద్వారా ఇక్కడ రాజకీయాన్ని కలగాపులగం చేయడం లక్ష్యంగా పవన్ పని చేయడం ఆరంభించారా? అన్న సందేహం వస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రండి దొర.. వస్తానంటే వద్దంటామా..? పవన్ పై ప్రకాశ్ రాజ్ సెటైర్లు
-
పవన్ గాలి తుస్..! డిప్యూటీ సీఎంపై మల్లాది విమర్శలు
-
పాపం పవన్ ను ఉతికి ఆరేసారు
-
అమరావతి ఉండగా.. ఎక్కడో ఉండడం ఎందుకు?
సాక్షి, నల్లగొండ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్ తెలుగు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై పార్టీలకతీతంగా తెలంగాణ నేతలు వరుసగా స్పందిస్తూ పవన్‌ను విమర్శిస్తున్నారు. తాజాగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పవన్‌తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.గురువారం నల్లగొండ జిల్లాలో మీడియా చిట్ చాట్ సందర్భంగా గుత్తా సుఖేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ సభ పెట్టుకోవాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆ రోజు రాజకీయ సభ ఎందుకు?” అంటూ పవన్‌ను ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ తన భాషలో మార్పు చేసుకోవాలని సూచిస్తూ.. రాజకీయ నేతగా మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. అంతటితో ఆగకుండా ఆయన వ్యాఖ్యలు నేరుగా కూటమి ప్రభుత్వ పెద్దలపైకి మళ్లాయి. అమరావతిని “బ్రహ్మాండం”గా, “ఈ భూగోళంలోనే అలాంటి రాజధాని లేదు” అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని.. దానికి పవన్ కల్యాణ్ వంతపాడుతున్నారని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు “షటిల్ సర్వీసులు బంద్ చేసుకోవాలి” అంటూ బాబు, పవన్‌లకు సూచించారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రులంతా అమరావతిలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు. “అమరావతి రాజధాని అని చెబుతున్నప్పుడు నాయకులు అక్కడే ఉండాలి. ఎక్కడో ఉంటాం అంటే ఎలా? అలా కుదరదు కదా” అని గుత్తా చురకలు అంటించారు. -
ఖర్మ రిటర్న్స్ పవన్ కళ్యాణ్.. ఇంకొక్కటే పెండింగ్
-
వెన్నుపోటుకు రెండేళ్లు.. రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు
వైఎస్సార్సీపీ నిరసనలు అప్డేట్స్.. నేటి నుంచి వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టింది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసనలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే హామీల అమలుకు నిరసనలు చేపట్టనుంది. మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లు దగ్ధం చేశారు. అలాగే, ఈ నెల 8 లేదా 9 తేదీల్లో టౌన్ హాల్ సదస్సులు జరగనున్నాయి. ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు కొనసాగుతాయి. కృష్ణాజిల్లా, మచిలీపట్నం:మచిలీపట్నం నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమంకూటమి ప్రభుత్వ హామీల పత్రాలను తగలపెట్టి నిరసన తెలిపిన పార్టీ శ్రేణులుబూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు రాష్ట్ర ప్రజలను వంచన చేశారుఅప్పుల కుప్పగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చి సంక్షేమాన్ని పక్కన పెట్టారుఅబద్ధాలు, మోసం రెండు పిల్లర్లుగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సాగిస్తుందిహామీలను అమలుపరచకపోగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ నిసిగ్గుగా ప్రజలకు ప్రచారం చేస్తూ మోసగిస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమికి బుద్ధి వచ్చేలా ప్రజలు తమ ఓటు ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తెలియపరుస్తారు: పేర్ని కిట్టు వాల్పేపర్లు దగ్ధంవిశాఖలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో హోరెత్తిన నిరసనలు చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ఆందోళనలువిశాఖ వెంకోజిపాలెం జంక్షన్, డైమండ్ పార్క్ జంక్షన్, కంచరపాలెంలో వాల్పేపర్లు దగ్ధంనంద్యాల జిల్లా..బేతంచర్ల నగరపంచాయతీలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం చేపట్టిన మాజీ మంత్రి బుగ్గనబుగ్గన కామెంట్స్..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేకపోయాడు.అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు.కరోనా సమయంలో కూటమి నాయకులు బయటకు రాకుండా బాదుడే బాదుడు అని ఇప్పుడు తీపి లడ్డూలు ఇస్తున్నారా?ఇంటింటికి తిరిగి అక్క, వదిన, బావ అని వరసలు కలిపి సూపర్ సిక్స్ పథకాలు అని నట్టేట ముంచారు.రెండేళ్లు గడిచినప్పటికీ కొత్త పెన్షన్లు ఇవ్వలేదు.కూటమి నాయకులు కరెంట్ లేని సమయంలో బయటకు వెళితే ప్రజలు దుప్పటి కప్పి కొట్టే పరిస్థితి ఉంది.వైఎస్ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయారు.ప్రజలు అబద్ధాలు నమ్మి మోసపోయారు. విజయవాడ..మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్..చంద్రబాబు అంటేనే మోసం.. మోసం అంటేనే చంద్రబాబుకూటమి ప్రభుత్వం మహిళలను ఘోరంగా వంచించింది ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక అబద్ధపు హామీలను ఇచ్చారుజగన్ కంటే ఎక్కువ పథకాలు అందిస్తామని నమ్మించారుఅధికారంలోకి వచ్చాక ప్రజలకు వెన్నుపోటు పొడిచారుకూటమి ప్రభుత్వం మహిళలకు పూర్తిగా మోసం చేసిందిఆంధ్రాలోనే ఏం పీకలేను అన్న పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం మనకు అవసరమా?మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి కామెంట్స్..కూటమి ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసిందిఆడబిడ్డ నిధి పథకం ఊసే లేదుమూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని అరకొరగా మార్చేశారుమహిళలకు ఉచిత బస్సు అని చెప్పి వంచించారునిరుద్యోగ భృతి కల్పిస్తామని యువతను మోసం చేశారు50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెన్షన్లు ఇస్తామన్న హామీని గాలికొదిలేశారుఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలిచిత్తూరు జిల్లా..నగరి క్లాక్ టవర్ సర్కిల్లో టీడీపీ పోసర్ట్, మేనిఫెస్టోను తగలబెట్టి నిరసన చేపట్టిన మాజీ మంత్రి రోజానగరిలో పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్న పార్టీ నాయకులు. కార్యకర్తలుమాజీ మంత్రి రోజా కామెంట్స్చంద్రబాబు వెన్నుపోటు పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడిచారుసంక్షేమ పాలన అందిస్తామని చెప్పి సంక్షోభ పాలన చేస్తున్నారురాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశాడు సీఎం చంద్రబాబుచేసిన అప్పులు మూడున్నర లక్షల కోట్లు ఏమయ్యాయి?.సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారుసూపర్ సిక్స్‌లో ఏ ఒక్క హామీ అమలు చేయలేదు30 లక్షలు మంది తల్లులకు అమ్మఒడి దూరం చేశారుసంక్షేమ పథకాలు లేవు, ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారుప్రజలు అందరూ కలిసి చంద్రబాబుకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారుఎన్టీఆర్ జిల్లా..ఇబ్రహీంపట్నంలో చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్లు కార్యక్రమంఇబ్రహీంపట్నంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన జోగి రమేష్జోగి రమేష్ కామెంట్స్..చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు రెండేళ్లు కాదు 30 ఏళ్లు.1996లో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడవడంతో మొదలైన ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది.ఇచ్చిన హామీలను మరచి అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడుకూటమి పాలనలో ఏ ఒక్క పంటకు దక్కని గిట్టుబాటు ధరలుసూపర్ సిక్స్ పథకాలు అమలు అంటూ ఎన్నికల హామీలలో చెప్పిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారుచంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను రాష్ట్ర ప్రజలు గమనించాలివైఎస్ జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.గుంటూరు..మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్....కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదుఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇవ్వడంఅధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ఉండటం చంద్రబాబుకు అలవాటేఅందుకే ఇవాళ వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం చేపట్టాం.మేము గుజ్జనగుంటలో కార్యక్రమం నిర్వహించాలని ముందే నిర్ణయించుకున్నాం.టీడీపీ నాయకులు అక్కడ మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలు రెచ్చగొట్టేలా బ్యానర్లు ఏర్పాటు చేశారువైఎస్ జగన్ దిష్టిబొమ్మను పోలీసులు దగ్గర ఉండి దగ్ధం చేయించారుటీడీపీ నాయకులు దగ్ధం చేయాల్సింది జగన్ దిష్టి బొమ్మను కాదు చంద్రబాబు దిష్టి బొమ్మని.ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు చంద్రబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేయాలిమా ఇంటి పైన దాడి చేసిన వారంతా ఇవాళ నిరసన పేరుతో గుజ్జునుకుంట దగ్గర హడావిడి చేశారుప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచివి కాదువిజయవాడ..ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్..చంద్రబాబు ప్రజలకు పొడిచిన వెన్నుపోటుకు నిరసన తెలుపుతున్నాం..నిరసనలో భాగంగా టీడీపీ మేనిఫెస్టో, బాండ్లు తగలబెడుతున్నాం.మహిళా లోకం మా కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారుజగన్ హయంలో ఆసరా, చేయూత, ఇంటి స్థలం వంటివి అందించారుకూటమి 50ఏళ్లకు పెన్షన్, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి అన్నారు..చదువుకున్న పిల్లలకు కనీసం సౌకర్యాలు కల్పించడం లేదు.ఏ ఒక్క పథకం అమలు చేయలేదుమ్యానిఫెస్టోని ఏవిధంగా తగలబెట్టారో అదే విధంగా చంద్రబాబును మంటల్లో వేస్తారు .జగన్ రిటైనింగ్ వాల్ నిర్మించారు.. ఇళ్ల పట్టాలు ఇచ్చారు..చంద్రబాబు పాలనలో సంతోషంగా ఉన్నది చంద్రబాబు, పవన్, లోకేష్ మాత్రమే.ప్రజానీకం డబ్బులతో మంత్రులు సింగపూర్‌లో జల్సాలు చేస్తున్నారుజగన్ను చూసి కూటమి నేతలు పరిపాలన నేర్చుకోవాలి.చంద్రబాబు కరెంట్, పెట్రోల్, కూరగాయలు వంటి రేట్లు పెంచారు8వ తేదీన టౌన్ హాల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం..12వ తేదీన జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహిస్తాం..చంద్రబాబుకు బుద్ది వచ్చే విధంగా పోరాటం చేస్తాం. నంద్యాల..నంద్యాలలో శిల్పా చక్రపాణి రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.శిల్పా చక్రపాణి రెడ్డి కామెంట్స్..వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం చెయ్యడానికి వెళ్తుంటే అడ్డుకోవడం సరైనది కాదు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి సవాల్ విసిరిన శిల్ప చక్రపాణి రెడ్డిప్రజల అధికారం ఇస్తే రెండేళ్లలో ఏం చేశావు ప్రజలకు చెప్పుఅధికారం ఇస్తే నియోజకవర్గంలో నువ్వు చేయని అరాచకాలు లేవుకూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ కావడంతో ప్రజలు తిరస్కరించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందిశ్రీశైలం నియోజకవర్గంలో నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరురాష్ట్రంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వని దుర్మార్గమైన పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఏర్పడిందిసూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు మేలు జరగలేదుప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే దాడులు దౌర్జన్యాలు దుర్భాష లాడటం పరిపాటిగా మారిందిఇలాంటివి చేసి భయపెట్టాలని చూస్తే భయపడే పరిస్థితుల్లో లేము.అవసరమైతే ఎదురు దాడి చేయడానికి కూడా వెనకాడం.టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి హెచ్చరిక. అనంతపురం..వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లుహామీల అమలులో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలంనిరసనగా అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళనవైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసనచంద్రబాబు హామీలపై ప్లకార్డుల ప్రదర్శననల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలువైఎస్సార్ జిల్లా..పులివెందులలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో నిరసనటీడీపీ సూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులుకార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ మధు రెడ్డి, ఇతర నాయకులుప్రొద్దుటూరులో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో నిరసనమాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, పార్టీ నేతల నిరసనలు. విజయవాడ..విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారి తోటలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంసూపర్ సిక్స్ హామీలు, మేనిఫెస్టోను అమలు చేయని కూటమి ప్రభుత్వంఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ర్యాలీకార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు. నంద్యాల జిల్లా..ఆత్మకూరు పట్టణంలో కొనసాగుతున్న ఉద్రిక్తత.వైఎస్సార్సీపీ ఆఫీసుతో పాటు పట్టణంలో భారీగా మోహరించిన పోలీసులు.చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు అలర్ట్.నంద్యాల నుంచి ఆత్మకూరు వస్తున్న శిల్పా చక్రపాణి రెడ్డిని నంద్యాలలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.శాంతి భద్రతల దృష్ట్యా ఆత్మకూరులో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని పార్టీ నాయకులకు నోటీసులుసవాళ్లు ప్రతి సవాళ్ల నేపధ్యంలో ఆత్మకూరు పట్టణంలో ఉద్రిక్తతఅవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు. -
జై ఆంధ్రా అంటే ఇక్కడ కనెక్ట్ అవ్వరు
సాక్షి, అమరావతి : ‘తెలంగాణ వాళ్లకు తెలంగాణ భావన ఉంది. తమిళనాడు వాళ్లకు తమిళ భావన ఉంటుంది. కానీ, ఆంధ్రా వాళ్లకు ఏ భావం ఉందో ఎవరికీ తెలియదు’ అని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జై ఆంధ్రా అంటే ఇక్కడి వాళ్లు కనెక్ట్ అవ్వరని చెప్పారు. బుధవారం ఆయన తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి రాజధాని ప్రాంతం శాఖమూరులోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తానెప్పుడూ తెలంగాణ–ఏపీ విభజనను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తాను అంత గట్టిగా మాట్లాడడం వెనుక ఎలాంటి ముందస్తు ప్లాన్ లేదని చెప్పారు. తాము సభ పెట్టుకుంటామంటే అడ్డుకోకూడదు కదా.. అని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అదంతా ఎవరో ఒకరు కూర్చొని చేసింది కాదు కానీ, చిలికి చిలికి గాలివానగా మారిందన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం పనిగట్టుకొని చేసిందని, రేవంత్‌రెడ్డి చేశారని నేను అనుకోను. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయతను రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలి. కేటీఆర్‌తో నాకు మంచి సంబంధాలున్నాయి’ అని చెప్పారు.రాష్ట్రంలో ఎన్నెన్నో కులాల సంఘాలు ఏర్పాటు అవుతున్నాయని, అయితే వాటి వల్ల ఆ సంఘ నాయకులు బాగుపడుతున్నారేమో తెలియదు గానీ, ఆ కుల ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ‘గత ముఖ్యమంత్రి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అంటూ రాజధాని ప్రాంతాన్ని ఇంకా పెంచారు. మూడు జిల్లాలు కలిపి రాజధాని అంటున్నారు. అంతా చేయాలంటే ఎప్పటికి సాగుద్ది.. రాజధాని రాత్రికి రాత్రే పూర్తవదు. హైదరాబాద్‌లో ఇంకా జరుగుతున్నాయి. రాజధాని విషయంలో రాష్ట్రంలో ఏకాభిప్రాయం లేదు. అయినా అందరూ కూర్చొని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దానిని ముందుకు తీసుకెళ్లాలి’ అని చెప్పుకొచ్చారు. -
వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ‘సర్’ ప్రభావంతోనే వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రంలో సీఎంలుగా ఉన్న మమత బెనర్జీ, స్టాలిన్లు ఓడిపోయారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర జరుగుతోందని.. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమన్న రోజా.. సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.‘‘రాష్ట్రంలో జగనన్న పాలన దూరం చేసుకున్నందుకు ప్రజలు బాధపడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో అందడం లేదు. రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. 30 లక్షలు తల్లులకు అమ్మఒడి దూరం చేశారు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ రంగాకు టీ ఇచ్చాను.. గద్దర్‌కు కారు కొనిచ్చా అని చెప్పుకుంటున్నాడు...మంత్రి నారా లోకేష్ లీకేజీ స్టార్ అయ్యారు. వైఎస్సార్సీపీ నేతలను జైల్లో పెట్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లి కన్నీళ్లు తుడవటానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు కనీసం పట్టించుకోలేదు’’ అని ఆర్కే రోజా ధ్వజమెత్తారు. -
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కూతురు సంచలన కామెంట్స్
-
నువ్వేంటో, నీ స్థాయేంటో తెలుసుకో..! పవన్ పై అడ్వకేట్స్ కేసు
-
సుగాలి ప్రీతీ చావును వాడుకొని, రోజా స్టాంగ్ రియాక్షన్
-
ఉరికించి ఉరికించి తంతం..! నువ్వు తెలంగాణ వచ్చి ఏం పీకుతావ్...
-
పవన్ వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె వెన్నెల స్పందించారు. పవన్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే. తెలంగాణ గడ్డ ఈరోజు మా జాగీరు. రేపు మా బిడ్డల జాగీరు. తెలంగాణ గడ్డ ముమ్మాటికీ మా జాగీరే. పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవ పోరాటం’’ అని వెన్నెల పేర్కొన్నారు.‘‘ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నాం కానీ ఎవర్ని ఒక్క మాట కూడా అనలేదు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ అన్నందుకు చాలా మందిని ఎన్కౌంటర్ చేశారు. ఉద్యమంలో చాలా మంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారు’’ అని వెన్నెల అన్నారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై.. గద్దర్ కూతురు వెన్నెల .. pic.twitter.com/oSdScmlfm5— Prabhakar Venavanka (@Prabhavenavanka) June 3, 2026ఆ రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది?: కేటీఆర్కాగా, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణ కచ్చితంగా భూమిపుత్రుల జాగీరే. పవన్ కల్యాణ్‌ను ఎవరు అడ్డుకున్నారు?. జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది?. 2023లో జనసేన పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ ఆవిర్భావం రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది?. జాతీయ వాదంపై ప్రధాన మంత్రి మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవు: పొన్నంకాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిన్న(మంగళవారం) పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కల్యాణ్‌కు లేదని, వెంటనే గద్దర్ ఆత్మకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.12 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, రెండు రాష్ట్రాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను పాకిస్తాన్లా చిత్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. -
జగన్.. జగన్.. అని గొంతు చించుకున్నాడు... తెలంగాణలో మీటింగ్ పెడతాడట
-
‘అందుకే తెలంగాణలో పవన్ కొత్త డ్రామా’
సాక్షి, కృష్ణా జిల్లా: మోదీ, చంద్రబాబు, పవన్ తలకిందులుగా తపస్సు చేసినా నిఖార్సైన వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించలేరని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. జూన్ 15 నుంచి బీఎల్వోలు వారి వెంట పెట్టుకుని బీఎల్ఏలను తీసుకువెళ్లాలి’’ అని సూచించారు.‘‘వైఎస్ జగన్ తనను నమ్ముకున్నోడిని మోసం చేయడు. నమ్మినోడిని దెబ్బకొట్టడు. రాబోయే స్థానిక ఎన్నికలే చాలా కీలకం. చంద్రబాబు రోజూ జగన్‌ను గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ నిజంగా గొడ్డలిపట్టుపకుని తిరిగి ఉంటే.. ఎర్రబుక్కు పట్టుకుని తిరిగే చంద్రబాబు, లోకేష్ ఇప్పటి వరకూ ఏం చేశారు?. ప్రజలను ఏమార్చడానికే చంద్రబాబు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.‘‘ఆంధ్రాలో మీటింగ్ పెట్టలేడు.. కానీ పవన్ తెలంగాణలో మీటింగ్ పెడతాడట. సూపర్ సిక్స్‌పై తెలంగాణలో ప్రశ్నిస్తాడట. తల్లికి కూడు పెట్టలేనోడు పినతల్లికి పట్టు చీరపెడతాడట. ఇక్కడ నీ తమ్ముడు లోకేష్ ఉద్యోగాల పేరుతో దోచేస్తున్నాడు. ఆయన్ని ప్రశ్నించలేవు కానీ తెలంగాణలో ప్రశ్నిస్తాడట’’ అంటూ పవన్ కల్యాణ్‌కు పేర్నినాని కౌంటర్ ఇచ్చారు.‘‘నెమ్మదిగా పవన్ పక్కన ఉన్న కాపులంతా జారిపోతున్నారు. మరో 15 ఏళ్లు పల్లకి మోయాల్సిందేనని అంటున్నాడు. ఇక్కడ అందరూ జారిపోతున్నారని తెలంగాణలో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. మొన్న ఎన్నికల్లో కమ్మ, కాపులు చించుకుని మరీ పనిచేశారు. ఇప్పుడు కమ్మ, కాపులకు మత్తు దిగిపోతుంది. పాలనను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఇది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో? దోచుకుంటున్నారో ఎవరికీ పట్టదు...తిరుపతి లెటర్ కూడా 30 వేలకు ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకే దివాలా తీసింది. ఏ కులాన్ని శత్రువుగా చూడకండి. మన పై దాడి చేసినోడు.. మనల్ని హింసించినోడిని గుర్తు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ చెప్పేవన్నీ సొల్లు కబుర్లే. వైఎస్సార్‌ని ఎదిరించా తుపాకీ సరెండర్ చేశానని చెబుతున్నాడు. నీ వల్ల ప్రమాదం ఉందని మీ అమ్మాయి పోలీసులకు చెబితేనే తుపాకీ సరెండర్ చేశావు. ఆ విషయం నీకు గుర్తులేదా?మతిమరపు ఏమైనా ఉందా పవన్?...ఏపీలో పర్మిషన్ ఇవ్వకపోతే జగన్ నువ్వెవరివి అని ఊగిపోయావ్. మరి తెలంగాణలో రేవంత్‌రెడ్డిని ఎందుకు నిలదీయలేకపోయావ్. ఇక్కడ ఆస్తులు లేవు కాబట్టి జగన్‌పై గొంతుచించుకున్నావ్. మన ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయ్ కాబట్టి రేవంత్ రెడ్డి పై నోరు పెగలడం లేదు. ఇప్పటికైనా వాటాలు తీసుకోవడం ఆపేసి నిజాయితీగా ప్రశ్నించడం మొదలు పెట్టు పవన్. అమరావతిలో అద్దాలు పెట్టడానికి 2500 కోట్లు ఏంటి?. అమరావతిలో రైతులు ఏడుస్తున్నారు. వేల టిప్పర్ల మట్టి అమ్ముకుతింటున్నారు. అమరావతి అవినీతి పై ప్రశ్నించవా పవన్...నువ్వు చేతకానోడివి కాబట్టే నీపైన పెమ్మసానిని తెచ్చి పెట్టారు. నీకు, చంద్రబాబుకి రాజధానిలో మంచి ప్లేస్‌లో ప్లాట్లు కావాలా?. రైతులకేమో చెరువుల్లో ప్లాట్లు ఇస్తారా?. వంశీ కుటుంబాన్ని నీచులతో చంద్రబాబు యూట్యూబుల్లో తిట్టిస్తున్నాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదని వంశీ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. అయినా వదిలిపెట్టకుండా వంశీని వేధిస్తున్నారు. ఎమ్మెల్యేలు మైన్.. వైన్‌లో మునిగిపోయారు’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పవన్ కల్యాణ్‌కు కర్మ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి ?
-
తెలంగాణకు వచ్చి పరువు తీసుకున్న పవన్
-
ఛీ మరి ఇంత చీప్ ఆహ్ నేను ఎక్కడా చూడలేదు.. అనిరుద్ స్ట్రాంగ్ కౌంటర్
-
పవన్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
-
రెచ్చగొట్టే ప్రసంగం.. జన గణ మనను పాడొద్దు అన్నది పవన్ కల్యాణే!
-
పవన్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణ కచ్చితంగా భూమిపుత్రుల జాగీరే. పవన్ కల్యాణ్‌ను ఎవరు అడ్డుకున్నారు?. జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది?. 2023లో జనసేన పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ ఆవిర్భావం రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది?. జాతీయ వాదంపై ప్రధాన మంత్రి మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తాజాగా కేటీఆర్ స్పందిస్తూ..‘దేశంలో ఎవరైనా పార్టీ పెట్టి పోటీ చేసుకోవచ్చు. ఎక్కడ పోటీ చేస్తారో ఆ ప్రాంత పరిస్థితులు తెలుసుకోవాలి. తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ ను ఎవరు అడ్డుకున్నారు. తెలంగాణ ప్రజలు మాత్రమే పవన్‌ను అడ్డుకున్నారు. ఓటమిని చూపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ మీటింగ్ పెట్టి విభజన సరిగా జరగలేదని అంటున్నారు. మీ కుటుంబాలు, మీ వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయి. తెలంగాణలోనే ఉన్నాయి కదా.తెలంగాణ నాలుగు కోట్ల భూమి పుత్రులది. తెలంగాణ వస్తే 11 రోజులు ఉపవాసం ఉన్న పవన్ ఇప్పుడు తెలంగాణ గురించి ప్రేమగా మాట్లాడుతున్నారు. మోదీ జాతీయ వాదం ముసుగులో ఆర్ధిక ప్రాంతీయ వాదం చేయడం లేదా?. ప్రధాన మంత్రి మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా?. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు కదం తొక్కిన నేల తెలంగాణ. ప్రాంతీయవాదం అంటున్న పవన్.. మరి మద్రాసు నుంచి వేరుపడటం కోసం పొట్టి శ్రీరాములు చేసింది ఏంటి?. దేశభక్తి గురించి పవన్ మాకు చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ సోదరుడిగా వస్తే ఇంటికి పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెడతా. కానీ సెక్రటేరియట్లో కూర్చుని పెత్తనం చేస్తామంటే ఒప్పుకోము. పవన్ సినిమా పేరు ఓజీ.. కానీ తెలంగాణ ఓజీ కేసీఆర్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం అవుతుంటే మేము దానికి వ్యతిరేకంగా మాట్లాడాము అని గుర్తు చేశారు. -
ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడితే చూస్తూ ఊరుకోవాలా..!
-
'బాబు'ది నో ఆన్సర్.. ఓన్లీ డైవర్షన్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. తన రాజకీయ ప్రత్యర్ధులపై తోచిన ఆరోపణ చేయడం, వీలైనంత బురద చల్లడం, తనపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేయడం ఒక విధానంగా మార్చుకున్నారు. అబద్ధాలకు ఆకాశమే హద్దుగా పెట్టుకున్నారు. అదే బాటలో ఆయన కుమారుడు, కీలక మంత్రి లోకేష్ నడుస్తున్నారు. వీరి బాటే బాగుందనుకుని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు దానినే అనుసరిస్తున్నారు. అందువల్లే ఏపీలో ప్రభుత్వం అంతా అస్తవ్యస్తంగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది.కొద్ది రోజుల క్రితం కాగ్ నివేదిక ఆధారంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్దిష్ట విమర్శలు చేశారు. పలు ప్రశ్నలు సంధించారు. ఏపీ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతోందని, దానికి చంద్రబాబు ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, అవినీతి కారణమని ఆయన ఆరోపించారు. ఏపీలో ఇప్పుడు జరుగుతున్నది ఆర్ధిక విధ్వంసమని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పులు పెరిగిపోయి, ఆదాయం తగ్గిపోయిన నేపథ్యాన్ని జగన్ ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు లేదా, ఆర్దిక మంత్రి కేశవ్ లేదా కీలక మంత్రి లోకేష్ వంటివారు ఏ మాత్రం స్పందించలేకపోయారు.రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్లకు పైగా అప్పు చేసి దేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఒక రికార్డు సృష్టించిందన్న అంశంపై వీరెవ్వరూ ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు. నిత్యం జగన్ గత ప్రభుత్వంపై ఏవేవో ఆరోపణలు చేస్తుంటారు. అసలు విషయాలు మాట్లాడకుండా అసత్యాలు వల్లెవేస్తుంటారు. దానికి బదులు ఇస్తే మొత్తం సమస్యను అటువైపు మళ్లించడం ద్వారా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. చిత్రమేమిటంటే ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ ద్వారా తొమ్మిదివేల కోట్ల రూపాయల అప్పు చేసి, దానిని రికార్డులలో ఆదాయంగా చూపించారట. ఇది వినడానికే గమ్మత్తుగా ఉంది కదా! మనం ఎవరమైనా బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే అది ఆదాయంగా భావించి ఖర్చు చేస్తామా? అవసరాలకు వాడుకుని, తద్వారా ఏదైనా సంపాదిస్తే, ఆ తర్వాత ఆ రుణ వాయిదా చెల్లించాక మిగిలితే దానిని ఆదాయంగా చూపిస్తాం. కాని ఇంత పెద్ద ప్రభుత్వం అప్పులనే ఆదాయం చూపడం ప్రజలను మోసం చేయడం అవుతుందా? అవ్వదా ? అన్న ప్రశ్న వస్తుంది.మరో వైపు సొంత పన్నుల రాబడిలో 3.22 శాతం క్షీణించిందని లెక్కలు చెబుతున్నాయి. అయినా 10.75 శాతం వృద్ధిరేటు చూపడాన్ని జగన్ తప్పుపట్టారు. లిక్కర్ షాపులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. వేలాది బెల్ట్ షాపులకు కొరత లేదు. అయినా మద్యం ద్వారా వచ్చే ఆదాయం 8.2శాతం తగ్గిందట. అంటే మద్యంలో భారీ స్కామ్ జరుగుతున్నట్లే కదా అని ఆయన అభిప్రాయపడ్డారు. రెండేళ్లలో మూల ధన వ్యయం కేవలం 7.31 శాతంగానే ఉండడం ఆందోళన కలిగించే అంశమే. ద్రవ్యలోటు రెండేళ్లలో 32 శాతంపైకి చేరుకుందని కాగ్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. సాధారణంగా అయితే ఆర్ధిక మంత్రి, లేదా ఆ శాఖ అధికారులు దీనిపై వివరణ ఇస్తారు. కాని వారు కూడా ఎవరూ మాట్లాడడం లేదు.ఈ పరిస్థితి ఇలా ఉంటే జగన్ ప్రభుత్వంలో విధ్వంసం అంటూ పడికట్టు పదాలతో డైలాగులు ప్రచారం చేస్తుంటారు. జగన్ 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తీసుకువస్తే వాటిని ప్రైవేటువారికి అప్పగించాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ నాలుగు ఓడరేవులను నిర్మించే పని చేపడితే వాటిని కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేయవలసిందేనని ఆ సంస్థ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బహుశా చంద్రబాబు సూచన మేరకే కొనకళ్ల ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. తద్వారా జనంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తే ఆయన ఖాతాలో వేయాలన్నది ప్రభుత్వ వ్యూహం కావచ్చు.పైగా మహిళలకు ఉచిత బస్ స్కీమ్ వల్ల ఆర్టీసీ నష్టపోతోందని, అందువల్ల ప్రైవేటీకరణ చేయాల్సి వస్తోందని అంటున్నారంటే ఏమనుకోవాలి. ఆ వాగ్దానం చేయాలని ఎవరైనా కోరారా? అట్టహాసంగా ఆ స్కీమ్ ను ఆరంభించినప్పుడు వారికి దీనివల్ల ఆర్టీసీకి నష్టం వస్తుందని తెలియదా? దానిని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి కదా! అలాకాకుండా ఆర్టీసీని గాలికి వదలివేస్తారా? ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు కొనాలంటే అన్నివేల కోట్ల డబ్బు ఎక్కడ ఉందని ఆర్టీసీ చైర్మన్ అమాయకంగా జనాన్ని ప్రశ్నిస్తున్నారు.ఈ మధ్యనే సంస్కరణ యోధుడు అన్న అవార్డును అందుకున్న చంద్రబాబునాయుడు వీటికి జవాబు ఇవ్వవలసిన పని లేదా?2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి ఆర్టీసీ 6300 కోట్ల అప్పుల్లో ఉంటే, ఉద్యోగులకు 3200 కోట్ల బకాయి ఉంటే, దానిని జగన్ టైమ్ లో రెండువేల కోట్లకు తగ్గించామని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. తమకు సంపద సృష్టించడం తెలుసునని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు కాకుండా ప్రైవేటువారికి సంపద సమకూర్చే పనిలో ఉన్నారని వైసీపీ మండిపడుతోంది. కొత్తగా తీసుకునే ఈ బస్ లన్నిటిని ప్రైవేటువారికే అప్పగిస్తే, అప్పుడు ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉండదన్నది ప్రభుత్వ భావన కావచ్చు. కాని దానివల్ల మొత్తం ఆర్టీసీ మనుగడే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాక ఉచిత బస్ స్కీమ్ కు కూడా మంగళం పాడతారా? అన్న సందేహాన్ని తీర్చవలసి ఉంటుంది.ఒకవైపు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేసుకోవడానికి ఎవరికి పడితే వారికి రూపాయికి, అర్ధ రూపాయికి భారీగా భూములు కట్టబెడుతున్నారు. వాటి ద్వారా వచ్చే ఉద్యోగాలు అంతంత మాత్రంగానే కనిపిస్తాయి. అదే టైమ్ లో ప్రభుత్వం ఆ కంపెనీలకు ఎదురు వేల కోట్ల రాయితీలు ఇస్తున్న తీరు గమనిస్తే, వచ్చే ఒకటి, రెండు దశాబ్ధాలలో ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమీ ఉండకపోవచ్చని ఒక ఆర్థిక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.పెట్రోల్, డీజిల్ పై ఉన్న పన్నులను తగ్గిస్తామని ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. కేంద్రం చమురు ధరలు పెంచినా, గతంలో తామే అమరావతి పేరుతో నాలుగు రూపాయల సెస్ వేసినా, ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రబుత్వం ఒక రూపాయి సెస్ వేస్తే, మొత్తం అంతటిని జగన్ ప్రభుత్వానికి రుద్ది ప్రచారం చేసేవారు. ఇప్పుడేమో పొదుపు అంటూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. అదే టైమ్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం ప్రత్యేక విమానాలలో తిరగడం మానుకోరట. నిత్యం ఏదో చోటకు విమానాలలో, హెలికాఫ్టర్ లలో వెళ్లి సభలుపెట్టడం ఆపుతారా? లేదా? అన్నది తెలియదు. అమరావతి పేరుతో జరుగుతున్న దుబారాను అరికట్టడం లేదు. మరి వీటన్నిటిని ఏపీ అభివృద్ధిగా చూడాలా? లేక విధ్వంసంగా చూడాలా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తెలంగాణ రాజకీయాల్లో పవన్ వేలు పెట్టడం వెనుక పెద్ద కుట్ర
-
జగన్ దెబ్బకు 5ఏళ్ళు తెలంగాణలో దాక్కున్నావ్.. నువ్వా రాజకీయాలకోసం మాట్లాడేది
-
మా బాబాయ్ దగ్గర రివాల్వర్ ఉంది నన్ను చంపేస్తాడు అని అంటేనే..
-
అవును మా అయ్య జాగీరే.. పవన్ కు మంత్రి పొన్నం కౌంటర్
-
ఏపీలో దమ్ము లేదు కానీ తెలంగాణలో పోటీ.. TGలో చీప్ పాలిటిక్స్
-
నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు.. తెలంగాణలో సీఎం అవుతానా?
బంజారాహిల్స్: ‘నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు.. తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతానా?’అని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘ఇది భారతదేశం అనుకున్నారా? పాకిస్తాన్, పాలస్తీనా అనుకున్నారా?.. నన్ను బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణ. జనసేన ప్రయాణం తెలంగాణలోనే మొదలైంది. ఇక్కడ కూడా జనసేన ఉంటుంది’అని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన సైనికుల తరఫున తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విభజనకు తాను వ్యతిరేకం కాదని, విభజన తీరుకు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. తాను నిజంగా చెరువు కబ్జా చేసి ఉంటే తనను ఉండనిస్తారా? అని అన్నారు. తాను కబ్జా చేశానని నిరూపిస్తే ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పారు. గద్దర్‌కు బుల్లెట్లు దిగినప్పుడు తన దగ్గరికి వచ్చి అండగా నిలబడమన్నారని చెప్పారు. గద్దర్ చనిపోయేదాకా ఆయనకు ఏంకావాలో అడిగేవాడినన్నారు. ‘ఆపదలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి నేను డబ్బులు ఇవ్వలేదా? వరదలు వచ్చినప్పుడు రూ.కోటి ఇచ్చా. కొండగట్టు అంజన్నకు రూ.30 కోట్లు ఇచ్చా. నేను తప్పు చేస్తే నా ఆస్తులు సీజ్ చేయండి’అని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు తమ నాలుకలు కోస్తామని చెబుతున్నారు.. రండి నాలుకలు చూపిస్తామని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో తీర్మానం పెట్టండి... ‘నా పీక కోసినా నేను భయపడను. దమ్ముంటే తెలంగాణకు పవన్ కల్యాణ్ రాకూడదంటూ అసెంబ్లీలో తీర్మానం పెట్టండి. తెలంగాణలో జనసేన ఉంటుంది. ఎన్నికల బరిలో నిలుస్తుంది. నేనే స్వయంగా పర్యటించి ప్రచారం నిర్వహిస్తా. ఇది నా దేశం. నేను ఎక్కడైనా అడుగుపెడతా. పక్క రాష్ట్రాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు తీసుకుని పోవాలా?’అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తనపై విమర్శల వెనుక రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఉన్నారని తాను అనుకోవడం లేదన్నారు. పెచ్చుమీరుతున్న ప్రాంతీయవాదంపై కేంద్రం దృష్టిపెట్టాలని చెప్పారు. 2029 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని, బీజేపీ తమతో కలిసివస్తుందో లేదో తెలియదన్నారు. ‘తెలంగాణలో కొందరు అనలిస్టులు నా వ్యాఖ్యలు వక్రీకరించారు. అమిత్ షా గురించి నేను మాట్లాడితే... దానిలో ప్రాంతీయత ఎక్కడుంది? నా గురించి మాట్లాడితే నేను నోరు మెదపవద్దా’అని పవన్ కల్యాణ్ పరోక్షంగా ప్రొ. నాగేశ్వర్ వివాదం గురించి స్పందించారు. -
మిస్టర్ పవన్.. తెలంగాణ మా అయ్య జాగీరే : పొన్నం
సాక్షి,హైదరాబాద్: ‘తెలంగాణ మీ అయ్య జాగీరా?’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. మిస్టర్ పవన్ కళ్యాణ్.. ‘తెలంగాణ మా అయ్య జాగీరే’ అంటూ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల జాగీరే. ఆయన మాటల్లో అహంకారం కనిపించింది. పవన్ పెయిడ్ ఆర్టిస్ట్’ అంటూ ధ్వజమెత్తారు. ‘‘ఆంధ్రాలోనే గెలవలేదు. తెలంగాణకు వచ్చి చేసేదేముంది’’ అని ఆయనే వ్యాఖ్యానించారు. ఏపీలో తన పరిస్థితి ఏంటో తానే చెప్పుకున్నాడు. ఆంధ్రాలోనే తనకు దిక్కులేదు.. తెలంగాణ లో ఏముంటుంది అన్నారు. ఏపీ ప్రజలు ఇక్కడ ఉండొద్దని, ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని మేము అనట్లేదు. అమెరికా వాల్లే పెట్టుబడి పెట్టగా.. ఏపీ వాళ్లు పెడతామంటే మేము ఎందుకు వద్దంటాం. పవన్ తెలంగాణ నీ అయ్య జాగిరి కాదు పవన్. ఇక్కడకొచ్చి ఏం మాట్లాడుతున్నావ్’ అని హెచ్చరించారు.‘గద్దర్‌కు కార్ కొనిచ్చా అని బహిరంగంగా ప్రకటించి పవన్ తప్పు చేశాడు. పవన్ గద్దర్‌కు క్షమాపణ చెప్పాలి ...లేదంటే దలిత సంఘాలు ప్రశ్నించాలి. తెలంగాణను పదేపదే పాకిస్థాన్‌తో పోల్చి అవమానిస్తున్నారు. తెలంగాణ అమరవీరుల కు ఎప్పుడైనా పవన్ మద్దతు ఇచ్చారా?, తెలంగాణ ఏర్పాటు తో 11 రోజులు అన్నం తినలేదు అన్నది పవన్ కాదు. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్డిస్ట్. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. కొండగట్టుకు పవన్ వస్తే...తెలంగాణ ఛీఫ్ గెస్ట్ గా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొండగట్టుకు పైసలు ఇచ్చామంటుంన్నారు.. మీ అయ్య జాగిరా ఆ పైసలు. బీజేపీ పార్టీ పవన్‌కు సరైన స్కిప్ట్ ఇవ్వలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే సభ పెట్టి పవన్ గెలికాడు. తెలంగాణ లొ పవన్ తిరుగుతా అంటే మాకు అభ్యంతరం లేదు’ అని స్సష్టం చేశారు. -
తెలంగాణలో జనసేన ఉంటుంది..!
-
నాకు ఏపీలోనే దిక్కు లేదు.. తెలంగాణ లో సీఎం నా ?
-
Gunshot Full: పవన్ కళ్యాణ్ ఫోటో కి చెప్పు దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ
-
తెలంగాణ ప్రజలను కించపరిస్తే ఊరుకోం పవన్‌కు టీపీసీసీ చీఫ్ వార్నింగ్
-
కత్తులతో పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగిన తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్
-
తెలంగాణ హైకోర్టులో, పవన్ కు బిగ్ షాక్
-
పర్మిషన్ ఇవ్వు లేకపోతే ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టుకుంటా..
-
తెలంగాణ హైకోర్టులో జనసేనకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీకి చుక్కెదురైంది. ‘నవనిర్మాణ సభ’కు అనుమతి నిరాకరించిన పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో ఆ పార్టీకి మంగళవారం ఎదురుదెబ్బ తగిలింది. అత్యవసర విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో నవనిర్మాణ పేరిట సభ నిర్వహణకు జనసేన ప్రయత్నించింది. అయితే తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు, ఇక్కడి రాజకీయ నేతల ఖండన, తాజా రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. నిన్న కోర్టు సాధారణ సమయం ముగిసిన తర్వాత పోలీసుల నుంచి జనసేనకు తిరస్కరణ సమాచారం వెళ్లింది. దీంతో చేసేది లేక ఇవాళ అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి విచారణ జరపాలని కోరింది. అయితే ఈ వ్యవహారంలో ప్రముఖ జర్నలిస్ట్ పాశం యాదగిరి కేవియెట్ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టును కోరారు.ఇరు పక్షాల అంశాలను పరిశీలించిన హైకోర్టు.. జనసేన వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. దీంతో నవనిర్మాణ సభ నిర్వాహణ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఫోకస్ అంతా సాయంత్రం పవన్ కల్యాణ్ నిర్వహించబోయే ప్రెస్‌మీట్ మీద కేంద్రీకృతమైంది. -
నీ బాధ ఏందీ..? పవన్ కు MLA అనిరుద్ స్ట్రాంగ్ కౌంటర్
-
పవన్‌కు మంత్రి పొన్నం హెచ్చరిక, తెలంగాణ జోలికొస్తే...!
-
పవన్ ప్రెస్‌మీట్ రగడ.. తన్నుకున్న కాంగ్రెస్-జనసేన కేడర్!
సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహారశైలితో తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది. తెలంగాణను కించపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నేపథ్యంతో ఇక్కడ సభ నిర్వహించాలనుకోవడం, దానికి అనుమతి నిరాకరించడంతో హైదరాబాద్ నుంచే ప్రెస్‌మీట్‌కు సిద్ధం కావడం.. ఈ అంశాల చుట్టే వివాదం నడుస్తోంది. అయితే.. జనసేన నవనిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్, జనసేన నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఉదయం ఆవిర్భావ వేడుకల నేపథ్యంతో గన్‌పార్క్ వద్ద నివాళులర్పిస్తుండగా.. ఇరు పార్టీల నాయకులు ఎదురెదురు పడ్డారు. పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ జనసేన నేతలు ఆందోళనకు దిగగా, కాంగ్రెస్ నేతలు దానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఇరవైపులా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పి దూషించుకుంటూ ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఘర్షణ జరగ్గా.. పిడిగుద్దులు గుప్పించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి కాసేపటికి సర్దుమణిగింది. ఇక పవన్ కల్యాణ్ తీరుపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకులు అక్కడే రాజకీయాలు చేయాలని, తెలంగాణలో ఏపీ నాయకులకు ఏం పని అని ప్రశ్నించారు.తెలంగాణలో జనసేనకు రాజకీయ భవిష్యత్తు లేదని, మనుగడ లేని పార్టీలు ఇక్కడ విజయవంతం కావడం కష్టమని వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ పార్టీ నిర్మాణం చేస్తామంటే ప్రజలు అంగీకరించరని విమర్శించారు.పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన, ఆయన వ్యాఖ్యలు, వాటిపై కాంగ్రెస్ ప్రతిస్పందనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
జనసేన నేత కాబట్టే చర్యలు లేవా?
పిఠాపురం రూరల్ : తనకు రావాల్సిన ఆస్తి అడుగుతుంటే తన మామ, జనసేన నాయకుడు అయిన గరగ సత్యానందం వేధింపులకు గురి చేస్తున్నారని పిఠాపురం మండలం గోకివాడకు చెందిన గరగ కృష్ణ స్వాతి ఆరోపించారు. తనకు న్యాయం కావాలని, తన కుమార్తెతో కలిసి పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ చట్టబద్ధంగా తనకు రావలసిన ఆస్తి హక్కులను కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భర్త గరగ జగన్నాథ్ 2021లో కోవిడ్‌తో మరణించారని, భర్త మరణానంతరం తనను మానసికంగా, ఆర్థికంగా మామ సత్యానందం వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన పిఠాపురం జనసేన నాయకుడు కావడంతో జనసేన కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కుమార్తెను పోషించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కృష్ణ స్వాతి తెలిపారు. భర్త చనిపోయిన సమయంలో తన వద్ద నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, మామగారే కదా అని నమ్మి సంతకం పెట్టానని, ఆస్తి కోసం ఇంత మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని కంటతడి పెట్టారు. స్థానిక జనసేన నాయకులు తనకు అండగా నిలవకుండా మామ సత్యానందానికే మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి, చేబ్రోలులోని పార్టీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశానని, హైదరాబాద్‌లో పవన్ నివాసానికి రెండుసార్లు వెళ్లానని అయినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన చిన్న కుమార్తెకు రక్షణ కల్పించి జీవన భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. -
తెలంగాణ నవ నిర్మాణ సభవెనుక భారీ కుట్ర..
-
ఇంత రాద్ధాంతం నడుమ ప్రెస్‌మీట్ అవసరమా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలకు కారణమవుతున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరును ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తప్పుబట్టారు. అనవసర వివాదాలకు పవన్ తెర తీస్తున్నారంటూ సాక్షితో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, అలాగే హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించాలన్న ఆయన ప్రకటనపై రాజకీయ దుమారం రేగింది. ఈ పరిణామంపై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం తీవ్రంగా స్పందించారు.పవన్ కల్యాణ్ అనవసర వివాదాలకు తెర లేపుతున్నారని కోదండరాం విమర్శించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు నచ్చకపోతే అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవకాశం ఉన్నప్పటికీ, పోలీసు కేసుల వరకు వెళ్లడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తుల మధ్య ఉన్న విభేదాలను ప్రాంతాల మధ్య వైరుధ్యంగా మార్చడం ఆందోళనకరమని అన్నారు.మొదటి నుంచి తెలంగాణ అంటే బీజేపీకి గిట్టదని, ఈ వివాదాల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చని కోదండరాం వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ పవన్ కల్యాణ్ ద్వారా ఈ తరహా పరిస్థితులను నడిపిస్తోందని ఆరోపించారు. ఇంత రాద్దాంతం జరుగుతున్న తరుణంలో పవన్ హైదరాబాద్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయన తన అభిప్రాయాలను ఏపీలోనే వ్యక్తం చేయవచ్చని సూచించారు.ఇదిలా ఉండగా.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరిలూదుకొన్నది తెలంగాణ గడ్డపైనేనని పేర్కొంటూ, ఈ నేల నుంచే పార్టీకి పోరాట పటిమ లభించిందని అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అదే సమయంలో.. జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ ప్రెస్‌మీట్‌కైనా పోలీసులు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్’లో వెటకారంగా ఓ పోస్ట్ చేశారు. -
మరి ఇంత బరితెగించాలా..! చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ వార్నింగ్
-
‘తెలంగాణ ప్రజలకు పవన్ కచ్చితంగా క్షమాపణ చెప్పాలి’
హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే అనిరుధ్.. ‘సాక్షి’తో మాట్లాడారు. ‘పవన్ కళ్యాణ్ సభ విషయం లొ మాకు అభ్యంతరం లేదు. సభ ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ నరదృష్టి తగిలిందని గతంలో పవన్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలపై పవన్ నీచంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణను అవమానించిన విషయంలో కచ్చితంగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలి. పవన్ సభ పై బీజేపీ, బిఆర్ఎస్ మౌనం వెనక రాజకీయ కారణం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, బిఆర్ఎస్ కలసి పోటీ చేసే అవకాశాలున్నాయి’ అని తెలిపారు. పవన్.. కొండగట్టు అంజన్నపై ఒట్టేసి చెప్పు! -
పనికిమాలిన వెధవ..తోడకలు తీస్తాం బిడ్డా.. పవన్ కళ్యాణ్ కు పొన్నం మాస్ వార్నింగ్
-
అధికార మదమా?.. పవన్ తీరుపై వైరల్ వీడియో
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని జిందాల్ ఫ్యాక్టరీ పరిశీలన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అధికారులతో శనివారం వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫ్యాక్టరీ పనితీరుపై వాకబు చేస్తున్న సమయంలో పవన్‌కళ్యాణ్ కాలు మీద కాలు పెట్టుకుని ఊగుతూ అహంకార ధోరణిలో సమీక్ష నిర్వహిస్తున్న వీడియో, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ, జిందాల్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు చేతులు కట్టుకుని నిలుచున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సినిమాటిక్ హీరోయిజం పండించేందుకు ఇలా చేశారా... లేదా పవన్ ఆసలు స్వభావం అధికారం వచ్చిన తరువాత ఇలా బయటపడిందా అనే చర్చ మొదలైంది. ఏదైతేనేం ఉన్నతవిద్యావంతులైన ఐఏఎస్‌లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతా«ధికారులు నిలబడి పరిశ్రమ పనితీరు, పర్యావరణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తుంటే కాలు మీద కాలు వేసుకుని నిర్లక్ష్యంగా, అధికారులను అవమానించే విధంగా ప్రవర్తించిన వ్యవహార శైలిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. అధికారులు ప్రభుత్వ పాలకులకు జవాబుదారీగా మాత్రమే ఉంటారని.. బానిసలు కాదని, వారి చదువుకైనా గౌరవం ఇవ్వాలని సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు. పదవీ వచ్చాక అహంకారంతో సభ్యసమాజంలో ఇలాంటి పోకడలు సరికాదని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సి ఉండగా.. తాజా దృశ్యాలు అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
రూ.500 కోట్ల చెరువును కబ్జా చేసిన పవన్ కళ్యాణ్
-
పవన్.. కొండగట్టు అంజన్నపై ఒట్టేసి చెప్పు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టనున్న ‘నవనిర్మాణ సంకల్ప సభ’ రాజకీయ దుమారానికి దారితీసింది. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు, ఆ తర్వాత కూడా తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజకీయ, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన వ్యక్తికి ఇక్కడ నవనిర్మాణం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, ముందుగా తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు.సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ వారి కనులు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో సభలు పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన వ్యక్తి, అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడికి వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరన్నారు.తెలంగాణ ఏర్పడినప్పుడు వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం రాజకీయ నాటకమేనని విమర్శించారు. ‘‘కన్న తల్లికి గాజులు కొనలేని వాడు పినతల్లికి ఒడ్డాణం చేస్తాడనే సామెత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో చేయలేనిది తెలంగాణలో వచ్చి చేస్తాననడం విడ్డూరం’’ అని వ్యాఖ్యానించారు.పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభల వెనుక బీజేపీ రాజకీయ ఎజెండా ఉందని ఆరోపించిన పొన్నం.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ, తమిళనాడుల్లో కాకుండా తెలంగాణనే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సామాజిక వైషమ్యాలు సృష్టించడం లక్ష్యంగా బీజేపీ డైరెక్షన్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు.‘‘సినిమాల్లో హీరోగా అభిమానించొచ్చు. కానీ రాజకీయాల్లో తెలంగాణ వ్యతిరేక ధోరణితో వస్తే నిలదీస్తాం. పవన్ కళ్యాణ్ సినిమా నటుడు. పైసలు ఇస్తే ఏ పాత్రనైనా పోషిస్తాడు. ఇప్పుడు బీజేపీ స్క్రిప్ట్‌కు తగ్గట్టే నటిస్తున్నాడు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ కోసం పార్లమెంట్లో, ఉద్యమాల్లో, సకల జనుల సమ్మెలో వేలాది మంది పోరాడారని గుర్తుచేసిన మంత్రి పొన్నం.. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఎవరైనా కించపరిస్తే సహించబోమన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డకు పండుగరోజు అని, ఆ వేడుకల్లో పాల్గొనాలనుకుంటే ఎవరైనా రావొచ్చని, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి ఇక్కడ రాజకీయ సభలు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్‌తో తమకు సోదర సంబంధాలే ఉన్నాయని, అక్కడి ప్రజలపై ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. అయితే తెలంగాణపై విషం కక్కిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రేమ నటిస్తే ప్రజలు నమ్మరన్నారు. ‘‘బీజేపీ ఇచ్చే రెమ్యూనరేషన్ కోసం తెలంగాణకు రావడం లేదని నువ్వు నమ్మిన దేవుడు కొండగట్టు అంజన్నపై ప్రమాణం చేసి చెప్పగలవా పవన్ కళ్యాణ్?’’ అంటూ సవాల్ విసిరారు.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, గంగవరం, కృష్ణపట్నం పోర్టుల అంశం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ప్రజా సమస్యలపై స్పందించకుండా తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ‘‘సినిమాల్లో దేశభక్తి చూపించడం కాదు.. నిజ జీవితంలో ప్రజల కోసం నిలబడాలి. ఏపీ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. ముందు అక్కడ నవనిర్మాణం చేసి చూపించు’’ అని హితవు పలికారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఆయన రాజకీయ ఉద్దేశాలను అంగీకరించదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు -
పవన్ కళ్యాణ్ భూ కబ్జా.. హైడ్రా యాక్షన్ తీసుకుంటుందా..? లేదా..?
-
కోడి చెరువు భూ కబ్జా.. నాగార్జునకు ఒక రూల్.. పవన్ కు ఒక రూలా..?
-
చెప్పులతో కొట్టినా సిగ్గు రాదా.. కూటమిలో నీ స్థాయేంటో నీకు తెలుసా?
-
పవన్ ఫోటోలకు చెప్పుదెబ్బలు.. 2029లో సినిమా చూపిస్తాం
-
హీరోయిన్గా మారిన ‘రాను బొంబాయికి రాను’ భామ!
‘రాను బొంబాయికి రాను’ ఫోక్ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. లిరిక్స్ కంటే ఎక్కువగా రామ్ రాథోడ్, లిఖిత వేసిన స్టెప్పులు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఈ ఒక్క పాటతో లిఖిత..తెలుగు ఆడియన్స్‌కి బాగా దగ్గరైంది. ఈ పాట తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. అయితే ఇన్నాళ్లు ప్రైవేట్ ఆల్బమ్స్‌తో అలరించిన లిఖిత..ఇక ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఆమెను టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నాడు. సామ్రాట్, డీమోన్ పవన్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘సాV3’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ‘సాV3’ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హీరోయిన్ లిఖిత మాట్లాడుతూ - డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెబుతున్నప్పుడే మూవీ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా తెలిసింది. నేను ఫోక్ సాంగ్స్ నుంచి చిన్న గ్యాప్ తీసుకున్నాను. హీరోయిన్ గా మంచి రోల్స్ చేయాలనే ఫోక్ సాంగ్స్ కు గ్యాప్ ఇచ్చాను. అయినా మంచి ఆల్బమ్ వస్తే తప్పకుండా చేస్తాను. నేను ఒక బెస్ట్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో ఈ మూవీ ఆఫర్ వచ్చింది. సామ్రాట్, పవన్ లాంటి కోస్టార్స్ దొరకడం హ్యాపీగా ఉంది. వాళ్లు తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు. ప్రొడక్షన్ పరంగా ఎక్కడా రాజీపడకుండా మా విజయ గారు నిర్మించారు. ఎలాంటి స్క్రిప్ట్ పేపర్ లేకుండా మేమంతా కథను ఓన్ చేసుకుని నటించాం. అదంతా మా డైరెక్టర్ వల్లే సాధ్యమైంది’ అన్నారు.దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ... లిఖి, డీమోన్ పవన్ కొత్త వాళ్లు ఎలా నటిస్తారో అనుకున్నాను గానీ పర్ ఫార్మెన్స్ ఇరగదీశారు. వాళ్లకు ఇప్పటిదాకా సరైన మూవీ రాలేదని అనిపించింది. సాయి కార్తీక్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. మా టెక్నీషియన్స్ అందరూ అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చారు. ‘సాV3’ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం’ అన్నారు.హీరో డీమోన్ పవన్ మాట్లాడుతూ - బిగ్ బాస్ తర్వాత నేను ఎలాంటి మూవీ చేయాలని ఆలోచిస్తున్న టైమ్ లో డైరెక్టర్ కృష్ణ మాయ ఈ స్క్రిప్ట్ చెప్పారు. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. ఆయన స్క్రిప్ట్ చెబుతుంటే ఇంకా వినాలని అనిపించింది. అంత ఎక్స్ ప్రెసివ్ గా స్టోరీ చెప్పారు. ఇలాంటి దర్శకుడితో వర్క్ చేస్తే నటుడిగా నాకు మంచి పేరొస్తుందని నమ్మాను. మేమంతా ఈ సినిమా కోసం ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఆన్ సెట్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ నాచురల్ గా నటించాం. సామ్రాట్ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అలాగే లిఖితకు హీరోయిన్ గా మంచి పేరు వస్తుంది. తక్కువ టైమ్ లో మేమంతా క్వాలిటీగా సినిమా చేశాం. అన్నారు. -
బాబు, పవన్.. మీ పాలనలో మోసపోయింది మహిళలే: పూజిత
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు రెండేళ్ల పాలనలో మోసపోయింది మహిళలేనని వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. మహిళల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేను అదుపు చేయలేకపోయారని అన్నారు. నాయకుల మాదిరిగానే కూటమి పార్టీ నేతల పీఏలు కూడా మహిళలపై దాడులు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆడబిడ్డలపై చేయి వేస్తే అదే ఆఖరి రోజని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు చెప్పినట్లు నిందితులకు కాదు బాధిత మహిళలకు అదే ఆఖరి రోజు అవుతోంది. కోనేటి ఆదిమూలం, అరవ శ్రీధర్ ఘటనలే ఇందుకు సాక్ష్యం. న్యాయం కోరిన బాధితురాలి పైనే దాడి చేసినా పట్టించుకోలేదు. మహిళల పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేను అదుపు చేయలేకపోయారు.ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ చేశారు. దేవుడంటే కూడా కూటమి నేతలకు భయం లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?. నాయకుల మాదిరిగానే కూటమి పార్టీ నేతల పీఏలు కూడా మహిళలపై దాడులు చేస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండుంటే ఆడపిల్లపై చెయ్యి వేయాలంటే ఒక్కొక్కరు భయపడేవారు. నా వంటి వారు రాజకీయాల్లోకి వచ్చారంటే అది జగన్ ఇచ్చిన ధైర్యం’ అని చెప్పుకొచ్చారు. -
పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం
-
బాలినేని ఎంట్రీతో రియాజ్ విఫలమయ్యారా..?
-
పవన్ ప్యాకేజీ స్టార్: కాంగ్రెస్ ఎమ్మెల్యే
జడ్చర్ల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం జడ్చర్లలో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత పవన్ కల్యాణ్‌కు లేదని, ఆయనపై విమర్శలు చేయడం తగదన్నారు. నాగేశ్వర్ రాజకీయ, సామాజిక విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ అని.. ఆయన గోటికి కూడా పవన్ సరిపోరని పేర్కొన్నారు.పవన్ ఒక ప్యాకేజీ స్టార్.. చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చారు కాబట్టి ఆయనతో ఉన్నారని, అదేవిధంగా అమిత్‌షా దగ్గరకు వెళ్లి ప్యాకేజీ మాట్లాడుకున్నారేమో అన్నారు. పవర్ కోసం ఆయన ఏ పార్టీతోనా పొత్తు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయడానికి వస్తే తానే ఆయన ఇంటి ఎదుట నిలబడతానని, మొదట తనను అరెస్ట్ చేసిన తరువాతే ప్రొఫెసర్‌ను అరెస్టు చేయాల్సి ఉంటుందన్నారు. ఏపీ రాజధాని అమరావతికి అంత బడ్జెట్ ఎందుకుని ప్రశ్నించారు. ఏపీ పాలకులంతా హైదరాబాద్‌లోనే ఉన్నారని, వారికి ఇక్కడే రాజధాని కోసం 5 వేల ఎకరాల భూమి కేటాయిస్తామని.. వారు ఇక్కడి నుంచే పాలన సాగించుకోవచ్చని సూచించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ తమకు నోటీసులు పంపిందని, తనతో పాటు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సోమవారం విచారణకు హాజరవుతామని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, తన ఫోన్‌తో పాటు తన కుటుంబసభ్యుల ఫోన్లను, తన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేయించారని ఆరోపించారు. విచారణ అనంతరం సీఎలీ్పలో జరిగే మీడియా సమావేశంలో బీఆర్ఎస్ బాగోతాలను ఎండగడుతామన్నారు. -
పవన్ కళ్యాణ్ ను చెప్పుతో కొట్టిన తెలంగాణ మహిళ!
-
TVK విజయ్ ని చూసి నేర్చుకో..పవన్‌కు ఇచ్చిపడేసిన తోట
-
ప్రోనాగేశ్వర్ ను టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చెయ్యి పవన్ కి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వార్నింగ్
-
కాపులను బెదిరిస్తున్న పవన్ కళ్యాణ్
-
తొక్కుతా బిడ్డ.. ప్రో నాగేశ్వర్ పై కేసు, పవన్ కి ఇచ్చిపడసిన కాంగ్రెస్ MLA
-
ఏరు దాటాక... బోడి మల్లయ్య అంటున్న పవన్!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాపు కుల నేతలకు సవాలు విసిరారా? బెదిరించారా? రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో పవన్ వ్యాఖ్యలు చూస్తూ ఇలా అనిపించకమానదు. కులం కోసం రాజకీయాల్లోకి రాలేదని, కులాన్ని దాటి వెళ్లలేరా అని ఆ సమావేశంలో వ్యాఖ్యానించిన పవన్ ఎన్నికల సమయంలో ‘‘ఆంధ్ర భావన లేకపోతే మానె.. కాపు భావనతోనైనా ఓట్లు వేయాలి’’ అని కోరిన విషయం మరచినట్టున్నారు. అంతేనా... కాపుల మద్దతుతో గెలవాలన్న ఉద్దేశమే లేకపోతే 2019లో ఆ సామాజిక వర్గం అధికంగా ఉండే భీమవరం, గాజువాకల నుంచే ఎందుకు పోటీ చేసినట్టు? రెండో చోట్లా ఓడిపోయేందుకు ఇతర కారణాలు ఉండవచ్చు. అది వేరే సంగతి. 2024లోనూ ఆయన కుల మద్దతు కోసమే కదా ఏరి కోరి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నది? ఈ విషయాలన్నీ జనసేనతోపాటు రాజకీయ పక్షాల వారందరికి తెలియదా! జనసేనలో ఎక్కువ మంది కాపులకే ఎందుకు టిక్కెట్లు ఇచ్చారు? ఏపీ కేబినెట్లో జనసేన మంత్రులు ముగ్గురు ఉంటే, పవన్‌తోపాటు కాపు వర్గానికే చెందిన మరొకరికి ఎందుకు అవకాశం ఇచ్చారు? ఇలాంటి వాటితో సరిపెడితే పోతుందని ఆయన అనుకున్నారేమో కాని, కాపు సామాజిక వర్గం సంతృప్తి చెందలేదు. ఇప్పుడేమో తాను కులం కోసం రాజకీయాల్లోకి రాలేదంటున్నారు.సినిమా నటుడిగా అన్ని వర్గాల అభిమానులు ఉండవచ్చు. కాని వారిలో కాపులు.. మరీ ముఖ్యంగా యువత ఎక్కువ అన్నది బహిరంగ రహస్యమే. వీరంతా గత ఎన్నికలలో అండగా నిలబడింది వాస్తవం కాదా! వారంతా ఏమని అనుకున్నారు. టీడీపీతో పొత్తు కుదుర్చుకునే సందర్భంలో జనసేనకు కనీసం 50 అసెంబ్లీ స్థానాలు డిమాండ్ చేస్తారని, రెండేళ్లు సీఎంగా ఉండేలా ఒప్పందం కుదుర్చుకుంటారని అనుకుంటే నిరాశపరిచారు. పోనీలే.. భవిష్యత్తులోనైనా కాపు వర్గం నేతగా పవన్ ముఖ్యమంత్రి కాకపోతారా అని సరిపెట్టుకుంటే, పదిహేనేళ్లపాటు చంద్రబాబే సీఎంగా ఉండాలని చెప్పడం విని వారంతా నిర్ఘాంతపోయారు. చంద్రబాబు కాకపోతే ఆయన కుమారుడు లోకేశ్‌కు పట్టం కట్టినా ఓకే అన్నట్టుగా పవన్ ఈ పదిహేనేళ్ల రాగం అందుకున్నారన్నది అధికుల అభిప్రాయం. ఒకవైపు జనసేన కార్యకర్తలు, కొన్నిచోట్ల నాయకులు కూడా టీడీపీ వారి దౌర్జన్యాలకు గురవుతుంటే, ఎందుకు పవన్ నోరెత్తి గట్టిగా మాట్లాడడం లేదన్నది పలువురి ప్రశ్న. ఇలా ఇబ్బంది పడుతున్న వారిలో కాపు సామాజికవర్గం వారే ఉన్నారని ఆ సంఘం నేత దాసరి రాము చెబుతున్నారు. కాపునేత అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే సరికాదని చిన్న మాట అనలేకపోయారు. అంబటి వైసీపీ నేతగా కాకున్నా ముందు కాపు వర్గం నేత కూడా. ఇలాంటి విషయాలలో కూడా రాజకీయంగానే ఆలోచిస్తారా? ఇవన్ని ఒక ఎత్తయితే తనను విమర్శించే కాపు నాయకులంతా ఏకాభిప్రాయంతో ఒక సీఎం అభ్యర్ధిని పెట్టుకుని గెలిపించుకోవాలని పవన్ చెప్పడం ఇంకో ఎత్తు. ఒక రకంగా కాపు సామాజిక వర్గానికి సవాలు విసిరారు అన్నమాట. ఒకవైపు కులం కోసం రాజకీయాలలోకి రాలేదంటూనే, మరో వైపు కాపుల్లో తన స్థాయి నేత ఇంకెవరూ లేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది పవన్ రాజకీయ భవిష్యత్తుకు అంత మంచిది కూడా కాదు. తాము సీఎం అవ్వాలని కోరుకున్న వ్యక్తే కాడి పారేసి తమ వర్గం ప్రయోజనాలను కాలరాసేలా మాట్లాడితే ప్రత్యామ్నాయ నేతను వెతుక్కునే అవకాశం ఉంటుంది. పవన్ సీఎం కానప్పుడు ఏ పార్టీ తమకు మేలు చేస్తుందో ఆ పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉంది. కాపు నేస్తం వంటి స్కీములు అమలు చేయడంతోపాటు , అనేక మంది కాపు నేతలకు మంచి గుర్తింపు ఇచ్చిన వైసీపీనే బెటర్ అని వారు భావించే అవకాశం ఉంది. ప్రస్తుతం కాపు సామాజికవర్గంలో అదే పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు. అందువల్లే దాసరి రాము, ఒ.వి.రమణ వంటివారు ఆవేదనతో వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. కాపుల అండ లేనిదేనే ఉప ముఖ్యమంత్రి అయ్యారా అని రాము ప్రశ్నిస్తే, సీఎం పదవి చేపట్టలేని సిగ్గు లేని జాతి మాది అని మరో కాపు నేత, టీటీడీ మాజీ సభ్యుడు రమణ వ్యాఖ్యానించారు. కులం వద్దని పవన్ నిజంగా అనుకుంటూంటే తనకు కాపు జాతి వద్దని ప్రకటించాలని అన్నారు. కాపు కులం లేకపోతే చిరంజీవి, పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చేవారా అని ఆయన ప్రశ్నించారు. కాపు నేతలు మాట్లాడితే వంగవీటి రంగా ప్రస్తావన తీసుకు వస్తున్నారని, ఆయన భార్య కమ్మ అని, వారి బిడ్డలు రెండు కులాలకు చెందినవారు అవుతారని పవన్ చిత్రమైన వాదన చేశారు. తాను సనాతని అంటూ హడావుడి చేసిన పవన్ వ్యక్తిగత జీవితం మాటేమిటి అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అనవసర విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రంగా బతికి ఉన్నప్పుడు కాపు నేతలు మాట్లాడలేదని పవన్ అనడం సరికాదు. రంగా కాంగ్రెస్ నేతగా ఉండి కాపులతోపాటు పేద వర్గాలను ఆకట్టుకోవడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అది ఆయనకు ప్రజాబలం పెంచింది. ఆ క్రమంలో ఆయన ఆయా జిల్లాలలో టూర్ చేసినప్పుడు కాంగ్రెస్ కాపు నేతలు బాగా ఆకర్షితులయ్యారు. తాను కూడా వంగవీటి రంగాకు టీ ఇచ్చానని పవన్ ఎందుకు చెప్పుకున్నారు? రంగా హత్యకు గురైనప్పుడు పార్టీలకు అతీతంగా హత్యను ఖండించడమే కాదు. కృష్ణా నది తిన్నెలపై కాపునాడు సభ జరిగితే పార్టీలకు అతీతంగా పెద్ద, పెద్ద నేతలు హాజరయ్యారు. ఆ రోజుల్లో టీడీపీ ఎంపీగా ఉన్న నిశ్శంకరరావు వెంకటరత్నం కాపునాడుకు వెళ్లారు. అప్పట్లో టీడీపీలో మంత్రిగా ఉన్న చేగొండి హరిరామ జోగయ్య తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు.. రంగా హత్య చంద్రబాబుకు తెలిసే జరిగిందని ఏకంగా తన పుస్తకంలోనే రాశారు. మరో నేత ముద్రగడ పద్మనాభం కాపులను ఏకతాటిపైకి తీసుకు వచ్చిన కృషి చిన్నది కాదు. చంద్రబాబు ప్రభుత్వం ఆయనను, కుటుంబాన్ని ఏ విధంగా బాధించింది పవన్‌కు తెలియదా! ఆ రోజుల్లో పవన్ సంఘీభావం చెప్పారో, లేదో కాని దాసరి నారాయణరావు, చిరంజీవి వంటి ప్రముఖులు మద్దతు ఇచ్చారు. ముద్రగడను పరామర్శించడానికి వెళుతుంటే చంద్రబాబు ప్రభుత్వం వీరిని రాజమండ్రి ఎయిర్ పోర్టు వద్ద నిలువరించిందన్న సంగతి గుర్తు ఉండకపోవచ్చు. చంద్రబాబు ఒకరి నాశనం కోరుకునే వ్యక్తి కాదని పవన్ కళ్యాణ్ చెబుతుంటే కాపులే బిత్తరపోతున్నారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు పాలనలో ఎంతమంది కాపులతోసహా వివిధ వర్గాల వారు ఎంత నాశనమైంది పవన్‌కు తెలియపోవచ్చని ఆ వర్గం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఆయన పదవిలో ఉన్నారు కనుక అంతా బాగానే ఉండవచ్చు. కాని ఈ మధ్య జనసేన ఎంపీ బాలశౌరి కూటమిపై చేసిన వ్యాఖ్యలే ఈ ప్రభుత్వం పనితీరుకు దర్పణం పడతాయి. కాపు నేతలు కొందరు చంద్రబాబు పాలనలో నాశనమైందీ లేనిది ఆ వ్యాఖ్యల ద్వారా తెలుసుకోవచ్చు. తాను దేశం, నేల, రాష్ట్రం కోసమే వచ్చా..ఎప్పుడూ కులం గురించి మాట్లాడలేదు.. సీఎం అయ్యే తెలివితేటలు లేకకాదు..సమాజ మార్పు కోసం వేచి చూశానని పవన్ అనడం అచ్చం సినీ డైలాగుల మాదిరి అనిపించడం లేదూ! పార్టీ నడిపే శక్తి లేదని ఆయనే చెబుతారు. తనకు సీఎం అయ్యే తెలివి ఉందని ఆయనే అంటారు. దేన్ని నమ్మాలి! సినిమా గ్లామర్ ద్వారా రాజకీయాలలోకి వచ్చి, కాపుల అండతో పైకి వచ్చి, ఇప్పుడు కులం ఏమిటంటూ సిద్దాంతాలు చెప్పడం అమాయకుల సంగతేమో కాని,విషయ పరిజ్ఞానం కలిగిన వారెవరైనా విశ్వసిస్తారా!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
దుర్గేష్ ను కావాలని టార్గెట్ చేసిన పవన్.. అసలు కథ ఇదే..!
-
కులాల కోసం మాట్లాడింది నువ్వు... దమ్ముంటే అరెస్ట్ చేయండి ప్రో. కే నాగేశ్వర రావు ఛాలెంజ్
-
ఇదేం పద్ధతి పవన్..? వేరే వాళ్ళు చేస్తే ఏమో చెడు..!
-
పవన్‌పై కోపం చల్లారట్లేదా?
టాలీవుడ్ సీనియర్ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. తమిళ రాజకీయాల్లో సినిమా హీరోల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో.. ఆ చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత సినీ–రాజకీయ విమర్శలుగా మొదలైన రియాక్షన్లు ఇప్పుడు సెటైర్ వార్‌ను దాటి మరింత భావోద్వేగ దశకు చేరుకున్నాయి.మొదట సోషల్ మీడియాలో ఆగ్రహంగా మొదలైన ప్రతిస్పందనలు ఇప్పుడు క్రమంగా విభిన్న రూపాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో సెటైర్లతో బదులిచ్చిన నెటిజన్లు, ఇప్పుడు తమ అభిమాన హీరో వ్యక్తిత్వం, సినీ ప్రస్థానం, సామాజిక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ మరింత గట్టిగా స్పందిస్తున్నారు.పవన్ ప్రసంగంలో “కటౌట్లు, హాలోగ్రామ్స్ పెట్టుకుని ఈజీగా గెలిచేసి సీఎంలు అయ్యారు” అనే వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో, కొందరు అభిమానులు దాన్ని తమ హీరోలపై వ్యాఖ్యలుగా భావించారు. దీంతో తమిళనాడు సోషల్ మీడియా వేదికలపై “పవన్ సార్… మా దళపతి మీలా కాదు” అనే వాక్యం విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. ఇది నేరుగా విజయ్ అభిమానుల భావోద్వేగ కౌంటర్‌గా మారింది.విజయ్ అభిమానులు ఈ కౌంటర్ ద్వారా ఆయన 25 ఏళ్ల సినీ ప్రస్థానం మాత్రమే కాదు, ప్రజలతో ఏర్పరుచుకున్న అనుబంధాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. “కేవలం హైప్ వల్ల కాదు… నిజమైన ఫ్యాన్ బేస్, గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ వల్లే ఆయన నిలిచారు” అనే వాదనలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం చేయడం, ఫ్యాన్స్ అసోసియేషన్ల ద్వారా విద్యా సామగ్రి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అలాగే తమిళనాడులో వరదలు, తుఫాన్లు వచ్చిన సమయంలో ఆయన ప్రకటించిన విరాళాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న విధానాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.“సినిమాల్లో మాత్రమే హీరో కాదు… అవసరమైన సమయంలో ప్రజలతో నిలబడే వ్యక్తి” అంటూ కొందరు విజయ్ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. మరికొందరు ఆయన వ్యక్తిత్వం, అభిమానులతో మెలిగే తీరు, పబ్లిక్‌లో చూపించే సింప్లిసిటీని ఉదాహరణగా చూపిస్తూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ చర్చ కేవలం సినిమా లేదా రాజకీయ వ్యాఖ్యలకే పరిమితం కాకుండా, ఇద్దరు నటుల వ్యక్తిత్వాల పోలిక దాకా వెళ్లిన పరిస్థితి వెళ్లింది.#Ilayathalapathy Vijay's helping hand rare old pics! @AllYGirL85 @vijayrambomaxim @Anything4Vj @yok382 @Vicky_VjMsd pic.twitter.com/CgkJS3F0b9— Balaji (@balajiganesan26) August 15, 2016#Vijay has donated relief materials worth Rs 3cr to people affected by Chennai floods #Theri #Ilayathalapathy pic.twitter.com/jCsVZVvIbW— Nandhakumar (@ActorVijayFan1) December 20, 2015మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను వేరే కోణంలో చూస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు కాదని, రాజకీయ అనుభవాలపై చేసిన సరదా వ్యాఖ్యలేనని వారు చెబుతున్నారు. 15 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను హైలైట్ చేయడమే ఉద్దేశమని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. విజయ్ కంటే పవనే తోపు అంటూ విజయ్ అభిమానులతో వాదనకు దిగుతున్నారు. దీంతో.. పవన్ వ్యాఖ్యలపై విజయ్ అభిమానుల కోపం ఇంకా చల్లారడం లేదు. మొత్తానికి పవన్ వ్యాఖ్యలు ఒక సాధారణ రాజకీయ హాస్యంగా మొదలై, ఇప్పుడు తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల మధ్య భావోద్వేగ పోరుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.Cutouts pettukoni gelichadu 👍 pic.twitter.com/hPoFawOwOp— JD⚡ (@JohnDurdeno) May 26, 2026 -
జనసేన స్టార్.. కన్ఫ్యూజన్ మాస్టర్!
కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు గందరగోళంగా కనిపిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలోని ఆయన ప్రసంగంలో ఒక్క విషయంపై మాత్రం ఆయన చాలా స్పష్టత ఉన్నట్లు తెలిసింది. భవిష్యత్తు రాజకీయ పరిణామాల్లోనూ టీడీపీతోనే కొనసాగాలని ఆయన కాంక్షిస్తున్నట్లు స్పష్టమైంది. కేడర్‌కు అసౌకర్యం, అవమానాలు ఎదురైనా భరించాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడారని విమర్శలు వస్తున్నాయి. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ సీఎం కావడం తనకు అసూయ కలిగించిందని చమత్కరిస్తూనే.. అక్కడ అభిమానులు ఏకతాటిపై ఉండి గెలిపించారని, కానీ ఏపీలో మాత్రం తాను స్వయంగా 15 ఏళ్లు రోడ్లపై దేకినా అవకాశం ఇవ్వలేదని అన్నారు. చిత్రంగా.. ఇందుకు కొద్దిరోజుల ముందే విజయ్ గెలుపును ఉద్దేశించి పవన్ ‘‘ఊళ్లో పెళ్లి అవుతుంటే..’’ సామెతను ప్రయోగించి కార్యకర్తలను విస్తుపరిచారు. ఒంటరిగా పోటీచేయడం సంగతి ఎలా ఉన్నా, ఆయన సీఎం కావాలని కోరుకుంటున్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటా అన్న బాధను పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేశారు.ఇప్పుడేమో ఇంకోరకంగా మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖునిగా పేరొందిన ఫ్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక విశ్లేషణపై ఆయన స్పందించిన తీరు కూడా అంత అర్థవంతం అనిపించదు. అమిత్ షాతో భేటీ కి సంబంధించి నాగేశ్వర్ వెల్లడించిన విషయాలపై అభ్యంతరం ఉంటే చెప్పవచ్చు కానీ.. కేసు పెట్టడాన్ని పవన్ ఎలా సమర్థిస్తారో? దారిన పోయే ప్రతి ఒక్కడు రాళ్లేస్తామంటే ఊరికే ఉండమని, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసనాలు తప్పవని ఆయన హెచ్చరించడం అంత బాగోలేదు. రాజకీయ విషయాలపై, విశ్లేషణలపై కేసు పెట్టిన సందర్భం ఇదొక్కటే కావచ్చు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఒక వ్యక్తి చెప్పిన అంశం నచ్చకపోతే, కరెక్ట్ కాదని భావిస్తే ఖండించవచ్చు. లేదా డామేజీ కోరవచ్చు. కానీ... కేసులు పెట్టి వేధించాలని అనుకుంటే అది ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించడమే! పవన్ కళ్యాణ్ గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని ఏ ఆధారంతో చెప్పారని, పైగా అది ఏపీ మహిళల పరువుకు సంబంధించినందని పలువురు జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. అలాగే తిరుమల లడ్డూ వివాదంలో పవన్ ఎంత అభ్యంతరకరంగా వ్యవహరించింది గుర్తు చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజానికి హాని కలుగుతుంది కాని, అమిత్ షాతో భేటీలో పవన్, మనోహర్‌లు ఫలానాది కోరారని అని చెబితే దానివల్ల కలిగే ప్రమాదం ఏమిటో తెలియదని వారు అంటున్నారు. నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా పవన్ ఎందుకు ఇలా స్పందించారన్నది చర్చనీయాంశంగా ఉంది. బీజేపీ పెద్దలు ఖండించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒకవైపు నాగేశ్వర్ అంటే గౌరవమని చెబుతూనే అమిత్ షాతో మాట్లాడిన మాటలు బయటకు ఎలా తెలుస్తాయని ఆయన అన్నారు. ఇంకోసారి అదేమీ జరగలేదని అన్నారు. విశ్లేషకులు వదంతులు మాట్లాడకూడదని అన్నారు. అది ఎవరికైనా వర్తిస్తుంది కదా! ఎల్లో మీడియా ఇలాంటి కథనాలు ఎన్ని వండి వార్చిందో పవన్‌కు తెలియదా! అమ్మ జగనా అంటూ బ్యానర్ కథనాలు ఇచ్చారే. ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ అయినప్పుడల్లా ఇలాంటి స్టోరీలు అల్లారే. అప్పుడు వారెవ్వరి మీద కేసులు పెట్లలేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. చివరికి జగన్ ఆత్మలతో మాట్లాడుతున్నారంటూ పిచ్చి వార్తలు రాసిన టీడీపీ మీడియాపై ఏమైనా కేసులు పెట్టారా? జగన్ జైలుకు వెళ్లాలని తానెందుకు కోరుకుంటానని పవన్ అన్నారు. ఇంతవరకు సమంజసంగానే ఉంది. కాని జగన్‌ను గతంలో రాజకీయంగా అష్ట దిగ్బంధనం చేయడానికి కాంగ్రెస్, టీడీపీ కలిసి అక్రమ కేసులు పెట్టిన సంగతి ఆయనకు తెలియదా? ఒకరు జైలుకు వెళితే జనసేన ఎదుగుతుందా! క్రైం చేసినోడి గురించి నేను చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకు తెలియదా అంటూ మాట్లాడారు. దీని భావమేమిటో అర్థం కాదు. అవినీతి కేసులలో చంద్రబాబు జైలుకు వెళ్లిన సందర్భంలో రోడ్డుపై కూడా పడుకుని రచ్చ చేసింది ఎవరు? జైలుకు వెళ్లి ఆయనతో పొత్తు ప్రకటన చేసింది ఎవరు? ఒక్కొక్కరి విషయంలో ఒక్కోరకంగా వ్యవహరించడం నేతలకు మామూలే అన్న విమర్శకు ఆస్కారం ఇవ్వడం లేదా?కులం, ప్రాంతం గురించి ప్రస్తావన తెస్తున్నారంటూ పవన్ బాధపడ్డారు.ఆయన నిజంగా వాటి జోలికి వెళ్లకపోతే అభినందించవచ్చు. కాని ఆయన గత కొన్నేళ్లలో చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాల వీడియోలు చూస్తే కులం గురించి, సీఎం పదవి గురించి, ఎన్నిసార్లు మాట్లాడింది కనిపిస్తూనే ఉంటుంది కదా? ఒక వైపు జనసేన కేడర్‌పై జరుగుతున్న దాడులను పరిష్కరించకపోగా, చిన్న, చిన్న వాటి గురించి పట్టించుకోరాదని, సర్దుకుపోవాలని చెప్పడాన్ని వారు ఎలా జీర్ణించుకోగలుగుతారు. బందరులో మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు జనసేన నేతకు సంబంధించి నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికారులు, పోలీసులను ప్రయోగించి కూల్చివేస్తే జనసేన ఎంపీ బాలశౌరి అధికారిక సమావేశంలోనే నిలదీశారు. కొల్లూరులో టీడీపీ వారు జనసేన వారిపై దాడి జరిపిన ఘటన కలకలం సృష్టించింది. వీటన్నిటిపై నేరుగా స్పందించలేదు. తాను కమాండర్ అని, తాను చెప్పినట్లు వినాల్సిందేనని, లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని చెప్పక తప్పదు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దు
పంజగుట్ట (హైదరాబాద్): ఏపీలో ప్రొ.నాగేశ్వర్‌పై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని వక్తలు డిమాండ్ చేశారు. లేకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దని చెప్పారు. తెలంగాణ క్రాంతిదళ్ ఆధ్వర్యంలో క్రాంతిదళ్ వ్యవస్థాపకుడు డాక్టర్ పృథ్విరాజ్ యాదవ్ అధ్యక్షతన ‘తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనుప బూట్లు ఇంకెంతకాలం’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రొ.నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో తనపై పెట్టిన కేసులు చూస్తే నవ్వొస్తుందన్నారు. ‘నేను కుల చిచ్చుపెట్టానట.. ప్రాంతం గురించి మాట్లాడానట.. అల్లర్లు సృష్టించేందుకు పనిచేశానట.. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేశానట.. ఆ కేసులు చూస్తుంటే నవ్వొస్తుంది’ అని అన్నారు. తెలంగాణ వారు ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడతారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నం రైల్వేజోన్ ఇచ్చినట్లే ఇచ్చి ఆదాయం వచ్చే మరో లైన్‌ను ఒడిశాకు కలిపారని, మచిలీపట్నం ఆయిల్ గ్యాస్ నిక్షేపాలను దుర్మార్గమైన వేదాంత కంపెనీకి అప్పచెప్పారన్నారు. దీనిపై ప్రశ్నించాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందని, తాను ప్రశ్నించినందుకే కేసులు పెట్టారని చెప్పారు. మీ ఆస్తులు ఇక్కడే ఉన్నాయ్... ‘పవన్ కళ్యాణ్‌కు ప్రజాస్వామ్యం, తెలంగాణ కోసం మాట్లాడే హక్కే లేదు. అసలు ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టే హక్కు కూడా లేదు. పూటకో రంగుమార్చేవాడు, చేగువేరా బొమ్మ పెట్టుకుని గద్దర్‌ను మోసం చేసిన వాడు పవన్. ఎన్టీఆర్‌ను మానసికంగా వేధించి ఆయన చావుకు కారణమైన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు. పవన్, బాబును తెలంగాణలో అడుగు పెట్టనివ్వరాదు’ అని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అన్నారు. ‘చంద్రబాబు, పవన్ జాగ్రత్త. రజాకార్లనే ఉరికించిన నేల ఇది. మీ ఆస్తులు, ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి. మీ ఆస్తులు తగలబెట్టడం కాదు, అస్తిత్వం లేకుండా చేస్తాం. చంద్రబాబు హెరిటేజ్‌ను నేటి నుంచి తెలంగాణలో బ్యాన్ చేద్దాం’ అని పృధ్వీరాజ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చంద్రబాబును విమర్శించామని, కానీ ప్రస్తుతం వారు చేస్తున్న బూతుపురాణాల్లా ఎప్పుడూ విమర్శించలేదని పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య అన్నారు. వెంటనే నాగేశ్వర్‌పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. -
ప్రశ్నించే గొంతుకపై 'ఉక్కుపాదం'
‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు, కానీ నీ అభిప్రా యాన్ని నిర్భయంగా చెప్పే నీ హక్కును నా ప్రాణం అడ్డుపెట్టయినా కాపాడు తాను‘ అన్న ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టెయిర్ ప్రసిద్ధ సూక్తి ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో విద్యావేత్తగా, పాత్రికేయుడిగా, మాజీ ప్రజాప్రతినిధిగా, రాజకీయ విశ్లేషకుడిగా కోట్లాది మంది ప్రజల గౌరవాన్ని చూరగొన్న వ్యక్తి ప్రొఫెసర్ కె. నాగేశ్వర్. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఆయనపై వరుసగా కేసులు నమోదు కావడం, కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చే మీడియా సంస్థలు ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒక వ్యక్తిపై జరుగు తున్న దాడి కాదు, ప్రశ్నించే గొంతుకను చిదిమేయడా నికి జరుగుతున్న కుట్రగా భావించాలి. ఒక పాత్రికేయుడిగా తనకు అందుబాటులో ఉన్న సోర్సులను దృష్టిలో ఉంచుకుని జరుగుతున్న రాజకీయ పరిణామాలను బయటపెట్టినందుకు ఆయనపై పగబట్టడం పాలకుల అహేతుక వైఖరిని వెల్లడిస్తోంది.భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన కీలకమైన హక్కు ‘భావప్రకటన స్వేచ్ఛ’. ఒక జర్నలిస్టుగా సమాజంలో జరుగుతున్న పరిణామాలను, తెరవెనుక రాజకీయాలను ప్రజల ముందుకు తేవడం ఆయన ప్రాథమిక బాధ్యత. ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య జరిగిన సంభాషణ గురించి నాగేశ్వర్ ప్రస్తావించడంపై ఇంత రగడ సృష్టించడం అర్థరహితం. రాజకీయాల్లో ఇటువంటి సంభాషణలు సన్నిహిత వర్గాల ద్వారా లేదా అంతర్గత లీకుల ద్వారా సీని యర్ జర్నలిస్టులకు చేరడం అత్యంత సహజమైన ప్రక్రియ. జర్నలిజం నిబంధనల ప్రకారం తమకు సమాచారం ఎక్కడి నుండి వచ్చిందో బహిర్గతం చేయాల్సిన బాధ్యత ఏ పాత్రికేయుడికీ లేదు. నమ్మదగిన సోర్స్ ద్వారా సమాచారం అందిన ప్పుడే బహిరంగంగా మాట్లాడతారు. ఒకవేళ నాగేశ్వర్ చెప్పిన విషయాల్లో నిజం లేకపోతే, అసలు వారి మధ్య ఏం సంభాషణ జరి గిందో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉప ముఖ్య మంత్రిపై ఉంటుంది. కనీసం ఆ వార్తలను ప్రజా స్వామ్య యుతంగా ఖండించే అవకాశం కూడా వారికి ఉంది. కానీ, కూటమి ప్రభుత్వం ఆ సరళ మైన, ప్రజాస్వామ్య మార్గాన్ని వదిలిపెట్టి, భయ బ్రాంతులకు గురిచేసే వ్యూహాన్ని ఎంచుకుంది. ‘మమ్మల్ని ప్రశ్నిస్తే సహించేది లేదు’ అనే అర్థం వచ్చేలా సాగుతున్న ఈ వైఖరి ఒక ప్రమాదక రమైన సంస్కృతికి భాష్యం చెబుతోంది.ఒకసారి చరిత్రను చూస్తే...భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో కార్టూనిస్ట్ శంకర్ పిళ్లై అప్పట్లో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై, ఆయన ప్రభుత్వ విధానాలపై పదునైన వ్యంగ్య కార్టూన్లు గీసేవారు. వాటిని చూసి నెహ్రూ ఎన్నడూ ఆగ్రహించలేదు. ‘శంకర్, నన్ను కూడా వదలకు’ అంటూ ప్రోత్సహించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తనపై వచ్చిన పత్రికా విమర్శలను, వ్యక్తిగత దూషణలను ఓపికతో భరించారు. ‘నన్ను విమ ర్శించే హక్కు పత్రికలకు ఉంది, నా తప్పులను నేను సరిదిద్దుకునే అవకాశం వాటి ద్వారా దక్కుతుంది’ అని ఆయన నమ్మారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న చర్చిల్‌పై మీడియా, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. యుద్ధ వ్యూహాల లీకేజీలపై కథనాలు వచ్చినా, ఆయన పాత్రికేయులపై కేసులు పెట్టలేదు. ‘సజీ వంగా ఉన్న ప్రజాస్వామ్యానికి విమర్శే ప్రాణా ధారం’ అని ప్రకటించారు. ఈ చారిత్రక ఉదాహరణలతో పోల్చితే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎంత అసహనంతో ఉన్నారో స్పష్టమవుతుంది.– ఎం. కృష్ణ ఆదిత్య ‘ పాత్రికేయుడు -
సీఎం పదవి చేపట్టలేని సిగ్గులేని జాతి మాది: టీడీపీ నేత
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో కాపులు ముఖ్యమంత్రి కావాలన్నది తమ చిరకాల ఆకాంక్ష అని.. కాపు యువత ఇదే కోరుకుంటోందని తెలుగుదేశం పార్టీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ అన్నారు. తిరుపతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు సామాజికవర్గం పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలనుకుందన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదన్నారు.సీఎం పదవి చేపట్టలేని సిగ్గు లేని జాతి తమదని, ఎంతకాలం తాము బ్రోకర్లుగా, జోకర్లుగా ఉండాలని ఆయన ప్రశ్నించారు. రానురాను కాపు జాతికి సిగ్గు, పౌరుషం తగ్గిపోతోందన్నారు. టీడీపీ అంటే కమ్మ, జనసేన అంటే కాపు పార్టీ అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తనకు కులం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా పవన్‌కు కులం అవసరం లేదనుకుంటే కాపు జాతి వద్దని బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. కాపు కులం లేకపోతే పవన్ కళ్యాణ్, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేవారా?. పవన్ ఈ రోజు మాత్రం రాణించగలిగే వాడా అంటూ ప్రశ్నించారు. కాపు కులం గురించి పవన్ తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని అన్నారు. పవన్‌కు ఆ ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యమన్నారు.కాపులను దూరం పెట్టే పనిలో పవన్..గత ఎన్నికల్లో కాపు జాతి పవన్ కళ్యాణ్‌ను సొంతం చేసుకుందని... కానీ పవన్ కళ్యాణ్ కాపులను దూరం పెట్టే పనిలో ఉన్నారని ఓవీ రమణ అన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కూడా కేటాయించని ప్రభుత్వంలో కాపు నేతగా ఉన్న పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నించే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాపులు, ఎస్సీ, ఎస్టీలు కలిసి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్నారని, పవన్ ఇలాగే ఉంటే రాష్ట్రంలో కొత్త నాయకుడు పుట్టుకొస్తాడన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు రాబోతున్నాయని హెచ్చరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడ్డ వారికి గుర్తింపు లేదన్నారు. తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలను ఎదుర్కొని విజయ్ ఎదిగారని గుర్తు చేశారు. మరి పవన్ ఎందుకు ఎదగకూడదని, ఆ దిశగా పవన్ ఆలోచించాలని సూచించారు. -
లోకేశ్ శాఖ అక్రమాలపై పవన్ ప్రశ్నించరా?
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్.. విద్యాశాఖ మంత్రి లోకేశ్ శాఖలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ నిలదీశారు. మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలో భారీ స్కామ్ జరిగిందని, ఒక్కో టీచర్ పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ప్రశ్నాపత్రాల లీకేజీ నుంచి మెరిట్ లిస్ట్ దాచిపెట్టడం వరకు మొత్తం నియామక ప్రక్రియపై సిట్టింగ్ జడ్జితో విచారణగానీ, సీబీఐతో దర్యాప్తుగానీ జరిపించాలని డిమాండ్ చేశారు.ఆయన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ–2025 పరీక్ష రాసే వ్యక్తికే ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యతలు అప్పగించారని చెప్పారు. ప్రశ్నాపత్రాలు లీకైన తర్వాత కూడా ఆ ఉద్యోగిని ఎందుకు సస్పెండ్ చేయలేదని, ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలాంటి సిఫార్సులు లేకుండా ప్రతిభ ఆధారంగా 1.20 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. గోదావరి కలుషితం కాకుండా వైఎస్ జగన్ చర్యలు గోదావరి కలుషితం కాకుండా ఉండాలని గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.756 కోట్లతో డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపిందని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ద్వారా ఏఆర్సీపీ స్కీమ్‌లో రూ.88 కోట్లు తీసుకొచి్చనట్లు తెలిపారు. పేపర్ మిల్లు నుంచి వచ్చే కలుషిత నీటిని పూర్తిగా శుద్ధిచేసిన తర్వాతే గోదావరిలో వదలాల్సి ఉందన్నారు.తమ హయాంలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) పనులు 50 శాతం పూర్తయ్యాయని చెప్పారు. కానీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కమీషన్ల కోసం కాంట్రాక్టర్‌ను బెదిరించి పనులు ఆపేశారని విమర్శించారు. ట్రీట్మెంట్ పేరుతో రూ.లక్షలు ఖర్చు చేస్తున్నామని చెబుతూ నేరుగా కలుషిత నీటిని గోదావరిలోకి వదులుతున్నారన్నారు. దీంతో ప్రజల్లో కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. పవన్‌కళ్యాణ్ ఎస్టీపీ చానల్‌ను పరిశీలించి అక్కడ జరుగుతున్న అక్రమాలను బయటపెట్టాలని సూచించారు.ఇసుక మాఫియా అక్రమాలకు అంతేలేదు రాజమహేంద్రవరంలో ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయిందని చెప్పారు. గ్యామన్ ఇండియా బ్రిడ్జిని రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు పంచుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. బ్రిడ్జి స్తంభాల వద్ద విపరీతంగా ఇసుక తవ్వేస్తున్నారని చెప్పారు. ఇక్కడ ఇసుక మాఫియా, మట్టి మాఫియా, చిట్టీల మాఫియా రెచ్చిపోతున్నాయని తెలిపారు. గ్యామన్ ఇండియా బ్రిడ్జి వద్ద జరుగుతున్న ఇసుక దోపిడీ, పేపర్ మిల్లు కాలుష్యంపై పవన్‌కళ్యాణ్ రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. -
నా బిడ్డ పేరు చెప్పుకుని డిప్యూటీ సీఎం అయ్యావ్
సాక్షి, అమరావతి: పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుటుంబ సభ్యులను తిట్టిన వారి మీద పెట్టిన కేసుల్లో పురోగతి ఉంది కానీ.. తొమ్మిదేళ్ల క్రితం హత్యాచారానికి గురైన తన కుమార్తె కేసు దర్యాప్తులో మాత్రం ముందడుగు పడలేదని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడి నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా కనీసం తమను పట్టించుకోవడం మానేశారని ఆమె ఆక్షేపించారు.అధికారంలోకి వచ్చాక మొదటిగా సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యాక వెళ్లి కలిస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారయ్యాయని, డీఎన్ఏ రిపోర్టులు మారిపోయాయని మాటమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలోనే 2019కి ముందే ఆయన్ను కలిసి నిందితులు టీడీపీ వారేనని చెప్పినప్పుడు, అండగా ఉండి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక తామెవరో కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. పచ్చి స్వార్థపరుడు పవన్ ‘‘వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిందించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికే సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ వాడుకున్నారని అర్థమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన దానిలో పదో శాతమైనా సీఎం చంద్రబాబును నిలదీసి ఉంటే ఈపాటికే కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చేది. ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తుంటే, జనసేన నాయకులు, కార్యకర్తలతో తనపై దాడులు చేయించారు. జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావును పురమాయించి తన వైకల్యాన్ని, కులాన్ని అవమానించేలా మాట్లాడించారు.పవన్‌కళ్యాణ్‌ను కలిసినప్పుడూ ఇదే వైకల్యం, అదే రెడ్డి కులం ఉన్నాయని పేర్కొన్నారు. మరి అవన్నీ తెలిసి కూడా అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇచ్చిన హామీకి కట్టుబడడం అంటే ఇదేనా? నా కూతురు దూరమైందన్న బాధ కన్నా కూటమి ప్రభుత్వం చేస్తున్న అవమానాలే మరింత కుంగదీస్తున్నాయి. ప్రధాని మోదీతో మాట్లాడి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తామన్న హామీ పవన్‌కళ్యాణ్‌కు గుర్తుకు లేదా? సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకునే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన పచ్చి స్వార్థపరుడు.’’ అని పార్వతి వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసమే నా కూతురు కేసును వాడుకున్నానని బహిరంగంగా చెప్పాలి ‘‘మాకు ఏదైనా న్యాయం జరిగిందీ అంటే, అది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మేము కోరిన వెంటనే అడిషనల్ ఎస్పీ రమాదేవి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి లైంగికదాడి జరిగిందనే విషయాన్ని నిర్ధారించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విషయాన్ని మరుగున పడేసేందుకు యత్నించడం బాధాకరం. ఇప్పటికైనా పవన్ తక్షణం స్పందించి నా బిడ్డ కేసు దర్యాప్తు చేయించి, నిందితులను శిక్షించాలి. లేదంటే రాజకీయ లబ్ధి కోసమే నా కూతురు కేసును వాడుకున్నట్టు బహిరంగంగా చెప్పాలి. నిందితులను కాపాడటానికి నాది రెడ్డి కులమంటూ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు.నా కుమార్తె మృతికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో 2025లో వీల్‌చైర్ యాత్రకు సిద్ధమైతే 300 మంది పోలీసులతో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఏ తప్పూ చేయకపోతే ప్రభుత్వం ఎందుకంతగా భయపడుతోంది? ఇప్పుడైనా నా వీల్‌చైర్ యాత్రకు అనుమతివ్వాలి. ఎస్సీ, ఎస్టీ యాక్టు ప్రకారం మాకు రావాల్సిన బెనిఫిట్స్‌ని చంద్రబాబు ప్రభుత్వం ఆపేసిందని తెలుసుకున్న జగన్ చాలా బాధ పడ్డారు. అవన్నీ సాధించడంతో పాటు కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.’’ అని సుగాలి పార్వతి వివరించారు. -
నా బిడ్డ పేరు వాడుకుని గెలిచావ్.. ఇప్పుడు తప్పించుకుంటున్నావ్
-
15 సంవత్సరాలు రోడ్లపై డేకించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సెటైర్లు
-
సీఎం విజయ్ పై పవన్ షాకింగ్ కామెంట్స్
-
ప్రొ. నాగేశ్వర్ వ్యాఖ్యలకు భయపడ్డ పవన్..!
-
కూటమిలో కామాంధుడు.. అరవ శ్రీధర్ మెడపై కత్తి
-
నేరుగా సమాధానం చెప్పలేరా వీళ్లు!
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఎంత మొత్తుకున్నా ఏం లాభం? జవాబు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ పవన్, కీలక మంత్రి లోకేశ్‌లు ఎప్పటికప్పుడు ఆవు కథ వల్లెవేస్తూ ప్రజలను పదే పదే మభ్యపెట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ లేవనెత్తిన అంశాలపై ఈ కూటమి నిర్దిష్ట, నిర్దుష్ట సమాధానం చెప్పలేకపోతోంది.రాజధాని పేరుతో అమరావతిలో జరగుతున్న ధన దోపిడీపై జగన్ కొన్ని రోజుల క్రితం విస్పష్టమైన సమాచారం, గణాంకాలతో వివరించారు. ఇదే సందర్భంలో హత్యా రాజకీయాలు ఎవరివో బాబు అండ్ కో స్పష్టం చేయాలని ప్రశ్నించారు కూడా. పెట్రోలు, డీజిల్ ధరలపై వీరు గతంలో ఇచ్చిన హామీలు.. ప్రస్తుత పరిస్థితులను పోల్చి విమర్శించారు. ‘‘బోత్ ఆర్ నాట్ ద సేమ్’’ అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యకు సమాధానమిస్తూ.. తమ ప్రభుత్వం, పాలన ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అస్సలు పొంతనే లేదని స్పష్టం చేశారు... ‘‘అవును.. బోత్ కేన్ నెవ్వర్ బీ ద సేమ్’’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్‌మీడియాలో హైలైట్‌గా నిలుస్తోంది.జగన్ అన్ని రకాల ఆధారాలతో చేసిన ఆరోపణలకు లోకేశ్, మంత్రి అచ్చెన్నాయుళ్లు ఇచ్చిన సమాధానం ఏమిటి? వ్యక్తిగతంగా జగన్‌ను విమర్శించడం. దూషణలకు దిగడం. తమ భుజాలు తామే చరచుకుని ‘‘శెభాష్’’ అనుకోవడం. అబద్ధాలకు రెక్కలు తొడిగి ప్రజల్లోకి తీసుకెళ్లడమే పనిగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్న జగన్ మాట అక్షరసత్యమవుతోంది. లోకేశ్ ఈ మధ్య తన ప్రసంగాల్లో జగన్‌పై కొన్ని విమర్శలు చేశారు.‘‘బోత్ ఆర్ నాట్ సేమ్, అర్థమైందా రాజా...’’ అంటూ సినిమా డైలాగు ఒకటి వదిలారు. చేసిన విమర్శలకు ఆధారాలు చూపిస్తే ఓకే కానీ... 99 శాతం అర్ధ సత్యాలుతో వాగడమే సమస్య. అచ్చం తన తండ్రి చంద్రబాబు మాదిరిగానే జగన్ అడిగిన వాటికి సూటిగా జవాబివ్వకుండా ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితమవుతున్నారు. హుందా రాజకీయాలు చేయడం, నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రతిపక్షం చేసే ఆరోపణలకు బాధ్యతాయుతంగా జవాబు ఇస్తే గౌరవం కానీ... గొడ్డలి పార్టీ అని, మరొకటి అని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి, చుట్టుపక్కల ఉన్న వారితో ఆహా.. ఓహో అనిపించుకుని మురిసిపోతే ఆయనకే నష్టం.లోకేశ్ వ్యాఖ్యలకు జగన్ దీటుగా ఇచ్చిన సమాధానంతో ఎవరి తీరు ఏమిటన్నది స్పష్టమైపోయింది. వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు... ప్రజాబలంతో గద్దెనెక్కిన తామూ....‘నెవ్వర్ కేన్ బీ ద సేమ్’’ అని స్పష్టం చేశారు. అలాగే.. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ ఎలా ఎగవేసింది.. తాము ఎలా నూటికి నూరుశాతం అమలు చేసింది ప్రస్తావించి లోకేశ్ వ్యాఖ్యను పూర్వపక్షం చేశారు. 2014లో చంద్రబాబు రైతు రుణ మాఫీతోపాటు అనేకానేక ఇతర వాగ్ధానాలిచ్చిన అధికారంలోకి రావడం.. ఆ తరువాత కొంత కాలానికి ఎన్నికల మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్సైట్ నుంచి తొలగించడం తెలిసిందే. 2024లో సూపర్ సిక్స్ పేరుతో అలవికాని హామీలిచ్చి చాలావాటిని అమలు చేయకుండానే చేసేసినట్లు ప్రచారం చేసి టీడీపీ నేతలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. అదే జగన్ తన మానిఫెస్టోని సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టి అంతా దానిని ఫాలో అవ్వాలని ఆదేశించి కొత్త ట్రెండ్ సృష్టించారు. దీనిని చంద్రబాబు, లోకేశ్‌లు కాదనగలరా? దీనిపై వారు సమాధానం చెబితే బాగుంటుంది కదా! అందుకే బోత్ కెన్ నెవ్వర్ సేమ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అవుతుంది.అమరావతి రోడ్లు, భవనాల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని జగన్ అంకెలతో సహా కడిగి పారేశారు. దీనికి లోకేశ్ సమాధానం ఇవ్వలేకపోయారు. కాని మంత్రి అచ్చెన్నాయుడుతో మాత్రం... ‘‘ఆవును అమరావతిలో అయ్యే ఖర్చు వేరు..ఇతర ప్రాంతాలలో అయ్యే ఖర్చు వేరు రెండిటిని ఎలా పోల్చుతారు’’ అంటూ చిత్రమైన సమాధానం ఇచ్చారు. కానీ ఏ కారణాల వల్ల చదరపు అడుగుకు రూ.ఇరవై వేలకు పైగా వ్యయం అవుతోందన్నది వివరించలేకపోయారు. జగనేమో నిర్మాణాలలో ఏ కాంపొనెంట్‌కు ఎంత ఖర్చు చేస్తున్నది వివరిస్తూ వివరంగా మాట్లాడారు.చంద్రబాబు, లోకేశ్ తదితరులు వైసీపీని తరచు గొడ్డలి పార్టీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల తమకు ఏదో పరపతి పెరుగుతుందని, వైసీపీని ప్రజల్లో విలన్ మాదిరి చేసి చూపించవచ్చని తాపత్రయపడుతున్నారు. అయితే నిత్యం ఈ అబద్ధపు ప్రచారమే చేస్తూండటం సంస్కారయుతంగా అనిపించదు. అందుకే జగన్ దానికి బదులు ఇస్తూ టీడీపీపైన, చంద్రబాబు పైన వచ్చిన హత్యారాజకీయాల ఆరోపణల చిట్టాను చదివారు. వాటిలో ఒక్కోదానికి జవాబివ్వకుండా జగన్ తాతగారు రాజారెడ్డి హత్య తర్వాత నిందితులు హత్యకు గురయ్యారని, ఇళ్లు కూల్చారని ఏవేవో ఆరోపణలు చేశారు. వాటిలో నిజం ఉందా?చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి హత్య జరిగింది. హత్య చేసింది టీడీపీ వారు కాదని ఎన్నడైనా చంద్రబాబు చెప్పగలిగారా? రాజారెడ్డి హత్య జరగడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అయితే ఎదురు ఆరోపణలు చేయడం టీడీపీ ప్రత్యేకత. ఆ తర్వాత ఏమైనా అల్లర్లు జరిగి ఉంటే వాటిని నియంత్రించలేకపోవడం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతే అవుతుంది కదా? ఈ విషయాన్ని కప్పిపుచ్చి విమర్శలు చేస్తే ఏమి ప్రయోజనం? చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం గురించి జగన్ ప్రస్తావించారు. అందులో చంద్రబాబువి ఎలాంటి హింసా రాజకీయాలో వెల్లడించారు.దానికి ఇన్నేళ్లకు కూడా చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేదన్నది ప్రశ్న. అలాగే మాజీ ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి రంగా హత్యకు సంబంధించి మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన పుస్తకంలో చంద్రబాబు పాత్రపై రాసిన అంశంపై జగన్ నిలదీస్తే దాని గురించి నోరెత్తరు. కూటమి ప్రభుత్వం వచ్చాక వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యతో పలు అంశాలను జగన్ లేవనెత్తారు. అలాగే ప్రశ్నించే వారిపై, సోషల్ మీడియాపై కత్తికట్టి చంద్రబాబు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులపై కూడా జగన్ గట్టిగా మాట్లాడారు.వాటన్నిటికి టీడీపీ నుంచి వచ్చే జవాబు ఒకే మాట గొడ్డలి పార్టీ, వివేక హత్య కేసు, తల్లి, చెల్లి.. వివేక హత్య కేసులో జగన్ పై ఎలాంటి ఆరోపణలు లేవని సీబీఐ తేల్చినా వీరు మాత్రం తమ ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తుంటారు. ఆ హత్యలో పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి తరఫున టీడీపీ కేసులు ఎక్కువగా వాదించే సిద్ధార్థ లూధ్రా ఎలా న్యాయవాది అయ్యారన్న జగన్ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు.తమిళనాడులో విజయ్ గెలుపులో తన పాత్ర ఏమి ఉంటుందని చాలా హుందాగా జగన్ జవాబు ఇచ్చారు. విజయ్ ఒకచోట జగన్ ఫోటో పట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అమిత్ షాతో పవన్, నాదెండ్ల ల భేటీలో వచ్చిన అంశాలపై జగన్ వ్యూహాత్మకంగా జవాబిచ్చారు.అది జరిగిందా? లేదా? అన్నదాని జోలికి వెళ్లకుండా జగన్ గురించి జగన్ పాలన గురించి చంద్రబాబు గురించి, చంద్రబాబు పాలన గురించి, వ్యత్యాసం గురించి అమిత్ షాకు బాగానే తెలుసు అని వ్యాఖ్యానించి టీడీపీ, జనసేనలను డిఫెన్స్‌లో పడేసినట్లు అనిపించింది. జగన్ అప్పుడప్పుడో లేక నెలకోసారి ప్రెస్‌మీట్ పెట్టి వరసబెట్టి పలు అంశాలపై మాట్లాడి కూటమికి గుక్క తిప్పుకోనివ్వకుండా చేయగలుగుతున్నారన్నది మాత్రం నిజం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
గబ్బర్ సింగ్ పారిపోయావా..!
భానుడి భగభగలు, కార్మికుల నిరసనల మధ్య ప్రయాణం ఎందుకనుకున్నారో ఏమో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తన పర్యటనను సూర్యుడు రాక ముందే ప్రారంభించి చకచకా పూర్తి చేసుకున్నారు. సోమవారం గోదావరి పుష్కర పనుల పరిశీలనలో భాగంగా రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఉదయం 5.30 గంటలకు పుష్కరఘాట్ వద్దకు చేరుకుని బోట్లో అధికారులతో కలిసి కోటిలింగాల రేవు వద్దకు చేరుకున్నారు.బోట్లోనే అధికారులు ఆయనకు గోదావరి పుష్కర పనుల గురించి వివరించారు. పేపరుమిల్లు వల్ల జరుగుతున్న నదీ కాలుష్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తనదైన స్టైల్లో బోట్లో స్టిల్స్ ఇచ్చి కార్యక్రమాన్ని గంటన్నరలో పూర్తి చేశారు. కోటిలింగాల రేవు వద్ద నుంచి కొద్ది దూరంలో ఉన్న నల్లకాలువ మురుగునీటి శుద్ధి ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమం కూడా కొన్ని నిమిషాలలో ముగిసిపోవడం విశేషం. అక్కడి నుంచి నేరుగా కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్మికుల ధర్నా రెల్లి జాతి ఇష్టమని చెప్పి కార్మికులను చూసి పారిపోతావా? అంటూ మున్సిపల్ కార్మికులు తమ నిరసనను తెలియచేశారు. కాకినాడ ఎన్నికల సభలో రెల్లి జాతిలో పుట్టడం అంటే అదృష్టమని, నేను రెల్లి జాతిని దత్తత తీసుకుంటానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ తమను చూసి పారిపోయారని రెల్లి కార్మికులు ఆవేదన చెందారు. ఉప ముఖ్యమంత్రి పవన్ గోదావరి పుష్కరాల నేపథ్యంలో పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆయనను కలవడానికి ఉదయం 6 గంటల నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళనకారుల వద్దకు వచ్చి ‘మేము ఆయనను కలవనిస్తాం. మీరు జెండాలు తీసివేయాల’ని చెప్పడంతో కొద్దిసేపు ఆందోళన విరమించారు. మూడు గంటలపాటు అక్కడే నిరీక్షించగా పవన్‌కల్యాణ్ బయటకు రాగానే కార్మికులను చూస్తూ చెయ్యి ఊపుతూ వెళ్లిపోయారు. కనీసం వినతి పత్రం స్వీకరించకపోవడంతో మున్సిపల్ కార్మికులు గేటు వద్ద కూర్చుని ఆందోళన చేశారు. సుమారు గంటపాటు గేట్లు వేసి ఆందోళన చేపట్టారు. ‘గబ్బర్ సింగ్ పారిపోయావా, మా గోడు వినవా, మున్సిపల్ మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, జిందాబాద్ ఏఐటీయూసీ జిందాబాద్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం అదనపు కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు. కేవలం 1,200 మంది కార్మికులతో పుష్కరాల్లో పని చేయగలమా అని నిలదీశారు. ఆప్కాస్‌ను ఎత్తివేసే కుట్ర ఆపాలని, మరణించిన కుటుంబీకులకు ఆప్కాస్ ద్వారా జీతాలు ఇవ్వాలని కోరారు. చాలా సంవత్సరాలుగా రిక్షా కార్మికులు కేవలం రూ.9,000కు పని చేస్తున్నారని ఇప్పుడున్న ధరలతో ఆ వేతనంతో కుటుంబం జీవించగలదా అని ప్రశ్నించారు. రిక్షా కార్మికులను ఆప్కాస్‌లో కలిపి రూ.21 వేలు జీతం ఇవ్వాలన్నారు. లేకుంటే పుష్కరాల కంటే ముందుగానే సమ్మె చేస్తామని కార్మికులు హెచ్చరించారు ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. ఒక్క రోజు ముందే ఘాట్ల శుభ్రంపవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటనకు ఒక్క రోజు ముందు గోదావరి ఘాట్లలో ఉన్న చెత్త, చెదారాలను శుభ్రం చేశారు. ఘాట్ల వద్ద ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలిగించారు. నల్లా చానల్ వద్ద ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా ఘాట్ల వద్ద చెత్త, చెదారాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు వెయ్యకుండా మున్సిపల్ సిబ్బందిని కాపలాగా పెట్టారు. అయినా గోదావరి నదీ కాలుష్యాన్ని చూసిన పవన్ కల్యాణ్ ఆ«శ్చర్యపోయారు. ఈ వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా నీటిలో కలుస్తున్నాయో తెలుసుకుని నదీ జలాల్లో వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): -
ఇది పులివెందుల.. చావును వెతుక్కుంటూ రావొద్దు! ? YSRCP మాస్ వార్నింగ్
-
ఇద్దరి మధ్య గ్యాప్.. అందుకేనా విభేదాలు
-
సత్యానంద్ శిష్యుడిని అని గర్వంగా చెప్పుకుంటా: పవన్ కల్యాణ్
పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’ ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేశారు. తాజాగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బత్తుల మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాని సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్స్. నేను సత్యానంద్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పలేదు. ఒక వేళ నా నేను బాగా నటించకపోతే మీ పేరుకి ఎఫెక్ట్ అవుతుందని అనుకున్నాను. ఈ రోజు నా నటనకు మంచి పేరు వస్తోంది. అందుకే ఈ రోజు నేను సత్యానంద్ మాస్టర్ గారి శిష్యుడిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇదంతా వీరు గారి వల్లే సాధ్యమైంది. ప్రీమియర్ల నుంచీ మా సినిమాకి మంచి టాక్ వచ్చింది. మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. మూవీని చూసి నాలోని ప్లస్, మైనస్‌లు చెప్పండి. మైనస్‌లు చెబితే వాటిని నేను అధిగమించేందుకు ప్రయత్నిస్తాను. మా సినిమాని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. ఇంకా చూడనివారు మా మూవీని చూసి సపోర్ట్ చేస్తారని, మా కష్టాన్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాను ఇంతటి స్థాయికి తీసుకు వెళ్లిన మీడియాకి థాంక్స్. ముగ్గురు హీరోయిన్లు చక్కగా నటించారు. వీరు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. కెమెరామెన్ సతీష్ గారు మంచి వ్యక్తి. సప్తగిరి గారు, కసిరెడ్డి గారు అద్భుతంగా నటించారు. పవన్ కళ్యాణ్ బత్తులని హీరోగా పెట్టి సినిమా తీస్తామని నా కంటే కోటీశ్వరులు ఫోన్ చేసి చెప్పారు. నేనే ఇంకో రెండు చిత్రాలు చేస్తానని వారికి చెప్పాను. ఎక్కడా కొత్త అబ్బాయిలా అనిపించలేదు. మా అబ్బాయి యాక్టింగ్ నాకు నచ్చింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరు వులవల, నటులు కసిరెడ్డి రాజ్ కుమార్, విషిక, హాసిని సుధీర్, సంధ్య తదితరులు పాల్గొని మాట్లాడారు.


