హోంమంత్రి అనిత శాఖలో పవన్‌ కల్యాణ్‌ జోక్యం | Pawan Kalyan Interference In Home Minister Anitha Department | Sakshi
Sakshi News home page

హోంమంత్రి అనిత శాఖలో పవన్‌ కల్యాణ్‌ జోక్యం

Jul 3 2026 4:42 PM | Updated on Jul 3 2026 5:04 PM

Pawan Kalyan Interference In Home Minister Anitha Department

సాక్షి, విజయవాడ: ఏపీ మంత్రుల తీరు విడ్డూరంగా మారింది. హోంమంత్రి అనిత శాఖలో పవన్ కళ్యాణ్‌ జోక్యం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఈగల్ చీఫ్ రవికృష్ణ భేటీ అయ్యారు. రెండు రోజుల కిందటే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా కేసులు పెట్టించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇవాళ డిప్యూటీ సీఎంతో  ఐజీ రవికృష్ణ సమావేశమయ్యారు.

వేరే శాఖ మంత్రికి నివేదిక ఇవ్వడంపై పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. హోంమంత్రి అనితను డమ్మీని చేసేశారంటూ చర్చ నడుస్తోంది. ఇటీవలే హోంశాఖ తన దగ్గర లేదంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు తర్వాత సోషల్ మీడియా కేసుల కోసం వింగ్ ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ శాఖలో పవన్‌.. హోంశాఖ వింగ్ ఏర్పాటు చేశారు. మంత్రుల పంచాయితీపై అధికారుల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement