ఎమ్మెల్సీల ర్యాలీ.. ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత | Tension At AP Assembly Police Stop YSRCP MLCs Rally | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీల ర్యాలీ.. ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

Aug 18 2026 10:12 AM | Updated on Aug 18 2026 10:33 AM

Tension At AP Assembly Police Stop YSRCP MLCs Rally

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. 

సీబీఐ అక్రమాలపై విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేశ్‌రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఫ్లెక్సీలతో గేటు వద్ద నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకుని బారికేడ్లు అడ్డుపెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

అసెంబ్లీలో చర్చిస్తామన్న వాళ్లు.. కౌన్సిల్‌ నుంచి ఎందుకు పారిపోతున్నారు? అని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. డీఎస్సీ అంశంపై మండలిలో చర్చ జరపాల్సిందేనని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే.. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు భాగంగా ‘డీఎస్సీ అక్రమాలపై చర్చ’కు వైఎస్సార్‌సీపీ శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement