డీఎస్సీ అక్రమాల అంశంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వరుసగా రెండో రోజు హోరెత్తాయి. ఎమ్మెల్సీల నిరసనలతో శాసన మండలి దద్దరిల్లుతోంది.
AP అసెంబ్లీ సమావేశాల అప్‌డేట్స్
ముగిసిన బీఏసీ సమావేశం.. మండలి వాయిదా
- శాసన మండలి సమావేశాలు రేపటికి వాయిదా
- డీఎస్సీపై చర్చకు కూటమి ప్రభుత్వం తర్జన భర్జన
- చర్చకు సిద్ధమంటూనే.. డేట్, టైం ఫిక్స్ చేయని వైనం
- ఎల్‌నినో చర్చ తర్వాత డీఎస్సీ చర్చపై చర్చిస్తామంటున్న కూటమి
- ముందే చర్చించాలని పట్టుబడుతున్న వైఎస్సార్‌సీపీ
డిప్యూటీ చైర్మన్ పోస్ట్‌కి నామినేషన్ వేసిన తుమాటి
- శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్లు
- ఎన్నికల బరిలో వైఎస్సార్‌సీపీ
- నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు
- అసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్ దాఖలు
- పాల్గొన్న మండలి ప్రతిపక్ష నేత బొత్స, వైసీపీ ఎమ్మెల్సీ లు
కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం
మీడియా పాయింట్ వద్ద తోట త్రిమూర్తులు కామెంట్స్..
- డీఎస్సీపై చర్చ జరగాలని పట్టుబడుతుంటే లోకేష్ వెనక్కి వెళ్ళిపోయాడు..
- సభలో చర్చించి నోట్ ఇచ్చిన చప్పట్లు కొట్టుకొన్నారు..
- లోకేష్ చంద్రబాబు ని, చంద్రబాబు లోకేష్ ని సభలో పొగుడుకొన్నాడు.
- డీఎస్సీపై అక్రమాలపై ప్రశ్నించేది ఎవరు?
- మండలి లో మేము ప్రశ్నిస్తామని కూటమి నేతలు రావడం లేదు..
- డీఎస్సీ అక్రమాలపై జగన్ ఆధారాలతో బయట పెట్టారు..
- అవినీతి జరకపోతే చర్చించండి..
- 6నెలలకు అసెంబ్లీ జరపాలి కాబట్టి మామ అనిపిస్తున్నారు..
- రైతులు కష్టాలపై మేము ప్రశ్నిస్తున్నాం..
- ప్రజలకు చెప్పేది ఎమ్ లేక ప్రతిపక్షం లేని సభలో చప్పట్లు కొట్టుకొంటున్నారు..
- టీడీపీ నేతలు గ్రామాల్లో తిరిగిటే 10 మంది కూడా ఉండడం లేదు..
- ఆడబిడ్డ నిది ఎక్కడని మహిళలు, రైతు భరోసా కోసం రైతులు గ్రామాల్లో అడుగుతున్నారు..
- ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మొహం చాటస్తున్నారు..
- అమరావతి లో దాచుకు తింటున్నారు కాబట్టి అమరావతి గురించి మాట్లాడుతున్నారు..
మొండితోక అరున్ కామెంట్లు..
- DSC పై చర్చకి వాయిదా తీర్మానం ఇచ్చాం..
- గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వొచ్చారు.. Dsc పై చర్చిస్తరని ఆశించం.
- లోకేష్ కాదు.. లీకేష్ తన మంత్రులతో పారిపోయాడు.
- స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష లేదని అబద్ధం చెప్పావ్..
- పీవీ సింధూకి పరీక్ష నిర్వహించకుండా ఇచ్చామమని లోకేష్ చెప్పాడు.
- సరేగానీ చర్చిద్దాం అంటే లీకేష్ ముందుకు రావడం లేదు
- సత్యం రామలింగ రాజు మేనేజ్మెట్ కోటాలో చదివాడో అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా అలాగే జాబ్ లు ఇచ్చాడు..
- హోమ్ శాఖ ఏవిధంగా కేంద్ర గణాంకాలులో దిగజారిందో అలాగే విద్యా శాఖ కుడా దిగజారుతుంది..
- మూడేళ్లు లీకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటే విద్యాశాఖ ర్యాంక్ కూడా పడిపోతుంది..
- డీఎస్సీతో పాటు మా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీపైనా సీబీఐ విచారణ జరిపిద్దాం
- అవకతవకలు జరిగినట్లు కనిపిస్తోంది కాబట్టి లీకేష్ రాజీనామా చేయాలి..
- లీకేష్ మేనేజ్మెంట్ కోట కింద ఇచ్చిన 400స్పోర్ట్స్ కోట సీట్లు రద్దు చేయాలి..
- 4 రోజులు సభ పెడితే ప్రజా సమస్యలు ఎక్కడ చర్చకి వస్తాయి..
- లీకేష్ స్కామ్ పై జనసేన, బీజేపీ మాట్లాడాలి..
- వాళ్ల స్టాండ్ ఏంటో బీజేపీ, జనసేనలు చెప్పాలి..
- ప్రశ్నించానికి పార్టీ పెట్టానని చెప్పిన పవన్ ఈ లీకేజ్ పై లీకేష్ ని ప్రశ్నించాలి..
- బీఏసీ సమావేశంలో డీఎస్సీపై చర్చించాలని పట్టుబడుతున్నాం..
వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేక పోతున్నారు: మంచ నాగమల్లేశ్వరి
- కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మంచ నాగమల్లేశ్వరి ఫైర్
- అసెంబ్లీ వేదిక శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది.
- బొత్స సత్యనారాయణ పై మంత్రి అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు..
- మంత్రిగా విఫలమైన అచ్చెన్నాయుడు కంటే దద్దమ్మ మరొకరు లేరు.
- బొత్స సత్యనారాయణ కు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి.
- లేదంటే అచ్చెన్నాయుడు ఇంటిని ముట్టడిస్తాము..
- అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..
- బొత్సా సత్యనారాయణ కు లోకేష్ కు నక్కకు నాగలోకానికి ఉన్నత తేడా ఉంది.
- బొత్స సత్యనారాయణ విద్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మన రాష్ట్ర విద్యార్ధులు ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టారు..
- దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉందని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
- 540 మంది రైతులు కూటమి పాలనలో చనిపోయారు.
- వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేక పోతున్నారు.
నారా లోకేశ్‌కు వైఎస్ అవినాష్‌రెడ్డి సవాల్
- నారా లోకేశ్‌కు సవాల్ విసిరిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
- లోకేష్ తో చర్చకు మేము సిద్ధమని అభ్యర్థులే సవాల్ విసురుతున్నారు
- ముందు వాళ్ళకి సమాధానం చెప్పు లోకేష్..
- గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య విసిరిన సవాళ్లకు సమాధానం చెప్పు
- దుర్గయ్య నీతో చర్చకు సిద్ధం అంటున్నాడు..నువ్వు సిద్ధమా..?
- పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటా ఎంపిక చేసి..ఆ తర్వాత ఆ జీవో రద్దు చేశారు
- నిన్న అసెంబ్లీలో లోకేష్ ఇచ్చిన వివరణ ఆయన్ని నవ్వుల పాలు చేసింది
- అంతర్జాతీయ క్రీడాకారిణి పీవీ సింధుతో పోల్చడం చాలా దారుణం
- మీ కోన రవి, భరత్ ఇచిన సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందిన వారు..పీవీ సింధు ఒకటేనా...?
- నీతో చర్చకు జగన్ అవసరం లేదు...మా పేర్ని నాని వస్తున్నారు
- నీకు దమ్ముంటే పేర్ని నానితో చర్చకు సిద్ధమా..?
- చరిత్రలో ఎన్నడూ లేని అక్రమాలు చేసి..ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు
- కోర్టులో ఉన్న అభ్యర్ధుల కేసులే నీకు ప్రశ్నలు..వాటికి సమాధానం చెప్పు లోకేష్
- టెట్ సమస్యపై మాతో పాటు ఉపాధ్యాయులు కేంద్రమంత్రిని కలిస్తే వేధింపులా...?
- టీచర్లపై అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి...లేదంటే వారికి అండగా మేము ఉద్యమిస్తాం
డీఎస్సీపై విచారణ జరిపించాల్సిందే: వైఎస్సార్‌సీపీ
- శాసన మండలిలో దద్దరిల్లిన డీఎస్సీ నినాదాలు
- మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల నినాదాలు
- మండలిని కాసేపు వాయిదా వేసిన చైర్మన్
మరో రెండు రోజులు పొడిగించండి: బొత్స విజ్ఞప్తి
- నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- ఇవాళ రెండో రోజు కొనసాగుతున్న సమావేశాలు
- మండలి చైర్మన్‌కు విపక్ష నేత బొత్స విజ్ఞప్తి
- ఎల్‌నినోపై చర్చ అవసరం లేదా?
- ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెబుతోందే మేం
- అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగించండి
పయ్యావుల పక్కనే లోకేశ్
- అసెంబ్లీకి వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
- పయ్యావుల పక్కనే గప్‌చుప్‌గా కూర్చున్న లోకేశ్
- లోకేశ్ మౌనంగా కూర్చోవడంపై మండలిలో బొత్స అభ్యంతరం
- మండలిలో సమాధానం చెప్పాలంటూ నిలదీత
కౌన్సిల్ నుంచి ఎందుకు పారిపోతున్నారు?: బొత్స
- మేం డీఎస్సీ అంటే.. ఏపీపీఎస్సీలో ఏదో జరిగిందని అంటున్నారు.
- మా హయాంలో నిర్వహించిన గ్రూప్-1పై సీబీఐతో విచారణ చేయించుకోండి
- డీఎస్సీపై ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి కనిపించడం లేదు
- ప్రభుత్వం మండలిలో ఎందుకు మాట్లాడడం లేదు?
- శాసన సభలో చెప్పిన విషయాలేవో.. ఇక్కడ మండలిలో చెప్పాలి.. మేం అదే అడుగుతున్నాం
- ఒకవేళ అవినీతి జరిగితే.. అక్రమాలపై సీబీఐ విచారణ వేయాలి
- మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి
శాసన మండలిలో గందరగోళం
- డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టు
- చర్చ జరగాలంటూ వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
- తిరస్కరించిన మండలి చైర్మన్
- సభలో ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల నినాదాలతో మండలిలో గందరగోళం


