‘రావణ్‌పై మరో కేసు.. దాడికి జనసేన ప్లాన్‌?’ | Another Case Filed On Prashna Ravan In AP Police | Sakshi
Sakshi News home page

‘రావణ్‌పై మరో కేసు.. దాడికి జనసేన ప్లాన్‌?’

Jul 4 2026 7:02 AM | Updated on Jul 4 2026 8:37 AM

Another Case Filed On Prashna Ravan In AP Police

కృష్ణా జిల్లా: ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు బెయిల్‌ రాగానే మరో కేసు అంటూ పోలీసులు.. రావణ్‌ను అరెస్ట్‌ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి మచిలీపట్నంలో బెయిల్ రాగానే రావణ్‌ను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు రావణ్‌ను మళ్లీ అరెస్ట్‌ చేశారు. కేసు నమోదైనట్టు చెబుతూ మచిలీపట్నం నుంచి పాయకరావుపేటకు తరలించారు. ఇప్పటికి మూడు కేసుల్లో రావణ్‌కు బెయిల్‌ వచ్చినప్పటికీ కొత్త కేసులతో పోలీసులు అరెస్ట్‌ చేయడం గమనార్హం.

ఈ సందర్భంగా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతీ సందర్భంలో ఒక దాని వెంట మరో కేసు పెడుతున్నారు. బెయిల్ రాగానే పోలీసులు మరో స్టేషన్‌కు తీసుకెళుతున్నారు. రావణ్ నిజంగా తప్పు చేసుంటే చట్టప్రకారం అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. తప్పు చేశాడో లేదో తెలియదు బెయిల్ రాగానే అరెస్ట్ చేస్తున్నారు. జనసేనకు పట్టున్న ప్రాంతంలోని స్టేషన్‌కు తరలిస్తున్నారు. అక్కడ జనసేన కార్యకర్తలు వెంటాడి వేటాడి కొడుతున్నారు. ఇది మీకు హీరోయిజం కింద కనిపిస్తుందా?. గత ఐదేళ్లలో తాను మాట్లాడిన నీతి కబుర్లు పవన్‌కు గుర్తులేవా?.

పవన్ సుద్ధ పూస కబుర్లు చెబుతున్నాడు. కసబ్‌కి కూడా పదేళ్ల తర్వాతే ఉరిశిక్ష వేశారు. జనసేన కార్యకర్తలను అదుపు చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌కు లేదా?. అధికారంలో ఉన్నామని విర్రవీగితే ప్రజాస్వామ్యంలో తొక్కి నార తీస్తారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని సీఎం, డిప్యూటీ సీఎంను కోరుతున్నాను. 2029లో ప్రభుత్వం మారి ప్రతిపక్షంలోకి వెళితే తూర్పుకు తిరిగి దండం పెట్టడమే’ అంటూ హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement