breaking news
Ravan
-
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే: అంబటి
సాక్షి, తాడేపల్లి: పోర్టులు, భూములను తమ వారికి కట్టబెట్టటానికే చంద్రబాబు కేబినెట్ సమావేశమంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐదుగురు మంత్రులు గైర్హాజరయ్యారంటే ఎంత నాన్ సీరియస్‌గా జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేబినెట్ సమావేశంలో ప్రజలకు మేలు చేసే అంశాలపై చర్చించటం మానేశారంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘కేబినెట్‌కి డీజీపీ వెళ్లి సోషల్ మీడియా కట్టడిపై మాట్లాడటం ఏంటి?. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో మా పార్టీ నేతలను తిట్టిస్తున్నారు. జుగుప్సాకరంగా పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదు. కానీ మావారిపై అక్రమ కేసులు పెట్టి 1,394 మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియా అంటే చంద్రబాబు భయపడిపోతున్నారు. అందుకే టాస్క్ ఫోర్స్ కూడా పెడుతున్నారు. గాదె సాయికృష్ణను దారుణంగా లాకప్ డెత్ చేస్తే ఈ డీజీపీ ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ అంబటి ప్రశ్నించారు.‘‘క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?. ఇలాంటి వాటిపై కేబినెట్లో చర్చించరా?. ఉండవల్లిలో పోలీసు కానిస్టేబుల్ తల పగలకొట్టిన టీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసు పెట్టలేదు?. ఉత్తుత్తి కేబినెట్లు కాకుండా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ కేబినెట్‌కి ఎందుకు రావటం లేదు?. ఆ కారణాలు ఏంటో సీఎం, డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలి.’’ అని అంబటి నిలదీశారు.‘‘రావణ్‌కు అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తోందని ఉపా చట్టం ప్రయోగించారు. రావణ్ టీమ్‌లోని ఒక మహిళ జగన్‌ని కలిసి న్యాయ సహాయం కావాలని కోరారు. వైఎస్ జగన్ సరే అన్నారు.. అంతే తప్ప రావణ్‌కు మాకు ఎలాంటి సంబంధం లేదు. టీడీపీ కార్యకర్తలు అడిగినా న్యాయ సహాయం చేస్తాం. తీవ్ర వాదుల మీద పెట్టాల్సిన చట్టాన్ని అమాయకులపై పెట్టటం ఏంటి?. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
రావణ్‌పై ఉపా కేసు హేయమైన చర్య.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి
సాక్షి, విజయవాడ: రావణ్ పై ఉపా కేసు పెట్టడం అత్యంత హేయమైన చర్యని వైఎస్సార్సీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. రావణ్ తరపున వాదనలు వినిపించేందుకు కోర్టుకు వచ్చానని పీపీ రాకపోవడంతో కేసును కోర్టు మంగళవారానికి వాయిదా వేసిందని తెలిపారు. శుక్రవారం రావణ్ కేసు అంశమై ఆయన మీడియాతో మాట్లాడారు.పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.."రావణ్‌ను పోలీసులు 10 రోజులు కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ వేశారు. అక్రమ కేసులు బనాయించారు కాబట్టి అతనికి అండగా నిలుస్తున్నాం. రావణ్ కు వైసీపీ ఎటువంటి సంబంధం లేదు.రావణ్ పై ఉపా యాక్ట్ అంటే రాజహింస కాదా. పోలీసులు రావణ్ ఇంటికి వెళ్లి బియ్యం డబ్బాలు కూడా సోదాలు చేయడమేంటి. ఈ ప్రభుత్వం ఎవరినో మెప్పించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది.అని ప్రశ్నించారు.తాను సామాన్య లాయర్ ని కాబట్టి సామాన్యుల తరుపున వాదించడానికి వచ్చానని కోర్టు వాయిదా ప్రకారం మంగళవారం వచ్చి రావణ్ తరపున వాదిస్తానని పేర్కొన్నారు. కాగా ప్రశ్న రావణ్‌పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రావణ్‌పై ఇప్పటికే ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు . ఇక, తాజాగా రావణ్ నిర్వహిస్తున్న ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు లేఖ రాశారు.రావణ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాదాస్పద కంటెంట్ ప్రసారం చేస్తూ ప్రతి నెల సుమారు రూ.1.50 లక్షల ఆదాయం పొందుతున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఈ ఆదాయం వివరాలు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా బ్యాంక్ ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపారు.వివాదాస్పద వీడియోలను తొలగించాలని, ఛానల్‌ను నిలిపివేయాలని పోలీసులు మెటా సంస్థను కోరారు. దీనిపై స్పందించిన మెటా.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తామని, అయితే మొత్తం ఛానల్‌ను పూర్తిగా నిలిపివేయడం తమ పరిధిలో లేదని పోలీసులకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. -
రావణ్‌పై మరో కుట్ర.. ‘ప్రశ్న’పై సర్కార్ చర్యలు
సాక్షి, కాకినాడ: ప్రశ్న రావణ్‌పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రావణ్‌పై ఇప్పటికే ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా రావణ్ నిర్వహిస్తున్న ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు పోలీసులు లేఖ రాశారు.వివరాల మేరకు.. యూట్యూబర్ రావణ్ బ్యాంక్ ఖాతాలను సర్పవరం పోలీసులు ఫ్రీజ్ చేయించారు. అలాగే ఆయన నిర్వహిస్తున్న ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు పోలీసులు లేఖ రాశారు. రావణ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాదాస్పద కంటెంట్ ప్రసారం చేస్తూ ప్రతి నెల సుమారు రూ.1.50 లక్షల ఆదాయం పొందుతున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఈ ఆదాయం వివరాలు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా బ్యాంక్ ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపారు.వివాదాస్పద వీడియోలను తొలగించాలని, ఛానల్‌ను నిలిపివేయాలని పోలీసులు మెటా సంస్థను కోరారు. దీనిపై స్పందించిన మెటా.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తామని, అయితే మొత్తం ఛానల్‌ను పూర్తిగా నిలిపివేయడం తమ పరిధిలో లేదని పోలీసులకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం.అయితే, ఈ వ్యవహారం 2025లో పిఠాపురం నియోజకవర్గం యండమూరు గ్రామంలో దళిత విద్యార్థుల సామాజిక బహిష్కరణ ఆరోపణల ఘటన నేపథ్యంలో మొదలైనట్లు తెలుస్తోంది. ఆ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఖరిని ప్రశ్నిస్తూ రావణ్ వీడియోలు చేసినట్లు సమాచారం. అప్పట్లో రావణ్‌పై పిఠాపురం జనసేన ఫైవ్‌మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో జూలై 2న రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ప్రస్తుతం రావణ్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా కంటెంట్‌పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ప్రశ్న రావణ్‌పై ఉపా కేసును వెంటనే ఎత్తివేయాలి : పౌరహక్కుల సంఘం
ప్రజాస్వామిక వ్యవస్థలో బలమైన నాలుగు వ్యవస్థలున్న నేపథ్యంలో మూడు వ్యవస్థలు దిగజారిపోయి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నాయి. నాలుగవ స్తంభమైన పత్రికా స్వేచ్ఛ కనీసంగానైనా సోషల్ మీడియా పరంగా యూట్యూబ్‌లతో ప్రజల విశ్వాసంలో ఉన్నది. నేషనల్ మీడియా రాష్ట్రాల పత్రికలన్ని కూడా అధికార పార్టీల కనుసన్నల్లో వార్తను బంధీ చేసి ఉన్నాయి. గతంలో చేగువేరతో ప్రారంభమైన పవన్ కళ్యాణ్ ఎక్కడ తేలాడో మనందరికి తెలుసు. అతని మాటలకు, ఆచరణకు చాలా వ్యత్యాసం కనబడింది. చివరికి తాను మాట్లాడిన అప్రజాస్వామిక పదజాలాన్ని ప్రశ్నా రావణ్ అనుకరించడం నాలుగు పోలీస్ స్టేషన్లలో బెయిల్ తో విడుదలైన తరువాత ఐదవ పోలీస్ స్టేషన్లో అప్రజాస్వామిక నిర్బంధ చట్టమైన ఉపా చట్టంతో అతనిని నిర్బందానికి గురి చేశారు. గతంలో టాడా, పోటా, నేపథ్యాల నుంచే ఉపా చట్టం వచ్చిన తరువాత ఉపా ఎంతగా ప్రశ్నించే గొంతులపై అణచివేతను, నిర్బంధాన్ని అమలు చేస్తున్నదో 2018 భీమాకొరెగావ్ ఉపా కుట్ర కేసు నుంచి మనందరికి అర్థమవుతున్న విషయం. కేవలం బెయిల్ దొరకకుండా ఆ ప్రశ్నను, ఆ నిరసన గొంతును నిశ్శబ్దం చేయడం కోసం పాలక వర్గాలు అనుసరిస్తున్న బలమైన అణచివేత విధానంగా పౌర హక్కుల సంఘం భావిస్తున్నది. అందులో భాగంగానే 84 ఏండ్ల ఫాదర్ స్టాన్ స్వామి జార్ఖండ్ లోని ఆదివాసీల కోసం న్యాయ స్థానంలో చట్టపరంగా బలమైన పోరాటాలు నిర్వహించినందుకు ఆగ్రహించిన ప్రభుత్వం జైలులోనే హత్య చేసింది. అదే విధంగా 90 శాతం వికలాంగుడైన ప్రొ. సాయిబాబా కూడా ఆదివాసీల పక్షాన మాట్లాడినందుకు ప్రశ్నించినందుకు అక్రమ కేసులో అన్యాయమైన శిక్షతో 10 ఏండ్లపాటు జైలు నిర్బంధానికి గురి చేస్తే అతను కూడా మరణించడం జరిగింది. ఇలా పీడిత ప్రజల పక్షాన ఆదివాసీల పక్షాన అణగారిన వర్గాల పక్షాన నేడు బుద్ధిజీవులు మేధావులతో పాటు య్యూట్యూబర్లు కూడా తమ ఛానెళ్ళ ద్వారా ప్రజలకు ప్రశ్నించడం నేర్పుతున్నారు. ఆ నేర్పడంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అన్న మాటలను పునరుచ్చరణ చేసినందుకు అదే నేరంగా వరుసగా కేసులు నమోదు చేశారు. నమోదు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రశ్నారావణపై, న్యాయస్థానానికి తరలిస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో గోడలు దూకి మరీ ప్రశ్నారావణపై భౌతిక దాడికి జనసేన కార్యకర్తలు పాల్పడ్డారు. జనసైనికులు, చట్టవిరుద్ధంగా వ్యవహరించడ మంటేనే పవన్ కళ్యాణ్ బాధ్యతపడాల్సిన అవసరం ఉంది.అదే మాదిరిగా ఈ నెల ఒకటిన మరో జర్నలిస్టు కె. వి. ఆర్. ఇంటి మీద దాడి చేసి ఎపి పోలీసులు అమాంతంగా ఎత్తుకు పోయారు. పోలీసులకు హద్దులు పరిమితులు పని చేయవు. పేదలకు అన్యాయం జరిగినపుడు పోలీసు స్టేషన్ కెళితే మా పరిధి కాని హింసించిన ఉదాహరణలెన్నో ఉన్నాయి. కె.వి.ఆర్. ను ఎత్తుకు పోవడానికి ముందు మఫ్టీలో వున్న ఎపి పోలీసులు రెక్కి నిర్వహించారు. మీరెవరు నా భర్తను ఎందుకు తీసుకు పోతున్నారని అడుగితే, నేను కూడా నా భర్త వెంబడి వస్తానంటే ఆమెను లాగిపడేశారు. పైగా భాగ్యలక్ష్మీపై కూడా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. అరెస్టు చేస్తున్న సందర్భంలో కుటుంబీకులుకు తెలియజేసే చట్టబద్దమైన బాధ్యత పోలీసులపై వుంది. పోలీసులకు చట్టాన్ని బేఖాతరు చేయమని పాలకులు మౌఖిక ఆదేశాలిస్తున్నారు. ఈ అరెస్టులకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి.వాక్ సభా స్వాతంత్ర్యాలకు రాష్ట్రంలో తీవ్ర విఘాతం కలుగుతుంది. గొంతు విప్పి మాట్లాడితే నేరం అవుతుంది. అంత్యక్రియల్లో మాట్లాడిన గాదె ఇన్నయ్యను జైలుపాలు చేసి 8 నెలలుగా బెయిలు లేకుండా నిర్బంధించారు.ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అన్నీ వ్యవస్థలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది. అప్రజాస్వామిక విధానాలకు అలవాటు పడిన ప్రభుత్వాలు వ్యక్తులు పత్రికా స్వేచ్ఛను గౌరవించడం ఇబ్బందిగా ఫీలవుతారు. ఆ నేపథ్యంలోనే ప్రశ్నారావణపై చట్టపరంగా పోరాటం చేయాల్సిన స్థితి కాకుండా అక్రమ ఉపా కేసులు నమోదు చేసి భౌతిక దాడులకు పాల్పడడం అదే విధంగా కేసులు చేస్తున్న జడ శ్రావణపై కూడా కేసులు నమోదు చేస్తామని ప్రకటించడం లాంటివన్నీ కూడా ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యలుగా పౌరహక్కుల సంఘం భావిస్తూ ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి ప్రభుత్వాలలో పాలకులుగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు రాజకీయ పార్టీలే రాజ్యాంగాన్ని పాటించకపోతే ప్రజలు మాత్రం ఎందుకు పాటించాలనే ఒక మౌళిక ప్రశ్న బలల్దేరుతుంది. అది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నారావణ్ పై కూటమి ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా నమోదు చేసిన ఉపా కేసుతో పాటు అన్ని కేసులను బేషరతుగా ఎత్తివేసి అతన్ని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది.తెలంగాణలో కూడా గత కొద్ది నెలల క్రితం కొన్ని య్యూట్యూబ్ ఛానెల్‌లపై ఎన్.ఐ.ఎ. తరహా నిర్బంధాలు బలంగానే కొనసాగాయి. ఆ నిర్బంధాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు దీనికి సంబంధం లేనట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. కానీ శాంతి భద్రతలనేవి కేవలం రాష్ట్రానికి సంబంధించినదే, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తూ య్యూట్యూబ్ ఛానెల్‌ల పట్ల పత్రికల పట్ల ప్రజాస్వామ్యబద్ధమైన వైఖరితో తమ పాలన కొనసాగించాలి. కనిపించ కుండా నిర్బంధాన్ని కొనసాగిస్తున్న అన్ని పత్రికలపై య్యూట్యూబ్లపై ఆ నిర్బంధాన్ని ఉపసంహరించుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడగలిగితేనేకనీసంగానైనా ప్రజాస్వామ్యం నిలబడు తుంది. లేకపోతే నిర్బంధమే రాజ్యమేలుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుంది. అప్పుడు ప్రజల దగ్గరకి ప్రజాస్వామ్య విలువల కోసం వెళ్ళడానికి మీకు అవకాశం ఉండదు. కాబట్టి పత్రికలపై య్యూట్యూబ్ ఛానెళ్ళపై నమోదు చేసిన అన్ని అక్రమ కేసులను ఎత్తివేయాల్సిందిగా ప్రభుత్వాలను పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.పౌరహక్కుల సంఘం (CLC) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రొ. గడ్డం లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్. నారాయణ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బాల కృష్ణ, సహాయ కార్యదర్శి, -
‘ఏపీలో రూల్ ఆఫ్ లా కాదు.. రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాలేనని మండిపడ్డారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కాదు, రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా? అని నిలదీశారు. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు పాలనలో ప్రజలకు మిగిలింది బాధలు, ఏడుపులే. రైతులు, కార్మికులు, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాలకూ కష్టాలు తప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లింది. కూటమి కార్యకర్తలు, నాయకులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నా కేసులు పెట్టటం లేదు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరికీ రక్షణ లేదు. ప్రశ్నించే వారిపై ఉపా చట్టాలను ప్రయోగిస్తారా?. ఇంగిత జ్ఞానం లేని లోకేష్ చేతిలో రాష్ట్రాన్ని పెడతారా?. పోలీసులు లాకప్‌డెత్‌లు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి కమీషను గుంజుతున్నారు. లక్షల కోట్లు దోచుకుని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.రష్యాలో తప్ప అన్ని దేశాల్లోనూ చంద్రబాబు పెట్టుబడులు పెట్టారు.వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి రక్షణ లేదు. టిప్పర్‌తో ఢీ కొట్టి చంపాలని చూశారు. పైగా ఆయన మీదే కేసు పెట్టారు. సాయికృష్ణను హతమార్చి బూడిద కూడా ఇవ్వని దారుణం ఏపీలో నెలకొంది. పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రం నుండి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. కడప ఉక్కు ఫ్యాక్టరీని రెండేళ్ల పాటు ఆపారు. వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టులను చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. క్రెడిట్ చోరీ తప్ప చంద్రబాబు చేస్తున్నదేమీ లేదు. దావోస్ పర్యటనలకు వెళ్లి ఏ పరిశ్రమను తెచ్చారు?. రాష్ట్రంలో జనం భయం భయంగా బతుకుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
బాబును నమ్ముకుంటే జనసేన మునిగినట్టే!: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని మరోసారి స్పందించారు. ఈ కేసుతో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించిన ఆయన.. టీడీపీ, జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమ్మ కులానికి చెందిన రావణ్‌ను.. ఐడెంటిటీ మార్చి దళితుడిగా.. క్రిస్టియన్‌గా చూపించేందుకు టీడీపీ మీడియా, సోషల్ మీడియా తీవ్రంగా ప్రయత్నించిందటూ సంచలన వ్యాఖ్యలే చేశారాయన.రావణ్ పేరు రావణ్.. జోసఫ్ కాదు. అతను క్రిస్టియన్ కాదు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా అతడి ఐడెంటిటీని టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా మార్చేసింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని దళితుడిగా, క్రిస్టియన్‌గా చూపించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నించాయి అని అన్నారు. అరెస్ట్, బెయిల్‌పై ప్రశ్నలురావణ్ అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సెక్షన్లు చదివారు. అయితే జనసేన కార్యకర్తలు పెట్టిన కేసుల్లో బెయిల్ రావడానికి ఎవరు సహకరించారో చెప్పాలి. “జగన్ గానీ, మేము గానీ ఎవరికీ ఫోన్ చేసి బెయిల్ ఇప్పించమని చెప్పలేదు. చంద్రబాబు పాత్ర లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ ఇకనైనా స్టోరీలు ఆపాలని.. ఈ బురద మాపై జల్లవద్దని నాని హితవు పలికారు.అతని వీడియోలే అన్నీ చెబుతాయిరావణ్ గత వీడియోలను పరిశీలిస్తే అతను ఎవరికీ అనుకూలంగా ఉన్నారో అర్థమవుతుందని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిన్న సోషల్ మీడియా పోస్టులకే అరెస్టులు చేసే టీడీపీ ప్రభుత్వం.. రావణ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని కొడాలి నాని ప్రశ్నించారు. “మావోయిస్టులకు మద్దతుగా పోస్ట్ పెట్టారని ఏడాది తర్వాత కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏంటి? ఇంతకాలం గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా? టీడీపీ మద్దతు లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అంటూ పశ్నలు గుప్పించారు.జనసేనపై వ్యాఖ్యలుచంద్రబాబును నమ్ముకుంటే జనసేన మునిగిపోతుందని.. రావణ్ వ్యవహారమే అందుకు ఉదాహరణ అని అన్నారు.“పిఠాపురం పోలీస్ స్టేషన్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లడం లేదు. బిగ్‌బాస్ ఏం చెబితే పోలీసులు అదే చేస్తున్నారు. డిప్యూటీ సీఎం, డమ్మీ సీఎం పరిస్థితి ఇదే. యాక్టింగ్ సీఎం లోకేష్ మాటలే చెల్లుబాటు అవుతాయి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మతాల మధ్య చిచ్చు పెట్టొద్దుహిందూ, క్రిస్టియన్ వర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయని కొడాలి నాని అన్నారు. ఒకే కుటుంబంలో రెండు మతాలకు చెందిన వారు ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని చెప్పారు.ఆ మాటకు కట్టుబడి ఉన్నా2029 ఎన్నికల్లో పరుశురాముడి గొడ్డలితో జగన్, చంద్రబాబు ప్రభుత్వాన్ని, టీడీపీని రాజకీయంగా సమాధి చేస్తామని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఇచ్చే కట్టెలు కొట్టడానికి కూడా పనికిరాని తుప్పు గొడ్డలి మాకు అవసరం లేదు అంటూ కొడాలి నాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
రావణ్ పై దేశద్రోహం.. పవన్ చెప్పు చూపించిన రోజే!
-
రావణ్ అరెస్ట్‌పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి,కృష్ణ: రావణ్ అరెస్ట్‌పై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నరావణ్ టీడీపీ మద్దతుదారుడు. బాబు,లోకేష్, బాలకృష్ణలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. అందుకే టీడీపీ నేతల గురించి ఒక్క మాట కూడా మాట్లాడడు.రావణ్‌పై టీడీపీ నేతలు ఎక్కడా కేసు పెట్టలేదు. పవన్‌ను ప్రశ్నించాడనే రావణ్‌ను అరెస్ట్ చేశారు. ఎల్లోమీడియా వైఎస్సార్సీపీపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ అంటే నచ్చని వ్యక్తులను పోలీస్స్టేషన్లలో తగలబెట్టే బూడిద పార్టీ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజల నోరు నొక్కే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది’అని వ్యాఖ్యానించారు. -
రావణ్ పై రాజద్రోహం కేసు పెట్టడమేంటి.. పవన్‌కు రాచమల్లు వార్నింగ్
-
కూటమి సర్కార్‌పై ప్రకాష్‌రాజ్ మరో ట్వీట్
సాక్షి, అమరావతి: కూటమి సర్కార్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ప్రతీకార రాజకీయాలు ఆపాలన్న ప్రకాష్‌రాజ్.. ‘‘మాపై రుద్దబడుతున్న ఈ కఠినమైన ఉపా చట్టాన్ని తొలగించండి అంటూ ట్వీట్ చేశారు.కాగా, యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ప్రకాష్‌రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎక్స్ వేదికగా టీడీపీ కూటమి ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. ‘ఉపా చట్టం కింద ఓ యూట్యూబర్‌ను రిమాండ్‌కు పంపుతారా? ప్రశ్నించడం ఏమైనా దేశద్రోహమా?’ అంటూ నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ‘ఇంకా ఇంకా దిగజారండి..’ అంటూ ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు.మరో వైపు, విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కూటమి నేతల తీరును ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడే అందరి వెనుక వైఎస్సార్సీపీ ఉందంటారా? రేపొద్దున కూటమి పార్టీల మధ్య విభేదాలొస్తే దాని వెనుక కూడా వైఎస్సార్సీపీ ఉందని ఆరోపిస్తారా?’ అంటూ ఆయన మండిపడ్డారు.ఏపీలో ప్రభుత్వ నిర్ణయాలపై లేదా అధికార కూటమిపై విమర్శలు వినిపించిన ప్రతిసారీ వాటివెనుక వైఎస్సార్సీపీ ఉందని ఆరోపించడం కూటమి నేతలకు అలవాటైపోయింది. సామాజిక కార్యకర్తలు, మేధావులు, సినీ ప్రముఖులు లేదా సాధారణ ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, వారిని ప్రతిపక్షంతో ముడిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా సినీ నటుడు ప్రకాష్‌రాజ్ కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుంటే.. ఆయన వెనుక వైఎస్సార్సీపీ ఉందనే ప్రచారాన్ని కూటమి నేతలు చేస్తున్నారంటూ నాగేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Big Question Full : రాజద్రోహం అసలు ఎవరిది...?
-
ఉపా కేసు పెట్టాల్సింది పవన్ పైనే.. లైవ్ లో వీడియో చూపిస్తూ
-
పవన్‌కళ్యాణ్ నమ్మక ద్రోహం
గన్నవరం: అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసు విషయంలో న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె కృష్ణా జిల్లా గన్నవరంలో పవన్‌కళ్యాణ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో పలు బహిరంగ సభల్లో సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం గురించి పవన్‌కళ్యాణ్ ప్రస్తావించారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే తాము చేపట్టే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిదేనని కూడా ఆయన హామీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు ముగిసిపోయినా సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం బాధాకరమన్నారు. ఐదు రోజులుగా దాదాపు ఐదు వందల మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించి యూట్యూబర్ రావణ్‌ను అరెస్ట్ చేశారని, అందులో కనీసం పది శాతం శ్రద్ధ పెట్టినా తమ కుటుంబానికి న్యాయం జరిగి ఉండేదన్నారు. నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో, కర్నూలులో స్వేచ్ఛగా తమ కళ్ల ముందే తిరుగుతున్నారని వాపోయారు. ఎందుకీ వివక్ష? అని నిలదీశారు. సుగాలి ప్రీతి కేసులో ఆధారాలు తారుమారయ్యాయని ఏ ఆధారంతో పవన్ చెబుతున్నారని పార్వతి ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా మాట్లాడిన ఆయనపై ఎన్ని కేసులు పెట్టాలని నిలదీశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక దివ్యాంగురాలికి మాట ఇచ్చి మర్చిపోవడం చీటింగ్ కాదా? అని ప్రశ్నించారు. ముద్దాయిలకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ క్లీన్చిట్ ఇవ్వడం దుర్మార్గమన్నారు. చివరికి దివ్యాంగురాలైన తనను జనసేన నేతలు, వీర మహిళలతో బాడీ షేమింగ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఛాలెంజ్ చేసి చెప్తున్నా నీ పతనం స్టార్ట్.. జడ శ్రీవణ్ రియాక్షన్
-
నెల్లూరు జైలుకు ప్రశ్న రావణ్
సాక్షి, కృష్ణా జిల్లా: యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు గన్నవరం కోర్టు.. ఈ నెల 18 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది. రావణ్‌ను నెల్లూరు జైలుకు పోలీసులు తరలించారు. మరోసారి బెయిల్ రాకుండా ఉండేందుకు పోలీసులు.. రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఇప్పటికే నాలుగు కేసులో బెయిల్ రాగా, 5వ కేసులో కోర్టు రిమాండ్ విధించింది.డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో బెయిల్‌పై విడుదలైన ప్రశ్న రావణ్‌ను ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత సంస్థ సీపీఐ (మావోయిస్ట్) సిద్ధాంతాలను ప్రశ్న రావణ్ ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకుడు, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఫిర్యాదు మేరకు శనివారం సాయంత్రం కేసు నమోదు చేశారు.ఆ తరువాత గంటల వ్యవధిలోనే వేంపాడు టోల్గేట్ వద్ద రావణ్‌ను అదుపులోకి తీసుకుని తెల్లవారుజామున గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. రావణ్‌పై సెక్షన్ 147, 148, 152, 192, 197(1), (డీ), 353(1), (బీ), బీఎన్ఎస్ 13, 39 యూఏఏ వంటి దేశద్రోహం నేరాలను నమోదు చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ నిషేధిత సంస్థ సీపీఐ(మావోయిస్టు)కు మద్దతుగా, వారి తీవ్రవాద సిద్ధాంతాలతో వీడియోలను ప్రచారం చేస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.రావణ్‌ను గన్నవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించిన సందర్భంగా బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఈ కేసులో ఫిర్యాదుదారుడైన జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ అల్పాహారం, భోజనాలు సరఫరా చేయడం గమనార్హం. కాగా, దేశద్రోహం కేసులో రావణ్‌ను పోలీసులు ఆదివారం కృష్ణా జిల్లా గన్నవరం కోర్టులో హాజరుపర్చగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. రావణ్‌ను పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. -
నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను: రావణ్ భార్య సంచలన కామెంట్స్
విజయవాడ: యూట్యూబర్ రావణ్ భార్య అనూష కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్న సిద్ధాంతమే రావణ్దని ఆమె చెప్పారు. అంతేగానీ, ఏ ఒక్కరినీ కించపరచాలని, ఎవ్వరినీ నొప్పించాలన్న మనస్తత్వం కాదని తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ, వీడియో విడుదల చేశారు.‘‘యూట్యాబర్ రావణ్‌గా ప్రజలకు పరిచయమున్న నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ వీడియో కల్పిత వీడియో.. అది సృష్టించిన వీడియో, తమ తప్పులను సమర్థించుకునేందుకు, లేని వీడియోను సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కులాలు, మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి నా భర్త కులం కమ్మ కులం. నా భర్త పేరుకూడా అధికారికంగా రావణే. రావణ్ ఫలానా పార్టీ, ఫలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతోనూ సంబంధాలు లేవు. గొంతులేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ పార్టీ, అదే వర్గానికి చెందిన రావణ్. సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్న సిద్ధాంతమే రావణ్‌ది.. తప్ప ఏ ఒక్కరినీ కించపరచాలని, ఎవ్వరినీ నొప్పించాలని కాదు. ఒక ప్రజాస్వామ్య వాదిగా ప్రశ్నిస్తాడు. గట్టిగానే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడం అతని నైజం. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలు ఉంటే చెప్పాలి. లేదంటే, లోపాలను సరిదిద్దుకోవాలి. అంతేకానీ, ఇలా చట్టవ్యతిరేకంగా నడుచుకోవడం అన్యాయం. కేవలం ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన దారుణ ఘటనలనుంచి డైవర్ట్ చేయడానికే రావణ్ ను వేధించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక ప్రభుత్వంతో పోరాడేటంత బలం మాకు లేదు. కానీ, నిజాయితీ మాకు ఉంది. రేపు ఎవరు ప్రశ్నించినా ఇదే సంప్రదాయం అమలైతే, అది ఈ సమాజానికి మంచిదికాదు. ఈ దేశంలో న్యాయం కాస్త ఆలస్యమైన, న్యాయం తప్పక జరుగుతుందనే విశ్వాసం మాకు ఉంది. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల అపారమైన నమ్మకం మా కుటుంబానికి ఉంది. ప్రజలందరికీ మా కుటుంబం తరఫున ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాపై చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించవద్దు, నమ్మవద్దు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్‌కు అండగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. మమ్మల్ని చంపేయండి ‘‘ఇంత హరాస్ చేస్తున్నారు? మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన ముఖం అన్నా చూడండి. లేదా మా కుటుంబ సభ్యులు అందరం ఒకేసారి మం చచ్చిపోతాం. తప్పు అయితే చంపేయండి.. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడినే కాదు ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని చంపేయండి. ఇంతకుమించి మేమేమి చెప్పలేం’’ అని వీడియోలో చెప్పారు. -
రిలీజ్ మళ్లీ అరెస్ట్.. గన్నవరం పోలీస్ స్టేషన్ లో రావణ్
-
ఏపీ హైకోర్టులో రావణ్ పిటిషన్
సాక్షి,విజయవాడ: యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి, ఒకే చోట విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఒకే అంశాన్ని లేదా ఒకే ప్రసంగాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అక్రమంగా వరుస కంప్లైంట్లు నమోదు చేస్తున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.ఒక కేసులో కోర్టు నుండి బెయిల్ లభించగానే, వెంటనే మరో పాత కేసు పేరుతో పోలీసులు తనను అరెస్టు చేస్తూ అక్రమ నిర్బంధానికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ వరుస అరెస్టులను నిలువరించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.రావణ్‌పై ఏపీలో ఇప్పటివరకు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం, పాయకరావుపేట, మరియు గన్నవరం పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదు చేశారు. -
రావణ్‌పై రాజద్రోహం కేసు
సాక్షి, కృష్ణా: ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రావణ్‌పై కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతోంది. తాజాగా రావణ్‌పై గన్నవరం పోలీసు స్టేషన్లో జనసేన నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. యలమంచిలి కోర్టు నిన్న(శనివారం) రావణ్‌కు బెయిల్ మంజూరు చేసింది. కాగా, బెయిల్ వచ్చిన కాసేపటికే వేంపాడు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు రావణ్‌ను మళ్లీ అరెస్ట్ చేశారు. జనసేన నేత, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ నిన్న రావణ్‌పై గన్నవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. శివశంకర్ ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విశేషం.దీంతో, హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. అర్ధరాత్రి రావణ్‌ను గన్నవరం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు.. స్టేషన్ లోపలికి ఎవరిని అనుమతించన లేదు. అనంతరం, గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే, రావణ్‌ను మొదట ఏలూరు తీసుకువెళతారని ప్రచారం జరిగినప్పటికీ అర్ధరాత్రి గన్నవరం స్టేషన్‌కి తీసుకువచ్చారు. అయితే, శివశంకర్ ఫిర్యాదుతో రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద U/s 147,148,152,192,197(1)(d),353(1)(b) & Sec 13, 39 of Unlawful Activity Prevention Act 1967 (UAPA Act) కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దేశసార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సమగ్రతకు భంగం కలిగించేలా చర్యలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడటం, దేశద్రోహ పూరిత, తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన ఆరోపణల నేపధ్యంలో కేసు నమోదు చేశారు. -
యూట్యూబర్ ప్రశ్న రావణ్ సంచలన వీడియో
సాక్షి, అనకాపల్లి: యూట్యూబర్ ప్రశ్న రావణ్ సంచలన వీడియో చేశారు. ‘‘కూటమి ప్రభుత్వం నా గొంతు నొక్కుతుంది. మీరు చంపితే నేను ఒక్కడినే చచ్చిపోతా.. ప్రశ్నించే వారు చావరు.. మీరు రావణ్‌ను మాత్రమే చంపగలరు.. ప్రశ్నను చంపలేరు. ప్రతీరోజూ 500 మంది పోలీసులు.. ప్రజా సమస్యలు వదిలేసి నా కోసం పని చేస్తున్నారు. ఇంత భయపడుతున్నారా..?. ఎస్పీ క్యాడర్ నుంచి కానిస్టేబుల్ వరకూ అంతా నా కోసం పని చేస్తున్నారు. ఇదా ఏపీలో పరిస్థితి?’’ అంటూ రావణ్ ప్రశ్నించారు.కాగా, రావణ్‌పై పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓ కేసులో బెయిల్ వచ్చిన కాసేపటికే రావణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వేంపాడు టోల్‌ప్లాజా వద్ద రావణ్‌ను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ(శనివారం) రావణ్‌కు యలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. ఆపై కాసేపటికే మళ్లీ అరెస్ట్ చేశారు. వేంపాడు టోల్ ప్లాజా వద్ద రావణ్‌ను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావణ్‌పై పెట్టిన కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేయడం వరుసగా ఇది నాలుగోసారి. అయితే మళ్లీ రావణ్‌ను అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు అద్దం పడుతోంది. -
కక్ష సాధింపు.. మళ్లీ రావణ్ అరెస్ట్
అనకాపల్లి : ప్రశ్న యూట్యూబర్ రావణ్‌పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓ కేసులో బెయిల్ వచ్చిన కాసేపటికే రావణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వేంపాడు టోల్‌ప్లాజా వద్ద రావణ్‌ను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు రావణ్‌కు యలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేయగా, ఆపై కాసేపటికే మళ్లీ అరెస్ట్ చేశారు. తెలుగు యూట్యూబర్ రావణ్‌కు నేడు(శనివారం) యలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో రావణ్ రిమాండ్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. రావణ్‌పై పెట్టిన కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేయడం వరుసగా ఇది నాలుగోసారి. అయితే మళ్లీ రావణ్‌ను అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దూషించాడని ఆరోపిస్తూ రావణ్‌పై జనసేన నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. కోర్టుల్లో రావణ్‌కు వరుసగా బెయిల్ దక్కుతోంది. అయినప్పటికీ, మరో కేసు అంటూ రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. -
విడుదల తర్వాత ప్రశ్నరావణ్ బిగ్ స్టేట్మెంట్!
-
రావణ్ రిమాండ్‌ను తిరస్కరించిన న్యాయమూర్తి
అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు యూట్యూబర్ రావణ్‌కు ఎలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రావణ్ రిమాండ్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. వరుసగా కోర్టులు బెయిల్ మంజూరు చేయడం ఇది నాలుగోసారి. రావణ్‌పై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దూషించాడని ఆరోపిస్తూ రావణ్‌పై జనసేన నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. కోర్టుల్లో రావణ్‌కు వరుసగా బెయిల్ దక్కుతోంది. అయినప్పటికీ, మరో కేసు అంటూ రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు: జడ శ్రవణ్ రావణ్‌ను ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. రావణ్ మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండని అన్నారు. ‘‘మాకు సమయం వచ్చినప్పుడు మీ సంగతి తేలుస్తా. శంకరగిరి మాన్యాలు పట్టిస్తా. ప్రభుత్వ తీరును చూసి ప్రజలు ఛీ కొడుతున్నారు. కోర్టులు బెయిల్ ఇవ్వడమేంటి, పోలీసులు మళ్లీ అరెస్టులు చేయడమేంటి? రావణ్ తప్పేమీ మాట్లాడలేదు. పవన్ మాట్లాడిన మాటలను ప్రస్తావించారు. నన్ను లిల్లీపుట్, అరకోటు న్యాయవాది అంటూ విమర్శలు చేస్తున్నారు. 76 ఏళ్ల వ్యక్తి ఉన్న చంద్రబాబు ఈ విధమైన విమర్శలు చేయవచ్చా?’’ అని అన్నారు. -
రావణ్ ను చంపే కుట్ర.. ఆ ఎమ్మెల్యేకు బందరులో ఏం పని..
-
రెచ్చిపోయిన జనసేన నేతలు, రావణ్‌ను తరలిస్తున్న వాహనంపై చెప్పులతో దాడి
-
రావణ్ మద్దతుదారులపై.. కోడి గుడ్లతో అటాక్ జనసేన గూండాల దాడి
-
రావణ్ పై కుట్రప్లాన్ పవన్ ఆఫీసులోనే..!
-
ఎలాగైనా.. రావణ్ పై పవన్ మాస్టర్ స్కెచ్
-
రావణ్ ని మాకు అప్పగించండి.. నక్కపల్లి పోలీసు స్టేషన్ వద్ద జనసేన నేతలు హల్ చల్
-
ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు
-
రావణ్‌ను మాకు అప్పగించాలి.. జనసేన కార్యకర్తల ఓవరాక్షన్
సాక్షి, పాయకరావుపేట: ఏపీలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను టార్గెట్ చేసి దాడి చేయాలనే ఉద్దేశ్యంతో హల్చల్ చేస్తున్నారు. తాజాగా నక్కపల్లి పోలీసు స్టేషన్ వద్ద జనసేన కార్యకర్తలు గుమ్మిగూడి.. రావణ్‌ను తమకు అప్పగించాలని నినాదాలు చేస్తున్నారు.ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు కొనసాగుతోంది. రావణ్‌పై వరుస కేసుల్లో భాగంగా పోలీసులు.. నక్కపల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. దీంతో, జనసేన కార్యకర్తలు.. నక్కపల్లి పీఎస్ వద్దకు చేరుకుని అత్యుత్సాహం ప్రదర్శించారు. రావణ్‌ను తమకు అప్పగించాలని నినాదాలు చేశారు. రావణ్‌పై దాడి చేసేందుకు వారంతా కోడిగుడ్లతో అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. రావణ్ వ్యవహారంలో పోలీసుల పక్షపాత ధోరణి చూపిస్తున్నారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ ముందు జనసేన కార్యకర్తలు ఓవరాక్షన్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్‌ను ముట్టడించినా వారి వైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. కానీ, రావణ్ చూసేందుకు వచ్చిన వారిపై మాత్రం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రావణ్ మనుషులు పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారిని బలవంతంగా కారు ఎక్కించి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, రావణ్ మనుషులపై జనసేన శ్రేణులు బూతులతో రెచ్చిపోతున్నారు. అంతటితో ఆగకుండా రావణ్ మనుషులపై దాడికి ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం.. జనసేన నేతల వ్యవహార శైలిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. -
కార్యకర్తలా, గుండాలా..? ప్రశ్నిస్తే చంపేస్తారా.? ప్రకాష్ రాజ్ వైరల్ వీడియో
-
సాయికృష్ణ ను జైల్లో చంపినట్లే... ప్రశ్న రావణ్ ను కూడా చంపడానికి మాస్టర్ ప్లాన్..!
-
రావణ్ పై ఎన్ని కేసులైన పెట్టుకోండి.. బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది
-
బెయిల్ వచ్చిన వెంటనే ప్రశ్న రావణ్ మళ్ళీ అరెస్ట్...
-
రావణ్ అంటే పవన్ కు ఎందుకంత భయం..
-
‘రావణ్‌పై మరో కేసు.. దాడికి జనసేన ప్లాన్?’
కృష్ణా జిల్లా: ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు బెయిల్ రాగానే మరో కేసు అంటూ పోలీసులు.. రావణ్‌ను అరెస్ట్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి మచిలీపట్నంలో బెయిల్ రాగానే రావణ్‌ను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు రావణ్‌ను మళ్లీ అరెస్ట్ చేశారు. కేసు నమోదైనట్టు చెబుతూ మచిలీపట్నం నుంచి పాయకరావుపేటకు తరలించారు. ఇప్పటికి మూడు కేసుల్లో రావణ్‌కు బెయిల్ వచ్చినప్పటికీ కొత్త కేసులతో పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.ఈ సందర్భంగా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతీ సందర్భంలో ఒక దాని వెంట మరో కేసు పెడుతున్నారు. బెయిల్ రాగానే పోలీసులు మరో స్టేషన్‌కు తీసుకెళుతున్నారు. రావణ్ నిజంగా తప్పు చేసుంటే చట్టప్రకారం అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. తప్పు చేశాడో లేదో తెలియదు బెయిల్ రాగానే అరెస్ట్ చేస్తున్నారు. జనసేనకు పట్టున్న ప్రాంతంలోని స్టేషన్‌కు తరలిస్తున్నారు. అక్కడ జనసేన కార్యకర్తలు వెంటాడి వేటాడి కొడుతున్నారు. ఇది మీకు హీరోయిజం కింద కనిపిస్తుందా?. గత ఐదేళ్లలో తాను మాట్లాడిన నీతి కబుర్లు పవన్‌కు గుర్తులేవా?.మచిలీపట్నంలో రావణ్ కు బెయిల్.. మళ్లీ మరో కేసులో అరెస్ట్రావణ్ పై అనకాపల్లి జిల్లా పాయకాపురంలోకూడా కేసు నమోదవ్వగా అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు.వరుసగా 4 అరెస్ట్ లు మూడు బెయిల్ తో సాగుతున్న రావణ్ పరిస్థితి pic.twitter.com/88BW8b6dbd— greatandhra (@greatandhranews) July 3, 2026పవన్ సుద్ధ పూస కబుర్లు చెబుతున్నాడు. కసబ్‌కి కూడా పదేళ్ల తర్వాతే ఉరిశిక్ష వేశారు. జనసేన కార్యకర్తలను అదుపు చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌కు లేదా?. అధికారంలో ఉన్నామని విర్రవీగితే ప్రజాస్వామ్యంలో తొక్కి నార తీస్తారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని సీఎం, డిప్యూటీ సీఎంను కోరుతున్నాను. 2029లో ప్రభుత్వం మారి ప్రతిపక్షంలోకి వెళితే తూర్పుకు తిరిగి దండం పెట్టడమే’ అంటూ హెచ్చరించారు. -
పవన్ గుట్టు రట్టు.. రావణ్ పై దాడికి ప్లాన్.. జనసేన నేత ఆడియో లీక్
-
బారు గేట్లు తోసుకుంటూ రావణపై జనసేన నేతల దాడులు
-
చేతులెత్తేసిన పోలీసులు.. స్టేషన్లోకి దూసకెళ్లిన జనసేన కార్యకర్తలు
సాక్షి,కృష్ణా: మచిలీపట్నంలోని ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన జనసేన కార్యకర్తలు ఏకంగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి రావణ్‌పై దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని స్టేషన్ పైకే దూసుకొచ్చిన జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.సాధారణంగా పోలీస్ స్టేషన్ పై దాడి జరిగితే ఉక్కుపాదంతో అణచివేయాల్సిన ఖాకీలు, ఇక్కడ మాత్రం పూర్తిగా 'లైట్' తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టేషన్లోకి దూసుకెళ్లిన జనసేన కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోకుండా, పోలీసులు అత్యంత సున్నితంగా వ్యవహరించడం వెనుక అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.లాఠీఛార్జ్ చేయకుండా, కేవలం రోప్‌లతో సర్దిచెప్పే ప్రయత్నం చేయడం పోలీసుల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చింది.సొంత పార్టీ నేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారంలో ఉన్నారనే ధీమాతోనే కార్యకర్తలు ఇంతలా రెచ్చిపోయారని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసుల హెచ్చరికలను, బారికేడ్లను సైతం లెక్కచేయకుండా స్టేషన్ వైపు దూసుకొచ్చినా ఖాకీలు మౌనప్రేక్షకులుగా ఉండిపోవడం శాంతిభద్రతల క్షీణతకు అద్దం పడుతోంది. అధికార పక్షానికి చెందిన వారైతే చట్టం చుట్టంగా మారిపోతుందా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, ఆ ప్రాంతమంతా రణరంగంగా మారడానికి పోలీసుల అలసత్వమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పవన్ వస్తా.. నీ అంతు తెలుస్తా.. రావణ్ అరెస్ట్ పై సుగాలి పార్వతి రియాక్షన్..
-
ప్రశ్న రావణ్ పై దాడికి ప్లాన్.. జనసేన నేత సంచలన ఆడియో
-
రావణ్ అరెస్ట్.. ప్రశ్నిస్తే కేసులా పవన్?: సుగాలి ప్రీతి తల్లి
సాక్షి, కర్నూలు: ఏపీలో కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సుగాలి ప్రీతి కేసు, కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తే రావణ్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి తల్లి సుగాలీ పార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్ల అవుతున్నా సుగాలి ప్రీతి కేసు విషయంలో నిందితుల పట్ల అరెస్టు, విచారణ చేయడం లేదు. ముద్దాయిలు విచ్చలవిడిగా తిరుగుతున్నా.. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రీతి కేసులో రెండు సంవత్సరాలుగా డిప్యూటీ సీఎం పవన్‌కు లేఖలు రాస్తున్నాం. కానీ ఎటువంటి సమాధానం లేదు. ఈ కేసు విషయమై డిప్యూటీ సీఎం పవన్‌ను ప్రశ్నించిన రావణ్‌పై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు.త్వరలో సుగాలి ప్రీతికి న్యాయం కోసం పవన్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి పోరాటం చేస్తాం.. ప్రశ్నిస్తాం. రావణ్‌పై అక్రమ కేసులు పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ ఎందుకు చూపించడం లేదు. ఎందుకు చొరవ తీసుకోవడం లేదు. అక్రమ అరెస్ట్, నిర్బంధంపై రావణ్‌కు మేము అండగా ఉంటాం. రావణ్‌కు ఎటువంటి హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. -
ప్రశ్న రావణ్ పై మచిలీపట్నం PS లో మరో కేసు.. మీ పోలీసులకు శతకోటి వందనాలయ్య
-
ప్రశ్న రావణ్ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ రియాక్షన్
-
‘రావణ్ ఒంటిపై ఒక్క దెబ్బైనా పడాల్సిందే’
సాక్షి,కృష్ణ : మచిలీపట్నం ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యూట్యూబర్ రావణ్‌ను ఎలాగైనా సరే వదిలిపెట్టేది లేదంటూ జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వ్యూహాలు పన్నుతున్నాయి. ‘రావణ్ ఒంటిపై ఒక్క దెబ్బైనా పడాల్సిందే..’ అంటూ జనసేన అంతర్గత వాట్సాప్ గ్రూపుల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మెసేజ్‌లు పంపుకుంటున్నారు. దీనికి సంబంధించిన జనసేన కీలక నేతల ఆడియో సంభాషణలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. పోలీసు కస్టడీలో ఉన్న రావణ్‌ను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన నేతలు ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా రెక్కీ నిర్వహించారు. పోలీసులు రావణ్‌ను బయటకు తీసుకువచ్చే సమయంలోనే అతనిపై భౌతిక దాడికి పాల్పడాలనే లక్ష్యంతో జనసేన కార్యకర్తలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సార్పవరం పీఎస్, కాకినాడ కోర్టు వద్ద గురువారం జరిగిన ఉదంతాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈసారి మరింత అప్రమత్తమయ్యారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు రావణ్‌పై దాడి జరగకుండా ఇనగుదురు పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పీఎస్ ప్రధాన గేట్లను సైతం మూసివేసి ఆంక్షలు విధించారు.ప్రస్తుతం ఇనగుదురు పోలీస్ స్టేషన్ ఆవరణ, చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది. -
బెయిల్.. అరెస్ట్.. రిపీట్
తెలుగు యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. పవన్ కల్యాణ్‌ను దూషించాడని ఆరోపిస్తూ జనసేన నేతలు వరుస ఫిర్యాదులు చేస్తుండడంతో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కోర్టులు వరుసగా అతనికి బెయిల్ ఇస్తుండగా.. ఒక్కో కేసును తెర మీదకు తెస్తూ నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేస్తుండడం గమనార్హం. ఈ పరిణామంపై రాజకీయ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సర్పవరం పీఎస్ కేసులో.. యూట్యూబర్ రావణ్‌కు గురువారం రాత్రి కాకినాడ మొబైల్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్‌పై బయటికొచ్చిన రావణ్‌ను కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుడివాడ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తరలించారు. అంతకు ముందు.. బుధవారం రాత్రి కూడా ఇదే తరహా సీన్ రిపీట్ అయ్యింది. కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేయగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. రావణ్ ఏ తప్పు చేయలేదని.. ప్రశ్నించడమే అతను చేసిన నేరమా? అని కొందరు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.ఈ పరిణామాలపై రావణ్ తరఫున వాదనలు వినిపిస్తున్న జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ భగ్గుమన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి “అంతిమ దినం”లా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమల్లో ఉన్నా, దాని అమలుపై మరోసారి ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.పిఠాపురం మెజిస్ట్రేట్ వాదనలు విని రావణ్‌కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కేవలం ఐదు నిమిషాల్లోనే సర్పవరం పోలీస్ స్టేషన్లో మరో కేసు చూపిస్తూ మళ్లీ అరెస్ట్ చేయడం ఆందోళనకరమని ఆయన అన్నారు. కనీస సమాచారం కూడా కుటుంబానికి ఇవ్వకుండా అరెస్ట్ చేసి కాకినాడ కోర్టులో హాజరుపరిచారని ఆరోపించారు. మూడు గంటల పాటు వాదనలు విన్న తర్వాత కాకినాడ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని.. ఇది ప్రజాస్వామ్యంలో రెండవ విజయం అని ఆయన అభివర్ణించారు. అయితే బెయిల్ వచ్చినప్పటికీ మళ్లీ ఇతర కేసుల్లో అదుపులోకి తీసుకోవడం అన్యాయమని అన్నారు. రావణ్‌పై జరుగుతున్న చర్యలు రాజకీయ కక్షసాధింపుగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నాయకులను గౌరవించాల్సిన అవసరం లేదని, చట్టాలు, రాజ్యాంగం శాశ్వతమని పోలీసులు గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 కేసులు నమోదైనట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో జర్నలిస్టుల సంఘాలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై స్పందించకపోవడం పట్ల ఆయన ప్రశ్నించారు.రావణ్ ప్రయాణిస్తున్న వాహనంపై జనసేన శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశాయని.. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వ పెద్దలు ఖండించాలా? లేదా? అని ప్రశ్నించారు. తాను కూడా అవసరమైతే మళ్లీ మచిలీపట్నం వెళ్లి వాదనలు వినిపిస్తానని, ప్రభుత్వ చర్యలపై చివరివరకు పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని పేర్కొన్నారు.“నన్ను జైలుకు పంపితే అది ప్రభుత్వానికి ఎదురుదెబ్బలా మారుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను వెనక్కి తగ్గబోనని జడ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. -
ప్రశ్న రావణ్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు.. పవన్ కు బిగ్ షాక్
-
జనసేన నాయకులు ఓవర్ యాక్షన్.. ప్రశ్న రావణ్ పై కోడిగుడ్లతో దాడి...
-
పోలీస్ వాహనంలో రావణ్ తరలింపు.. కోడిగుడ్లతో జనసేన శ్రేణుల దాడి!
సాక్షి,కాకినాడ: స్థానిక సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. రావణ్‌ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని జనసేన శ్రేణులు ఒక్కసారిగా అడ్డుకున్నారు.పోలీసుల వాహనం ముందుకు కదలకుండా అడ్డుకోవడమే కాకుండా, ఆగ్రహంతో ఆ వాహనంపై కోడిగుడ్లతో దాడికి దిగారు. దీంతో సర్పవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
పిఠాపురం టూ సర్పవరం.. ఇలా బెయిల్.. అలా అరెస్ట్..
-
రావణ్ కి ఏమి జరిగినా పవన్ దే బాధ్యత..
-
టైమ్ మీది కొట్టారు.. టైమ్ మాకు వస్తది మేము కొడితే ఈ ప్రభుత్వానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడతాది
-
‘రావణ్‌కు ఏం జరిగినా పవన్‌దే బాధ్యత’
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రశ్న రావణ్‌కు పిఠాపురం మెజిస్ట్రేట్ వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే ఆయనను పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేశారు. 2025లో నమోదైన మరో కేసుకు సంబంధించి సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకుని పిఠాపురం నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ..‘రావణ్ కేసులో న్యాయం గెలిచిన రోజు ఇది. సోషల్ మీడియా కేసుల్లో ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరైంది కాదని భావించిన మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. అయితే బెయిల్‌పై విడుదలైన వెంటనే మరో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజ్యాంగబద్ధం కాదు. ఇది వ్యక్తిగత ప్రాథమిక హక్కులను హరించడమేనని అవుతుంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామ కృష్ణంరాజు నా బాడీ షేమింగ్ చేస్తూ అహేళనగా మాట్లాడారు.. దానికి చట్టం లేదు?. కాళ్లకు కాళ్ళు.. కీళ్లకు కీళ్లు విరగొడతామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను నా కొడకల్లారా అని పవన్ కళ్యాణ్ మాట్లాడితే అది రాజ్యాంగబద్దమా?.పంతం నానాజీ మాజీ ముఖ్యమంత్రిని దుర్భాషలాడితే న్యాయబద్దమా? వాటిమీద కేసులు ఉండవా?. రఘురామ కృష్ణంరాజుకు రాజకీయ సమాధి కడతానంటే తప్పా? నా మీద కేసు కడతారా?. మీ కేసులకు భయపడేది లేదు. టైమ్ మీది కొట్టారు.. టైమ్ మాకు వస్తుంది. మేము కొడితే ఈ ప్రభుత్వానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడటం ఖాయం. రావణ్ కోసం మళ్ళీ రేపు కోర్టులో వాదనలు వినిపిస్తా. రావణ్‌కు ఏం జరిగినా ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలి. సోషల్ మీడియా కేసుల్లో ముందుగా టీడీపీ, జనసేన నేతలను కంట్రోల్ చెయ్యమని సీఎం, డిప్యూటీ సీఎంను కోరుతున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అంతకంటే ముందు పిఠాపురం పోలీసులకు షాక్ తగిలింది. ప్రశ్న రావణ్ రిమాండ్‌ను మెజిస్ట్రేట్ రిజెక్ట్ చేశారు. దీంతో, వ్యక్తిగత పూచికతుపై రావణ్ విడుదలయ్యారు. ఈ క్రమంలో రావణ్ తరపున వాదనలు జడ శ్రవణ్ కుమార్ వినిపించారు. అనంతరం, విడుదలైన వెంటనే పోలీసులు.. 2025లో నమోదైన మరో కేసుకు సంబంధించి సర్పవరం పోలీసులు రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
ప్రశ్న రావణ్ పై కక్ష సాధింపు.. విడుదల అయిన వెంటనే మళ్ళీ...
-
అరెస్టులతో వెంట్రుక కూడా పీకలేవ్ ఈడ్చి తంతే హైదరాబాద్ లో పడతావ్ జాగ్రత్త
-
పాపాలు చేస్తే శాపాలు తప్పవా? రావణ వృత్తాంతం ఏం చెబుతోంది?
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవ రం రూరల్): ‘ఇతరులను హేళన చేస్తే పరాభవం తప్పదు. అధర్మవర్తనంతో తపోబలం క్షీణిస్తుంది. పాపాలు చేస్తే శాపాలు తప్పవు’ అని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నా రు. ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యాన స్థానిక టి.నగర్‌లోని హిందూ సమాజంలో ఉత్తరకాండపై మూడో రోజు ప్రవచనాన్ని ఆయన కొనసాగించారు. ‘నీది వానరముఖం అని నందీశ్వరుడిని హేళన చేసిన రావణునికి వానరుల చేతిలో పరాభవం తప్పదన్న శాపం ఎదురైంది. వేదవతిని పరాభవించినప్పుడు ఆమె మరుసటి జన్మలో అయోనిజగా జన్మించి, సపరివారంగా రావణుడు నశించడానికి కారకురాలినవుతానని శపించింది. ఇక్ష్వాకువంశానికి చెందిన రాజు అనరణ్యుడు.. రావణుని చేతిలో పరాజితుడై, మా వంశంలో జన్మించే శ్రీరాముని చేతిలో నీవు మరణిస్తావని శపించాడు. రావణుని చేతిలో బందీలుగా చిక్కిన ఎందరో దేవకాంతలు, ఋషి కన్యలు, మానవకాంతల కన్నీరే రావణుని పాలిట పెనుశాపంగా మారింది’ అని సామ వేదం అన్నారు. ధర్మాచరణతో అల్పాయుష్కుడు కూడా దీర్ఘాయువు పొందగలడని, దీనికి విలోమంగా దీర్ఘాయువు వరంగా గలవాడు కూడా పాపకృత్యాలతో అల్పాయుష్కుడు కాగలడని చెప్పారు.‘కైలాసగిరిని పెకలించబోయి భంగపాటుకు గురైన రావణుడు పెద్దగా రోదించినప్పుడు, దయాళువు అయిన పరమ శివుడు అతనికి విడుదల ప్రసాదించి, ఇక నుంచి నీవు రావణుడిగా పేరు పొందుతావని అన్నాడు. అప్పటి నుంచీ రావణ శబ్దం వ్యాప్తిలోకి వచ్చింది. రామ అనే శబ్దానికి అందరికీ ఆనందాన్ని కలిగించేదని అర్థమైతే, రావణ శబ్దానికి అందరినీ ఏడిపించడం అనే అర్థం ఉంది’ అని వివరించారు. వేదవతి తామర పూవులో శిశువుగా ఉద్భవించడం, రావణుడు ఆ శిశువును సముద్రంలో పడవేయడం ప్రాచీన రామాయణ ప్రతుల్లో లేదని, ఇది ప్రక్షిప్తమని చెప్పారు. కృతయుగాంతంలో వేదవతిని పరాభవించిన రావణుడు త్రేతాయుగంలో శ్రీరాముని చేతిలో మరణించాడంటే.. ఆయన ఎప్పటివాడో మనం ఊహించుకోవచ్చునని సామవేదం అన్నారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు స్వాగత వచనాలు పలికారు. -
రాకీ భాయ్ కాదు.. రావణ్ భాయ్..!
-
ఆయన నుంచి ఫోన్ వస్తే చాలు.. చేయి కోసుకోవడానికైనా రెడీ: హీరోయిన్
హీరోహీరోయిన్లుకు కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. పలానా పాత్ర చేయాలని.. అలాంటి సినిమాల్లో నటించాలని అనుకుంటారు. అంతేకాదు కొంతమంది దర్శకులతో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. వారి సినిమాల్లో నటించే అవకాశం వస్తే చాలు.. చిన్న పాత్ర అయినా సరే చేసేందుకు రెడీ అవుతారు. అలా ఓ దర్శకుడి సినిమాలో నటించే అవకాశం వస్తే చాలు అన్ని వదిలేసి ఆయన మూవీ కోసం ఎదురు చూస్తాను అంటోంది సీనియర్ నటి ప్రియమణి(Priyamani ). అంతేకాదు ఆయన సినిమాలో నటించేందుకు చేసు కూడా కోసుకుంటాను అని చెబుతోంది. ఇంతకీ ఆ గొప్ప దర్శకుడు ఎవరంటే..?ఫోన్ వస్తే చాలు.. దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ ప్రస్తావన వస్తే.. అందులో కచ్చితంగా మణిరత్నం(Mani Ratnam) పేరు ఉంటుంది. సౌత్ సినిమా దశాదిశను మార్చేసిన అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన తెరకెక్కించిన గీతాంజలి, నాయకుడు, అంజలి, రోజా, బొంబాయి, సఖి ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే మాస్టర్ క్లాసిక్ మూవీస్. ఆయనతో ఒక్క సినిమా చేసిన చాలు అనుకునే హీరోహీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లకు మణిరత్నం ఫేవరేట్ డైరెక్టర్. వారిని తెరపై అందంగా, డిఫరెంట్‌గా చూపించే డైరెక్టర్ ఆయన. అందుకే ఆయన సినిమాలో చాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా వదులుకోదు. కమిట్ అయిన సినిమాలను వదిలేసి మరీ.. మణిరత్నం సినిమాల్లో నటిస్తారు. ప్రియమణికి కూడా మణిరత్నం అంటే చాలా ఇష్టం. తాజగా ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం గురించి మాట్లాడుతూ.. ‘మణి సార్ నుండి ఫోన్ రాగానే నేను ఆయన సినిమాలో నటించడానికి చేయి కోసుకుంటా అన్నట్టు సిద్ధంగా ఉంటాను. ఆయన సినిమాలో నటించడమే గొప్ప అదృష్టం. ఆయన చేసిన సినిమాలు, ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ చూస్తే ఎలాగైనా ఆయన సినిమాలో నటించాలనే కోరిక పుడుతుంది. అది ఎలాంటి పాత్ర అయినా సరే ’’ అని చెప్పుకొచ్చింది ప్రియమణి. గతంలో మణిరత్నం తెరకెక్కించిన రావన్ సినిమాలో ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే.బాలీవుడ్లో బిజీ బిజీఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ప్రియమణి.. పెళ్లి తర్వాత చిత్రపరిశ్రమకు కాస్త గ్యాప్ ఇచ్చింది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి..సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తోంది. సినిమాలతో పాటు పలు టీవీ షోలు, వెబ్ సిరీస్ చేస్తూ అటు వెండితెర, ఇటు బుల్లితెరను ఏలేస్తోంది. ఆ మధ్య బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది.ప్రస్తుతం హిందీలో ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది ప్రియమణి. ఇప్పటికే ఈ సిరీస్ సక్సెస్‌ఫుల్‌గా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కూడా త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ హీరోగా నటిస్తుండగా తన భార్య పాత్రలో ప్రియమణి కనిపించనుంది. -
అగస్త్యుడి చేతిలో రావణుడి ఓటమి
మేరు పర్వతంతో స్పర్థకు పోయిన వింధ్య పర్వతం ఆకాశాన్ని కమ్మేస్తూ పెరిగిపోవడంతో గ్రహగతులు తప్పి, ముల్లోకాల్లోనూ కల్లోలం ఏర్పడింది. దేవతలందరూ ప్రార్థించడంతో అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి వింధ్య పర్వతం వైపుగా దక్షిణదేశ యాత్రకు బయలుదేరాడు. అగస్త్యుడు భార్యా సమేతంగా తనవైపు వస్తుండటంతో వింధ్యుడు ఆయన ముందు మోకరిల్లాడు. తాను దక్షిణదేశ యాత్రలకు వెళుతున్నానని, తాను తిరిగి వచ్చేంత వరకు అలాగే ఉండమని వింధ్యుణ్ణి ఆదేశించాడు. అలా వింధ్యుడిని అణచిన అగస్త్యుడు దక్షిణ భారత దేశంలోని తీర్థక్షేత్రాలన్నింటినీ దర్శించుకున్నాడు. తీర్థయాత్రలు ముగిశాక ఆయన కావేరీ తీరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, భార్యా సమేతంగా తపోజీవనం గడపసాగాడు.దక్షిణ భారత దేశానికి ఆవల సముద్రం నడిబొడ్డున ఉన్న లంకను అప్పట్లో రావణుడు పరిపాలించేవాడు. తన అన్న కుబేరుడిని అలకాపురి వరకు తరిమికొట్టి, అప్పటి వరకు అతడు పాలించిన లంకను, అతడి పుష్పక విమానాన్ని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత రావణుడు దేవతలను జయించాడు. అష్ట దిక్పాలకులను తన ఆజ్ఞలకు లోబడేలా చేసుకున్నాడు. నవగ్రహాలను తన అదుపులోకి తెచ్చుకున్నాడు. అయితే, లంకకు చేరువలో ఉన్న దక్షిణ భారతదేశం మాత్రం అతడికి స్వాధీనం కాలేదు. ఆ ప్రాంతాన్ని కూడా ఎలాగైనా తన వశంలోకి తెచ్చుకోవాలని తలచాడు.దక్షిణ భారతదేశంలో పరిస్థితులు ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకుని రావాలని ముందుగా కొందరు దూతలను, వేగులను పంపాడు. వారు దక్షిణ భారతదేశం నలుమూలలా సంచరించారు. కొండలు, కోనలు, అడవులతో పచ్చని ప్రకృతి సౌందర్యంతో అలరారే దక్షిణ భారతదేశం అత్యంత ప్రశాంతంగా కనిపించింది. అడవుల్లో అక్కడక్కడా చక్కని పొదరిళ్లలాంటి రుషి ఆశ్రమాలు కనిపించాయి. వారు తిరిగి లంకకు చేరుకుని, తాము చూసిన పరిస్థితులను రావణుడికి వివరించారు.అంత ప్రశాంతంగా ఉన్న దక్షిణ భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవడం తేలిక పనేనని అనుకున్నాడు. తాను కూడా ఒకసారి స్వయంగా పరిస్థితులను చూసి, అవసరమైనట్లయితే యుద్ధానికి తగిన ఏర్పాట్లతో తిరిగి వచ్చి, దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు.కొద్దిమంది అనచరులతో కలసి రావణుడు దక్షిణ భారతదేశానికి వచ్చాడు. కావేరీ తీరం మీదుగా సంచరిస్తూ, అగస్త్యుడి ఆశ్రమం వద్దకు చేరుకున్నాడు. ఆశ్రమం ఆవరణలోనే అగస్త్యుడు కూర్చుని ఉండటం చూసి, రావణుడు ‘మునీశ్వరా! ప్రణామాలు’ అంటూ నమస్కరించాడు.అగస్త్యుడు సాదరంగా స్వాగతం పలుకుతూ, ‘రావయ్యా లంకేశ్వరా! రా! లోపలికి పద’ అంటూ ఆశ్రమం లోనికి తీసుకుపోయి, ఉచితాసనంపై కూర్చోబెట్టాడు. కుశల ప్రశ్నలయ్యాక, ‘ఏం పని మీద ఇక్కడకు వచ్చావు?’ అని నేరుగా అడిగాడు అగస్త్యుడు.‘మునీశ్వరా! ఇప్పటికే నేను స్వర్గాన్ని కూడా నా అధీనంలోకి తెచ్చుకున్నాను. ఈ ప్రాంతం మాత్రం ఇంకా నా స్వాధీనంలో లేదు. దీనిని కూడా నా స్వాధీనంలోకి తెచ్చుకుందామనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను’ అని అసలు విషయాన్ని చెప్పేశాడు రావణుడు.‘అది సరే, నువ్వు రుద్రవీణ గొప్పగా వాయిస్తావుటగా! నువ్వు నాతో రుద్రవీణ వాయించి జయించావనుకో, నీ కోరిక నెరవేరుతుంది’ అన్నాడు అగస్త్యుడు.‘సరే, మునీశ్వరా!’ అంటూ అగస్త్యుడితో వీణా వాదన పోటీకి సిద్ధపడ్డాడు రావణుడు.అగస్త్యుడితో రావణుడు వీణా వాదన పోటీకి సిద్ధపడిన వార్త ముల్లోకాలకూ పాకింది. వారి పోటీని తిలకించడానికి దేవ గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ తరలి వచ్చారు. ఇద్దరికీ పోటీ ప్రారంభమైంది. మొదట మంద్రగతిలో ప్రారంభించారు. మధ్యమంలోకి వెళ్లాక పోటా పోటీగా అపురూపమైన రాగాలను పలికించారు. తారస్థాయిలో రావణుడు అగస్త్యుడి ధాటిని, వేగాన్ని అందుకోవడానికి నానా తంటాలు పడసాగాడు. అగస్త్యుడి వీణా వాదనకు చుట్టుపక్కల కొండలు నీరై ప్రవహించసాగాయి. వీణ వాయించడంలో అగస్త్యుడి నైపుణ్యానికి రావణుడు నిరుత్తరుడయ్యాడు. మారు మాట్లాడకుండా ఓటమిని అంగీకరించాడు.‘మహర్షీ! నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మీరు సంచరిస్తున్న ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించను’ అని చెప్పి లంకకు వెనుదిరిగాడు.∙సాంఖ్యాయన -
మెడను పక్కకు తిప్పి, కత్తి దూయనున్న రావణుడు
కోటా: రాజస్థాన్‌లోని కోటా సిటీ పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి జరిగే వేడుకల్లో రావణుడు మరింత ప్రత్యేకంగా కనిపించనున్నాడని నిర్వాహకులు చెబుతున్నారు.500 వెదులు బొంగులను ఉపయోగించిన తయారు చేస్తున్న ఈ రావణుని బొమ్మ 80 అడుగుల ఎత్తు ఉండనుంది. ఈ రావణుని బొమ్మ తన మెడను పక్కకు తిప్పి, కత్తిని ప్రయోగించనుంది. ఈ బొమ్మను తయారు చేసేందుకు కళాకారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అక్టోబర్ 12న దసరా సందర్భంగా రావణ దహనం జరగనుంది. అలాగే ఇక్కడ దసరా జాతరకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.రావణునితో పాటు మేఘనాథుడు, కుంభకర్ణుని బొమ్మలను కూడా దహనం చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. కోటా మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీకి చెందిన కళాకారులకు ఈ బొమ్మల తయారీ పనులను అప్పగించింది. 15 మంది కళాకారుల బృందం రావణుడి వంశాన్ని సిద్ధం చేస్తోంది. రావణుని బొమ్మ 80 అడుగుల ఎత్తు ఉండగా, మేఘనాథుడు, కుంభకర్ణుని బొమ్మలు 60 అడుగుల ఎత్తున ఉంటాయి. రావణుడి వంశం తయారు చేసేందుకు రూ.7.30 లక్షలు ఖర్చు అవుతున్నదని నిర్వాహకులు తెలిపారు.ఇది కూడా చదవండి: కుక్కల బీభత్సం.. రోజుకు వెయ్యిమందిని కరుస్తూ.. -
రామరావణ యుద్ధానికి నేతలు, ప్రముఖులు
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో దసరా సందర్భంగా నేడు నిర్వహించే రామ్‌లీలను సందర్శించేందుకు నేతలు, ప్రముఖులు తరలిరానున్నారు. ఎర్రకోట మైదానంలో ధార్మిక లీల కమిటీ, లవకుశ రామలీల కమిటీలతో పాటు వివిధ కమిటీల నేతలు రామ్‌లీల నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ వస్తారని ధార్మిక్ లీల కమిటీ అధికార ప్రతినిధి రవి జైన్ తెలపగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సినీ నటి కంగనా రనౌత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని లవకుశ రామ్‌లీల కమిటీ చైర్మన్ అర్జున్ కుమార్ తెలిపారు. సోనియా గాంధీ కూడా తమ ఆహ్వానం మేరకు వస్తున్నారని నవశ్రీ రిలీజియస్ లీల కమిటీ అధికార ప్రతినిధి రాహుల్ శర్మ అన్నారు. శ్రీరామ్‌లీలా కమిటీ చైర్మన్ అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ మైదానంలో రామ్‌లీలను నిర్వహిస్తున్న శ్రీరామ్ ధార్మిక రామ్‌లీల కమిటీ చైర్మన్ సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరుకానున్నారని తెలిపారు. దేరావాల్ నగర్‌లోని నవశ్రీ మానవ్ ధరమ్ రామ్‌లీల కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఎంపీ మనోజ్ తివారీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తాము నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరు కానున్నారని ఇంద్రప్రస్థ రామ్‌లీల కమిటీ ప్రతినిధి సురేష్ బిందాల్ చెప్పారు. ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 20 మంది మృతి -
రాహుల్ గాంధీపై బీజేపీ వివాదాస్పద ఫొటో.. రావణుడితో పోల్చి..
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల హడావుడి ఇప్పటి నుంచే మొదలైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. లంకాధిపతి రావణుడి అవతారంలో ఉన్న ఒక ఫొటోను బీజేపీ ట్విట్టర్లో షేర్ చేయడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. రావణుడి అవతారంలో రాహుల్ గాంధీ ఫొటోను బీజేపీ ట్విట్టర్లో షేర్ చేసింది. ఇక, రాహుల్ ఫొటోకు మరింత వివాదాస్పదంగా టైటిల్‌ను పెట్టింది. దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. భారత దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్, జార్జ్ సోరోస్ దర్శకత్వం వహించారని ఆ పోస్టర్లో పేర్కొంది. ఈ వివాదాస్పద ఫొటోపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. The new age Ravan is here. He is Evil. Anti Dharma. Anti Ram. His aim is to destroy Bharat. pic.twitter.com/AwDKxJpDHB — BJP (@BJP4India) October 5, 2023 ఈ ఫొటోపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీని రావణుడిగా చిత్రీకరిస్తూ గ్రాఫిక్ ఫోటోలు విడుదల చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడిపై హింసను ప్రేరేపించడం, రెచ్చగొట్టడం కోసమే ఈ పోస్ట్ చేశారని మండిపడ్డారు. దేశాన్ని విభజించాలని చూసిన కొన్ని శక్తులు.. రాహుల్ గాంధీ తండ్రి, అమ్మమ్మలను హత్య చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక అబద్ధాల కోరు అని ఆరోపించారు. తన పార్టీని ఇలాంటి అసహ్యకరమైన పోస్టులు చేయాలని కోరడం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని.. ఇలాంటివి చాలా ప్రమాదకరమైనవని మండిపడ్డారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్ పార్టీ బెదిరిపోదని గట్టి సమాధానం ఇచ్చారు. What is the real intent of an atrocious graphic portraying @RahulGandhi as Ravan by the BJP’s official handle? It is clearly intended to incite and provoke violence against a Congress MP and a former President of the party, whose father and grandmother were assassinated by forces… — Jairam Ramesh (@Jairam_Ramesh) October 5, 2023 ఇదిలా ఉండగా.. జార్జ్ సోరోస్ ఒక హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త. అతను దేశాన్ని అస్థిరపరిచేందుకు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని ఆరోపణలున్నాయి. అతను అనేక భారతదేశ వ్యతిరేక ప్రచారాలను నడుపుతున్నాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనలో హంగేరియన్-అమెరికన్ వ్యాపారి నిధులు సమకూర్చుకున్న వ్యక్తులను కలిశారని బీజేపీ ఆరోపించింది. జార్జ్ సోరోస్‌తో అనుబంధం ఉన్న సునీతా విశ్వనాథ్‌ను రాహుల్ అమెరికా పర్యటనలో కలిశారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ను బీజేపీ కోరింది. यह कार्टून 1945 में अग्रणी पत्रिका में छपा था, जिसका सम्पादक नाथूराम गोडसे था। तीर चलाने वालों में एक सावरकर है। गांधी और कांग्रेस हमेशा से इनके निशाने पर रहे हैं, लेकिन न तब डरे थे, न आज डरे हैं और न ही आगे डरने वाले हैं। https://t.co/fyfiX2JtBz pic.twitter.com/HkuyYTrWke — Jairam Ramesh (@Jairam_Ramesh) October 5, 2023 ఇది కూడా చదవండి: సిసోడియా అరెస్ట్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం.. సాక్ష్యం ఎక్కడ? -
అది రావణుని మూత్రంతో నిండిన చెరువు.. ఎక్కడుందంటే..
మనదేశంలో రామాయణ, మహాభారత కథలతో ముడిపడిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అవి ఎంతో ఆదరణ పొందుతున్నాయి కూడా. వీటిలో విచిత్రమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటే రావణుని మూత్రంతో ఏర్పడిన చెరువు. వింత కథనం ఈ కథ ఎంతో వింతగా అనిపిస్తుంది. అయితే మనదేశంలోని కొన్ని ప్రాంతాలతో ముడిపడిన కథలు స్థానికుల, పురాణాల నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. రావణుని మూత్రంతో నిండిన చెరువు కూడా ఈ కోవలోకే వస్తుంది. జార్ఖండ్‌లోని బైద్యనాథ్‌లో అత్యంత ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని రావణుడు ఇక్కడికి తీసుకువచ్చాడని చెబుతారు. కనీసం నీటిని తాకరు ఈ ఆలయానికి సమీపంలో రెండు చెరువులు ఉన్నాయి. వాటిలో ఒక చెరువు రావణుని మూత్రంతో ఏర్పడిందని చెబుతారు. ఈ కారణంగానే ఇక్కడికి వచ్చేవారు కనీసం ఈ నీటిని తాకరు. అలాగే ఈ నీటిని ఏ పనులకు కూడా వినియోగించరు. రావణుని మొండితనాన్ని గ్రహించి.. ఆలయ స్థల పురాణం ప్రకారం ఒకసారి రావణుడు మహాశివునికి ప్రతిరూపమైన శివలింగాన్ని లంకకు బలవంతంగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. రావణుని మొండితనాన్ని గ్రహించిన మహాశివుడు ఆ శివలింగాన్ని దారిలో ఎక్కడ కింద పెట్టినా, అది మరిక కదలదని చెబుతాడు. ఈ షరతు విన్న రావణుడు దానికి సరేనంటాడు. అయితే ఈ సంగతి తెలుసుకున్న విష్ణుమూర్తి ఇది జరగకుండా చూడాలని తిరిగి శివుడిని కోరుతాడు. లఘుశంక తీర్చుకునేందుకు.. శివలింగం తీసుకువెళుతున్న రావణుడు దారిలో లఘుశంక కోసం ఆగాల్సి వస్తుంది. ఈ సమయంలో మహావిష్ణువు బాలుని రూపంలో రావణునికి ఎదురవుతాడు. రావణుడు కాసేపు ఈ శివలింగాన్ని పట్టుకోవాలని ఆ పిల్లవాడిని కోరతాడు. రావణుడు లఘుశంక తీర్చుకుని తిరిగి వచ్చేసరికి ఆ బాలుడు కనిపించడు. అయితే ఆ శివలింగం అక్కడ నేలపై ఉంటుంది. రావణుడు ఆ శివలింగాన్ని పైకి లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదట. బైద్యనాథ్‌లో కొలువై.. ఆ శివలింగమే బైద్యనాథ్‌లో కొలువై పూజలు అందుకుంటోందని చెబుతారు. రావణుడు మూత్రం పోసిన ప్రాంతం చెరువుగా మారిందని, అందుకే దానిని రావణుని మూత్రం చెరువుగా అభివర్ణిస్తారు. అలాగే దీనిలోని నీటిని ఎవరూ వినియోగించరు. కాగా ఇది నమ్మకాలపైన ఆధారపడిన అంశమని, దీనిలో వాస్తవం లేదనేవారు కూడా ఉన్నారు. ఇది కూడా చదవండి: ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి, ఎందుకు పంపిస్తున్నారంటే.. -
రావణుడు లుక్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. అందుకే ఇలా!
ప్రభాస్ 'ఆదిపురుష్' థియేటర్లలో సంచలనాలు సృష్టిస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా మూడు రోజుల్లోనే రూ.340 కోట్లు కలెక్షన్స్ సాధించి, రికార్డులు తిరగరాస్తోంది. అదే టైంలో ఈ సినిమాలో పాత్రలు, వాటి గెటప్స్ పై ఇప్పటికే ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా రావణుడి లుక్ పై ఘోరంగా విమర్శలు వస్తున్నాయి. అసలు రావణుడి పాత్ర ఎందుకు అలా డిజైన్ చేయాల్సి వచ్చిందనేది నిర్మాత వివేక్ కూచిభొట్ల ఇప్పుడు కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీ సిరీస్ సంస్థ నిర్మించిన 'ఆదిపురుష్'ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పంపిణీ చేసింది. దాదాపు రూ.185 కోట్లు పెట్టి హక్కుల్ని కొనుగోలు చేసింది. సరే అదంతా పక్కనబెడితే మూడురోజుల్లో అంటే ఆదివారం వరకు ఈ సినిమాను కోటి మందికి పైగా చూశారు. దీంతో 'రామకోటి ఉత్సవం' పేరిట హైదరాబాద్ లో సోమవారం ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత వివేక్ కూచిభొట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!) 'చిన్నపిల్లలకు అర్థమయ్యేలా ఓ సినిమా తీయాలి. రామాయణం అంటే పాతకాలంలాగా సంస్కృత పద్యాలు, డైలాగ్స్ తో సినిమా తీస్తే.. అప్డేట్ అవ్వండ్రా అని మీరే అంటారు. ఇప్పుడేమో అప్డేట్ అయి సినిమా తీస్తే.. మళ్లీ రావణాసురుడు ఏంటి ఇలా ఉన్నాడు? వాళ్లేంటి ఇలా ఉన్నారు? వీళ్లేంటి ఇలా ఉన్నారని అంటున్నారు. మీరు చూడలేదు, మేము చూడలేదు. మీ ఊహకు రావణాసురుడిని ఒకలా ఊహించుకున్నారు. మా ఊహకు రావణాసురుడిని ఒకలా ఊహించుకున్నాం.' 'కానీ ఈ సినిమాలో ఎక్కడా చరిత్రని తప్పుదోవ పట్టించలేదు. రాముడు ధీరోదాత్తుడు, సకలాగుణాభిరాముడు అనే చూపించారు. మంచి చెప్పడానికి.. ఈ రోజు పిల్లలకు అర్థమయ్యేటట్టు.. అంటే ఈ రోజు పిల్లలని తీసుకుంటే థార్, హల్క్, డిస్నీ క్యారెక్టర్స్ అన్నీ తెలుసు. కానీ వాళ్లకు జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు అంటే ఎవరో తెలుసా? తెలియదు. బ్యాట్ మ్యాన్ ఫొటో చూపిస్తే వెంటనే గుర్తుపడతారు. అంగదుడిని గుర్తుపట్టలేరు. ఈ రకంగా అయినా మన పిల్లలకు రామాయణంలోని పాత్రలు పిల్లలకు తెలిసే అవకాశముంటుంది' అని నిర్మాత వివేక్ కూచిబొట్ల చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్.. అక్కడ భారత్ సినిమాలపై నిషేధం!) -
ఖర్గేని ఎంతో గౌరవిస్తా, కానీ..: ప్రధాని మోదీ
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీలో గట్టి పోటీ ఒకటి నడుస్తోంది. ఆ పార్టీ నేతలు పోటీ పడి మరీ మోదీని తిడుతున్నారు. ఎవరైతే ఎక్కువగా, పెద్దగా, పదునైన అవమానాలకు మోదీ గురిచేస్తారో.. అంటూ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. కానీ, అలాంటి పదాలు వాడుతూ.. వాళ్లు పశ్చాత్తాపం చెందకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉత్తర గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని కలోల్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తనపై చేసిన రావణ్ కామెంట్‌పైనా ఆయన స్పందించారు. రామభక్తుల నేలపై ఒకరిని రావణుడు అని సంభోధించడం ఏమాత్రం సరికాదని మోదీ పేర్కొన్నారు. ‘‘కొన్నిరోజుల కిందట ఓ కాంగ్రెస్ నేత.. మోదీకి కుక్క చావు తప్పదన్నాడు. మరో నేత హిట్లర్‌లా మోదీ చస్తాడని వ్యాఖ్యానించారు. ఇంకొకరేమో.. ఛాన్స్ దొరికితే మోదీని నేనే చంపేస్తా అంటాడు. ఒకరేమో రావణుడంటున్నారు. మరొకరు రాక్షసుడంటున్నారు. ఇంకొకరు బొద్దింక అంటున్నారు. ఇలా.. కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే మోదీ పేరు వాడడం నాకు కొత్తేం అనిపించడం లేదు. కానీ, అలాంటి పదాలు వాడుతున్నప్పటికీ, కాంగ్రెస్‌కు ఎప్పుడూ పశ్చాత్తాపం చెందడం లేదని నేను ఆశ్చర్యపోతున్నా. అసలు వాళ్లు మోదీని అవమానించడం ఒక హక్కుగా అనుకుంటున్నారు అని మోదీ విమర్శలపై ఘాటుగా స్పందించారు. గుజరాత్ నాకు బలం ఇస్తే.. కాంగ్రెస్‌ను మాత్రం ఇబ్బంది పెట్టింది. ఓ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడికి వచ్చి ఈ ఎన్నికల్లో మోదీ స్థాయి ఏంటో చూపిస్తాం అని సవాల్ విసిరాడు. అది సరిపోలేదని కాంగ్రెస్ అనుకుందేమో. అందుకే ఖర్గేను ఇక్కడికి పంపారు. ఆయన్ని(ఖర్గేని) నేను గౌరవిస్తా.. కానీ ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గుజరాత్ రామభక్తుల నేల అని కాంగ్రెస్‌కు తెలియదు. అందుకే.. ఆయన ఇక్కడికి వచ్చి మోదీ వంద తలలున్న రావణుడన్నారు’’ అని మోదీ ఖర్గే విమర్శకు సమాధానం ఇచ్చారు. గుజరాత్లో ఇవాళ(గురువారం) ఫస్ట్ ఫేజ్ ఎన్నిక జరుగుతోంది. రెండో ఫేస్ ఎన్నిక డిసెంబర్ 5వ తేదీన(సోమవారం) జరగనుంది. -
నమ్మకం రెండింతలయింది
రావణ్ నిట్టూరు, శ్రీ నిఖిత జంటగా ఆనంద్. జె దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో..’. రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర.పి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా రావణ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథ విన్నప్పుడు ఈ సినిమాపై కలిగిన నమ్మకం అవుట్‌పుట్ చూసిన తర్వాత రెండింతలయింది. కొత్తవాళ్లతో కూడా మంచి సినిమా తీయవచ్చని మా సినిమా చూసిన తర్వాత మరోసారి నిరూపితమవుతుంది. ఇంతమంచి స్క్రిప్ట్‌లో నన్ను భాగం చేసిన దర్శకుడు ఆనంద్‌కు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఇందులో పూర్తిగా తిరుపతి నేటివిటీని చూస్తారు. నటీనటులు కొత్తవారైనా అంకితభావంతో పని చేశారు’’ అన్నారు ఆనంద్. ‘‘థ్రిల్లర్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో డివైన్ టచ్ ఉన్న సినిమా ఇది. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ఓవర్సీస్లో కూడా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు రమేష్, రాజేంద్ర. హీరోయిన్ శ్రీ నిఖితతో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
నందిని రెడ్డి చేతుల మీదుగా ‘అలిపిరికి అల్లంత దూరంలో’ ఫస్ట్‌లుక్
నూతన నటుడు రావణ్ నిట్టూరు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆనంద్ జె దర్శకత్వం వహిస్తున్నాడు. రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని తాజాగా దర్శకురాలు నందిని రెడ్డి లాంచ్ చేసి యూనిట్ కు బెస్ట్ విశేష్ అందించారు. ఫస్ట్ లుక్ లో ఒక హొటల్ టెర్రస్ పై హీరో సీరియస్ గా నిలుచుని చూడటం, బ్యాగ్రౌండ్ లో తిరుమల సప్తగిరులు కనిపించడం ఆసక్తికరంగా ఉంది. నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నాడు. -
సీతాపహరణం చూస్తున్న ‘రావణుడు’!
న్యూఢిల్లీ: భారత్‌లో రామాయణ, మహాభారత ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన సీరియళ్లు, సినిమాలు, నాటకాల ఆదరణకు కొదవే ఉండదు. ఇక లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమతమైన అభిమానులు, సెలబ్రిటీల కోరికమేరకు 37 ఏళ్ల క్రితం విజయవంతంగా ప్రదర్శితమైన రామాయణ్, మహాభారత్ సీరియళ్లను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రేటింగ్స్ పరంగా నయా రికార్డులను సాధిస్తున్న రామాయణ్ మరోసారి వార్తల్లో నిలిచింది. నాడు రామాయణ్ సీరియల్లో రావణ పాత్రధారి అరవింద్ త్రివేది.. తాజాగా సీతాపహరణం దృశ్యాన్ని చూస్తున్న వీడియో వైరల్ అయింది. (చదవండి: డీడీ నంబర్ వన్) 81 ఏళ్ల వయసున్న త్రివేది సీతను అపహరించే ఘట్టం క్లైమాక్స్‌కు చేరుకున్న దృశ్యాల్ని టీవీ ముందు కూర్చుని ఆసక్తికరంగా వీక్షిస్తున్న వీడియో అది. సీతను రావణుడు చెరబడుతున్న సందర్భంలో ఆయన రెండు చేతులూ జోడించడం గమనార్హం. ఈ వీడియోను రామాయణ్ ఫ్యాన్స్ క్లబ్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్ అయింది. కాగా, రామానంద్‌సాగర్ దర్శకత్వం, నిర్మాణ సారథ్యంలో 1987లో వచ్చిన ఈ సీరియల్లో రాముడిగా అరుణ్ గోవలి, సీతగా దీపికా చిఖిలా, లక్ష్మణుడిగా సునీల్ లహరి నటించారు. (చదవండి: ఒక్కరోజులోనే ఆ సీరియల్‌కు 50 మిలియన్ వ్యూస్) -
రావణుడిగా హీరోయిన్ తండ్రి
దేశ రాజధాని ఢిల్లీలో ఏటా ఘనంగా నిర్వహించే దసరా వేడుకల్లో ఈసారి ఓ హీరోయిన్ తండ్రి రావణాసురుడి వేషం వేసి అందరినీ అలరించారు. తన అందం, అభినయంతో ప్రస్తుతం బాలీవుడ్‌ని ఊపేస్తున్న గులాబి బాల శ్రద్ధా కపూర్ తండ్రి, ప్రముఖ నటుడు శక్తి కపూర్ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతున్న దసరా వేడుకల్లో రావణాసురుడి వేషం వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఉత్తరాదిలో దసరాను ఎంతో వేడుకగా నిర్వహించుకుంటారు. ప్రధానంగా రాంలీలా మైదానంలో భారీ ఎత్తున రావణాసురుడి బొమ్మను పెట్టి.. దాన్ని దహనం చేయించడం అలవాటు. అలాగే పలువురు ప్రముఖులు కూడా వీటిలో రకరకాల వేషాలు వేస్తుంటారు. ఈసారి ఢిల్లీ ఎర్రకోట వేడుకల్లో శక్తి కపూర్ తన నటనా సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు చూపించారు. సినిమాల్లో విలన్‌గా ఎంత భయపెట్టగలడో కమెడియన్‌గా అంతే నవ్వించగల విలక్షణ నటుడు 'శక్తి కపూర్'. ఆయన ముద్దుల తనయ శ్రద్ధా కపూర్ కూడా తండ్రి బాటలోనే తన మార్క్ నటనతో బాలీవుడ్లో స్థానం సుస్థిరం చేసుకుంటోంది.


