రావణ్‌ రిమాండ్‌ను తిరస్కరించిన న్యాయమూర్తి | Ravan granted bail in case | Sakshi
Sakshi News home page

రావణ్‌ రిమాండ్‌ను తిరస్కరించిన న్యాయమూర్తి

Jul 4 2026 6:27 PM | Updated on Jul 4 2026 7:22 PM

Ravan granted bail in case

అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు యూట్యూబర్‌ రావణ్‌కు ఎలమంచిలి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రావణ్‌ రిమాండ్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. వరుసగా కోర్టులు బెయిల్‌ మంజూరు చేయడం ఇది నాలుగోసారి. 
 
రావణ్‌పై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను దూషించాడని ఆరోపిస్తూ రావణ్‌పై జనసేన నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. కోర్టుల్లో రావణ్‌కు వరుసగా బెయిల్‌ దక్కుతోంది. అయినప్పటికీ, మరో కేసు అంటూ రావణ్‌ను పోలీసులు  అరెస్ట్‌ చేస్తున్నారు.

ఎన్‌కౌంటర్‌ చేయాలనుకుంటున్నారు: జడ శ్రవణ్ 
రావణ్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని చూస్తున్నారని జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్‌ ఆరోపించారు. రావణ్ మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండని అన్నారు. ‘‘మాకు సమయం వచ్చినప్పుడు మీ సంగతి తేలుస్తా. శంకరగిరి మాన్యాలు పట్టిస్తా. ప్రభుత్వ తీరును చూసి ప్రజలు ఛీ కొడుతున్నారు.  

కోర్టులు బెయిల్ ఇవ్వడమేంటి, పోలీసులు మళ్లీ అరెస్టులు చేయడమేంటి? రావణ్ తప్పేమీ మాట్లాడలేదు. పవన్ మాట్లాడిన మాటలను ప్రస్తావించారు. నన్ను లిల్లీపుట్, అరకోటు న్యాయవాది అంటూ విమర్శలు చేస్తున్నారు. 76 ఏళ్ల వ్యక్తి ఉన్న చంద్రబాబు ఈ విధమైన విమర్శలు చేయవచ్చా?’’ అని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement