కక్ష సాధింపు.. మళ్లీ రావణ్‌ అరెస్ట్‌ | Prasna Ravan Arrested By AP Police Again | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపు.. మళ్లీ రావణ్‌ అరెస్ట్‌

Jul 4 2026 7:58 PM | Updated on Jul 4 2026 8:34 PM

Prasna Ravan Arrested By AP Police Again

అనకాపల్లి : ప్రశ్న యూట్యూబర్ రావణ్‌పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి.  ఓ కేసులో బెయిల్‌ వచ్చిన కాసేపటికే రావణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వేంపాడు టోల్‌ప్లాజా వద్ద రావణ్‌ను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ రోజు రావణ్‌కు యలమంచిలి కోర్టు బెయిల్‌ మంజూరు చేయగా, ఆపై కాసేపటికే మళ్లీ అరెస్ట్‌ చేశారు. 

తెలుగు యూట్యూబర్‌ రావణ్‌కు నేడు(శనివారం) యలమంచిలి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అదే సమయంలో రావణ్‌ రిమాండ్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. రావణ్‌పై పెట్టిన కేసుల్లో కోర్టులు బెయిల్‌ మంజూరు చేయడం వరుసగా ఇది నాలుగోసారి. అయితే మళ్లీ రావణ్‌ను అరెస్ట్‌ చేయడం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు అద్దం పడుతోంది. 

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను దూషించాడని ఆరోపిస్తూ రావణ్‌పై జనసేన నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. కోర్టుల్లో రావణ్‌కు వరుసగా బెయిల్‌ దక్కుతోంది. అయినప్పటికీ, మరో కేసు అంటూ రావణ్‌ను పోలీసులు  అరెస్ట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement