breaking news
Prashna Ravan
-
పోలీసుల పిటిషన్ లో దమ్ము లేదు.. పొన్నవోలు సెటైర్స్
-
రావణ్ ను ఉరితీస్తారా...!? పొన్నవోలు షాకింగ్ కామెంట్స్
-
రావణ్ ఎపిసోడ్.. పరువు పోగొట్టుకున్న బాబు, పవన్!
రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత సామర్థ్యం దేశంలో మరే పార్టీకి ఉండకవచ్చు. రావణ్ అనే యూట్యూబర్‌పై దేశద్రోహం కేసు పెట్టడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అయింది. అంతా ఇదేమి పద్దతి అని నొచ్చుకున్నారు. దీనివల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తీరని అప్రతిష్ట వస్తే,ఎపి పోలీసు వ్యవస్థకు కళంకం ఏర్పడిందన్న వ్యాఖ్యలు వచ్చాయి. దీంతో ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం పార్టీ వెంటనే వ్యూహం మార్చి వైఎస్సార్సీపీపై బురద చల్లడం ఆరంభించింది. ఎల్లో మీడియాతో పాటు, సోషల్ మీడియాలో తనకు ఉన్న పట్టు మేరకు విపరీతమైన వ్యతిరేక ప్రచారం సాగించింది.అదే టైమ్‌లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో వైఎస్ జగన్‌పైన, వైఎస్సార్సీపీపైన నిందలు వేయడం ఆరంభించారు. రావణ్ అరెస్టు చేశాక జరిగిన పరిణామాలలో జనసేన పరువు పోగొట్టుకుంటే, తీవ్రవాద నిరోధచట్టం కింద కేసులు, దేశద్రోహం కేసులు వంటివి పెట్టి తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది. జనసేన క్యాడర్ కొంతమంది అరాచకంగా పోలీస్ స్టేషన్లపై దాడులు చేసినా వారిని అరికట్టలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం కనీసం కేసులు పెట్టలేదు. జనసేన వారిపై కేసులు పెడితే ఎక్కడ పవన్ కళ్యాణ్‌కు, ఆ పార్టీ వారికి కోపం వస్తుందన్న భయం కావచ్చు.జనసేన జనంలో పలచన అయినా ఫర్వాలేదులే అన్న వ్యూహం కావచ్చు. కాని న్యాయ వ్యవస్థ తగురీతిలో స్పందించి రావణ్ కు బెయిల్ ఇచ్చేస్తుండడంతో పవన్‌ను సంతృప్తి పరచడానికిగాను అన్నట్లు తీవ్రమైన నేరారోపణ చేస్తూ రావణ్‌పై కేసులు పెట్టింది. ఈ ఫిర్యాదు చేసింది జనసేనకు చెందిన ఒక స్థానిక నేత అయినా, దానిని ఆమోదించడం ద్వారా టీడీపీ కూడా భాగస్వామి అయినట్లయింది. చంద్రబాబు ఆధ్వర్యంలోనే లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీతో పాటు, వామపక్షాలు, ఆలోచనాపరులు, విజ్ఞులైనవారంతా స్పందించారు. న్యాయవాది జడ శ్రావణ్ ఇదంతా కుట్ర పూరితంగా చేస్తున్నారని విమర్శించారు.సామాజిక అంశాలపై కూడా స్పందించే నటుడు ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు రావణ్ అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పలువురు సీనియర్ పాత్రికేయులు, యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్న కొంతమంది ప్రభావశీలురు కూడా ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ వీడియోలు చేశారు. రావణ్ చేసిన విషయాలలో తప్పు ఉంటే చర్య తీసుకోవద్దని ఎవరూ అనడం లేదు.కాని తప్పుడు కేసులు పెట్టడం, అది కూడా ఏకపక్షంగా చేయడంపైనే అంతా బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ గతంలో నక్సల్సిజంకు సంబంధించి చేసిన అనుకూల ప్రకటనల వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి.దీంతో రావణ్ విషయంలో తప్పుడు కేసు పెట్టిన విషయం జనం అందరికి తెలిసిపోయిందన్న ఆందోళనతో చంద్రబాబు సర్కార్ వ్యూహాత్మక ఎదురుదాడి చేయడం ఆరంభించింది. రావణ్ దేశద్రోహి అని, సమాజ విధ్వంసకుడు అని, హిందూ మత వ్యతిరేకి అని ఇలా పలు ఆరోపణలు సంధిస్తూ ప్రచారం చేయడానికి టీడీపీ, జనసేనలు యత్నించాయి. వారికి బీజేపీ కూడా జత కలిసింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ పైన, ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పైన పలు విమర్శలు చేస్తూ టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టారు. చివరకు చంద్రబాబు కూడా ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. రావణ్‌కు జగన్ మద్దతు ఇస్తారా అంటూ టీడీపీ గంభీరంగా మాట్లాడే యత్నం చేసి దొరికిపోయిందని చెప్పాలి. నిజానికి రావణ్ ఎప్పుడూ వైఎస్సార్సీపీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఒకప్పుడు వపన్ కళ్యాణ్ అభిమాని.ఆ విషయం ఆయనే పలుమార్లు చెప్పారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై వ్యతిరేక వీడియోలు చేయలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పలు విమర్శలతో వీడియోలు చేసిన వ్యక్తి రావణ్. అయినా రావణ్‌పై కూటమి సర్కార్ తీవ్రమైన కేసులు పెట్టడం మీద జగన్ మానవత్వంతో స్పందించారు. తప్పుడు కేసులు పెట్టడం మంచిది కాదని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కులాలు, మతాలకు అతీతంగా ఆయన వ్యవహరిస్తే సమాజ విధ్వంసకుడు రావణ్‌ను సమర్థిస్తున్నారంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.అయితే అదే టైమ్‌లో వామ పక్షాలు కూడా రావణ్‌పై ఉపా కేసులు పెట్టడంపై మండిపడ్డాయి. వారి జోలికి మాత్రం టీడీపీ, జనసేనలు వెళ్లలేదు. సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ చాలా ఘాటుగా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇది తప్పుడు కేసు అని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో టీడీపీ మద్దతుదారుగా పేరొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రావణ్‌పై కూటమి సర్కార్ తప్పుడు కేసులు పెట్టిందని ఆయన తెలిపారు. రావణ్‌పై పెట్టిన కేసులకు ఆధారంగా అక్కడక్కడ, ఆయా సందర్భాలలో మాట్లాడిన మాటలను కట్ చేసి, ముక్కలు, ముక్కలు అతికించి వీడియోల రూపంలో పోలీసులు పెట్టారని ఆయన అభిప్రాయపడ్డారు.రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఇతర మతాలను దారుణంగా అవమానించే రీతిలో మాట్లాడితే దానికి జవాబు ఇచ్చారే కాని రావణ్ స్వయంగా మతాలను దూషించలేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీంతో ఏపీ పోలీసుల దుశ్చర్య ప్రజలకు మరింత స్పష్టంగా తెలిసింది. మరి ఏబీ వెంకటేశ్వరరావుపై ఎందుకు టీడీపీ విమర్శలు చేయలేకపోయింది. ఆయన అడిగినవాటికి ఎందుకు జవాబులు ఇవ్వడం లేదు. ఇప్పటికే సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగవ్వ, తదితర కేసులలో పోలీసులపై మచ్చపడింది. దానికితోడు రావణ్ పై తప్పుడు కేసు పెట్టారని ఒక రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించడంతో అటు చంద్రబాబు, పవన్‌లకు, ఇటు పోలీసు అధికారులకు బాగా డామేజీ అయిందని చెప్పాలి.చిత్రమేమిటంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్సార్సీపీకి చెందిన ఒక నేత పార్టీపై అసమ్మతితో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా రోజూ మాట్లాడుతుంటే వైఎస్ జగన్ ప్రభుత్వంపై దారుణమైన ఆరోపణలు చేస్తుండేవారు. దానిని ఎల్లో మీడియా లైవ్ కవరేజీ ఇచ్చి అదేదో పండగ మాదిరి సంబర పడేది. అంతే తప్ప ఆయన సమాజాన్ని విధ్వంసం చేస్తున్నారని ఎక్కడా రాయలేదు.రాజద్రోహం కేసు పెట్టి ఆయనను అరెస్టు చేస్తే తెలుగుదేశం పార్టీ నానా రచ్చ చేసింది. ఇప్పుడేమో అదే రాజద్రోహం కేసును రావణ్‌పై బనాయిస్తోంది. దాస్ అనే వ్యక్తి చేస్తున్న దారుణ ప్రసంగాలపై చర్య తీసుకుని ఉంటే కూటమి ఇప్పుడేమి చెప్పినా అర్థం ఉండేది. పవన్ కళ్యాణ్ తాను గతంలో నక్సలిజానికి, చెగువేరాకు ఎందుకు మద్దతు ఇచ్చింది చెప్పి తప్పు చేశానని ప్రకటించి ఉంటే ఆయనలో నైతికత ఉందన్న అభిప్రాయం కలిగేదన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏబీ వెంకటేశ్వరరావు చెప్పిన అంశాలకు ఏపీ పోలీసులు సమాధానం ఇస్తారా? ఆయనపై కూడా టీడీపీ దాడి చేస్తుందా? టీడీపీ, జనసేనలు ఈ అంశంపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే వారే సెల్ప్ గోల్ వేసుకున్నట్లవుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నేను మౌనంగా లేను, ఇది ఆరంభం మాత్రమే.. ప్రకాష్ రాజ్ సంచలన వీడియో
-
ప్రశ్న రావణ్ స్ఫూర్తి పవన్ కళ్యాణ్ ఫస్ట్ అరెస్ట్ చెయ్యాల్సింది పవన్ కళ్యాణ్‌నే
-
ప్రశ్న రావణ్ అరెస్ట్ పై మా పార్టీ స్టాండ్ ఇదే
-
కొడాలి నాని పై కేసు... దమ్ముంటే టచ్ చేయండి... అంబటి రాంబాబు స్ట్రాంగ్ రియాక్షన్
-
రావణ్ పై ఉపా కేసు.. ఆధారాలతో నిరూపించకపోతే కోర్టులో జరిగేది ఇదే
-
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకు అనర్హుడు..! ప్రశ్న రావణ్ పై పెట్టిన కేసు నిలవదు
-
మా పార్టీ కి రావణ్ కు ఉన్న సంబంధం ఇదే..! జూపూడి సంచలన కామెంట్స్
-
పవన్ కు బిగ్ షాక్.. రావణ్ పై ఉపా కేసు నిలవదు.. ఇదిగో సాక్ష్యం
-
కొడాలి నానిపై కేసు...
-
ప్రశ్న రావణ్ పై దేశద్రోహం కేసు PV సునీల్ కుమార్ స్ట్రాంగ్ రియాక్షన్
-
పవన్ మాటలే కదా రావణి చెప్పింది నీలాగా చెప్పు చూపించలేదు కదా!
-
నేను ప్రశ్న రావణి కేసును వాదించడానికి ఎందుకు వచ్చానంటే...?
-
ప్రశ్న రావణ్ బ్యాంక్ అకౌంట్లు సీజ్.. సర్పవరంలో మరోకేసు
-
రావణ్‌పై మరో కుట్ర.. ‘ప్రశ్న’పై సర్కార్ చర్యలు
సాక్షి, కాకినాడ: ప్రశ్న రావణ్‌పై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. రావణ్‌పై ఇప్పటికే ఉపా కేసు పెట్టి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా రావణ్ నిర్వహిస్తున్న ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు పోలీసులు లేఖ రాశారు.వివరాల మేరకు.. యూట్యూబర్ రావణ్ బ్యాంక్ ఖాతాలను సర్పవరం పోలీసులు ఫ్రీజ్ చేయించారు. అలాగే ఆయన నిర్వహిస్తున్న ‘ప్రశ్న’ యూట్యూబ్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు పోలీసులు లేఖ రాశారు. రావణ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాదాస్పద కంటెంట్ ప్రసారం చేస్తూ ప్రతి నెల సుమారు రూ.1.50 లక్షల ఆదాయం పొందుతున్నట్లు పోలీసులు ఆరోపించారు. ఈ ఆదాయం వివరాలు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా బ్యాంక్ ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపారు.వివాదాస్పద వీడియోలను తొలగించాలని, ఛానల్‌ను నిలిపివేయాలని పోలీసులు మెటా సంస్థను కోరారు. దీనిపై స్పందించిన మెటా.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తామని, అయితే మొత్తం ఛానల్‌ను పూర్తిగా నిలిపివేయడం తమ పరిధిలో లేదని పోలీసులకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం.అయితే, ఈ వ్యవహారం 2025లో పిఠాపురం నియోజకవర్గం యండమూరు గ్రామంలో దళిత విద్యార్థుల సామాజిక బహిష్కరణ ఆరోపణల ఘటన నేపథ్యంలో మొదలైనట్లు తెలుస్తోంది. ఆ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఖరిని ప్రశ్నిస్తూ రావణ్ వీడియోలు చేసినట్లు సమాచారం. అప్పట్లో రావణ్‌పై పిఠాపురం జనసేన ఫైవ్‌మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో జూలై 2న రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ప్రస్తుతం రావణ్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా కంటెంట్‌పై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
పంతం నానాజీకి ఓరేంజ్ లో ఇచ్చిపడేసిన కొడాలి నాని
-
జైల్లో ప్రశ్న రావణ్ ఇప్పటికి కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు.. ఎందుకంటే..
-
ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం.. ప్రశ్న రావణ్ అరెస్ట్ పై కొడలి నాని స్ట్రాంగ్ రియాక్షన్
-
BR నాయుడు బ్రోకర్, ABN RK లోఫర్.. రావణ్ వివాదంపై కొడాలి నాని సంచలన కామెంట్స్
-
ప్రశ్న రావణ్ ఉన్న పోలీస్ స్టేషన్ లపై జనసేన వాళ్ళు తప్ప టీడీపీ వాళ్ళు దాడులు ఎందుకు చేయలేదంటే?
-
‘ప్రశ్న’కు పవన్ భయపడుతున్నారా?
ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరుగుతోంది? సోషల్ మీడియాను అణచివేయాలన్న ఆలోచనతో టీడీపీ, జనసేన కూటమి నేతలు అనుసరిస్తున్న పద్దతులు ప్రమాదకరంగా మారుతున్నాయి. యూ ట్యూబర్ రావణ్ అనే ఆయనపై ఏకంగా దేశద్రోహం కేసు పెట్టిన తీరు సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. నిజంగా ఆయన అలాంటి తప్పు చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు.కాని ఒక ప్రసంగంలో ఏదో మాట్లాడాడని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఆయన పదే, పదే నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఉద్దేశంతో కేసు పెట్టడం, ఆ వెంటనే అరెస్టు చేయడం, కోర్టుల చుట్టూ తిప్పడం, అవి అంతగా ఫలించకపోవడంతో ఏకంగా దేశద్రోహం కేసులో జైలుకు పంపించడం అంత సమంజసం అనిపించదు.రావణ్ చేసే వ్యాఖ్యలలో అభ్యంతరకర విషయాలు ఉంటే ఎవరూ సమర్ధించరు. కాని అదే టైమ్‌లో ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరించడం శోచనీయం. దళిత క్రైస్తవుల డిమాండ్లకు సంబంధించి ఏలూరులో జరిగిన సభలో ఆయన పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు. పవన్ కళ్యాణ్ గతంలో ఆయా సందర్భాలలో చేసిన ఆవేశపూరిత ప్రకటనలను ఉటంకిస్తూ అదే తరహాలో మాట్లాడారు. పిఠాపురంలో జరిగిన ఒక కుల వివాదాన్ని ఆయన గట్టిగా ప్రస్తావించారు. అది పవన్‌కు కోపం తెప్పించి ఉండవచ్చు. ఆ వెంటనే జనసేన కార్యకర్తలను పురమాయించి కేసులు పెట్టించారు.రావణ్‌ను ముందుగా పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ కోర్టువారు బెయిల్ ఇవ్వగానే సర్పవరం, మచిలీపట్నం, నక్కపల్లి పోలీసులు అరెస్టు చేయడం సంబంధిత కోర్టులు ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగాయి. పాయకరావు పేట నుంచి ఆయన బయల్దేరి వస్తుండగా, మళ్లీ పోలీసులు అరెస్టు చేసి ఈసారి కృష్ణా జిల్లా గన్నవరం తీసుకువచ్చారు. ఏకంగా దేశద్రోహం కేసుపెట్టారు. ఉగ్రవాదులపై పెట్టే సెక్షన్లు పెట్టారు. తద్వారా కోర్టు రిమాండ్ అంటే జైలుకు పంపించేలా చేశారు. ఈ ఘటనలన్నిటిని చూసినవారికి ఏమనిపిస్తుంది.రావణ్‌ను జైలులో ఎలాగైనా పెట్టాల్సిందేనని, పవన్ కళ్యాణ్, ఆయన పార్టీవారు కోరుకున్నారని, ఆ కక్ష తీర్చుకోవడానికి, అహం చల్లబరచుకోవడానికి ఇలా చేశారని అనిపించదా? మొదటే దేశద్రోహం కేసు పెట్ట లేదు. ఐదు రోజుల పాటు నిద్రహారాలు సరిగా లేకుండా అతనిని తిప్పిన తీరు కూడా దారుణంగా ఉంది. ఇక్కడ చిత్రమేమిటంటే శాంతిభద్రతల గురించి, దాడుల గురించి పదే పదే సుద్దులు చెప్పి ప్రభుత్వ పెద్దలు ఈ పోలీస్ స్టేషన్ల వద్ద జరిగిన గొడవను మాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. జనసేన కార్యకర్తలు ఆయా స్టేషన్ల వద్ద నానా రచ్చ చేశారు.కొన్నిచోట్ల పోలీసులను కింద పడేశారు. గోడలు దూకి స్టేషన్లోకి వెళ్లి రావణ్‌ను కొట్టడానికి యత్నించారు. మరి ఇవేవి తప్పు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? వారిపై ఏమైనా కేసులు పెట్టారా? పెట్టి ఉంటే అవి ఏ తరహావో చెప్పాలి కదా!ఒక్కరినైనా ఎందుకు అరెస్టు చేయలేదు? అంటే టీడీపీ, జనసేనలకు చెందినవారు ఎలాంటి రౌడీయిజం చేసినా, అరాచకాలకు పాల్పడినా పోలీసులు కూడా అడ్డుకునే పరిస్థితి లేదని చెప్పదలిచారా? గత కొన్నాళ్లుగా దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ సహనం, సంయమనం లేకుండా కక్ష కట్టి ఒక యూట్యూబర్ పై ఈ రకమైన కేసులు పెట్టించడం పిచుకపై బ్రహ్మాస్త్రం వేసినట్లు అనిపించదా?ఈయన చేసిన విధంగా గతంలో పవన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదా అంటే పలుమార్లు ఆ తరహాలో మాట్లాడిన వీడియోలు అనేకం కనిపిస్తాయి. ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయన తాను నక్సలైట్ అవ్వాలనుకున్నానని, తుపాకి పట్టుకోవడం గురంచి మాట్లాడారు. బీజేపీతో కలిసి లేనప్పుడు యుద్ధాల గురించి ఆయన ఏమి మాట్లాడారో కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. రావణ్ ఒక స్పీచ్‌లో ఏదేదో మాట్లాడారని, దానితో దేశ సమగ్రతకు భంగం కలిగించే పనులు చేసినట్లు, వివిధ వర్గాల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు.నిజానికి మతపరమైన, కులపరమైన విద్వేష వ్యాఖ్యలు చేసిన కొందరు నేతలు ప్రస్తుతం కూటమిలో ప్రముఖులుగా ఉన్నారు. అవన్ని ఎందుకు!ఒకప్పుడు టీడీపీ వారు దేశ ప్రధానిని ఎంతలేసి మాటలు అన్నారో అందరికి తెలుసు కదా! అవేవి తప్పుకాదా?వారికి ఏమీ కాలేదే! వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రావణ్ అప్పటి ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగానే విమర్శించేవారు. అయినా అప్పుడు కేసులు రాలేదు. రావణ్‌పై ఇంత తీవ్రమైన కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని వైఎస్ జగన్ ఖండించారు.రావణ్‌కు మద్దతుగా జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ఆయా కోర్టులలో వాదనలు చేశారు. దేశ ద్రోహం కేసు పెట్టడానికిగాను వీడియోలను మార్ఫింగ్ చేశారని రావణ్ భార్య అనూష ఆరోపించారు. ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతే తమ కుటుంబాన్ని చంపేయండని ఆమె ఆవేదనతో వ్యాఖ్యానించారు. రావణ్ నిజంగా దేశ ద్రోహానికి పాల్పడ్డారా? లేదా? అన్నది పోలీసులు ఎలా నిర్థారించుకున్నారో తెలియదు. జనసేన స్థానిక నాయకుడు ఒకరు కేసుపెట్టడం, వెంటనే పోలీసులు రంగంలో దిగిపోవడం జరిగింది.పోలీసులు అనుసరిస్తున్న తీరు మొత్తం పోలీసు వ్యవస్థకే అప్రతిష్ట తెస్తుంది. అధికారంలో ఉన్నవారు చెప్పినా అది నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా? అన్నది తేల్చుకుని ఆ తర్వాత కేసు పెడితే బాగుంటుంది. రావణ్ అరెస్టు వల్ల ఆయనకు జరిగిన నష్టం ఎంతో చెప్పలేం కాని, పవన్ కళ్యాణ్ కైతే నైతికంగా చాలా అప్రతిష్ట వచ్చే పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం ఉంది. తనకు వ్యతిరేకంగా ఎవరైనా పన్నిన ట్రాప్ లో పవన్ పడి, ఇలాంటి అరెస్టులు చేయిస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పిన ఆయన, తన ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. మరో ఘటనలో కూడా పవన్‌కు నష్టమే జరిగింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆయన తప్పు చేసిన పోలీసు అధికారికి మద్దతు ఇచ్చిన తీరు తీవ్ర విమర్శలకు గురైది. సాయికృష్ణను రౌడీషీటర్ అని, పోక్సో కేసులో నిందితుడని, క్రిమినల్ అని పవన్ చెప్పడాన్ని ప్రజాస్వామికవాదులు ఆక్షేపిస్తున్నారు. ఎవరినైనా చంపే హక్కు పోలీసులకు ఉందని పవన్ భావిస్తున్నారా? అది ఏ రకంగా చట్ట సమ్మతం అని ప్రశ్నిస్తున్నారు.పవన్ వ్యాఖ్యలను సాయికృష్ణ తల్లి తీవ్రంగా ఖండించారు. తన కుమారుడిపై ఫోక్సో కేసును కోర్టు కొట్టివేసిందని, ఆ యువతి కూడా అలాంటిది జరగలేదని చెప్పినా ఇలా మాట్లాడడం న్యాయమా అని ఆమె అడిగింది. సాయికృష్ణ కూడా పవన్ అభమాని అని, తామంతా ఆయనకే ఓట్లు వేశామని, కాపులు ఆయనకు మద్దతు ఇచ్చినందుకు ఇలా అంటున్నారా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పవన్ కాని, జనసేన పార్టీ కాని జవాబు ఇవ్వలేకపోయారు.ఈ రెండు ఘటనలలో టీడీపీ వ్యూహాత్మకంగా చోద్యం చూస్తున్నట్లుగా వ్యవహరిస్తూ పవన్‌ను వివాదంలో దించిందా అన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. క్రాంతికుమార్ అనే యువకుడు కూడా పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కూడా ప్రభుత్వం సకాలంలో చర్య తీసుకోలేదు. క్రాంతి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్ వెళ్లాకే కదలిక వచ్చింది. విశేషం ఏమిటంటే క్రాంతి తండ్రి టీడీపీకి మద్దతు ఇచ్చిన వ్యక్తి. అయినా పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు.తెలంగాణకు చెందిన జర్నలిస్టు కేవీఆర్‌ను కూడా కక్ష పూరితంగా అరెస్టు చేసి, ఎక్కడో మారుమూల ఉన్న బొబ్బిలి జైలులో పెట్టారు. అది చాలదన్నట్లుగా తమకు విధులకు అడ్డుపడ్డారని చెప్పిన ఆయన భార్యపై కూడా కేసు పెట్టారు. తన పట్ల ఏపీ పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఆమె కేసు పెట్టడంతో పోటీగా ఈ కేసు పెట్టారనుకోవాలి. జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్లపై దాడి చేసినా కేసులు లేవు. ఇవన్ని చూస్తుంటే ఏపీలో సోషల్ మీడియాను అణచివేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాపై సుమారు 1400 కేసులు పెట్టి దేశంలోనే ఒక రికార్డు సృష్టించుకుంది. ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు దిగితే చంద్రబాబు ప్రభుత్వం మరింత అప్రతిష్టపాలవుతుందని చెప్పక తప్పదు. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘ప్రశ్న రావణ్‌తో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధమూ లేదు’
నెల్లూరు: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో కాకాణి మీడియా సమావేశంలో మాట్లాడారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్ష సాధింపు, అతనిపై కేసులపై కేసులు మోపడం వంటి అంశాలపై స్పందించారు. ప్రశ్న రావణ్‌తో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధమూ లేదు. రావణ్ టీడీపీకి చెందిన వ్యక్తేనని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోందని తెలిపారు.‘‘చంద్రబాబు, లోకేశ్‌ను ప్రశంసిస్తూ ప్రశ్న రావణ్ అనేక వీడియోలు పోస్ట్ చేశాడు. తిరుమల లడ్డూపై కూటమి నేతలు పనిగట్టుకుని విషప్రచారం చేశారు. దేవుడి దర్శనం కోసం ఆలయాలకు వచ్చిన భక్తుల ప్రాణాలు తీశారు’’ అని కాకాణి తెలిపారు.ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు.. రాష్ట్రంలో కుప్పకూలిన శాంతిభద్రతల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కాకాణి చెప్పారు. ‘‘యూట్యూబర్ రావణ్‌పై యూఏపీఏ చట్టం ప్రయోగించడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. రావణ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమైతే ఏడాది క్రితమే ఎందుకు చర్యలు తీసుకోలేదు.. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? యూఏపీఏ చట్టాన్ని రాజకీయ కక్షసాధింపునకు వాడటం అత్యంత ప్రమాదకర పరిణామం. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు.. మరో బెయిల్ వస్తే ఇంకో కేసు పెట్టడం చట్టపాలన కాదు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి పోలీసు వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. చంద్రబాబుకు సంక్షోభం వచ్చిన ప్రతిసారీ మతం పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయడం అలవాటే. నిజంగా భక్తి ఉంటే తిరుమల లడ్డూ, ఆలయాల ఘటనలు, భక్తుల భద్రతపై ముందు సమాధానం చెప్పాలి. కస్టోడియల్ డెత్‌లు, పోలీసుల దుర్వినియోగం, శాంతిభద్రతల వైఫల్యంపై ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పాలి.పోలీస్ స్టేషన్లలో మరణాలు, బాధిత కుటుంబాలకు అన్యాయం జరగడం అత్యంత దారుణం. సాయికృష్ణ కేసు ఏమైంది.. క్రాంతికుమార్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి కేసుల్లో పురోగతి ఎందుకు లేదు? ఈ ఘటనలన్నీ చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని చెబుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే కొత్త కథలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. డైవర్షన్ రాజకీయాలు మానేసి శాంతిభద్రతలు, పోలీసుల దుర్వినియోగంపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి" అని తెలిపారు. కాకాణిపై కేసును కొట్టేసిన హైకోర్టు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. రైతులకు అండగా పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు గతంలో కాకాణి నిరసన తెలిపారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పొదలకూరు పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించారు. పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేసింది హైకోర్టు. -
ప్రశ్న రావణ్ పై పవన్ కళ్యాణ్ కు ఎందుకంత కక్ష అంటే.. నేను గన్నవరంలో కేసు పెట్టాడని కారణం కూడా అదే
-
సాయి కృష్ణ పరిస్థితే రావణ్ కి వస్తుందేమో అని నూరి ఫాతిమా షాకింగ్ కామెంట్స్
-
పవన్ పై సాయి కృష్ణ తల్లి ఇచ్చిన హింట్.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన అడ్వకేట్ రజిని
-
Big Question Full : రాజద్రోహం అసలు ఎవరిది...?
-
రావణ్ సంచలన వీడియో పవన్ వెన్నులో వణుకు
-
అసలు టార్గెట్ రావణేనా..? రావణ్‌పై ఎవరి గేమ్..?
-
ప్రశ్న రావణ్ పై ఉపా చట్టం... CPI నారాయణ అదిరిపోయే కౌంటర్
-
రావణికి జైలులో ప్రాణహాని.. కారుమూరి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్
-
ప్రశ్న రావణ్ అరెస్ట్ పై కర్నూల్లో భారీ నిరసన
-
ప్రశ్నించడమే తప్పైతే, మమ్మల్ని ఒకేసారి చంపేయండి.. కన్నీటి ఆవేదన
-
రావణ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్.. ప్రకాష్ రాజ్ ఏమన్నారు?
-
ప్రశ్న రావణ్ పై దేశద్రోహం కేసు.. అంబటి సంచలన ప్రెస్ మీట్
-
టెర్రరిస్టుల పై పెట్టే కేసులు పెట్టి... ప్రశ్నరావణ్ కు రిమాండ్
-
పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?
-
Liveలో పవన్ కళ్యాణ్ వీడియో.. ఉపా కేసు వెయ్యాల్సింది పవన్ కళ్యాణ్ పైనే!
-
ప్రశ్న రావణ్ పై ఉపా చట్టం.. CPI రామకృష్ణ సీరియస్
-
ప్రశ్న రావణ్ చచ్చిపోవాలి అంటా..? 20 మంది పెద్ద పెద్ద లాయర్లను పెట్టి..
-
ప్రశ్న రావణ్ అరెస్ట్ పై వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్
-
14 రోజులు రిమాండ్.. నెల్లూరు జైలుకు ప్రశ్న రావణ్
-
రావణ్ పై రాజద్రోహం కేసు పెట్టి రిమాండ్ కు పంపిస్తున్నావ్.. ఈ రోజు ప్రశాంతంగా నిద్రపో...
-
ఆ మార్ఫింగ్ వీడియోలు ఏంటండీ.. ప్రశ్న రావణ్ భార్య సంచలనం వీడియో
-
నాది రావణ్ ది ఆడియో లీక్.. ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ రియాక్షన్
-
గన్నవరంలో రావణపై పెట్టిన కేసు దారుణం ఉరిశిక్ష పడే సెక్షన్లు..
-
గుర్తుపెట్టుకోండి.. మీరు భయపెడితే భయపడే మనిషి కాదు అతను..
-
'ఇంకా ఎంతకు దిగజారుతారు.. కొత్తగా ఏదైనా ట్రై చేయండి'
టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ మరో వీడియో రిలీజ్ చేశారు. నా గొంతుతో పాటు.. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని క్లియర్ కట్‌గా తెలిసిపోతోందని అన్నారు. ఆడియోను ఎడిట్ చేసి గాలి మాటలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇలాంటి గాలి మాటలను సృష్టించి మీరు చేస్తున్న అక్రమ అరెస్టులు దౌర్జన్యాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా??! అని ప్రశ్నించారు.ఇదంతా జనాలు గమనిస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ ఆడియో మీకు ఎక్కడి నుంచి వచ్చింది?.. సోషల్ మీడియాలో దీన్ని ఎవరు లీక్ చేశారని కౌంటరిచ్చారు. మీరు చేస్తున్న ఈ నాటకం అందరికీ తెలుసని అన్నారు. ఇలా కాకుండా కొత్తగా ఇంకేదైనా ట్రై చేయండని హితవు పలికారు. పదవి ఉందన్న అహంకారంతో ఒక వ్యక్తిని ఇలా అరెస్టు చేయించడం సిగ్గుగా లేదా? అని నిలదీశారు ప్రకాశ్ రాజ్.కాగా..యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రావణ్‌పై కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతోంది. ఇప్పటికే నాలుగు కేసుల్లో బెయిల్ రాగా.. తాజాగా మరో కేసులో అరెస్ట్ చేశారు. రావణ్‌పై గన్నవరం పోలీసు స్టేషన్లో జనసేన నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.Editing voice messages of me asking for spelling corrections in telugu and a minister claiming it as an act of conspiracy to destabilise a government shows your desperation to silence voices of dissent. From where did you this audio ? who leaked it on social media ? #justasking pic.twitter.com/b9r9YaT8WF— Prakash Raj (@prakashraaj) July 5, 2026 -
ఏపీ హైకోర్టుకు ప్రశ్న రావణ్.!
-
ప్రశ్న రావణ్ పై రాజ ద్రోహం కేసు
-
ప్రశ్న రావణ్ ను ఎన్ కౌంటర్ చేయాలని చూస్తున్నారు.. జడ శ్రవణ్ సంచలన నిజాలు
-
ఇంకా ఎంత దిగజారుతార్రా.. నాలుగోసారి బెయిల్, ఐదోసారి అరెస్ట్...
-
ఏంటి నన్ను చంపేస్తారా.. భయపడకుండా సంచలన వీడియో రిలీజ్ చేసిన ప్రశ్న రావణ్
-
రావణ్‌పై రాజద్రోహం కేసు
సాక్షి, కృష్ణా: ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రావణ్‌పై కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతోంది. తాజాగా రావణ్‌పై గన్నవరం పోలీసు స్టేషన్లో జనసేన నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. యలమంచిలి కోర్టు నిన్న(శనివారం) రావణ్‌కు బెయిల్ మంజూరు చేసింది. కాగా, బెయిల్ వచ్చిన కాసేపటికే వేంపాడు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు రావణ్‌ను మళ్లీ అరెస్ట్ చేశారు. జనసేన నేత, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ నిన్న రావణ్‌పై గన్నవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. శివశంకర్ ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విశేషం.దీంతో, హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. అర్ధరాత్రి రావణ్‌ను గన్నవరం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు.. స్టేషన్ లోపలికి ఎవరిని అనుమతించన లేదు. అనంతరం, గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే, రావణ్‌ను మొదట ఏలూరు తీసుకువెళతారని ప్రచారం జరిగినప్పటికీ అర్ధరాత్రి గన్నవరం స్టేషన్‌కి తీసుకువచ్చారు. అయితే, శివశంకర్ ఫిర్యాదుతో రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద U/s 147,148,152,192,197(1)(d),353(1)(b) & Sec 13, 39 of Unlawful Activity Prevention Act 1967 (UAPA Act) కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దేశసార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సమగ్రతకు భంగం కలిగించేలా చర్యలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడటం, దేశద్రోహ పూరిత, తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన ఆరోపణల నేపధ్యంలో కేసు నమోదు చేశారు. -
కక్ష సాధింపు.. మళ్లీ రావణ్ అరెస్ట్
అనకాపల్లి : ప్రశ్న యూట్యూబర్ రావణ్‌పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓ కేసులో బెయిల్ వచ్చిన కాసేపటికే రావణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వేంపాడు టోల్‌ప్లాజా వద్ద రావణ్‌ను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు రావణ్‌కు యలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేయగా, ఆపై కాసేపటికే మళ్లీ అరెస్ట్ చేశారు. తెలుగు యూట్యూబర్ రావణ్‌కు నేడు(శనివారం) యలమంచిలి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో రావణ్ రిమాండ్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. రావణ్‌పై పెట్టిన కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేయడం వరుసగా ఇది నాలుగోసారి. అయితే మళ్లీ రావణ్‌ను అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు అద్దం పడుతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దూషించాడని ఆరోపిస్తూ రావణ్‌పై జనసేన నేతలు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. కోర్టుల్లో రావణ్‌కు వరుసగా బెయిల్ దక్కుతోంది. అయినప్పటికీ, మరో కేసు అంటూ రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.


