'ఇంకా ఎంతకు దిగజారుతారు.. కొత్తగా ఏదైనా ట్రై చేయండి' | Tollywood Actor Prakash Raj Video Released On Prashna Raavan, Questions Audio Manipulation And Arrests, Viral On Social Media | Sakshi
Sakshi News home page

Prakash Raj: 'ఇంకా ఎంతకు దిగజారుతారు.. కొత్తగా ఏదైనా ట్రై చేయండి'

Jul 5 2026 1:27 PM | Updated on Jul 5 2026 3:14 PM

Tollywood actor Prakash raj video released on Raavan arrest

టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ మరో వీడియో రిలీజ్ చేశారు. నా గొంతుతో పాటు.. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని క్లియర్‌ కట్‌గా తెలిసిపోతోందని అన్నారు. ఆడియోను ఎడిట్ చేసి గాలి మాటలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇలాంటి గాలి మాటలను సృష్టించి మీరు చేస్తున్న అక్రమ అరెస్టులు దౌర్జన్యాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా??! అని ప్రశ్నించారు.

ఇదంతా జనాలు గమనిస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ ఆడియో మీకు ఎక్కడి నుంచి వచ్చింది?.. సోషల్ మీడియాలో దీన్ని ఎవరు లీక్ చేశారని కౌంటరిచ్చారు. మీరు చేస్తున్న ఈ నాటకం అందరికీ తెలుసని అన్నారు. ఇలా కాకుండా కొత్తగా ఇంకేదైనా ట్రై చేయండని హితవు పలికారు. పదవి ఉందన్న అహంకారంతో ఒక వ్యక్తిని ఇలా అరెస్టు చేయించడం సిగ్గుగా లేదా? ‍అని నిలదీశారు ప్రకాశ్ రాజ్.

కాగా..యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రావణ్‌పై కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్‌ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టి అరెస్ట్‌ చేయడం జరుగుతోంది. ఇప్పటికే నాలుగు కేసుల్లో బెయిల్ రాగా.. తాజాగా మరో కేసులో అరెస్ట్‌ చేశారు. రావణ్‌పై గన్నవరం పోలీసు స్టేషన్‌లో జనసేన నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement