యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ సంచలన వీడియో | Youtuber Prasanna Ravan Sensational Video | Sakshi
Sakshi News home page

యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ సంచలన వీడియో

Jul 4 2026 8:22 PM | Updated on Jul 4 2026 9:47 PM

Youtuber Prasanna Ravan Sensational Video

సాక్షి, అనకాపల్లి: యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ సంచలన వీడియో చేశారు. ‘‘కూటమి ప్రభుత్వం నా గొంతు నొక్కుతుంది. మీరు చంపితే నేను ఒక్కడినే చచ్చిపోతా.. ప్రశ్నించే వారు చావరు.. మీరు రావణ్‌ను మాత్రమే చంపగలరు.. ప్రశ్నను చంపలేరు. ప్రతీరోజూ 500 మంది పోలీసులు.. ప్రజా సమస్యలు వదిలేసి నా కోసం పని చేస్తున్నారు. ఇంత భయపడుతున్నారా..?. ఎస్పీ క్యాడర్ నుంచి కానిస్టేబుల్ వరకూ అంతా నా కోసం పని చేస్తున్నారు. ఇదా ఏపీలో పరిస్థితి?’’ అంటూ రావణ్‌ ప్రశ్నించారు.

కాగా, రావణ్‌పై పై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓ కేసులో బెయిల్‌ వచ్చిన కాసేపటికే రావణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వేంపాడు టోల్‌ప్లాజా వద్ద రావణ్‌ను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇవాళ(శనివారం) రావణ్‌కు యలమంచిలి కోర్టు బెయిల్‌ మంజూరు చేయగా.. ఆపై కాసేపటికే మళ్లీ అరెస్ట్‌ చేశారు. వేంపాడు టోల్ ప్లాజా వద్ద రావణ్‌ను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావణ్‌పై పెట్టిన కేసుల్లో కోర్టులు బెయిల్‌ మంజూరు చేయడం వరుసగా ఇది నాలుగోసారి. అయితే మళ్లీ రావణ్‌ను అరెస్ట్‌ చేయడం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు అద్దం పడుతోంది.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement