నందిని రెడ్డి చేతుల మీదుగా ‘అలిపిరికి అల్లంత దూరంలో’ ఫస్ట్‌లుక్‌ | Sakshi
Sakshi News home page

నందిని రెడ్డి చేతుల మీదుగా ‘అలిపిరికి అల్లంత దూరంలో’ ఫస్ట్‌లుక్‌

Published Sun, Jul 31 2022 12:43 PM

Nandini Reddy Launches First Look Poster Of Alipiri Ki Allantha Dooramlo Movie - Sakshi

నూతన నటుడు రావణ్ నిట్టూరు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై  రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్‌ నందిని రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆనంద్‌ జె దర్శకత్వం వహిస్తున్నాడు. రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని తాజాగా దర్శకురాలు నందిని రెడ్డి లాంచ్ చేసి యూనిట్ కు బెస్ట్ విశేష్ అందించారు.

ఫస్ట్ లుక్ లో ఒక హొటల్ టెర్రస్ పై హీరో సీరియస్ గా నిలుచుని చూడటం, బ్యాగ్రౌండ్ లో తిరుమల సప్తగిరులు కనిపించడం ఆసక్తికరంగా ఉంది. నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement