పవన్-చంద్రబాబు.. కోర్టు ఏం చెబుతుందో అర్థ‌మ‌వుతోందా మీకు? | Prakash Raj Slams AP Government Over Repeated Arrests Of Youtuber Prashna Raavan Despite Court Bail, Video Went Viral | Sakshi
Sakshi News home page

Prakash Raj: ఏంటీ నాటకం.. ఏంటీ దౌర్జన్యం?

Jul 4 2026 3:07 PM | Updated on Jul 4 2026 4:11 PM

Prakash Raj Reacts Youtuber Raavan Repeat Arrest

యూట్యూబ్, సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాడనే ఆరోపణలతో ప్రశ్న రావణ్‌పై ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. గతంలో నమోదైన రెండు కేసులకు సంబంధించి న్యాయస్థానం ఆయనకు ఉపశమనం కలిగిస్తూ బెయిల్ ఇవ్వగా.. జైలు నుంచి విడుదలయ్యే లోపే మచిలీపట్నంలో నమోదైన కేసును రంగంలోకి తెచ్చిన పోలీసులు.. పక్కా ప్లాన్‌తో రావణ్‌ని మళ్లీ అరెస్ట్ చేసి తరలించారు. ఈ వరుస అరెస్టుల పరిణామాల నేపథ్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ వరస వీడియోలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

'నాలుగు రోజుల నుంచి రావ‌ణ్ నిరాహార‌దీక్ష‌లో ఉన్నాడు. అస‌లు ఆలోచించ‌రా? ఏంటీ నాట‌కం, దౌర్జ‌న్యం. అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. మ‌ళ్లీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. మ‌ళ్లీ అరెస్ట్ చేశారు. మ‌ళ్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెబుతున్న‌దో అర్థ‌మ‌వుతోందా మీకు?' అని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ని ట్యాగ్ చేస్తూ ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement