మరో​సారి కేబినెట్‌ భేటీకి పవన్‌ గైర్హాజరు | Deputy CM Pawan Kalyan Absent From Cabinet Meeting Again | Sakshi
Sakshi News home page

మరో​సారి కేబినెట్‌ భేటీకి పవన్‌ గైర్హాజరు

Aug 6 2026 3:17 PM | Updated on Aug 6 2026 3:38 PM

Deputy CM Pawan Kalyan Absent From Cabinet Meeting Again

సాక్షి, విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మరోసారి రాజకీయ దుమారం రేగుతోంది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ మరోసారి గైర్హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడం ఇది వరుసగా మూడోసారి. గతంలో జరిగిన రెండు మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన రాలేదు.

గతంలో రెండు సార్లు కేబినెట్‌ సమావేశాలు జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి   చంద్రబాబు నిర్వహించే ప్రభుత్వ సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.

ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌.. సీఎం చంద్రబాబు సమీక్షలు, కేబినెట్‌ సమావేశాలకు ఆయన వరుసగా గైర్హాజరవుతుండటం కూటమి సర్కార్‌లో అసలేం జరుగుతోంది?. అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలకు తావిస్తోంది. వరుసగా మూడు కేబినెట్‌ సమావేశాలకు డిప్యూటీ సీఎం డుమ్మా కొట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement