రైల్వేకోడూరు అర్బన్: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేశాడన్న ఆరోపణల నేపథ్యంలో అరవ శ్రీధర్ ఎటువంటి అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని జనసేన పార్టీ అధిష్టానం ఆదేశించింది. తరువాత ఎమ్మెల్యేపై ఆరోపణలను దర్యాప్తు చేయడానికి ముగ్గురితో కూడిన కమిటీని ఏర్పాటుచేసింది. నిర్ణయం తీసుకునేంతవరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆయనకు స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు.
అయితే గురువారం ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లిలో జరిగిన విబీజీ రామ్‌జీ ప్రారంభ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలోనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని వేదికపై ప్రసంగించడం చూస్తుంటే మహిళా ఉద్యోగి కేసు మూలనపడిపోయిందని ప్రతి ఒక్కరూ చర్చించుకుటున్నారు. దీనిపై స్వయంగా అధినేత పవన్‌కళ్యాణ్ సమాధానం చెప్పాల్సి ఉందంటున్నారు.


