OTT
-
రానా నాయుడు సీజన్-2.. టీజర్ వచ్చేసింది
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. కాగా.. సీజన్-1 సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీజన్-2ను కూడా తెరకెక్కించారు.తాజాగా రానా నాయుడు సీజన్-2 టీజర్‌ను విడుదల చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో నిర్వహించిన ఈవెంట్లో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో హీరో రానా సందడి చేశారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌కు విచ్చేసిన రానాకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలతున్నాయి. కాగా.. ఈ వెబ్ సిరీస్‌ను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన ట్విటర్ ద్వారా తెలియజేస్తూ రానా నాయుడు పోస్టర్‌ను పంచుకుంది. తాజాగా రిలీజైన రానా నాయుడు సీజన్-2 అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్‌ను రూపొందించారు. -
రానా నాయుడు సీజన్-2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati) నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్.. నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: వెంకటేశ్- రానా సూపర్ హిట్ కాంబో.. టీజర్ వచ్చేసింది)సీజన్-1 సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీజన్-2ను కూడా తెరకెక్కించారు. తాజాగా రానా నాయుడు సీజన్-2 స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌ను జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన ట్విటర్ ద్వారా తెలియజేస్తూ రానా నాయుడు పోస్టర్‌ను పంచుకుంది. ఇప్పటికే రానా నాయుడు సీజన్-2 టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌తో రానా, వెంకటేశ్ మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు. Jab baat parivaar ki ho, Rana harr line cross karega ❤️🔥Watch Rana Naidu Season 2, out 13 June, only on Netflix. #RanaNaiduOnNetflix pic.twitter.com/NwhRM3MQcE— Netflix India (@NetflixIndia) May 20, 2025 -
టాలీవుడ్లో మరో ఆసక్తికర వెబ్ సిరీస్.. ట్రైలర్ వచ్చేసింది!
రీతూ వర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'దేవిక అండ్ డానీ'. ఈ సిరీస్‌కు బి.కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ను ఫుల్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలోనే విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే దేవిక అండ్ డానీ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరెకెక్కించినట్లు అర్థమవుతోంది. 'ఎవడు భయపెట్టినా.. ఎంత ప్రమాదమైనా రానీ.. వెనకడుగు వేసేదే లేదు'.. అని రీతూ వర్మ చెప్పే డైలాగ్ అభిమానుల్లో మరిన్ని అంచనాలు పెంచేసింది. జియో హాట్ స్టార్ వేదికగా ఈ సిరీస్ జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో సూర్య వసిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వైవా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనిక రెడ్డి, ఐశ్వర్య కీలక పాత్రలు పోషించారు. One holds her hand and the other... her soul. 🤍 https://t.co/zTcVhoqYg3Devika & Danny streaming from 6th June only on #JioHotstar 💌 Directed by @im_kishorudu #DevikaAndDanny #SuryaVashistta @iam_shiva9696 @actorsubbaraju #SoniyaSingh #MounikaReddy #IshwaryaVullingala… pic.twitter.com/OUiWshV7FW— Ritu Varma (@riturv) May 20, 2025 -
సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన దెయ్యం సినిమా.. ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య ఓటీటీల్లో సినిమాలు తెగ సందడి చేసేస్తున్నాయి. ఎప్పుడో రిలీజైన చిత్రాలు ఉన్నట్లుండి ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ థ్రిల్లర్ సినిమా భవానీ వార్డ్ 1997 సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. గాయత్రీ గుప్తా, గణేశ్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ప్రస్తుతానికి ఈ మూవీ చూడాలంటే అద్దె చెల్లించాల్సిందే. రూ.99 అదనంగా చెల్లించి వీక్షించాల్సి ఉంటుంది. మనిషి చనిపోయిన తరువాత ఆత్మ దేవుడి దగ్గరకు వెళ్లాలి.. కానీ, అలా వెళ్లకుండా అదే ఆత్మ ఈవిల్ స్పిరిట్‌గా మారిపోతుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఆద్యంతం ఆడియన్స్‌ను భయపెట్టేలా ఈ సినిమా ఉండనుంది. కాగా.. ఈ సినిమాకు జీడీ నరసింహా దర్శకత్వం వహించారు. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైంది. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని చెప్పొచ్చు. -
ఓటీటీలోకి 'హిట్ 3'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?
నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హిట్ 3'. ఈనెల మొదట్లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మంచి టాక్ తెచ్చుకుంది కానీ అనుకున్నంత స్థాయిలో మాత్రం వసూళ్లు సాధించలేకపోయింది. ప్రస్తుతం అక్కడక్కడ ప్రదర్శితమవుతోంది. ఇకపోతే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డేట్ లాక్ అయిందని అంటున్నారు. ఇంతకీ దీని సంగతేంటి?హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన మూడో సినిమా ఇది. తొలి రెండు పార్ట్స్ సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకోగా.. ఇందులో మాత్రం సస్పెన్స్ తో పాటు యాక్షన్, రక్తపాతాన్ని కాస్త గట్టిగానే దట్టించారు. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ మూవీకి కాస్త దూరం జరిగారు. రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందం జరిగింది. ఈ క్రమంలోనే వచ్చే వారం చివర్లో లేదంటే జూన్ 5న ఓటీటీలోకి ఈ సినిమా రావొచ్చని తెలుస్తోంది. దీనితో పాటు సూర్య 'రెట్రో' కూడా కాస్త అటుఇటుగా ఇదే తేదీల్లో స్ట్రీమింగ్ అవ్వొచ్చు.హిట్ 3 విషయానికొస్తే.. అర్జున్ సర్కార్ (నాని) స్ట్రిక్ట్ పోలీస్. విచిత్రమైన మర్డర్ జరిగితే దాన్ని దర్యాప్తు చేస్తుంటాడు. అయితే ఇలాంటి హత్యలు దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయని తెలుస్తుంది. దీంతో ఆ టాస్క్ మీద అర్జున్ పూర్తిగా దృష్టిపెడతాడు. ఇంతకీ ఈ మర్డర్స్ వెనక ఉన్నది ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తెరపైకి తెలంగాణ అమర జవాన్ బయోపిక్!) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో కేసరి 2, ఏస్, భోల్ చుక్ మాఫ్ తదితర సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవి తప్పితే తెలుగు స్ట్రెయిట్ మూవీస్ ఏం రావట్లేదు. మరోవైపు ఓటీటీలో 30కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే చాలా వరకు ఇంగ్లీష్ మూవీస్-సిరీసులు రానున్నాయి. వీటితో పాటు అర్జున్ సన్నాఫ్ వైజయంతి, అభిలాషం చిత్రాలతో పాటు హార్ట్ బీట్ సీజన్ 2 సిరీస్ ఉన్నంతలో కాస్త చూడదగ్గవిగా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల లిస్ట్ (మే 19-23 వరకు)నెట్ ఫ్లిక్స్సారా సిల్వర్ మన్: పోస్ట్ మార్టమ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 20ఎయిర్ ఫోర్స్ ఎలైట్ (ఇంగ్లీష్ సినిమా) - మే 23బిగ్ మౌత్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - మే 23ఆఫ్ ట్రాక్ 2 (స్వీడిష్ మూవీ) - మే 23అన్ టోల్డ్: ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 23అవర్ అన్ రిటిన్ సియోల్ (కొరియన్ సిరీస్) - మే 24ద వైల్డ్ రోబో (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 24అమెజాన్ ప్రైమ్మోటర్ హెడ్స్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20అభిలాషం (మలయాళ మూవీ) - మే 23హాట్ స్టార్ట్రూత్ ఆర్ ట్రబుల్ (హిందీ రియాలిటీ షో) - మే 19టక్కీ ఇన్ ఇటలీ (ఇంగ్లీష్ సిరీస్) - మే 19ల్యాండ్ మ్యాన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 21హార్ట్ బీట్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మే 22ఫైండ్ ద ఫర్జీ (హిందీ సిరీస్) - మే 23ఆహాఅర్జున్ సన్నాఫ్ వైజయంతి (తెలుగు సినిమా) - మే 23బుక్ మై షోఏ మైన్ క్రాఫ్ట్ మూవీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 20చెక్ మేట్స్ (స్పానిష్ సినిమా) - మే 20కూప్ (ఇంగ్లీష్ మూవీ) - మే 20డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20డ్రాప్ (ఇంగ్లీష్ మూవీ) - మే 20యూఫస్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20ఎల్లిప్సిస్ (స్పానిష్ మూవీ) - మే 20ఫెయిల్యూర్ (ఇంగ్లీష్ సినిమా) - మే 20ఫిల్మ్ లవర్స్ (ఫ్రెంచ్ మూవీ) - మే 20ఐ యామ్ నెవెంకా (స్పానిష్ సినిమా) - మే 20జూలియట్ ఇన్ స్ప్రింగ్ (ఫ్రెంచ్ మూవీ) - మే 20నార్బెర్ట్ (స్పానిష్ సినిమా) - మే 20ఓడిటీ (ఇంగ్లీష్ మూవీ) - మే 20రీటా (స్పానిష్ సినిమా) - మే 20విష్ యూ వర్ హియర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 23ఆపిల్ ప్లస్ టీవీఫౌంటెన్ ఆఫ్ యూత్ (ఇంగ్లీష్ మూవీ) - మే 23(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) -
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ వీకెండ్ ఓటీటీల్లో దాదాపు 25కి పైగా కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజయ్యాయి. మరికొన్ని సడన్ స్ట్రీమింగ్ అయ్యాయి. అలాంటి వాటిలో 'లవ్ డేల్' అనే సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి. పేరుకే మలయాళ సినిమా అయినప్పటికీ ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో రిలీజైంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్) ఫిబ్రవరిలో మలయాళంలో థియేటర్లలో రిలీజైన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'లవ్ డేల్'. కాస్త హారర్ టచ్ ఇచ్చిన ఈ మూవీలో అందరూ కొత్త నటీనటులే ఉండటంతో ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే సొంతం చేసుకుంది. ఇప్పుడీ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ యూకేలో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మన దగ్గర కూడా అందుబాటులోకి రానుంది. 'లవ్ డేల్' అనేది ఊటీలోని ఓ ఊరి పేరు. ఈ మూవీ విషయానికొస్తే మోడల్ కమ్ ఫొటోగ్రాఫర్ అయిన ఓ అమ్మాయి.. తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ ఊరికి వస్తుంది. ఓ బంగ్లాలో వీళ్లంతా ఉంటారు. కానీ ఓ రోజు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఇంతకీ వీళ్లని చంపుతున్నది ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా) -
యూట్యూబ్‌లో కొత్త సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
ప్రముఖ దర్శక కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) డైరెక్షన్లో ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ (Raagin Raj) హీరోగా నటించిన చిత్రం తల. తాజాగా ఈ చిత్రం యూట్యూబ్‌లో విడుదలైంది. అంకిత నస్కర్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. రోహిత్, ఎస్తర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించారు. నిర్మాత శ్రీనివాస్ గౌడ్.మదర్ సెంటిమెంట్‌తో అమ్మ రాజశేఖర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఆయన కుమారుడు రాగిన్ రాజ్‌కు ఇదే ఫస్ట్ సినిమా.. అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. ఈ మూవీలో రెండు పాటలకు తమన్ మ్యూజిక్ అందించడం విశేషం. అయితే, ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మొదట్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం ఉచితంగానే రన్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లేకుంటే యూట్యూబ్‌లో 'తల' సినిమాను చూడొచ్చు.కథహీరో రాగిన్ రాజ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె కోరిక మేరకు హీరో తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని తండ్రిని కలుస్తాడు. తండ్రిని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? తండ్రి కుటుంబంలోని సమస్య ఏంటి? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారు? తనకు పరిచయమైన అమ్మాయి చివరిగా హీరోకు ఏమవుతుంది? అసలు హీరో తల్లిదండ్రులు కలుస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే! -
ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
రీసెంట్ టైంలో ప్రతి భాషలోనూ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాల్ని తీస్తున్నారు. చాలా వరకు అవి హిట్ అవుతున్నాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి కూడా. అలా ఇప్పుడు కన్నడ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎప్పుడు రిలీజ్ కానుంది?సాధారణంగా థ్రిల్లర్స్ అంటే ఎక్కువగా మలయాళ ఇండస్ట్రీ పేరు వినిపిస్తుంది. తాజాగా కన్నడ చిత్రసీమ నుంచి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ 'అజ్ఞాతవాసి'. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్ కూడా అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జీ5 ఓటీటీలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా) మే 28 నుంచి కన్నడతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. 25 ఏళ్లుగా అసలు నేరాలే జరగని ఓ ఊరిలో అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తిని చంపేస్తే ఏమైందనే కాన్సెప్ట్ తో 'అజ్ఞాతవాసి' తీశారు. థ్రిల్లర్స్ అంటే ఆసక్తి ఉంటే దీన్ని అస్సలు మిస్ కావొద్దు.అజ్ఞాతవాసి విషయానికొస్తే.. ఓ ఊరిలో గత 25 ఏళ్లుగా ఒక్క క్రైమ్ కూడా జరగదు. అలాంటి ఊరికి గోవిందు అనే పోలీస్.. బదిలీపై వస్తాడు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్న టైంలో ఊరి పెద్ద హత్యకు గురవుతాడు. పంకజ, రోహిత్, శ్రీనివాసయ్య అనే ముగ్గురిపై గోవిందు అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ హంతకుడు ఎవరు? 1970లో ఇదే ఊరిలో జరిగిన సంఘటనకు ఈ హత్యకు సంబంధమేంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా
ఒకే సినిమా రెండు మూడు ఓటీటీల్లోనూ రిలీజ్ అయిన సందర్భాలు అడపాదడపా ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయింది లేటెస్ట్ తెలుగు మూవీ. కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీ ఇప్పటికే ఒకదానిలో రిలీజ్ కాగా.. ఇప్పుడు మరో దానిలోకి కూడా రాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. రిలీజ్ కి ముందు చాలా హడావుడి చేశారు గానీ సినిమాలో అంత సీన్ లేకపోయేసరికి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కట్ చేస్తే థియేటర్లలోకి వచ్చిన నెలలోపే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (మే 16) నుంచి అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్'తో బలుపు పెరిగింది.. నా ఫ్రెండ్సే నన్ను..: సొహెల్) ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ వచ్చే శుక్రవారం (మే 23) నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. తల్లికొడుకుల బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ ఎమోషనల్ డ్రామా మరి ఓటీటీలో ఏ మేరకు రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి?అర్జున్ సన్నాఫ్ వైజయంతి విషయానికొస్తే.. వైజయంతి (విజయశాంతి) సిన్సియర్ పోలీసాఫీసర్. ఈమె కొడుకు అర్జున్ కూడా పోలీస్ అయ్యేందుకు కష్టపడుతుంటారు. కానీ ఓ సందర్భంలో తన తండ్రిని చంపిన హంతకుడిని అందరూ చూస్తుండానే అర్జున్ చంపేస్తాడు. దీంతో తల్లికొడుకుల మధ్యం దూరం పెరుగుతుంది. మరి వీళ్లిద్దరూ కలిశారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
శవంతో కామెడీ.. క్రేజీ డార్క్ కామెడీ మూవీ రివ్యూ (ఓటీటీ )
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలానే తాజాగా సోనీ లివ్ లోకి వచ్చిన డార్క్ కామెడీ మూవీ 'మరణమాస్'. మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శవంతో కామెడీ చేయడం క్రేజీ అనే చెప్పొచ్చు. ఇంతకీ సినిమా ఎలా ఉంది? దీని సంగతేంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) కథేంటి?ముసలివాళ్లని మాత్రమే టార్గెట్ చేసే సీరియల్ కిల్లర్.. వారిని చంపేసి, నోటిలో అరటిపండు పెట్టి వెళ్లిపోతుంటాడు. అదే ఊరిలో ఉంటున్న ల్యూక్ (బాసిల్ జోసెఫ్).. బనానా కిల్లర్ అనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. జెస్సీ(అనీష్మా) అనే అమ్మాయిని ల్యూక్ ప్రేమిస్తుంటాడు. ఓ రోజు జెస్సీ బస్సులో ఇంటికి తిరిగొస్తున్నప్పుడు ఓ ముసలివాడు ఈమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. కోపమొచ్చి అతడి ముఖంపై పెప్పర్ స్ప్రే కొడుతుంది. దీంతో చనిపోతాడు. అదే టైంకి ల్యూక్.. జెస్సీ కోసం బస్సు ఎక్కుతాడు. వీళ్లతో పాటే సదరు సీరియల్ కిల్లర్ కూడా బస్సులోనే ఉంటాడు. మరి సీరియల్ కిల్లర్ గురించి జెస్సీ, ల్యూక్ కి తెలిసిందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?మన దగ్గర కొందరు దర్శకులు.. తీసిన కథలతోనే సినిమాలు తీసి తీసి ప్రేక్షకులకు చిరాకొచ్చేలా చేస్తుంటారు. ఏమంటే స్టోరీల్లేవు అని అంటుంటారు. అదే మలయాళంలో మాత్రం చాలా చిన్న పాయింట్ తీసుకుని వాటితో ఏకంగా మూవీస్ తీసేస్తుంటారు. అలా తీసిన చిత్రమే ఇది.మసలివాళ్లని మాత్రమే చంపి, వాళ్ల నోటిలో అరటిపండు పెట్టే సీరియల్ కిల్లర్. సినిమా మొదట్లోనే ఇతడెవరో చూపించేస్తారు. మరోవైపు హీరోహీరోయిన్ ప్రేమకథ, ఇంకోవైపు బస్సు డ్రైవర్, కండక్టర్ స్టోరీలు. దీనికి తోడు ఓ శవం. అసలు ఓ మనిషి చనిపోయాడని బయటకు తెలియకుండా ఉండేందుకు ఈ ఐదుగురు ఎలాంటి పాట్లు పడ్డారు. ఎలా నవ్వించారనేదే స్టోరీ.ఒకదానికి ఒకటి ఏ మాత్రం సంబంధం లేని పాత్రల్ని తీసుకొచ్చి ఓ వృద్ధుడి మరణంతో లింక్ చేయడం థ్రిల్లింగ్ గా ఉంటుంది. మరీ పగలబడి నవ్వేంత సీన్లు అయితే ఉండవు కానీ టైమ్ పాస్ అయిపోతుంది. చూస్తున్నంతసేపు సినిమా అలా నడిచేస్తూ ఉంటుంది. బనానా కిల్లర్ ఎందుకు ముసలి వాళ్లని మాత్రమే చంపుతున్నాడనే విషయాన్ని చివర్లో రివీల్ చేస్తారు గానీ అదేమంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు.శవంతో కామెడీ చేయడం ఏంటా అనిపిస్తుంది గానీ సినిమా చూస్తున్నప్పుడు అదేమంత ఇబ్బందిగా అనిపించదు. చివరలో ఓ ట్విస్ట్‌తో నవ్వులు పంచే ప్రయత్నం చేశారు. కథను కామెడీగా చెప్పినప్పటికీ.. అంతర్లీనంగా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమ్మాయిల ఆత్మరక్షణ లాంటి అంశాలు కూడా ఆలోచించేలా చేస్తాయి. ఎవరెలా చేశారు?డబ్బింగ్ చిత్రాలతో మనకు బాగా పరిచయమైన బాసిల్ జోసెఫ్.. ఎప్పటిలానే మరో డిఫరెంట్ పాత్రలో ఆకట్టుకున్నాడు. జట్టుకి కలర్ తో భలే వెరైటీగా కనిపిస్తాడు. హీరోయిన్ గా చేసిన అనీష్మా, సీరియల్ కిల్లర్ గా చేసిన శ్రీకుమార్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ గానూ సినిమా బాగుంది. పాటలేం లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సింపుల్ పాయింట్ ని వీలైనంత ఫన్నీగా తీయడానికి దర్శకుడు కష్టపడ్డాడు. ఈ ప్రయత్నంలో కొంతమేర సక్సెస్ అయ్యాడు. ఈ వీకెండ్ ఏదైనా కాస్త ఫన్, కాస్త థ్రిల్ ఉండే మూవీ చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సోనీ లివ్ లో ప్రస్తుతం తెలుగులోనూ అందుబాటులో ఉంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. అనసూయ పోస్ట్ వైరల్) -
మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. కానీ
ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తుంటాయి. కొన్నిసార్లు థియేటర్లలో రిలీజైన కొన్ని వారాలకే స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు కూడా ఓ తెలుగు మూవీ అలానే ఓటీటీలోకి వచ్చింది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది?గత నెల 24న థియేటర్లలో రిలీజైన తెలుగు మూవీ 'చౌర్యపాఠం'. బ్యాంక్ దొంగతనం నేపథ్య కథతో తీశారు. బాగానే ప్రమోట్ చేశారు కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మూడు వారాలకే ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం ఓవర్సీస్ (విదేశాల్లో) తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.(ఇదీ చదవండి: ఈ రోజుని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.. అనసూయ పోస్ట్ వైరల్) బహుశా వచ్చే వారం మన దేశంలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి రావొచ్చు అనిపిస్తుంది. ప్రముఖ దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. నిఖిల్ దర్శకత్వం వహించాడు. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లు కాగా మస్త్ అలీ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
ఓటీటీలో 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'.. ఉచితంగానే స్ట్రీమింగ్
విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. భారీ యాక్షన్ కాన్సెప్ట్‌తో నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చెప్పే అర్జున్ సన్నాఫ్ వైజయంతిని ఈ వీకెండ్లో ఇంట్లోనే చూసేయండి.ఏప్రిల్ 18న విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు భారత్‌లో ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతుంది. కొద్దిరోజుల క్రితం యూకేలో ఉన్నవాళ్లు అద్దె విధానంలో మాత్రమే చూసే అవకాశం కల్పిస్తూ ఓటీటీలో విడుదల చేశారు. అయితే, ఇప్పుడు సడెన్‌గా భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు.అర్జున్ సన్నాఫ్ వైజయంతి కథ విషయానికొస్తే.. సీన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయశాంతి). ఈమెకు ఓ కొడుకు అర్జున్ (కల్యాణ్ రామ్). ఐపీఎస్ అవ్వడానికి రెడీగా ఉన్న ఇతడు.. తండ్రిని ఓ క్రిమినల్ చంపేశాడని పగతో రగిలిపోతుంటాడు. తల్లికి ఇదంతా ఇష్టముండదు. అనుకోని పరిస్థితిలో అర్జున్ ఆ హంతకుడిని అందరూ చూస్తుండగా చంపుతాడు. అప్పటి నుంచీ తల్లీకొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. చివరకు వారిద్దరూ ఎలా కలుసుకున్నారు..? తల్లి కోసం కొడుకు చేసిన త్యాగం ఏంటి? అనేదే మిగతా స్టోరీ. -
రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'ఎలెవన్' అనే చిన్న సినిమా తప్పితే చెప్పుకోదగ్గ రిలీజులు ఏం లేవు. మరోవైపు ఓటీటీలో మాత్రం 24 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి. ఇవన్నీ రెండు రోజుల్లోనే స్ట్రీమింగ్ కావడం విశేషం.(ఇదీ చదవండి: డేటింగ్లో సమంత.. స్పందించిన మేనేజర్)ఓటీటీల్లోకి వచ్చిన వాటిలో మరణమాస్, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, గేంజర్స్, జాలీ ఓ జింఖానా చిత్రాలు ఉన్నంతలో చూడదగ్గవి. ఇవి కాకుండా మరికొన్ని ఇంగ్లీష్, హిందీ మూవీస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు (మే 16)అమెజాన్ ప్రైమ్అర్జున్ సన్నాఫ్ వైజయంతి - తెలుగు మూవీభోల్ చుక్ మాఫ్ - హిందీ సినిమాఏ వర్కింగ్ మ్యాన్ - తెలుగు డబ్బింగ్ మూవీగేంజర్స్ - తెలుగు డబ్బింగ్ సినిమాలవ్ ఆఫ్ రెప్లికా సీజన్ 1 - చైనీస్ సిరీస్వైట్ ఔట్ - ఇంగ్లీష్ మూవీ (రెంట్)వన్ ఆఫ్ దెమ్ డేస్ - ఇంగ్లీష్ సినిమాసలాటే సలనాటే - మరాఠీ మూవీవన్ లైఫ్ - ఇంగ్లీష్ సినిమామనడ కడలు - కన్నడ మూవీసోనీ లివ్ మరణమాస్ - తెలుగు డబ్బింగ్ సినిమానెట్ ఫ్లిక్స్ద క్విల్టర్స్ - ఇంగ్లీష్ మూవీబెట్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ఐ సా ద టీవీ గ్లో - ఇంగ్లీష్ మూవీజానెట్ ప్లానెట్ - ఇంగ్లీష్ సినిమాసాసాకీ అండ్ పీప్స్ - జపనీస్ సిరీస్వినీ జూనియర్ - పోర్చుగీస్ మూవీహాట్ స్టార్డస్టర్ - ఇంగ్లీష్ సిరీస్హే జునూన్ - హిందీ సిరీస్వుల్ఫ్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీ (మే 17)సన్ నెక్స్ట్నెసిప్పయ - తమిళ మూవీఆపిల్ ప్లస్ టీవీడియర్ ప్రెసిడెంట్ నౌ - ఇంగ్లీష్ సినిమామర్డర్ బాట్ - ఇంగ్లీష్ సిరీస్ఆహాజాలీ ఓ జింఖానా - తెలుగు డబ్బింగ్ సినిమా(ఇదీ చదవండి: 'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు) -
ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లింగ్ కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు, దర్శకుడు సుందర్ సి కలిసి నటించిన 'గ్యాంగర్స్' చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు 15 ఏళ్ల తరువాత వీరిద్దరూ కలిసి నటించడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించేలా కలెక్షన్స్ రాబట్టింది. ఖుష్బు సుందర్ నిర్మించిన ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు.'గ్యాంగర్స్' తమిళ యాక్షన్ కామెడీ మూవీ తాజాగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో సడెన్‌గా స్ట్రీమింగ్కు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, మునిష్కాంత్, భగవతి పెరుమాల్ నటించగా వెంకట్ రాఘవన్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.వినోదభరిత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో వడివేలు సింగారన్ అనే పాత్రలో నటించారు. ఒక చిన్న పట్టణంలో ఉండే పాఠశాలలో ఒక బాలిక తప్పిపోతుంది, ఉపాధ్యాయురాలు సుజిత (కేథరిన్ థ్రెసా) ఆమెను కనుగొనమని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఈ కేసును పూర్తి చేసేందుకు ఓ పోలీసు అధికారి రహస్యంగా అదే స్కూల్లో పీటీగా అండర్ కవర్లో నియమించబడతారు. పోలీస్ అధికారి రాకతో అసలు పీటీ (వడివేలు) పరిస్థితి ఏంటి..? ఇన్వెస్టిగేషన్ సాగుతున్న క్రమంలోనే కథ మరో మలుపు తిరుగుతుంది. స్థానికంగా ఉండే ముగ్గురు రౌడీల వద్ద ఉన్న డబ్బును దోచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తారు. వీరికి, తప్పిపోయిన బాలికకు ఉన్న లింక్ ఏంటి..? వంటి అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. -
6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. స్టార్ హీరోలు, యంగ్ హీరోల నటించిన చిత్రాలు వీలైనంత త్వరగా వచ్చేస్తాయి. కానీ కొన్ని చిన్న మూవీస్ కి మాత్రం చాన్నాళ్లకు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఓ తెలుగు సినిమా దాదాపు ఆరు నెలల తర్వాత సడన్ గా వచ్చేసింది.గతేడాది నవంబర్ లో రిలీజైన తెలుగు మూవీ 'సినిమా పిచ్చోడు'. కుమారస్వామి హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. పెద్దగా ఆకట్టుకోని స్టోరీ, తక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రం కావడంతో థియేటర్లలోకి వచ్చి వెళ్లిన సంగతి కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.(ఇదీ చదవండి: రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో) సినిమా పిచ్చోడు విషయానికొస్తే.. జోష్ అలియాస్ కుమారస్వామి గ్రామంలో పాలు అమ్ముతుంటాడు. కానీ సినిమాలంటే పిచ్చి. అందుకే ఊరిలో వాళ్లని పేరుతో కాకుండా సినిమా పేర్లతో పిలుస్తుంటాడు. ఓసారి భాను.. డెమో ఫిల్మ్ తీసేందుకు జోష్ ఉంటున్న ఊరికి వస్తుంది. ఈ క్రమంలో అనుకోకుండానే జోష్ కి నటించే అవకాశమొస్తుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. మరణమాస్, భోల్ చుక్ మాఫ్, నెసిప్పయ అనే సినిమాలు రాబోతున్నాయి. గత వీకెండ్ లో రాబిన్ హుడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్, ఓదెల 2, కాలమే కరిగింది తదితర తెలుగు చిత్రాలు వచ్చాయి. ఈ వీకెండ్ మరి ఏమేం తెలుగు మూవీస్ ఓటీటీలోకి వస్తాయో చూడాలి?(ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు) -
ఓటీటీలోకి మరింత లేటుగా రీసెంట్ హిట్ సినిమా
కొన్ని సినిమాలు ఊహించిన దానికంటే సూపర్ హిట్ అవుతుంటాయి. అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుంటాయి. రీసెంట్ టైంలో అలా ఏ మాత్రం అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయిన మూవీ 'తుడరమ్'. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.మార్చి చివర్లో ఎల్ 2:ఎంపురాన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన మోహన్ లాల్ కాస్త నిరాశపరిచాడు. ఇది వచ్చిన నెలరోజులకే 'తుడరమ్' చిత్రంతో వచ్చారు. ఊహించని విధంగా ఇది సక్సెస్ అయింది. ప్రస్తుతం రూ.200 కోట్లకు పైగా వసూళ్లుతో ఇంకా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది.(ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి అవమానం? వివాదంపై స్పందించిన హీరో)అసలు ప్రచారమే లేకుండా తెలుగులోనూ రిలీజ్ చేస్తే రూ.2 కోట్ల మేర వసూళ్లు వచ్చాయట. దీంతో ఓటీటీ రిలీజ్ విషయంలో ప్లాన్ మారిందట. లెక్క ప్రకారం గత వారం స్ట్రీమింగ్ కావాలి. కానీ థియేటర్లలో ఇంకా ఆదరణ వస్తున్న దృష్ట్యా ఓటీటీ రిలీజ్ మరికొన్నాళ్లు ఆలస్యం కానుందట. అంటే జూన్ లో స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది.తుడరమ్ విషయానికొస్తే.. బెంజ్ అనే ట్యాక్సీ డ్రైవర్. అతడి భార్య లలిత. రన్ని అనే ఓ చిన్న ఊళ్లో వీళ్లు తమ ఇద్దరు పిల్లలో హాయిగా జీవిస్తుంటారు. బెంజ్ కు ఓ బ్లాక్ అంబాసిడర్ కారు ఉంటుంది. అదంటే అతనికి ఎంతో ఇష్టం. ఒకరోజు బెంజ్ కొడుకు ఫ్రెండ్స్ ఆ కారును చెన్నైకి తీసుకెళ్తారు. అదే కథని మలుపు తిప్పుతుంది. ఆ కారులో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారంటూ పోలీసులు సీజ్ చేస్తారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రాంగ్ రూట్ లో తెలుగు హీరో.. నిలదీసిన కానిస్టేబుల్) -
థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో టాప్-2లో ట్రెండింగ్!
సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda) నటించిన జాక్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 10న విడుదలైన థియేటర్లలో విడుదలై భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.అయితే జాక్ మూవీ ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. మే 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న జాక్ ఏకంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం జాక్ మూవీ టాప్-2లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళంలో అందుబాటులో ఉంది.డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధు.. జాక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ అంచనాలు తప్పడంతో అంతా రివర్స్ అయింది. ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. సుమారు రూ. 36 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 7 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి.#Jack is back… and he’s trending! 💥Now streaming and sitting pretty at #2 on @NetflixIndia!❤️🔥Watch now in Telugu, Tamil, Hindi, Kannada & Malayalam!🔗 https://t.co/PjBIjRjVYv#JackOnNetflix #SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @Prakashraaj #AchuRajamani… pic.twitter.com/HZotUC59tU— SVCC (@SVCCofficial) May 13, 2025 -
ఓటీటీలోకి వచ్చేసిన ప్రభుదేవా కామెడీ ఎంటర్టైనర్!
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు డబ్బింగ్ చిత్రాలు నేరుగా తెలుగు స్ట్రీమింగ్ అయిపోతుంటాయి. ఇప్పుడు అలానే ఓ తమిళ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?కొరియోగ్రాఫర్ గా మనకు తెలిసిన ప్రభుదేవా.. గత కొన్నాళ్ల నుంచి పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు. హీరో, సహాయ పాత్రల్లో నటిస్తున్నాడు. ఇతడు హీరోగా నటించిన మూవీ 'జాలీ ఓ జింఖానా'. గతేడాది నవంబరులో తమిళంలో థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు తెలుగు వెర్షన్ ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇంటికి పేరు కూడా)నేటి(మే 15) నుంచి ఆహా ఓటీటీలో ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. శవం బ్యాక్ డ్రాప్ కథతో తీసిన ఈ చిత్రం తమిళంలో జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు తెలుగు వెర్షన్ ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. 'జాలీ ఓ జింఖానా' విషయానికొస్తే.. తంగసామి అనే వ్యక్తి కొందరు మహిళలతో కలిసి హోటల్ నడుపుతుంటాడు. అనుకోకుండా ఆ ప్రాంత ఎమ్మెల్యేతో వీళ్లకు గొడవ అవుతుంది. దీని తర్వాత మరో సమస్య వస్తుంది. దీన్ని నుంచి గట్టెక్కిస్తాడని ఓ లాయర్ దగ్గరకు వీళ్లంతా వెళ్తారు. అతడికి కలవడానికి వెళ్లేసరికి అతడు శవమై కనిపిస్తాడు. ఇంతకీ ఎలా చనిపోయాడు? బతికున్నాడని కవర్ చేయడానికి ఎలాంటి పాట్లు పడ్డారనేదే స్టోరీ.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా)They packed bags, snacks… and a dead body? 🚗💀Discover the most unexpected family journey in #JollyOGymkhana on aha!Watch #jollyogymkhana from May 15 on #aha#prabhudeva #Pujithaponnada #yogibabu #MadonnaSebastian pic.twitter.com/LGhsS1qCCW— ahavideoin (@ahavideoIN) May 13, 2025 -
ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు.. మోస్ట్ అవైటేడ్ ఇవే!
ఓటీటీలు వచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్‌లకు కొదవే లేదు. థియేటర్లలో రిలీజైన నెలలోపే కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇకపోతే వెబ్ సిరీస్‌లు సైతం ఓటీటీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. మిస్టరీ, క్రైమ్ సిరీస్‌లతో పాటు కామెడీ వెబ్ సిరీస్‌లు సైతం వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్లో వెబ్ సిరీస్‌లకు ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే వరుస సీజన్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గతేడాది మెప్పించిన సిరీస్‌లు.. కొత్త ఏడాదిలోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న వాటిపై మనం ఓ లుక్కేద్దాం పదండి.రానా నాయుడు సీజన్-2..విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. రానా నాయుడు సీజన్-2 త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.పంచాయత్ సీజన్-4..పంచాయత్ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. జితేంద్ర కుమార్, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే మూడూ సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ ఏడాది పంచాయత్ సీజన్ 4 కూడా స్ట్రీమింగ్కు వస్తోంది. జూలై 2వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది.ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-3బాలీవుడ్లో అభిమానుల క్రేజ్ దక్కించుకున్న మరో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ భాజ్‌పేయి కీలక పాత్రలో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే మూడో సీజన్ కూడా అలరించేందుకు వస్తోంది. ఈ సంవత్సరం నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.అసుర్ సీజన్-3..మరో బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ అసుర్ మూడవ సీజన్ కూడా వస్తోంది. అర్షద్ వార్సీ, బరున్ సోబ్తి, అనుప్రియ గోయెంకా నటించిన ఈ సిరీస్ ఈ ఏడాది చివర్లో ప్రముఖ ఓటీటీ జియో హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.మిర్జాపూర్ సీజన్- 4..మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఇప్పటికే మూడు సీజన్స్ హిట్‌కాగా.. మీర్జాపూర్ సీజన్-4 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త సీజన్ రిలీజ్ ఎప్పడనేది ఇప్పటివరకు ప్రకటించలేదు.ఫర్జీ సీజన్-2..విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో వచ్చిన సూపర్ హిట్ సిరీస్ ఫర్జీ. సీజన్ -1 హిట్ కావడంతో అభిమానులు రెండవ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ సీజన్ 2 డిసెంబర్ ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సుంది. -
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే
మరో వారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావట్లేదు. దీంతో గతవారం రిలీజైన సింగిల్, శుభం చిత్రాలే ఉండనున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ చెప్పుకోదగ్గర మూవీస్ ఏం లేవు.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా) ఉన్నంతలో 8 సినిమాలు-సిరీసులు మాత్రమే ప్రస్తుతానికి స్ట్రీమింగ్ కానున్నాయి. వీకెండ్ వచ్చేసరికి సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు రిలీజులు ఉండొచ్చు. ఈ వారం చూడదగ్గ వాటిలో మరణమాస్, నెసిప్పయ, భోల్ చుక్ మాఫ్ చిత్రాలు ఉన్నంతలో చూడొచ్చని అనిపిస్తున్నాయి.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మే 12-18 వరకు)నెట్ ఫ్లిక్స్సీ4 సింటా (తమిళ సినిమా) - మే 12హాట్ స్టార్ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద వార్ ఆఫ్ ద రోహ్రిమ్ (ఇంగ్లీష్ సినిమా) - మే 13హై జునూన్ (హిందీ సిరీస్) - మే 16వూల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17అమెజాన్ ప్రైమ్భోల్ చుక్ మాఫ్ (హిందీ మూవీ) - మే 16సోనీ లివ్మరణమాస్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 15సన్ నెక్స్ట్ నెసిప్పయ (తమిళ సినిమా) - మే 16బుక్ మై షో స ల టే స ల న టే (మరాఠీ సినిమా) - మే 13మనోరమ మ్యాక్స్ప్రతినిరపరాధి యానో (మలయాళ మూవీ) - మే 12(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా) -
హార్ట్ బీట్ పెంచే వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ వెబ్ ప్రపంచంలో హార్ట్‌బీట్ సిరీస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కనిపిస్తుంది. సెంటిమెంట్, పదవి కోసం పోరాటం అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయినా హార్ట్‌బీట్ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో దీనికి కొనసాగింపుగా సీజన్–2 రూపొందించారు మేకర్స్. ఈ సిరీస్‌కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. రెజిమల్ సూర్య థామస్ ఛాయాగ్రహణం, చరణ్ రాఘవన్ సంగీతాన్ని అందించారు. ఏ టెలీ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ పతాకంపై రాజవేలు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.ఈనెల 22 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగు, తమిళం, హిందీలో భాషల్లో అందుబాటులో ఉండనుందని ప్రకటించాకరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పాటను విడుదల చేశారు. కాగా.. ఈ సిరీస్‌లో దీపా బాలు, అనుమోన్, యోగలక్ష్మీ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు అక్షిత, శివం, అబ్దుల్, అమైయ, టీఎం కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. The wait ends with a beat.. Save the date May 22 ❤️❤️🩺#HotstarSpecials Heart Beat Season 2 Streaming from May 22 only on JioHotstar#HotstarSpecials #HeartBeatSeason2 #HeartBeatS2 #HB2 #HB2ComingSoon #LubDubOnHotstar #HeartBeatS2OnHotstar #HeartBeatS2onJioHotstar… pic.twitter.com/cLIci1QpOb— JioHotstar Tamil (@JioHotstartam) May 10, 2025 -
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా
మరో కొత్త తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీకెండ్ దాదాపు 30కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. వీటిలో ఓదెల 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్ తదితర తెలుగు చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ కూడా ఎలాంటి హడావుడి లేకుండా డిజిటల్ గా అందుబాటులోకి వచ్చింది.కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. తల్లి కొడుకు సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో తీసిన ఈ చిత్రం ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కి ముందు చాలా హడావుడి చేశారు గానీ మూవీలో అంత సీన్ లేకపోయేసరికి ఓ మాదిరి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా) ఇకపోతే ఇప్పుడు మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ.. యూకేలో ఉన్నవాళ్లు అద్దె విధానంలో మాత్రమే చూడొచ్చు. రాబోయే శుక్రవారం లేదా గురువారం ఇండియాలో అందుబాటులోకి రావొచ్చేమో?అర్జున్ సన్నాఫ్ వైజయంతి విషయానికొస్తే.. సీన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయశాంతి). ఈమెకు ఓ కొడుకు అర్జున్ (కల్యాణ్ రామ్). ఐపీఎస్ అవ్వడానికి రెడీగా ఉన్న ఇతడు.. తండ్రిని ఓ క్రిమినల్ చంపేశాడని పగతో రగిలిపోతుంటాడు. తల్లికి ఇదంతా ఇష్టముండదు. అనుకోని పరిస్థితిలో అర్జున్ ఆ హంతకుడిని అందరూ చూస్తుండగా చంపుతాడు. అప్పటి నుంచీ తల్లీకొడుకుల మధ్యలో ఒక గ్యాప్. చివరకు ఏమైంది? తల్లికొడుకులు కలిశారా? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) -
ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా
హీరో నితిన్ లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్' ఓటీటీలోకి వచ్చేసింది. మార్చిలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. కామెడీ మూవీ అన్నారు గానీ ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో నవ్వించలేకపోయింది. ఇప్పుడీ చిత్రం అటు టీవీ, ఇటు ఓటీటీలోకి ఒకేసారి వచ్చింది.(ఇదీ చదవండి: భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన డాక్టర్ బాబు) నితిన్-శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్.. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇక డిజిటల్ హక్కులు దక్కించుకున్న జీ5 సంస్థ.. తాజాగా శనివారం నాడు సాయంత్రం 6 గంటలకు టీవీలో టెలికాస్ట్ చేసింది. అదే టైంలో ఓటీటీలోకి కూడా తీసుకొచ్చేసింది. గతంలో సంక్రాంతి వస్తున్నాం చిత్రానికి ఇలానే చేసి మంచి వ్యూయర్ షిప్ సొంతం చేసుకున్నారు. రాబిన్ హుడ్ విషయానికొస్తే.. రామ్ అలియాస్ రాబిన్ హుడ్ (నితిన్) చిన్నప్పుడే దొంగగా మారతాడు. ధనవంతుల నుంచి డబ్బులు దొంగిలించి అనాథ శరణాలయాలకు దానం చేస్తుంటాడు. మరోవైపు రుద్రకొండలో కరుడుగట్టిన విలన్ ఉంటాడు. తన వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటాడు. ఇంకోవైపు ఆస్ట్రేలియాలో ఉన్న వాసుదేవ్ కుమార్తె రీనా (శ్రీలీల) తాతని చూసేందుకు ఇండియా వస్తుంది. ఈ మూడు పాత్రలు ఎలా కలిశాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: హీరో జయం రవి భార్య- ప్రియురాలి మధ్య మాటల యుద్ధం!) -
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అలా ఈ శుక్రవారం 30కి పైగా కొత్త చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. శనివారం నాడు సడన్ గా మరో తెలుగు మూవీ ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వచ్చింది. ఇంతకీ ఏంటా? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకున్నా.. హీరోయిన్ అమలాపాల్)గతేడాది డిసెంబరు 27న థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'కర్ణ పిశాచి'. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని భరత్ సిగిరెడ్డి నిర్మించగా, విజయ్ మల్లాది దర్శకత్వం వహించారు. ప్రణవి, రమ్యశ్రీ, నిఖిల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని నిర్మించిన భరత్ సిగిరెడ్డి.. కీలక పాత్రలోనూ నటించారు. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంది.కర్ణ పిశాచి విషయానికొస్తే.. ప్రేమతో పాటు జీవితంలోనూ ఓ యువకుడు ఫెయిల్ అవుతాడు. దీంతో తాగుబోతుగా మారిపోతాడు. ఓ సందర్భంలో అనుకోకుండా తన పూర్వీకులకు సంబంధించిన ఓ గ్రంథం ఈ కుర్రాడికి దొరుకుతుంది. ఆ పుస్తకం కారణంగా యువకుడి జీవితం ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) -
ఆహాలో 'మదర్స్ డే 'కానుక.. ఉచితంగానే నివేదా థామస్ హిట్ సినిమా
‘హ్యాపీ మదర్స్ డే అమ్మా!’ అంటూ.. మే 11న కొంత సమయం అయినా సరే అమ్మతో సంతోషంగా గడుపుతారు. ఆమ్మ ప్రేమ గురించి వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. అవన్నీ సూపర్ హిట్ అందుకున్నాయి కూడా.. అయితే, ఈ మాతృదినోత్సవం (Mother's Day) సందర్భంగా కుటుంబం మొత్తం కలిసి '35–చిన్న కథ కాదు' సినిమాను చూసేయండి. ఉచితంగానే ఈ చిత్రాన్ని చూడొచ్చని ఆహా తెలుగు ప్రకటించింది. మే 10, 11 తేదీలలో మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.'35–చిన్న కథ కాదు' సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రేక్షకులను మెప్పించింది. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాదిలో తెలుగు, తమిళ, మలయాళంలో విడుదలయింది. అయితే, ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదలైంది. మదర్స్‌డే (మే 11) కానుకగా ఉచితంగా చూసేందుకు ఆహా సంస్థ అవకాశం కల్పించింది. నందకిశోర్ ఇమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో నివేదా మొదటిసారి తల్లి పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.కథేంటంటే..తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్‌లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు.కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. దీంతో అరుణ్‌కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్‌కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్‌కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ఓటీటీల్లోకి వచ్చేసిన 32 సినిమాలు.. అవి మిస్ అవ్వొద్దు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో సమంత నిర్మించిన 'శుభం', శ్రీ విష్ణు 'సింగిల్' సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటికి టాక్ పర్వాలేదనిపించేలా వచ్చింది. మరోవైపు ఓటీటీల్లో ఈ ఒకటి రెండు రోజుల్లో ఏకంగా 30కి పైగా సినిమాలు-సిరీసులు అందుబాటులోకి వచ్చాయి.(ఇదీ చదవండి: ‘#సింగిల్’ మూవీ రివ్యూ)ఓటీటీల్లో ఈ వీకెండ్ చూడదగ్గ వాటిలో గుడ్ బ్యాడ్ అగ్లీ, రాబిన్ హుడ్, ద డిప్లమాట్, ఓదెల 2, కాలమే కరిగింది చిత్రాలు కనిపిస్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయండోయ్. ఇంతకీ ఏ చిత్రం ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (మే 09)నెట్ ఫ్లిక్స్ద డిప్లమాట్ - హిందీ సినిమాద రాయల్స్ - హిందీ మూవీటూ హ్యాండిల్ టూ ఇటాలియన్ సీజన్ 1 - ఇటాలియన్ సిరీస్నోన్నాస్ - ఇంగ్లీష్ సినిమాబ్యాడ్ ఇన్ఫ్లూయెన్స్ - స్పానిష్ మూవీజాక్ - తెలుగు సినిమాగుడ్ బ్యాడ్ అగ్లీ - తెలుగు డబ్బింగ్ మూవీబ్లడ్ ఆఫ్ జ్యూస్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ఫరెవర్ - తెలుగు డబ్బింగ్ సిరీస్హోల్డ్ మీ క్లోజ్ - తగలాగ్ మూవీకరోల్ జీ - ఇంగ్లీష్ సినిమాఅమెజాన్ ప్రైమ్ఓదెల 2- తెలుగు సినిమాగ్రామ చికిత్సాలయ్ - హిందీ సిరీస్ఏ బిట్టర్ స్వీట్ లైఫ్ - కొరియన్ సినిమాఆఫ్టర్ 30 - నైజీరియన్ మూవీనడికలిల్ సుందరి యమున - మలయాళ సినిమావామన - కన్నడ సినిమాఔసెప్పింటే ఒసియాతు - మలయాళ మూవీఆక్టోపస్ - ఇంగ్లీష్ సిరీస్టెన్ అవర్స్ - తమిళ సినిమాసన్ నెక్స్ట్కాలమే కరిగింది - తెలుగు సినిమాహాట్ స్టార్ఎమర్జెన్సీ డిక్లరేషన్ - హిందీ మూవీకొనన్ ఒబ్రియన్ మస్ట్ గో సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్పోకర్ ఫేస్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్జీ5బొహురూపీ - బెంగాలీ మూవీ రాబిన్ హుడ్ - తెలుగు సినిమా (మే 10)ఆహాఅస్త్రం - తమిళ మూవీబుక్ మై షోబ్లాక్ బ్యాగ్ - ఇంగ్లీష్ మూవీలాస్ట్ స్విమ్ - ఇంగ్లీష్ సినిమాఇట్స్ కమింగ్ - ఇంగ్లీష్ సినిమా (మే 10)హూ బై ఫైర్ - ఫ్రెంచ్ మూవీ (మే 10)ఆపిల్ ప్లస్ టీవీలాంగ్ వే హోమ్ సీజన్ 1 - ఇంగ్లీష్ సిరీస్(ఇదీ చదవండి: Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ) -
'ఆపరేషన్ సిందూర్' ఎఫెక్ట్.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానున్న భారీ సినిమా
బాలీవుడ్లో రాజ్‌కుమార్ రావ్ (Rajkummar Rao) హీరోగా నటించిన మూవీ 'భూల్ చుక్ మాఫ్' (Bhool Chuk Maaf) డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. మే 9న థియేటర్స్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిల వల్ల డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఇందులో వామికా గబ్బి హీరోయిన్గా నటించగా.. ధనశ్రీ వర్మ స్పెషల్ సాంగ్‌లో దుమ్మురేపింది. ఈ చిత్రాన్ని కరణ్ శర్మ తెరకెక్కించారు. స్త్రీ 2 మూవీతో భారీ విజయాన్ని అందుకున్న రాజ్‌కుమార్ రావ్ 'భూల్ చుక్ మాఫ్' ద్వారా మరో హిట్ కొట్టాలని ప్లాన్ వేశాడు. కానీ, అది ఫలించలేదు.'భూల్ చుక్ మాఫ్' థియేట్రికల్ రిలీజ్ క్యాన్సిల్ అయ్యిందని మేకర్స్ ప్రకటించారు. మే 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా (Amazon Prime Video) స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరిగిన భద్రతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భారీ ఆశలతో ఈ సినిమాను థియేటర్లో ప్రేక్షకులతో పాటుగా చూడాలని తాము అనుకున్నాం. కానీ, దేశ స్ఫూర్తి, భద్రతకు తాము మొదటి ప్రాధాన్యం ఇస్తామంటూ.. జై హింద్ అని ఒక పోస్ట్ ద్వారా తెలిపారు.భూల్ చుక్ మాఫ్ మూవీ పూర్తిగా ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ కథ. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆమె తండ్రి పెట్టిన పరీక్షలో ఒక యువకుడు ఎలా నెగ్గాడు. కొన్ని గంటల్లో పెళ్లి జరిగిపోతుందని అనుకుంటే.. యువతి తండ్రికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. దాని వల్ల మొదలైన ఇబ్బందులు ఏంటి..? అనేది సినిమాలో తెలుసుకోవాలి. ‘టింగ్ లింగ్ సజా మే’ అనే పాటలో ధనశ్రీ స్టెప్పులు అదుర్స్ అనేలా ఉంటాయి. క్రికెటర్ చాహల్‌తో విడిపోయాక ఆమె నటించిన సినిమా కావడంతో ప్రేక్షకులలో కాస్త ఆసక్తి కలిగిస్తుంది. -
OTT: ఒకరోజు వ్యవధిలోనే 4 ట్రెండింగ్ సినిమాలు
ఏప్రిల్ నెలలో బాక్సాఫీస్ వద్ద ట్రెండింగ్ చిత్రాల జాబితాలో ఉన్న నాలుగు సినిమాల్లో 'జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఓదెల2 నేడు (మే8) ఓటీటీలోకి రాగా.. రాబిన్‌హుడ్ సినిమా మాత్రం మరో 24 గంటల్లో స్ట్రీమింగ్కు రానుంది. దీంతో ఈ సమ్మర్లో ఇంట్లోనే కూర్చొని సందడి చేయవచ్చు. వీటిలో కొన్ని థియేటర్ వద్ద ప్రేక్షకులను మెప్పించగా మరికొన్ని మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే, ఓటీటీ ఫ్యాన్స్‌ను ఏమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.నెట్‌ఫ్లిక్స్‌లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’- మే8కోలీవుడ్ హీరో అజిత్ హీరోగా నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly) నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ్ వర్షన్లో ఈ చిత్రాన్ని చూడొచ్చు. అజిత్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ (రూ. 250 కోట్లు)సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ (NetFlix) వేదికగా మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటన వచ్చిన సమయం నుంచి ఆయన ఫ్యాన్స్ ఎదురుచూశారు. అజిత్ సరసన త్రిష నటించిన ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.నెట్‌ఫ్లిక్స్‌లో 'జాక్'- మే8టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జోడీగా నటించిన చిత్రం ‘జాక్’ (Jack). ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిల్చింది. అయితే, ఓటీటీలో చూడొచ్చని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్పై, యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా ఆయన ప్లాన్ చేశాడు కానీ, ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం మే 8న ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఓదెల 2’- మే8సౌత్ ఇండియా పాపులర్ హీరోయిన్ తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో నటించిన ల్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘ఓదెల 2’ (Odela 2).. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను భయపెట్టలేదు. ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్‌గా దర్శకుడు అశోక్ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.. అయితే, మరో దర్శకుడు సంపత్ నంది ఈ ప్రాజెక్ట్‌కు కథ అందించారు. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video)లో నేడు (మే8 ) స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అందుబాటులో ఉంది.జీ5లో 'రాబిన్‌హుడ్'- మే 10నితిన్- శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్‌హుడ్' మరో 24గంటల్లోనే ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ‘జీ 5’ (Zee 5) సంస్థ ఇప్పటికే ప్రకటించింది. మే 10న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ‘జీ తెలుగు’ ఛానల్లో ప్రసారం కానుంది. అదే సమయంలో జీ5 ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కానుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో కూడా ఈ సంస్థ ఇదే స్ట్రాటజీని అనుసరించిన విషయం తెలిసిందే. నితిన్‌తో భీష్మ చిత్రం ద్వారా హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ డిజాస్ట్ర్గా నిలిచింది. -
సడన్ సర్ ప్రైజ్.. ఓటీటీలోకి తమన్నా 'ఓదెల 2'
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు చాలారోజుల ముందే అనౌన్స్ మెంట్స్ ఇస్తారు. మరికొన్నిసార్లు మాత్రం సడన్ సర్ ప్రైజ్ అన్నట్లు ఎలాంటి ప్రకటనలు లేకుండానే స్ట్రీమింగ్ చేసేస్తారు. ఇప్పుడు కూడా ఓ చిత్రాన్ని అలానే ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు.తమన్నా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల 2. గత నెల 17న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కి ముందు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దేశమంతా సినిమాకు ప్రచారం చేశారు. కానీ విడుదల తర్వాత టాక్ తేడా కొట్టేసింది. రెండు మూడు రోజులకే సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మూడు వారాలకే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'న్యూ బిగినింగ్స్'.. మళ్లీ జంటగా కనిపించిన సమంత) మరికొన్ని గంటల్లో అంటే రేపటి(మే 08) నుంచి ఓదెల 2 చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.ఓదెల 2 విషయానికొస్తే.. ఓదెల అనే ఊరిలో తిరుపతి(వశిష్ఠ) అనే కామాంధుడు కొత్తగా పెళ్లయిన అమ్మాయిల్ని రేప్ చేసి చంపేస్తుంటాడు. ఓ రోజు అతడి భార్య అతడి నరికి చంపేసి జైలుకి వెళ్తుంది. కానీ తిరుపతి ఆత్మకు శాంతి కలగకుండా ఉండాలని సమాధి చేస్తారు. కానీ తిరుపతి ప్రేతాత్మ తిరిగి సమాధిలో నుంచి బయటకొచ్చి ఊరిపై పడుతుంది. దాన్ని నిలువరించడానికి శివశక్తి (తమన్నా) ఓదెలకు వస్తుంది. తర్వాత ఏమైంనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?) -
'రెట్రో'ని దెబ్బ కొట్టిన చిన్న సినిమా.. ఓటీటీకి అప్పుడేనా?
కొన్నిసార్లు చిన్న సినిమానే కదా ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ అదే భారీ దెబ్బ కొట్టొచ్చు. తమిళ ప్రేక్షకుల్ని ప్రస్తుతం ఎంటర్ టైన్ చేస్తున్న 'టూరిస్ట్ ఫ్యామిలీ'ని చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే సూర్య 'రెట్రో'కి పోటీగా రిలీజ్ అనేసరికి చాలామంది.. బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా అనుకున్నారు. కానీ ఇప్పుడదే సూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది.చాలా తక్కువ బడ్జెట్, సింపుల్ కథతో తీసిన ఈ సినిమా మే 01న రిలీజైతే ఇప్పటివరకు రూ.20 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. పోటీలో ఉన్న రెట్రో కంటే దీన్ని చూసేందుకే ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) అసలు విషయానికొస్తే ఈ సినిమాని త్వరలో తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది కానీ అది జరిగే పనిలా అనిపించట్లేదు. ఎందుకంటే ఇది తమిళ ఫ్లేవర్ తో తెరకెక్కిన కథ. దీన్ని తెలుగులో ఆదరిస్తారా అంటే సందేహమే. అదే టైంలో ఓటీటీలో రావడానికి నాలుగు వారాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారట.ఈ లెక్కన చూసుకుంటే 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా ఓటీటీలోకి మే 31న వచ్చే సూచనలు గట్టిగా ఉన్నాయి. తెలుగు వెర్షన్ కూడా అప్పుడే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీలో సిమ్రాన్ తప్పితే మనకు తెలిసిన ముఖం లేదు.(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో సీమంతం వేడుక) -
ఒకేసారి ఓటీటీ, టీవీలో ‘రాబిన్ హుడ్’.. ఎప్పుడంటే?
నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్(Robinhood).. ఈ ఏడాది మార్చిలో విడుదలై డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. శ్రీలీల గ్లామర్, క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో, కేతికా శర్మ ఐటమ్ సాంగ్..ఏవి సినిమాను రక్షించలేకపోయాయి. ఛలో, భీష్మ లాంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రంలో అపజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఓటీటీలో అయినా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం చిత్రబృందంలో బలంగా ఉంది. అయితే ఓటీటీ కంటే ముందే ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ని కొనుగోలు చేసిన జీ5(ZEE5) సంస్థ.. మే 10న ఈ చిత్రాన్ని టీవీలో టెలికాస్ట్ చేయనుంది. ఆ తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫార్ములా అప్లై‘సంక్రాంతి వస్తున్నాం’సినిమాను అటు ఛానల్లో, ఇటు ఓటీటీలోకి ఓకేసారి తీసుకోచ్చింది జీ5 సంస్థ. ఇప్పుడు ‘రాబిన్‌హుడ్’ విషయంలోనూ అదే ఫాలో అవుతోంది. ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ.. మే 10వ తేదినే ఓటీటీలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ఒకేసారి టీవీలోనూ, ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల.. జీ చానల్‌కి మంచి టీఆర్పీ వచ్చింది. అందుకే రాబిన్ హుడ్ చిత్రానికి కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి ఈ రాబిన్‌హుడ్ కనీసం బుల్లితెర మనసులను అయినా దోచుకుంటాడో లేదో చూడాలి.రాబిన్ హుడ్ కథేంటంటే..?రామ్ (నితిన్) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్‌హుడ్’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్(షైన్ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్ రాబిన్‌ని పట్టుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు. రాబిన్‌కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్‌హుడ్ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్‌హుడ్ సడెన్‌గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.Full of laughs, packed with thrills, and loaded with chills – Robinhood ! Don't miss 🌟🎬Robinhood World Television Premiere On May 10th, Saturday at 6 PM On #ZeeTelugu#ZeeTeluguPromo #WorldTelevisionPremiereRobinhood #RobinhoodOnZeeTelugu pic.twitter.com/SjA5ShGdPX— ZEE TELUGU (@ZeeTVTelugu) May 6, 2025 -
నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లర్ సినిమా
పుష్ప సినిమాతో తెలుగు వారికి బాగా దగ్గరైన నటుడు ఫహాద్ ఫాజిల్.. ఆయన విలన్‌గా నటించిన 'ఇరుల్' మలయాళ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది. అపరాధి టైటిల్‌తో డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుంది. 2021లో విడుదలైన ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రానికి నసీఫ్ యూసుఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించారు. ఫహద్ ఫాసిల్‌తో పాటు సౌబిన్ షాహిర్, దర్శన రాజేంద్రన్ వంటి వారు ఇందులో నటించారు. ఈ చిత్రాన్ని ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, ప్లాన్ జె స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే మలయాళ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.అపరాధి పేరుతో డైరెక్ట్‌గా ఆహా తెలుగు ఓటీటీలో ఈ చిత్రం మే 8న విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అపరాధి సినిమా మొత్తం ఒకే ఇంట్లో కేవలం మూడు పాత్రలతోనే చాలా సస్పెన్స్‌గా జరుగుతుంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్లో కనిపించాడు. 2021లో కొవిడ్ కారణంగా ఈ చిత్రం డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళ వర్షన్ విడుదలైంది. అప్పట్లో చాలామంది సబ్‌టైటిల్స్‌తో ఈ మూవీని చూశారు. ఈ సినిమా రన్‌టైమ్ కేవలం 91 నిమిషాలే కావడం విశేషం.ఒక ప్రేమజంట జీవితంలోకి ఓ సీరియల్ కిల్లర్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో ఈ చిత్రం చెబుతుంది. కేవలం 30 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్‌ను పూర్తిచేసి ఓటీటీలో విడుదల చేశారు. ప్రేక్షకులను ప్రతి క్షణం సస్పెన్స్‌కు గురిచేసే ఈ చిత్రం సుమారు నాలుగేళ్ల తర్వాత తెలుగులో విడుదల కానుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
ప్రతి క్షణం భయపెట్టే థ్రిల్లర్ సిరీస్.. టీజర్ వచ్చేసింది!
సినీ ప్రేక్షకులంతా ఇప్పుడు ఓటీటీలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలా 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్‌కు ఇండియాలో క్రేజ్‌ను దక్కించుకుంది. దీంతో స్క్విడ్ గేమ్-2 సిరీస్‌ను కూడా తీసుకొచ్చారు. గతేడాది డిసెంబర్లో విడుదలై ఈ సిరీస్ అదే రేంజ్లో ఆదరణను సొంతం చేసుకుంది.ఈ రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మూడో సీజన్‌ను తెరకెక్కించారు. తాజాగా ఈ సీజన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఈ సీజన్ జూన్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈ కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.స్క్విడ్ గేమ్ స్టోరీ ఏంటంటే..ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్‌గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలా 15కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు యాడ్ అయింది. అస్సలు ఇంగ్లీష్ పదాలే వాడకుండా తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుందని ఇప్పుడు చూద్దాం?అందరూ కొత్తవాళ్లతో తీసిన సినిమా 'కాలమే కరిగింది?'. మార్చి 21న ఈ తెలుగు మూవీ థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఈ మూవీలో సారీ, థ్యాంక్స్ తప్ప మరే ఇంగ్లీష్ పదాలు ఉపయోగించలేకపోవడం విశేషం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) కథంతా స్కూల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు ఎంచుకున్న లవ్‌స్టోరీ పాయింట్ కొత్తదేమి కాదు. కానీ అప్పటి ప్రేమకథల్లో ఉండే మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని కవితాత్మకంగా సరికొత్తగా చూపించారు. స్కూల్ డేస్ లోని బాల్యప్రేమను మధురంగా మలిచారు. ఇప్పుడీ చిత్రం మే 09 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.'కాలమే కరిగింది?' విషయానికొస్తే.. ఫణి (వినయ్ కుమార్-అరవింద్) బాగా చదువుకుని జీవితంలో సెటిల్ అయ్యింటాడు. తొలి ప్రేమ గుర్తొచ్చి ప్రియురాలు బిందు (శ్రావణి-నోమిన తార) కోసం సొంతూరు వెళ్తాడు. అసలు బిందు ఎక్కడ ఉంది? ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఫణికి బిందు కలిసిందా లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: స్నానం కూడా చేయలేదు.. అమ్మ జీవితాంతం నన్ను..: రష్మీ) -
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి సమంత నిర్మించిన 'శుభం', శ్రీ విష్ణు కామెడీ సినిమా '#సింగిల్', బ్లైండ్ స్పాట్, కలియుగమ్ 2064 తదితర చిత్రాలు రానున్నాయి. మరోవైపు చిరంజీవి-శ్రీదేవి క్లాసిక్ మూవీ 'జగదేకవీరుడు అతిలోక సుందరి' రీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మరోవైపు ఓటీటీల్లోనూ ఈ వారం 15కి పైగా సినిమాలు- సిరీసులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్, ది డిప్లమాట్ చిత్రాలతో పాటు గ్రామ చికిత్సాలయ్ అనే సిరీస్ ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏ మూవీస్ రాబోతున్నాయంటే?ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ (మే 05-11వ తేదీ వరకు)నెట్ ఫ్లిక్స్బ్రిటైన్ అండ్ ద బ్లిట్జ్ (ఇంగ్లీష్ మూవీ) - మే 05కొనన్ ఓ బ్రయన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 05మైటీ మానస్టర్ వీలీస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05ద సీట్ (ఇంగ్లీష్ సినిమా) - మే 05ది మ్యాచ్ (ఇంగ్లీష్ చిత్రం) - మే 07లాస్ట్ బులెట్ (ఇంగ్లీష్ సినిమా) - మే 07గుడ్ బ్యాడ్ అగ్లీ (తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 08జాక్ (తెలుగు సినిమా) - మే 08ది డిప్లమాట్ (హిందీ మూవీ) - మే 09ద రాయల్స్ (హిందీ సిరీస్) - మే 09అమెజాన్ ప్రైమ్గ్రామ చికిత్సాలయ్ (హిందీ సిరీస్) - మే 09హాట్ స్టార్యువ క్రైమ్ ఫైల్స్ సీజన్ 1 (హిందీ సిరీస్) - మే 05యెల్లో స్టోన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05పోకర్ ఫేస్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 09జీ5బోహుర్పీ (బెంగాలీ సినిమా) - మే 09(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా!) -
ఓటీటీలోకి మలయాళ డార్క్ కామెడీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మలయాళ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరీ ముఖ్యంగా బాసిల్ జోసెఫ్ నుంచి వస్తున్న ప్రతి సినిమా ఆకట్టుకుంటోంది. రీసెంట్ టైంలో పలు చిత్రాల డబ్బింగ్ లతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు మరో మూవీతో ఓటీటీలో రచ్చ చేసేందుకు సిద్ధమైపోయాడు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్?(ఇదీ చదవండి: ఓటీటీలో 'జాక్' సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..) స్వతహాగా డైరెక్టర్ అయిన బాసిల్ జోసెఫ్ గత కొన్నాళ్ల నుంచి హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది కాలంలో నూనక్కుళి, సూక్ష్మదర్శిని, ప్రావింకుడు షప్పు, పొన్ మన్ తదితర చిత్రాలతో వచ్చాడు. ఇప్పుడు 'మరణమాస్' మూవీతో రాబోతున్నాడు. మలయాళ పండగ విషు సందర్భంగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మే 15 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాని ప్రముఖ హీరో టొవినో థామస్ నిర్మించడం విశేషం.(ఇదీ చదవండి: ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’ మూవీ రివ్యూ) 'మరణమాస్' విషయానికొస్తే.. ఓ రాత్రి అనుకోకుండా సీరియల్ కిల్లర్ తోపాటు ఓ శవం ఉన్న బస్సులో కొందరు వ్యక్తులు చిక్కుకుంటారు. ఆ శవాన్ని వాళ్లు ఏం చేశారు? ఆ సీరియల్ కిల్లర్ నుంచి ఎలా తప్పించుకున్నారనేదే స్టోరీ. ఈ సినిమాలో లూక్ పీపీ అనే ఇన్ ఫ్లూయెన్సర్ గా బాసిల్ జోసెఫ్ నటించాడు. ఓ అమ్మాయి తన ప్రేమని అంగీకరించకపోవడంతో లూక్.. ఆమెను వేధిస్తూ ఉంటాడు. అదే ఊరిలోని వృద్ధులను చంపి నోటిలో అరటిపండు పెడుతుంటాడు సీరియల్ కిల్లర్. డార్క్ కామెడీగా తీసిన ఈ సినిమా వచ్చే వారాంతంలో రిలీజ్ అవుతుంది.(ఇదీ చదవండి: 'కిర్రాక్ ఆర్పీ మోసాన్ని నా జీవితంలో మర్చిపోను'.. జబర్దస్త్ తన్మయ్) Welcome to a world where nothing makes sense, but everything will crack you up!Watch #Maranamass on SonyLIV From 15 May #MaranamassOnSonyLIV pic.twitter.com/s3GTEM5YEz— Sony LIV (@SonyLIV) May 5, 2025 -
‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’ మూవీ రివ్యూ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో జపనీస్ చిత్రం బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. భాష ఏదైనా సరైన భావం పలికించి చూపించేది సినిమా. అందులో డబ్బింగ్ వల్ల ప్రపంచంలోని ఏ మూల సినిమా అయినా మన భాషలో చూస్తుంటే మన చుట్టూ జరిగిన కథే అన్న భావన కలుగుతుంది. మరీ ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ చిత్రాలు ఇట్టే ఆకట్టుకుం టాయి. ఆ కోవకి చెందినదే ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన జపనీస్ సినిమా ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’(Bullet Train Explosion). ఈ సినిమా ఓ బ్లాక్ బస్టర్ పేలుడు అనొచ్చు. ఈ మూవీ వల్ల మనకు రెండు అనుభూతులు కలుగుతాయి. (చదవండి: ఇండియా ఫస్ట్ ఐటమ్ గర్ల్ ఓ పాకిస్తానీ.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?)ఇండియాలో త్వరలో బుల్లెట్ ట్రైన్ పరిగెత్తబోతోంది. ఆ బుల్లెట్ ట్రైన్ అనుభూతిని ఈ చిత్రం ద్వారా అనుభవించవచ్చు. అలాగే జపాన్ దేశంలోని ట్రైన్ స్టేషన్, ట్రైన్ నంబర్లు కూడా మనం ఈ సినిమా ద్వారా గుర్తు పెట్టుకోవచ్చు. బుల్లెట్ ట్రైన్ ఎంత స్పీడ్ ఉంటుందో అంతకు రెండింతలు ప్రేక్షకులు ఈ సినిమాని చూసి థ్రిల్ ఫీలవుతారు. అంతలా ఈ సినిమాలో ఏముందంటే... కథ ప్రకారం ట్రైన్ నెంబర్ 5060బి షిన్ అమోరి నగరం నుండి జపాన్ రాజధాని టోక్యోకి బయలుదేరుతుంది. ఈ ట్రైన్లో కజుయాతకైచి ఫస్ట్ లైన్ మేనేజర్‌గా ఉంటాడు. ట్రైన్ బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఓ అగంతకుడు స్టేషన్‌కు ఫోన్ చేసి, ట్రైన్లో బాంబు పెట్టామని, ట్రైన్ 120 కిలోమీటర్ల స్పీడ్ తగ్గకుండా వెళితేనే బాంబు పేలకుండా ఉంటుందని బెదిరిస్తాడు. ఆ బాంబు తీయాలంటే తనకు 100 బిలియన్ల డబ్బు అప్పజెప్పాలని కండిషన్ పెడతాడు. 2 గంటల 14 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా దాదాపు ట్రైన్లోనే నడుస్తుంది. మరి... ఆగకుండా వెళుతున్న ట్రైన్ పేలిపోతుందా లేదా మేనేజర్ ఆపగలుగుతాడా అన్నది తెలియాలంటే ‘బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్’ సినిమా చూడాలి. 1994వ దశకంలో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘స్పీడ్’ని పోలి ఉంటుందీ సినిమా. కానీ ఈ చిత్రం క్లైమాక్స్ సూపర్ హైలైట్. ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది. – హరికృష్ణ ఇంటూరు -
మరోసారి వచ్చేస్తోన్న హార్ట్ బీట్.. సీజన్-2 ప్రోమో చూశారా?
కోలీవుడ్ వెబ్ ప్రపంచంలో హార్ట్‌బీట్ సిరీస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కనిపిస్తుంది. సెంటిమెంట్, పదవి కోసం పోరాటం అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయినా హార్ట్‌బీట్ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది.ఈ నేపథ్యంలోనే వెబ్ సిరీస్‌లో పలు ఆసక్తికరమైన విషయాలకు పరిష్కారం చూపే విధంగా దీనికి సీజన్–2 రూపొందించారు మేకర్స్. ఈ సిరీస్‌కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. రెజిమల్ సూర్య థామస్ ఛాయాగ్రహణం, చరణ్ రాఘవన్ సంగీతాన్ని అందించారు. ఏ టెలీ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ పతాకంపై రాజవేలు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ప్రోమో ఇప్పుడు హాట్ స్టార్ ఓటీటీలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.హార్ట్ బీట్ సీజన్–2ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో నటి దీపా బాలు, అనుమోన్, యోగలక్షి్మ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు అక్షిత, శివం, అబ్దుల్, అమైయ, టీఎం కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. Get ready for a double blast of fun and excitement 🥳❤️❤️#HotstarSpecials Heart Beat Season 2 Coming Soon on JioHotstar#HotstarSpecials #HeartBeatSeason2 #HeartBeatS2 #HB2 #HB2ComingSoon #LubDubOnHotstar #HeartBeatS2OnHotstar #HeartBeatS2onJioHotstar #HB2onJioHotstar… pic.twitter.com/akIbMEzuJf— JioHotstar Tamil (@JioHotstartam) May 4, 2025 Adhey Heart'u dhan, ana Beat'u vera.. ❤️❤️ Rina 2.0 coming soon 😉😎😍#HotstarSpecials HeartBeat Season 2 Coming Soon on JioHotstar#HotstarSpecials #HeartBeatSeason2 #HeartBeatS2 #HeartBeat2Promo #HB2 #HB2ComingSoon #LubDubOnHotstar #HeartBeatS2OnHotstar… pic.twitter.com/WzxzFblVwj— JioHotstar Tamil (@JioHotstartam) May 1, 2025 -
ఓటీటీకి తమన్నా దెయ్యం సినిమా.. నెల రోజుల్లోపే!
తమన్నా, వశిష్ఠ, హెబ్బా పటేల్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'ఓదెల 2'. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదలైంది.బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా.. ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. మూడు రోజుల్లో కేవలం రూ.6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓదెల-2 ఓటీటీ రిలీజ్ డేట్‌పై టాక్ వినిపిస్తోంది. ఈ నెలలోనే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేయనున్నట్లు సమాచారం. మే 17వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానున్టన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.ఓదెల-2 కథేంటంటే..ఓదెల 2 విషయానికొస్తే.. ఓదెలలో తిరుపతి(వశిష్ట సింహ) అనే కామాంధుడు.. కొత్తగా పెళ్లయిన అమ్మాయిల్ని మానభంగం చేస్తుంటాడు. దీంతో తిరుపతి భార్య అతడి తల నరికి జైలుకెళ్తుంది. కానీ తిరుపతి ఆత్మకు శాంతి కలగకుండా ఉండాలని.. సమాధిశిక్ష వేస్తారు. కొన్ని సంఘటనల వల్ల ఇతడి ప్రేతాత్మ తిరిగి ఊరిపై పడుతుంది. దీంతో శివశక్తి అలియాస్ భైరవి (తమన్నా) అనే ఓదెల ఊరికి వస్తుంది. ఆ తర్వాత దుష్టసంహారమే మిగిలిన స్టోరీ. -
భార్య, సవతి కలిసి భర్తని మాయం చేస్తే.. ఓటీటీ రివ్యూ
ఓటీటీలు అనగానే చాలామందికి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఈ తరహా మూవీస్ రిలీజ్ అవుతుంటాయి. తాజాగా అలానే ఓటీటీలోకి వచ్చిన చిత్రం 'జెంటిల్ ఉమన్'. ట్రెండింగ్ టాపిక్ బేస్ చేసుకుని ఈ మూవీ తీయడం విశేషం. ఇంతకీ దీని సంగతేంటి అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) కథేంటి?పల్లెటూరిలో పుట్టి పెరిగిన పూర్ణిమ అలియాస్ పూర్ణి (లిజోమోల్ జోస్) అరవింద్(హరికృష్ణన్)ని పెళ్లి చేసుకుని నగరానికి వస్తుంది. మూడు నెలలుగా ఉదయం లేవడం, పూజ చేయడం, భర్తకు వంట చేసి పెట్టడం, అతడి శారీరక అవసరాలని తీర్చడం. ఇదే ఈమె రొటీన్. అలాంటిది ఓ సందర్భంలో భర్తకు ఆని(లోస్లియా) అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలుస్తోంది. దీంతో భర్తని నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంది. తర్వాత ఏమైంది? పోలీసులకు దొరికిందా లేదా? ఆని.. పూర్ణిని ఎందుకు కలవాల్సి వచ్చిందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?పొద్దున్న లేస్తే చాలు.. ప్రియుడితో కలిసి భర్తని చంపిన భార్య, ప్రియురాలి కోసం భార్యని అడ్డు తొలిగించిన భర్త.. ఇలాంటి వార్తలే చూస్తున్నాం. సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్ తో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 'జెంటిల్ ఉమన్'. సినిమా మొదలవడమే చాలా కూల్ గా మొదలవుతుంది. పూర్ణిమ అనే గృహిణి. ఆమెకు రోజూ ఒకేలాంటి దినచర్య. మరోవైపు రోజూ దేవుడికి పూజ చేస్తూ ఫిలాసఫీ పుస్తకాలు చదివే భర్త. కట్ చేస్తే సరిగ్గా సినిమా అరగంట గడిచేసరికి మొదటి ట్విస్ట్. భర్త అక్రమ సంబంధం గురించి తెలిసి అప్పటివరకు శాంతంగా కనిపించిన పూర్ణిమ ఒక్కసారి వయలెంట్ అవుతుంది. భర్తని నరికి చంపి ఫ్రిజ్ లో పెడుతుంది.మరోవైపు సదరు భర్త.. మరో మహిళతో ఎఫైర్ నడిపిస్తుంటాడు కదా. తన ప్రియుడు కనిపించట్లేదని ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. అక్కడ నుంచి పోలీసుల దర్యాప్తు. పూర్ణిమని పిలిచి విచారించడం. చివరకు ఏమైందనేదే స్టోరీ.చాలా సాదాసీదాగా మొదలయ్యే సినిమా ఆద్యంతం నిదానంగానే వెళ్తుంది. కాకపోతే ప్రస్తుతం సమాజంలో పోకడల్ని కొంతవరకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఒకప్పటిలా భర్తలు అక్రమ సంబంధాలు అంటూ నడిపితే అరిచి గీ పెట్టడాలు, గొడవ పడటం లాంటివి కాకుండా భార్యలు ఎంతకు తెగిస్తున్నారు అనే చెప్పే స్టోరీ ఇది.సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఆసక్తి ఉంటే ఈ సినిమా చూడొచ్చు. మరీ అంచనాలు పెట్టుకుంటే నిరాశపరచొచ్చు. రెండు గంటల్లోపే నిడివి కాబట్టి ఇలా మొదలుపెడితే అలా ముగించేయొచ్చు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆహాలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరెలా చేశారు?'జై భీమ్' సినిమాలో చినతల్లిగా అలరించిన లిజోమోల్.. ఇందులో పూర్ణిమగా అదరగొట్టేసిందని చెప్పొచ్చు. ఈమె భర్తగా చేసిన హరికృష్ణన్ ది చిన్న రోల్. ఉన్నంతలో ఓకే. ప్రియురాలిగా చేసిన లోస్లియా కూడా పాత్రకు తగ్గట్లు చేసింది. మిగిలిన పాత్రధారులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే ఇందులో పాటలేం లేవు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీ మూడ్ కి తగ్గట్లు ఉంది. కెమెరా వర్క్ బాగుంది. దర్శకత్వం మాత్రం మీద కంప్లైంట్ ఉంది. చిన్న పాయింట్ నే చాలా సేపు సాగదీసినట్లు అనిపించింది. ఓవరాల్ గా చెప్పుకొంటే మాత్రం ఓసారి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) -
ఓటీటీలోకి వచ్చేసిన కామెడీ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. మొన్నీమధ్యే వీకెండ్ సందర్భంగా మే 01-02 తేదీల్లో ఏకంగా 30 చిత్రాలకు పైగా స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. ఇప్పుడు మరో కన్నడ కామెడీ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ దీని సంగతేంటి?'పుష్ప' జాలిరెడ్డి డాలీ ధనంజయ అతిథి పాత్రలో నటించిన కన్నడ సినిమా 'విద్యాపతి'. నాగభూషణ, మలైకా వాసుపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. యాక్షన్ కామెడీగా తీసిన ఈ చిత్రం ఏప్రిల్ 11న థియేటర్లలోకి రాగా డీసెంట్ టాక్ అందుకుంది. ఇప్పుడు మూడు వారాలు తిరిగేసరికల్లా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. కన్నడతో పాటు తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: నవ్వులతో కాసులు కురిపించే బ్రహ్మానందం రెమ్యునరేషన్ తెలుసా?)'విద్యాపతి' విషయానికొస్తే.. సిద్ధు అనే కుర్రాడు సులభంగా డబ్బు సంపాదించి జీవితంలో సెటిలైపోవాలని అనుకుంటాడు. దీంతో అబద్ధాలాడి సినిమా హీరోయిన్ విద్యకు దగ్గరవుతాడు. కొన్నాళ్లకు ఇతడి గుణగణాలు నచ్చి విద్య పెళ్లి చేసుకుంటుంది. దీని తర్వాత సిద్ధుకు మేనేజర్ గా సిద్ధు సెటిలైపోతాడు.ఓ సందర్భంలో జగ్గు అనే వ్యక్తితో విద్య గొడవపడుతుంది. అదే సమయంలో సిద్ధు గురించి విద్యకు నిజం తెలిసిపోతుంది. దీంతో ఇంట్లో నుంచి గెంటేస్తుంది. తర్వాత ఏమైంది? సిద్ధు-విద్య ఒక్కటయ్యారా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: 'హిట్3' కలెక్షన్స్ ప్రకటన.. రూ. 100 కోట్లకు చేరువలో నాని) -
ఓటీటీలో సూపర్ హిట్ సిరీస్.. కొత్త సీజన్ పై ప్రకటన
ఓటీటీలో ఎప్పటికప్పుడు రిలీజయ్యే సినిమాలు చూసే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. కానీ వీటిలోనే ఉంటే వెబ్ సిరీసులు మాత్రం కొందరే చూస్తుంటారు. అయితే లాక్ డౌన్ టైంలో రిలీజై సూపర్ హిట్ అయిన సిరీస్ ల్లో 'పంచాయత్'. ఇదివరకే మూడు సీజన్లు రాగా ఇప్పుడు నాలుగో సీజన్ డేట్ ఫిక్స్ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) పంచాయత్ సిరీస్ గురించి చెప్పుకుంటే చాలా సింపుల్ స్టోరీ. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు.. ఓ మారుమూల పల్లెలోకి పంచాయతీ సెక్రటరీగా అడుగుపెడతాడు. జాబ్ అయితే చేస్తుంటాడు గానీ అస్సలు ఇష్టముండదు. విదేశాలకు వెళ్లిపోవాలనేదే ఇతడి డ్రీమ్. అలాంటిది ఇతడిని పల్లెలోని ఉంటే కొందరు మనుషులు మార్చేస్తారు. తర్వాత ఏమైందనేదే స్టోరీ.ఇదివరకు మూడు సీజన్లు స్ట్రీమింగ్ కాగా అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో సీజన్ ని ఈ జూలై 02 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ సీజన్ అంతా కూడా పంచాయతీ ఎన్నికల బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది. కామెడీ ప్లస్ ఎమోషనల్ గా ఉండే ఈ సిరీస్ ని తెలుగులోనూ 'సివరపల్లి' పేరుతో రీమేక్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) Phulera mein elections ki garma garmi shuru hone wali hai 👀🗳️#PanchayatOnPrime, New Season, July 2 pic.twitter.com/bsVMojSUEk— prime video IN (@PrimeVideoIN) May 3, 2025 -
ఓటీటీలోకి అజిత్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
రీసెంట్ గా పద్మ భూషణ్ అవార్డ్ అందుకున్న తమిళ హీరో అజిత్. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie). యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. గత నెలలో రిలీజై హిట్ అయింది. ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీ(OTT) స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. అధికారిక తేదీ కూడా ప్రకటించారు.తమిళ హీరోల్లో అజిత్(Ajith Kumar) కాస్త డిఫరెంట్. సినిమాలు, కారు రేసింగ్ అని తన పనేదో తాను చూసుకుంటూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో అజిత్ సినిమాలు చేస్తున్నాడు హిట్ అవుతున్నాయి గానీ ఫ్యాన్స్ ఎందుకో పూర్తిగా సంతృప్తి చెందడం లేదు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు పూర్తిగా ఫ్యాన్ మూమెంట్స్ తో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తీశారు.(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే) ఈ మూవీలో అజిత్ పాత సినిమా పాటలు, వింటేజ్ స్టైల్ తదితర అంశాలు అజిత్ అభిమానులకు తెగ నచ్చేశాయి. దీంతో హిట్ చేసేశారు. నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్ కావడంతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. కానీ ఏమంత గొప్పగా ఆడలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్ లో మే 08 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.'గుడ్ బ్యాడ్ అగ్లీ' విషయానికొస్తే.. ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ (అజిత్) తన గ్యాంగ్ స్టర్ జీవితాన్ని వదిలేసి కుటుంబంతో హ్యాపీగా ఉండాలనుకుంటాడు. అందుకోసం జైలుకి కూడా వెళ్తాడు. కొడుకు కోసం ఏడాది ముందే జైలు నుంచి బయటకొస్తాడు. అంతలోనే కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారనే సంగతి తెలుస్తుంది. అలానే డ్రగ్స్ కేసులోనూ ఇరుక్కున్నాడనే సంగతి తెలుస్తుంది. దీంతో ఏకే మళ్లీ గ్యాంగ్ స్టర్ అవుతాడు? తర్వాత కొడుకుని ఎలా కాపాడుకున్నాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలో రాబిన్‌హుడ్.. ప్రకటనతో క్లారిటీ)He's done being good. Now he's going to be bad and things are about to get ugly 👀🔥Watch Good Bad Ugly on Netflix, out 8 May in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam#GoodBadUglyOnNetflix pic.twitter.com/HJVKYBxybl— Netflix India (@NetflixIndia) May 3, 2025 -
ఓటీటీలో రాబిన్‌హుడ్.. ప్రకటనతో క్లారిటీ
నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన రాబిన్‌హుడ్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ ఏడాదిలో మార్చి 28న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి అంచనాలతో థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే, మొదటిరోజే మిక్స్డ్ టాక్ రావడంతో అనుకున్నంత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో నితిన్, శ్రీలీలతో పాటు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, కేతిక శర్మ మెప్పించగా.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్‌తో కనిపించారు.రాబిన్‌హుడ్ సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్లో మే 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్నట్లు ఒక పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, జీ5 ఆప్కమింగ్ సినిమాల విభాగంలో మే 10న ఓటీటీ విడుదల కానుందని ఒక ప్రకటన ఉంది. కొద్దిరోజులుగా జీ నెట్వర్క్ ఇలాంటి స్ట్రాటజీనే అమలు చేస్తోంది. కొత్త సినిమాలను టీవీ ప్రీమియర్, ఓటీటీ స్ట్రీమింగ్కు ఒకేసారి విడుదల చేస్తుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో కూడా ఇదే ప్లాన్‌ను జీ తెలుగు అమలు చేసింది. ఇప్పుడు రాబిన్‌హుడ్ చిత్రం విషయంలోనూ దానిని అమలు చేస్తున్నట్లు అర్థం అవుతుంది. మే 10 నుంచి జీ తెలుగు ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ఫైనల్ అయింది. సుమారు రూ. 50కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 10 కోట్లు కూడా రాబట్టలేదని టాక్.కథేంటంటే.. రామ్ (నితిన్) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్‌హుడ్’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్(షైన్ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్ రాబిన్‌ని పట్టుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు.రాబిన్‌కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు.(Robinhood Review). అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్‌హుడ్ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్‌హుడ్ సడెన్‌గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చాక ఏడాపెడా వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్‌లు ఎక్కువగా ఆ జోనర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ జోనర్ ఇష్టపడే వారికోసం మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలోనే అలరించనుంది.రోషన్ మాథ్యూ , మోహిత్ రైనా, త్రినేత్ర ప్రధాన పాత్రల్లో నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కంకాజుర'. ఈ సిరీస్‌కు చందన్ అరోరా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ థ్రిల్లర్ సిరీస్ సోనీలివ్‌లో ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇజ్రాయెల్ సిరీస్ మ్యాగ్పీ ఆధారంగా ఈ సిరీస్నును హిందీలో తెరకెక్కించారు. టీజర్ చూస్తే తనను అవమానించిన వారిపై పగతీర్చుకునే ఓ యువకుడి కథ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. It’s fragile. It’s fatal. It’s coming.Kankhajura — Streaming on 30th May on Sony LIV.#KanKhajura #SoFragileYetSoFatal#MohitRaina @roshanmathew22 @sarahjanedias03 #TrinetraHaldarGummaraju #NinadKamat #MaheshShetty #HeebaShah pic.twitter.com/FxUDjHUsaW— Sony LIV (@SonyLIV) May 2, 2025 -
ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి శుక్రవారం కాకుండా గురువారం (మే 01) పబ్లిక్ హాలీ డే కావడంతో హిట్ 3, రెట్రో, రైడ్ 2 తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో హిట్ 3కి తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు ఓటీటీల్లోనూ ఏకంగా 30 సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: నానికి బిగ్ షాక్.. ఆన్లైన్లో హిట్ 3 హెచ్డీ ప్రింట్ లీక్!)ఓటీటీలోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే చాలావరకు తెలుగు కంటే హిందీ, తమిళ, మలయాళ చిత్రాలే ఈ వీకెండ్ అందుబాటులోకి వచ్చాయి. ఏకంగా 29 వరకు సినిమాలు ఈ రెండు రోజుల్లోనే రావడం విశేషం. ఇంతకీ ఆ మూవీస్ ఏంటి? ఏయే ఓటీటీల్లో ఏది స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (మే 01-02)అమెజాన్ ప్రైమ్ఈఎమ్ఐ - తమిళ మూవీఈడీ (ఎక్స్ ట్రా డిస్కౌంట్) - మలయాళ చిత్రంవలియంట్ వన్ - ఇంగ్లీష్ సినిమా ఇంపీరియల్ లైవ్ టూర్ - కన్సర్ట్ మూవీస్కూల్ స్పిరిట్ - ఇంగ్లీష్ సిరీస్బడ్డీ - హిందీ డబ్బింగ్ సినిమాఎనదర్ సింపుల్ ఫేవర్ - తెలుగు డబ్బింగ్ మూవీకరెబెటే - కన్నడ సినిమామాన్ సూన్ బేబీ - జర్మన్ మూవీఔసిప్పింటే ఒసీయాతు - మలయాళ సినిమాశ్రీ గణేశ - మరాఠీ మూవీనెట్ ఫ్లిక్స్బ్యాడ్ బాయ్ - ఇజ్రాయెలీ సిరీస్పారా రెస్క్యూ జంపర్ - జపనీస్ సిరీస్జీఏటీఏఓ - మాండరిన్ మూవీద బిగ్గెస్ ఫ్యాన్ - స్పానిష్ సినిమాద క్లీసే - థాయ్ మూవీద రాంగ్ వే టూ హీలింగ్ మ్యూజిక్ - జపనీస్ సిరీస్ద ఫోర్ సీజన్స్ - తెలుగు డబ్బింగ్ సిరీస్హాట్ స్టార్కుల్: ద లెగసీ ఆఫ్ రైజింగ్స్ - హిందీ సిరీస్ 100 ఫుట్ వేవ్ సీజన్ 3 - ఇంగ్లీష్ డాక్యుమెంట్ సిరీస్ద బ్రౌన్ హార్ట్ - ఇంగ్లీష్ డాక్యుమెంటరీ (మే 03)ఆహావేరే లెవల్ ఆఫీస్ సీజన్ 2 - తెలుగు సిరీస్వరుణన్ - తమిళ సినిమాజీ5కోస్టాకో - హిందీ మూవీసన్ నెక్స్ట్కాలా పత్తర్ - కన్నడ సినిమాబ్లూ స్టార్ - తమిళ మూవీపరమణ్ - తమిళ సినిమాసోనీ లివ్బ్రొమాన్స్ - తెలుగు డబ్బింగ్ సినిమాబ్లాక్, వైట్ అండ్ గ్రే - హిందీ సిరీస్లయన్స్ గేట్ ప్లేద బాయు - తెలుగు డబ్బింగ్ మూవీ(ఇదీ చదవండి: 'హిట్ 3' ఫస్ట్ డే కలెక్షన్స్.. నాని కెరీర్లో ఇదే టాప్) -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. నెల రోజుల్లోపే ఓటీటీకి..!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ. స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విదాముయార్చి తర్వాత ఈ ఏడాదిలోనే వచ్చిన రెండో చిత్రానికి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నెలలోనే స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 8వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఈ చిత్రంలో అజిత్ కుమార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో మెప్పించారు. గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిష హీరోయిన్గా నటించగా.. అర్జున్ దాస్ విలన్ పాత్రలో అలరించారు. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్, కార్తికేయ దేవ్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రభు, ప్రసన్న, టిన్ను ఆనంద్, రఘు రామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
నాని 'హిట్ 3' వచ్చేది ఆ ఓటీటీలోనే..
హీరో నాని (Nani) స్పీడుమీదున్నాడు. హీరోగా, నిర్మాతగా వరుస విజయాలు అందుకుంటున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హిట్లు అందుకుంటున్న ఈ హీరో.. నిర్మాతగా కోర్ట్ చిత్రంతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్: ద థర్డ్ కేస్ మూవీ (HIT: The Third Case) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.హిట్ 3కి పాజిటివ్ టాక్మే1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హిట్ 1, 2 కంటే కూడా ఈ మూవీలో వయొలెన్స్ మూడు రెట్లు ఎక్కువగా ఉంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి హిట్ 3 బాగా ఎక్కేసిందట! ఈ టాక్ చూస్తుంటే నాని బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. హిట్ 3 సినిమాలో నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏ ఓటీటీలో అంటే?ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఏకంగా రూ.54 కోట్లు పెట్టి ఈ హక్కుల్ని సొంతం చేసుకుందని టాక్. థియేటర్లో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన మే చివరి వారం, లేదా జూన్ మొదటివారంలో హిట్ 3 ఓటీటీలో వచ్చే అవకాశాలున్నాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రవాహం వారాల తరబడి కొనసాగితే మాత్రం ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే ఆస్కారం ఉంది.హిట్ 3 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
OTT: రాధికా ఆప్టే బోల్డ్ మూవీ ‘ది వెడ్డింగ్ గెస్ట్’ రివ్యూ
రాధికా ఆప్టే.. అందం, నటనతో ఆకట్టుకునే నటి. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో తన ప్రతిభను చాటుతూ, 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 2019లో విడుదలైంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. ఫ్రెండ్ కోసం పెళ్లికూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చే హీరోలు తెలుగు తెర మీద చాలా మందినే చూశాం. ఈ సినిమాలో హీరో మాత్రం పెళ్లికూతురిని కిడ్నాప్ చేసేది ఫ్రెండ్ కోసం కాదు డబ్బు కోసం. జై (దేవ్ పటేల్) అనే లండన్ వాసి పాకిస్తాన్ లోని లాహోర్ సమీపంలో ఉన్న యోంగానాబాద్ అనే గ్రామానికి చేరుకుంటాడు. అంతకు ముందే తనను ఎవరూ గుర్తించకుండా, సిమ్ కార్డులు, కార్లు మార్చుకుంటూ అక్కడ దాకా వస్తాడు. ఆ తర్వాత రెండు గన్స్ ను కొనుగోలు చేస్తాడు. ఆ గ్రామానికి వచ్చాక పెళ్లికి రెడీ అవుతున్న సమీరా (రాధికా ఆప్టే) అనే యువతిని కిడ్నాప్ చేస్తాడు. ఆ క్రమంలో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డ్ని హత్య చేయాల్సి వస్తుంది. ఆమెను దేశం దాటించి తీసుకువెళ్లడానికి ముందు...ఆమె ప్రేమికుడు దీపేశ్ (జిమ్ సర్భ్) తనతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఈ పనిచేయించాడనే విషయం జై బయటపెడతాడు.ఆ తర్వాత ఇద్దరూ కలిసి మారుపేర్లతో , దొంగ పాస్‌పోర్ట్‌లతో ఇండియాకు వస్తారు. అయితే సెక్యూరిటీ గార్డ్ హత్య కారణంగా ఈ కిడ్నాప్ రెండు దేశాల మీడియాలో వైరల్ అవుతుంది, దాంతో సమీరా ప్రేమికుడు దీపేశ్ భయపడతాడు, సమీరాను తిరిగి పాకిస్తాన్ కు పంపేయమని దేవ్‌ని కోరతాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు సన్నిహితంగా గడిపిన జై, సమీరా మధ్య అనుబంధం పెరుగుతుంది. ముఖ్యంగా సమీరా అతనిపై మోజుపడుతుంది. వారిద్దరూ శారీరకంగా ఒకటవుతారు. అదే సమయంలో దీపేశ్ దగ్గర ఖరీదైన వజ్రాలు ఉన్నాయని తెలుసుకున్న జై, వాటిని పొందేందుకు ప్రయత్నిస్తాడు. రకరకాల మలుపుల మధ్య సాగే ఈ లవ్–క్రైమ్–రొమాంటిక్ కథ చివరికి ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది.జై పాత్రలో మిస్టీరియస్ ప్రొఫెషనల్ కిల్లర్‌గా జై పూర్తి గా మెప్పిస్తాడు. బోల్డ్ సీన్లకు పెట్టింది పేరైన రాధికా ఆప్టే(తెలుగులో లెజెండ్‌లో బాలకృష్ణ సరసన హీరోయిన్) ఈ సినిమా హాలీవుడ్ రూపకర్తల సమర్పణలో రావడంతో...పూర్తి స్థాయి హాలీవుడ్ హీరోయిన్లా రెచ్చిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్లలో ఆమె దాదాపు పూర్తి న్యూడ్‌గా కనిపించడం విశేషం.హాలీవుడ్ చిత్రం చేసినప్పటికీ మన ఇండియన్ హీరోయిన్లు మరెవ్వరూ ఈ స్థాయిలో బోల్డ్ సీన్స్ చేసి ఉండరు... సమీరా పాత్ర భావోద్వేగాలను కూడా బాగా ప్రదర్శించింది. ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ మరో ఆకర్షణ. పాకిస్తాన్, ఇండియా మధ్య ప్రయాణం, మారుమూల ప్రాంతాల చిత్రీకరణ బాగా చూపించారు. సంగీత పరంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ మూమెంట్లను ఎలివేట్ చేస్తుంది. అక్కడక్కడా సాగదీసినట్టు అనిపించినా.. ఆ ఫీలింగ్ ముదరకముందే ఆసక్తికరమైన మలుపులు పేర్చుకుంటూ రావడం వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. ఐఎమ్‌డిబి 6.0 రేటింగ్ ఇచ్చిన ఈ సినిమా ఓ కాలక్షేపం యాక్షన్, థ్రిల్లర్, లవ్, రొమాంటిక్ సీన్లను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది. చూడాలనుకున్నవారు నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. -
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మిగతా భాషలతో పాటు తెలుగు చిత్రాలు కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దీంతో టైమ్ కుదిరినప్పుడల్లా ప్రేక్షకులు వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రెండు తెలుగు మూవీస్.. సడన్ గా ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి. వేటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?గతేడాది అక్టోబరు చివరి వారంలో 'సముద్రుడు' అనే సినిమా రిలీజైంది. ఇది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. రమాకాంత్, అవంతిక, భాను శ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ళ కష్టాలు ఏంటి? దళారులు.. మత్స్యకారులను ఎలా మోసం చేస్తున్నారు లాంటి అంశాలతో ఈ మూవీ తీశారు. (ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) అలానే 2022లో రిలీజైన 'రుద్రవీణ'.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ ఇందులో హీరోయిన్ గా చేసింది. ఇదో రొటీన్ యాక్షన్ మూవీ. ఊరిని ఇబ్బంది పెట్టే రౌడీ. దీంతో హీరో రంగంలోకి దిగుతాడు. చివరకు విలన్ ని హీరో ఎలా చంపాడనేదే స్టోరీ.పై రెండు సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఇలా థియేటర్లలోకి వచ్చి అలా వెళ్లిపోయాయి. ఇవి ఇప్పుడు రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చాయి. గత కొన్ని వారాలుగా ఈ ఓటీటీ సంస్థ ఇలానే పలు తెలుగు చిన్న చిత్రాల్ని స్ట్రీమింగ్ చేస్తోంది. ఆసక్తి ఉంటే వీటిపై ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో) -
ఓటీటీలోకి వచ్చేసిన ఆంథాలజీ.. తెలుగులో స్ట్రీమింగ్
ఒకప్పటితో పోలిస్తే వారంతో సంబంధం లేకుండా ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. ఇతర భాషల్లో రిలీజైనవి కూడా కొన్నాళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా ఓ సిరీస్ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి సంగతి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.సోనియా అగర్వాల్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సిరీస్ 'ష్'. ఇది నాలుగు కథల సమాహారం. లస్ట్, రొమాన్స్ తదితర అంశాలని బోల్డ్ గానే చూపించే ప్రయత్నం చేశారు. స్కూల్ ఏజ్ లో సె*క్స్ ఎడ్యుకేషన్.. పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత శృంగార జీవితం తదితర స్టోరీలతో ఈ ఆంథాలజీ తీశారు. పృథ్వీ ఆదిత్య, వాలి మోహన్ దాస్, హరీష్, కార్తీకేయన్ దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?)గతేడాది తమిళంలో రిలీజ్ కాగా.. దీని తెలుగు వెర్షన్ ఇప్పుడు(ఏప్రిల్ 30 నుంచి) ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ అయితే ఆహా, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో అప్పట్లో సెన్సేషన్ సృష్టించిన 'లస్ట్ స్టోరీస్' స్ఫూర్తితో ఈ ఆంథాలజీని తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. ఇందులో మరీ అంత బోల్డ్ సీన్స్ లేవని, క్లైమాక్స్ ని ఓపెన్ ఎండింగ్ తో ముగించడం కాస్త అసంతృప్తిని కలిగించిందని తమిళంలో రిలీజైనప్పుడు అన్నారు. మరి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) -
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూశారుగా. అందులో భాగ్యంగా తనదైన యాక్టింగ్ చేసిన ఐశ్వర్య రాజేశ్.. గత కొన్నాళ్లుగా తెలుగులో మూవీస్ చేస్తోంది. అయితే ఈమె నటించిన ఓ తమిళ చిత్రాన్ని ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) 1980ల్లో పలు తెలుగు సినిమాలు చేసిన రాజేశ్ అనే నటుడి కూతురే ఐశ్వర్య రాజేశ్. స్వతహాగా తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ నటిగా కెరీర్ ప్రారంభించింది. 2010 నుంచి అక్కడ వరస చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. మలయాళం, హిందీలోనూ ఒకటి రెండు మూవీస్ చేసింది.కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి వచ్చిన ఈమె.. తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ తదితర చిత్రాలు చేసింది. అసలు విషయానికొస్తే ఈమె హీరోయిన్ గా చేసిన తమిళ మూవీ ఆరతు సీనం 2016లో రిలీజైంది. దీని తెలుగు వెర్షన్ ని ఇప్పుడు ఆహా ఓటీటీలో నేరుగా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐశ్వర్య రాజేశ్ సినిమాని గరుడ 2.0 పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. దీన్ని థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ కథతో తీశారు. అరివళగన్ అనే దర్శకుడు దీన్ని తెరకెక్కించారు. అరుణ్ నిధి, ఐశ్వర్య దత్త, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.గరుడ 2.0 విషయానికొస్తే.. హీరో సీన్సియర్ పోలీస్ ఆఫీసర్. భార్య కూతురితో సంతోషంగా ఉంటాడు. కానీ కొందరు క్రిమినల్స్.. హీరో భార్య కూతురిని చంపేస్తారు. దీంతో మందుకి బానిస అవుతాడు. పై అధికారి చెప్పడంతో చాన్నాళ్ల తర్వాత మళ్లీ డ్యూటీలోకి వస్తాడు. అలా వరస హత్యల కేసు ఇతడికి అప్పగిస్తారు. మరి హీరో.. హంతకుడిని పట్టుకున్నాడా లేదా అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 20 చిత్రాలు) -
మరో ఓటీటీకి టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. కేవలం వారి కోసమే!
శ్రీవిష్ణు హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓం భీమ్ బుష్'. గతేడాది మార్చి 22న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. లాజిక్‌తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాకు శ్రీహర్ష దర్శకత్వం వహించారు. అయితే ఈ సూపర్ హిట్ మూవీఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ దాదాపు ఏడాది తర్వాత మరో ఓటీటీలో సందడి చేయనుంది. మే నెల 2వ తేదీ నుంచి సింప్లీ సౌత్ అనే ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుంది. అయితే కేవలం ఈ ఓటీటీలో విదేశాల్లో నివసించే వారు మాత్రమే చూడొచ్చు. ఇండియాలో ఉండే వారికి సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్ కాదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. #OmBheemBush, streaming in Telugu, Tamil and Malayalam on Simply South from May 2 worldwide, excluding India., pic.twitter.com/km7om16Zlf— Simply South (@SimplySouthApp) April 29, 2025 -
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు తెలుగులో పెద్దగా రాలేదు. రీసెంట్ టైంలో మాత్రం 'కోర్ట్' అనే మూవీ సూపర్ హిట్ అయింది. తొలుత థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ పైన ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే జోరు చూపించింది. 'కోర్ట్'(Court Movie Telugu) గురించి కాసేపు పక్కనబెడితే ఇదే తరహాలో తీసిన వెబ్ సిరీసులు కూడా ఓటీటీలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'క్రిమినల్ జస్టిస్'(Criminal Justice). 2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. 'మీర్జాపుర్' ఫేమ్ పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi), విక్రాంత్ మస్సే ఇందులో నటించారు.(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?) తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యేసరికి మరో కేసుని తీసుకుని 2020లో రెండో సీజన్, 2022లో మూడో సీజన్ రిలీజ్ చేశారు. వీటికీ మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లు కూడా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుని నాలుగో సీజన్ ని సిద్ధం చేశారు. 'క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్' పేరుతో నాలుగో సీజన్ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. మే 22 నుంచి హాట్ స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈసారి ఎలాంటి కేసు వాదించబోతున్నారో అనేది చూడాలి?(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) Seedha aur simple toh Madhav Mishra ji ke syllabus mein hai hi nahi. Aapke favourite vakeel sahab aa rahe hain courtroom mein wapas! ⚖️#HotstarSpecials #CriminalJustice - A Family Matter, streaming from May 22, only on #JioHotstar@ApplauseSocial @BBCStudiosIndia @nairsameer… pic.twitter.com/Gu1B3bnLWF— JioHotstar (@JioHotstar) April 29, 2025 -
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
నవీన్ చంద్ర, షాలిని జంటగా నటించిన చిత్రం '28 డిగ్రీస్ సెల్సియస్'(28°C Movie).. 2025 ఏప్రిల్ 4న విడుదలైన ఈ చిత్రం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ థ్రిల్లర్ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేశారు. పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితం నవీన్ చంద్రతో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ కరోనాకు ముందే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించారు.హారర్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన '28 డిగ్రీస్ సెల్సియస్' చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. చనిపోయిన వాళ్లు మళ్లీ తిరిగొస్తారా? అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ తాజాగా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో(Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం నెలరోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.కథేంటంటే..?కార్తీక్(నవీన్ చంద్ర)కి మెడిసిన్ చదువుతున్న సమయంలో అంజలి(షాలిని వడ్నికట్టి) పరిచయమై ప్రేమలో పడతాడు. కార్తీక్ అనాథ, వేరే కులం కావడంతో అంజలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంజలికి బాడీ టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అంజలి బాడీ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే పెరిగినా, తగ్గినా కాసేపటికే చనిపోతుంది. అంజలి ట్రీట్మెంట్ కోసం కార్తీక్ తనని జార్జియా తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తూనే అంజలికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అనుకోకుండా ఓ రోజు కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయిన బాధలో కార్తీక్ తాగుడుకు బానిస అవుతాడు. కానీ ఆ ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతుందని అనుమానాలు వచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ వస్తుందా? కార్తీక్ మళ్ళీ మాములు మనిషి అవుతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో మరోసారి మ్యాజిక్ చేస్తారా?
ఇప్పుడంటే కాస్త తగ్గింది గానీ లాక్ డౌన్ టైంలో ఓటీటీల్లో సినిమాలు-సిరీస్ లని అని తెగ చూసేశారు. ఆ టైంలో కొన్ని మూవీస్, సిరీసులు.. భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి వాటిలో ఒకటే 'పంచాయత్'. ఇప్పుడు దీన్ని తీసిన మేకర్స్ నుంచి మరో సిరీస్ రాబోతుంది.పంచాయత్ సిరీస్ గురించి చెప్పుకొంటే.. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు, మారుమూల పల్లెటూరికి పంచాయతీ సెక్రటరీగా వస్తాడు. ఇక్కడ వాతావరణం, మనుషులు, పరిస్థితుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే కథ. సున్నితమైన హాస్యం, పల్లె వాతావరణంలో తీసిన ఈ సిరీస్ 2020లో రిలీజై సూపర్ హిట్ అయింది. తర్వాత మరో రెండు సీజన్లు కూడా వచ్చాయి.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలు.. 'గ్రామ చికిత్సాలయ' అనే సిరీస్ ప్రకటించారు. మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసి మరీ వెల్లడించారు. ఓ పల్లెటూరిలో చిన్న హాస్పిటల్, అందులో ఉండే డాక్టర్.. దీని బ్యాక్ డ్రాప్ స్టోరీ అనిపిస్తుంది. ఇందులోనూ ఫన్ తగ్గదని తెలుస్తోంది.అయితే పంచాయత్ సిరీస్ ఓటీటీలో సూపర్ హిట్. దీన్ని తెలుగులో 'సివరపల్లి' పేరుతోనూ రీమేక్ చేస్తే ఇక్కడ కూడా ఆకట్టుకుంది. మరి ఇప్పుడు గ్రామ చికిత్సాలయ సిరీస్ తో వస్తున్నారు. మరి ఈసారి కూడా కంటెంట్ తో మ్యాజిక్ చేసి హిట్ కొడతారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?) 📢 BHATKANDI jaane ke liye taiyaar ho jaiye 📢#GramChikitsalayOnPrime, New Series, May 9 pic.twitter.com/7L7TeBFoC5— prime video IN (@PrimeVideoIN) April 28, 2025 -
ఈవారం థియేటర్లో పెద్ద సినిమాలు.. ఓటీటీలో 20 చిత్రాలు
మే నెలలో రెట్టింపు వినోదాన్ని పంచేందుకు సినిమాలు సిద్ధమయ్యాయి. థియేటర్లలో రెండు పెద్ద సినిమాలు రిలీజవుతుండగా ఓటీటీలోనూ పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. మరి మే మొదటివారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజయ్యే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే..నాని హీరోగా నటించిన 'హిట్ 3' - మే 1సూర్య హీరోగా నటించిన 'రెట్రో' - మే 1అజయ్ దేవ్‌గణ్ 'రైడ్ 2' - మే 1సంజయ్‌దత్, సన్నీ సింగ్‌ల 'భూతిని' - మే 1ఓటీటీ రిలీజెస్..నెట్‌ఫ్లిక్స్🎬 చెఫ్స్ టేబుల్: లెజెండ్స్ (సిరీస్) - ఏప్రిల్ 28🎬 ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్: ద బిగ్ ఫైట్ (మినీ సిరీస్) - ఏప్రిల్ 30🎬 ఎక్స్‌టెరిటోరియల్ - ఏప్రిల్ 30🎬 ద ఎటర్నాట్ - ఏప్రిల్ 30🎬 టర్నింగ్ పాయింట్: ద వియత్నాం వార్ (వెబ్ సిరీస్) - ఏప్రిల్ 30🎬 ద రాయల్స్ (వెబ్ సిరీస్) - మే1🎬 యాంగి: ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ - మే 1🎬 ద బిగ్గెస్ట్ ఫ్యాన్ - మే 1🎬 ద ఫోర్ సీజన్స్ (వెబ్ సిరీస్) - మే 1🎬 బ్యాడ్ బాయ్ (వెబ్ సిరీస్) - మే 2అమెజాన్ ప్రైమ్ వీడియో🎥 అనదర్ సింపుల్ ఫేవర్ - మే1జీ5🎬 కొస్టావో - మే 1హాట్‌స్టార్🎥 కుల్ల్: ద లెగసీ ఆఫ్ ద రైసింగ్స్ (వెబ్ సిరీస్) - మే 2🎥 ద బ్రౌన్ హార్ట్ (డాక్యుమెంటరీ) - మే 3ఆహా🎬 వేరేలెవల్ ఆఫీస్ రీలోడెడ్ - మే 1సోనీలివ్🎥 బ్రొమాన్స్ - మే 1🎥 బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ (వెబ్ సిరీస్) - మే 1ఎంఎక్స్ ప్లేయర్🎬 ఈఎమ్ఐ - మే1టుబి🎥 సిస్టర్ మిడ్నైట్ - మే 2యాపిల్ టీవీ ప్లస్🎬 కేర్ మీ - ఏప్రిల్ 30చదవండి: దుస్తులు తీసేయమన్నాడు.. చేదు అనుభవం బయటపెట్టిన నటి -
ఐ హోస్టేజ్ రివ్యూ: వామ్మో... ఆపిల్ స్టోరా... హడలెత్తించే థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ఐ హోస్టేజ్’ (iHostage)ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఉన్నవి రెండుపాత్రలు... వాటికి అనుసంధానంగా అడపా దడపా వచ్చే మరో డజనుపాత్రలు. కథ మొత్తం ఆ రెండుపాత్రల మధ్యే. అయినా ప్రేక్షకుడిని క్షణం కూడా కన్నార్పనీయకుండా కట్టిపడేసే విథంగా థ్రిల్లర్ జోనర్‌తో సినిమా నడపడం డచ్ దర్శకుడైన బాబీ బోర్మెన్స్కి మాత్రమే చెల్లింది. అదే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఐ హోస్టేజ్ సినిమా. ఆపిల్ స్టోర్... ఐ ఫోన్ నుండి ఐ ప్యాడ్ల వరకు ప్రతి దానికి ఆపిల్ స్టోరే కదా... ఈ సినిమాకి మూలం అదే. అమెరికా, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాలలో ఆపిల్ స్టోర్లు ఘనంగా దాదాపు 5 ఫ్లోర్లు పైనే విశాలంగా పెద్ద భవంతిలో ఉంటాయి.అది కూడా నగరానికి మధ్యలోనే ఉంటాయి. కథా పరంగా ఆమ్స్టర్డామ్ నగరం మధ్యలోని ఓ ఆపిల్ స్టోర్ బోలెడంత మంది కస్టమర్లతో కళకళలాడుతుంటుంది. అప్పుడు ఆ స్టోర్‌లోకి కూరగాయల సంచితో ఓ వ్యక్తి వచ్చి తన దగ్గర ఉన్న తుపాకీ తీసి అందరినీ హడలుగొట్టి, ఓ వ్యక్తిని బందీగా తీసుకుంటాడు. అంతేకాదు తన దగ్గర పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరించి, తనకు మిలియన్ల డబ్బుతోపాటు అక్కడ నుండి తప్పించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయమని అధికారులకు ఫోన్లో చెప్తాడు. ఇక సినిమా మొత్తం దాదాపుగా ఆ ఇద్దరి మధ్యే నడుస్తుంది.సినిమా ఆ ఇద్దరి మీదే నడిచినా మంచి స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నారు దర్శకుడు. సినిమా చివర్లో బందీగా తీసుకున్న వ్యక్తితో తను బయటపడగలిగాడా? లేదా? తాను డిమాండ్ చేసిన డబ్బులు అందుకున్నాడా? లేదా అనేది తెలుసుకోవాలంటే మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఐ హోస్టేజ్ సినిమాని చూసేయండి. ఈ సినిమా ద్వారా మానసికంగా ప్రేక్షకుడికి భయాన్ని పూర్తిగా పరిచయం చేశారు దర్శకుడు.అది కూడా చిన్నపాటి ఘర్షణ లేకుండా, ఒక్క బుల్లెట్ పేలకుండా... మరీ ముఖ్యంగా ఎటువంటి పేలుళ్లు జరగకుండా సైకలాజికల్‌గా సినిమాని తీసుకువెళ్లారు. సినిమా చూసిన తరువాత మాత్రం వామ్మో... ఆపిల్ స్టోరా ఇంక వెళ్లొద్దు బాబు అని కనీసం పది మందిలో సగమైనా అనుకుంటారు. మరి... మీరు కూడా ఆలస్యం కాకుండా ఈ సినిమా చూసేయండి. అయితే ఆపిల్ స్టోర్‌కి మాత్రం వెళ్లడం మానకండి. – హరికృష్ణ ఇంటూరు -
G 20 Review: అమెరికన్ ప్రెసిడెంటా.. మజాకా..
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం జీ 20 ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా దర్శకుని ఊహ అనేది ప్రేక్షకుల ఊహకందకపోతే అప్పుడు ఆ సినిమా పండుతుంది. ముఖ్యంగా హాలీవుడ్ దర్శకుల ఆలోచనలే వేరు. ఏది అసాధ్యమో, ఏదైతే జరగదు అని ప్రేక్షకులు అనుకుంటారో దాన్నే సినిమాలో చూపిస్తుంటారు హాలీవుడ్ డైరెక్టర్స్. హాలీవుడ్ దర్శకుడు పాట్రిసియా రీగెన్ తీసిన ‘జీ 20’ సినిమా ఆ కోవలోకి చెందినదే. ఒక్కసారి ఊహించండి... ప్రపంచంలోనే ఉత్తమోత్తమ సురక్షితమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు అనే విషయం మనకు తెలుసు. మరి... ఆ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తిని తన కుటుంబంతో పాటు బందీలుగా తీసుకుని ప్రపంచాన్ని శాసిద్దా మనకున్న విలన్‌ను అమెరికా ప్రెసిడెంట్ ఎలా ఎదుర్కొన్నారో ఈ ‘జీ 20’లో చూడవచ్చు. అది కూడా అమెరికన్ ప్రెసిడెంట్‌ను, అతని కుటుంబాన్ని బందీలుగా చేసుకోవడం కూడా చిన్న వేదిక మీదైతే కాదు, దాదాపు అరడజను దేశాధినేతలతో పాటు జీ 20 శిఖరాగ్ర సమావేశంలో హై సెక్యూరిటీ నడుమ ఉండగా అమెరికన్ ప్రెసిడెంట్‌తో పాటు అక్కడున్న మిగతా దేశాధినేతలందరినీ బందీలుగా చేసుకుంటాడు విలన్. ఇక్కడ ఈ సినిమా దర్శకుడు ఇంకా వినూత్నంగా ఆలోచించాడు. బందీలుగా ఉన్న తన కుటుంబాన్ని, ఇతర దేశాధినేతలను కూడా విలన్‌తో పోరాడి విడిపించే బాధ్యత ప్రెసిడెంట్ మీదే పెట్టాడు సదరు సినిమా డైరెక్టర్. ‘జీ 20’ సినిమా మంచి ఉత్కంఠతతో ప్రారంభమై, ఆద్యంతం ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తుంది. ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ పోరాట సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో అమెరికన్ ప్రెసిడెంట్ కుంగ్ ఫూ ఫైటర్, గన్ షూటర్, అలాగే హెలికాప్టర్ రైడర్ కూడా. ఇక మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే సదరు అమెరికన్ ప్రెసిడెంట్ ఈ సినిమాలో ఓ లేడీ. ఈ పాత్రలో డేనియల్ సట్టన్ సూపర్‌గా నటించారు. పైన చెప్పుకున్నట్టు ఓ లేడీ అమెరికన్ ప్రెసిడెంట్ తన కుటుంబంతో పాటు ఇతర దేశాధినేతలను సూపర్ ఫైటింగ్ స్కిల్స్‌తో సేవ్ చేయడమనేది మామూలు కాన్సె΄్టా... ఆలోచించండి. దటీజ్ ‘జీ 20’. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా లభ్యమవుతోంది. అయితే మీ పిల్లలను ఈ సినిమాకి దూరంగా ఉంచి మీరు మాత్రం వాచ్ ఇట్ ఫర్ వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
ఓటీటీల జమానా పెరిగిన తర్వాత థియేటర్లలో చెప్పలేని, చూపించలేని కొన్ని స్టోరీలని సినిమాలు, వెబ్ సిరీసులుగా తీస్తున్నారు. అలా గతేడాది తమిళంలో రిలీజైన ఓ బోల్డ్ మూవీ.. ఇప్పుడు తెలుగులో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇంతకీ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?సోనియా అగర్వాల్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా 'ష్'ని గతేడాది రిలీజ్ చేశారు. తమిళ వెర్షన్ ఆహా, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ ని ఆహా ఓటీటీలోనే ఏప్రిల్ 30 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) 'ష్' మూవీ నాలుగు కథల సమాహారం. ఇందులో లస్ట్, రొమాన్స్ తదితర అంశాలని చూపించారు. స్కూల్ ఏజ్ లో సె*క్స్ ఎడ్యుకేషన్.. పెళ్లికి ముందు.. మిడిల్ ఏజ్ రొమాన్స్ తదితర స్టోరీలతో ఈ సినిమాని తీశారు. పృథ్వీ ఆదిత్య, వాలి మోహన్ దాస్, హరీష్, కార్తీకేయన్ దర్శకత్వం వహించారు. గతంలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన 'లస్ట్ స్టోరీస్' స్ఫూర్తితో ఈ సినిమా తీశారు. కాకపోతే ఇందులో మరీ అంత బోల్డ్ సీన్స్ ఏం లేవని, క్లైమాక్స్ ని ఓపెన్ ఎండింగ్ తో ముగించడం కాస్త అసంతృప్తిని కలిగించిందని తమిళంలో రిలీజైనప్పుడు టాక్ వచ్చింది. మరి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ
కొత్త సినిమాలు ఎన్నో వస్తుంటాయి. కొన్ని మాత్రం మన మనసుకు నచ్చేస్తాయి. అరె ఇది మన కథలా ఉందే అనే భావన కలిగిస్తాయి. చూస్తున్నంతసేపు మనసుకు హత్తుకుంటూనే గుండెను బరువెక్కిస్తాయి. అలాంటి సినిమానే 'ప్రణయం 1947'. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఈ తెలుగు డబ్బింగ్ మూవీ ఎలా ఉంది? రివ్యూ ఏంటనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) కథేంటి?శివన్న (జయరాజన్) 70 ఏళ్ల వృద్ధుడు. భార్య చనిపోవడం, కొడుకులు పెళ్లి చేసుకుని మరోచోటుకి వెళ్లిపోవడంతో సొంతూరిలో పొలం మధ్యలో కట్టుకున్న ఇంటిలో ఒంటరిగా జీవిస్తుంటాడు. దగ్గరలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తుంటాడు. అదే ఆశ్రమంలో గౌరీ (లీలా) అనే ముసలావిడ కూడా ఉంటుంది. గతంలో టీచర్ గా పనిచేసిన ఈమె సొంతింటిపై బెంగతో ఇక్కడ ఉండలేకపోతుంటుంది. ఓ సందర్భంలో శివ చెప్పిన జోక్ ని సీరియస్ గా తీసుకున్న గౌరీ.. అతడితో పాటు అతడి ఇంట్లోనే కలిసి ఉంటానని అంటుంది. కట్ చేస్తే పిల్లల అనుమతితో శివ-గౌరీ కలిసి జీవిస్తారు. తర్వాత ఏమైందనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇప్పటివరకు టీనేజీ, మధ్య వయసు ప్రేమకథలు మనం చూశాం. కానీ ఇది ఓల్డేజీ ప్రేమకథ. అంటే భార్య చనిపోయిన ఓ వ్యక్తి, భర్త చనిపోయిన ఓ మహిళ.. ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేదే 'ప్రణయం 1947'.కుటుంబం, పిల్లలు, బాధ్యతలు అంటూ చాలామంది తల్లిదండ్రులు జీవితం మొత్తం కష్టపడుతూనే ఉంటారు. కానీ ముసలితనంలో మాత్రం వీళ్లని కొడుకులు దూరం పెడుతున్నారు. దీంతో చాలామంది ఒంటరితనాన్ని భరిస్తూ బతుకుతున్నారు. వృద్ధాప్యంలో తమకు ప్రేమని పంచే ఓ తోడు ఉంటే బాగుండు అనుకునే ఎందరో తల్లిదండ్రుల మనోవేదనే ఈ సినిమా.(ఇదీ చదవండి: ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' రివ్యూ) చూస్తున్నంతసేపు చాలా హృద్యంగా ఉంటుంది. సినిమాలో ఎలాంటి హంగులు, ఆర్భాటాలు ఉండవు. కొందరు సాధారణ మనషులు, వారి మధ్య జరిగే సంభాషణలు, సున్నితమైన హాస్యం, ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమ, చిరుకోపం.. ఇలా ప్రతి సీన్ మనసుకు హత్తుకునేలా ఉంటుంది.ప్రేమకు వయసుతో సంబంధం లేదని విషయాన్ని తెరపై చూపించిన విధానం చాలా బాగుంది. పిల్లలు తమను కాదనుకోవడంతో అటు ఆశ్రమాల్లో ఉండలేక.. ఇటు ఇంటికి వెళ్లలేక లోలోపల మధనపడే పెద్దల బాధని కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్లేటులో ఇడ్లీ పెట్టి ప్రేమని వ్యక్తపరచడం, మనషుల కంటే కుక్కలే విశ్వాసంగా ఉంటాయని చెప్పే సన్నివేశాలు భలే ఉన్నాయని చెప్పొచ్చు.కేవలం 100 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమా చూస్తున్నంతసేపు సరదాగానే ఉంటుంది. కానీ చివరకొచ్చేసరికి ట్రాజెడీ ఉంటుంది. లీనమైతే మన కంట్లో నీళ్లొచ్చేస్తాయి. 50,60 ఏళ్ల వయసు గల వ్యక్తులు ఈ మూవీ చూస్తే ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే తెరపై కనిపించేది సినిమా కాదు. అలాంటి వాళ్ల జీవితం కాబట్టి.ఎవరెలా చేశారు?శివ, గౌరీ టీచర్ గా ప్రధాన పాత్రలు చేసిన జయరాజన్, లీలా సామ్సన్ జీవించేశారు. చాలా సహజ నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి. కొన్నిచోట్ల ల్యాగ్ అనిపించినప్పటికీ మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ విషయంలో దర్శకుడు అభిజిత్ అశోకన్ ని మెచ్చుకోవాలి.ఈ వీకెండ్ ఏదైనా ఓ మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం 'ప్రణయం 1947' చూడొచ్చు. ఆహా ఓటీటీలో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది. కుటుంబంతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో సారంగపాణి జాతకం, చౌర్యపాఠం, జింఖానా తదితర సినిమాలొచ్చాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం దాదాపు 25కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. వీటిలో అరడజనుకు మూవీస్ కి పైగా ఆసక్తి కలిగిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే మ్యాడ్ స్క్వేర్, జ్యూయెల్ థీప్, మజాకా, వీరధీరశూర, ఎల్ 2 ఎంపురాన్, నిరమ్ మరుమ్ ఉళగిల్, లాఫింగ్ బుద్ధా చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ (ఏప్రిల్ 25)నెట్ ఫ్లిక్స్మ్యాడ్ స్క్వేర్ - తెలుగు సినిమాహవోక్ - ఇంగ్లీష్ మూవీఈజ్ లవ్ సస్టెయనబుల్ - జపనీస్ సిరీస్జ్యూయెల్ థీప్ - తెలుగు డబ్బింగ్ సినిమాద రెలుక్టెంట్ పీచర్ - జపనీస్ సిరీస్వీక్ హీరో క్లాస్ 2 - కొరియన్ సిరీస్అమెజాన్ ప్రైమ్మజాకా - తెలుగు మూవీవీరధీరశూర - తెలుగు చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్)కల్లు కాంపౌండ్ - తెలుగు మూవీఫ్లో - ఇంగ్లీష్ సినిమాఇరవనిల్ ఆటమ్ పర్ - తమిళ మూవీల్యాండ్ లైన్ - ఇంగ్లీష్ సినిమావివాహా ఆహ్వానం - మలయాళ చిత్రంనోవకైన్ - ఇంగ్లీష్ మూవీసమర - మలయాళ సినిమాసూపర్ బాయ్స్ మలెగావ్ - తెలుగు డబ్బింగ్ మూవీతకవి - తమిళ సినిమాహాట్ స్టార్ఫ్రాన్సిస్ ద పీపుల్స్ పోప్ - ఇంగ్లీష్ మూవీకజిలియోనైరీ - ఇంగ్లీష్ సినిమావాండర్ పంప్ విల్లా సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఎల్ 2 ఎంపురాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)జీ5అయ్యన మానే - కన్నడ సిరీస్ఎస్ఎఫ్ 8 - కొరియన్ సిరీస్సన్ నెక్స్ట్నిరమ్ మరుమ్ ఉళగిల్ - తమిళ సినిమాలాఫింగ్ బుద్ధా - కన్నడ మూవీఆపిల్ ప్లస్ టీవీవోండ్లా సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ఆహాగార్డియన్ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఓల్డేజ్ ప్రేమకథ.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
OTTలో ఏం చూడాలో అర్థం కావట్లేదా? ఇవైతే అస్సలు మిస్ చేయొద్దు!
ఓటీటీ అనగానే చాలామంది థ్రిల్లర్ సినిమాలకే ఓటేస్తారు. సబ్స్క్రిప్షన్ వృథాగా పోకుండా మంచి సినిమాలన్నీ చూసేయాలనుకుంటారు. కొత్తగా రిలీజయ్యే వాటిని ఎలాగోలా చూస్తారు. కానీ, అవైపోయాక ఏం చేయాలో అర్థం కాదు. ఇందుకోసం ఓటీటీలో టాప్ సినిమాల జాబితా కోసం గూగుల్‌లో వెతికేస్తారు. అలాంటివారికోసమే నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన చిత్రాల జాబితాను ఇక్కడ పొందుపరిచాం. నెట్‌ఫ్లిక్స్‌లో.. ఇవి బాగుంటాయ్ అని చెప్పుకునే సినిమాలు బోలెడు. వాటిలో ఓ పది చిత్రాలను మీకోసం అందిస్తున్నాం. అవేంటో చూసేయండి..డామ్సెల్ఒక యువరాణి తన రాజ్యానికి దూరంగా ఉన్నప్పుడు ఓ గాయపడ్డ డ్రాగన్‌ను కనుగొంటుంది. దానితో ఆమెకు మంచి స్నేహం కుదురుతుంది. ఈ స్నేహితులు ఏం చేశారన్నది నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిందే!ద విచ్ఒక ఫ్యామిలీ అడవిలోని ఓ ప్రదేశంలో తమకంటూ ఓ ఇల్లు నిర్మించుకుని ఆవాసం ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ భయాన సంఘటనలు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొన్నారా? లేదా? వీరు దెయ్యం చేతిలో ప్రాణాలు కోల్పోయారా? అన్నది తెలియాలంటే ద విచ్ చూడాల్సిందే!ట్రైన్ టు బూసన్దక్షిణ కొరియాలో జాంబీ వైరస్ వ్యాపిస్తుంది. దీంతో ఓ రైలులో మనుషులు ఉన్నట్లుండి జాంబీలుగా మారిపోతారు. మరి అందులోని హీరో కుటుంబం వీరి బారి నుంచి సురక్షితంగా బయపడ్డారా? లేదా? అన్నదే మిగతా కథ!వెరోనికాసరదా ఆటలు కొన్నిసార్లు ప్రాణాపాయంగా మారతాయి. ఓ టీనేజ్ అమ్మాయి ఊజా బోర్డుతో గేమ్ ఆడుతుంది. దాంతో దెయ్యం ఆమె వెంటపడుతుంది. తన కుటుంబాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.బర్డ్ బాక్స్ఒక శక్తి.. తన కంటిచూపుతో జనాల్ని సూసైడ్ చేసుకునేలా చేస్తుంది. దాని నుంచి తప్పించుకునేందుకు ఒక తల్లి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని కట్టుబట్టలతో ఇల్లు వదిలేసి వెళ్తుంది. ఈ క్రమంలో వారు కళ్లకు గంతలు కట్టుకుని నది దాటే ప్రయత్నం చేస్తారు. మరి వాళ్లు గండం గట్టెక్కారా? లేదా? అనేది తెలియాలంటే బర్డ్ బాక్స్ చూడాల్సిందే!ఫ్రాక్చర్డ్యాక్సిడెంట్ తర్వాత ఓ జంట ఆస్పత్రిలో చేరుతుంది. తీరా చూస్తే తన భార్య, కూతురు కనిపించకుండా పోతారు. ఆస్పత్రిలోనే ఏదో జరుగుతోందని హీరో కనుగొంటాడు. తన భార్య, కూతురిని తిరిగి కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ.స్ట్రేంజర్ థింగ్స్మనకు తెలియని ప్రపంచం మరోటి ఉందని పిల్లలు కనుగొంటారు. ఆ మరో ప్రపంచంలోని రాక్షస జీవులతో పోరడతారు. అదృశ్య శక్తులున్న ఓ అమ్మాయి ఆ రాక్షస జీవులతో పోరాడేందుకు సాయం చేస్తుంది. ఇప్పటికి ఈ వెబ్ సిరీస్ నాలుగు సీజన్లు వచ్చింది. త్వరలో ఐదో సీజన్ రాబోతోంది.ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్అమెరికన్ రచయిత ఎడ్గర్ అల్లన్ పో ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ అనే కథ రాశాడు. దీన్ని ఆధారంగా చేసుకుని ద ఫాల్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఉషర్ సిరీస్ తెరకెక్కింది. ఇందులో ఓ కుటుంబాన్ని దెయ్యం వెంటాడుతూ ఉంటుంది.. ఒంట్లో వణుకు పుట్టించే సిరీస్ ఇది.ట్రూత్ ఆర్ డేర్మనలో చాలామంది ఆడుకునే సరదా ఆట ఇది. ఈ సినిమాలో కూడా ఫ్రెండ్స్ సరదాగా ట్రూత్ ఆర్ డేర్ ఆడతారు. కానీ ఎవరైనా అబద్ధం చెప్పారంటే ఓ శక్తి వారిని దారుణంగా శిక్షిస్తుంటుంది. ఆటను మధ్యలో వదిలేసినవారిని చంపడానికి కూడా వెనుకాడదు.మెరైన్ఓ అమ్మాయి హారర్ కథలు రాస్తుంటుంది. నెమ్మదిగా అవన్నీ నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. ఈ ఫ్రెంచ్ సిరీస్ హారర్ ప్రియులను కచ్చితంగా మెప్పిస్తుంది.చదవండి: మర్చిపోయారా? సిక్స్ ప్యాక్ ట్రెండ్ మొదలుపెట్టిందే ఆ హీరో!: విశాల్ -
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'హన్సిక' సినిమా
హన్సిక నటించిన గార్డియన్ సినిమా ఏడాది తర్వాత సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే మేకర్స్ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో హన్సిక ఒక అందమైన యువతిగా, దెయ్యంగా ద్విపాత్రాభినయం చేసింది. ఫిలిం వర్క్స్ పతాకంపై విజయ్‌చందర్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శక ద్వయం శబరి, గురుశరవణన్ దర్శకత్వం వహించారు. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. అయితే, ఈమూవీ బిగ్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీలో సురేష్ చంద్రమీనన్, శ్రీమాన్ కీలక పాత్రలలో నటించారు.ఔట్‌డేటెడ్ హారర్ మూవీగా ప్రేక్షకులు ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు. అయితే, గతేడాది మే నెలలో విడుదలైన ఈ చిత్రం సడెన్‌గా 'ఆహా' తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత హన్సికకు మరో ఛాన్స్ దక్కలేదు. తెలుగులో చివరగా 105 మినట్స్ అనే మూవీలో ఆమె నటించింది. ప్రస్తుతం నషా పేరుతో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్న ఈ బ్యూటీ పలు టీవీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది.అసలు కథేంటంటే..రోటీన్ హారర్ స్టోరీగా దర్శకుడు శబరి గురుశరవణన్ తెరకెక్కించారు. అపర్ణ (హన్సిక) ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తుంది. ఓ ప్రమాదంలో గాయపడిన అపర్ణ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ సహాయంతో సిటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారిపై ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుంది? అసలు ఆ ఆత్మ ఎవరు? అపర్ణ శరీరంలోకి ఆ ఆత్మ ఎలా ప్రవేశించింది? ఆ ఆత్మ కారణంగా అపర్ణ జీవితంలో ఎలా చిక్కుల్లో పడింది అన్నదే అసలు కథ. -
భారీ ట్విస్ట్‌లతో థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్ నటుడు నాజర్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'ది అకాలీ'(The Akaali).. ఏడాది క్రితం తమిళ్లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ ఓటీటీలో రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీలో కథ, కథనాలతో పాటు భారీ ట్విస్ట్‌లు ఉంటాయి. ముఖ్యంగా నాజర్ పర్ఫార్మెన్స్కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో నాజర్‌తో పాటు వినోద్ కిషన్, తలైవాసల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు మహ్మద్ అసిఫ్ హమీద్ హారర్ థ్రిల్ మూవీగా దీనిని తెరకెక్కించారు.సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదు. అయితే, ఇప్పటికే తమిళ వర్షన్ ఆహా(AHA) ఓటీటీలో రావడంతో చాలామంది చూసిన తర్వాత మూవీ బాగుందంటూ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అదే ఓటీటీలో ఈ నెల 26 నుంచి తెలుగు ఆడియో అందుబాటులో ఉండనుంది. డార్క్ హారర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉండటంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.జానిస్ అనే అమ్మాయి తనకున్న అతీంద్రియ శక్తుల సహాయంతో వరుసగా హత్యలు చేస్తుంటుంది. అందులో దాగి ఉన్న మిస్టరీని ఛేదించేందుకు హమ్జా అనే పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇస్తాడు. సంబంధిత కేసును ఛేదించే క్రమంలో పోలీసు అధికారికి విస్తుపోయే విషయాలు తెలుస్తాయి. ఈ కేసు విషయంలో అతను తెలుసుకున్న షాకింగ్ నిజాలేమిటి..? మరి, జానిస్ ఎందుకు మర్డర్స్ చేయాల్సి వచ్చింది..? జానిస్ పూజలను హమ్జా ఎలా అడ్డుకున్నాడు? వంటి అంశాలు ఆసక్తిని పెంచుతాయి. -
ఓటీటీలోకి కామెడీ మూవీ 'బ్రొమాన్స్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మలయాళ చిత్రాల్ని డబ్ చేసి నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తుంటారు. అలా దాదాపు రెండున్నర నెలల తర్వాత ఓటీటీలో కామెడీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఓల్డేజ్ ప్రేమకథ.. తెలుగులోనూ స్ట్రీమింగ్) 'ప్రేమలు' అనే డబ్బింగ్ సినిమాతో మనకు పరిచయమైన సంగీత్ ప్రతాప్, మాథ్యూ థామస్, శ్యామ్ మోహన్ తో పాటు అర్జున్ అశోకన్, మహిమ నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'బ్రొమాన్స్'. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.ఫిబ్రవరి 14న రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా దాదాపు రెండున్నర నెలల తర్వాత అంటే మే 1 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) 'బ్రొమాన్స్' విషయానికొస్తే.. బింటో (మాథ్యూ థామస్) తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుంటాడు. ఇతడి అన్నయ్య షింటో (శ్యామ్) కొచ్చిలో జాబ్ చేస్తూ అక్కడే ఉంటాడు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోస బింటో.. కూర్గ్ వెళ్లగా.. అన్నయ్య కనిపించకుండా పోయాడనే విషయం తెలుస్తుంది.దీంతో అన్నయ్యని వెతికేందుకు బింటో ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఇతడికి షబీర్, ఐశ్వర్య, హరిహరసుధాన్, కొరియర్ బాబు అని నలుగురు వ్యక్తులు కలుస్తారు. వీళ్లందరూ కలిసి షింటోని వెతికుతుంటారు. మరి చివరకు షింటో దొరికాడా? ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) Chaos, comedy, and a gang you’ll never forget. Watch #Bromance streaming from May 1 on SonyLIV pic.twitter.com/mjgYqjnDok— Sony LIV (@SonyLIV) April 23, 2025 -
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలో(OTT Movie) మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే వాటి ఒరిజినల్ వెర్షన్స్ కొందరు చూస్తుంటారు. కానీ చాలామంది తెలుగు ఆడియెన్స్ మాత్రం తెలుగులో డబ్ చేస్తే చూద్దామని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ క్యూట్ లవ్ స్టోరీ మూవీ వచ్చేసింది. గతేడాది మార్చిలో మలయాళంలో రిలీజైన సినిమా 'జననం 1947 ప్రణయం తుడరున్'. 70 ఏళ్ల వయసున్న ఓ మహిళ, పురుషుడు ప్రేమలో పడితే అనే స్టోరీతో ఈ మూవీ తీశారు. దీన్ని దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత తెలుగులో ఇప్పుడు రిలీజ్ చేశారు. ఒరిజినల్ అమెజాన్ ప్రైమ్ లో ఉండగా.. ప్రస్తుతం ఆహాలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) '1947 ప్రణయం'(1947 Pranayam Movie) పేరుతో దీన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సినిమా విషయానికొస్తే.. శివ(జయరాజ్ కొజికోడ్) ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తుంటాడు. అక్కడే ఉంటున్న గౌరీ అనే రిటైర్డ్ టీచర్.. శివని చూసి ఇష్టపడుతుంది. అతడితో కలిసి ఉండాలనుకుంటుంది. దీనికి అనుమతి దక్కడంతో ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తారు. మరి ఓల్డేజ్ ప్రేమకథ చివరకు ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమా చూద్దామనుకుంటే మాత్రం ఈ వీకెండ్ కి ఇది మంచి ఆప్షన్ కావొచ్చు. మరోవైపు ఈ వారం థియేటర్లలో సారంగపాణి జాతకం, చౌర్యపాఠం, జింఖానా సినిమాలు వస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో ఎల్ 2 ఎంపురాన్, వీరధీరసూర చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సిరీస్
ఓటీటీల జమానా పెరిగిన తర్వాత సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని భాషల్లోనూ ఎక్కువగా తీస్తున్నారు. అయితే అవి టైమ్ చూసుకుని రిలీజ్ చేస్తున్నారు. అలా అషూరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఓ సిరీస్ ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండా రిలీజ్ చేసేశారు. ఇంతకీ ఇది ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? దీని కథేంటి?సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న అషూరెడ్డి.. గత కొన్నాళ్లుగా సినిమాల్లోనూ సహాయ పాత్రలు చేస్తోంది. ఈమె నటించిన లేటెస్ట్ సిరీస్ 'ఎవరు ఎప్పుడు ఎక్కడ'. పీఎస్ రావు అనే దర్శకుడి దీన్ని తెరకెక్కించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తీసిన ఈ సిరీస్ లో అషూతో పాటు ధన్య బాలకృష్ణ, కౌశల్, ఆటో రాంప్రసాద్ ఇతర పాత్రలు పోషించారు.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్)'ఎవరు ఎప్పుడు ఎక్కడ' సిరీస్ తెలుగు వెర్షన్ తో పాటు హిందీలోనూ హంగామా ఓటీటీ యాప్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సిరీస్ విషయానికొస్తే.. ఎమ్మెల్యే దగ్గర పనిచేసే పీఏ ఒకరు చనిపోతారు. దీని గురించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో సాక్షులు కూడా చనిపోతుంటారు. ఇదంతా ఓ అమ్మాయి చేస్తుందని పోలీసులు తేలుస్తారు. ఇంతకీ మర్డర్స్ చేస్తుంది ఆ అమ్మాయేనా? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఇకపోతే ఈ వారం థియేటర్లలో ప్రియదర్శి హీరోగా నటించిన సారంగపాణి జాతకం, చౌర్యపాఠం అనే తెలుగు సినిమాలతో పాటు జింఖానా అనే డబ్బింగ్ చిత్రం రాబోతుంది. ఓటీటీలో ఎల్ 2 ఎంపురాన్, వీరధీరశూర, జ్యూయెల్ థీప్ మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు వీకెండ్ ఓటీటీలో సడన్ సర్ ప్రైజులు ఏమైనా ఉండే అవకాశముంది.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) -
మరో ఓటీటీలో 'మసూద'.. భయపెడుతూ, థ్రిల్‌ని పంచే సినిమా
మసూద సినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. అప్పటికే ఈ బ్యానర్ నుంచి మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించారు.మసూద సినిమా కొత్త రకమైన హారర్ డ్రామాతో రూపొందడంతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల్ని భయపెడుతూ, థ్రిల్‌ని పంచడంతో ఈ మూవీకి భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆహా (AHA) తెలుగు ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే, తాజాగా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video)లో కూడా మసూద స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.కథేంటంటే.. నీలం(సంగీత) ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్. భర్త అబ్దుల్(సత్య ప్రకాశ్)కు దూరంగా ఉంటూ.. కూతురు నాజియా(బాంధవి శ్రీధర్)తో కలిసి ఓ అపార్ట్మెంట్లో రెంట్‌కు ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో ఉండే గోపీ(తీరువీర్) ఓ సాఫ్ట్వేర్. తన సహోద్యోగి మినీ(కావ్యా కళ్యాణ్ రామ్)ని ప్రేమిస్తుంటాడు. కానీ ఆ విషయం ఆమెతో చెప్పడానికి భయపడతాడు. ఒకే అపార్ట్మెంట్లో ఉండడంతో నీలం ఫ్యామిలీకి క్లోజ్ అవుతాడు. అప్పుడప్పుడు గోపీతో కలిసి నీలం, నాజియా బయటకు వెళ్తుంటారు. అయితే ఓ రోజు నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది. అర్థరాత్రి వేళ ఏదోదో మాట్లాడుతుంది. కూతురిని అలా చూసి భయపడిన నీలం.. గోపీని సహాయం అడుగుతుంది. నాజియా ప్రవర్తను చూసిన గోపీ.. ఆమెకు దెయ్యం పట్టిందని గ్రహిస్తాడు. ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చివరకు అల్లా ఉద్దీన్(సత్యం రాజేశ్) సలహాతో పీర్ బాబా(శుభలేఖ సుధాకర్)ను కలుస్తారు. ఈ తర్వాత గోపీ, నీలంలకు ఎదురైన సమస్యలు ఏంటి? నాజియా ఆత్మలోకి దెయ్యం ఎలా ప్రవేశించింది? అసలు మసూద ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? మసూదను మీర్ చాచా ఎందుకు చంపాడు? నాజియాను రక్షించడానికి గోపీ చేసిన సాహసం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మసూద’చూడాల్సిందే. -
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
తెలుగులో ప్రతి ఏడాది వందలకొద్ది సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. కానీ వీటిలో ప్రేక్షకులని ఆకట్టుకునే హిట్ అయ్యేవి చాలా తక్కువ. మిగతావి ఎప్పుడొచ్చి వెళ్లాయో తెలియనంతలా కనుమరుగైపోతాయి. చాన్నాళ్ల తర్వాత ఏదో ఓ చోట ప్రత్యక్షమవుతుంటాయి. అలా దాదాపు రెండేళ్ల తర్వాత రెండు తెలుగు మూవీస్ ఓటీటీలోకి సడన్ గా వచ్చేశాయి. 2023లో ఆగస్టు చివరి వారంలో రిలీజైన 'మహానటులు', అదే ఏడాది సెప్టెంబరు తొలివారంలో రిలీజైన 'ప్రేమదేశపు యువరాణి' చిత్రాలు దాదాపు ఏడాదిన్న రెండేళ్ల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేశాయి. కాకపోతే రూ.99 రెంట్ విధానంలో మీరు వీటిని చూడొచ్చు. రీసెంట్ టైంలో ఇలా చాలా తెలుగు చిత్రాల్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేస్తోంది.(ఇదీ చదవండి: ప్రాణ భయం.. వేరే దేశంలో ఇల్లు కొన్న 'దేవర' విలన్)ప్రతివారం కొన్ని కొన్ని సినిమాలు అన్నట్లు స్ట్రీమింగ్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఈవారం ప్రేమదేశపు యువరాణి, మహానటులు చిత్రాల్ని ఓటీటీలోకి తీసుకొచ్చింది. ఈ సినిమాల విషయానికొస్తే.. రెండింటిలోనూ పెద్దపేరున్న నటీనటులు ఎవరూ లేరు. దీంతో రిలీజైన సంగతి కూడా చాలామందికి తెలియకపోవచ్చు.ఇకపోతే ఈ వారం థియేటర్లలో ప్రియదర్శి హీరోగా నటించిన సారంగపాణి జాతకం, చౌర్యపాఠం అనే తెలుగు సినిమాలతో పాటు జింఖానా అనే డబ్బింగ్ చిత్రం రాబోతుంది. ఓటీటీలో ఎల్ 2 ఎంపురాన్, వీరధీరశూర, జ్యూయెల్ థీప్ మూవీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు వీకెండ్ ఓటీటీలో సడన్ సర్ ప్రైజులు ఏమైనా ఉండే అవకాశముంది.(ఇదీ చదవండి: నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక) -
ఓటీటీకి వచ్చేస్తోన్న మ్యాడ్ స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఆదరగొట్టింది. ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈనెల 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ పోస్టర్‌ను పంచుకుంది. ఇంకేందుకు ఆలస్యం ఈ సినిమాను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. ఇటీవలే ఈ సినిమాలో స్వాతిరెడ్డి అంటూ సాగే క్రేజీ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో హీరోయిన్ రెబా మోనికా జాన్ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. కాగా.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. The boys are back with double the MADness! 🤪Watch Mad Square on Netflix, out 25 April in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.#MadSquareOnNetflix pic.twitter.com/0WGsRj2Sgc— Netflix India South (@Netflix_INSouth) April 21, 2025 మ్యాడ్ స్క్వేర్ అసలు కథేంటంటే..ఈ కథలో పెద్దగా లాజిక్స్ అంటూ ఏమీ ఉండవ్.. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. అశోక్ (నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్), దామోదర్(సంగీత్ శోభన్),లడ్డు(విష్ణు) నలుగురు స్నేహితులు ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత విడిపోతారు. కానీ, లైఫ్‌లో సెటిల్ కాకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లడ్డు(విష్ణు) పెళ్లి నుంచి ఈ సినిమా అసలు కథ మొదలౌతుంది. స్నేహితులకు చెప్పకుండా లడ్డు పెళ్లికి రెడీ అయిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అతని మిత్రులు వేడక సమయంలో సడెన్‌గా ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ఫన్ మొదలౌతుంది. లడ్డుకు ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రి మురళీధర్ గౌడ్ ఎదురు కట్నం ఇచ్చి సంబంధం సెట్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ పెళ్లి చెడిపోకూడదని లడ్డూ ఫ్యామిలీ పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. ఫ్రెండ్ పెళ్లి ఘనంగా చేయాలని దామోదర్, అశోక్, మనోజ్ అనేక ప్లాన్స్ వేస్తుంటారు. వారి హంగామాకు తోడు పెళ్లికూతురు ఫ్యామిలీ నుంచి లడ్డూకు ఎదురయ్యే అవమానాలు కడుపుబ్బా నవ్విస్తాయి.తన స్నేహితులు చేసే తుంటరి పనుల వల్ల ఆ పెళ్లిలో చాలా గందరగోళం నెలకొంటుంది. పెళ్లి జరుగుతున్నంత సేపు ఎక్కడ ఆ కార్యక్రమం ఆగిపోతుందో అనే భయంతో లడ్డు ఉంటాడు. సరిగ్గా పెళ్లి అవుతుందని సమయంలో లడ్డు స్నేహితులతో పాటు వచ్చిన ఒక వ్యక్తితో పెళ్లికూతురు వెళ్లిపోతుంది. ఈ విషయం తెలిశాక లడ్డూ ఇంట్లో జరిగే పంచాయితీ, అక్కడ మ్యాడ్ గ్యాంగ్ చేసే అతి ఫుల్‌గా నవ్విస్తుంది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న లడ్డు కోసం కాస్త రిలాక్స్ ఇవ్వాలని వారందరూ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. వారు ఎంట్రీ ఇచ్చాక గోవా మ్యూజియంలో విలువైన లాకెట్‌ను గోవాలో పెద్ద డాన్‌గా ఉన్న మ్యాక్స్ (సునీల్) మనుసులు దొంగలిస్తారు. దానిని లడ్డు బ్యాచ్ చేశారని పోలీసులు అనుమానిస్తారు. దీంతో వారిపై నిఘా ఉంచుతారు.అయితే, ఒక ఘటనలో ఆ లాకెట్ లడ్డు చేతికి దొరుకుతుంది. దీంతో దానిని తిరిగి తెచ్చివ్వాలని లడ్డు తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేస్తాడు. ఈ కేసును చేధించేందుకు ఒక ఐపీఎస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లడ్డు బ్యాచ్‌లో ఉన్న ఆ అధికారి ఎవరు..? లడ్డుని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరో అబ్బాయితో ఎందుకు వెళ్లిపోయింది...? వారిద్దరూ కూడా గోవాకే ఎందుకు వెళ్తారు..? చివరిగా ఆ లాకెట్ కథ ఏంటి.. ఎవరి వద్ద ఉంటుంది..? ఫైనల్‌గా లడ్డును తన స్నేహితుడే జైలుకు ఎందుకు పంపుతాడు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీ/ థియేటర్లో 20 సినిమాలు.. వీకెండ్లో వేసవి వినోదం
బాక్సాఫీస్ వద్ద ఓదెల2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రాలతో రష్ ఉంది. ఓటీటీలో కూడా కోర్టు, ఛావా సినిమాలు వేసవికాలంలో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే, ఏప్రిల్ చివరి వారంలో కూడా థియేటర్స్‌తో పాటు ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్గా అనిపించే పలు చిత్రాలు వస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఎల్2: ఎంపురాన్ (లూసిఫర్2), విక్రమ్ హీరోగా నటించిన వీర ధీర శూరన్ చిత్రాలు ఓటీటీలోకి ప్రధానంగా రానున్నాయి. అదే విధంగా థియేటర్స్‌లో కూడా క్రైమ్ కామెడీ సినిమా సారంగపాణి జాతకం, ప్రేమలు మూవీ హీరో నటించిన జింఖానా చిత్రం విడుదల కానుంది. బాక్సింగ్ నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండనుంది. బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మి నటించిన గ్రౌండ్ జీరో చిత్రం కూడా ఈ వారంలోనే రిలీజ్ కానుంది. మొత్తం 20 సినిమాలు ఉన్నప్పటికీ 10 సినిమాలే ప్రధానంగా చూడొచ్చని చెప్పవచ్చు.థియేటర్స్‌లోకి వచ్చే సినిమాలు🎥 సారంగపాణి జాతకం- ఏప్రిల్ 25🎥 చౌర్య పాఠం- ఏప్రిల్ 25🎥 జింఖానా- ఏప్రిల్ 25🎥 గ్రౌండ్ జీరో- ఏప్రిల్ 25🎥 శివ శంభో- ఏప్రిల్ 25🎥 సూర్యాపేట జంక్షన్- ఏప్రిల్ 25నెట్‌ఫ్లిక్స్🎥 బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోజన్ (ఇంగ్లీష్)- ఏప్రిల్ 23🎥 ఏ ట్రాజడీ ఫోర్టోల్డ్ ఫ్లైట్ 3054 (ఇంగ్లీష్)- ఏప్రిల్ 23🎥 యు: సీజన్5 (ఇంగ్లీష్) -ఏప్రిల్ 24🎥 డిటెక్టివ్ కోనాన్ (యానిమేషన్)- ఏప్రిల్ 25🎥 హ్యావోక్ (ఇంగ్లీష్) -ఏప్రిల్ 25🎥 జువెల్ తీఫ్ (హిందీ/సినిమా)- ఏప్రిల్ 25జియో హాట్‌స్టార్🎥 ది రిహార్సల్స్ సీజన్1 (ఇంగ్లీష్)- ఏప్రిల్21🎥 యాండోర్ సీజన్2 (ఇంగ్లీష్) -ఏప్రిల్ 23🎥 ఎల్2: ఎంపురాన్ (తెలుగు)- ఏప్రిల్ 24అమెజాన్ ప్రైమ్🎥 వీర ధీర శూరన్ (తెలుగు)- ఏప్రిల్ 24🎥 క్రేజీ (హిందీ/సినిమా)- ఏప్రిల్ 25🎥 సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ (హిందీ/సినిమా)- ఏప్రిల్ 25జీ5🎥 అయ్యన మానే (మూవీ/ కన్నడ) ఏప్రిల్ 25సోనీలివ్🎥 షిర్డీ వాలే సాయిబాబా (మూవీ/హిందీ) ఏప్రిల్ 21 -
ఓటీటీలో రొమాంటిక్ సినిమా.. రూ. 1900 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డ్
రెండేళ్ల క్రితం హాలీవుడ్లో సంచలన విజయాన్ని అందకున్న చిత్రం ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, ఇప్పుడు ఉచితంగానే స్ట్రీమింగ్ అవుతుంది. 2023లో విడుదలైన 'ఎనీవన్ బట్ యూ' ఇప్పటికే పలు ఓటీటీలలో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు సోనీలివ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. అమెరికన్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా ప్రముఖ దర్శకుడు విల్ గ్లక్ తెరకెక్కించారు. విలియం షేక్స్పియర్ రచించిన మచ్ అడో అబౌట్ నథింగ్ ఆధారంగా ఈ సినిమా స్టోరీని తీసుకున్నారు. ఇందులో సిడ్నీ స్వీనీ , గ్లెన్ పావెల్ జోడి చాలా రొమాంటిక్‌గా నటించారు.ఆ ఏడాదిలో విడుదలైన అన్ని హాలీవుడ్ చిత్రాల్లో 'ఎనీవన్ బట్ యూ' టాప్‌లో రన్ అయింది. ఆపై ఓటీటీలోనూ ఈ చిత్రానికి భారీగానే వ్యూస్ దక్కాయి. సబ్‌టైటిల్స్‌తో ఉన్న ఈ మూవీ ఇంగ్లీష్‌లో ఉంది. ప్రస్తుతం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అదికూడా ఉచితంగానే చూసేయవచ్చు. అయితే, జీ5,అమెజాన్ ప్రైమ్‌లో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది. కానీ అక్కడ రెంటల్ విధానంలో ఉంది. సుమారు ఏడాది పాటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ చిత్రం రన్ అయింది. ఢీల్ పూర్తి కావడంతో తాజాగా అందులో నుంచి తొలగించారు.రూ. 210 కోట్ల బడ్జెట్'ఎనీవన్ బట్ యూ' చిత్రాన్ని రూ. 210 కోట్ల బడ్జెట్‌తో విల్ గ్లక్, జో రోత్, జెఫ్ కిర్షెన్‌బామ్ సంయుక్తంగా నిర్మించారు. కేవలం 103 నిమిషాలు మాత్రమే ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1900 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను కోలంబియా పిక్చర్స్, ఓలివ్ బ్రిడ్జ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నిర్మించాయి. అయితే, సోనీ పిక్చర్స్ విడుదల చేసింది. డేటింగ్ కోసం వెళ్లిన ఇద్దరు ప్రేమికులు చిన్న కారణంతో విడిపోయి.. ఒక పెళ్లిలో మళ్లీ కలుస్తారు. ఆ వేడుకను చూసి వారిలో ఎలాంటి ఆలోచన వచ్చింది అనేది ఈ సినిమా ప్రధాన కాన్సెప్ట్. చాలా రొమాంటిక్‌గా, కామెడీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
ఓటీటీలో ఆకట్టుకుంటున్న‘నేను-కీర్తన’
చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను-కీర్తన’. చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఏ) సమర్పణలో, చిమటా లక్ష్మీ కుమారి నిర్మించిన ఈ సినిమా గత ఏడాది ఆగస్టు 30న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 99 రూపాయల రెంట్‌తో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఓటీటీలోనూ అద్భుతమైన స్పందనను రాబడుతూ, తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్ సాధించింది.‘నేను-కీర్తన’ మల్టీ జానర్ చిత్రంగా రూపొందింది. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, కామెడీ, హర్రర్ వంటి అన్ని అంశాలను కలగలిపి దర్శకుడు చిమటా రమేష్ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జానీ అనే పాత్రలో రమేష్ బాబు నటన అందరి ప్రశంసలు అందుకుంది. అన్యాయాలను ఎదిరించే, అపాయంలో ఉన్నవారికి సాయం చేసే యువకుడిగా ఆయన కనిపించారు. కథలో జానీ శత్రువులతో పోరాడుతూనే, తన జీవితంలోకి వచ్చిన కీర్తనతో స్నేహం, ప imza బంధాన్ని నడిపిస్తాడు. కీర్తన ప్రమాదంలో ఉన్న విషయం తెలిసిన జానీ ఆమెను ఎలా కాపాడాడనేది ఆసక్తికర మలుపులతో, హర్రర్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ చిత్రం ఐఎమ్‌డీబీలో 8.9, బుక్‌మైషోలో 9.3 రేటింగ్ సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో విజయం సాధించిన ఈ చిత్రం ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరిస్తోంది -
'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీ డేట్ ఫిక్సయిందా?
రీసెంట్ టైంలో ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తున్నాయి. నెలలోపే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా గత నెలలో రిలీజై హిట్ కొట్టిన 'కోర్ట్'(Court Movie) కూడా 28 రోజులకే డిజిటల్ వీక్షకుల ముందుకొచ్చేసింది. ఇప్పుడు ఇదే తరహాలో మరో హిట్ మూవీ స్ట్రీమింగ్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?)2023లో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై హిట్ కొట్టిన సినిమా మ్యాడ్. జస్ట్ ముగ్గురు కుర్రాళ్లు.. ఇంజినీరింగ్ కాలేజీలో చేసే అల్లరి నేపథ్యంగా ఫుల్ కామెడీతో తీశారు. ప్రేక్షకులకు అది నచ్చేసింది. దీనికి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్(Mad Square Movie) పేరుతో మూవీ తీశారు. ఈ ఉగాదికి థియేటర్లలోకి తీసుకొచ్చారు.తొలి పార్ట్ అంతా కాకపోయినా సరే ప్రేక్షకులని పర్వాలేదనిపించేలా ఆకట్టుకుంది. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీని ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 25 నుంచి 'మ్యాడ్ స్క్వేర్' స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది కాకపోతే 28న రావొచ్చని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) -
ఓటీటీలోకి 'రాబిన్ హుడ్'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
రీసెంట్ టైంలో ఓటీటీల్లోకి(Ott Movies) కొత్త సినిమాలు చాలావరకు నెలలోపే వచ్చేస్తున్నాయి. ఈ విషయంలో చిన్నా పెద్దా అనే తేడాలు ఉండట్లేదు. మరీ బ్లాక్ బస్టర్ అనుకుంటే నెలన్నర నుంచి రెండు నెలలకు స్ట్రీమింగ్ చేస్తున్నారు.మరోవైపు 'సంక్రాంతికి వస్తున్నాం'తో జీ5 ఓటీటీ సంస్థ.. సరికొత్త పంథాలో వెళ్తోందని చెప్పాలి. ఒకేసారి అటు టీవీ, ఇటు ఓటీటీల్లో సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. వెంకీ మూవీతో పాటు రీసెంట్ గా 'కింగ్ స్టన్' చిత్రాన్ని ఇలానే రిలీజ్ చేశారు. ఇప్పుడీ లిస్టులోకి 'రాబిన్ హుడ్'(Robinhood Movie) కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) నితిన్, శ్రీలీల(Sreeleela) జంటగా నటించిన ఈ సినిమా.. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే ఘోరంగా ఫ్లాప్ అయింది. కనీస వసూళ్లు రాక చతికిలపడిందని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడీ మూవీని మే 4న టీవీ, ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.'రాబిన్ హుడ్' విషయానికొస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ. అనాథశ్రమాల కోసం రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చిన నీరా (శ్రీలీల)కు సెక్యూరిటీగా ఉంటాడు. ఓరోజు నీరాని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి రామ్, నీరాని ఎలా రక్షించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?) -
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో ఓదెల 2, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, డియర్ ఉమ తదితర తెలుగు చిత్రాలు రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీల్లో ఏకంగా ఒక్కరోజే 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి విక్రమ్ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే శివంగి, టుక్ టుక్, దావీద్ చిత్రాలు కాస్త చూడదగ్గ కేటగిరీలో ఉంటాయి. మిగతావన్నీ మీ ఆసక్తి బట్టి చూడొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి వచ్చిందంటే?శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల జాబితా (ఏప్రిల్ 18)అమెజాన్ ప్రైమ్టుక్ టుక్ - తెలుగు మూవీమిథ్య - కన్నడ సినిమాకౌఫ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్విష్ణుప్రియ - కన్నడ మూవీద నాట్ వెరీ గ్రాండ్ టూర్ సీజన్ 1 - ఇంగ్లీష్ సిరీస్మిక్కీ 17 - ఇంగ్లీష్ సినిమా (రెంట్ విధానం)చికిచికి బూమ్ బూమ్ - మరాఠీ సినిమాజెంటిల్ ఉమన్ - తమిళ మూవీఆహాశివంగి - తెలుగు సినిమాహాట్ స్టార్మేరే హస్బెండ్ కీ బీవీ - హిందీ సినిమాలా అండ్ ఆర్డర్ సీజన్ 5 - ఇంగ్లీష్ సిరీస్ద వే ఐ సీ ఇట్ - ఇంగ్లీష్ మూవీనెట్ ఫ్లిక్స్ఐ హోస్టేజ్ - డచ్ సినిమాఒక్లామా సిటీ బాంబింగ్ - ఇంగ్లీష్ మూవీహెవెన్లీ ఎవర్ ఆఫ్టర్ - కొరియన్ సిరీస్ (ఏప్రిల్ 19)జీ5లాగౌట్ - హిందీ సినిమాదావీద్ - మలయాళ మూవీసన్ నెక్స్ట్కత్తీస్ గ్యాంగ్ - మలయాళ మూవీఅం అః - మలయాళ సినిమాముబీగ్రాండ్ టూర్ - పోర్చుగీస్ మూవీ(ఇదీ చదవండి: ఆడవాళ్లు కనిపిస్తే వదలడు.. అలాంటి నటుడితో నన్ను..: టాలీవుడ్ హీరోయిన్) -
ఓటీటీలోకి విక్రమ్ కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
పేరుకే తమిళ హీరో గానీ విక్రమ్ కి తెలుగులోనూ బోలెడంతమంది అభిమానులు ఉన్నారు. ఇతడు అందరిలా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కాకుండా కాస్త వైవిధ్యంగా ఉండే సినిమాలు తీస్తుంటాడు. దీంతో అప్పుడో ఇప్పుడో అన్నట్లు హిట్స్ పడుతుంటాయి. అలాంటిది ఇప్పుడు ఇతడి కొత్త సినిమా నెలలోపే ఓటీటీలోకి(OTT Movie) వచ్చేస్తోంది.విక్రమ్(Vikram)హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'వీరధీరశూర'(Veera Dheera Sooran Movie). యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో తీసిన ఈ సినిమాలో ఎస్జే సూర్య, సూరజ్ వెంజుమోడ్ లాంటి స్టార్స్ నటించారు. అయితే మార్చి 27న ఉగాది కానుకగా థియేటర్లలో రిలీజైంది. అదే టైంకి తెలుగులో మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ రిలీజ్ కావడంతో దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.(ఇదీ చదవండి: ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో.. )మరోవైపు ఈ చిత్రానికి యావరేజ్ టాక్ రావడం కూడా మైనస్ అయిందని చెప్పొచ్చు. అలా చాలామంది చూడకుండానే థియేటర్లలో నుంచి ఈ సినిమా తీసేశారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు నెలలోపే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. 'వీరధీరశూర' విషయానికొస్తే.. కాళి (విక్రమ్) ఓ కిరాణా దుకాణం నడుపుతుంటాడు. భార్య వాణి, పిల్లలతో ప్రశాంతంగా బతికేస్తుంటాడు. కానీ కాళి గతం వేరు. రవి (పృథ్వీ) దగ్గర చాన్నాళ్లు పనిచేసుంటాడు. ఓ రోజు రవి వచ్చి కాళిని సాయం అడుగుతాడు. తనని, తన కొడుకు కన్నా (సూరజ్ వెంజరమూడు)ని ఎన్కౌంటర్ చేయాలనుకున్న ఎస్పీ అరుణగిరి (ఎస్.జె.సూర్య)ని అంతం చేయాలని అంటాడు. దీనికి కాళి ఒప్పుకోవల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్) One night. No rules. Only survival. A night that will change everything. 🔥#VeeraDheeraSooranOnPrime, April 24 pic.twitter.com/os8pfrjyUJ— prime video IN (@PrimeVideoIN) April 18, 2025 -
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
వాహనానికి కూడా జీవితం ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనలో నుంచి పుట్టిందే టుక్ టుక్ మూవీ (Tuk Tuk Movie). హర్ష రోషన్ (Harsh Roshan), కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి, తెలుగమ్మాయి శాన్వీ మేఘన (Saanve Megghana) ప్రధాన పాత్రల్లో నటించారు. పూరీ జగన్నాథ్ దగ్గర రచయితగా పని చేసిన సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఆర్‌వైజీ సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీ రాములరెడ్డి నిర్మించారు. గత నెలలో థియేటర్లలో.. ఇప్పుడు ఓటీటీలోమార్చి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్ష రోషన్ హీరోగా నటించిన కోర్ట్ ఘన విజయం సాధించడంతో ఆ ప్రభావం ఈ సినిమాపై కూడా ఉంటుందనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం రాబట్టుకోలేకపోయింది. అయితే నటీనటుల పర్ఫామెన్స్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తాజాగా ఈ సినిమా నెల తిరగకుండానే ఓటీటీ (OTT)లోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.కథేంటంటే? ముగ్గురు టీనేజ్ కుర్రాళ్లు (హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బు కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకచవితి చేస్తారు. వినాయక నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఓ పాత స్కూటర్‌ను తెచ్చుకుని ముగ్గురూ కూర్చునే టుక్ టుక్ బండిలా తయారు చేస్తారు. ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు. ఆ తెల్లవారు నుంచి ఆ బండి దానంతటదే ఆన్ అవుతుంది. తిరుగుతుంది. దీంతో ఆ స్కూటర్లో దేవుడు ఉన్నాడని భావిస్తారు. మరి నిజంగానే అందులోకి దేవుడు ప్రవేశించాడా? లేక ఆత్మనా? అసలు ఆ ఆత్మ ఎవరిది? ఆ స్కూటర్‌ను ఏం చేశారు? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!చదవండి: ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో.. -
ఓటీటీకి రూ.250 కోట్ల సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన యాక్షన్ చిత్రం ఎల్2: ఎంపురాన్. ఈ మూవీకి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. విడుదలైన 15 రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్కును దాటేసింది. మార్చి 27న థియేటర్లలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ దేశీయ మార్కెట్లో వందకోట్లకు పైగా నికర వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్ల సాధించిన ఎంపురాన్.. మలయాళ ఇండస్ట్రీలోనే తొలి చిత్రంగా నిలిచింది.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 24 నుంచి మలయాళం, తెలుగు, తమిళం, కన్నడలో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. అయితే హిందీలో స్ట్రీమింగ్ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ లేదు. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు మంజు వారియర్, టోవినో థామస్, జెరోమ్ ఫ్లిన్, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటించారు. അബ്റാമിൻറെ ലോകം ഇവിടെ തുടങ്ങുന്നു.L2: Empuraan will be streaming from 24 April only on JioHotstar. @mohanlal @prithviofficial @GopyMurali @antonypbvr @gokulamstudios @aashirvadcine @LycaProductions @ManjuWarrier4 @ttovino @Indrajith_S @SaniyaIyappan_ @sujithvasudev… pic.twitter.com/QL6ELgED9u— JioHotstar Malayalam (@JioHotstarMal) April 17, 2025 -
సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్.. ఎక్కడంటే?
ఆనంది, వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం శివంగి. ఆనంది (Anandi) సత్యభామగా.. వరలక్ష్మి పోలీసాఫీసర్‌గా మెప్పించారు. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. దేవరాజ్ భరణీధరన్ దర్శకత్వంలో నరేశ్‌బాబు.పి నిర్మించిన ఈ చిత్రం మార్చి 7న విడుదలైంది. నెలన్నర తర్వాత ఈ సినిమా సడన్‌గా ఓటీటీ (OTT)లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (AHA)లో ప్రసారమవుతోంది. ఈరోజు (ఏప్రిల్ 17) నుంచి తెలుగు వర్షన్ స్ట్రీమ్ అవుతుండగా రేపటి నుంచి తమిళ వర్షన్ ప్రసారం కానుంది.కథేంటంటే?సత్యభామ (ఆనంది) సాధారణ గృహిణి. ఓవైపు భర్త అనారోగ్యం, మరోవైపు ఆర్థిక సమస్యలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దీనికి తోడు అత్త వేధింపులు! ఇదిలా ఉండగా ఓ రోజు తల్లిదండ్రులు వరదల్లో చిక్కుకుపోతారు. తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయిస్తుంది. అక్కడేం జరిగింది? ఎవరైనా చనిపోయారా? చంపేశారా? సత్యభామ తన కష్టాలను ఎలా దాటింది? అనేది తెలియాలంటే ఆహాలో శివంగి చూడాల్సిందే! చదవండి: సావిత్రి పాటకు అసభ్యంగా డ్యాన్స్.. సపోర్ట్ చేసిన డైరెక్టర్? -
తారక్ పూనకం వచ్చినట్లే చేశాడు.. నాదేం లేదు: రాజమౌళి
ఆర్ఆర్ఆర్ (RRR Movie)లో రోమాలు నిక్కబొడుచుకునే పాట+ సన్నివేశం అనగానే చాలామందికి మొదట గుర్తొచ్చేది కొమురం భీముడో సాంగ్.. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్‌ను చిత్రహింసలు పెడుతున్నా.. అతడు ప్రజలను ఒక్కటి చేసేందుకు ప్రయత్నించడం.. ఈ క్రమంలో ఆయన పలికించే భావోద్వేగాలు.. నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. ఆ సమయంలో తారక్‌ను చూస్తే ఏదో పూనకం వచ్చినట్లే కనిపించాడంటున్నాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (S. S. Rajamouli).తారక్ వల్లే ఈజీ..జపాన్‌లో ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ ప్రమోషన్లలో రాజమౌళి మాట్లాడుతూ.. కొమురం భీముడో పాట (Komuram Bheemudo Song) షూటింగ్ చాలా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే తారక్ (Jr NTR) పోషించిన పాత్ర తాలూకు ఆత్మ అతడిలో ప్రవేశించినట్లుగానే యాక్ట్ చేశాడు. అతడు అద్భుతమైన నటుడని మనందరికీ తెలుసు. ఈ పాటలో మాత్రం మరో స్థాయిలో నటించాడు. తనిచ్చే ఒక్కో ఎక్స్ప్రెషన్.. నుదుటిపై కండరాల కదలిక.. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి.కొరియోగ్రాఫర్ నైపుణ్యం కూడా..నేను కేవలం కెమెరాను అతడి ముఖం ముందు పెట్టి పాట ప్లే చేశానంతే.. చివరకు ఆ పర్ఫామెన్స్ అద్భుతంగా వచ్చింది. ఈ విషయంలో కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ (Prem Rakshit)కు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే! అతడిని ఎలా కట్టేయాలి, గాల్లో ఎలా వేలాడదీయాలి.. ఇలా అన్నింటినీ తను చాలా బాగా కొరియోగ్రఫీ చేశాడు అని మెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే.. విజయేంద్రప్రసాద్ కథ అందించిన ఈ చిత్రాన్ని ఆయన తనయుడు రాజమౌళి తెరకెక్కించాడు. వెయ్యికోట్లకు పైనే..సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా డీవీవీ దానయ్య నిర్మించాడు. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్, శ్రియా, సముద్రఖని, ఒలీవియా మోరిస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. 2022 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.1300 కోట్లకు పైగా రాబట్టింది. ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ (RRR: Behind and Beyond) డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.రాజమౌళి నెక్స్ట్ మూవీ..ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. అతడు వార్ 2 చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. Everyone Knows Tarak Is Good, Fantastic Actor But In #KomuramBheemudo Sequence He's On Different Level 🔥👏🛐 - @ssrajamouli In Japan ❤️.Goat Actor @tarak9999 🐐❤️🔥.#RRRBehindAndBeyond pic.twitter.com/2yDLhx0Dae— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) April 13, 2025 చదవండి: సమంత 'సిటాడెల్ 2' లేనట్లే.. ప్రకటించిన అమెజాన్ -
సమంత 'సిటాడెల్ 2' లేనట్లే.. ప్రకటించిన అమెజాన్
ఏ మాయ చేశావె సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది సమంత (Samantha Ruth Prabhu). తొలి చిత్రంలో అమాయకంగా కనిపించిన సామ్ తర్వాత యాక్షన్, ఛాలెంజింగ్ రోల్స్ చేసింది. 25 ఏళ్ల కెరీర్లో ఆమె ఎక్కువ కష్టపడ్డది సిటాడెల్ కోసమే! ఓపక్క మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పుడే సిటాడెల్లో యాక్షన్ సిరీస్ పూర్తి చేసింది.ఇండియన్ సిటాడెల్ :హనీ బన్నీలో వరుణ్ ధావన్- సమంతహాలీవుడ్ సిరీస్‌కు ఇండియన్ వర్షన్నిజానికి ఇది ఒరిజినల్ కాదు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటించిన అమెరికన్ వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel)కు ఇది ఇండియన్ వర్షన్‌గా రూపొందింది. ఒరిజినల్ వర్షన్లో హాలీవుడ్ స్టార్ రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా జంటగా నటించారు. న్యూటన్ థామస్- జెస్సికా ద్వయం రూపొందించారు. దీని ఇండియన్ వర్షన్ సిటాడెల్: హనీ బన్నీ (Citadel: Honey Bunny)లో వరుణ్ ధావన్, సమంత లీడ్స్ రోల్లో నటించగా రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇది గతేడాది నవంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది.హాలీవుడ్ సిటాడెల్లో రిచర్డ్ మాడెన్- ప్రియాంక చోప్రాఇకపై లేనట్లేతాజాగా దీనికి సీక్వెల్ నిలిపివేస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. సిటాడెల్ ఇండియన్ వర్షన్‌తో పాటు ఇటాలియన్ వర్షన్ (సిటాడెల్: డయానా) సీక్వెల్స్ ఆపేసి, బదులుగా వీటిని మాతృకలో విలీనం చేయనున్నారు. దీని గురించి అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. సిటాడెల్: హనీ బన్నీ, సిటాడెల్: డయానా సిరీస్‌లను కొనసాగించడం లేదు. దానికి బదులుగా వీటిని మాతృకలో విలీనం చేసి సిటాడెల్ సెకండ్ సీజన్‌ను ముందుకు తీసుకొస్తాం. 2026లో రెండో సీజన్‌ను ముందుకు తీసుకొస్తాం అని పేర్కొన్నారు.చదవండి: ఘనంగా నటి అభినయ పెళ్లి.. ఫోటో చూశారా? -
8 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు మూవీ
తెలుగులో ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కాకపోతే స్టార్ హీరోల మూవీస్ కి ఉన్నంత హైప్ చిన్న చిత్రాలకు ఉండదు. వాటిని సరిగా పట్టించుకోరు. కానీ ఓటీటీలో లేదా యూట్యూబ్ లో వస్తే మాత్రం ప్రేక్షకులు టైమ్ పాస్ కోసం చూస్తుంటారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)ఇప్పుడు అలాంటి ప్రేక్షకుల కోసమా అన్నట్లు ఓ తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది ఆగస్టు చివరలో రిలీజైన 'నేను కీర్తన' అనే మూవీ.. దాదాపు 8 నెలల తర్వాత అంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ప్రైమ్ ఓటీటీలోకి ఇలానే చాలా చిన్న సినిమాలు వస్తున్నాయి.నేను కీర్తన మూవీ విషయానికొస్తే.. ఆపదలో ఉన్నవాళ్లకు సాయపడే కుర్రాడు జానీ. ఇతడి జీవితంలోకి కీర్తన అనే అమ్మాయి వస్తుంది. తర్వాత జానీ లైఫ్ టర్న్ అవుతుంది. తనకు లభించిన ఓ వరాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా, సమాజ ప్రయోజనాలకు జానీ ఏవిధంగా ఉపయోగించాడనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. 'పెరుసు' మూవీ ఓటీటీ రివ్యూ) -
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే థియేటర్లలో రిలీజైన చాలా మూవీస్.. ఆ తర్వాత కనిపించకుండా పోతాయి. చాన్నాళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఓ తెలుగు చిత్రం.. దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)తెలుగమ్మాయి నవీనరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బిఫోర్ మ్యారేజ్'. గతేడాది జనవరి 26న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే చిన్న మూవీ కావడంతో పెద్దగా గుర్తింపు లేకుండానే కనుమరుగైపోయింది. ఇప్పుడు ఈ చిత్రం రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.బిఫోర్ మ్యారేజ్ విషయానికొస్తే.. ధరణి(నవీన రెడ్డి) ఫ్రెండ్స్ తో కలిసి ఓ రూమ్ లో ఉండి చదువుకుంటూ ఉంటుంది. కొత్త అలవాట్లు, ఎంజాయ్ మెంట్ పేరుతో ఊహించని విధంగా ప్రెగ్నెంట్ అవుతుంది. పెళ్లి కాకుండానే తల్లి కావడంతో చాలా ఇబ్బందులు ఎదురువుతాయి. ఈ స్థితిని ఆమె ఎలా అధిగమించింది? తండ్రి ఈమెని అంగీకరించారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?) -
సైఫ్ అలీ ఖాన్ థ్రిల్లర్ మూవీ.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం జ్యువెల్ థీఫ్య ది హెయిస్ట్ బిగిన్స్ అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు కూకీ గులాటి, రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఖరీదైన వజ్రాలను దొంగతనం చేసే వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్ఫిక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ నిర్మించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ బాలీవుడ్ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ దొంగ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో జైదీప్ అహ్లావత్,కునాల్ కపూర్ రాయ్, వికితా దత్తా ప్రధాన పాత్రలు పోషించారు. Danger. Deception. Desire. And a diamond that's worth everything 💎🔥Watch Jewel Thief, out 25 April, only on Netflix.#JewelThiefOnNetflix #SaifAliKhan pic.twitter.com/sg58YnJ8oz— Netflix India (@NetflixIndia) April 14, 2025 -
ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?
మరో వారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి తమన్నా 'ఓదెల 2', కల్యాణ్ రామ్ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. హిందీలో అక్షయ్ కుమార్ 'కేసరి 2' విడుదల కానుంది. ఓటీటీలో మాత్రం 12 మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి.(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ) ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి స్ట్రెయిట్ తెలుగు సినిమాలేం లేవు. కానీ కొన్ని తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలు డిజిటల్ ప్రేక్షకుల్ని అలరించబోతున్నాయి. ఇంతకీ ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలేంటంటే?ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ (ఏప్రిల్ 14-20 వరకు)అమెజాన్ ప్రైమ్కౌఫ్ (హిందీ సిరీస్) - ఏప్రిల్ 18విష్ణుప్రియ (కన్నడ సినిమా) - ఏప్రిల్ 18హాట్ స్టార్ద లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 14ద స్టోలెన్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 16లా అండ్ ఆర్డర్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 18ద వే ఐ సీ ఇట్ (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 18నెట్ ఫ్లిక్స్ది గ్లాస్ డోమ్ (ఇంగ్లీష్ సిరీస్)- ఏప్రిల్ 15ఐ హోస్టేజి (ఇంగ్లీష్ మూవీ)- ఏప్రిల్ 18ఆహామనమే (తెలుగు సినిమా) - ఏప్రిల్ 14జీ5దావీద్ (మలయాళ మూవీ) - ఏప్రిల్ 18లాగౌట్ (హిందీ సినిమా) - ఏప్రిల్ 18టెన్ కోటాజెంటెల్ ఉమెన్ (తమిళ మూవీ) - ఏప్రిల్ 14(ఇదీ చదవండి: తమన్నా ట్రెండీ ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?) -
OTT Movie Review: వీడి జాతకంలో పెళ్లి లేదా?
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ఒరు జాతి జాతకం(Oru Jati Jathakam) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.కల్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కానీ పెళ్లి యోగమే లేని మన కథానాయకుడు తన పెళ్లి కోసం చేసే ప్రయత్నాల హడావిడే ఈ ‘ఒరు జాతి జాతకమ్’ సినిమా. గతంలో ఇదే కథాంశం మీద ఎన్నో సినిమాలు వచ్చి ఉండొచ్చు గాని ఈ సినిమా మాత్రం డిఫరెంట్. ఇంకా చె΄్పాలంటే... ఇదో హైబ్రిడ్ పీస్. మోహనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వినీత్ శ్రీనివాసన్ కథానాయకుడు. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... జయేష్‌కు 30 సంవత్సరాలు వచ్చినా ఏ సంబంధం కుదరదు. పెళ్లి కోసం జయేష్ పరితపిస్తుంటాడు. అంతేనా ఏకంగా మ్యారేజ్ ఏజెన్సీకి లైఫ్ టైమ్ మెంబరై వాళ్లని వేధిస్తుంటాడు. ఈ కోవలోనే శినిత అనే అమ్మాయి సంబంధం తెలుస్తుంది. శినిత తాను పామిస్ట్రీ చదివానని, జయేష్ చేయి చూస్తానని చెబుతుంది. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. జయేష్ చేయి చూసిన శినిత... జయేష్ జీవితంలో అనుకోని సంఘటనలు చాలా జరుగుతాయని, ఓ వ్యక్తి జయేష్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అలాగే జయేష్‌కి వివాహం విచిత్రంగా అయ్యే అవకాశం కనబడుతోందని, అంతేకాదు... ఆ వివాహం వల్ల కొన్ని వర్గాల మధ్య కొట్లాటలు కూడా జరుగుతాయని చెబుతుంది.అయితే జయేష్‌కు తనతో వివాహం చేసుకునే రాత కనిపించలేదని చెప్పి వెళ్లిపోతుంది శినిత. ఈ శినిత క్యారెక్టర్ ఆఖర్లో కడుపుబ్బా నవ్విస్తుంది. ఈలోపు జయేష్‌కు తన కుటుంబం నుండి అనుకోని సమస్యలు చాలానే వచ్చి పడతాయి. మరి... జయేష్‌కు పెళ్లవుతుందా? లేదా అన్నది మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ‘ఒరు జాతి జాతకమ్’ సినిమాలో చూడాలి. ఈ సినిమా మాత్రం ఆద్యంతం కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది. ఇది వేరే లెవెల్ కామెడీ అని చెప్పవచ్చు. దర్శకుడు తన కథానాయకుడు ఎలా నటించాలని అనుకున్నారో అంతకు వేయి రెట్లు వినీత్ వినూత్నంగా నటించారు. ఇట్స్ ఎ మస్ట్ వాచబుల్ కామెడీ ఫిల్మ్. – హరికృష్ణ ఇంటూరు -
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
కొన్ని సినిమాలు చూసినప్పుడు అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఒకవేళ వచ్చిన ఎలా తీసారబ్బా అని మనం అనుకుంటాం. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోనూ రిలీజైన ఓ మూవీ చూస్తే సరిగ్గా ఇదే అనిపిస్తుంది. చెబితే బుతులా ఉంటుంది కానీ చూస్తుంటే తెగ నవ్వొస్తుంది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి)కథేంటి?పరంధామయ్య ఓ పెద్దమనిషి. ఇతడికి స్వామి (సునీల్), దొర (వైభవ్) అని ఇద్దరు కొడుకులు. వీళ్లకు పెళ్లిళ్లు కూడా అయిపోయింటాయి. ఓ రోజు టీవీ చూస్తూ పరంధామయ్య చనిపోతాడు. కాకపోతే ఆయన విషయంలో బయటకు చెప్పుకోలేని ఓ సంఘటన జరుగుతుంది. అలా ఎందుకో జరిగిందో కుటుంబ సభ్యులకు అర్థం కాదు. దీంతో చావు గురించి బయటకు చెప్పలేని పరిస్థితి. మరి కుటుంబ పరువు ప్రతిష్టలు పోకుండా అంత్యక్రియలు ఎలా నిర్వహించారు? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'పెరుసు' అంటే తెలుగులో పెద్దాయన అని అర్థం. ఊరికి పెద్దమనిషిలా ఉండే ఒకతను చనిపోతాడు. కాకపోతే అతడి శరీరంలో జరిగిన చిన్న మార్పు వల్ల కుటుంబానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. దాన్ని కవర్ చేసి ఎలా అంత్యక్రియలు చేశారనేదే స్టోరీ.చెబితే బూతులా అనిపిస్తుంది కానీ ఇలాంటి పాయింట్ తీసుకుని సినిమా తీయడమే షాకింగ్ అంటే.. దాన్ని కామెడీగా చెప్పాలనుకోవడం మరింత పెద్ద షాకిస్తుంది. ఎందుకంటే ఏ మాత్రం తేడా కొట్టినా నవ్వుల పాలైపోవడం గ్యారంటీ. కానీ దర్శకుడు చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు.(ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. ముద్దు ఫోటోలు వైరల్)సినిమా మొదలైన ఐదు నిమిషాలకే కథలో కాన్ ఫ్లిక్ట్ పాయింట్ వస్తుంది. అక్కడి నుంచి తొలి 45 నిమిషాల పాటు శవం చుట్టూ జరిగే కామెడీ తెగ నవ్విస్తుంది. ఆ తర్వాత మాత్రం చాలాచోట్ల సాగతీతగా అనిపిస్తుంది. మళ్లీ చివరకొచ్చేసరికి క్లైమాక్స్ సర్ ప్రైజ్ చేస్తుంది.శవంతో కామెడీ చేయడం ఏంట్రా బాబు అనుకుంటే మాత్రం సినిమా అస్సలు చూడకండి. ఎందుకంటే ప్రతి సీన్ బూతులానే అనిపిస్తుంది. అడల్ట్ కామెడీ సినిమాలంటే ఇష్టముంటేనే దీన్ని చూడండి. లేదంటే మాత్రం ఒంటరిగా చూసేందుకు ప్రయత్నించండి. ఫ్యామిలీతో చూశారా మీరు బుక్ అయిపోతారు.ఎవరెలా చేశారు?పెద్దాయన కొడుకులుగా చేసిన వైభవ్, సునీల్ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ఏ మాత్రం ఎక్కువ చేయకుండా కామెడీ భలే పండించారు. వీరికి తోడు భార్యలుగా నటించిన నిహారిక, చాందిని ఆకట్టుకున్నారు. రెడిన్ కింగ్ స్లీ, వీటీవీ గణేశ్ తదితరులు కూడా నవ్వించారు. మిగిలిన పాత్రధారులు కూడా జీవించేశారనే చెప్పాలి.సినిమా టెక్నికల్ గా భలే తీశారు. ఎందుకంటే రెండు గంటల సినిమాలో దాదాపు సీన్లన్నీ ఒక ఇంటిలో పెద్దాయన శవంతోనే ఉంటాయి. కానీ బోర్ కొట్టిన సందర్భాలు చాలా తక్కువ. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చివరకు డైరెక్షన్ గురించి చెప్పాలి. ఇళంగో రామ్.. బూతులా అనిపించే విషయాన్ని చాలా చాకచక్యంగా తీశాడు. మరి వీకెండ్ ఏదైనా డిఫరెంట్ గా ఉండే కామెడీ సినిమా చూద్దామనుకుంటే 'పెరుసు' ట్రై చేయండి. కాకపోతే ఒంటరిగానే చూడండి.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
నేడు మధ్యాహ్నం ఓటీటీలోకి రానున్న ఫాంటసీ మూవీ
కోలీవుడ్ హీరో జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన చిత్రం 'కింగ్స్టన్' నేడు ఓటీటీలోకి రానుంది. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతనెల 7వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది.భారతదేశపు మొట్టమొదటి సముద్ర ఫాంటసీ చిత్రంగా 'కింగ్స్టన్' గుర్తింపు తెచ్చుకుంది. మంచి విజువల్ ఎక్సిపీరియన్స్ పొందాలని ఉంటే ఈ చిత్రాన్ని చూడొచ్చు. నేడు (ఏప్రిల్ 13) మధ్యాహ్నం 12 గంటలకు కింగ్స్టన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జీ5 వేదికగా తమిళ్, తెలుగు వర్షన్స్లలో ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. కింగ్స్టన్ చిత్రాన్ని జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. ఈ సినిమాలో చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ కీలక పాత్రలు పోషించారు.కింగ్స్టన్ కథేంటి..?కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. ఆ కారణంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్‌తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్స్టన్ సినిమా చూడాల్సిందే. -
'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)
మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త థ్రిల్లర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. చాన్నాళ్లుగా ఈ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అలా 'ప్రావింకుడు షప్పు' పేరుతో ఓ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) కథేంటి?అడవికి సమీపంలో ఓ ఊరు. బాబు (శివజిత్) ఓ కల్లు దుకాణం నడుపుతూ ఉంటాడు. ఓ రోజు రాత్రి వర్షం కురుస్తుండటంతో ఇతడి షాపులో 11 మంది తాగుతూ తెల్లారేవరకు ఉండిపోతారు. ఓ సందర్భంగా బయటకొచ్చి చూస్తే బాబు.. దూలానికి కట్టిన ఉరితాడుకు వేలాడుతుంటాడు. దీంతో దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీస్ అధికారి సంతోష్ (బాసిల్ జోసెఫ్).. ఇది హత్య అని నిర్ధారిస్తాడు. 11 మందిలోనే నిందితుడు ఉన్నాడని అనుమానపడతాడు. చివరకు హత్య చేసినవాడు దొరికాడా? బాబుతో సునీ (చెంబన్ వినోద్), కన్నా (షౌబిన్ సాహిర్)కి గొడవేంటి? అనేదే మిగతా స్టోరీ. ఎలా ఉందంటే?సింపుల్ గా చెప్పుకొంటే.. ఓ మారుమూల గ్రామం, ఓ రాత్రి జరిగిన హత్య, 11 మంది అనుమానితులు.. మరి హంతకుడిని పోలీసులకు పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీ. మలయాళంలో ఇదివరకే ఇలాంటి పాయింట్ తో చాలా సినిమాలు తీశారు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో చెబుతారు. ఈ మూవీ విషయానికి వచ్చేసరికి డార్క్ క్రైమ్ జానర్ ని ఎంచుకున్నారు. కాకపోతే ఓకే ఓకే అనిపించేలా మాత్రమే తీయగలిగారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు) హత్య కేసులో 11 మంది అనుమానితులని విచారించినప్పుడు, వాళ్ల నుంచి ఒక్కో క్లూని లాగుతున్నప్పుడు సీన్స్ థ్రిల్లింగ్ గా అనిపించాలి. కానీ ఇందులో చాలాచోట్ల విసుగు పుడుతుంది. తొలుత కల్లు దుకాణంలో పనిచేసే కన్నాని పోలీసులు అనుమానిస్తారు. తర్వాత కాసేపటి సునీ అనే వ్యక్తిపై సందేహం వస్తుంది. తర్వాత మెరిండా అనే పాత్ర ఎంటరవుతుంది. వీళ్లలో దొంగ ఎవరనేది మూవీ చూసే తెలుసుకోవాలి.కథ పరంగా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ సాంకేతికంగా మాత్రం అలరిస్తుంది. విజువల్స్ తో పాటు నేపథ్య సంగీతం బాగుంది. లొకేషన్స్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తాయి. డైరెక్టర్ ఇంకాస్త శ్రద్ధ పెట్టి సరైన సీన్స్ రాసుకుని ఉంటే మంచి థ్రిల్లర్ అయ్యేది.నటీనటుల విషయానికొస్తే.. విచిత్రంగా ప్రవర్తించే పోలీస్ అధికారి సంతోష్ గా బాసిల్ జోసెఫ్ నటన ఆకట్టుకుంది. కన్నా పాత్రలో సౌబిన్ షాహిర్, సునీ పాత్రలో చెంబన్ వినోద్ చెప్పుకోదగ్గ పాత్రలు. వాటిని సునాయసంగా చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగతా పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.ఓవరాల్ గా చెప్పుకొంటే.. రీసెంట్ టైంలో వచ్చిన మలయాళ థ్రిల్లర్స్ తో పోలిస్తే ఇది తేలిపోయింది. టైమ్ పాస్ కోసం చూద్దామనుకుంటే మాత్రం ఓసారి ట్రై చేయొచ్చు.-చందు డొంకాన(ఇదీ చదవండి: జాన్వీ కపూర్‌కు లంబోర్గిని కారు గిఫ్ట్) -
'ఛావా' టాలీవుడ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తెలుగు వర్షన్ వచ్చేసింది
బాలీవుడ్ హిట్ సినిమా ఛావా తెలుగు వర్షన్ కూడా ఓటీటీలోకి వచ్చింది. విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie) ఫిబ్రవరి 14న హిందీలో రిలీజై బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 750 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. రీసెంట్గా హిందీ వర్షన్ మాత్రమే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం తాజాగా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.ఛావా సినిమాకు బాలీవుడ్లో హిట్ టాక్ రావడంతో.. మార్చి 7న ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ విడుదల చేసింది. అయితే, ఈ చిత్రం విడుదలైన రెండు నెలల తర్వాత ఏప్రిల్ 11న హిందీ వర్షన్ మాత్రమే విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్.. తాజాగా తెలుగు భాషలోకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో టాలీవుడ్ అభిమానులు తమ సంతోషాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుపుతున్నారు. ఈ వీకెండ్లో ఒక యోధుడి కథ గురించి తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఛావా' దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ రాజ్యాన్ని సులభంగా ఆక్రమించుకోవచ్చని భావిస్తాడు మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు(అక్షయ్ ఖన్నా). అతని ఆశకు అడ్డుకట్ట వేస్తూ బరిలోకి దిగుతాడు శివాజీ పుత్రుడు శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్). మొగల్ చక్రవర్తుల కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగాజేబు వరకు చేరుతుంది. దీంతో శంభాజీని అంతం చేసేందుకు తానే రంగంలోకి దిగుతాడు. పెద్ద ఎత్తున సైన్యంతో దక్కన్ ప్రాంతానికి బయలుదేరుతాడు. కేవలం పాతిక వేల మంది సైన్యం మాత్రమే ఉన్న శంభాజీ..ఔరంగాజేబును ఎలా ఎదుర్కొన్నాడు? యుద్ధంలో అతనికి తోడుగా నిలిచిందెవరు? వెన్నుపటు పొడిచిందెవరు? స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ. -
మరో ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం హిట్ సినిమా
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా నటించిన 'క'(KA Movie) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. కిరణ్ అబ్బవరం హీరోగా, నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘క’. సుజీత్–సందీప్ దర్శకత్వంలో చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టి కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది.ఇప్పటికే ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'క' చిత్రం సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. సైకలాజికల్ సస్పెన్స్‌తో మెప్పించిన ఈ చిత్రానికి భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. చూడని వారు ఉంటే అమెజాన్ ప్రైమ్‌లో కూడా ఈ క చిత్రాన్ని చూడొచ్చు.‘క’ కథేంటంటే..ఈ సినిమా కథంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) అనాథ. చిన్నప్పటి నుంచి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. తన వయసుతో పాటు ఈ అలవాటు కూడా పెరుగుతూ వస్తుంది. పోస్ట్ మ్యాన్ అయితే అన్ని ఉత్తరాలు చదువొచ్చు అనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ కోసం రామ్(పెంపుడు కుక్క)తో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ పోస్ట్ మాస్టర్ రామారావు(అచ్చుత్ కుమార్) అనుమతితో పోస్ట్ మ్యాన్ అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ..రామారావు గారి అమ్మాయి సత్యభామ(నయని సారిక)తో ప్రేమలో పడతాడు.అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. వారిని కిడ్నాప్ చేసేదెవరు? కృష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్ అవుతున్నారు? ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసుదేవ్‌కి తెలిసిన నిజమేంటి? వాసుదేవ్ ను ఓ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? లాలా, అబిద్ షేక్ ఎవరు? వారికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? చీకటి గదిలో బంధించిబడిన రాధ( తన్వి రామ్) ఎవరు? ఆమెకు వాసుదేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఎప్పటినుంచంటే?
హారర్ కంటెంట్‌ను ఇష్టపడనివారు ఎవరుంటారు? ఈ మధ్య యాక్షన్, ప్రేమకథా చిత్రాలెక్కువైపోవడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓ కొత్త హారర్ సిరీస్‌ను ఓటీటీ (OTT) ప్రియుల ముందుకు తీసుకొస్తోంది. అదే ఖౌఫ్. ఈ సిరీస్ కథేంటంటే.. ఓ అమ్మాయి స్వేచ్ఛగా బతకాలని పట్టణంలోని ఓ హాస్టల్లోకి అడుగుపెడుతుంది.ఏం జరిగింది?అప్పటికే అక్కడున్నవారు వెంటనే వెళ్లిపోమని సలహా ఇస్తారు. తర్వాత వెళ్లాలనుకున్నా వెళ్లలేవని హెచ్చరిస్తారు. వారి మాటల్ని ఆ అమ్మాయి లెక్క చేయదు. ఇంతకీ తన గదిలో ఏముంది? ఆ హాస్టల్ నుంచి అమ్మాయిలు ఎందుకు బయటపడలేకపోతున్నారు? చివరకు ఏం జరిగింది? వంటి అంశాలు తెలియాలంటే ఖౌఫ్ (Khauf Web Series) చూడాల్సిందే!ఓటీటీలో ఎప్పుడంటే?మోనిక పన్వర్, రజత్ కపూర్, గీతాంజలి కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించిన ఖౌఫ్ సిరీస్‌ను పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ డైరెక్ట్ చేశారు. మ్యాచ్బాక్స్ షార్ట్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సిరీస్ ఏప్రిల్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఖౌఫ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో హాస్టల్ గదిలోని అమ్మాయిలు భయంతో వణికిపోతున్నట్లుగా చూపించారు. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోవాలనుకున్న వారి కంఠం తెగడాన్ని చూపించారు. హారర్ కథల్ని ఇష్టపడేవారు వచ్చే శుక్రవారం ప్రైమ్‌లో ఖౌఫ్ చూసేయండి.. చదవండి: సర్కస్ చూస్తున్నట్లే ఉంది.. ధోని తీరుపై హీరో అసహనం -
మిస్టర్ హౌస్‌కీపింగ్ రివ్యూ.. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం మిస్టర్ హౌస్ కీపింగ్(Mr. Housekeeping) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సౌత్ సినిమాలకు ఓ రకమైన నేటివిటీ ఉంటుంది. ఆ చిత్రాలు భారతదేశంలోని ఏ భాషలో అనువాదమైనా ప్రేక్షకులు మన కథలు అనుకొని ఆదరిస్తారు. చిన్న లైన్ తీసుకుని ఆ లైన్‌కు రసవత్తరమైన స్క్రీన్‌ప్లే జోడించి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు సౌత్ దర్శకులు. అందులో తమిళ దర్శకులు కూడా ఉన్నారు. ఆ కోవలోనే తమిళ దర్శకుడైన అరుణ్ రవిచంద్రన్ ఓ రొటీన్ లవ్ స్టోరీలా తలపించే చిన్న లైన్ తీసుకుని, దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో చక్కటి మెసేజ్‌ని ఇస్తూ, అద్భుతమైన కామెడీ అనే మసాలాని జోడించి ‘మిస్టర్ హౌస్ కీపింగ్’ అనే మెగా థాళి లాంటి సినిమా భోజనాన్ని ప్రేక్షకుడి ముందు వడ్డించారు.ఇంకేముందీ... ప్రేక్షకులు లొట్టలేసుకొని మరీ ఆస్వాదిస్తున్నారు ఈ సినిమాని. మరి... అంతలా ఏముంది ఈ సినిమాలో ఓసారి చూద్దాం. హానెస్ట్ రాజ్ కాలేజ్ రోజుల నుంచి ఇసాయ్తో ప్రేమలో ఉంటాడు. కానీ ఇసాయ్ మాత్రం రాజ్‌ను ప్రేమించదు... సరి కదా హానెస్ట్ రాజ్ చేసే పనులతో విసిగి వేసారి పోయి ఉంటుంది. హానెస్ట్ రాజ్ మరీ బద్ధకస్తుడు. ఎంతలా అంటే తిన్నాక హోటల్లో సర్వ్ చేసినట్లు ఇంట్లో కూడా చేతులు కడుక్కోవడానికి ఫింగర్ బౌల్‌ని కోరుకుంటాడు. హానెస్ట్ రాజ్ అమ్మకు కొడుకు అంటే బాగా గారాబం. తండ్రి మాత్రం రోజూ రాజ్ మీద చిటపటలాడుతుంటాడు.ఓ రోజు అనుకోకుండా తన తండ్రి ఫోన్ ద్వారా ఓ బ్లాక్ మెయిలింగ్ గ్యాంగ్‌కి కనెక్ట్ అవుతాడు రాజ్. వాళ్లకి 5000 రూపాయలు ఇవ్వవలసి వస్తే తెలియకుండానే హౌస్ కీపింగ్ టీమ్‌లో చేరతాడు. అనుకోకుండా హానెస్ట్ రాజ్ తాను కాలేజీలో ప్రేమించిన ఇసాయ్ వాళ్లింటికే హౌస్ కీపింగ్‌కి వెళతాడు. ఇసాయ్ ఇల్లు అని రాజ్‌కి తెలిసి నాలుక్కరుచుకుని ఇసాయ్ని బ్రతిమలాడి పనికి కుదురుతాడు. ఇసాయ్కి తన కొలీగ్ హరీష్ నచ్చి, పెళ్లి కుదుర్చుకుంటుంది. కానీ ఇసాయ్ ఇంట్లో పని చేస్తున్న రాజ్ మాత్రం ఇసాయ్ తనను ప్రేమిస్తుందని అనుకుంటాడు. మరి... పనివాడిగా వచ్చిన రాజ్... ఇసాయ్ మనసు గెలుచుకుంటాడా? హరీష్‌తో పెళ్లి కుదిరిన ఇసాయ్... రాజ్ ప్రేమను అంగీకరిస్తుందా? అన్నది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ‘మిస్టర్ హౌస్ కీపింగ్’లో చూడాల్సిందే. నేటి తరం చూడాల్సిన సినిమా ఇది. అలాగే లివింగ్ టు గెదర్ అనే ట్రెండ్‌ను విడమర్చి సినిమా భాషలో అర్థం చెప్పిన దర్శకుడికి హ్యాట్సాఫ్. ఉద్యోగస్తులు తమ తల్లి, తండ్రులతో కలిసి చూసి, చాలా తెలుసుకోవాల్సిన సినిమా ఇది. వాచ్ దిస్ విత్ యువర్ ఫ్యామిలీ.– హరికృష్ణ ఇంటూరు -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలోకి వచ్చిన 'జాక్' టాక్ బాగోలేదు. మరోవైపు యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' టాక్ ఏంటో తెలియాల్సి ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 21 సినిమాలు-సిరీస్ లు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి. వీటిలో క్రేజీ మూవీస్ ఉండటం విశేషం.(ఇదీ చదవండి: కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్.. వీడియో వైరల్)ఓటీటీలోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే కోర్ట్, ఛావా, పేరసు, ప్రావిన్ కుడు షప్పు, షణ్ముఖ, రాచరికం.. ఇలా చూడదగ్గ తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి. ఇంతకీ ఏయే సినిమాలు ఏయే ఓటీటీల్లోకి వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాల జాబితా (ఏప్రిల్ 11)నెట్ ఫ్లిక్స్కోర్ట్ - తెలుగు సినిమాఛావా - తెలుగు డబ్బింగ్ మూవీపేరసు - తెలుగు డబ్బింగ్ సినిమామీట్ ద కుమలోస్ - ఇంగ్లీష్ సినిమాద గార్డెనర్ - స్పానిష్ సిరీస్ఛేజింగ్ ద విండ్ - ఇంగ్లీష్ సినిమాఅమెజాన్ ప్రైమ్ఛోరీ 2 - హిందీ మూవీబ్యాడ్ బాయ్స్ - మలయాళ సినిమావిష్ణుప్రియ - కన్నడ మూవీఆహాషణ్ముఖ - తెలుగు మూవీజీ5కింగ స్టన్ - తెలుగు డబ్బింగ్ సినిమా (ఏప్రిల్ 13)హాట్ స్టార్హ్యాక్స్ సీజన్ 4 - ఇంగ్లీష్ సిరీస్పెట్స్ - ఇంగ్లీష్ మూవీరెస్క్యూ హై సర్ఫ్ - ఇంగ్లీష్ సిరీస్స్వీట్ హార్ట్ - తమిళ సినిమాద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6 - తెలుగు డబ్బింగ్ సిరీస్డాక్టర్ హూ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (ఏప్రిల్ 12)సోనీ లివ్ప్రావిన్ కుడు షప్పు - తెలుగు డబ్బింగ్ సినిమాసన్ నెక్స్ట్రాక్షస - తెలుగు డబ్బింగ్ మూవీలయన్స్ గేట్ ప్లేరాచరికం - తెలుగు మూవీమనోరమ మ్యాక్స్ పైనకిళి - మలయాళ సినిమా(ఇదీ చదవండి: విడాకులు.. అయినా తనను వదలను: ప్రభుదేవా మాజీ భార్య) -
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
కోర్టు- నెట్ఫ్లిక్స్హీరో నాని(Nani) నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'కోర్ట్–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ'(Court - State Vs. A Nobodycourt). భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఈరోజు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించగా.. ఇందులో శివాజీ అద్భుతమైన నటనతో మెప్పించారు. సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలకంగా నటించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. బక్సాఫీస్ వద్ద రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన కోర్టు చిత్రం నేడు ఏప్రిల్ 11న 'నెట్‌ఫ్లిక్స్'(Netflix)లోకి వచ్చేసింది.ఛావా- నెట్‌ఫ్లిక్స్ (హిందీ)బాలీవుడ్ హిట్ సినిమా 'ఛావా' ఓటీటీలోకి వచ్చేసింది. విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 750 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన విషయం తెలిసిందే. సుమారు రెండు నెలల తర్వాత నేడు ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, కేవలం హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ చేసి చివర్లో మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. మరో వారంలోపు తెలుగులో కూడా విడుదల కావచ్చని తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కాస్త నిరాశ చెందుతున్నారు.షణ్ముఖ- ఆహాటాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం 'షణ్ముఖ' ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 21న విడుదలైన ఈ చిత్రాన్ని షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్గా కనిపించింది. డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. అయతే, రవి బస్రూర్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. నేడు ఏప్రిల్ 11న ఆహా(Aha) తెలుగులో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.మనమే- ఆహాశర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం మనమే (Manamey Movie) మరో ఓటీటీలోకి వచ్చేసింది. రాజ్ కందుకూరి, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా టాక్ బాగున్నప్పటికీ థియేటర్లలో లాంగ్ రన్ సాధించలేకపోయింది. ఈ మూవీ ఈ ఏడాది మార్చి మొదటివారంలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే, నేడు ఏప్రిల్11న 'ఆహా'(Aha)లో కూడా విడుదలైంది. -
ఓటీటీలో అసురుడిని ఎదురించిన ధీరుడి కథ సడెన్ ఎంట్రీ
టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన తాజా చిత్రం 'షణ్ముఖ' ఓటీటీ ప్రకటన వచ్చేసింది. మార్చి 21న విడుదలైన ఈ చిత్రాన్ని షణ్ముగం సప్పని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్గా కనిపించింది. డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. సాప్‌బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్లో తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. అయతే, రవి బస్రూర్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు.ఒక అసురుడిని ఎదురించిన ధీరుడి కథ అనే కాన్సెప్ట్‌తో 'షణ్ముఖ' చిత్రం విడుదలైంది. ఇప్పుడు ఆహా తెలుగు ఓటీటీ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. 'ఏప్రిల్ 11'న విడుదల కానుందని ఆ సంస్థ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. . ఈ చిత్రంలో ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు. ఈ మూవీలో ఆది సరసన ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్( Avika Gor) గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది.షణ్ముఖ కథేంటంటే..చిరాగ్ జానీ(విగాండ) దంపతులకు ఓ విచిత్రమైన రూపంలో కుమారుడు జన్మిస్తాడు. అతన్ని అలా చూసిన తండ్రి కొడుకు రూపాన్ని మార్చాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్లి క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత తిరిగొచ్చిన అతను తన కుమారుడి సాధారణ రూపం కోసం బామ్మర్ది సాయంతో తాంత్రిక పూజలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఎస్సైగా పనిచేస్తున్న కార్తీ వల్లభన్(ఆది సాయికుమార్) ఓ డ్రగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతాడు. వారం రోజుల్లోనే తన తప్పును సరిదిద్దుకోవాలని కార్తీని కమిషనర్ ఆదేశిస్తాడు. ఆ తర్వాత బెంగళూరులో జర్నలిజం చేస్తున్న సారా మహేశ్(అవికా గోర్) తన ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్‌కు వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఎస్సై కార్తీ వల్లభన్ సాయం కోరుతుంది. ఆ సమయంలోనే సారా తన రీసెర్చ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని కార్తీకి చెబుతుంది. అసలు ఆమె చేస్తున్న రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏంటి? ఆరేళ్లుగా చేస్తున్న ఆ పరిశోధనలో కనిపెట్టిన అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్లకు ఏంటి సంబంధం? దీని వెనక ఏదైనా హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా ఉందా? అసలు సారాను చంపాలనుకున్నది ఎవరు? చివరికీ ఈ ఇన్‌స్టిగేషన్ ప్రాజెక్ట్‌లో కార్తీ, సారా సక్సెస్ అయ్యారా? లేదా? అన్నదే అసలు స్టోరీ.A cop, a scholar, and an ancient mystery!Dive into the forgotten tales, hidden treasures, and secrets buried deep in the forest.#Shanmukha Premieres from April 11 only on #aha #AadiSaikumar #Avikagor #Shanmukha pic.twitter.com/YvnuUBU6P3— ahavideoin (@ahavideoIN) April 10, 2025 -
10 నెలల తర్వాత మరో ఓటీటీలో తెలుగు సినిమా
శర్వానంద్, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం మనమే (Manamey Movie). రాజ్ కందుకూరి, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ బాగున్నప్పటికీ థియేటర్లలో లాంగ్ రన్ సాధించలేకపోయింది. ఈ మూవీ ఈ ఏడాది మార్చి మొదటివారంలో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది.తాజాగా మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆహాలో రేపటి (ఏప్రిల్ 11) నుంచే స్ట్రీమ్ అవనుంది. ఈ విషయాన్ని ఆహా ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది. మనమే చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్సే స్టూడియోస్ ప్రొడక్షన్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందించాడు. What happens when charm meets chaos? Manamey happens! Streaming April 11 on #aha @ImSharwanand @IamKrithiShetty pic.twitter.com/juzYGUYxW5— ahavideoin (@ahavideoIN) April 10, 2025చదవండి: బిగ్ ప్లాన్‌తో రవితేజ కూతురు 'మోక్షద' .. ఎంట్రీకి లైన్ క్లియర్ -
ఓటీటీలో 'ఛావా' సినిమా.. సడెన్ సర్ప్రైజ్
బాలీవుడ్ హిట్ సినిమా 'ఛావా' ఓటీటీ ప్రకటన సడెన్‌గా వచ్చేసింది. విక్కీ కౌశల్,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie) ఫిబ్రవరి 14న హిందీలో రిలీజై భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే, సినిమాకు మంచి ఆదరణ రావడంతో మూడు వారాల తర్వాత నిన్న (మార్చి 7) ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది. సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదలపై మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఛావా' చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) 'ఏప్రిల్ 11'న విడుదల కానుందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, హిందీ, తెలుగు రెండు భాషలలో విడుదల చేస్తారా లేదా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తారా..? అనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ, రెండు భాషలలో ఒకేసారి స్ట్రీమింగ్ కావచ్చని సమాచారం. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.750 కోట్లు రాబట్టి అనేక రికార్డ్స్‌ను క్రియేట్ చేసిన ఛావా కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ రాజ్యాన్ని సులభంగా ఆక్రమించుకోవచ్చని భావిస్తాడు మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు(అక్షయ్ ఖన్నా). అతని ఆశకు అడ్డుకట్ట వేస్తూ బరిలోకి దిగుతాడు శివాజీ పుత్రుడు శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్). మొగల్ చక్రవర్తుల కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగాజేబు వరకు చేరుతుంది. దీంతో శంభాజీని అంతం చేసేందుకు తానే రంగంలోకి దిగుతాడు. పెద్ద ఎత్తున సైన్యంతో దక్కన్ ప్రాంతానికి బయలుదేరుతాడు. కేవలం పాతిక వేల మంది సైన్యం మాత్రమే ఉన్న శంభాజీ..ఔరంగాజేబును ఎలా ఎదుర్కొన్నాడు? యుద్ధంలో అతనికి తోడుగా నిలిచిందెవరు? వెన్నుపటు పొడిచిందెవరు? స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ. Aale Raje aale 👑 Witness a tale of courage and glory etched in time 🔥⚔️Watch Chhaava, out 11 April on Netflix. #ChhaavaOnNetflix pic.twitter.com/6BJIomdfzd— Netflix India (@NetflixIndia) April 10, 2025 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ సినిమా
ఆర్జీవీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న అప్సర రాణి.. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రాచరికం'. జనవరిలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.(ఇదీ చదవండి: తమన్నా 'ఓదెల 2' ట్రైలర్ రిలీజ్)రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథతో తీసిన పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు సినిమా 'రాచరికం'. అప్సర రాణి, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కంటెంట్ లో లోటుపాట్లు వల్ల థియేటర్లలోకి వచ్చి వెళ్లిన సంగతి కూడా చాలామందికి తెలియదు. అలాంటిది ఏప్రిల్ 11 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలోకి రానుందని ప్రకటించారు.'రాచరికం' విషయానికొస్తే.. రాచకొండ అనే ఊరిని రాజారెడ్డి ఏకగ్రీవంగా పరిపాలిస్తుంటాడు. ఈయనకు కొడుకు వివేక్ రెడ్డి (వరుణ్ సందేశ్), కూతురు భార్గవి రెడ్డి (అప్సర రాణి) ఉంటాయి. కొన్ని అనుకోని పరిస్థితుల్లో అన్నచెల్లి ప్రత్యర్థులుగా మారతారు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్)Fierce. Fearless. Unforgettable.#BhargaviReddy in #Racharikam – streaming on #LionsgatePlay from April 11th. pic.twitter.com/khuFn2VWss— Lionsgate Play (@lionsgateplayIN) April 8, 2025 -
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'అషు రెడ్డి' రొమాంటిక్ మూవీ
యంగ్ ట్యాలెంటెడ్ ప్రవీణ్ రాజ్ కుమార్ ,‘బిగ్‌బాస్’ ఫేం అషు రెడ్డి(Ashu Reddy) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘పద్మ వ్యూహంలో చక్రధారి’(PadmaVyuham Lo Chakradhari). విడుదలైన ఏడాది తర్వాత సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వం వహించిన ఈ వ్యూర్ లవ్ ఎమోషనల్ డ్రామా చిత్రానికి కె.ఓ.రామరాజు నిర్మాతగా వ్యవహరించారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమాలో శశికా టిక్కూ మధునందన్, మహేష్ విట్టా, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు.'పద్మవ్యూహంలో చక్రధారి' సినిమా గతేడాది జూన్‌లో థియేటర్స్‌లోకి వచ్చింది. అయితే, ఇప్పుడు సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్కు వచ్చేసింది. అషు రెడ్డి వల్ల సినిమాకు బాగా ప్రమోషన్స్ దొరికినప్పటికీ ఆశించినంతగా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేదు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగానే ఉన్నప్పటికీ కథ మొత్తం పాత చింతకాయ పచ్చడిలానే చూపించారు. అషురెడ్డి తను గ్లామర్‌తో కట్టిపడేసిందని చెప్పవచ్చు. అలాగే హీరోయిన్ శశికా టిక్కూ అద్భుతంగా నటించడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో అలరించింది.అసలు కథేంటంటే..రాయలసీమలోని ఓ గ్రామంలో జరిగే కథే పద్మవ్యూహంలో చక్రధారి. ఆ గ్రామానికి చెందిన చక్రీ(ప్రవీణ్ రాజ్‌కుమార్) సిటీలో ఐటీలో జాబ్ చేసుకుంటూ స్నేహితులతో ఉంటాడు. అదే సమయంలో హీరో ఊరినుంచి సత్య(శశికా టిక్కూ) జాబ్ కోసం హైదరాబాద్ వస్తుంది. చక్రీ, సత్యకు జాబ్ రావడంలో హెల్ప్ చేస్తాడు. దాంతో ఇద్దరు మంచి స్నేహితులవుతారు. ఆ తరువాత ప్రేమికులుగా మారుతారు. అదే సమయంలో అనుకోకుండా సత్య జాబ్ వదిలేసి ఊరికి వెళ్లిపోతుంది. విషయం తెలుసుకున్న చక్రీ తన ఉద్యోగానికి లీవ్ పెట్టి తాను కూడా విలేజ్‌కి వెళ్తాడు. హీరో స్నేహితుడు శ్రీను(మహేష్ విట్టా) ఊరిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. అతని సాయంతో సత్యను కలవాలని ప్లాన్ చేస్తాడు. అదే విలేజ్‌లో స్కూల్ టీచర్‌గా పద్మ(అషురెడ్డి) పనిచేస్తుంది. తన భర్త కోటి(భూపాల్ రాజ్) ఓ తాగుబోతు. బ్యాంక్ మేనేజర్ ప్రసాద్(మధునందన్) కూడా గతంలో జరిగిన సంఘటనలకు ఆ ఊరి వారంటే ద్వేషం పెంచుకుంటాడు. అతను తాగుబోతుగా మారతాడు. అసలు తన ప్రేమ కోసం వచ్చిన చక్రీ.. సత్యను దక్కించుకున్నాడా ? పద్మ (అషురెడ్డి)తాగుబోతు అయిన కోటిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది.? అసలు బ్యాంక్ మేనేజర్ గతం ఏంటి? సత్యను పెళ్లి చేసుకోవాలంటే వాళ్ల నాన్న హీరోకు పెట్టిన కండీషన్స్ ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
టైమ్ లూప్ స్టోరీకి హారర్‌ను మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో 'రాక్షస' (Rakshasa) సినిమాలో చూడొచ్చు. ఈ ఏడాది మార్చి 7న కన్నడలో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు కన్నడ, తెలుగు వర్షన్స్‌లో ఓటీటీలో రిలీజ్ కానుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కన్నడ నటుడు ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా దర్శకుడు లోహిత్ హెచ్ ఈ మూవీని తెరకెక్కించారు. టైమ్‌లూప్ కాన్సెప్టుతో వచ్చిన తొలి కన్నడ సినిమా ఇదే కావడం విశేషం. 'రాక్షస' (Rakshasa) సినిమా ‘సన్‌నెక్ట్స్’ (Sun NXT)లో ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం కన్నడ, తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ఆ సంస్థ సోషల్ మీడియా ద్వరా ప్రకటించింది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. -
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళ సినిమాలు అనగానే సింపుల్ స్టోరీలే గుర్తొస్తాయి. కానీ ఈ మధ్య వీళ్లు కూడా రూట్ మార్చి యాక్షన్ మూవీస్ తీస్తున్నారు. గతేడాది చివర్లో మార్కో, రీసెంట్ టైంలో ఎల్ 2 ఎంపురాన్ చిత్రాలు ఈ కోవకే చెందినవే. ఈ తరహా కథతో తీసిన మరో మలయాళ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'దావీద్'(Daveed Movie). ఓ ఫెయిల్యర్ బాక్సర్ నేపథ్యంగా తీసిన ఈ మూవీకి మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కాగా.. దాదాపు రెండు నెలల తర్వాత అంటే ఏప్రిల్ 11 నుంచి ఓటీటీలోకి (Ott Movie) వచ్చేస్తోంది. ఈమేరకు జీ5 సంస్థ అధికారికంగా ప్రకటించింది. (ఇదీ చదవండి: విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా)దావీద్ విషయానికొస్తే.. భార్య సంపాదనపై బతికే అబు (ఆంటోనీ వర్గీస్).. కూతురితో రోజూ కాలక్షేపం చేస్తూ బతికేస్తుంటాడు. అప్పుడప్పుడు బౌన్సర్ గా పనిచేస్తుంటాడు. ఓరోజు అలానే బాక్సింగ్ ఈవెంట్ కి వెళ్తే.. అబుని ఓ బాక్సర్ ఒక్క పంచ్ గుద్దుతాడు. పోటీకి రమ్మని సవాలు విసురుతాడు. దీంతో అబు.. బాక్సర్ ట్రైనింగ్ తీసుకుంటాడు. తర్వాత ఏమైందనేదే స్టోరీ.ప్రస్తుతానికి మలయాళంలో మాత్రం స్ట్రీమింగ్ ఉండొచ్చని ప్రకటించారు. కానీ రీసెంట్ టైంలో రిలీజైన పలు చిత్రాల తెలుగు వెర్షన్ కూడా హడావుడి లేకుండా తీసుకొచ్చేస్తున్నారు. దావీద్ కూడా తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా) -
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా
తెలుగులో ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే వీటిలో ఓటీటీలోకి మాత్రం కొన్నే వస్తుంటాయి. కొన్ని చిత్రాలు మాత్రం నెలలు లేదా సంవత్సరాల తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఓ తెలుగు ఆంథాలజీ మూవీ.. దాదాపు 15 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.సాయికుమార్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన 'మూడో కన్ను' సినిమా గతేడాది జనవరి 26న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే అప్పుడు హనుమాన్ చిత్రం హవా వల్ల ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. దాదాపు ఏడాది మూడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. ప్రస్తుతం రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల)'మూడో కన్ను' విషయానికొస్తే.. తొలి కథలో ఓ అందమైన కుటుంబం ఉంటుంది. వీళ్ల పెంపుడు కుక్క ఓ రోజు చనిపోతుంది. ఏమైంది అనుకునేలోపు హీరో తల్లి మరణిస్తుంది. రెండో కథలో మనిషి తయారు చేసిన కృత్రిమ మాంసం కోసం జరిగిన ఫైట్ ఫార్ములా ఎవరిది? ఎవరు దొంగిలించారనేది స్టోరీ.మూడో కథలో ఓ నేరస్తుడిని పట్టుకునేందుకు పిల్లాడిని ఉపయోగిస్తారు. ఇంతకీ ఇది ఎవరు చేయించారనేది స్టోరీ. ఈ మూడింటికి సంబంధించిన లింక్, సస్సెన్సే నాలుగో కథ. వీటన్నింటిని అమెరికాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించడం విశేషం.(ఇదీ చదవండి: 'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్) -
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్, ఓటీటీలలో పెద్దగా సినిమాల సందడి కనిపించలేదు. మార్చి చివరన వచ్చిన సినిమాలతోనే అభిమానులు ఎంజాయ్ చేశారు. అయితే, ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద కాస్త సందడి వాతావరణం కనిపించనుంది. రేసులో సిద్ధు నటించిన జాక్, అజిత్, త్రిష నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీతో పాటు సన్నీ డియోల్- దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా 'జాట్' ఉంది. ఇదే క్రమంలో ఓటీటీ నుంచి కూడా కాస్త పర్వాలేదనే సినిమాలే ఉన్నాయి.థియేటర్స్‌లోకి వచ్చే సినిమాలు🎥 జాక్- ఏప్రిల్ 10🎥 గుడ్ బ్యాడ్ అగ్లీ -ఏప్రిల్ 10🎥 జాట్- ఏప్రిల్ 10🎥 బజూక- ఏప్రిల్ 10🎥 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి- ఏప్రిల్ 11🎥 కౌసల్య తనయ రాఘవ- ఏప్రిల్ 11ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు/ వెబ్సిరీస్లునెట్ఫ్లిక్స్🎥 కోర్టు- ఏప్రిల్ 11🎥 పెరుసు (తెలుగు/ తమిళ్)- ఏప్రిల్ 11🎥 బ్లాక్ మిర్రర్ 7 (వెబ్‌సిరీస్/ఇంగ్లిష్)- ఏప్రిల్ 10 🎥 కిల్ టోనీ (వెబ్‌సిరీస్/ఇంగ్లిష్)- ఏప్రిల్ 7అమెజాన్ ప్రైమ్ వీడియో🎥 ఛోరీ 2 (హిందీ)- ఏప్రిల్ 11🎥 ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ ( ఇంగ్లీష్) - ఏప్రిల్ 8 🎥 జీ20 (ఇంగ్లీష్)- ఏప్రిల్ 10జియో హాట్‌స్టార్🎥 ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6 (యానిమేషన్ సిరీస్/హిందీ)- ఏప్రిల్ 11🎥 ది లాస్ట్ ఆఫ్ అజ్ (హిందీ/ తెలుగు/ ఇంగ్లీష్)- ఏసోనీలివ్🎥 ప్రావింకూడు షాపు (తెలుగు/ మలయాళం)- ఏప్రిల్ 11 జీ5🎥 కింగ్స్‌స్టన్ (తమిళ్/తెలుగు)- ఏప్రిల్ 13 -
ఓటీటీలో కోర్ట్ సినిమా.. అఫీషియల్ ప్రకటన
హీరో నాని(Nani) నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'కోర్ట్–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ'(Court - State Vs. A Nobodycourt). ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రలలో మెప్పించగా.. ఇందులో శివాజీ అద్భుతమైన నటనతో మెప్పించారు. సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు కీలకంగా నటించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడాలని విమర్శకులు సైతం కామెంట్ చేయడం విశేషం. సెన్సిటివ్ పోలీస్ కేసు విషయంలో మన చట్టాలు ఎలా ఉంటాయో ఈ చిత్రం చెబుతుందని వారు తెలిపారు.'కోర్టు' సినిమా 'ఏప్రిల్ 11'న విడుదల కానుందని 'నెట్‌ఫ్లిక్స్'(Netflix) అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే తమ ఓటీటీ కమింగ్‌సూన్ బ్లాక్‌లో ఈ సినిమాను చేర్చారు. అందులోనే స్ట్రీమింగ్ వివరాలను ప్రకటించారు. తెలుగతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. కేవలం రూ. 10 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్‌కు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆపై సుమారు రూ. 8 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో హీరో నానికి మంచిపేరు రావడమే కాకుండా భారీ లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిలి.. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు(రోషన్)తో ప్రేమలో పడుతుంది.ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్ లాయర్ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్’ సినిమా చూడాల్సిందే. -
గ్రీకు వీరుడు రెండో రూపంలో...
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం గ్లాడియేటర్ 2 ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది గ్రీకు సంస్కృతి. ఎన్నో వైవిధ్యమైన పోరాటాలకు, వీరోచితంగా పోరాడిన వీరుల కథలతో రోమ్ రాచరికపు చరిత్ర నిండి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని భాషలలో గ్రీకు కథలకు సంబంధించి ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ 25 ఏళ్ల క్రితం హాలీవుడ్లో వచ్చిన ‘గ్లాడియేటర్’ సినిమా మాత్రం ప్రపంచ సినీ ప్రేక్షకులకు చాలా ప్రత్యేకం. అప్పట్లో 110 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ సినిమా 465 మిలియన్ డాలర్ల వరకు రాబట్టిందంటేనే తెలుస్తుంది ఈ సినిమా శక్తి ఏంటో. ప్రముఖ హాలీవుడ్ హీరో రస్సెల్ క్రోవ్ నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘గ్లాడియేటర్ 2’ రిలీజైంది. నాటి ‘గ్లాడియేటర్’తో పోలిస్తే అంత పెద్ద హిట్ కాకపోయినా నేటి టెక్నాలజీతో సినిమా ఆద్యంతం మంచి విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. పాల్ మెస్కల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు నాటి ‘గ్లాడియేటర్’ దర్శకుడైన రిడీ స్కాటే దర్శకత్వం వహించారు. ఇక కథాపరంగా ‘గ్లాడియేటర్ 2’లో ఏముందంటే హీరో అయిన హన్నో భార్య అరిషత్ను చంపి, హన్నోను రోమన్ జనరల్ అకాసియస్ బానిసగా తీసుకెళతాడు.హన్నో కొలోసియంలో గ్లాడియేటర్‌గా పోరాడుతూ ఉండగా తన తల్లి ఆ రాజ్యపు పట్టపు రాణి అయిన లూసిల్లా అని, తాను మాక్సిమస్ వారసుడని తెలుసుకుంటాడు. మాక్సిమస్ కుట్రతో లూసిల్లాను కొలోసియంలో ఉరి తీయాలనుకుంటాడు. బానిసగా వచ్చిన హన్నో తన తల్లిని కాపాడుకుంటాడా? అలాగే తనను బానిసగా తెచ్చిన అకానియస్... హన్నోకి అండగా ఉంటాడా? అనేది మాత్రం ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘గ్లాడియేటర్ 2’లోనే చూడాలి. మొదటి గ్లాడియేటర్ కన్నా ఈ గ్లాడియేటర్లో ఎక్కువ పోరాట సన్నివేశాలతో పాటు గ్రీకు సంస్కృతి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా కథలో జొప్పించారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఉంది కాబట్టి నాటి రోమ్ కథను హాయిగా మన భాషలో చూసేయొచ్చు. అయితే పిల్లలతో కాకుండా పెద్దవాళ్లు మాత్రం చూడదగ్గ మంచి అడ్వెంచరెస్ ఫిల్మ్. – హరికృష్ణ ఇంటూరు -
జాబిలమ్మ నీకు అంత కోపమా.. సినిమా రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రా జెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘నిలవక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ (Nilavuku En Mel Ennadi Kobam) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా అనేది 24 కళలతో రూపొందేది. అంటే 24 కళలకు సంబంధించిన కళాకారులు ఓ సినిమా కోసం పని చేస్తారన్నమాట. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మల్టీ టాలెంటెడ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. 24 కళలలో ఓ మూడు నాలుగు కళలు ఒక్కరే చేసేస్తున్నారు. అలా సినిమాలోని కొన్ని శాఖలను ఒక్కరే చేసి, ఓ సినిమాకి సింగిల్ కార్డుతో 80వ దశకంలోనే ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావుగారు శ్రీకారం చూట్టారు. ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ కొనసాగుతోంది.‘నిలవక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ అనేది ఓ తమిళ సినిమా. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అన్నది తెలుగు డబ్బింగ్ వెర్షన్. ప్రముఖ హీరో ధనుష్ తాను కీలక విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తాను రాసిన కథకు తానే నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దర్శకత్వం కూడా చేశారు. ఇది ఓ రకంగా రిస్క్ అనే చెప్పాలి. అయినా ఈ సినిమాని మాత్రం ఈ తరం యంగ్ జనరేషన్‌తో పాటు నిన్న, మొన్నటి తరాలకు కూడా నచ్చే విధంగా తీర్చిదిద్దారు ధనుష్. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులను కదలనివ్వదు. అంత ప్లెజెంట్‌గా ఉంటుంది.సినిమా టైటిల్ కూడా కొంటెగా పెట్టడంలోనే తెలిసిపోతుందీ సినిమా విషయం. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రైమ్ వీడియోలో లభ్యమవుతోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... ప్రభు ఓ మంచి చెఫ్. తన గర్ల్‌ఫ్రెండ్ నిలాతో విడిపోయిన తరువాత ప్రభు తల్లిదండ్రులు ప్రీతితో వివాహం నిశ్చయించి, సంబంధం కుదుర్చుకోవడానికి ప్రీతి ఇంటికి వస్తారు. ఆ సమయంలో ప్రీతికి నిలా కథ చెబుతాడు. నిలా, ప్రభు ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన పార్టీలో కలిసి ప్రేమలో పడతారు. ఓ అనుకోని సంఘటన వల్ల నిలాకి దూరమవుతాడు ప్రభు. దాంతో నిలాకి కోపమొచ్చి తండ్రి చూసిన సంబంధానికి తలూపుతుంది. నిలా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని స్నేహితులందరినీ గోవాకి పిలుస్తుంది. నిలా పెళ్లి ఆహ్వానం ప్రభుకి కూడా అందుతుంది. ప్రభు ఫ్రెండ్స్ అందరూ అతన్ని వారించినా నిలా పెళ్లికి వెళతాడు. తన మాజీ ప్రేయసి పెళ్లికి వెళ్లిన ప్రభుకి అక్కడ ఎదురైన పరిస్థితులేంటి? తరువాత ప్రీతి పరిస్థితి ఏంటి? అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. ఇది చాలా సింపుల్ స్టోరీ. స్క్రీన్ ప్లే చక్కగా రాసుకున్నారు ధనుష్. ఈ సినిమాలోని పాత్రధారులంతా ఫ్రెష్‌గా అనిపించడంతో పాటు ప్రతి పాత్ర ప్రేక్షకులను కనువిందు చేస్తుందనే చెప్పాలి. హ్యాట్సాఫ్ టు ధనుష్. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
తెలుగు సినిమాలు ఎప్పటికప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతూనే ఉంటాయి. కాకపోతే వీటిలో ఓటీటీ, టీవీలోకి వచ్చేవి మాత్రం చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. కొన్నింటికి నెలలు లేదంటే ఏళ్ల తర్వాత మోక్షం దక్కుతుంది. అలా దాదాపు రెండేళ్ల తర్వాత ఓ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: సినిమా వివాదం.. 'సలార్' విలన్ కి నోటీసులు)నిహాల్, ద్రిషిక చందర్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ద స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫల్ గర్ల్'. 2023 మే 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలో స్టార్స్ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. ప్రస్తుతం రూ.99కు రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'ద స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫల్ గర్ల్' విషయానికొస్తే.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ చరిత్ర (ద్రిషిక) కనిపించకుండా పోతుంది. దీంతో ఐపీఎస్ ఆఫీసర్ ఆదిత్య రంగంలోకి దిగుతాడు. విక్రమ్ అనే వ్యక్తిని కలుస్తాడు. ఇతడి చెప్పిన దానిబట్టి రవి (నిహాల్)తో చరిత్ర ప్రేమలో ఉందనే విషయం బయటపడుతుంది. మరి ఆదిత్య.. చరిత్ర ఆచూకీ కనుగొన్నాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్) -
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తుంటాయి. కాకపోతే థియేటర్లలోకి వచ్చిన కొన్ని ఓటీటీలోకి చాన్నాళ్ల తర్వాత వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఓ తెలుగు మూవీ దాదాపు ఏడాది తర్వాత స్ట్రీమింగ్ లోకి వచ్చింది.(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)సాయికుమార్, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'లక్ష్మీ కటాక్షం'. గతేడాది మే 10న థియేటర్లలో రిలీజైంది. కానీ వచ్చి వెళ్లిన విషయం కూడా ఎవరికీ గుర్తులేదు. ఇప్పుడు 11 నెలల తర్వాత దీన్ని ఆహా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.'లక్ష్మీ కటాక్షం' విషయానికి వస్తే.. రూ.100 కోట్ల ఖర్చు చేసి ఎమ్మెల్యే కావాలన్న రాజకీయ నేత (సాయికుమార్) ఒకరు. అలానే ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టనివ్వకుండా అడ్డుపడేందుకు ప్రయత్నిస్తున్న పోలీస్ అధికారి (వినయ్) ఒకరు. వీళ్లిద్దరి మధ్య సంఘర్షణే ఈ సినిమా కథ.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. మరోవైపు ఓటీటీల్లోకి మాత్రం దాదాపు 18 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు వచ్చేశాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి.(ఇదీ చదవండి: హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక)14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, టెస్ట్, ఇంటి నం.13, లవ్ యాపా సినిమాలతో పాటు హౌమ్ టౌన్ అనే సిరీస్ ఉన్నంతలో తెలుగు ప్రేక్షకుల కోసం ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఏ ఓటీటీల్లోకి ఏయే మూవీ వచ్చిందంటే?ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు (ఏప్రిల్ 04)అమెజాన్ ప్రైమ్14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో - తెలుగు సినిమాఇంటి నం.13 - తెలుగు చిత్రం (రెంట్)ముర్ ముర్ - తమిళ మూవీమచంటే మలక - మలయాళ సినిమాద బాండ్స్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీఅబౌట్ డ్రై గ్రాసెస్ - టర్కిష్ సినిమాముక్కం పోస్ట్ దేవచ్ ఘర్ - మరాఠీ మూవీపరు పార్వతి -కన్నడ సినిమా నెట్ ఫ్లిక్స్టెస్ట్ - తెలుగు డబ్బింగ్ మూవీకర్మ - కొరియన్ సిరీస్పల్స్ - ఇంగ్లీష్ సిరీస్హాట్ స్టార్లవ్ యాపా - హిందీ సినిమాటచ్ మీ నాట్ - తెలుగు సిరీస్ఆహాహోమ్ టౌన్ - తెలుగు సిరీస్సోనీ లివ్ఛమక్ - తెలుగు సిరీస్మనోరమ మ్యాక్స్జైలర్ - మలయాళ సినిమాబుక్ మై షోపెర్సోనా నాన్ గ్రాటా - జర్మన్ మూవీయూనివర్సల్ లాంగ్వేజ్ - ఫ్రెంచ్ సినిమా(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
తెలుగులో ప్రతివారం ఏదో ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతూనే ఉంటుంది. కాకపోతే కాస్త పేరున్న నటీనటులు ఉంటే మోస్తరు కలెక్షన్స్ సాధిస్తుంది. లేదంటే వచ్చివెళ్లిన సంగతి తెలియనంత వేగంగా మాయమైపోతుంది. అలాంటి ఓ తెలుగు మూవీ ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)అంకిత్, శ్రియ, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా '14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో'. టైటిల్ చూస్తేనే కథేంటో అర్థమైపోతుంది కదా. ఒంటరిగా ఉన్న ప్రియురాలిని కలవడానికి ఓ కుర్రాడు.. ఆమె ఇంటికి వెళ్తాడు. అదే టైంకి అమ్మాయి తల్లిదండ్రులు రావడంతో అక్కడే ఉండిపోతాడు. తర్వాత ఏమైందనేదే స్టోరీ.మార్చి 7న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. కానీ ఈ విషయం కూడా చాలామందకి తెలియదు. అలాంటిది ఈ రొమాంటిక్ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఉంటే దీనిపై ఓ లుక్కేయొచ్చు. దీనితో పాటు ఈ వారం పలు తెలుగు, డబ్బింగ్ మూవీస్ కూడా పలు ఓటీటీల్లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక) -
ఓటీటీలో తమిళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
కోలీవుడ్‌లో తెరకెక్కిన 'పెరుసు' (Perusu) సినిమా ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించింది. ఇప్పుడు ఈచిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులో నటుడు వైభవ్‌తో(Vaibhav) పాటు సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నిహారిక(Niharika NM) కీలక పాత్రలలో మెప్పించారు. ఆపై సునీల్ రెడ్డి, బాల శరవణన్, రెడిన్ కింగ్స్లీ, చాందిని తమిళరసన్ నటించారు. 'టాంటిగో' (శ్రీలంక చిత్రం) ఆధారంగా ‘పెరుసు’ మూవీని దర్శకుడు ఇళంగో రామ్ తెరకెక్కించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, బవేజా స్టూడియోస్, ఎంబర్ లైట్ స్టూడియో సంయుక్తంగా నిర్మించాయి.మార్చి 14న కోలీవుడ్‌లో మాత్రమే విడుదలైన పెరుసు చిత్రం మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. కథ తెగనచ్చేసిందంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెట్టారు. థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెరుసు ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రానుంది. తమిళ్, తెలుగు, కన్నడ,మలయాళంలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
'సంక్రాంతికి వస్తున్నాం' బాటలో జీవీ ప్రకాశ్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన చిత్రం 'కింగ్స్టన్'. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతనెల 7వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది.తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. అయితే ఈ మూవీ ఓకేసారి ఓటీటీతో పాటు టీవీల్లోనూ ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది సంక్రాంతి సూపర్ హిట్‌గా నిలిచిన టాలీవుడ్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం మూవీ తరహాలో ఓకేసారి రెండు ఓటీటీతో పాటు బుల్లితెరపై ప్రసారం చేయనున్నారు. ఏప్రిల్ 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కింగ్స్టన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే టీవీల్లో కేవలం జీ తమిళం ఛానెల్లో మాత్రమే ప్రసారం కానుంది.కాగా.. కింగ్స్టన్ చిత్రాన్ని జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. ఈ సినిమాలో చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ కీలక పాత్రలు పోషించారు.(ఇది చదవండి: 'ఒకడి అత్యాశే ఊరిని మొత్తం నాశనం చేసింది'.. ఆసక్తిగా ట్రైలర్)అసలు కింగ్స్టన్ కథేంటంటే..కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. ఆ కారణంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్‌తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్స్టన్ సినిమా చూడాల్సిందే.The sea calls. He answers! 🌊 🧟 #Kingston Arrives on 13th April! ⛵India's First Marine Fantasy Blockbuster #Kingston Premiering on OTT & TV on April 13th 12pm!#KingstonFromApril13thOnZEE5@gvprakash @storyteller_kp @ZeeStudiosSouth @ParallelUniPic @divyabarti2801… pic.twitter.com/QRPHkXcy6W— ZEE5 Tamil (@ZEE5Tamil) April 3, 2025 -
ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మలయాళంలో ఎప్పటికప్పుడు క్రేజీ సినిమాలు వస్తూనే ఉంటాయి. అవి ఓటీటీలోకి వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటాయి. అలా ఇప్పుడు మనోళ్లని ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్న మూవీ 'ప్రావింకూడు షప్పు'. ఇప్పుడు దీని స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఆ వార్తల్ని నమ్మొద్దు.. 'కన్నప్ప' మూవీ టీమ్)రీసెంట్ టైంలో మలయాళంలో వరస హిట్స్ కొడుతున్న నటుల్లో బాసిల్ జోసెఫ్ ఒకడు. ఇతడు పోలీస్ గా నటించిన లేటెస్ట్ మూవీ 'ప్రావింకూడు షప్పు'. షౌబిన్ సాహిర్, చెంబన్ వినోద్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జనవరి 16న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఏప్రిల్ 11 నుంచి సోనీ లివ్ ఓటీటీలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 'ప్రావింకూడు షప్పు' విషయానికొస్తే.. ఓ కల్లు దుకాణ యజమానిని ఎవరో చంపేస్తే.. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఆ రోజు రాత్రంతా షాపులోనే 11 మంది తాగుతూ పేకాటాడుతూ ఉంటారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. అక్కడ ఉన్న ఆ 11 మందిని అతడు ప్రశ్నిస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)A mystery too twisted, a ride too fun. Get ready for mystery and madness with Pravinkoodu Shappu streaming from April 11 on Sony LIVWatch #PravinkooduShappu On Sony Liv From 11 April#PravinkooduShappuOnSonyLIV pic.twitter.com/3urUrZGcgx— Sony LIV (@SonyLIV) April 1, 2025 -
ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?
2025లో మూడు నెలలు పూర్తయిపోయాయి. గత నెల మార్చిలో బోలెడన్ని మూవీస్ వచ్చాయి. కాకపోతే కోర్ట్ (Court A State Vs Nobody) అనే ఓ చిన్న సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. హీరో నాని (Nani) నిర్మించిన ఈ మూవీ.. మంచి లాభాలని అందుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?)రామ్ జగదీశ్ అనే కొత్త దర్శకుడు తీసిన 'కోర్ట్'లో పోక్సో చట్టం గురించి ప్రస్తావించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తీసిన ఈ సినిమాకు జనాలు నుంచి మంచి ఆదరణ దక్కింది. శివాజీ, ప్రియదర్శితో పాటు హర్ష రోషన్-శ్రీదేవి జంట నటనకు ప్రశంసలు దక్కాయి.ఇక విషయానికొస్తే మార్చి 14న థియేటర్లలోకి వచ్చిన కోర్ట్ మూవీ.. ఏప్రిల్ 11న ఓటీటీలోకి (Court OTT) వచ్చే అవకాశముందని టాక్. దీని డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో పలు కొత్త సినిమాలు ఈ ఓటీటీలో 28 రోజులకే వస్తున్నాయి. దీంతో కోర్ట్ కూడా అలానే రావొచ్చని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతనేది చూడాలి?(ఇదీ చదవండి: వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?) -
OTT: సడెన్‌గా తెలుగులోకి వచ్చేసిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’.. తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) పేరుతో విడుదలైంది. అయితే, ఎలాంటి ప్రకటన లేకుండా ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్కు వచ్చేసింది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో ఇందులో నటించారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో తమిళ్ వర్షన్ అందుబాటులో ఉంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది.‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద యూత్‌ను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో సడెన్‌గా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండా ఈ సినిమాను విడుదల చేయడంతో ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సింప్లీ సౌత్ ఓటీటీలో కూడా ఈ చిత్రం తెలుగులో ఉంది. ఓ భిన్నమైన రొమాంటిక్ కామెడీ కథతో ధనుష్ ఈ సినిమాని తెరకెక్కించారు. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ మూవీ ఉంటుంది. ఆర్కేప్రోడక్షన్స్‌తో కలిసి ధనుష్(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ పథాకంపై ఈ సినిమాను నిర్మించారు. -
ఓటీటీలోకి ఖుషీ కపూర్ డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అతిలోక సుందరి శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి జాన్వీ కపూర్ హీరోయిన్ గా సెట్ అయిపోయింది. రెండో కూతురు ఖుషీ కపూర్ మాత్రం కష్టపడుతూనే ఉంది. ఇప్పటికే మూడు సినిమాలు చేయగా.. అవన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. ఈమె లేటెస్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్)రీసెంట్ టైంలో 'లవ్ యాపా' మూవీలో ఖుషీ కపూర్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాతోనే ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. 'లవ్ టుడే' హిందీ రీమేక్ ఇది. కంటెంట్ మంచిదే కానీ ఖుషీ-జునైద్ ఇద్దరికి ఇద్దరు పసలేని యాక్టింగ్ చేయడంతో మూవీ డిజాస్టర్ అయింది. రూ.60 కోట్లు పెడితే రూ.10 కోట్ల వసూళ్లు వచ్చాయి.ఇకపోతే లవ్ యాపా మూవీ ఏప్రిల్ 4 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దాదాపు రెండు నెలల తర్వాత రిలీజ్ అవుతుంది. థియేటర్లలో రిలీజైనప్పుడే ఖుషీ నటనపై విమర్శలు వచ్చాయి. మరి ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఖుషీ యాక్టింగ్ ని ఇంకెంత ట్రోలింగ్ చేస్తారో?(ఇదీ చదవండి: లంక మాజీ క్రికెటర్ తో 51 ఏళ్ల మలైకా డేటింగ్?) -
ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
ఉగాది, రంజాన్ రెండు పండుగల తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో కూడా సినిమాల సందడి ఉంది. ఇప్పటికే థియేటర్స్‌లో లూసిఫర్, మ్యాడ్, రాబిన్‌హుడ్ వంటి చిత్రాలు సందడి చేస్తున్నాయి. ఇంకో వారం పాటు బిగ్ స్క్రీన్‌పై ఈ చిత్రాల హవా ఉంటుంది. అందుకే ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్స్‌లోకి వచ్చే పెద్ద సినిమాలు లేవని చెప్పవచ్చు. విద్యార్థులకు దాదాపుగా పరీక్షలు ముగిశాయి. ఎండలు పెరిగాయి దీంతో ఇంట్లోనే ఉంటూ సరదాగా సినిమాలు చూసే వారికి చాలానే ఉన్నాయి. మండు వేసవిలో చల్లని వినోదాన్ని పంచడానికి ఓటీటీలో సినిమాలు సిద్ధమయ్యాయి. మరి ఏప్రిల్ మొదటి వారంలో సినీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న చిత్రాలేంటి..? తెలుసుకుందాం.నెట్‌ఫ్లిక్స్🎥 టెస్ట్ (తమిళ్/తెలుగు)- ఏప్రిల్ 4🎥 కర్మ కొరియన్ (ఇంగ్లీష్/తెలుగు)- ఎప్రిల్ 4అమెజాన్ ప్రైమ్🎥 బ్లాక్ బ్యాగ్- ఏప్రిల్ 1🎥 అక్టోబర్ 8- ఏప్రిల్1🎥 ది బాండ్స్‌మ్యాన్ (ఇంగ్లీష్/తెలుగు)- ఏప్రిల్ 3జియో హాట్‌స్టార్🎥 జ్యూరర్ 2 (ఇంగ్లీష్/తెలుగు) ఏప్రిల్ 1🎥 హైపర్ నైఫ్ (కొరియన్/ తెలుగు) వెబ్ సిరీస్ ఏప్రిల్ 2🎥 ఏ రియల్ పెయిన్ (ఇంగ్లీష్)- ఏప్రిల్ 3🎥 టచ్ మీ నాట్ (తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4జీ5🎥 కింగ్స్‌స్టన్ (తెలుగు/తమిళ్)- ఏప్రిల్ 4ఆహా🎥 హోం టౌన్ (తెలుగు వెబ్ సిరీస్)- ఏప్రిల్ 4 -
Moana 2 : ‘మోఆనా2 ’ మూవీ రివ్యూ
కిడ్స్ మోఆనా2 (Moana 2) ఓటీటీలోకి వచ్చేసింది. . ఫస్ట్ పార్ట్ చూసివ వాళ్ళకి ఇది ఇంకా బాగా నచ్చుతుంది. బట్ కిడ్స్ ఇది మీ ఎగ్జామ్స్ టైం. సో మీ ఎగ్జామ్స్ అయిపోగానే ఫస్ట్ మీ ఛాయిస్ మోఆనా2 అవ్వాలి. ఎందుకంటే ఈ సారి మోర్ అడ్వెంచరస్ అండ్ మచ్ మరో ఫన్ తో మోఆనా ఉంది కాబట్టి. ఫస్ట్ పార్ట్ లో లాగానే మావోయి మొఆనా2లో కూడా ఓ టాస్కులో హెల్ప్ అవుతాడు. మోఆనా2 లో మోఆనా తన ఆన్సిస్టర్స్ కోసం వెతుకుతూ ఉంటుంది.ఈసారి మోటుఫెటు అనే ద్వీపం కోసం కూడా సెర్చ్ చేస్తుంటుంది. మౌయ్ తన టాటూ డాన్స్‌తో రచ్చ చేస్తాడు. డిస్నీ విజువల్స్‌లో ఎప్పటిలాగే మాయ చేశారు. మోఆనా ధైర్యంగా సముద్రంలో తిరుగుతుంది. మోఆనా ఈ అడ్వెంచర్ లో బోలెడన్ని వింత క్యారెక్టర్స్ తగులుతాయి. అవి భలే తమాషాగా ఉంటాయి. అవి ఏంటి, అలాగే మోఆనాకి తన ఆన్ సిస్టర్స్ దొరుగుతారా లేదా అన్నది మాత్రం మీ ఎగ్జామ్స్ అయ్యాక జియో హాట్ స్టార్ ట్యూన్ చేయండి. మోఆనా తో ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ కిడ్స్ అండ్ హావ్ ఎ బ్లాస్టింగ్ హాలిడేస్.-ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇప్పుడంటే ఓటీటీల్లో సరైన వెబ్ సిరీసులు రావట్లేదు. కానీ ఒకప్పుడు పలు సిరీస్ లు ఓ రేంజు ఫాలోయింగ్ సంపాదించుకున్నాయి. అందులో ఒకటి ఫ్యామిలీ మ్యాన్. లాక్ డౌన్ రావడానికి కొన్నాళ్ల ముందు వచ్చిన ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా.. 2021లో రెండో సీజన్ వచ్చింది. ఈ రెండు కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అప్పటినుంచి మూడో సీజన్ ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. గతేడాది షూటింగ్ మొదలుపెట్టగా.. ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇందులో కీలక పాత్రధారి అయిన మనోజ్ బాజ్ పాయ్.. తాజాగా ఓటీటీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నాడు. అలా మాట్లాడుతూ మూడో సీజన్ గురించి అప్డేట్ ఇచ్చాడు.ఈ ఏడాది నవంబరులో ఫ్యామిలీ మ్యాన్ 3.. స్ట్రీమింగ్ అవుతుందని చెప్పాడు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణితో పాటు ఈసారి జైదీప్ అహ్లవత్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పీఆర్వోపై కేసు నమోదు) -
మన సిద్ధ వైద్య రహస్యాలు చెప్పిన సినిమా
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం అగత్తియా ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనం చూసే సినిమాలలో మనకు తెలియని చరిత్రకు సంబంధించిన రహస్యాలు చాలావరకు తెలుపుతూ ఉంటాయి. అటువంటి రహస్యాలలో మన సంస్కృతికి సంబంధించిన సిద్ధ వైద్యం ఒకటి. కొన్ని వేల సంవత్సరాలకు ముందే మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం అద్భుత ఔషధాల వివరాలను గోప్యంగా పొందుపరిచారు. కోట్ల విలువైన సంపద కంటే ఈ వివరాలు ఎంతో విలువగలవి. కానీ దురదృష్టవశాత్తు అటువంటి వివరాలు చాలావరకు విదేశీయులు నాశనం చేయడమో, కొల్లగొట్టడమో జరిగింది. ఆ సమయంలో ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి ఆ మహత్ గ్రంథాలను కాపాడిప్రాణత్యాగం చేశారు. ఆ నేపథ్యంలోనే అల్లుకున్న కథ ‘అగత్తియా’. దేవతలకు రాక్షసుల మధ్య పోరాటం అనే టాగ్ లైన్‌తో సినిమా కథాంశం నడుస్తుంది. కథానుగుణంగా సీరియస్పాయింట్ అయినా ఈ సినిమా దర్శకుడుపా. విజయ్ తన స్క్రీన్‌ప్లేతో దీనిని హారర్ కామెడీలా తెరకెక్కించారు.సినిమా మొత్తం సిద్ధ వైద్యం గొప్పతనాన్ని ప్రేక్షకులకు ఓ పక్క చెబుతూనే మరో పక్క కమర్షియల్ కామెడీ హంగులతో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేశారు. ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో జీవా, రాశీ ఖన్నా నటించారు. మరో ముఖ్యపాత్రలో ప్రముఖ నటుడు అర్జున్ నటించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే... అగత్యన్ అనే ఆర్ట్ డైరెక్టర్ ఓ సినిమా కోసం తాను కూడా డబ్బులు పెట్టి ఓ పురాతన బంగ్లాలో షూటింగ్ ఏర్పాటు చేసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ రద్దవుతుంది. పెట్టుబడి పెట్టిన డబ్బులు పోతాయనే ఉద్దేశంతో ఆ బంగ్లాని ఓ హారర్ థీమ్‌తో పర్యాటక కేంద్రంగా మారుస్తాడు. పర్యాటకులను ఆ బంగ్లాలో అనుమతించినప్పటి నుండి బంగ్లాలో కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి. అంతేకాదు అగత్యన్ టీమ్‌కి ఓపాత పియానో కూడా దొరుకుతుంది. ఆ మిస్టరీ పియానో అగత్యన్కి ఆ బంగ్లా కథ చెబుతుంటుంది. అగత్యన్ తల్లి కేన్సర్‌తో బాధ పడుతుంటుంది. ఆ బంగ్లా వల్ల వాళ్ల అమ్మ కోలుకుంటుంది. అది ఎలానో మీరు సన్ నెక్ట్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘అగత్తియా’ చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగు వెర్షన్ ‘అగత్యా’ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఐదేళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అల్లాడిపోయింది. అప్పుడు ఇంగ్లిషు మందులతోపాటు మనప్రాచీన వైద్యంతో కూడా చాలా మంది కోలుకున్నారు. అలానే మన సిద్ధ వైద్యం కూడా. అసలింతలా ఏముంది ఆ సిద్ధ వైద్యంలో అని అనుకుంటే ‘అగత్యా’ సినిమా చూడండి. ఉగాది పండగ రోజు పూజా పునస్కారాలయ్యాక మంచి కాలక్షేపం ఈ సినిమా. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో ఉపేంద్ర 'యూఐ' సినిమా..
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యూఐ’. ఇప్పుడు డైరెక్ట్‌గా టెలివిజన్ ప్రీమియర్‌కు రానుంది. లహరి ఫిల్మ్స్, జీ మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 20న విడుదల అయింది. ఈ సినిమాని తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను వర్చువల్ రియాలిటీ పైప్‌లైన్‌లో చిత్రీకరించడంతో బాగా హైప్ క్రియేట్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపలేదు. సుమారు రూ. 80 కోట్లతో ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 47 కోట్లు మాత్రమే రాబట్టి నష్టాలను మిగిల్చింది.యూఐ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఉపేంద్ర ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘యూఐ’ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారైనట్లు ఒక ప్రకటన చేశారు. ఉగాది సందర్భంగా మార్చి 30న సాయంత్రం 4.30 గంటలకు జీ కన్నడలో ‘యూఐ’ టెలికాస్ట్ అవుతుందని తెలిపారు. కానీ, ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. టాలీవుడ్ హీట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' మాదిరి యూఐ చిత్రం కూడా జీ5 ఓటీటీలో ఉగాది నాడే రావచ్చని చెబుతున్నారు. ఓటీటీ, టెలివిజన్ ప్రీమియర్ రెండూ కూడా ఏక కాలంలో అందుబాటులోకి రావచ్చని సమాచారం.కథేంటి?ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. -
'హత్య' మూవీ రివ్యూ.. ఇది కదా అసలు నిజం!
టైటిల్: హత్య; నటీనటులు: ధన్యా బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్, రఘు, భరత్ తదితరులు. నిర్మాత: ప్రశాంత్ రెడ్డి; కథ–స్క్రీన్ ప్లే–దర్శకత్వం: శ్రీవిద్య బసవ; సంగీతం: నరేశ్ కుమరన్.పి సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్; ఎడిటర్: అనిల్ కుమార్ .పి; ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో.అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కల్పిత కథ అని మేకర్స్ ప్రకటించినప్పటికీ... ఈ సినిమాలోనిపాత్రలు, స్థలాలు, హత్య ఘటన, కేసు దర్యాప్తు ప్రక్రియ అన్నీ కూడా సంచలనం అయిన ప్రముఖ రాజకీయ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పోలి ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించి దర్శక–నిర్మాతలు లోతైన పరిశోధన చేసి, దాగి ఉన్న పలు విషయాలను సేకరించినట్లుగా సినిమా చూసినవారికి అనిపించడం సహజం.ఈ హత్యకు సంబంధించిన అసలు నిజాలు చెప్పేలా కథ ఉండటంతో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన వెంటనేపాపులర్ అయింది... నిజంగా ఏం జరిగింది? అనేదానికి ఈ సినిమా నిజమైన నమూనానా? హత్య వెనక ఉన్న నిజమైన హంతకులను ఈ సినిమా బయటపెట్టిందా? జరిగిన విషయాన్ని ఎలా తారుమారు చేసి, ప్రచారం చేస్తున్నారో ఈ సినిమా చూపించిందా? ‘హత్య’ సినిమా బయటపెట్టిన నిజాలు ఏంటి? ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌ని ఇష్టపడేవారు, వివేకానంద రెడ్డి హత్య కేసుని ఫాలో అవుతున్నవారు చూడాల్సిన చిత్రం ఇది.ఇంతకీ ఈ చిత్ర కథేంటంటే...ఇల్లందులో రాజకీయ నాయకుడు ధర్మేంద్ర రెడ్డి (రవి వర్మ) దారుణ హత్యకు గురవుతాడు. అయితే తొలుత ఆయన మరణం గుండెపోటు వల్ల జరిగిందని వార్తలు వస్తాయి. కానీ ధర్మేంద్ర గొడ్డలి వేటుతో హత్యకు గురయ్యాడని నిర్ధారణ అవుతుంది. ఈ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి (భరత్) నిజాయితీ గల ఐపీఎస్ అధికారి సుధ (ధన్యా బాలకృష్ణ)కి అప్పగిస్తాడు. ఆమె తన టీమ్‌తో కలిసి ధర్మేంద్ర రెడ్డి హత్య కేసు విచారణ మొదలుపెడుతుంది. అజాత శత్రువు అయిన ధర్మేంద్ర రెడ్డిని అంత దారుణంగా నరికి చంపింది ఎవరు? ధర్మేంద్రకు, సలీమా (పూజా రామచంద్రన్)కు ఉన్న సంబంధం ఏంటి? పొలిటికల్ ఎజెండాతో ఈ హత్య చేశారా?\ఆర్థిక సమస్యలే కారణమా? ధర్మేంద్ర కుమార్తె కవితమ్మ (హిమబిందు)ను తప్పుదోవ పట్టించింది ఎవరు? చిన్నాన్న హత్య కేసులో నిజాలను నిగ్గు తేల్చడానికి సీఎం కిరణ్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? గత ప్రభుత్వం దగ్గర అమ్ముడుపోయిన కొంతమంది అధికారులు ఈ కేసును ఎలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు? అనేక ఒత్తిడిలను తట్టుకొని ఐపీఎస్ అధికారి సుధ ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించింది? కేసు విచారణ చివరి దశలో ఉన్న సమయంలో ఏం జరిగింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కథంతా కల్పితమే అని చిత్రబృందం పేర్కొన్నప్పటికీ.. సినిమాప్రారంభంలోనే ఇది వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. దర్శకురాలు శ్రీవిద్య బసవ ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆమె రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయి. సినిమాప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. జేసీ ధర్మేంద్ర ఎవరన్నది చెబుతూ కథను మొదలుపెట్టారు దర్శకురాలు. ధర్మేంద్ర హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూపించారు. సుధ విచారణలో ఒక్కో కొత్త విషయం బయటకు వస్తుంటే.. ‘ఇది కదా అసలు నిజం’ అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సలీమా, ధర్మేంద్రల మధ్య లవ్‌స్టోరీ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. దర్శకురాలు ఎంతో పకడ్బందీగా రీసెర్చ్ చేసి, లవ్‌స్టోరీ చెప్పినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మంచి ఎమోషన్ పండించారు.ఎవరెలా చేశారంటే..ధర్మేంద్ర రెడ్డిపాత్రలో రవి వర్మ ఒదిగిపోయారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా ధన్యా బాలకృష్ణ తనపాత్రకు న్యాయం చేశారు. సలీమాగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో పూజా రామచంద్రన్ మెప్పించారు. భరత్, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగార్... మిగిలిన నటీనటులు వారిపాత్రల్లో మెప్పించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నరేశ్ కుమరన్ .పి అందించిన నేపథ్య సంగీతం,పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
నేరుగా ఓటీటీలోకి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇప్పుడంతా ఓటీటీల జమానా నడుస్తోంది. చాలా చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ.. మరికొన్ని మాత్రం నేరుగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. అలా ఇప్పుడో హిందీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎప్పుడు రాబోతుంది?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'జ్యూయల్ థీఫ్'. టైటిల్ చూడగానే అర్థమైందనుకుంటా. మనీ హైస్ట్ లా ఇందులోనూ రెడ్ సన్ అనే రూ.500 కోట్ల విలువైన డైమండ్ కొట్టేయాలని హీరోకి విలన్ పనిఅప్పజెబుతాడు. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.వార్, పఠాన్ తదితర చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ పెంచుకున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి నిర్మాత. రాబీ గ్రేవాల్, కుకీ గులాటీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25 నుంచి ఇది నేరుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తాజాగా ప్రకటించారు.(ఇదీ చదవండి: సల్మాన్ చేతికి 'రామ్ జన్మభూమి' వాచ్.. రేటు ఎంతంటే?) -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ లాంటి తెలుగు సినిమాలతో పాటు ఎల్ 2 ఎంపురాన్, వీరధీరశూర లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా రిలీజయ్యాయి. మరోవైపు ఓటీటీలోకి ఏకంగా 20 సినిమాలు వచ్చేశాయి.(ఇదీ చదవండి: ఆలియాను చూసి ఈర్ష్య పడ్డా.. ఈమెకేంటి.. లైఫ్ సెట్టు అనుకున్నా!)ఓటీటీలోకి వచ్చిన సినిమాల విషయానికొస్తే.. మజాకా, శబ్దం, దేవా, అగాథియా చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని మూవీస్, వెబ్ సిరీసులు కూడా ఉన్నాయి. ఇంతకీ తాజాగా ఓటీటీలోకి వచ్చిన మూవీస్ ఏంటంటే?ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన మూవీస్ (మార్చి 28)నెట్ ఫ్లిక్స్దేవా - హిందీ సినిమాద లేడీస్ కంపానియన్ - స్పానిష్ సిరీస్ద లైఫ్ లిస్ట్ - ఇంగ్లీష్ మూవీఅమెజాన్ ప్రైమ్శబ్దం - తెలుగు డబ్బింగ్ సినిమాచూ మంతర్ - కన్నడ మూవీసన్ నెక్స్ట్బచ్చలమల్లి - తెలుగు సినిమాబిగ్ బెన్ - మలయాళ మూవీఅగాథియా - తెలుగు డబ్బింగ్ సినిమాహాట్ స్టార్ఓం జై కాళీ - తెలుగు డబ్బింగ్ సిరీస్ఆహావిజయ్ ఎల్ఎల్ బీ - తమిళ సినిమాజీ5మజాకా - తెలుగు మూవీసెరుప్పగుల్ జాకర్తై - తమిళ సిరీస్విడుదలై పార్ట్ 2 - హిందీ వెర్షన్ మూవీలయన్స్ గేట్ ప్లేబిఫోర్ ఐ వేక్ - ఇంగ్లీష్ మూవీడెన్ ఆఫ్ థీవ్స్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమాజురాసిక్ హంట్ - ఇంగ్లీష్ మూవీరెడ్ లైన్ - ఇంగ్లీష్ సినిమాబుక్ మై షోబ్రిడ్జెట్ జోన్స్ - ఇంగ్లీష్ సినిమాఎమ్ఎక్స్ ప్లేయర్కిల్ దిల్ - హిందీ సిరీస్ఆపిల్ టీవీ ప్లస్నంబర్ వన్ ఆన్ ద కాల్ షీట్ - ఇంగ్లీష్ సిరీస్(ఇదీ చదవండి: కమెడియన్ ధనరాజ్‌తో గొడవలు- విడాకులు.. క్లారిటీ ఇచ్చిన భార్య) -
Adolescence Review: డిజిటల్ లోయల్లో టీనేజ్ పిల్లలు
తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడుతుంటారు. పిల్లలు చదువులతో కష్టపడాలి వాస్తవంగా. కాని వారికి సోషల్ మీడియాలోని చెత్తా చెదారం, తప్పుడు సమాచారం, ఉద్రిక్త ఆకర్షణలు, హింసాత్మక భావజాలాలు... ఇవి కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఇటీవల వచ్చిన ‘అడోలసెన్స్’ వెబ్‌సిరీస్ మీద సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఇది హెచ్చరిక అంటున్నారు. ఈ సిరీస్ మనల్ని ఎలా నిద్ర లేపుతున్నది?మీ పిల్లలు మీతో ఇంట్లో మాట్లాడే భాష మీకు తెలుసు. వాళ్లు సోషల్ మీడియాలో మాట్లాడే భాష మీకు తెలుసా? వాళ్లు ఉపయోగించే ‘ఎమోజీ’ల అర్థాలు తెలుసా? మాటలు లేకుండా ఎమోజీలతో గాయపరిచే వీలు ఉంటుందని తెలుసా? కిడ్నీ బీన్స్, రెడ్ పిల్, బ్లూ పిల్, డైనమైట్, రెడ్ హార్ట్, పర్పుల్ హార్ట్, ఎల్లో హార్ట్.... ఈ ఎమోజీల అర్థం ప్రతి దానికీ మారుతుంది. అవి ఎందుకు ఉపయోగిస్తున్నారు. ఇంట్లో మన ఎదురుగా పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసు. సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసా?ముఖ్యంగా వారి వయసు 12– 14 సంవత్సరాల మధ్య ఉంటే వారికి తెలిసింది ఎంత... తెలియంది ఎంత... తెలిసీ తెలియంది అంత. జాగ్రత్త సుమా... అని హెచ్చరించడానికి వచ్చింది ‘అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్.నాలుగు ఎపిసోడ్స్ల సిరీస్‘అడోలసెన్స్’ అనేది నాలుగు ఎపిసోడ్ల మినీ వెబ్ సిరీస్. బ్రిటిష్ క్రైమ్ డ్రామా. బ్రిటన్‌లో టీనేజ్ పిల్లల్లో పెరుగుతున్న హింసా ప్రవృత్తిని గమనించి ఈ సిరీస్‌ను తీశారు. జాక్ థోర్న్ స్క్రిప్ట్ రాస్తే, ఫిలిప్ బరాన్టిని దర్శకత్వం వహించాడు. ఒక్కో ఎపిసోడ్ ఒక గంట ఉంటుంది. విశేషం ఏమిటంటే ప్రతి ఎపిసోడ్ సింగిల్ షాట్. అంటే మధ్యలో కట్ లేకుండా కెమెరా కదులుతూ దృశ్యాలను చూపుతూ వెళుతుంది. ఈ మేకింగ్‌లో వినూత్నత వల్ల కూడా ఈ సిరీస్ ప్రశంసలు అందుకుంటోంది.ఆ పసివాడి సంఘర్షణఈ సిరీస్ మొదలు కావడమే ‘జెమీ మిల్లర్’ అనే 13 ఏళ్ల పిల్లవాడి అరెస్టుతో మొదలవుతుంది. ముందు రోజు రాత్రి స్కూల్లో తన క్లాస్మేట్ అమ్మాయి కేటీని కత్తితో ఏడుసార్లు పొడిచి చంపాడని అభియోగం. తండ్రి, తల్లి, సోదరి హడలిపోతాడు. జెమీ మిల్లర్ అయితే పోలీసులను చూసి ప్యాంట్ తడుపుకుంటాడు. ఆ తర్వాత జేమీనే కేటీని చంపాడని ఇందుకు ఒక స్నేహితుడు కూడా పురిగొల్పాడని విచారణలో ప్రేక్షకులకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇందులో ఎవరి తప్పు ఎంత? దీనికి బాధ్యులు ఎవరెవరు? శిక్ష మాత్రం ఒక్కడికే పడబోతోందా?ఇన్‌స్టా గొడవజెమీ వయసు 13 ఏళ్లే అయినా అతనికి ఇన్‌స్టా అకౌంట్ ఉంది. అందమైన ఫిమేల్మోడల్స్ బొమ్మలను అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాడు. అతని పోస్టులకు కేటీ కామెంట్స్ పెడుతూ ఉంటుంది. వాటికి రకరకాల ఎమోజీలు వాడుతుంటుంది. అవి జెమీని బాధ పెట్టాయని మనకు తెలుస్తుంది. జెమీ తన వయసులో అపరిపక్వత వల్ల తను ఆకర్షణీయంగా లేడని తనను ఎవరూ ఇష్టపడరని న్యూనతతో ఉంటాడు. కేటీ కామెంట్స్ ఇందుకు ఆజ్యం పోస్తాయి. అంతే కాదు సాటి మనిషి పట్ల, ఆడపిల్లల పట్ల సెన్సిటివ్‌గా ఉండాలనే భావజాలం కాకుండా వాళ్లను ఏమైనా అనొచ్చు ఎలాగైనా ఉండొచ్చు అనే ఆధిపత్యపు భావజాలమే ఎక్కువగా జెమీకి పరిచయం అవుతుంటుంది. వీటన్నింటి దరిమిలా అతడు కేటీప్రాణం తీసేవరకూ వెళతాడు.టీనేజ్ పిల్లలు ఎంతో సున్నితమైన దశలో ఉండే సీతాకోక చిలుకలు. వారిని గురించి అందరికీ బాధ్యత ఉండాలని చెబుతోంది ఈ సిరీస్. ఇందులోని ముఖ్య పాత్రను ఒవెన్ కూపర్ అనే బాల నటుడు అద్భుతంగా పోషించాడు. దిన పత్రికల వార్తలు కూడా మనకు రోజూ టీనేజ్ పిల్లల సమస్యలు, కుటుంబాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ లోపం పట్టి ఇస్తున్నాయి. తల్లిదండ్రులు ఈ సిరీస్ చూడటం మంచిదంటున్నారు అభిరుచి ఉన్న ప్రేక్షకులు. కొందరైతే టీనేజ్ పిల్లలతో పాటుగా తల్లిదండ్రులూ చూడాలని సూచిస్తునారు. ముందు పెద్దలు చూడండి. ఆ తర్వాత మీకు సబబని అనిపిస్తే పిల్లలకు చూపించండి. కానీ ఆలోచించండి.ఎవరు నిందితులు?సోషల్ మీడియాను, ఎమోజీలను కనిపెట్టిన వారా? వాటిని ఫోన్లకు అనుసంధానం చేసిన వారా? పిల్లలకు ఫోన్లు కొనిచ్చిన తల్లిదండ్రులా? వాళ్లు ఏ మీడియాను ఉపయోగిస్తున్నారో చూడని తల్లిదండ్రుల నిర్బాధ్యతా? వారితో గడపలేని బిజీతో ఉన్న తల్లిదండ్రుల నిర్లక్ష్యమా? సరిగా పెంచని, సరిగా విద్యాబుద్ధులు చెప్పని వారంతా ఇందుకు బాధ్యులు కాదా? సమాజంలో పేరుకున్న హింసా ప్రవృత్తిని దూరం చేయలేని పాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ, పౌర వ్యవస్థలో ఉన్న వీరంతా కాదా బాధ్యులు. -
ఓటీటీకి పూజా హెగ్డే డిజాస్టర్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
బుట్టబొమ్మ పూజా హెగ్డే, బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ జంటగా నటించిన చిత్రం దేవా. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఆదరణ కరవైంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన దేవా అభిమానులను థియేటర్లలో రప్పించడంలో విఫలమైంది.అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఈనెల 28 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ మేరకు దేవా పోస్టర్‌ను పంచుకుంది.కాగా..2013లో మలయాళంలో 'ముంబై పోలీస్' అనే పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అదే సినిమాని తెలుగులో 'హంట్' పేరుతో సుధీర్ బాబు రీమేక్ చేశాడు. ఇక్కడ అంతగా వర్కవుట్ కాకపోవడంతో ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమానే మళ్లీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'దేవా' పేరుతో తెరకెక్కించగా డిజాస్టర్‌గా నిలిచింది. మరీ ఓటీటీలోనైనా అభిమానులను ఏమేర అలరిస్తుందో వేచి చూడాలి.Bhasad macha 🥁🥁🥁 Trigger chala 🚨🚨🚨 Deva aa raha hai 🔥#DevaOnNetflix pic.twitter.com/9eHQGvnjWn— Netflix India (@NetflixIndia) March 27, 2025 -
Ind Vs Pak టెస్ట్.. ముగ్గురి జీవితాలు.. ఓటీటీ సిరీస్ ట్రైలర్ రిలీజ్
క్రికెట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఇప్పటికే పలు సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చాయి. ఇప్పుడు అలాంటి కంటెంట్ తో వస్తున్న లేటెస్ట్ సిరీస్ 'టెస్ట్'. మాధవన్, నయనతార, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ ని తాజాగా విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా)చెన్నైలో జరిగిన ఇండియా vs పాకిస్థాన్ టెస్టు మ్యాచ్.. ముగ్గురు వ్యక్తుల జీవితాల్ని ఎలా ప్రభావితం చేసిందనే కథతో ఈ సిరీస్ తీశారు. ఏప్రిల్ 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. (ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య) -
ఓటీటీలోకి పూజా హెగ్డే డిజాస్టర్ సినిమా
బుట్టబొమ్మ పూజా హెగ్డేకి (Pooja Hegde) టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. రెండు మూడేళ్ల ముందు వరకు తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేసింది. ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ లాంటి వరస డిజాస్టర్స్ దెబ్బకు పూర్తిగా సౌత్ కి దూరమైపోయింది. హిందీలో ప్రయత్నిస్తే ఒకటి రెండు ఛాన్సులు వచ్చాయి గానీ ఆయా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్స్ గా మిగిలాయి. ఈ ఏడాది జనవరి 31న రిలీజైన 'దేవా' (Deva OTT) సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది గానీ ఇదేమో ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఈ మూవీనే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య)2013లో మలయాళంలో 'ముంబై పోలీస్' పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో కాస్త కొత్తగా అనిపించడంతో హిట్ అయింది. దీన్ని తెలుగులో 'హంట్' పేరుతో సుధీర్ బాబు రీమేక్ చేశాడు. కానీ ఫ్లాప్ అయింది. దీన్నే మళ్లీ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'దేవా' పేరుతో తీస్తే ఇక్కడ కూడా డిజాస్టర్ అయింది.ఇప్పుడు 'దేవా' సినిమా ఓటీటీలోకి రానుంది. మార్చి 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య థియేటర్లలో ఫ్లాప్ అయిన 'ఎమర్జెన్సీ' లాంటి మూవీస్ ఓటీటీలో హిట్ అవుతున్నాయి. మరి 'దేవా' కూడా అలా ఏమైనా ట్రెండింగ్ అవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఓటీటీలోకి సూపర్ హిట్ హారర్ మూవీకి సీక్వెల్
హారర్ సినిమాలకు సెపరేట్ ప్రేక్షకులు ఉంటారు. సరిగ్గా తీయాలే గానీ భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ చేసేస్తారు. అలా నాలుగేళ్ల క్రితం ఓటీటీలో రిలీజై అందరినీ భయపెట్టిన ఓ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ గురువు కన్నుమూత)హిందీ నటి నుష్రత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఛోరీ'. ఓ మారుమూల గ్రామంలోని పొలంలో జరిగే కథతో తీశారు. ఓ గర్భవతికి ఆమెకు ఆశ్రయం కల్పించి, చంపాలని చూసే ఓ మహిళ చుట్టూ తిరిగే స్టోరీతో తొలి భాగం తీయగా.. సదరు గర్భవతికి పుట్టిన కూతురి పడే కష్టాలతో సీక్వెల్ తీసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.తొలి భాగంలో భయపెడుతూనే థ్రిల్ కి గురిచేసినట్లు.. ఈసారి కూడా థ్రిల్ పంచే సీన్స్ బోలెడు ఉన్నాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఏప్రిల్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలుగులో మిగతా సినిమాల మాటేమో గానీ కామెడీ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సంక్రాంతికి అలా వచ్చిన ఓ కామెడీ మూవీ ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. అదే 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇది వచ్చిన కొన్నిరోజులకు థియేటర్లలోకి వచ్చిన మరో హాస్యభరిత చిత్రం 'మజాకా' (Mazaka Movie). ఇప్పుడు దీని ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.రావు రమేశ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకుడు. తండ్రి కొడుకుల ఒకేసారి ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రంలో రీతూ చౌదరి, అన్షు (Anshu) హీరోయిన్లుగా నటించారు. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత)శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలోకి వచ్చిన మజాకా చిత్రానికి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. కంటెంట్ లో చిన్నచిన్న లోపాలే దీనికి కారణం. ఇకపోతే ఇప్పుడు ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 28 నుంచి జీ5లో (Zee 5 Ott) స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు.'మజాకా' విషయానికొస్తే.. రమణ (రావు రమేశ్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రి కొడుకులు. చిన్నప్పుడే భార్య చనిపోవడటంతో మరో పెళ్లి చేసుకోకుండా కొడుకుని రమణ పెంచుతాడు. కానీ కృష్ణకి పెళ్లి చేయాలనేసరికి ఇంట్లో ఆడదిక్కు లేదని ఎవరూ పిల్లనివ్వరు. దీంతో రమణ.. యశోద (అన్షు)తో, కృష్ణ.. మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: నన్ను దెబ్బ కొట్టేందుకు వాళ్లు కోట్లు ఖర్చు పెట్టారు: పూజా హెగ్డే) -
ఓటీటీలో ట్విస్ట్ ఇచ్చిన ధనుష్.. తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
కోలీవుడ్ స్టార్ హీరో డైరెక్ట్ చేసిన ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) పేరుతో తెలుగులో కూడా విడుదలైంది. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో తమిళ్ వర్షన్ అందుబాటులో ఉంది. అయితే, తెలుగు స్ట్రీమింగ్ గురించి మేకర్స్ ప్రకటించలేదు. ఈ క్రమలో తాజాగా సింప్లీ సౌత్ ఓటీటీ సంస్థ ఈ మూవీ తెలుగు రైట్స్ కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది తెలుపలేదు. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్స్‌లోకి వచ్చేసింది. అయితే, రీసెంట్గా తమిళ్ వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి త్వరలో తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వస్తుందని అందరూ ఆశించారు. కానీ, తెలుగు స్ట్రీమింగ్ మాత్రం సింప్లీ సౌత్ ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇండియాలో ఈ ఓటీటీ సంస్థకు అనుమతి లేదు. కానీ, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు అందరూ ఈ చిత్రాన్ని సింప్లీ సౌత్ ఓటీటీలో చూడొచ్చు. కొద్దిరోజుల తర్వాత అమెజాన్, ఆహాలో ఈ సినిమా అందుబాటులోకి రావచ్చని సమాచారం ఉంది. -
వికటకవి సిరీస్‌కు ఉత్తమ దర్శకుడిగా ప్రదీప్.. ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉందంటే?
హిందూస్తాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 (OTTPlay Awards 2025) మూడవ ఎడిషన్ మార్చి 22న ముంబైలో ఘనంగా జరిగింది. అపరశక్తి ఖురానా, కుబ్రా సైత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు దక్కాయి. 'డిస్పాచ్' సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా మనోజ్ బాజ్‌పాయ్, 'భామ కలాపం 2' చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ప్రియమణి, 'ది రాణా దగ్గుబాటి షో'తో ఉత్తమ టాక్ షో హోస్ట్‌గా రానా దగ్గుబాటితో సహా పలువురికి అవార్డులు ప్రదానం చేశారు. ఓటీటీలో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్జీ5లో స్ట్రీమ్ అవుతున్న సూపర్ హిట్ సిరీస్ వికటకవి (Vikkatakavi Web Series)కి గాను ప్రదీప్ మద్దాలి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. నిఖిల్ అద్వానీ (ఫ్రీడమ్ ఎట్ నైట్)తో కలిసి ఉత్తమ దర్శకుడు (వెబ్ సిరీస్) అవార్డును ప్రదీప్ మద్దాలి పంచుకున్నారు. అనంతరం ప్రదీప్ మద్దాలి.. హిందూస్తాన్ టైమ్స్ ఓటీటీ ప్లే అవార్డ్స్‌కు, అతని తల్లిదండ్రులకు, సిరీస్ యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపుతో తనపై బాధ్యత మరింత పెరిగినట్లు చెప్పారు. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు సిరీస్ ఇదే1970ల నాటి కల్పిత గ్రామమైన అమరగిరిలో ప్లేగు వ్యాధి నేపథ్యంలో ఆకట్టుకునే గ్రామీణ థ్రిల్లర్ వికటకవి. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య డిటెక్టివ్ రామ కృష్ణగా నటించారు. మేఘా ఆకాశ్ మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. వర్ధమాన దర్శకుడు ప్రదీప్ మద్దాలి.. ఇంజనీరింగ్, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. '47 డేస్', 'సర్వం శక్తి మయం'తో టాలెంటెడ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వికటకవితో దర్శకుడిగా మరో స్థాయికి వెళ్ళారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శించిన మొదటి తెలుగు వెబ్ సిరీస్ వికటకవి కావడం విశేషం.చదవండి: హీరో నితిన్‌పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్‌కు రానన్నా: హర్షవర్ధన్ -
ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్
జీవా(jeeva), అర్జున్ సర్జా(arjun sarja) హీరోలుగా నటించిన 'అగత్యా' (Aghathiyaa) చిత్రం ఓటీటీలోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఫాంటసీ హారర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన పాన్ ఇండియా మూవీని ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహించారు. డా.ఇషారి కె.గణేశ్, అనీశ్ అర్జున్దేవ్ నిర్మాతలు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదల అయింది. ట్రైలర్‌కు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు.గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం.. సన్ నెక్స్ట్ వేదికగా మార్చి 28 నుంచి స్ట్రీమింగ్కు రానుందని ప్రకటన వచ్చేసింది. పాన్ ఇండియా రేంజ్లో తమిళ్,హిందీ,తెలుగు,మలయాళం, కన్నడలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఎన్ని భాషలలో విడుదల అవుతుంది అనేది మాత్రం ఆ సంస్థ చెప్పలేదు. కానీ, అన్ని లాంగ్వేజెస్‌లో అగత్యా స్ట్రీమింగ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో కూడా ఈ మూవీ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.కథేంటంటే..అగత్య(జీవా) ఓ ఆర్ట్ డైరెక్టర్. ఓ పెద్ద సినిమా చేసే చాన్స్ వస్తుంది. ఓ భారీ సెట్ వేసిన తర్వాత నిర్మాత షూటింగ్ నిలిపివేస్తాడు. దీంతో ప్రియురాలు వీణా(రాశీ ఖన్నా) ఇచ్చిన సలహాతో ఆ సెట్‌ని స్కేరీ హౌస్లా మార్చుతాడు. అయితే నిజంగానే ఆ బంగ్లాలో దెయ్యాలు ఉంటాయి. అసలు ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలు ఎవరు? ఓ ఆడ దెయ్యం అగత్యను ఎందుకు బయటకు పంపించాలనుకుంటుంది? అసలు 1940లో ఆ బంగ్లాలో ఏం జరిగింది? సిద్ద వైద్యం కోసం డాక్టర్ సిద్ధార్థ్(అర్జున్) ఎలాంటి కృషి చేశాడు? బ్రిటిష్ గవర్నర్ ఎడ్విన్ డూప్లెక్స్ చేసిన అరాచకం ఏంటి? అతని చెల్లెలు జాక్వెలిన్ పూవిలేకి సిద్ధార్థ్ చేసిన సహాయం ఏంటి? ఫ్రీడం ఫైటర్ నాన్సీకి అగత్యకు ఉన్న సంబంధం ఏంటి? కాన్సర్‌తో బాధపడుతున్న తల్లిని రక్షించుకునేందుకు అగత్యా ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
ఓటీటీలో 25 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్ అవుతున్న సినిమా
సుమారు 25 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. 2000 ఏడాదిలో థియేటర్స్‌లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ 'మలేనా' ఓటీటీ ప్రియుల కోసం రానుంది. లూసియానో విన్సెంజోని కథ నుండి గియుసేప్ టోర్నాటోర్ రచించి దర్శకత్వం వహించిన ఈ శృంగార నాటక చిత్రం అప్పట్లో సంచలనం రేపింది. 73వ అకాడమీ అవార్డ్స్‌లో సత్తా చాటిన మలేనా.. బాక్సాఫీస్ వద్ద ఆరోజుల్లోనే రూ. 150 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్‌కు కూడా నామినేట్ అయింది.'మలేనా' చిత్రం సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ మూవీ చూడాలంటే రూ. 99 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 29 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. టైటిల్ పాత్రలో ఇటాలియన్ నటి మోనికా బెల్లూచి (Monica Bellucci) కనిపిస్తుంది. ఆమె ఒక ఆర్మీ ఆధికారి భార్యగా అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. 12 ఏళ్ల బాలుడి రెనాటో పాత్రలో గియుసేప్ సల్ఫారో (Giuseppe Sulfaro) మెప్పించాడు. సినిమా మొత్తం వీరిద్దరి మధ్య జరిగే ఆర్షణ, ప్రేమ చుట్టూ ఉంటుంది. ఒక అందమైన అమ్మాయి ఒంటరిగా జీవిస్తుంటే ఈ సమాజం ఏ విధంగా చిత్రీకరిస్తుంది అనేది ప్రధాన కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు.కథేంటి..?ఆ నగరంలో అత్యంత అందమైన యువతిగా మలేనా ఉంటుంది. ఆమె భర్త దేశ సరిహద్దుల్లో ఉద్యోగ రిత్యా ఉండటంతో ఆమెకు దగ్గర కావాలని చాలామంది ఆశ పడుతుంటారు. కానీ, తను మాత్రం వాటిని పట్టించుకోకుండా వెళ్లిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో 12 ఏళ్ల బాలుడు రెనాటో కూడా ఆమెను ఇష్టపడుతాడు. అయితే, ఆమెను షాడోగా మాత్రమే వెంబడిస్తూ ఆమె విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. మెలేనాకు దగ్గర కావాలని కలలు కంటూ ఉంటాడు. ఇంతలో ఆమె భర్త మరణించారని వార్త రావడంతో ఆమెకు చాలా ఇబ్బందులు ఎదురౌతాయి.. వాటిని అధిగమించేందుకు ఆమె ఒక వేశ్యగా మారుతుంది. దీంతో నగరంలోని చాలామంది మహిళలు ఆమెను దూషించడం జరుగుతుంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న ఆమె ముందుకు ఒకరోజు సడెన్‌గా తన భర్త ప్రత్యక్షమౌతాడు. తాను మరణించలేదని, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్తాడు. అయితే, ఒక వేశ్యగా మారిన ఆమెతో అతను కలిసి జీవిస్తాడా..? ఆమె ఎందుకు అలాంటి పని చేయాల్సి వచ్చింది..? ఆమెకు 12 ఏళ్ల రెనాటో చేసిన సాయం ఏంటి..? వంటి అంశాలతో పాటు సమాజంలో ఒంటరి మహిళ పట్ల ఉన్న అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఇందులో చక్కడ చూపారు. ఈ కథ అంతా 1940 నాటి కాన్సెప్ట్‌తో చిత్రీకరించారు. -
ఓటీటీలో 'మజాకా'.. స్ట్రీమింగ్ వైరల్
సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపోందిన సినిమా ‘మజాకా’(Mazaka) . ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ‘మజాకా’ నవ్వుల కోసమే... లాజిక్స్ కోసం కాదని చెప్పినట్లుగాను ఈ మూవీ ఉంటుంది. పూర్తి వినోదాన్ని అందించిన ఈ చిత్రంలో రావు రమేశ్( Rao Ramesh), రీతూవర్మ(Ritu Varma), అన్షు ప్రధాన పాత్రలలో నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేశ్ దండా, నిర్మాత అనిల్ సుంకర తెరకెక్కించారు.మజాకా సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 28న ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు నెట్టింట ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. సినిమా వినోదాత్మకంగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా సందీప్ కిషన్, 'మన్మథుడు' పేమ్ అన్షు భారీగానే కష్టపడ్డారు. అయినప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఓటీటీ డీల్ మాత్రం మంచి ధరకే కుదిరినట్లు తెలుస్తోంది.కథేంటంటే.. వెంకటరమణ అలియాస్ రమణ(రావు రమేశ్) ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని కొడుకు కృష్ణ(సందీప్ కిషన్) ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. రమణ మాత్రం ఇంట్లో ఆడదిక్కు లేదని.. కొడుక్కి త్వరగా పెళ్లి చేసి ఓ ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలని ఆశ పడుతుంటాడు. కానీ..ఆడదిక్కు లేని ఇంటికి పిల్లని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో పెళ్లిళ్ల బ్రోకర్ ఇచ్చిన సలహాతో ముందుగా తానే పెళ్లి చేసుకొని..ఆ తర్వాత కొడుక్కి పిల్లని వెతుకుదామని ఫిక్స్ అవుతాడు. అదే సమయంలో బస్‌స్టాఫ్‌లో యశోద(అన్షు)ని చూసి ఇష్టపడతాడు.మరోవైపు కృష్ణ కూడా మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. ఇలా తండ్రికొడుకులిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకేసారి ప్రేమలో పడిపోతారు. వీరిద్దరి ప్రేమలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఇంజనీరింగ్ చదివే కొడుకు ఉన్న రమణ ప్రేమను యశోద ఎలా ఒప్పుకుంది? పగతో రగిలిపోయే వ్యాపారవేత్త భార్గవ్ వర్మ(మురళీ శర్మ)తో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు తండ్రికొడుకుల ఆశపడినట్లు ఇంట్లోకి ఫ్యామిలీ ఫోటో వచ్చిందా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా
'పుష్ప' సినిమాలతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్(Director Sukumar)కి ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు అబ్బాయి కాగా, సుకృతి (Sukrithi) అనే కుమార్తె కూడా ఉంది. ఈమె ప్రధాన పాత్రలో ఓ సినిమాలో నటించగా.. అది థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఆ మూవీ సడన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.సుకుమార్ కూతురు సుకృతి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గాంధీతాత చెట్టు' (Gandhi Tatha Chettu Movie ). ఇందులో ఈమె స్టూడెంట్ గా నటించింది. సుకుమార్ భార్య బబితనే మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి నిర్మించింది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 24న థియేటర్లలో రిలీజైంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు)ఈ సినిమాలో కంటెంట్ పర్లేదనే టాక్ వచ్చింది కానీ సంక్రాంతికి రిలీజైన మూవీస్ వల్ల 'గాంధీతాత చెట్టు' అనే చిత్రం ఒకటి రిలీజైందని తెలియనంత వేగంగా థియేటర్లలోకి వచ్చి వెళ్లిపోయింది. అలాంటిది దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు సడన్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.'గాంధీతాత చెట్టు' విషయానికొస్తే.. నిజామాబాద్ జిల్లా అడ్లూర్. గాంధీ మహాత్ముడి గుర్తుగా రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) ఓ చెట్టు నాటుతాడు. ఎప్పుడూ ఆ చెట్టు చెంతనే గడుపుతూ, అందులోనే తన ప్రాణం ఉందని చెబుతుంటాడు. గాంధీ సిద్ధాంతాల్ని నమ్మి అనుసరించే ఆయన... తన మనవరాలికి గాంధీ (సుకృతి) అని పేరు పెడతాడు. పేరే కాదు, గాంధీ సిద్ధాంతాల్ని బోధిస్తూ పెంచుతాడు. ఊరిలోనూ, కుటుంబంలోనూ చోటు చేసుకున్న పరిణామాల కారణంగా రామచంద్రయ్య తన భూమికి, చెట్టుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతాయి. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?) -
ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలోకి పెళ్లి కాని ప్రసాద్, టుక్ టుక్ తదితర కొత్త సినిమాలతో పాటు సలార్, ఎవడే సుబ్రమణ్యం లాంటి పాత మూవీస్ రీ రిలీజ్ అయ్యాయి. మరోవైపు ఓటీటీలోకి రెండు రోజుల్లో 12 మూవీస్ వచ్చేశాయి.(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?)ఓటీటీల్లోకి ఈ శుక్రవారం వచ్చిన వాటిలో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ ఉన్నంతలో కాస్త ఆసక్తి కలిగిస్తుంది. అలానే ఆఫీసర్ ఆన్ డ్యూటీ, బ్రహ్మానందం మూవీస్ కూడా మీరు ప్రయత్నించొచ్చు. ఇంతకీ ఏ ఓటీటీల్లో ఏ మూవీస్ ఉన్నాయంటే?ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (మార్చి 21)నెట్ ఫ్లిక్స్రిట్నర్ ఆఫ్ ద డ్రాగన్ - తెలుగు సినిమాలిటిల్ సైబీరియా - ఫినిస్ మూవీరివిలేషన్స్ - కొరియన్ సినిమాఆఫీసర్ ఆన్ డ్యూటీ - తెలుగు డబ్బింగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)ఖాకీ: ద బెంగాల్ ఛాప్టర్ - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)అమెజాన్ ప్రైమ్నిలవుకు ఎన్ మేల్ ఎన్నాడీ కోబమ్ - తమిళ సినిమాస్కై ఫోర్స్ - హిందీ మూవీహాట్ స్టార్కన్నెడ - హిందీ సిరీస్ఆహాబ్రహ్మానందం - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)రింగ్ రింగ్ - తమిళ మూవీ సన్ నెక్స్ట్బేబీ అండ్ బేబీ - తమిళ సినిమాఆపిల్ ప్లస్ టీవీబార్బరిక్ - ఇంగ్లీష్ సిరీస్(ఇదీ చదవండి: Tuk Tuk Movie: ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ) -
తెలుగులో మిస్టరీ థ్రిల్లర్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాలు, సిరీసులు నేరుగా వీటిల్లో రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే వాటిలో చాలా తక్కువ మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు. ఇక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ కి అయితే సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలా ఈ జానర్ లో తీసిన లేటెస్ట్ సిరీస్ 'టచ్ మీ నాట్'. తాజాగా దీని ట్రైలర్ రిలీజ్ చేయండంతో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా)నవదీప్, దీక్షిత్ శెట్టి ('దసరా' ఫేమ్) కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ బట్టి చూస్తే.. స్కూల్ చదివే ఓ కుర్రాడి.. శవాన్ని ముట్టుకుని ఎవరు హత్య చేశారో చెప్పే అద్బుతమైన శక్తి ఉంటుంది. మరోవైపు పోలీస్ పాత్ర పోషించిన నవదీప్ మాత్రం ఈ కుర్రాడిపై కాస్త సందేహంగానే ఉంటాడు. మరి హంతకుడిని పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.హాట్ స్టార్ లో ఈ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో వచ్చిన సిరీస్ లు పెద్దగా క్లిక్ కాలేదని చెప్పొచ్చు. మరి 'టచ్ మీ నాట్' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?) -
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా
చాన్నాళ్ల తర్వాత బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన సినిమా 'బ్రహ్మానందం'. ఇందులో బ్రహ్మీతో పాటు ఆయన తనయుడు రాజా గౌతమ్, వెన్నెల తదితరలు నటించారు. గత నెలల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)బ్రహ్మానందం సినిమాని తాత-మనవడు మధ్య జరిగే ఎమోషనల్ కంటెంట్ తో తీశారు. కథ పరంగా బాగానే అనుకున్నారు కానీ సినిమాగా రిలీజ్ చేసిన తర్వాత ఎందుకో జనానికి సరిగా కనెక్ట్ కాలేదు. ఇలాంటివి ఓటీటీలో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో గోల్డ్ యూజర్స్ కోసం స్ట్రీమింగ్ అవుతోంది. రేపటి (మార్చి 20) నుంచి యూజర్స్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.'బ్రహ్మానందం' విషయానికొస్తే.. నటుడు కావాలనుకునే బ్రహ్మా (రాజా గౌతమ్).. ఢిల్లీలో నాటకం వేయాలని అనుకుంటాడు. కానీ దీనికి డబ్బులివ్వాల్సి ఉంటుంది. దీంతో తాత ఆనంద్ రామ్మూర్తి (బ్రహ్మానందం) పేరిట ఉన్న భూమి అమ్మాలని అడుగుతాడు. దీనికి తాత ఒప్పుకొంటాడు కానీ కొన్ని షరతులు పెడతాడు. ఇంతకీ అవేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: నటనకు గుడ్ బై.. హేమ ఇప్పుడేం చేస్తుంది?) -
ధనుశ్ డైరెక్షన్లో లవ్ స్టోరీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'(తమిళంలో నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబం). ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush) దర్శకత్వం వహించారు. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ గతనెల ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లో రిలీజ్ చేశారు.(ఇది చదవండి: ధనుశ్ డైరెక్షన్లో లవ్ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?)అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 21 నుంచి అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ సినిమాను వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్లో స్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా నిర్మించిన సంగతి తెలిసిందే. -
నేరుగా ఓటీటీకి మీరా జాస్మిన్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ మీరా జాస్మిన్, నయనతార నటించిన చిత్రం 'ది టెస్ట్'. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథనంతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. వైనాట్ స్టూడియోస్ బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కించారు.అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. మీరా జాస్మిన్ ఫోటోలు షేర్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్‌ను రివీల్ చేసింది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి టెస్ట్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్ట్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో కూడా అందుబాటులో ఉండనుందని ట్విటర్ ద్వారా తెలిపింది.ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగువారికి సుపరిచితమే. రవితేజ భద్ర సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. టాలీవుడ్లో గుడుంబా శంకర్, రారాజు, ఆకాశ రామన్న, గోరింటాకు, బంగారు బాబు, మహారథి లాంటి చిత్రాల్లో కనిపించింది. అయితే కొన్నేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మీరా.. ఆ తర్వాత విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టెస్ట్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.Some things change, but our love for Meera Jasmine? Never 🥰Watch TEST, out 4 April in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi, only on Netflix!#TestOnNetflix pic.twitter.com/Sm1Neb2B4t— Netflix India South (@Netflix_INSouth) March 18, 2025 -
ఓటీటీలో హిట్ సినిమా 'డ్రాగన్' ఎంట్రీ
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ (Return Of The Dragon) ఓటీటీ ప్రకటన అధికారికంగా వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు, నిర్మాత అర్చనా కల్పతిలను డైరెక్టర్ శంకర్ కూడా మెచ్చుకున్నారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సైతం ఈ మూవీని మెచ్చుకున్నారు.తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడలో మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు పోస్టర్‌ను విడుదల చేశారు. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది. ‘లవ్‌టుడే’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రంతో మరోసారి హిట్ అందుకున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కీలకపాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.కథేంటి..?డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది. డ్రాగన్‌కు ప్రిన్సిపల్ పెట్టే కండీషన్స్ ఏంటి..? బీటెక్‌లో 48 సబ్జెక్టులను ఎలా పూర్తి చేశాడు. కాలేజీ డేస్‌లో తను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) మరోసారి ఆయన జీవితంలోకి ఎందుకొస్తుంది..? ఉద్యోగం ఉందని చెప్పి పెళ్లి సెట్ చేసుకున్న పల్లవితో ఏడడుగులు వేస్తాడా..? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఓటీటీలో అదరగొట్టే సినిమా.. తెలుగులో కూడా స్ట్రీమింగ్
సోషల్‌మీడియాలో కొద్దిరోజుల క్రితం చైనాకు సంబంధించిన 'ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్: వాల్డ్ ఇన్' ఈ సినిమా బాగా వైరల్ అయింది. గత ఏడాదిలో విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం భారత్ మినహా అన్ని దేశాల్లో ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్కు రానున్నట్లు అధికారికంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ సినిమాలతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు సోయ్ చియాంగ్ ఈ మూవీని తెరకెక్కించారు. మార్షల్ ఆర్ట్స్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ మూవీ ఎంతమాత్రం నిరాశపరచదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు.'ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్: వాల్డ్ ఇన్' అమెజాన్ ప్రైమ్‌లో మార్చి 27న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా స్ట్రీమింగ్ రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం 1980ల నాటి హాంకాంగ్ నేపథ్యంలో సాగుతుంది. మాదకద్రవ్యాల సామ్రాజ్యంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న యువకుడు ఎలాంటి పోరాటం చేశాడనేది ఇందులో ఉంటుంది. రూ. 330 కోట్ల బడ్జెట్‌తో (ఇండియన్ కరెన్సీ) తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 960 కోట్లు రాబట్టింది. హాంకాంగ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండవ దేశీయ చిత్రంగా 'ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్: వాల్డ్ ఇన్' నిలిచింది. పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో కూడా ఈ మూవీ సత్తా చాటింది. -
ఓటీటీలోకి హై వోల్టేజీ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రపంచంలోని చాలా భాషల సినిమాల్ని చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కింది. అందుకు తగ్గట్లే ఆయా చిత్ర దర్శక నిర్మాతలు కూడా మిగతా భాషలతో పాటే తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆస్కార్ రేసులో నిలిచిన ఓ హై వోల్టేజీ యాక్షన్ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?)గతేడాది మే 1న రిలీజైన యాక్షన్ మూవీ 'వాల్డ్ ఇన్'. హాంకాంగ్ తరఫున ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ పోటీల్లోకి వెళ్లింది. కానీ విజయం సాధించలేకపోయింది. దాదాపు 2 గంటల పాటు ఫుల్ ఆన్ యాక్షన్ సీన్లతో ఉండే ఈ మూవీని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషల్లో ఈ మూవీ మార్చి 27 నుంచి అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. ఒకవేళ యాక్షన్ సినిమాలంటే ఇష్టముండి, తెలుగు డబ్బింగ్ తో చూడగలరనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. ఓ పాడుబడ్డ సిటీలో డ్రగ్స్ సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీ తీశారు.(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్.. ఫోటోలు వైరల్) -
ఓటీటీలో భారీ యాక్షన్ మూవీ.. ఆ రోజు నుంచి ఫ్రీగా చూడొచ్చు
బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించిన చిత్రం స్కై ఫోర్స్. ఈ యాక్షన్ మూవీని దర్శక ద్వయం సందీప్ కెవ్లానీ– అభిషేక్ అనిల్ కపూర్ తెరకెక్కించారు. జియో స్టూడియోస్, మాడ్డాక్ ఫిల్మ్స్, లియో ఫిల్మ్స్ యూకే ప్రొడక్షన్స్ పతాకాలపై జ్యోతి దేశ్‌పాండే, అమర్ కౌశిక్, భౌమిక్, దినేశ్ విజన్ దాదాపు రూ. 160 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ వార్ నేపథ్యంలో భారతదేశపు మొదటి వైమానిక దాడి సంఘటనల ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భారీ అంచనాల మధ్య రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు వరకు కలెక్షన్లు రాబట్టింది.ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం రెంటల్ పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మూవీని చూడాలంటే అదనంగా రూ.249 అద్దె చెల్లించాల్సిందే. ఈ మూవీ కేవలం హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సబ్‌టైటిల్స్‌తో ఇతర భాషల వారు కూడా చూడొచ్చు.అయితే ఈ సినిమాను ప్రేక్షకులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకు రానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈనెల 21 నుంచి ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. కాగా... ఈ సినిమాలో వీర్ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కమాండర్ కేవో అహుజా పాత్రలో అక్షయ్ కుమార్, టి. విజయ పాత్రలో వీర్ పహారియా నటించారు. -
థియేటర్లో సినిమాల జోరు.. ఓటీటీలో ఏకంగా 15 చిత్రాలు/సిరీస్‌లు
థియేటర్లలో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. గతవారం కోర్ట్, దిల్రూబా సినిమాలు రిలీజవ్వగా ఈవారం మరికొన్ని చిన్న సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అటు ఓటీటీలోనూ హిట్ చిత్రాలు, సిరీస్‌లు రిలీజయ్యేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వారం (మార్చి 17 నుంచి 23 వరకు) అటు థియేటర్లో, ఇటు ఓటీటీ (OTT)లో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం..థియేటర్లో రిలీజయ్యే సినిమల జాబితా..🎥 షణ్ముఖ - మార్చి 21🎥 పెళ్లి కాని ప్రసాద్ - మార్చి 21🎥 కిస్ కిస్ కిస్సిక్ - మార్చి 21🎥 టుక్ టుక్ - మార్చి 21🎥 అనగనగా ఆస్ట్రేలియాలో - మార్చి 21🎥 ఆర్టిస్ట్ - మార్చి 21🎥 ది సస్పెక్ట్ - మార్చి 21ఇవే కాకుండా రెండు సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. మార్చి 21న ప్రభాస్ 'సలార్: సీజ్ ఫైర్', నాని, విజయ దేవరకొండల 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రాలు ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి.ఓటీటీ విషయానికి వస్తే..నెట్ఫ్లిక్స్విమెన్ ఆఫ్ ది డెడ్ 2 (వెబ్ సిరీస్) - మార్చి 19ఆఫీసర్ ఆన్ డ్యూటీ - మార్చి 20బెట్ యువర్ లైఫ్ (వెబ్ సిరీస్) - మార్చి 20ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (వెబ్ సిరీస్) - మార్చి 20ది రెసిడెన్స్ (వెబ్ సిరీస్)- మార్చి 20లిటిల్ సైబీరియా - మార్చి 21రివిలేషన్స్ - మార్చి 21జియో హాట్స్టార్అనోరా (ఆస్కార్ విన్నింగ్ మూవీ) - మార్చి 17గుడ్ అమెరికన్ ఫ్యామిలీ (వెబ్ సిరీస్) - మార్చి 19కన్నెడ (వెబ్ సిరీస్) - మార్చి 21విక్డ్ - మార్చి 22ఆహాబ్రహ్మా ఆనందం - మార్చి 20అమెజాన్ ప్రైమ్డూప్లిసిటీ - మార్చి 20స్కై ఫోర్స్ - మార్చి 21అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్లూట్ కాంట్ (వెబ్ సిరీస్) - మార్చి 20చదవండి: అనారోగ్యంతో నటి 'బిందు' మృతి.. చివరిరోజుల్లో..