ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా | Before Marriage Telugu Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movie: గతేడాది థియేటర్లలో రిలీజ్.. ఇప్పుడు ఓటీటీలోకి

Published Tue, Apr 15 2025 12:15 PM | Last Updated on Tue, Apr 15 2025 12:20 PM

Before Marriage Telugu Movie OTT Streaming Now

తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే థియేటర్లలో రిలీజైన చాలా మూవీస్.. ఆ తర్వాత కనిపించకుండా పోతాయి. చాన్నాళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఓ తెలుగు చిత్రం.. దాదాపు ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)

తెలుగమ్మాయి నవీనరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బిఫోర్ మ్యారేజ్'. గతేడాది జనవరి 26న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే చిన్న మూవీ కావడంతో పెద్దగా గుర్తింపు లేకుండానే కనుమరుగైపోయింది. ఇప్పుడు ఈ చిత్రం రెంట్ విధానంలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.

బిఫోర్ మ్యారేజ్ విషయానికొస్తే.. ధరణి(నవీన రెడ్డి) ‍ఫ్రెండ్స్ తో కలిసి ఓ రూమ్ లో ఉండి చదువుకుంటూ ఉంటుంది. కొత్త అలవాట్లు, ఎంజాయ్ మెంట్ పేరుతో ఊహించని విధంగా ప్రెగ్నెంట్ అవుతుంది. పెళ్లి కాకుండానే తల్లి కావడంతో చాలా ఇ‍బ్బందులు ఎదురువుతాయి. ఈ స‍్థితిని ఆమె ఎలా అధిగమించింది? తండ్రి ఈమెని అంగీకరించారా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement