ఓటీటీకి తమన్నా దెయ్యం సినిమా.. నెల రోజుల్లోపే! | Tamannaah Bhatia Latest Movie Odela 2 OTT Release Date | Sakshi
Sakshi News home page

Odela 2 OTT Release Date: నెల రోజుల్లోపే ఓటీటీకి ఓదెల-2..!

May 5 2025 9:00 AM | Updated on May 5 2025 9:11 AM

Tamannaah Bhatia Latest Movie Odela 2 OTT Release Date

తమన్నా, వశిష్ఠ, హెబ్బా పటేల్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'ఓదెల 2'. సంపత్‌ నంది సూపర్‌ విజన్‌లో అశోక్‌ తేజ దర్శకత్వంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.  గతంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కించారు. మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న విడుదలైంది.

బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా.. ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. మూడు రోజుల్లో కేవలం రూ.6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓదెల-2 ఓటీటీ రిలీజ్ డేట్‌పై టాక్ వినిపిస్తోంది. ఈ నెలలోనే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో సందడి చేయనున్నట్లు సమాచారం. మే 17వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానున్టన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి  ఉంది.

ఓదెల-2 కథేంటంటే..

ఓదెల 2 విషయానికొస్తే.. ఓదెలలో తిరుపతి(వశిష్ట సింహ) అనే కామాంధుడు.. కొత్తగా పెళ్లయిన అమ్మాయిల్ని మానభంగం చేస్తుంటాడు. దీంతో తిరుపతి భార్య అతడి తల నరికి జైలుకెళ్తుంది. కానీ తిరుపతి ఆత్మకు శాంతి కలగకుండా ఉండాలని.. సమాధిశిక్ష వేస్తారు. కొన్ని సంఘటనల వల్ల ఇతడి ప్రేతాత్మ తిరిగి ఊరిపై పడుతుంది. దీంతో శివశక్తి అలియాస్ భైరవి (తమన్నా) అనే ఓదెల ఊరికి వస్తుంది. ఆ తర్వాత దుష్టసంహారమే మిగిలిన స్టోరీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement